Rome Masters: జొకోవిచ్‌కు చేదు అనుభవం.. తొలిసారి స్టార్లు లేకుండానే ఫైనల్‌

Rome Masters: Novak Djokovic Knocked Out Loss In Quarter - Sakshi

Rome Masters: రోమ్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) కథ ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌  జొకోవిచ్‌ 2–6, 6–4, 2–6తో ఏడో సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. 2004 తర్వాత రోమ్‌ మాస్టర్స్‌ టోర్నీలో జొకోవిచ్, నాదల్‌లలో ఒక్కరు కూడా లేకుండా తొలిసారి ఫైనల్‌ జరగనుంది.    

ఇది కూడా చదవండి: ‘ఎమిలియా’ ఎఫ్‌1 రేసు రద్దు 
ఇమోలా (ఇటలీ): ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో భాగంగా ఈనెల 21న ఇటలీలో జరగాల్సిన ఎమిలియా రొమాన్య గ్రాండ్‌ప్రి రేసు రద్దయింది. ఈ రేసుకు వేదికగా నిలవాల్సిన ఇమోలా ప్రాంతాన్ని భారీవర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో రేసును నిర్వహించి అందరినీ ఇబ్బంది పెట్టే యోచన లేదని ఎఫ్‌1 నిర్వాహకులు తెలిపారు. సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top