నాదల్‌కు చుక్కెదురు  | Rafael Nadal lost in the second round | Sakshi
Sakshi News home page

నాదల్‌కు చుక్కెదురు 

Apr 18 2024 5:07 AM | Updated on Apr 18 2024 5:07 AM

Rafael Nadal lost in the second round - Sakshi

బార్సిలోనా: స్పెయిన్‌ దిగ్గజం, 12 సార్లు చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ బార్సిలోనా ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో నాదల్‌ 5–7, 1–6తో డి మినార్‌ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు.

2003 తర్వాత నాదల్‌ మళ్లీ ఈ టోర్నీలో రెండో రౌండ్‌లో పరాజయం చవిచూశాడు. తుంటి గాయంతో నాదల్‌ ఈ ఏడాది కేవలం ఒక టోర్నీలో మాత్రమే పాల్గొన్నాడు. బ్రిస్బేన్‌ ఓపెన్‌లో నాదల్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆ్రస్టేలియా ప్లేయర్‌ జోర్డాన్‌ థాంప్సన్‌ చేతిలో ఓడిపోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement