50వ ‘మాస్టర్స్‌ సిరీస్‌’ ఫైనల్లో రాఫెల్‌ నాదల్‌ 

Rafael Nadal fires warning to Stefanos Tsitsipas ahead of Italian Open - Sakshi

నాలుగు నెలల విరామం తర్వాత స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఈ సీజన్‌లో రెండో టోర్నమెంట్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో అతను ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో నాదల్‌ 6–3, 6–4తో సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలిచాడు.

నాదల్‌ కెరీర్‌లో ఇది 50వ మాస్టర్స్‌ సిరీస్‌ ఫైనల్‌ కావడం విశేషం. జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లో ఆడిన నాదల్‌ ఆ తర్వాత ఐదు టోర్నీల్లో పాల్గొన్నా సెమీఫైనల్‌ను దాటి ముందుకెళ్లలేకపోయాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top