Jeevan Reddy
-
జీవన్ రెడ్డి మరో షాక్.. BRS పార్టీలోకి జంప్!
-
BRS గూటికి..!? జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్
-
జగన్ ను వదులుకోవడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు.. జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్
-
విధి లేకే వీడుతున్నా: జీవన్‌రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్‌లో నాలుగు దశాబ్దాలపాటు ఉన్న మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని బండారి గార్డెన్స్‌లో అభిమానులు, నాయకులు, కార్యకర్తల మధ్య రాజీనామా చేశారు. ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనదనే ధోరణిలో రేవంత్ మాట్లాడుతున్నారని, అడ్డొస్తే తొక్కుతా అంటున్నారని, ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు అందుకు ముగింపు తప్పదన్నారు. ఆ ముగింపు జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. తాను ఎదగకుండా అణగదొక్కాలన్నదే రేవంత్‌రెడ్డి ఆలోచన అని, అయినప్పటికీ ఎదిరించి పోరాటం చేయడం తనకేం కొత్త కాదని తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు వంటి వారితోనే పోరాటం చేశానని, ఇక నుంచి రేవంత్‌పైనే తన పోరాటమని వ్యాఖ్యానించారు. రేవంత్‌కు ఎదిరించే వారు వద్దని, రాహుల్‌గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వారిని అణగదొక్కుతున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... విధిలేకనే వీడుతున్నా... నేను 1984లో కాంగ్రెస్‌లో చేరిన. పార్టీతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి అనుబంధాన్ని వదులుకోవాలని ఎవరూ కోరుకోరు. జరిగిన అవమానాలతో విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నా. స్థానిక సంస్థల్లో ఒక సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఒంటరిగా గెలిపించా. కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేసిన వారికే మళ్లీ పార్టీలో స్థానం కల్పించారు. విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని, మీ హక్కులకు భంగం కలగనివ్వబోమని కేసీ వేణుగోపాల్, మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో జాప్యం చేశారు. దశాబ్దాలుగా అండగా నిలిచిన ఓ నాయకుడిని అతిదారుణంగా చంపితే సీఎం కనీసం మందలించలేదు. బీఆర్ఎస్ పాలనలో అరాచకం చేసిన పోలీసు యంత్రాంగాన్నే మళ్లీ తీసుకొచ్చారు. వేం నరేందర్‌రెడ్డి ఎవరు? అసలు వేం నరేందర్‌రెడ్డి ఎవరు..? ఆయన పార్టీకి ఏం చేశారు..? చిన్నారెడ్డి వంటి సీనియర్ నాయకులకు జరిగిన అన్యాయానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన దిశగా తీసుకొచ్చారు. సీనియర్లను గౌరవించడం లేదు. అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వేం నరేందర్‌రెడ్డి ప్రభుత్వానికి ఏం సలహాలు ఇచ్చారో చెప్పాలి. ఇంకెంత కాలం అవమానాలు, మానసిక క్షోభ అనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నా. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్‌లో చేరలేదు. పార్టీ కోసం కష్టపడ్డా. అదే రేవంత్ నాయకులను తొక్కుకుంటూ.. పథకం వేసుకుని పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ నిర్ణయాలతో సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయింది. ప్రభుత్వాన్ని నడిపేందుకు తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదని మొదటి నుంచి చెబుతున్నా. ఈ విషయమై గతంలోనే పార్టీ అధిష్టానానికీ లేఖ రాశా. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపుల ప్రభావం జాతీయస్థాయిలో కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుంది. పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. రేవంత్‌పై పోరాటం రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డితో పోరాటం చేయబోతున్నా. ఇది నా ఆఖరి పోరాటం కానుంది. బీఆర్ఎస్ను ఎదిరించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి నాయకుడిగా నేనూ అంతే పోరాటం చేశా. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు మంత్రి అయ్యే అర్హత లేదా? సీనియర్లయిన చిన్నారెడ్డి, మధుయాష్కీ, హన్మంతరావును కాదని వేం నరేందర్‌రెడ్డిని రాజ్యసభకు పంపడమేంటి? బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతూ పార్టీ జెండా మోసినోళ్లకు పదవులు కట్టబెట్టడాన్ని సహించలేక పార్టీని వీడుతున్నా. నాలుగు దశాబ్దాలుగా అండగా నిలిచిన కార్యకర్తలను నాకు తోడుగా నిలవాలని కోరుతున్నా. జగిత్యాలను జాతీయస్థాయిలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తా. -
‘జీవన్ రెడ్డి మనసు మార్చుకొని కాంగ్రెస్‌లో కొనసాగాలి’
హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లడం చాలా బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. జీవన్ రెడ్డి క్రమశిక్షణతో పని చేశారని, ఆయన పార్టీలోనే ఉంటే బాగుండేదని చెప్పారు. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలని అన్నారు.‘పార్టీలో ఉండి అడగాలి. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల చాలా మందికి పదవులు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతాలు ఉన్న పార్టీ. అలాంటి పార్టీ దేశంలో ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు, గొప్ప వ్యూహకర్త. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాంగ్రెస్ చేసిన కృషిని ఈ దేశం ఎన్నడూ మరిచిపోదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సిద్ధాంతాలను ఆచరిస్తూ హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. కులగణన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా రాజకీయాలు చేసిన నాయకుడు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన బాగా పని చేశారు. జీవన్ రెడ్డిలాంటి క్రమశిక్షణతో ఉన్న నాయకుడు పార్టీని వీడడం బాధాకరం. ప్రభుత్వం పటిష్ఠమైన పాలన చేయాలంటే కొంత సర్దుకుపోవాలి. నాకు కూడా అవకాశాలు చాలా మిస్సయ్యాయి. నేను పార్టీలోనే ఉండి పోరాటం చేశాను. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలి. పరిస్థితులను బట్టి నాయకులకు అవకాశాలు వస్తాయి. వేచి చూడాలి.. మంచి నాయకులకు మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసిన అనుభవం ఉంది. ఆయన లాంటి వారు ఓపికగా రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు అండగా ప్రజాపాలనకు సహకారాన్ని అందిస్తే బాగుండేది’ అని చెప్పారు. -
KCR మంచి దోస్త్ నాకు..
-
కాంగ్రెస్ కోసం కష్టపడ్డా.. కార్యకర్త హత్యపై రేవంత్ మౌనం
-
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. రేవంత్‌పై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీమంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మూడు వేల మందితో కలిసి జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలిలో ఏకైక సభ్యుడిగా నేనే నాయకుణ్ణి, నేనే సభ్యుడిగా పోరాడాను. 1995 ఎన్నికల్లో టీడీపీ గాలిలో కూడా జగిత్యాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అది నాటి కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం. చంద్రబాబు స్వయంగా వచ్చినా, ఎంఐఎం మద్దతిచ్చినా 93 ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో నన్ను గెలిపించారు. 2006, 2008 రెండు ఉప ఎన్నికల్లో కూడా నాటి తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏఐసీసీ ఎంపిక చేస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఒంటిచేత్తో పోరాటం చేశాను.పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం. దశాబ్ద కాలంగా చేసిన పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుంది. అంతకుముందు ఆధిపత్యం చేసిన వాళ్లే మళ్లీ ఆధిపత్యం చేయడమేంటి?. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమావేశం గాంధీభవన్‌లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారు?. పార్లమెంట్ వంటి అత్యున్నత ఎన్నికల్లో ఒక పార్టీలో గెల్చి దానికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఏం సంకేతం ఇస్తుంది?. సరే అభివృద్ధిలో కలిసి వస్తే పర్లేదు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారి జోక్యం ఏంటి?.మహేష్ కుమార్ గౌడ్, వంశీచందర్ వస్తే ఏంటి పరిష్కారం?. నా అనుచరుడిని నడిబజారులో దారుణ హత్య చేస్తే ఓపిక పట్టాలా?. మాకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపిక పట్టాలా?. ఎందుకు ఓపిక పట్టాలి?. కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే విధంగా సాగింది. శాసనసభ్యుడిగా, మండలి సభ్యుడిగా ఒంటరి పోరాటం చేసిన నేను కనీసం మంత్రి పదవికి అర్హుడిని కాదా?. ఒకనాడు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న నేను ఇవాళ నా హక్కుల కోసం నియోజకవర్గంలో పోరాడాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం?. జీవన్ రెడ్డిని తొక్కేయాలనేది ఇవాళ కాంగ్రెస్ యోచన.చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేసిన నేను ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకెంత కాలం ఈ అవమానాలు?. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదుగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారా?. రాహూల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే నాలాంటి వాడిని అణగదొక్కుతారా?. వేం నరేందర్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు -
నేడు జీవన్ రెడ్డి రాజీనామా.. చెరిగిపోతున్న ఆనవాళ్లు
-
నేడు కాంగ్రెస్‌కు రాజీనామా.. జీవన్ పయనమెటు?
సాక్షి,జగిత్యాల: నేడు కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రాజీనామా అనంతరం ఏఐసీసీ, పీసీసీకి లేఖ పంపనున్నారు.కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాల రాజకీయ బంధానికి తెగదెంపులు పెట్టనున్న జీవన్ రెడ్డి, తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. రాజీనామా విషయంలో చివరి క్షణం వరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించింది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ దూత వంశీచందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి కలిసినా జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు.దీంతో జీవన్ రెడ్డి రాజీనామా, ఆయన భవిష్యత్తు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆయన భవిష్యత్తుపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి. స్థానిక స్థాయిలో బలమైన మద్దతు ఉన్న నేతగా జీవన్ రెడ్డి ఎటు వెళ్లినా ఆ పార్టీకి బలం చేకూరుస్తారనే అభిప్రాయం ఉంది. ఆయన స్వతంత్రంగా కొనసాగడం, బీఆర్ఎస్లో చేరడం లేదా బీజేపీలోకి వెళ్లడం వంటి అవకాశాలు చర్చనీయాంశమవుతున్నాయి.జీవన్ రెడ్డి నిర్ణయం ఆయన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుతో పాటు జగిత్యాల ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, ఆయన తుది నిర్ణయం పూర్తిగా అనుచరుల అభిప్రాయాలపైనే ఆధారపడి ఉండటం గమనార్హం. -
తగ్గేదేలే.. తెగదెంపులే!
జగిత్యాల: తన సమస్యకు కాంగ్రెస్‌లో పరిష్కారం లేదని, అందుకే ఆ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజులుగా జీవన్‌రెడ్డి నివాసానికి కాంగ్రెస్ నేతల తాకిడి మొదలైంది. ఎవరు వచ్చినా జీవన్‌రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వచ్చి చర్చలు జరిపినా, ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తాజాగా మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్‌రెడ్డి వచ్చి దాదాపు గంటకుపైగా జీవన్‌రెడ్డితో చర్చించారు. వారు జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా.. ఆయన మాత్రం గౌరవం లేని చోట ఉండలేనని బహిరంగంగానే చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన పార్టీని వీడటం బాధగానే ఉన్నా.. విలువ లేని చోట ఉండలేనని పేర్కొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం జీవన్‌రెడ్డి వంటి నాయకుడిని వదులుకోలేమని చెబుతున్నా, ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్‌రెడ్డి అప్పటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అనేకం పోరాటాలు చేశారు. మండలి నేతగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జీవన్‌రెడ్డి ఓడిపోవడం.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌కుమార్ అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో జీవన్‌రెడ్డి కినుక వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యేకే పెద్దపీట వేయడంతో ఆయన చలించిపోయారు. అప్పటి నుంచే జీవన్‌రెడ్డి తన రూటు మార్చుకున్నారు. ఇటీవల పార్టీ వీడుతున్నట్టు బహిరంగంగానే లేఖ రాశారు. తన నిర్ణయాన్ని ఈనెల 25న ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ మారొద్దని కోరిన కాంగ్రెస్ పెద్దలు.. మెట్టు దిగని జీవన్‌రెడ్డి జీవన్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పెద్దలు తరలివస్తున్నా, ఆయన మెట్టు దిగడం లేదు. పార్టీ మారొద్దని వారు పేర్కొన్నా.. పార్టీలో జరిగిన అన్యాయం చాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని సూచించినా, కప్పుకోనంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం. చివరి ప్రయత్నంగా టీపీసీసీ అధ్యక్షుడితోపాటు, ఏఐసీసీ నాయకులు రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదు. వంశీచంద్‌రెడ్డి పార్టీ మారొద్దని చెప్పినా, పెద్దగా స్పందించనట్టు తెలిసింది. పార్టీ వీడొద్దని మహేశ్‌కుమార్‌గౌడ్ కోరారని, 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నానని జీవన్‌రెడ్డి ఆయన చెప్పారు. దీంతో మహేశ్‌గౌడ్ అసంతృప్తితోనే వెళ్లిపోయినట్టు తెలిసింది. నేడు సమావేశం: జీవన్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని, వచ్చిన నేతలకు చెప్పానని, బండారి గార్డెన్లో బుధవారం అందరితో సమావేశమై తన భవిష్యత్ పయనం ఎలా ఉండబోతుందో చెబుతానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతోనే పోరాటం చేయడం తనకు సాధ్యం కాదన్నారు. నాలుగు దశాబ్దాల ప్రయాణానికి ముగింపు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న జీవన్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. జీవన్‌రెడ్డి 1981లో మల్యాల సమితి ప్రెసిడెంట్‌గా రాజకీయ ఆరగేట్రం చేశారు. టీడీపీ నుంచి 1983లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. టీడీపీలో చీలిక రావడంతో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అంటే జీవన్, జీవన్ అంటే కాంగ్రెస్‌లా తనదైన ముద్ర వేసుకున్నారు. జీవన్‌రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారో ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దాదాపు బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారమైతే జరుగుతుండగా బీజేపీ నేతలు కూడా జీవన్‌రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
కాంగ్రెస్ విడిచి వెళ్లడం అంటే జీవన్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
-
మహేష్ కుమార్‌తో జీవన్ రెడ్డి కీలక భేటీ.. సంచలన ప్రకటన
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జీవన్ రెడ్డి ఎపిసోడ్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని విషయాలు జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. జీవన్ రెడ్డి అనుచరులు ఆయన ఇంటిపై ఉన్న “ఇందిరా భవన్” ఫ్లెక్సీని తొలగించడం గమనార్హం.కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నేడు ఆయన నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ చీఫ్ సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ వచ్చారు. ఈ క్రమంలో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అనంతరం, మహేష్ కుమార్ సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్..‘పార్టీ రాజకీయ నిర్ణయాలతో జీవన్ రెడ్డి ఇబ్బంది పడ్డారు. జీవన్ రెడ్డికి, ఆయన అనుచరులకు అన్యాయం జరిగిందన్న ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమైంది.ప్రభుత్వం సాఫీగా నడవాలంటే కొన్ని పనులు, నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభివృద్ధికి ఆకర్షితులయ్యారు. అదే జీవన్ రెడ్డికి ఇబ్బందిగా మారినట్టు ఉంది. జీవన్ రెడ్డితో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలున్నాయి. జీవన్ రెడ్డి పార్టీ మారవద్దని చెప్పి వచ్చాం. మొన్ననే నేను శ్రీధర్ బాబుతో కలిసి రావాల్సింది. మీనాక్షి నటరాజన్‌తో కూడా మాట్లాడించాం. ఆయన పార్టీ మారరు అనే ఆశిస్తున్నాం. ఆయనకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో ఆయన అనుభవానికి తగిన న్యాయం చేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. తన నివాసం నుంచి మహేష్ కుమార్ గౌడ్ వెళ్లిపోయిన వెంటనే జీవన్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఇదే నా చివరి రోజు అని సంచలన ప్రకటన చేశారు. రేపు సమావేశం యథావిధిగా ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో జీవన్ రెడ్డి ఇంటి పైన ఇందిరా భవన్ అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీలను కార్యకర్తలు తొలగించారు. అయితే, ఇందిరా గాంధీ మీద అభిమానంతో తన ఇంటికి ఇందిరా భవన్ అని పేరు పెట్టుకుని ఇంతకాలం పార్టీ కార్యకలాపాలు కొనసాగించిన జీవన్ రెడ్డి. ఇవాళ ఆ పేరుతో ఉన్న ఫ్లెక్సీ కూడా తొలగించారు. దీంతో పార్టీకి పూర్తిస్థాయిలో గుడ్‌బై చెబుతున్నట్టు అనుచరులు సంకేతాలు ఇచ్చారు. -
ఫలించని బుజ్జగింపులు! రేపే జీవన్ రెడ్డి రాజీనామా?
