Rafael Nadal Becomes Father Wife Maria Francisca Gives Birth Baby-Boy - Sakshi
Sakshi News home page

Rafael Nadal: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన స్పెయిన్‌ బుల్‌

Oct 9 2022 9:03 AM | Updated on Oct 9 2022 10:42 AM

Rafael Nadal Becomes Father Wife Maria Francisca Gives Birth Baby-Boy - Sakshi

టెన్నిస్‌ రారాజు.. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. శనివారం రాత్రి నాదల్‌ భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఈ ఏడాది జూలైలో నాదల్‌ దంపతులు తాము తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మగబిడ్డ ఇంట్లో అడుగుపెట్టడంతో వారి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

ఇక నాదల్‌, మరియా ఫ్రాన్సిస్కాలు 2019లో వివాహం చేసుకున్నారు. కెరీర్‌పై ఫోకస్‌ పెట్టడానికే కొన్నాళ్ల పాటు పిల్లలు వద్దనుకున్నామని నాదల్‌ గతంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న నాదల్‌ టెన్నిస్‌లో ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు.టెన్నిస్‌ పురుషుల ర్యాంకింగ్స్‌లో నాదల్‌ రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో తన దేశానికే చెందిన టెన్నిస్‌ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ కొనసాగుతున్నాడు.

ఇటీవలే తన చిరకాల మిత్రుడు రోజర్‌ ఫెదరర్‌ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఫెదరర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నాదల్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. ఇద్దరు చివరిసారిగా లావెర్‌ టెన్నిస్‌ టోర్నీలో డబుల్స్‌ మ్యాచ్‌లో పాల్గొని అభిమానులను సంతోషపెట్టారు.అయితే మ్యాచ్‌ ముగిశాకా ఫెదరర్‌, నాదల్‌లు కన్నీళ్లు పెట్టడం అక్కడున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసింది.

మరో టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ నాదల్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ''కంగ్రాట్స్‌ స్పెయిన్‌ బుల్‌.. ఇప్పటిదాకా తెలియదు.. నిజంగా గుడ్‌న్యూస్‌. ఏ వ్యక్తి అయినా తాను తొలిసారి తండ్రి అయితే అక్కడ ఉండే సంతోషం వేరుగా ఉంటుంది. ఆ అనుభూతిని ఇప్పుడు నాదల్‌ పొందుతున్నాడు. అలాంటి సంతోషాన్ని ఇదివరకే చూశా. నాదల్‌కు ఎలాంటి అడ్వైజ్‌ ఇవ్వలేను.. ఎందుకంటే అతనికి పెద్ద ఫ్యామిలీ ఉంది. వాళ్లే అన్ని జాగ్రత్తలు చెబుతారు'' అంటూ లాఫింగ్‌ ఎమోజీతో పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement