Madrid Open 2022: నాదల్‌పై అల్‌కరాజ్‌ సంచలన విజయం

Carlos Alcaraz first win over Rafael Nadal to reach Madrid semi finals - Sakshi

మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో దిగ్గజ ఆటగాడు రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)కు అనూహ్య పరాజయం ఎదురైంది. తన దేశానికే చెందిన, ‘భవిష్యత్‌ నాదల్‌’గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న కార్లోస్‌ అల్‌కరాజ్‌ 6–2, 1–6, 6–3తో ఐదు సార్లు చాంపియన్‌ నాదల్‌ను ఓడించాడు. సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక పోరులో 2 గంటల 28 నిమిషాల పాటు ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. గురువారమే తన 19వ పుట్టిన రోజు జరుపుకున్న అల్‌కరాజ్‌... తన ఆరాధ్య ఆటగాడు నాదల్‌ను, అదీ అతడికి కోటలాంటి ‘క్లే కోర్టు’పై ఓడించడం విశేషం.

గత ఏడాది ఇదే టోర్నీ రెండో రౌండ్‌లో నాదల్‌ చేతిలో పరాజయంపాలైన అల్‌కరాజ్‌ ఇప్పుడు అదే వేదికపై బదులు తీర్చుకున్నాడు. ఫలితంతో తానేమీ బాధపడటం లేదని... ఫ్రెంచ్‌ ఓపెన్‌కు మరో రెండున్నర వారాల సమయం ఉంది కాబట్టి తన ప్రణాళికలతో సిద్ధమవుతానని నాదల్‌ వ్యాఖ్యానించగా...తన కెరీర్‌లో ఇది అత్యుత్తమ క్షణంగా అల్‌కరాజ్‌ పేర్కొన్నాడు.

చదవండి: Asian Games 2022: చైనాలో కరోనా తీవ్రత.. ఆసియా క్రీడలు వాయిదా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top