-
కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా వేళ బిగ్ ట్విస్ట్!
సాక్షి,జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత 20 నెలలుగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, అవమానాలు భరించలేక మార్చి 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ క్రమంలో ఆయనను పార్టీ వీడకుండా బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరోసారి రంగంలోకి దిగింది. మరికాసేపట్లో జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఆయనను కాంగ్రెస్‌లో కొనసాగాలని కోరనున్నారు. ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జీవన్ రెడ్డి రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.జీవన్ రెడ్డి పార్టీ వీడకుండా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి చేసిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా, రాజీనామా ప్రకటించే కొన్ని గంటల ముందు పీసీసీ చీఫ్ రాకతో జీవన్ రెడ్డి నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు..గత ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అవమానం భరించలేక కాంగ్రెస్‌ను వీడనున్నట్లు జీవన్‌రెడ్డి తెలిపారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. జీవన్‌రెడ్డి ప్రకటన అనంతరం, ఆయన ఇంటి వద్ద ఓ పోస్టర్ వెలసింది. అందులో ఒకవైపు జీవన్‌రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్‌స్టార్ జీవన్‌రెడ్డి’ అని ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. జీవన్‌రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, జీవన్ రెడ్డి పార్టీ మారకుండా ఇవాళ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయా? విఫలమవుతాయా? అనేది తెలియాల్సి ఉంది. -
25న రాజీనామా చేస్తున్నా..
జగిత్యాల టౌన్: పార్టీలో 20 నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తాను అవమానాలు భరించలేకే కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయం తీసుకున్నానని, ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని మాజీమంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంతకాలం తనతో కలిసి నడిచిన నాయకులు, అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. దశాబ్దాల పోరాట ఫలితాన్ని ఎవరో కాజేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానని సీనియర్ నేత భావోద్వేగానికి గురయ్యారు. సంయమనం పాటించాలని మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారని, అయితే సంయమనంతో ఎలాంటి ఉపయోగమూ లేదని భావించి రాజీనామాకు సిద్ధపడ్డానని తెలిపారు. తాను పార్టీకి రాజీనామా చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒక కారణమన్నారు. నాకు మంత్రి అయ్యే అర్హత లేదా?రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎంత పోరాటం చేశారో.. మండలి ఏకైక సభ్యుడిగా తానూ అంతేస్థాయిలో పోరాటం చేశానని జీవన్‌రెడ్డి చెప్పారు. వారిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి పొందినప్పుడు తనకు మంత్రి పదవి ఆశించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ఒంటరి పోరాటం చేసిన తనకు మంత్రి అయ్యే అర్హత లేదా..? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చే నాటికి మండలి సభ్యుడిగా తనకు 20 నెలల కాలం మిగిలి ఉందని గుర్తు చేశారు. నేను ఒక్కసారి చెబితే..!జీవన్‌రెడ్డి, రజినీకాంత్‌తో పోస్టర్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద వెలసిన ఒక పోస్టర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. అందులో ఒకవైపు జీవన్‌రెడ్డి ఉంటే మరోవైపు ప్రముఖ నటుడు రజినీకాంత్ ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాగా పోస్టర్ మధ్యలో ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..’ అన్న రజినీకాంత్ ఫేమస్ డైలాగ్ ఆంగ్లంలో ఉండటం, దాని కింద ‘తెలంగాణ పొలిటికల్ సూపర్‌స్టార్ జీవన్‌రెడ్డి’ అని ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. జీవన్‌రెడ్డి ఒకసారి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడంటే వెనక్కి తగ్గే వ్యక్తి కాదనే అర్థం వచ్చేలా ఈ పోస్టర్ ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రాజీనామాపై జీవన్‌రెడ్డి క్లారిటీ.. చేరేది ఆ పార్టీలోకే..!
సాక్షి, జగిత్యాల జిల్లా: రాజీనామాపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేనని.. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లో ఉండలేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్మీట్లో రాజీనామాను ప్రకటించిన జీవన్‌రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నట్టు వెల్లడించారు. పార్టీని వీడడానికి గల కారణాలపై కూడా జీవన్‌రెడ్డి లేఖ విడుదల చేశారు.కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానన్న జీవన్‌రెడ్డి.. 40 ఏళ్ల బంధానికి స్వస్తి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా తనతో పాటు ప్రయాణం చేస్తున్న తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 25న సమావేశంలో చర్చించేందుకు కలుద్దామన్న జీవన్‌రెడ్డి.. గత 20 మాసాలుగా జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు మీరంతా గమనించారన్నారు.ఇదిలా ఉండగా, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ బుజ్జగింపులు ఫలించలేదు. శనివారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వచ్చి గంటకుపైగా ఆ యనతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈనెల 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్‌రెడ్డి నుంచి మొదట నుంచి బలమైన సంకేతాలు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఇప్పటికే జీవన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడగా, రెండురోజుల క్రితం పీసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి చర్చించారు. కానీ ఆయన నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాజాగా మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు రంగంలోకి దిగారు. ఆయన ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. అయినా కూడా జీవన్‌రెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. -
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి.. కేసీఆర్ సమక్షంలో చేరిక?
సాక్షి, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఈనెల 25వ తేదీన తన అనుచరులతో జగిత్యాలలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే జీవన్ రెడ్డి తన రాజీనామాను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ తర్వాత ఏప్రిల్ ఐదో తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు సమాచారం. నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ ప్రయాణానికి గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలిసింది. కాగా, ఈసారి జీవన్ రెడ్డిని బుజ్జగించడంతో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఆయనతో మంత్రులు జరిపిన చర్చలు ఫలించలేదని తెలుస్తోంది. ఆదివారం జగిత్యాలలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఆయనతో భేటీ అయ్యారు. పార్టీని వీడవద్దని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వారు కోరినప్పటికీ, జీవన్ రెడ్డి తన పంతం వీడలేదని సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సీనియారిటీని గౌరవించకుండా, తనను పక్కన పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వ్యవహారం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా, కొత్తగా చేరిన ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చైర్మన్ పదవిని కట్టబెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించి తన బలాన్ని నిరూపించుకున్నప్పటికీ, పార్టీ నాయకత్వం తనను విస్మరించడంపై ఆయన మండిపడుతున్నారు. ఇక, ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వంటి వారు ఆయనతో మాట్లాడారని గుర్తు చేశారు. అయినప్పటికీ, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. -
‘జీవన్‌రెడ్డి పునరాలోచన చేస్తారని అనుకుంటున్నా’
కరీంనగర్ : జీవన్‌రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని అనుకుంటున్నానని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలతో జీవన్ రెడ్డి మనస్థాపం చెంది ఉండవచ్చని, ఆయన మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదన్నారు. ఈ మేరకు జీవన్‌రెడ్డి రాజీనామా చేస్తారని నిర్ణయంపై సాక్షీ టీవీతో శ్రీధర్‌బాబు మాట్లాడారు. జీవన్ రెడ్డికి భవిష్యత్ లో న్యాయం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ చెప్పారని, పార్టీ ఆదేశం మేరకే ఆయనతో చర్చలు జరిపామన్నారు. తప్పకుండా జీవన్‌రెడ్డి పునరాలోచన చేస్తారని అనుకుంటున్నానన్నారు. కాగా, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. -
నేను వెనక్కి తగ్గను జీవన్ రెడ్డితో కాంగ్రెస్ మంత్రుల చర్చలు విఫలం
-
కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. ముహూర్తం ఫిక్స్?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కాగా, కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేయవద్దని కోరుతున్నట్టు తెలిసింది. జీవన్ రెడ్డి సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో, కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.మరోవైపు.. జగిత్యాలలో జీవన్ రెడ్డితో ముగిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ చర్చలు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోదు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తాం. ఆయన మాతో చర్చించినవి అధిష్ఠానం ముందు ఉంచుతాం. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌తోనే కొనసాగుతారనే నమ్మకం మాకుంది అంటూ కామెంట్స్ చేశారు.ఇక, జగిత్యాలలో మంత్రులతో జీవన్ రెడ్డి భేటీ తర్వాత ఉత్కంఠ నెలకొంది. అయితే, జీవన్ రెడ్డి మాత్రం ఈనెల మార్చి 25న జరిగే సమావేశం యథావిధిగా ఉంటుందని కార్యకర్తలకు స్పష్టం చేశారు. దేవుడు శాసించాడు.. నేను అనుసరిస్తున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కార్యకర్తలంతా రెడీగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి పార్టీ మార్పు లాంఛనంగా మారినట్టు తెలుస్తోంది. ఆయన నిర్ణయంపై జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది. -
పార్టీ మారతారన్న ప్రచారం వేళ.. జీవన్ రెడ్డి ఇంటికి ఏఐసీసీ నేతలు
జగిత్యాల జిల్లా: కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తారన్న ఊహాగానాల మధ్య జగిత్యాలలోని ఆయన ఇంటికి ఏఐసీసీ నేతలు వెళ్లారు. జీవన్ రెడ్డిని కలిసిన వారిలో నేషనల్ కో ఆర్డినేటర్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ప్రొ.కత్తి వెంకటస్వామి ఉన్నారు. పార్టీ మార్పు ప్రచారం వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దాదాపు గంటకుపైగా చర్చలు కొనసాగాయి. నిన్న జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. జీవన్ రెడ్డి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరిగిన వేళ నేరుగా ఆయన ఇంటికే వెళ్లి ఏఐసీసీ నేతలు చర్చిస్తున్నారు. కాగా, నిన్న జీవన్ రెడ్డి మీడయా సమావేశంలో మాట్లాడుతూ.. జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ, ఆయనతో కలిసి పనిచేయాలని తనకు చెబుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం సర్కారుతో కలిసి పనిచేయడం తప్పులేదుకానీ హక్కులను కాలరాయడం, అభ్యర్థులను ఎంపిక చేయడం ఇవన్నీ కరెక్టేనా అని అడిగారు. పార్టీ మారాలని తనకు వచ్చిన ఆలోచనకు తనలోని ఆవేదనే కారణమని చెప్పారు. -
కాంగ్రెస్‌కు గుడ్ బై... నేను పార్టీ మారడం ఖాయం
-
జగిత్యాల జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్న సంజయ్.. నన్ను తనతో కలిసి పనిచేయాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నలు సంధించారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఒంటిచేత్తో అధికారపార్టీతో పోరాటం చేసిన నేను మంత్రి కావాలనుకోవడం తప్పా?. పార్టీ ఫిరాయింపునకు నాకు అవకాశం లేకుండేనా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాల బంధాన్ని విడిచి పెట్టుకోవడం ఎవరికైనా ఇబ్బందే. ఆ స్థితిలో నేను ఇవాళ బాధ పడుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ.. నన్నే తనతో కలిసి పని చేయాలని ఆఫర్ ఇస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడంలో తప్పు లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, హక్కులను కాల రాయడం, అభ్యర్థుల ఎంపిక చేయడం ఇవన్నీ సమంజసమా?. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశాను. ఇందుకు ఎమ్మెల్యే సంజయ్ కారణం కాదా. 1995లో చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఎక్కడా పోటీకి కూడా వెనుకంజ వేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్నీ గెల్చుకున్నాం. వీడిపోవడానికి కారకుడైన వ్యక్తి ఇవాళ కలిసి పని చేస్తానంటున్నాడు. నేను ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తా. ఈ ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడితో ఓ ఆడబిడ్డ మున్సిపాలిటీలో ఇబ్బంది పడింది నిజం కాదా?. నాకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు?. నేను పార్టీ వీడుతానని ఆయనకు చెప్పానా?. పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు?. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు?. నన్ను ఎలా కలిసి రమ్మంటారు?. సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారు. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకోడు. చట్టసభల్లో ఎంపికైన వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలి. నేను ఇంతవరకు కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నాను. ఉండాలని ఇంకా కోరుకుంటున్నా. ఇంట్లో ఉడుం లాగా వచ్చి చేరితే ఆయనతో కలిసి ఎలా పనిచేస్తాం. నిన్నటి వరకు రాష్ట్రానికి జగిత్యాల ఆదర్శంగా ఉంటే ఇవాళ వివాదాలకు కేరాఫ్ చేశాడు. రాముడు నాకు ఆదర్శం. అందుకే శ్రీరామనవమి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టుకున్నా. నేను పార్టీ మారితే దానికి కారణం ఎమ్మెల్యే సంజయ్, ఆయన వెనుకున్న వారే కారణం అవుతారు. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ అధిష్టానానిదే బాధ్యత. నాకు పార్టీ మారాలనే యోచనకు కారణం ఈ ఆవేదనే’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
జీవన్‌రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు
జగిత్యాల : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద ఉన్న పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను తొలగించారు. జగిత్యాలలోని జీవన్‌రెడ్డి రెడ్డి నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇంటి లోపల ఉన్న ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి ఫోటోలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఈనెల 24 లేదా 25వ తేదీన జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటివద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవన్‌రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉతంఠ నెలకొంది.బీఆర్ఎస్లో చేరతారా..?తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత ప్రముఖంగా ఉన్న పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు. మరి జీవన్‌రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం వార్త హల్చల్ చేసింది. బీఆర్ఎస్ గూటికి జీవన్‌రెడ్డి చేరబోతున్నారనేది ఆ వార్త సారాంశం. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడానికి జీవన్‌రెడ్డి సన్నద్ధమవుతున్నారని, ఆ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత తనకు కాంగ్రెస్‌లో తగిన గౌరవం లభించలేదని భావిస్తున్న జీవన్‌రెడ్డి.. దానికి పార్టీని వీడటం ఒక్కటే సరైన మార్గమని అనుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. -
కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా
రాయికల్ (జగిత్యాల): కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దశాబ్దాలకాలం కాంగ్రెస్‌కు సేవలందించానని, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇమడలేకపోతున్నానని, ఈ క్రమంలో మొదటగా పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి అందజేస్తారా? అని ప్రశ్నించగా.. ఇక్కడే చేస్తానని తెలిపారు. రంజాన్, ఉగాది పండుగల అనంతరం మరోసారి అభిమానులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. -
బీఆర్ఎస్లోకి జీవన్‌రెడ్డి..?
జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్‌రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్‌రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్ కూడా మారిపోతున్నాయి. తాను కాంగ్రెస్‌లో సీనియర్‌గా ఉండి కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్‌రెడ్డి వేరే స్టెప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా. ఇదే జీవన్‌రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్‌రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
-
హెచ్సీఎ కొత్త కార్యదర్శిగా జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కొత్త కార్యదర్శిగా ఎం.జీవన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 15న కార్యదర్శి పదవి కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే జీవన్ రెడ్డితో పాటు ఈ పదవి కోసం నామినేషన్ వేసిన మరో నలుగురు తప్పుకున్నారు.చిట్టి శ్రీధర్, అనిల్, హరినారాయణ, బాబూరావు తమ నామినేషన్లను చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడంతో జీవన్ రెడ్డికి పోటీ లేకుండా పోయింది. ప్రతిష్టాత్మక ఫార్మా సంస్థ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్‌లో జీవన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కార్యదర్శి ఎంపిక ఖరారు కావడంతో ఈ నెల 15న కేవలం హెచ్‌సీఏ కోశాధికారి పోస్టు కోసం ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎలక్టోరల్ ఆఫీసర్ వీఎస్ సంపత్ వెల్లడించారు. కార్యదర్శి పదవికి బాబూరావు, అనిల్ కుమార్, హరినారాయణ, ఆగం రావు పోటీ పడుతున్నారు. -
జీవన్‌రెడ్డికి తగిన గౌరవమివ్వండి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కష్ట కాలంలో పార్టీతో ఉన్న జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చే విధంగా పార్టీ హైకమాండ్ చొరవ తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారు. కాంగ్రెస్ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీ లోనే ఉన్నాడు. రాజకీయంగా జీవన్ రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా కాంగ్రెస్ పెద్దలు చొరవ చూపాలి. జీవన్ రెడ్డికి గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారిని కోరుతున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, జీవన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఫుడ్ పాయిజన్ అయిందని జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. -
మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, జీవన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఫుడ్ పాయిజన్ అయిందని జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. -
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి షాకిచ్చిన అధిష్టానం
సాక్షి,జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాకిచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఎమ్మెల్యే సంజయ్ తరుఫు వర్గానికి చెందిన అభ్యర్థిని మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మొండి చేయిచూపించింది. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. జగిత్యాలలలో మున్సిపాలిటీ వార్డులు మొత్తం 50 ఉండగా ఛైర్పర్సన్ను ఎన్నుకోవాలంటే కనీసం 25 కౌన్సిలర్ల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో ఆయన వర్గానికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఈ పరిణామం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్గానికి పెద్ద దెబ్బగా మారింది.కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. వాణి అభ్యర్థిత్వం ఖరారవడంతో, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండే అవకాశం బలపడింది. అయితే, ఈ నిర్ణయం వల్ల పార్టీ అంతర్గతంగా విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
చైర్మన్ పదవిపై జీవన్ రెడ్డి క్లారిటీ
-
జగిత్యాల మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి
-
నేనేం పాపం చేసిన?
జగిత్యాల: ‘నేనేం పాపం చేసిన.. తినే ముందు పల్లెం ఎత్తుకెళ్లారు.. బీఆర్ఎస్ కార్యకర్తల కడుపు నింపారు. రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని బలపర్చడమే నేను చేసిన తప్పా. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను వదిలి వలసవాదులకు పెద్దపీట వేశారు.. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించారు? నాలుగు దశాబ్దాల పాటు క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నా’అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు పెద్దపీట వేస్తూ అధిష్టానం బీఫామ్‌లు కట్టబెట్టడంతో జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే న్యాయ నిర్ణేతలు. జాబితాను కార్యకర్తల అభిప్రాయం మేరకు సర్వే చేపట్టి ఇచ్చాం. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూర్చోబెట్టుకొని జాబితాను రూపొందించి నిజమైన కార్యకర్తలకు టికెట్లు రాకుండా చేశారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనకు ఎదురీదిన.. ప్రవాహానికి అనుగుణంగా ఉన్నప్పుడు నన్ను తోసేశారు. జాబితాను రూపొందించినా పరిశీలించకుండానే జెండా మోసిన వారిని పక్కనపెట్టారు. జీవితంలో కాంగ్రెస్ జెండా పట్టనోనికి బీఫామ్‌లు కట్టబెట్టారు. నేను చేసిన తప్పేంటి? నిబద్ధత గల నాయకుడిగా కేసీఆర్‌పైనా పోటీచేసిన. గాం«దీభవన్‌లో ఇంటర్నల్ మీటింగ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చారని మాట్లాడిన. అందుకు కోపం ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి. కార్యకర్తలపై ఎందుకు ? ఓ ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు.. ఎవరు అతిక్రమిస్తున్నారో చెప్పాలి’అని అన్నారు. ఇది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, వలసవాదులకు జరుగుతున్న పోటీ అని, తాను జెండా మోసిన వారికే మద్దతిస్తానని తేల్చి చెప్పారు. ప్రజలే న్యాయనిర్ణేతలని వ్యాఖ్యానించారు. ఎవరు కాంగ్రెస్, ఎవరు కాదు అన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. జెండా మోసిన వారి కోసం ప్రజల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు. -
వీడిన ఉత్కంఠ.. జగిత్యాలలో హైవోల్టేజ్ పొలిటికల్ డ్రామా
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల విషయంలో అధికార పార్టీలో కొనసాగుతున్న రగడ.. హైవోల్టే పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించింది. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సంజయ్ వర్గానికే అధిక సీట్లు కేటాయించింది. దీంతో.. సీనియర్ నేత జీవన్‌రెడ్డి అలకబూనారు.అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సక్సెస్ అయ్యారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో 62 మంది అభ్యర్థుల ఖరారు చేసింది. ఇందులో సంజయ్ వర్గానికి 36 (జగిత్యాలలో 30, రాయికల్‌లో 6), జీవన్‌రెడ్డి వర్గానికి 26 సీట్లు (జగిత్యాలలో 20, రాయికల్‌లో 6) కేటాయించింది. ఫ్లాష్ సర్వే, ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న సీఎం రేవంత్ మాటకే కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో.. ఎమ్మెల్యే సంజయ్‌ను బహిరంగంగానే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దూషిస్తున్నారు. తమకు బీఫామ్‌లు రాకుండా అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సంజయ్ నివాసం, ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో జగిత్యాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధిష్టానం వద్ద జరిపిన లాబీయింగ్‌లో సంజయ్ సక్సెస్ అయ్యారు. అయితే అధిష్టానం ఫార్ములాను జీవన్‌రెడ్డి రిజెక్ట్ చేస్తున్నారు. పంపకాల ప్రసక్తే లేదు.. కార్యకర్తలకే ప్రాధాన్యత అని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్‌లు వరుస ఫోన్‌కాల్స్‌తో ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.నన్ను, నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నా గొంతు కోశారు. నా కోసం కార్యకర్తలను పార్టీ బలి చేస్తోంది. నాకు వర్గమంటూ ఏదీ లేదు. పార్టీ జెండా మోసిన వారే నా వర్గం. క్రమశిక్షణ పేరుతో కట్టడి చస్తే చూస్తూ ఊరుకోవాలా? అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేన్నారాయన. జగిత్యాల హస్తం పార్టీలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవన్‌రెడ్డి నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఆయన తదుపరి అడుగులపై ఏంటనే చర్చ నడుస్తోంది. ఈ అలకను అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
కాంగ్రెస్‌పై ఫైర్.. జీవన్‌రెడ్డికి ఎంపీ అరవింద్ సపోర్ట్
సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగిత్యాల రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని సెటైరికల్ కామెంట్స్ చేశారు.జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అనేక రుజువులు ఉన్నాయి. సంబంధిత వారిని అరెస్టు చేస్తారా లేదా అన్నది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి ప్యాకేజీకి అమ్ముడుపోతారా? లేక నిజాయితీగా పనిచేస్తారా? అన్నది కాంగ్రెస్ పార్టీనే తేల్చుకోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో జగిత్యాల రాజకీయాలపై స్పందిస్తూ..‘జగిత్యాల రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదు. జీవన్ రెడ్డి నాకు తండ్రితో సమానం. జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని నా అభిప్రాయం. ఈ వయసులో ఆయనను హింసించడం మహాపాపం. మానసిక క్షోభకు గురి చేయడం కాంగ్రెస్‌కు మంచిది కాదని హెచ్చరిస్తున్నాను. ఎలక్షన్ టైం కాకపోతే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పలకరించేవాడిని అంటూ వ్యాఖ్యానించారు. -
సంజయ్ ఏ పార్టీనో ఆయనకే తెలియదు: జీవన్ రెడ్డి సెటైర్లు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్ జోక్యం ఏంటి? అని ప్రశ్నించారు. సంజయ్ ఎవరు కాంగ్రెస్ వ్యవహారాలో జోక్యం చేసుకోవడానికి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే సంజయ్ రాజ్యంగా నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థిస్తూ ఎమ్మెల్యే సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడాన్ని స్వాగతిస్తున్నా. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యమే కరెక్ట్ కాదు.1983 ఎన్నికల్లో టీడీపీ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది నేను ఎమ్మెల్యే, మంత్రిగా జగిత్యాలకు సేవ చేశాను. టీడీపీలో చంద్రబాబు ఆధిపత్యంతో విభేదించి నాదెండ్ల వర్గంలో చేరాను. అప్పుడు నాకు నేనుగా మంత్రి పదవికి రాజీనామా చేశాను. 1985లో పార్టీ ఫిరాయింపు చట్టం అమలులోకి వచ్చింది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు సంజయ్. పార్టీ ఫిరాయింపులపై గత దశాబ్ద కాలంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను. సంజయ్ అభివృద్ధి గురించి నేను నేర్చుకోవాలా?. కాంగ్రెస్ పార్టీలో సంజయ్ అడుగుపెట్టాడు. కార్యకర్తల కాళ్లలో కట్టెలు పెట్టి మా హక్కులను కాజేశాడు. కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్టానానికి వ్యక్తం చేశాను. సంజయ్ ఎవరు మా పార్టీ వ్యవహారాల్లో తల దూర్చడానికి..’ అని ప్రశ్నించారు. -
‘మా ముఖ్యమంత్రి ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారు’
జగిత్యాల : తమ ముఖ్యమంత్రి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ పార్టీ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేవలం పార్టీ ఫిరాయింపు వారికే గుర్తింపు ఇస్తున్నారని చురకలు అంటించారు. జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడు నందయ్యకు తన ఇంట్లో సన్మాన కార్యక్రమానికి హాజరైన జీవన్‌రెడ్డి.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై మండిపడ్డారు. ‘లక్ష్మణ్ అన్నకు కోపం వచ్చినా సరే… కానీ, మా పోటీ పక్కవాళ్లతో కాదు.. ముఖ్యమంత్రి స్థాయి నాయకులతోనే. కాంగ్రెస్ కన్నతల్లి లాంటి పార్టీ. తన బిడ్డలను కాపాడుకుంటుంది. కానీ మా లాంటి వాళ్లను సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదు. అసలైన కాంగ్రెస్‌కు కార్యకర్తలను వదిలేస్తున్నారు.. ఫిరాయింపు వారికి గుర్తింపు ఇస్తున్నారు. జగిత్యాలకు ఎమ్మెల్యే సంజయ్ చేసేందేమీ లేదు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సంజయ్ ఏం చేశారు?’ అని ధ్వజమెత్తారు. -
జీవన్ రెడ్డి, శ్రావణికి ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్
సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, శ్రావణికి ఎమ్మెల్యే సంజయ్ కౌంటరిచ్చారు. వంద కోట్ల భూకబ్జా ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భూమి కబ్జా వ్యవహారానికి నాకేం సంబంధం లేదు. మంచాల కృష్ణ నా మిత్రుడు కావచ్చు. అంత మాత్రాన ఆరోపణలు చేయడమేంటి?. నియోజకవర్గంలో నాకు అందరూ మిత్రులే. 75 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని లాగి నాపై బురద చల్లడం తగదు. శ్రావణి చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడే మంచాల కాంప్లెక్స్ ప్రారంభం చేసింది. ఎంపీ ఎన్నికల సమయంలో జీవన్ రెడ్డి.. మంచాల కృష్ణ ఇంటికెళ్లి శాలువా కప్పించుకోలేదా?. జగిత్యాల ప్రజలు చైతన్యవంతులు. నిజాలు తెలుసు కాబట్టే నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారు’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. జగిత్యాలలో సంచలనంగా మారిన రూ.100 కోట్ల భూకబ్జా ఆరోపణలపై భోగ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు పెట్రోల్ పంపు భూ కబ్జా విషయంపై మాట్లాడితే తనను టార్గెట్ చేశారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయడానికి పెట్రోల్ పంపు వ్యవహారణమే కారణమని తెలిపారు. యావర్ రోడ్డు విస్తరణకై తొలి ప్రయత్నంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ నిర్మిస్తున్న సందర్భంలో ఐదు ఫీట్లు ఆర్అండ్బీ ఆఫీస్ సైడ్ అలైన్మెంట్ చేయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడితే పెట్రోల్ పంపు విషయం బయటకు వస్తుందని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఓ దశలో మొదలుపెట్టిన డివైడర్ నిర్మాణాన్ని సైతం మార్చి కట్టేలా చేశారని.. కబ్జాలకు పాల్పడిన వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను నడిరోడ్డుపై నిలబెట్టి.. ఇది మా వ్యక్తిగత విషయమని.. ఈ విషయంలో నువ్వు తలదూర్చొద్దంటూ ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. పెట్రోల్ పంప్‌కి అన్ని అనుమతులు ఉన్నట్లయితే ఆ రోజు తనపై ఎమ్మెల్యే సంజయ్ తనపై ఒత్తిడికి తీసుకురావడానికి కారణం ఏంటని ఆమె ప్రశ్నించారు.అన్ని నిజాలు తెలిసినా ఎమ్మెల్యే సంజయ్ తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనా ముగిసి.. 1949 ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే 1952లో అసలు అమలులో లేని కిబాల ద్వారా స్థలం ఎలా కొన్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంలో ఇప్పటికే అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందని.. సందేహాత్మకంగా ఉన్న కిబాల పత్రాన్ని అందరి సమక్షంలో ట్రాన్స్‌లేట్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. తాను చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి రికార్డులు మున్సిపల్లో లభించలేదని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి ఇప్పటికైనా ఈ వ్యవహారంపై మాట్లాడడం హర్షించదగ్గ విషయమన్నారు. మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణకై పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. -
పార్టీలో నా స్థానం ఏంటి?.. మంత్రి ముందు జీవన్‌రెడ్డి ఆవేదన
సాక్షి, జగిత్యాల జిల్లా: తనను హలాల్ చేసి రోజుకింత ఎందుకు చంపేస్తున్నారంటూ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి చంపండంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు జీవన్‌రెడ్డి వాపోయారు. బీఆర్‌పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీపై జీవన్‌రెడ్డి అసంతృప్తి చేశారు. కమిటీలు, కాంట్రాక్టులు బీఆర్ఎస్ నుంచి వచ్చినవారికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తమ స్థానమేంటని ప్రశ్నించారు.తాము వలసదారులం కాదంటూ తాజాగా పార్టీలోకి చేరి పదవులనుభవిస్తున్న వారిపై చురకలు అంటించారు. మంత్రి శ్రీధర్‌బాబు, అడ్లూరి అడుకోకపోతే ఆ రోజే కథ వేరుండేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కౌలుదారులం కాదు.. పట్టాదారులమంటూ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీకి తగ్గ గుర్తింపు లేదు: జీవన్ రెడ్డి
-
కాంగ్రెస్‌లో ట్విస్ట్ : సీనియారిటీకి గుర్తింపు లేకపోతే ఎలా.. జీవన్‌రెడ్డి గుస్సా
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీకి తగిన గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా అసంతృప్తి ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీ తానే అని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ తప్ప ప్రస్తుతం నాకంటే అనుభవజ్ఞుడైన నాయకుడు ఎవరున్నారు?. జానారెడ్డి కూడా నాకంటే పార్టీ పరంగా నాలుగేళ్లు జూనియరే. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీని నేనే. శాసనసభ, శాసన మండలిలో.. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఎంత పోరాటమైతే చేశారో అంతకు మించి పోరాటం నేనూ చేశాను.సీనియారిటీకి తగ్గ గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా నాకు అసంతృప్తి ఉంటుంది. అది కావాలని కోరుకోవడంలో తప్పేముంది?. సీనియర్ నాయకుడైన ప్రేమ్ సాగర్ రావు అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా మంత్రి పదవులు కావాలని కోరుకోవడంలో తప్పేముంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారి తీసినట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా!
జగిత్యాల జిల్లా: ‘కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం మరోసారి చర్చకు దారి తీసింది.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన ఓ కార్యకర్తతో జీవన్ రెడ్డి అన్న మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. తన మనసులోని మాటను బయటపెట్టారు.ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మపురి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ తో అవాక్కయ్యేలా మాట్లాడారు జీవన్ రెడ్డి. ‘ నేనే మీ పార్టీలో వద్దామనుకున్నా.. ఏదో ఉందని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావ్’ అంటూ పార్టీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాచు.‘మీ పార్టీకి.. మీకో దండం’ అంటూ ఆనాడే వ్యాఖ్యలుతన ముఖ్యఅనుచరుడైన గంగారెడ్డి గతేడాది హత్య గావించబడ్డ దగ్గర్నుంచీ జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉన్న సమయంలోనే తన అనుచరుడు హత్యకు గురి కావడంతో జీవన్ రెడ్డి బహిరంగంగానే పార్టీ తీరుపై నిరసన స్వరం వినిపిస్తున్నారు. ‘ ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకునైనా సేవ చేస్తా. మీ పార్టీకి మీకో దండం అంటూ గతంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్నో అవనానాలు భరించామని. ఇక భౌతికంగా లేకుండా చేయలేని చూస్తే చేసేది ఏముంటుందటూ జీవన్ రెడ్డి ఆ సమయంలో మాట్లాడారు. -
బీఆర్ఎస్ది వడ్డీ మాఫీనే.. దొంగ దీక్ష అందుకే: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అలాగే, తెలంగాణ ప్రజలకు రేషన్‌కార్డులు ఇవ్వడమే మర్చిపోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోందని తెలిపారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు.. వడ్డీ మాఫీ మాత్రమే చేసింది. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. మేము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ రైతు భరోసా అమలు చేస్తుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతల ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతోంది. రైతు భరోసా పేరుతో ఈనెల 26 నుండి రైతుకు ప్రోత్సాహం కింద ఎకరాకు 12 వేలు ఇస్తుంది. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద 12వేల ఆర్థిక సహాయం అందజేస్తుంది. బీఆర్ఎస్ రైతుబంధు పేరుతో ఏడాదికి 8వేల నుండి పది వేలు చేస్తే.. కాంగ్రెస్ పది వేల నుండి 12 వేలు ఇస్తుంది. భవిషత్తులో 14 వేలు కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది.దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు 500 బోనస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రైతులకు సన్నాలు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తున్నాం. రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఈనెల 26నుండి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బీఆర్ఎస్ హౌసింగ్ పథకాన్ని మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేలా ప్రణాళిక చేసింది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ రుణమాఫీ అంశాన్నే ఎత్తేసింది. బీజేపీ రుణమాఫీ అనే మాటే ఎత్తలేదు. కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నీతి ఆయోగ్‌లో ప్రస్తావిస్తే బాగుండేది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పేటెంట్ అంటే అది కాంగ్రెస్ మాత్రమే’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ.. జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
జగిత్యాల: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల్లో పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తన వ్యక్తిగత నిర్ణయం ఏమీ లేదని కుండబద్ధలు కొట్టారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే బాగుంటుంది. ఆ అభిప్రాయం అధిష్టానానికి కాంగ్రెస్ రాష్ట్ర శాఖ నివేదిస్తుంది. నివేదిక తర్వాత ఎవరు బరిలో ఉండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. పోటీ చేయడం, చేయించడం పార్టీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. నా వ్యక్తిగత నిర్ణయం అంటూ ఏది లేదు.గతంలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేనే వ్యక్తిగతంగా ఏమీ పోటీ చేయలేదు. పార్టీ నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. నాకు ఎవరూ హామీ ఇవ్వలేదు.. నాకు ఎలాంటి ఒప్పందాలూ లేవు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ చీఫ్ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. వచ్చే పట్టభ్రదుల ఎన్నికల్లో మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికే అవకాశం దక్కే అవకాశం ఉంది. -
కాంగ్రెస్‌లో దశాబ్దాల పోరాటం మాది.. నేడు కంచం లాక్కున్నట్టుంది: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉండి పోరాటం చేశామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.జగిత్యాలలో నేడు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేశాం. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్లు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి. విప్ లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జగిత్యాల కాంగ్రెస్ నాయకులకు ఆత్మస్థైర్యం కల్పించే విధంగా అండగా ఉండాలి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకుందాం. కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. నవంబర్ నెల చివరి వరకు సర్వే రిపోర్ట్ వస్తే డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక చేసుకోవచ్చు. తద్వారా జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లు నిండా ముంచారు. పదవులు లేకపోతే కేటీఆర్, కేసీఆర్ ఉండలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టుగా శ్వేతపత్రం విడుదల చేశారు. చేసిన అప్పులు కొరకే ప్రజలను క్షమించమంటూ కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రజలకు వివరించాలి. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
‘ప్రాణానికి హాని ఉందన్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు’
జగిత్యాల, సాక్షి: ప్రాణానికి హాని ఉందని గంగారెడ్డి ముందే చెప్పినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిజామాబాద్ మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఆయన శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే హత్యకు గురి కావడం విచారకరం. ఎవరి ప్రోద్భలంతో, ఎవరి అండతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతామని అభద్రతా భావంతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకున్నాం. 2014లో ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరే జీవన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ పార్టీలోకి వెళ్ళలేదు’’అని అన్నారు.‘‘ నాకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే ఫిరాయింపు జరిగింది. కనీసం నాకు చెప్పలేదనేది నా ఆవేదన. గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది. గంగారెడ్డిని వాట్సాప్‌లో బెదిరించినా గానీ పోలీసులు పట్టించుకోలేదు. 100 డయల్ ఫోన్ చేసినా నో రెస్పాన్స్. దసరా పండుగ రోజు డీజేలు పగులగొట్టినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కుట్రలను, వాస్తవాలని వెలికి తీయలేకనే పాత కక్షలు అని పోలీసులు చెబుతున్నారు. నా కుటుంబ సభ్యుణ్ని కోల్పోయా. ఒక నేరస్థుడు పోలిసు స్టేషన్లో రీల్స్ తీస్తే పోలీసుల ఏం చేశారు. ఫిరాయింపులతో మేము ఆత్మస్థైర్యం కోల్పోయాం. మా ప్రత్యర్థులు రెచ్చిపోయారు’’అని అన్నారు. -
జీవన్‌రెడ్డికి యాష్కీ, జగ్గారెడ్డి మద్దతు
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డికి ఆ పార్టీలోని పలువురు నేతలు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. అనుచరుడి హత్యతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆయన్ను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం కలిసి పరామర్శించారు. అనుచరుడి హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకొని సానుభూతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పారీ్టకి ఎనలేని సేవ చేశారని... ఆయన సేవలు పారీ్టకి మరింత అవసర మని అభిప్రాయపడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలిచారని గుర్తుచేశారు. అప్పుడే ఆయనకున్న ప్రజాబలం ఏమిటో అర్థమైందన్నారు. జీవన్‌రెడ్డిని పార్టీ కాపాడుకుంటుందని.. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు ప్రభుత్వ పాలనలో ఆయన తెలిపిన అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని యాష్కీగౌడ్ చెప్పారు. ఆయన ఆవేదన చూసి బాధపడ్డా: జగ్గారెడ్డి జీవన్‌రెడ్డి ఆవేదనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్పందించారు. జీవన్‌రెడ్డి ఆవేదన చూసి తాను చాలా బాధపడ్డానని.. మనసు కలుక్కుమందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మీకు అండగా ఉన్నానని చెప్పడానికి ఈ ప్రకటన మీడియా ద్వారా చేస్తున్నా. నేను ఎవరినీ తప్పుబట్టట్లేదు. కానీ పారీ్టలో మీరు ఒంటరినని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు నేను మీ వెంట ఉంటా. ఎప్పుడూ జనంలో ఉండే మిమ్మల్ని జగిత్యాల, సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావట్లేదు. మీ సమస్యకు అధిష్టానం పరిష్కారం చూపాలని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీని కోరుతున్నా’అని జగ్గారెడ్డి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు -
ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్
-
రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టానికి తూట్లు.. జీవన్ రెడ్డి ఆగ్రహం..
-
ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం: జీవన్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా చట్టం రూపొందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాం. మానసిక ఆవేదనలో ఉన్నా. ఫిరాయింపులపై ఖర్గేకు లేఖ రాశా. ఫిరాయింపుల చట్టం లొసుగులతో పార్టీ మారుతున్నారు. కొందరు అభివృద్ధి అనే నినాదంతో పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజీవ్ గాంధీ చట్టం తెచ్చారు. ఇప్పుడు ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. కాంగ్రెస్ సుస్థిర ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ ఉంది.. ఫిరాయింపుల అవసరం లేదు. దురదృష్టవశాత్తు నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందని సంతోషించా. ఎమ్మెల్యే ల చేరికలు ఎందుకు అనేది అర్థం కాని పరిస్థితి. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అనే పరిస్థితి ఉంది. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది.. పార్టీకి నేను అంతే గౌరవం ఇచ్చా. పదేళ్లు బీఆర్ఎస్ దౌర్జన్యాలను ఎదుర్కొన్నాం. మళ్లీ కాంగ్రెస్ ముసుగులో దౌర్జన్యం చేస్తామంటే మేము ఎలా సహించాలి.నామినేటెడ్ పదవులు, అధికారం చెలాయించాలని కొత్తగా చేరిన ఎమ్మెల్యే లు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మా పరిస్థితి ఏంటి?. పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి. ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి మాపై పెత్తనం చేయాలని పోచారం ఆదేశించారు. పది మంది ఎమ్మెల్యేలు లేకుండా మా ప్రభుత్వం కొనసాగదా. రాహుల్ గాంధీ కోరుకున్న ప్రజాస్వామ్య విలువలు ఇవ్వేనా. పార్టీ ఫిరాయింపులపై పోచారం శ్రీనివాస్‌రెడ్డికి చాలా అనుభవం ఉంది. పార్టీ ఫిరాయింపుల క్రమబద్ధీకరణకు పోచారం సలహాలు ఇస్తారు. అసలు పోచారం సలహాదారుడు ఏంటి? భట్టి సీఏల్పీ పదవి పోవడానికి పోచారం కారణం కాదా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి.. పార్టీ బలోపేతం కావాలనేదే నా భవిష్యత్ కార్యాచరణ. గంగారెడ్డిని హత్యచేసిన సంతోష్ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి. ఎమ్మెల్యే చేరికతో సంతోష్ ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు వేసుకున్నాడు. ఆదిపత్యపోరుతో గంగారెడ్డిని హత్యచేశారు. గంగారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోటీలో ఉన్నారు. గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు డాక్టర్ సంజయ్ కుమారు నాకు హత్యతో సంబంధం లేదు అంటున్నారు. సంజయ్ ఇంట్లోనే కాంగ్రెస్ పుడితే.. బీఆర్ఎస్కలోకి ఎందుకు పోయాడు?. అధికార పార్టీలో చేరితేనే అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? చేరికలను నేను ముందే వ్యతిరేకించా’’ అని అన్నారు.చదవండి: ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది -
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
జీవన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరం..
-
సీఎం రేవంత్.. ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఎమ్మెల్యే ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్యగా చెబుతున్నారని, దీనిపై రేవంత్ లెంపలేసుకుంటారా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని సూటిగా వేలెత్తి చూపుతున్నారని తెలిపారు. తమ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారని అన్నారు.ఈ మేరకు ఎక్స్‌లో స్పందించిన కేటీఆర్.. ‘ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా? క్షమాపణ చెబుతారా? మీరు గడప గడపకు వెళ్లి.. చేర్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా ?ప్రోత్సహించిన మిమ్ములనా ?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే.. మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు.. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా ?జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే..ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని….మీ దిగజారుడు… pic.twitter.com/D9CTnAl6Ci— KTR (@KTRBRS) October 23, 2024కాగా కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫిరాయింపులు మంచిది కాదని హైకమాండ్‌కు చెప్పానని పేర్కొన్నారు. ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు.ఫిరాయింపుల కారణంగా బీఆర్ఎస్ ఎవరో.. కాంగ్రెస్ ఎవరో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఎంఐఎంను మినహాయించినా కాంగ్రెస్ సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు. -
జీవన్ రెడ్డి తిరుగుబాటు
-
అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి
జగిత్యాల: ‘అవమానాలు చాలు.. ఇకనైనా బతకనివ్వండి. ఈ రోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. ఎన్జీవో పెట్టుకోనైనా ప్రజలకు సేవ చేస్తా..’అంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురికావడంతో జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ చంపిందని వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాలపాటు పార్టీకి సేవ చేస్తే మంచి బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. గంగారెడ్డి హత్యతో ఆందోళనకు దిగిన జీవన్‌రెడ్డికి మద్దతుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జగిత్యాలకు రాగా ‘నీకో దండం.. నీ పార్టీకో దండం.. ఇకనైనా బతకనివ్వండి..’అంటూ దండం పెడుతూ వ్యాఖ్యానించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ జీవన్‌రెడ్డికి ఫోన్ చేసి హత్యకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయ త్నించగా మధ్యలోనే ఫోన్ కట్ చేశారు. పార్టీకి ఎంతో సేవ చేశా ‘ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న. అయినా బీఆర్ఎస్ వైఫల్యాలు, ఉద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, రైతుల సమస్యలు ఇలా అన్నీ లేవనెత్తి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నా స్థానం ఎక్కడో ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో అవమానాలు తట్టుకుంటున్నాం. ఇక ఓపిక లేదు. బీఆర్ఎస్ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొని, తట్టుకొని నిలబడితే.. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంతో ఈరోజు జగిత్యాలలో ఎలాంటి పరిస్థితులున్నాయో ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. మానసిక అవమానాలకు గురయ్యాం. అది చాలదన్నట్టు భౌతికదాడులకు తెగబడుతున్నారు’అంటూ జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వమా? బీఆర్ఎస్ ప్రభుత్వమా? ఇప్పుడు తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామో.. లేక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామో అర్థం కావడం లేదని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలకు నైతిక విలువ లు ఉండాలని సూచించారు. గతంలో కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూ సి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని, ఆయన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. మా స్థానం ప్రశ్నార్థకం కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని, భౌతిక దాడులు చేస్తున్నారని, నాటి టీఆర్ఎస్.. ఈనాటి కాంగ్రెస్ ముసుగులో ఉందని జీవన్‌రెడ్డి అన్నారు. మానసిక వేదనకు గురవుతున్నామని, కార్యకర్తలు కూడా నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిందే తాము చేస్తామంటే మన నాయకుడు కేసీఆర్ కాదని, రాహుల్‌గాంధీ అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఇలాంటివే ఎదురవుతాయని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంతో బీఆర్ఎస్ గత ఎన్నికల్లో మూడో స్థానంలోకి వెళ్లిందని గుర్తు చేశారు. -
TG: జీవన్‌రెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గంగారెడ్డి హత్యను పార్టీ సీరియస్‌గా తీసుకుందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విషయమై మహేష్‌కుమార్ గౌడ్ మంగళవారం(అక్టోబర్ 22) మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ నేత గంగారెడ్డి హత్య వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడాను.జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు హత్యకు గురికావడంతో ఆయన ఆవేదనతో ఉన్నారు.జీవన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత ఆయన ఆవేదనను అర్థం చేసుకుంటాం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవన్నీ త్వరలో పరిష్కారమవుతాయి. జీవన్‌రెడ్డి అంశాన్ని మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగించాం. ఆయన త్వరలో అన్ని సర్దుకునేలా చేస్తారు’అని మహేష్‌కుమార్ గౌడ్ చెప్పారు.ఇదీ చదవండి: జగిత్యాలలో కాంగ్రెస్ నేత దారుణ హత్య -
శాంతిభద్రతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే నేడు జీవన్‌రెడ్డి అంటున్నారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో...రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ఆవేదనతో చెబుతున్నారని పేర్కొన్నారు.ఇకనైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని కేటీఆర్ కోరారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని సూచించారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని.. వారి పని వారిని చేసుకొనిస్తే శాంతి భద్రతలు, రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడగలుగుతారని అన్నారు.A senior congress leader & a Former Minister, MLC Jeevan Reddy Garu today is echoing what the rest of Telangana has been saying since the last few months Law & Order in Telangana has been a major concern. Without a full time Home Minister and more importantly with police being…— KTR (@KTRBRS) October 22, 2024 -
జీవన్ రెడ్డికి ఝలక్..
-
జగిత్యాల- ధర్మపురి రోడ్డుపై కొనసాగుతున్న నిరసన
-
నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేను: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, సాక్షి: జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధర్నా విరమించారు. ఆయన ఇవాళ పార్టీ నేత గంగారెడ్డి హత్యను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటంతో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో సొంత ప్రభుత్వంపైనే జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విప్ అడ్లూరి లక్ష్మణ్‌పై జీవన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ‘‘ నీకో దండం... నీ పార్టీకో దండం’’ అంటూ లక్ష్మణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. జీవన్ రెడ్డికి సీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఫోన్ చేయగా.. ‘‘నేను పార్టీలో ఉండలేను. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారు’’ అని ఫోన్ మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేశారు. ‘‘ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదు. ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహూల్ గాంధీ వరకు కోరుకున్నారు. కానీ, ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ దాన్ని విస్మరించింది. కేసీఆర్ ఏదైతే చేశాడో.. అదే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఆచరిస్తున్నారు. రాహూల్ గాంధీ మన నాయకుడనే విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. నేనెవ్వరికీ భరోసా ఇచ్చే స్థితిలో లేను. నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను’’ అని జీవన్‌రెడ్డి అన్నారు.అంతకు ముందు గంగారెడ్డి హత్యపై కాంగ్రెస్ నేతలు జగిత్యాల-ధర్మపురి రహదారిపై నిరసన చేపట్టారు. రోడ్డుపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ బైఠాయించిన నిరసన తెలిపారు. జగిత్యాలలో 2 గంటలుగా జీవన్‌రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు.పోలీసులకు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సహనం కోల్పోయిన జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో జగిత్యాలలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.జగిత్యాల రూరల్ జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.గంగారెడ్డిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. పాత కక్షలతోనే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: జగిత్యాల: కాంగ్రెస్ నేత గంగారెడ్డి దారుణ హత్య -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్
ఆర్మూర్: ఆర్మూర్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మె ల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన జీవన్‌రెడ్డి మాల్‌కు ఆంధ్రప్రదే శ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సోమవా రం నోటీసులు జారీ చేసింది. సంస్థ యజ మాని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డితో పాటు రుణం తీసుకోవడానికి షూరిటీ ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్ అండ్ మలి్టప్లెక్స్ నిర్మాణం కోసం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వద్ద రూ.40 కోట్ల రుణం తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.45.46 కోట్లకు చేరుకుంది. ఈ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆస్తులను షూరిటీగా పెట్టిన కాటిపల్లి గంగారెడ్డి, యాల్ల నరేందర్, నక్కల లక్ష్మణ్‌కు సైతం నోటీసులు జారీ అయ్యాయి. షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. సకాలంలో రుణ బకాయిలు చెల్లించకపోవడంతో భూములు స్వా«దీనం చేసుకుంటామని వ్యవసాయ భూముల వద్ద ఫ్లకార్డులు పెట్టి, నోటీసులను అతికించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఒక విహారయాత్ర: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై ఇప్పటికైనా బీఆర్ఎస్ తప్పు ఒప్పుకోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వాస్తవాలు తెలిసి కూడా తప్పును కప్పి పుచ్చుకోవడానికి విహార యాత్రగా కాళేశ్వరంగా వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.కాగా, బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజక్ట్ పర్యటనపై జీవన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కేటీఆర్ కాళేశ్వరం పర్యటన ఓ విహారయాత్ర. మూడు లిఫ్ట్‌ల్లో నీటిని తరలిస్తే 30వేల కోట్లు అయ్యే ప్రాజెక్ట్‌కు లక్షా 20వేల కోట్లు చేశారు. అప్పులకు కేసీఆరే బాధ్యుడు. ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాణాత్మకంగా లోపాలు ఉన్నాయి. మూడు ప్రాజెక్ట్‌ల్లో నీటిని నిల్వ చేయకుడదని ఎన్డీఎస్ఏ స్పష్టం చెబుతోంది. విజిలెన్స్ కూడా ఇదే నివేదిక ఇవ్వబోతోంది.వాస్తవాలు తెలిసి కూడా ఇలా విహారయాత్రకు వెళ్లినట్టు వారంతా అక్కడికి వెళ్లారు. ఒకవైపు న్యాయవిచారణ జరుగుతోంది. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ అనుభవం ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించడానికి ఒకేఒక అవకాశం ఉంది. మారో మార్గమే లేదు. గత బీఆర్ఎస్ వల్లే ఈ పరిస్థితి నెలకొంది. తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారు. 148 మీటర్ల ఎత్తుతో నీటిని తరలిస్తే ప్రాణహిత నీళ్లు ఒక్క లిఫ్ట్‌తో ఎల్లంపల్లికి నీళ్లు వచ్చేవి. కేసీఆర్ కమీషన్ల కోసం లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
DSCపై బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్.. జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
అమెరికా చిన్నారికి అత్యవసర వీసా..
కరీంనగర్: రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చింతలపెల్లి అఖిలేందర్రెడ్డి ఉపాధి నిమిత్తం అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన భార్య కేతిరెడ్డి శ్రుతిరెడ్డి తండ్రి కోరుట్ల మండలం నాగులపేటకు చెందిన మోహన్‌రెడ్డి ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన తండ్రి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 6న డల్లాస్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరగా.. ఖత్తర్ ఎయిర్వేస్ సిబ్బంది ఆరు నెలల చిన్నారికి యశ్నకు ఫెలైట్ ఎక్కడానికి అనుమతించలేదు.శ్రుతిరెడ్డి భారతీయ పౌరురాలు. అమెరికాలో జన్మించిన ఆమె కూతురు యశ్నకు అమెరికా పౌరసత్వం ఉన్నా.. భారతీయ మూలాలున్నవారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఈ) కార్డు లేదా ఇండియా విజిట్ వీసా ఉండాలి. ఈ ఆరు నెలల పాపకు ఈ రెండు లేకపోవడంతో.. అక్కడ ఖత్తర్ ఎయిర్వేస్ సిబ్బంది ఫెలైట్ ఎక్కడానికి అనుమతి ంచలేదు.విషయం తెలుసుకున్న అఖిలేందర్ తండ్రి కొత్త పేట మాజీ ఎంపీటీసీ చింతలపెల్లి గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దృష్టికి శనివారం తీసుకెళ్లగా.. వెంటనే స్పందించిన జీవన్‌రెడ్డి తెలంగాణ ఎన్నారై అధికారి చిట్టిబాబు, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సమన్వయంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి చిన్నారి యశ్నకు అత్యవసర వీసా ఇప్పించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు ఆదివారం అంత్యక్రియల కోసం ఫైలెట్లో బయలుదేరారు. సోమవారం నాగులపేటలో కేతిరెడ్డి మోహన్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని అంతిమ వీడ్కోలు పలకనున్నారు. -
జగిత్యాల కాంగ్రెస్‌లో కొత్త చర్చ.. జీవన్‌రెడ్డి ఫొటో ఎక్కడ?
