పెళ్లి చేసుకోనున్న నాదల్‌ | MAGAZINE REVEALS NADAL IS ENGAGED | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోనున్న నాదల్‌

Jan 31 2019 1:08 AM | Updated on Jan 31 2019 10:45 AM

MAGAZINE REVEALS NADAL IS ENGAGED - Sakshi

అంతర్జాతీయ పురుషుల టెన్నిస్‌ బిగ్‌–4లో రోజర్‌ ఫెడరర్, నొవాక్‌ జొకోవిచ్, ఆండీ ముర్రే ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలో చివరివాడైన స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఈ ముగ్గురి సరసన చేరనున్నాడు. తన ప్రియురాలు ఫ్రాన్సెస్కా పెరెల్‌ను వచ్చే వేసవిలో  నాదల్‌ వివాహం చేసుకోనున్నట్లు  స్పెయిన్‌కు చెందిన హోలా మేగజైన్‌ కథనాన్ని ప్రచురించింది.

14 ఏళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుండగా... గతేడాది మే నెలలో ఫ్రాన్సెస్కాకు నాదల్‌ పెళ్లి ప్రతిపాదన చేసినట్లు సమాచారం.    

Advertisement
 
Advertisement
Advertisement