Rafael Nadal: సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్‌.. పలు అరుదైన రికార్డులు!

French Open 2022: Winner Rafael Nadal 14th Title Set New Records Check - Sakshi

French Open 2022- Winner Rafael Nadal: మట్టికోర్టులో తనకు తిరుగులేదని స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ మరోసారి నిరూపించుకున్నాడు. ఏకంగా 14వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచి సత్తా చాటాడు. తద్వారా కెరీర్‌లో 22వ ‘గ్రాండ్‌’ టైటిల్‌ కైవసం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

ఇక ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో నార్వేకు చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌పై ఐదో సీడ్‌ నాదల్‌ 6–3, 6–3, 6–0తో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాదల్‌ పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం!

1: ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన పెద్ద వయస్కుడిగా  నాదల్‌ (36 ఏళ్ల 2 రోజులు) రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రెస్‌ గిమెనో (స్పెయిన్‌; 1972లో 34 ఏళ్ల 10 నెలలు) పేరిట ఉండేది.  

8: నాదల్‌ 14 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన క్రమంలో ఎనిమిదిసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్‌పై మూడుసార్లు, డొమినిక్‌ థీమ్‌పై రెండుసార్లు, సోడెర్లింగ్, పుయెర్టా, ఫెరర్, వావ్రింకా, కాస్పర్‌ రూడ్‌లపై ఒక్కోసారి విజయం సాధించాడు.  

23: నాదల్‌ 14సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన క్రమంలో తన ప్రత్యర్థులకు కోల్పోయిన మొత్తం సెట్‌ల సంఖ్య.
2008, 2010, 2017, 2020లలో అతను ఒక్క సెట్‌ కూడా ఓడిపోలేదు.
2007, 2012, 2018లలో ఒక్కో సెట్‌... 2014, 2019లలో రెండు సెట్‌లు... 2005, 2006, 2011, 2022లలో మూడు సెట్‌లు... 2013లో అత్యధికంగా నాలుగు సెట్‌లు చేజార్చుకున్నాడు. 
 

112: ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ చరిత్రలో నాదల్‌ గెలిచిన మొత్తం మ్యాచ్‌లు.
22: నాదల్‌ నెగ్గిన ఓవరాల్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌. ఇందులో 14 ఫ్రెంచ్‌ ఓపెన్‌కాగా... 4 యూఎస్‌ ఓపెన్, 2 వింబుల్డన్, 2 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్స్‌ ఉన్నాయి.

చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్‌, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top