నాదల్‌ 33వసారి..

Nadal overcomes Schwartzman To Ease Into US Open Semi Final - Sakshi

న్యూయార్క్‌:  యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో రెండో సీడ్‌ నాదల్‌ 6-4, 7-5, 6-2 తేడాతో డీగో స్వ్కార్జర్‌మ్యాన్‌(అర‍్జెంటీనా)పై గెలిచి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్‌ను గెలిచిన నాదల్‌కు రెండో సెట్‌లో అసలు సిసలు పరీక్ష ఎదురైంది. ఆ సెట్‌లో స్వ్కార్జర్‌మ్యాన్‌ అద్భుతమైన ఏస్‌లు, రిటర్న్‌ షాట్‌లతో చెలరేగిపోయాడు. ఫలితంగా రెండో సెట్‌ను నాదల్‌ చేజార్చుకున్నారు.

కాగా, మూడో సెట్‌లో దూకుడుగా ఆడిన నాదల్‌.. స్వ్కార్జర్‌మ్యాన్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధించి మూడో సెట్‌ను సునాయాసంగా గెలవడమే కాకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీస్‌లోకి ప్రవేశించాడు. దాంతో గ్రాండ్‌  స్లామ్‌ టోర్నీలో 33వసారి సెమీ ఫైనల్‌కు చేరాడు నాదల్‌. ఓవరాల్‌గా అత్యధికసార్లు గ్రాండ్‌ స్లామ్‌ సెమీ ఫైనల్స్‌కు చేరిన జాబితాలో రోజర్‌ ఫెదరర్‌(45) అగ్రస్థానంలో ఉండగా, నొవాక్‌ జొకోవిచ్‌(36) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో నాదల్‌ నిలిచాడు.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే రోజర్‌ ఫెడరర్‌, జొకోవిచ్‌లు ఇంటిదారి పట్టడంతో నాదల్‌ మరో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ రేసులో ముందంజలో ఉన్నాడు.  ఇప్పటివరకూ మూడుసార్లు యూఎస్‌ ఓపెన్‌ను గెలిచిన నాదల్‌.. మరో టైటిల్‌పై కన్నేశాడు. శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో మాట్టే బెర్రిట్టినీ(ఇటలీ)తో నాదల్‌ తలపడతాడు.(ఇక్కడ చదవండి: ఫెడరర్‌ ఖేల్‌ ఖతం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top