నాదల్‌ ఖాతాలో 80వ టైటిల్‌

After Rogers Cup crown, Rafael Nadal pulls out of Cincy tournament - Sakshi

నాలుగోసారి రోజర్స్‌ కప్‌ దక్కించుకున్న స్పెయిన్‌ స్టార్‌

కెరీర్‌లో 33వ మాస్టర్స్‌ సిరీస్‌   ట్రోఫీ సొంతం  

టొరంటో: ఐదేళ్ల విరామం తర్వాత స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ హార్డ్‌ కోర్టులపై మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోజర్స్‌ కప్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 టోర్నీలో నాదల్‌ విజేతగా నిలిచాడు. గంటా 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ నాదల్‌ 6–2, 7–6 (7/4)తో గ్రీస్‌ యువ ఆటగాడు స్టెఫానోస్‌ సిట్‌సిపాస్‌పై గెలుపొంది నాలుగోసారి రోజర్స్‌ కప్‌ను దక్కించుకున్నాడు.

32 ఏళ్ల నాదల్‌ 2005, 2008, 2013లలో కూడా ఈ టైటిల్‌ను సాధించాడు. 2013లో చివరిసారి సిన్సినాటి మాస్టర్స్‌ టైటిల్‌ గెలిచాక నాదల్‌ హార్డ్‌ కోర్టులపై మరోసారి ఈ స్థాయి విజయం సాధించడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా నాదల్‌ కెరీర్‌లో ఇది 80వ సింగిల్స్‌ టైటిల్‌ కాగా... మాస్టర్స్‌ సిరీస్‌లో 33వ టైటిల్‌. విజేతగా నిలిచిన నాదల్‌కు 10,20,425 డాలర్ల (రూ. 7 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.     

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top