చాలా సంతోషంగా ఉంది.. అల్కరాజ్‌కు అభినందనలు: రాఫెల్ నాదల్

Rafael Nadal lauds Carlos Alacaraz for Wimbledon 2023 - Sakshi

ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌ సంచలనం కార్లోస్‌ అల్‌కరాజ్‌ సొంతం చేసుకున్నాడు.  ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ను మట్టికరిపించి.. అల్‌కరాజ్‌ తొలి వింబుల్డన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో 1-6, 7-6, 6-1, 3-6, 6-4 స్కోరుతో నోవాక్ జకోవిచ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచాడు.

అంతకుముందు అల్కరాజ్ 2022లో యుఎస్ ఓపెన్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. కాగా వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకుని టైటిల్‌ను గెలుచుకున్న మూడో స్పానిష్ ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. ఇక తొలి వింబుల్డన్ టైటిల్‌ సొంతం చేసుకున్న కార్లోస్‌ అల్‌కరాజ్‌ను మరో స్పెయిన్‌ టెన్నిస్‌ లెజెండ్‌ రాఫెల్ నాదల్ అభినందించాడు.

"ఛాంపియన్‌ కార్లోస్ అల్కరాజ్‌కు అభినందనలు. తొలి టైటిల్‌ను గెలుచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్పానిష్ టెన్నిస్‌కు మార్గదర్శకుడు మనోలో సాంటానా మనతో లేకపోయినా నీ విజయాన్ని కచ్చితంగా చూస్తుంటారు. అతని ఆశీర్వాదాలు మనకు ఎప్పటికీ ఉంటాయి. నీ విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్‌ చేసుకుంటుంది ఛాంపియన్‌" అంటూ నాథల్‌ ట్వీట్‌ చేశాడు. మనోలో సాంటానా.. స్పెయిన్‌ టెన్నిస్‌ దిగ్గజాల్లో ఒకరు. ఆయన తన కెరీర్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నారు.  మనోలో సాంటానా(83) 2021 డిసెంబర్‌లో తుది శ్వాస విడిచారు.

చదవండి: IND vs WI: 'అలా జరగనందుకు చాలా బాధగా ఉంది.. అతడు ఇండియన్‌ క్రికెట్‌ను ఏలుతాడు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top