సాక్షి, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీల నేతలు హస్తం గూటికి చేరుతున్న నేపథ్యంలో పలు చోట్ల కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఫ్లెక్సీల వార్ ఇంకా కొనసాగుతోంది.తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోలు లేకపోవడం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది. కావాలనే జీవన్ రెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఇక.. మొన్న కూడా జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించిన విషయం తెలిసిందే.మరోవైపు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో, రెండు వర్గాల మధ్య దూరం పెరుగుతోంది. ఈనేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్‌లో అంతర్గత పోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. జగిత్యాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డిని కావాలనే సైడ్ చేస్తున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
అలక వీడిన జీవన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యవహారంలో కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. తనకు సమాచారం లేకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకో వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి అధిష్టానం హామీతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధిష్టానం ఆదేశాల మేరకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జీవన్‌రెడ్డిని వెంటబెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రాత్రి 7.30 గంటలకు నేరుగా తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో భేటీఅయి అరగంట పాటు మంతనాలు సాగించారు. అనంతరం 8 గంటలకు జీవన్‌రెడ్డిని తోడ్కొని దీపాదాస్, శ్రీధర్‌బాబులు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు.అండగా నిలిచిన వారిని గుర్తిస్తామన్నారు: జీవన్రెడ్డిఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని, కార్యకర్తల మనోభావాలు గుర్తించి, పార్టీకి అండగా నిలిచిన వారిని ప్రాధాన్యమిచ్చి గుర్తిస్తామని కేసీ వేణుగోపాల్ చెప్పారని జీవన్‌రెడ్డి అన్నారు. వేణుగోపాల్‌తో భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీకైనా కేడర్ ఆత్మగౌరవమే ప్రధానం. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. పార్టీకి అండగా నిలిచినవారి ఆలోచనలకు అనుగుణంగానే ముందుకెళ్తాం. వారి కృషికి ప్రాధాన్యత ఇస్తామని వేణుగోపాల్ ఇచ్చిన హామీతో సంతృప్తి చెందాను’ అని జీవన్‌రెడ్డి తెలిపారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని, అందరికీ కావాల్సింది పార్టీ ఐక్యతే అన్నారు. ఈ భేటీకి చొరవ తీసుకున్న దీపాదాస్ మున్షీ, శ్రీధర్‌బాబు, లక్ష్మణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.తలుపులు తెరిచే ఉంటాయి: దీపాదాస్ మున్షీకాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీలోకి రావాలనుకుంటే పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ చెప్పారు. ‘కాంగ్రెస్‌లో ఇప్పటికే చాలామంది చేరారు. ఇంకా చాలామంది చేరబోతున్నారు. మా పార్టీలోని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా కలిసి నడుస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో పటిష్టంగా నడుస్తోంది’ అని అన్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల నియామకం ఉంటుందా అనే ప్రశ్నకు.. ‘పిక్చర్ అభీ బాకీ హై (సినిమా ఇంకా ఉంది) త్వరలోనే ఉంటుంది. పీసీసీ అ«ధ్యక్షుడి ఎంపిక అధిష్టానం నిర్ణయం. అసెంబ్లీ, పార్లమెంటులాగా కాలవ్యవధి ఉండదు’ అని మున్షీ బదులిచ్చారు.దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: శ్రీధర్బాబుగత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీని చీల్చి, నష్టపరిచి, బలహీనపరిచిన వారే పార్టీ చేరికలపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, అయితే రాజీనామాలు చేసి రావాలన్న నిబంధనపై పార్టీ ఆలోచన ఏవిధంగా ఉంటుందో చూడాలన్నారు. -
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. ఢిల్లీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరటంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి జీవన్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి వారితో జీవన్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం, తనకు సమాచారం లేకుండానే ఇదంతా జరగిందంటూ టి. జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు. అటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన్ను కాంగ్రెస్ నేతలు, మంత్రలు బుజ్జగించారు. జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ సైతం చర్చలు జరుపుతోందని, ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయలుదేరటంపై ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఇంకా అలక వీడని జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనకు సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇంకా అలకపాన్పు వీడలేదు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి గంటన్నర పాటు చర్చించారు. చర్చల తర్వాత కూడా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీని తాను వదిలే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం త్వరలోనే రాజీనామా చేస్తానని జీవన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. మండలి చైర్మన్‌కు ఫోన్ సంజయ్ చేరిక సమయంలో కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదన్న మనస్తాపంతో ఉన్న జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ నాయకత్వం సోమవారం చర్చలు జరిపింది. పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. అయినా, తన వైఖరిలో మార్పు లేదంటూ జీవన్‌రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను కలుస్తానంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫోన్ చేశారు. కానీ, తాను అందుబాటులో లేనని, నల్లగొండ వెళుతున్నానని గుత్తా వెల్లడించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు బేగంపేటలోని జీవన్‌రెడ్డి నివాసానికి హుటాహుటిన వెళ్లారు. గంటన్నరకు పైగా అక్కడే ఉండి జీవన్‌రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ తగిన గౌరవం ఇస్తుందని, సీనియారిటీకి ఎక్కడా గౌరవం తగ్గకుండా తాము చూస్తామని నచ్చజెప్పారు. అయితే, మంత్రులతో చర్చల సందర్భంగా జీవన్‌రెడ్డి తన మనసులోని మాటలను వారికి వెల్లడించారని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి. పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలోని తన రాజకీయ ప్రత్యరి్థని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు ఏం గౌరవం ఇచి్చనట్టని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో తనది నాలుగు దశాబ్దాల అనుబంధమని, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అయితే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే ఆలోచన ప్రస్తుతానికి లేదని, తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు సమాచారం. జీవన్‌రెడ్డి మా మార్గదర్శకులు: డిప్యూటీ సీఎం భట్టి మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నేతలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పదేళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన నాయకుడు జీవన్‌రెడ్డి అని అన్నారు. ఆయన మనస్తాపానికి గురైతే తాము కూడా బాధపడతామని వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి తమందరికీ మార్గదర్శకులని, ఆయన అనుభవాన్ని ప్రభుత్వాన్ని నడిపేందుకు తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. ఆయన సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సీనియర్ నాయకులను వదులుకునేందుకు పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జీవన్‌రెడ్డిని తాము కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని భట్టి వెల్లడించారు. చైర్మన్‌ను సమయం ఎందుకు అడిగానో ఆలోచించుకోండి: జీవన్‌రెడ్డి భట్టి, శ్రీధర్‌బాబులతో చర్చలు ముగిసిన అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉదని చెప్పారు. జరిగిన పరిణామాలు కొన్ని బాధించాయని వ్యాఖ్యానించారు. తనతో పార్టీ ఇన్చార్జ్ మున్షీ కూడా మాట్లాడారని వెల్లడించారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, ఆయన అందుబాటులోకి రాగానే నిర్ణయం చెబుతానని, త్వరలోనే మండలి చైర్మన్ దగ్గరకు వస్తానని అన్నారు. మీరు ఎమ్మెల్సీగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా అని ప్రశ్నించగా, మండలి చైర్మన్ టైం ఎందుకు అడిగానో అర్థం చేసుకోవాలని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
జీవన్‌రెడ్డి.. తగ్గేదే లే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జగిత్యాల: జగిత్యాల జిల్లాలో రగిలిన రాజకీయ చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తనను సంప్రదించకుండా తన చిరకాల ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధపడిన విషయం విదితమే. మంగళవారం అధిష్టాన పెద్దలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినా ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్ సింగ్ జీవన్‌రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. కార్యకర్తలతో మాట్లాడాక బుధవారం నిర్ణయం తీసుకుంటారని, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన అనుచరులు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో జీవన్‌రెడ్డి చేయబోయే ప్రకటనపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.వెనక్కి తగ్గొద్దని ఒత్తిడి..ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లారని తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అక్కడి ఆయన నివాసానికి తరలివెళ్లారు. నాయకుడు ప్రేమ్‌సాగర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులంతా జీవన్‌రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేరికపై సరైన వివరణ ఇచ్చేదాకా వెనక్కి తగ్గొద్దని ఎమ్మెల్సీపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో తన పదవికి రాజీనామా చేసే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా ఆయన ఉన్నారని విశ్వసనీయ సమాచారం.నాయకులు, కార్యకర్తల ఆవేదన..ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికే ఆ పార్టీ నాయకులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు సంజయ్‌కుమార్ బీఆర్ఎస్ను వీడటంపై ఆ పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. పదేళ్లపాటు అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జీవన్‌రెడ్డి వెంటే ఉండి, పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పోరాటం చేసిన వ్యక్తితో కలిసి పని చేయలేమని బహిరంగంగానే చెబుతున్నారు.ఎక్కడ చూసినా ఇదే చర్చ..జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం నుంచి హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. జీవన్‌రెడ్డి పయనమెటు? రాజీనామా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? సంజయ్ చేరికతో ఎలాంటి మార్పులు జరుగుతాయన్న అంశాలపై చర్చించుకుంటున్నారు. -
జీవన్‌రెడ్డి..తగ్గేదేలే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో రగిలిన రాజకీయ చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తనను సంప్రదించకుండా చిరకాల ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నరంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధపడిన విషయం విధితమే. మంగళవారం అధిష్టాన పెద్దలను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లినా ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఠాకూర్ మక్కాన్ సింగ్ జీవన్‌రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. ఫలితం కనిపించలేదు. కార్యకర్తలతో మాట్లాడాక బుధవారం నిర్ణయం తీసుకుంటారని, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భవి ష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన అనుచరులు ‘సాక్షి’కి తెలిపారు. జీవన్‌రెడ్డి ప్రకటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.వెనక్కి తగ్గొద్దని ఒత్తిడి..ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లారని తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అక్కడి ఆయన నివాసానికి తరలివెళ్లారు. నాయకుడు ప్రేమ్‌సాగర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులంతా జీవన్‌రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేరికపై సరైన వివరణ ఇచ్చేదాకా వెనక్కి తగ్గొద్దని ఎమ్మెల్సీపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో తన పదవికి రాజీనామా చేసే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా ఆయన ఉన్నారని విశ్వసనీయ సమాచారం.నాయకులు, కార్యకర్తల ఆవేదన..ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికే ఆ పార్టీ నాయకులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు సంజయ్‌కుమార్ బీఆర్ఎస్ను వీడటంపై ఆ పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నారు. పదేళ్లపాటు అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జీవన్‌రెడ్డి వెంటే ఉండి, పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పోరాటం చేసిన వ్యక్తితో కలిసి పని చేయలేమని బహిరంగంగానే చెబుతున్నారు.ఎక్కడ చూసినా ఇదే చర్చ..జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం నుంచి హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, కూడళ్ల వద్ద ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. జీవన్‌రెడ్డి పయనమెటు? రాజీనామా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? సంజయ్ చేరికతో ఎలాంటి మార్పులు జరుగుతాయన్న అంశాలపై చర్చించుకుంటున్నారు. -
శాంతించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
-
‘జగిత్యాల జగడం’.. జీవన్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ బంపరాఫర్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ‘జగిత్యాల జగడం’ హాట్ టాపిక్‌గా మారింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హస్తం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.కాగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు జీవన్ రెడ్డి సిద్ధమవడంతో ఆయనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఏకాంతంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ఫోన్‌తో మాట్లాడించారు. కాగా, వేణుగోపాల్‌తో జీవన్ రెడ్డి మాట్లాడిన తర్వాత రాజీనామాపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ సంద్భంగా కేసీ వేణుగోపాల్.. జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం.అనంతరం, జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరు. ఆయన అందుబాటులోకి రాగానే నా నిర్ణయం చెబుతాను. తొందరలోనే మండలి ఛైర్మన్ దగ్గరికి వస్తాను. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ నాతో మాట్లాడారు. సీనియర్ నాయకులు, సభ్యులు నా దగ్గరికి వచ్చారు. నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను. పార్టీతో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. జరిగిన పరిస్థితులు నాకు బాధ కలిగించాయి. మండలి ఛైర్మన్‌ను సమయం అడిగాను అంటేనే మీరు ఆలోచించండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలోని తన మద్దతుదారులంతా గాంధీభవన్‌కు రావాలని పిలుపునిచ్చారు. తనకు మద్దతుగా నిలవాలన్నారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా క్రియేట్ అయ్యింది. నిన్న(సోమవారం) కూడా జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
చాలా మనస్తాపానికి గురయ్యాను
-
కాంగ్రెస్ లో కలకలం
-
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా.. ట్విస్ట్ ఇచ్చిన జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జగిత్యాల కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం, తనకు సమాచారం లేకుండానే ఇదంతా జరగిందంటూ టి. జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఇవాళ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన ఈ పంచాయితీలో.. ఆయన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఆయన మాత్రం రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నారు.సోమవారమంతా జగిత్యాల కేంద్రంలో హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో.. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో జీవన్ రెడ్డి సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్ శ్రేణులంతా తనకు మద్దతుగా గాంధీభవన్‌కు రావాలంటూ ఆయన పిలుపు ఇవ్వడంతో.. అక్కడే ఆయనతో అధిష్టానం సంప్రదింపులు జరుపుతుందని అంతా భావించారు. ఈలోపు ఆయన మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఉదయం అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శికి తన రాజీనామా లేఖ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హుటాహుటిన నగరంలోని జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈలోపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఫోన్ చేసి రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జీవన్‌రెడ్డిని కోరారు. తాను హైదరాబాద్‌కు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ‘‘నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. నా ప్రమేయం లేకుండా జరగాల్సిందంతా జరిగింది. నేను పార్టీ మారను. ఏ పార్టీ నుండి నాకు కాల్స్ రాలేదు. బీజేపీ నుంచి ఎవరూ నన్ను సంప్రదించలేదు. నన్ను ఏ పార్టీ ప్రభావితం చేయలేదు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. నాతో కాంగ్రెస్ ఇంచార్జీ మున్షీ మాట్లాడారు. నిన్నటి నుండి మంత్రులు మాట్లాడుతున్నారు’’ అని జీవన్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.శ్రీధర్ బాబు దౌత్యం విఫలం?సంజయ్ చేరిక ఎపిసోడ్లో.. సోమావారమంతా జీవన్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంపై నిరసనగా కార్యకర్తల భేటీలోనే జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డిని బుజ్జగించే యత్నం చేశారు. అయితే జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపినా ఫలించలేదు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి, కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. దీంతో.. ఆయనను ఒక్కరోజు గడువుకోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన అర్ధరాత్రి హైదరాబాద్‌కు వచ్చారు.నన్ను సంప్రదించకుండా ఎలా? జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం. మూడు విడతలు తలపడిన జీవన్‌రెడ్డి, సంజయ్ జగిత్యాల నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్‌రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్‌లో సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు. -
సంజయ్ చేరిక.. జీవన్ కినుక
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. ఆదివారం రాత్రి అనూహ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫొటోలు బయటికి రావడంతో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి శ్రీనివాస్‌లు నచ్చజెప్పినా ఆయన దిగిరాలేదు. చివరికు మంత్రి శ్రీధర్‌బాబు చొరవ తీసుకుని చర్చలు జరిపినా జీవన్‌రెడ్డి శాంతించినట్టుగా కన్పించలేదు. ఏ వ్యక్తిపైనైతే పోరాడానో ఆ వ్యక్తినే పార్టీలో చేర్చుకోవడం ద్వారా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారి అభిప్రాయాలను గౌరవించే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. తన భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందంటూ సమస్య పరిష్కారం కాలేదనే సంకేతాలు ఇచ్చారు. నన్ను సంప్రదించకుండా ఎలా? జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయమే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని భావించారు. ఉదయాన్నే జగిత్యాలలోని తన నివాసానికి చేరుకున్న అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరిపారు. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ తన సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వ విప్‌లుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలలో జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామా వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కానీ జీవన్‌రెడ్డి ససేమిరా అన్నారు. పార్టీకి అండగా నిలిచిన పెద్దమనిషి: శ్రీధర్‌బాబు తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు రంగంలోకి దిగారు. జరిగిన వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తూ అన్నివిధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అనేక క్లిష్టమైన సందర్భాల్లో పార్టీకి, ప్రజలకు అండగా నిలిచిన పెద్దమనిషి జీవన్‌రెడ్డి అని కొనియాడారు. ఆయన మనస్తాపం చెందిన విషయం తెలుసుకుని తామంతా వచ్చి పార్టీకి పెద్దదిక్కుగా ఉండాలని కోరామని తెలిపారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని, మనోవేదనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ సోమవారం రాత్రి జగిత్యాలలో విలేకరులతో మాట్లాడిన జీవన్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యే సంజయ్‌ను ఏకపక్షంగా చేర్చుకోవడం సరికాదని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ బలోపేతానికి పనిచేశారని, సంఖ్యాబలం ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. వారి అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తనతో చర్చించడానికి మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఇతర నేతలు వచ్చారని అన్నారు. మూడు విడతలు తలపడిన జీవన్‌రెడ్డి, సంజయ్ జగిత్యాల నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్‌రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్‌లో సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో ఆర్డినేటర్ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు. -
జీవన్ రెడ్డి అవుట్!.. సంజయ్ ఇన్..!?
