భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు రోమ్ మాస్టర్స్ ఫైనల్లో నిరాశ ఎదురైంది.
రోమ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు రోమ్ మాస్టర్స్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ఓటమి చవిచూసి రన్నరప్‌గా నిలిచారు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ 4-6, 3-6 స్కోరుతో టిమియా బాబోస్ (హంగేరి), క్రిస్టినా మ్లడెనోవిక్ (ఫ్రాన్సు) చేతిలో ఓడింది.