breaking news
Rome Masters
-
జొకోవిచ్‌కు చేదు అనుభవం.. తొలిసారి స్టార్లు లేకుండానే ఫైనల్
Rome Masters: రోమ్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కథ ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 2–6, 6–4, 2–6తో ఏడో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 2004 తర్వాత రోమ్ మాస్టర్స్ టోర్నీలో జొకోవిచ్, నాదల్‌లలో ఒక్కరు కూడా లేకుండా తొలిసారి ఫైనల్ జరగనుంది. ఇది కూడా చదవండి: ‘ఎమిలియా’ ఎఫ్1 రేసు రద్దు ఇమోలా (ఇటలీ): ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో భాగంగా ఈనెల 21న ఇటలీలో జరగాల్సిన ఎమిలియా రొమాన్య గ్రాండ్‌ప్రి రేసు రద్దయింది. ఈ రేసుకు వేదికగా నిలవాల్సిన ఇమోలా ప్రాంతాన్ని భారీవర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో రేసును నిర్వహించి అందరినీ ఇబ్బంది పెట్టే యోచన లేదని ఎఫ్1 నిర్వాహకులు తెలిపారు. సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది. -
రోమ్ మాస్టర్స్ ఫైనల్లో సానియా జోడీ ఓటమి
రోమ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు రోమ్ మాస్టర్స్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ఓటమి చవిచూసి రన్నరప్‌గా నిలిచారు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ 4-6, 3-6 స్కోరుతో టిమియా బాబోస్ (హంగేరి), క్రిస్టినా మ్లడెనోవిక్ (ఫ్రాన్సు) చేతిలో ఓడింది.