రాఫెల్‌ నాదల్‌కు నిరాశ  | Sakshi
Sakshi News home page

Rafael Nadal: రాఫెల్‌ నాదల్‌కు నిరాశ 

Published Fri, Aug 19 2022 1:54 PM

Borna Coric Crashes Rafael Nadal 1st Round Cincinnati Tournament - Sakshi

సిన్సినాటి: గాయం నుంచి కోలుకొని ఆరు వారాల తర్వాత బరిలోకి దిగిన స్పెయిన్‌ టెన్నిస్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌కు పునరాగమనంలో షాక్‌ తగిలింది. సిన్సిపాటి ఓపెన్‌ తొలి మ్యాచ్‌లోనే నాదల్‌ వెనుదిరిగాడు. క్రొయేషియాకు చెందిన బోర్నా కొరిక్‌ 7–6 (9), 4–6, 6–3 స్కోరుతో నాదల్‌ను ఓడించాడు. 2 గంటల 51 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. పొత్తి కండరాల్లో చీలికతో వింబుల్డన్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు తప్పుకున్న నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ సన్నాహకాల్లో భాగంగా ఈ టోర్నీలో ఆడాడు.    

Advertisement
 
Advertisement
 
Advertisement