ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో నాదల్‌ !

rafael nadal moves onto semis in french open defeating jannik sinner - Sakshi

పారిస్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌కు చేరాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఇటలీకి చెందిన యువ ఆటగాడు 'జన్నిక్‌ సిన్నర్‌'పై 7-6, 6-4, 6-1 తేడాతో గెలుపొందాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ ఇప్పటివరకు వంద మ్యాచులు ఆడగా, వీటిలో 98 విజయాలు సాధించడం విశేషం. ఇప్పటి వరకు 12 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ దక్కించుకున్న నాదల్‌ మరో టైటిల్‌ సాధించేందుకు రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. సెమీ ఫైనల్స్‌లో అర్జెంటినాకు చెందిన 'డీగో ష్వార్ట్‌మెన్‌'తో తలపడనున్నాడు.
 
ఆ టైంలో భయకరంగా ఉంది...
దాదాపు 2 గంటల 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ ముగిసేసరికి అర్ధరాత్రి 1.30 గంటలైంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం మీడియాతో నాదల్‌ మాట్లాడాడు. 12 డిగ్రీల సెల్సియల్‌తో ఈ సమయం వరకు మ్యాచ్‌ ఆడడం భయంకరంగా ఉందని అన్నాడు. ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఇలాంటి వాతావరణంలో ఆడుతారని, కానీ నిర్వాహకులు మ్యాచ్‌ను ఇంత ఆలస్యంగా ఎందుకు నిర్వహించారని అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాదల్‌, జన్నిక్‌ సిన్నర్‌ రాత్రి 10.30 గంటలకు కోర్ట్‌లో అడుగుపెట్టారు. ఒకే కోర్టుపై ఐదు మ్యాచులు ఉండడంతో వారికి ఆలస్యం అవ్వక తప్పలేదు.

జన్నిక్‌పై ప్రశంసలు...
జన్నిక్‌ అద్భుతంగా ఆడాడని, బంతిని ధాటిగా స్ట్రైక్‌ చేస్తున్నాడని నాదల్‌ అన్నాడు. మొదటి రెండు సెట్స్‌లో మంచి పోటీనిచ్చాడని...ముఖ్యంగా మొదటి సెట్‌లో హోరాహోరిగా పోటిపడ్డామని అన్నాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉందని కితాబిచ్చాడు. 

(ఇదీ చదవండి: అక్షరాలా రూ. 7 కోట్లు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top