-
జగిత్యాల కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్సీకి జీవన్ రెడ్డి రాజీనామా?
సాక్షి, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ నడుస్తోంది. సీనియర్ నేతలకే పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరికపై స్థానిక నేత జీవన్ రెడ్డికి అధిష్టానం సమాచారం ఇవ్వలేదు. ఇక, సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం నెలకొంది. దీంతో, జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, సోమవారం ఉదయం నుంచే జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు.. జీవన్‌తో అధిష్టానం మాట్లాడుతున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. అంతకుముందు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతీ రాజకీయ పార్టీ వారి సిద్దాంతాలకు అనుగుణంగా పని చేయాలి.. పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సిన పనిలేదని నా భావన’ అని కామెంట్స్ చేశారు. అయితే, జీవన్ రెడ్డి ఇలా కామెంట్స్ చేసిన మరుసటి రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు విశేషం.సీఎం రేవంత్ సమక్షంలో ఆదివారం సంజయ్ కుమార్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో రెండు పవర్ సెంటర్స్‌పై విస్తృత చర్చ నడుస్తోంది. కాగా, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ప్రత్యర్థులుగా ఉన్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌లో ఆసక్తికర రాజకీయం.. జీవన్‌రెడ్డి వ్యాఖ్యలకు చెక్ పెట్టినట్టేనా?
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చాలా బలంగా ముందుకు తీసుకువెళ్తోంది. ప్రతిపక్ష పార్టీల్లో కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్‌లో భిన్న నెలకొంది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రతీ రాజకీయ పార్టీ వారి సిద్దాంతాలకు అనుగుణంగా పని చేయాలి.. పోరాటం చేయాలి. రాష్ట్రంలో ఇప్పటికే 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సిన పనిలేదని నా భావన అని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇతరుల చేరిక అవసరం లేదుపోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..@jeevanreddyMLC @PocharamBRS @PocharamBRS @PocharamBhasker @BRSparty @INCTelangana @KTRBRS pic.twitter.com/w7wYzgz0gz— Sai (@Vardhavelly) June 23, 2024 అయితే, జీవన్ రెడ్డి ఇలా కామెంట్స్ చేసిన మరుసటి రోజే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆదివారం సంజయ్ కుమార్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో రెండు పవర్ సెంటర్స్‌పై విస్తృత చర్చ నడుస్తోంది. కాగా, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ప్రత్యర్థులుగా ఉన్న విషయం తెలిసిందే. -
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారుల షాక్
-
ఇందూరు నిర్ణేతలు వీరే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయపరంగా అభివృద్ధిపథంలో దూసుకెళుతూ...రైతు ఉద్యమాల కేంద్రంగా ఉన్న ఇందూరులో గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తీర్పును ప్రభావితం చేసే అంశాలు ప్రధాన పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. బీజేపీ నుంచి నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు.త్రిముఖ పోటీగా భావిస్తున్నప్పటికీ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1952 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి బీఆర్ఎస్, ఒకసారి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరినీ కేంద్ర మంత్రి పదవి వరించలేదు.గల్ఫ్ సంక్షేమ బోర్డు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ వలస కార్మిక కుటుంబాల ఓట్లు 22% ఉన్నట్టు అంచనా. దీంతో ఆయా కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం రెండు జాతీయ పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్ఫ్ సంక్షేమ బోర్డు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాగా గల్ఫ్ కార్మిక సంఘాలు 60 ఉన్నాయి.ఈ సంఘాల జేఏసీకి జీవన్‌రెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో తనను తమ ప్రతినిధిగా పార్లమెంట్‌కు పంపాలని జీవన్‌రెడ్డి కోరుతున్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో పాటు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు గౌరవం దక్కుతోందంటే బీజేపీ, మోదీ మాత్రమే కారణమని అర్వింద్ పేర్కొంటున్నారు. ♦ ఉత్తర, దక్షిణ భారతానికి మధ్యలో హబ్ మాదిరిగా ఉన్న నిజామాబాద్ ప్రాంతంలో కంటెయినర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరుతున్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటయితే ఇక్కడి నుంచే నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఎగుమతులు చేయవచ్చని అంటున్నారు. ♦ జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్, బీడీ కార్మికుల అంశం సైతం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. 185 నామినేషన్లలో 178 పసుపు రైతులవే.. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఏకంగా 185 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పసుపు బోర్డు డిమాండ్‌తో రైతులు దాఖలు చేసిన నామినేషన్లే 178 ఉండడం గమనార్హం. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణకు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఈవీఎంలు తీసుకొచ్చి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.పసుపు బోర్డు పసుపు బోర్డు మంజూరు చేస్తున్నట్టు గత శాసనసభ ఎన్నికల ముందు ప్రధాని మోదీ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం గెజిట్ విడుదల చేసిందని, పసుపు ధర సైతం రూ. 20 వేలకు తీసుకొచ్చినట్టు అర్వింద్ చెబుతున్నారు. ఈ ప్రాంతానికి పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు వస్తాయని ఆయన అంటున్నారు.రీసెర్చ్ సెంటర్‌తో రైతులకు కొత్త వంగడాలు, మరిన్ని సబ్సిడీలు అందుతాయని పేర్కొంటున్నారు. అయితే పసుపు బోర్డు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు. మొత్తానికి పసుపు బోర్డు గెజిట్ విడుదలైనా, ఈ ఎన్నికల్లోనూ ఈ అంశంపై రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కులాల వారీగా చూస్తే... నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్నూరుకాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ్, గౌడ్ల ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కులసంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఓట్లు 16,89,957 ఉండగా, పురుషుల ఓట్లు 7,99,458, మహిళల ఓట్లు 8,90,411 ఉన్నాయి. నిజాం షుగర్స్ కీలక అంశం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అర్వింద్ తెరిపించలేకపోయారని జీవన్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారు. తాము మాత్రం 2025లో నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని జీవన్‌రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అయితే ఎంపీ అర్వింద్ సైతం ఈసారి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెబుతున్నారు. చెరకుతో పాటు వరి, మొక్కజొన్నల నుంచి ఇథనాల్ ఉత్పత్తి సైతం చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు.. బీజేపీ – ధర్మపురి అర్వింద్ 4,80,584 (45 శాతం) టీఆర్ఎస్ – కల్వకుంట్ల కవిత 4,09,709 (39 శాతం) కాంగ్రెస్ – మధుయాష్కీ69,240 (7 శాతం) -
అన్ని వ్యవస్థలు రేవంత్ గుప్పిట్లోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, కోవాలక్ష్మి, నేతలు జీవన్‌రెడ్డి, పి.శశిధర్‌రెడ్డి గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ► ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడంలో స్పీకర్ చేస్తున్న జాప్యంపై తాము హైకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వస్తుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు వెళితే అసెంబ్లీ కార్యదర్శి బాత్రూంలో దాక్కున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని, ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఉపఎన్నికలు వస్తాయని వెల్లడించారు. ► బీఆర్ఎస్ తరపున ఎన్నికై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము కోరుతున్నా స్పీకర్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తాము అపాయింట్మెంట్ కోరినా ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తమకు సమయం ఇవ్వక పోవడంతో రిజిస్టర్ పోస్టులో పిటిషన్లు పంపినట్టు వెల్లడించారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా అక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేశారు. దీనిని తెలంగాణ స్పీకర్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ ఎవరిని కొట్టాలో చెప్పాలి. అభద్రతాభావంతో ఉన్న రేవంత్ కొడంగల్ ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు’ అని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ► 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మంత్రి ఉత్తమ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. ప్రజాపాలన చేతకాని కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్.. మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రం తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఇంకా పెండింగ్‌లో నాలుగు స్థానాలు సీఈసీలో 8 స్థానాలపై చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కేవలం ఆరు స్థానాలపై మాత్రమే చర్చ జరిగింది. పారీ్టలో అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్ అభ్యర్థి ఎవరనేది ప్రస్తావనకు రాలేదు. ఇక ఆరు స్థానాల్లోనూ నాలుగు సీట్లను మాత్రమే ఖరారు చేశారు. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నల పేర్లను పరిశీలించినా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ రెండు స్థానాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఎవరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31న మరోసారి జరగనున్న సీఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తలనొప్పిగా మారిన ఖమ్మం తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ సీట్‌గా మారింది. ఎక్కువమంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరిని బరిలో దించాలన్న అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమకు సంబంధించిన అభ్యర్థులకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. భట్టి తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం, తుమ్మల తన కుమారుడు యుగంధర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. వీరితో పాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌లు సైతం తమకు ఖమ్మం సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం అభ్యర్థి ప్రకటన వాయిదా పడుతోందని చెబుతున్నారు. -
ఈ రెండుస్థానాల్లో పోటీ ఎవరు..?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉత్తర తెలంగాణలో కీలకమైన పార్లమెంటు స్థానం కరీంనగర్. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. హస్తం పార్టీ మాత్రం ఇంకా ఏ అభ్యర్థినీ ఖరారు చేయలేదు. పొరుగునే ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఈ స్థానానికి సైతం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ఈ రెండుస్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలు ఇటు కేడర్‌లో అటు ఆశావహుల్లో గందరగోళం చెలరేగేలా చేస్తున్నాయి. హైకమాండ్ ఆలోచన ఏంటన్నది అర్థం కాక క్షేత్రస్థాయి హస్తం పార్టీ నేతలు సతమతమవుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో అనూహ్యంగా పారాచూట్ లీడర్ అయిన గడ్డం వంశీకృష్ణను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్, ఎప్పుడో అనుకున్న జీవన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి పేర్లపై ఇంకా జాప్యం చేస్తుండటం పార్టీలో ఉత్కంఠకు, కేడర్‌లో గందరగోళానికి కారణమవుతోంది. పెద్దపల్లి తరహాలో నిజామాబాద్, కరీంనగర్లో పారాచూట్ లీడర్లకు ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం ఆయా అభ్యర్థుల అనుచరుల్లో అయోమయానికి దారి తీస్తోంది. నేటికీ నెరవేరని ఢిల్లీ పెద్దల హామీ.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసిన అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ హామీ ఢిల్లీ పెద్దల నుంచి రావడంతో అంతా తదుపరి కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డి అనే అనుకున్నారు. అదే హామీపై అంగబలం, అర్ధబలం దండిగా ఉన్న ప్రవీణ్‌రెడ్డి సెగ్మెంట్లోని హుస్నాబాద్, మానకొండూరు, కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలో తన ప్రచార పోస్టర్లను కూడా అంటించారు. అయితే, ఇప్పటి వరకూ రెండుసార్లు ఎంపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పెద్దలు ప్రకటించినా అందులో ప్రవీణ్‌రెడ్డికి చోటు దక్కకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం తనకు ఇవ్వాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పెద్దలను రాజేందర్రావు కలిసిన సందర్భంలోనూ ప్రవీణ్‌రెడ్డికే అన్న సంకేతాలు ఇచ్చినా.. ఆయన మాత్రం తన అభ్యర్థిత్వంపై వెనకడుగు వేయడం లేదు. ఇంకోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. తన విజయావకాశాలపై కరీంనగర్ ఎంపీ సెగ్మెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో మల్లన్న అనుచరులు ఏకంగా బహిరంగ సర్వే చేపట్టారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని ప్రకటిస్తారని అనుకున్నా.. తొలి రెండులిస్టుల్లో ఆయనకూ చాన్స్ రాలేదు. దీంతో ఈ రెండుస్థానాల్లో అధిష్టానం అభ్యర్థుల ప్రకటనను జాప్యం చేస్తుండటం, కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో గందరగోళం, అయోమయాలకు కారణమవుతోంది. అసలు అధిష్టానం మనసులో ఏముందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ సీనియర్ నేత ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. పాఠాలు నేర్వలేదా? రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కేసులో ఈడీ దూకుడు ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఈడీ దర్యాప్తు దూకుడు తదితర అంశాలను బీజేపీ ఆయుధాలుగా మార్చుకుని నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డకు మరమ్మతులు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇచ్చిన హామీలను ఇంతవరకూ నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ హస్తం పార్టీపై దుమ్మెత్తి పోస్తోంది. అయితే, ఈ సందర్భంలో నిజామాబాద్, కరీంనగర్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించే వారు కరవయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా అభ్యర్థుల ప్రకటనలో కాలం గడిపేస్తున్న కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం చేసి చేతులు కాల్చుకున్న సంగతిని మర్చిపోయిందా? గతం నుంచి పాఠాలు నేర్వకపోతే ఎలా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గాలి వీచినా.. అభ్యర్థి ప్రకటనను జాప్యం చేసి కరీంనగర్లో దాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో హస్తం పార్టీ విఫలమైందన్న విమర్శలు మూటగట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలోనూ అదే మల్లగుల్లాలు పడుతోంది. పోనీ, ప్రకటించిన వారిలోనూ పారాచూట్ నేతలకే పెద్ద పీట వేయడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతుంది. దీంతో తమ నాయకులను పక్కనబెట్టి.. ఎక్కడ పారాచూట్ లీడర్లకు టికెట్ కేటాయిస్తారో? అని జీవన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఇవి చదవండి: Liquor Case: కవితకు జైలా? బెయిలా? -
సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీల్లో రెండు అమలు అవుతున్నాయి మరో రెండు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఉచిత బస్ ప్రయాణం వల్లే మేడారం జాతరకు మహిళా భక్తులు పోటెత్తారని అన్నారు. ఈయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం. ఉద్యోగులు గత ప్రభుత్వం తెచ్చిన 317 జీవోతో స్థానికతకు దూరంగా వెళ్లారు. జీవో 46, జీవో 317లను సమీక్షించేందుకు సబ్ కమిటీ వేయడం హర్షణీయం. ఉమ్మడి జిల్లా మొత్తం ఒక జోన్ ఉండేలా ఉంటే మంచిది. ఉమ్మడి కరీంనగర్ 4 జోన్లుగా విభజించారు.దీంతో జూనియర్లు చేరిన చోట ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండవు. సీనియర్లు అందరూ దగ్గరగా ఉండే చోటుకు వెళ్తే ఆ జోన్లో పదవీ విరమణ జరిగి ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే సవరణలు ఉంటాయి. ఏప్రిల్ చివరివారం లోపు కమిటీ నివేదిక ఇస్తే సంతోషం’ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. చదవండి: అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి -
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, పెద్దపల్లి/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బొర్లకుంట వెంకటేశ్ నేత ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. కొంతకాలంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వైఖరితో అసంతృప్తితో ఉన్న ఆయన... ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటి కి చేరారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత అడుగుపెట్టి నేతలతో సమీక్షించిన రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీటీడీ మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత రెహ్మాన్, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం కేసీ వేణుగోపాల్, రేవంత్‌రెడ్డితో కలిసి వెంకటేష్ నేత, మన్నె జీవన్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మ హబూబ్‌నగర్), జనంపల్లి అనిరుద్‌రెడ్డి (జడ్చర్ల), గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (దేవరకద్ర), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరిగి సొంత గూటికి... మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన వెంకటేశ్ నేత 2018 అసెంబ్లీ ఎన్నికలకు మందు రాజకీయల్లోకి వచ్చారు. కాంగ్రెస్ తరఫున 2018లో చెన్నూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2019లో పెద్దపల్లి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ తిరిగి సొంతగూటికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఇస్తే ధర్నా చేస్తా: శేజల్ ఎంపీ వెంకటేశ్ నేత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాపాడాడని ఆరిజిన్ డెయిరీ సీఏవో బొడపాటి శేజల్ ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని ఎంపీకి చెబితే న్యాయం చేస్తామని మాటిచ్చి మోసం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ ఇలాంటి వారిని చేర్చుకొని ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఢిల్లీలో ధర్నా చేస్తానని, ఎన్నికల్లో వెంకటేశ్ నేతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరించారు. -
తల్లిగా కవితకు ఆ బాధ తెలియదా..? జీవన్ రెడ్డి ఫైర్
జగిత్యాల జిల్లా: నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణం కేసులో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. యువకుడి బలవన్మరణానికి కారణం అయిన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని అన్నారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టే అందరూ చేస్తారనుకోవడం విచారకరమని అన్నారు. 'సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4గా ఉన్న సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయాలని రిపోర్ట్ లో ఉంది. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టే నేర నిర్ధారణ జరిగినా కూడా నిందితుడైన సర్పంచును పరారీలో చూపెట్టారు. రెండున్నర మాసాలు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు ఎన్నిక ప్రక్రియలో బిజీగా ఉన్నాడు. సర్పంచ్ ఊరిలో ఉన్నా పోలీసులకు తెలియకపోవడం విచారకరం. ఎన్నికల్లో వెసులుబాటు కల్పించడానికి ఈ కుట్రకు తెరలేపారు. వాస్తవంగా పోలీసులపైనే చర్యలు తీసుకోవాలి. ఎవరు ఎవరికీ ఫ్రెండ్లి పోలీసో కవిత సమాధానం చెప్పాలి.' అని జీవన్ రెడ్డి అన్నారు. చట్టం, పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోయి శివనాగేశ్వర్ ప్రాణం అర్పించుకున్నాడని జీవన్ రెడ్డి తెలిపారు. కొడుకును కోల్పోయిన తల్లి హృదయం ఏ విధంగా ద్రవించిందో ఒక తల్లిగా కవితకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఆ బాధిత మృతుని తల్లిని కవిత పరామర్శిస్తే సంతోషించే వాడినని అన్నారు. ఎంతవరకు రాజకీయ కోణం తప్ప మానవత్వం లేదా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు ఫ్రెండ్లీ కాబట్టి సర్పంచును అబ్ స్క్యాండింగ్ గా చూపించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎస్పీ స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: వారానికి రెండు ఢిల్లీ టూర్లు -
Karimnagar Lok Sabha: కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ రికార్డులు మరే పార్టీ బ్రేక్ చేయలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామంటారు. ఆఖరు వరకు నాన్చుతారు. సీటు కోసం పోటీ పడుతున్న నేతలకు టెన్షన్ పెంచుతారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ తీరు ఇలాగే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలపుడు కూడా గాంధీభవన్ దగ్గర ఇదే సీన్ కనిపించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పాత సీన్లే కనిపిస్తాయంటున్నారు. ఉత్తర తెలంగాణలో ఓ కీలకమైన పార్లమెంట్ సీటు వ్యవహారం ఎలా ఉందో చూద్దాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాలిటిక్స్ బాగా హీటెక్కుతున్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పోటీ చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బరిలో ఉంటారు. వీరిద్దరి పేర్లను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించకపోయినా..ఒకరు సిటింగ్ ఎంపీ, మరొకరు మాజీ ఎంపీ కావడంతో పార్టీ నాయకత్వం ఇచ్చిన సానుకూల సంకేతాలతో ఇద్దరూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో హస్తం టిక్కెట్ కోసం క్యూ లైన్ బాగా పెరిగింది. గతంలో పోటీ చేసినవారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ, మంత్రి సోదరుడు ఇలా అనేక మంది కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, వెలిచాల రాజేందర్ రావు వంటివారితో పాటు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు పేరు కూడా బాగా ప్రచారంలోకొస్తోంది. బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎక్కడా తాను కాంగ్రెస్‌లో చేరి కరీంనగర్ ఎంపీగా పోటీచేస్తున్నట్లు ప్రకటించకపోయినా ఆయన పేరును కూడా ప్రచారం చేస్తున్నారు. ఈటల అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన పేరు కూడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కరీంగనర్ నుంచి వినిపిస్తోంది. ఇంతమంది పేర్లు ప్రచారంలోకి రావడంతో అసలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు కాబోతున్నారన్నది ఇప్పుడు కరీంనగర్లో ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికలపుడు నామినేషన్లు ముగిసేవరకు కూడా కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. అప్పుడు కూడా అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆఖరులో అభ్యర్థిని ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల సామాజిక వర్గానికి చెందిన నేతనే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిగా ప్రకటించినా.. బాగా ఆలస్యం కావడంతో అసలు పోటీ ఇవ్వలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొనసాగిన కన్ఫ్యూజన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరుగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం కొనసాగుతోంది. -
కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!
ఎన్నికల టైమ్‌లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్‌లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు? గులాబీ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్‌కుమార్‌కు సమీప బంధువు ఒకరికి జెన్కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్‌ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్ హీట్ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్ -
కాంగ్రెస్‌లోకి మన్నె జీవన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఢిల్లీలో కలవడం ఇందుకు బలం చేకూర్చింది. మన్నె జీవన్‌రెడ్డి ప్రస్తుత మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి స్వయానా సోదరుడి కుమారుడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జడ్చర్ల బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని చివరి దాక చెబుతూ వచ్చిన ఆయన టికెట్ రాకపోవడంతో మిన్నంకుండిపోయారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మళ్లీ మన్నె జీవన్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర వస్తున్న సమయంలో కాంగ్రెస్‌లో చేరి పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే సొంత బాబాయ్ ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో అబ్బాయ్ మన్నె జీవన్‌రెడ్డి తలపడే పరిస్థితి ఉంటుంది. ఇదే జరిగితే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు రసవత్తరం కానుంది. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని మారిస్తే కాంగ్రెస్ నుంచి కూడా కొత్త అభ్యర్థి పేరు తెరపైకి రావొచ్చు. అభ్యర్థుల ఖరారు తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణలు మరింత మారే అవకాశాలు ఉన్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడిగా సేవలు జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన మన్నె జీవన్‌రెడ్డికి ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమ అధినేతగా, టీటీడీ బోర్డు సభ్యులుగా మంచి గుర్తింపు ఉంది. రాజకీయాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాల్లో ఆయన ముందున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పట్ల మన్నె జీవన్‌రెడ్డి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేరికకు సర్వం సిద్ధం కాంగ్రెస్‌లో చేరేందుకు మన్నె జీవన్‌రెడ్డి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ నెలాఖరులో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ముహూర్థం కూడా ఖరారు అయ్యింది. అయితే ఇందుకు వేదిక హైదరాబాదా.. ఢిల్లీనా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే ముఖ్య నేతలను కలిసి ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్కు దెబ్బ మన్నె జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో బీఆర్ఎస్కు కొంత మేరకు నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జడ్చర్ల నియోజకవర్గంలో ఆ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొదటి నుంచి మన్నె జీవన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకం ఉన్న అనుచర గణం సైతం కాంగ్రెస్ వైపు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ సీటుపైనే.. కాంగ్రెస్‌లో చేరుతున్న మన్నె జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసమే మొగ్గు చూపుతున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటికే వంశీచంద్‌రెడ్డి పేరు ఖరారు దిశలో ఉన్న నేపథ్యంలో తాను ఎమ్మెల్సీ పదవిని కోరాలని నిర్ణయించకున్నట్లు మన్నె జీవన్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. -
ఓటమిని అంగీకరించే స్థితిలో కేటీఆర్ లేడు: జీవన్ రెడ్డి సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడు అంటూ కామెంట్స్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కాగా, జీవన్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదు. మిషన్ భగీరథ పెద్ద స్కాం. కాళేశ్వరం రీ-డిజైన్ పెద్ద బోగస్. కేవలం కమీషన్ల కోసమే రీ-డిజైన్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్‌ను ఎస్సీ డెవల్మెంట్ ఫండ్‌గా మార్చి.. నిధులను మళ్లించింది. నిధుల దారి మళ్లింపును చర్చకు రాకుండా చేసేందుకు దళితబంధును తెరపైకి తెచ్చారు. గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. అందుకే వాళ్లంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేశారు. బీఆర్ఎస్ పరోక్ష మిత్ర పక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లెంలా కాచుకుని ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు’ అంటూ కామెంట్స్ చేశారు. -
అడ్లూరి, జీవన్‌రెడ్డి తులాభారం!
జగిత్యాల: మండలంలోని మల్లన్నపేట మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్నకు పూజలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎత్తు బంగారం ఇచ్చారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు, సర్పంచ్‌లు సిద్దంకి నర్సయ్య, నిశాంత్ రెడ్డి, చిర్ర గంగాధర్, రాజ్యలక్ష్మి తిరుపతి రెడ్డి, వెంకటపద్మ, మాజీ సర్పంచ్ బీమ సంతోష్, నేరెల్ల మహేశ్, బుచ్చిరెడ్డి, గంగాధర్, ఉమేశ్ పాల్గొన్నారు. -
కాళేశ్వరం, మిషన్ భగీరథపై న్యాయవిచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులను చేపట్టారని, అనవసరమైన ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, కానీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రస్తుత రోజుల్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా మారడం విడ్డూరమే అని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో పాటు అన్నారం బ్యారేజీలో సైతం లీకేజీలు ఏర్పడటం విచారకరమన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు సంబంధించి ఎల్అండ్టీ తొలుత చేపడుతుందని చెప్పినప్పటికీ... ఇప్పుడు చేయనని అంటోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై న్యాయ విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని, అప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ ఉన్నప్పటికీ వృథా ఖర్చులతో మళ్లీ మిషన్ భగీరథ పనులు చేపట్టి ప్రజాధనాన్ని నీటిపాలు చేశారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిరుద్యోగులు హర్షించేవారని, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మానసికంగా ఆందోళన చెందారన్నారు. జీవో 317 ద్వారా ఉద్యోగులు నష్టపోయారని, వారికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను కలిసే సీఎం రేవంత్: నర్సిరెడ్డి పదేళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యుడిని సీఎం కలిసే పరిస్థితే ఉండేది కాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన బలపర్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దాదాపు 30 సార్లు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయతి్నంచినా అవకాశం దక్కలేదని, ఒకసారి అవమానానికి సైతం గురయ్యానన్నారు. కానీ రేవంత్‌రెడ్డి సీఎం అయిన మరుసటిరోజే ప్రజాభవన్‌లో కలిశానని చెప్పారు. ప్రజలను కలిసి వారి సమస్యలు వినే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని, ఈ ఐదేళ్ల కాలంలో ఇదే తరహాలో పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవు: ఉత్తమ్ బీఆర్ఎస్ పాలనలో పౌరసరఫరాల విభాగాన్ని అల్లకల్లోలం చేశారని, ఆ శాఖ వద్ద 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ధాన్యం ఉందా? లేదా? ఉంటే ఎక్కడుంది? అనే అంశాలకు కాగితాల్లో ఎక్కడా వివరాలు లేకపోవడం గమనార్హమని, దీనిపై సమగ్ర పరిశీలన ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. పదేళ్లలో ఈ శాఖ రూ.56 వేల కోట్ల నష్టాల్లో ఉందని చెప్పారు. రేషన్ బియ్యం చాలాచోట్ల లబ్ధిదారులకు చేరడం లేదని, దీనిపై మరింత లోతైన చర్యలు చేపడతామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ సభ్యులు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచి్చన ప్రతి హామీని నెరవేర్చాలని, మానవహక్కుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రకటన హర్షనీయమని, భావప్రకటన స్వేచ్ఛపై సీఎం చేస్తున్న ప్రకటనలు అమలు జరిగేలా చూడాలని అన్నారు. -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణంతో పాటు వడ్డీ రూ.25 కోట్లు మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజిత రెడ్డి పేరు జీవన్ రెడ్డి ఈలోన్ తీసుకోగా ఇప్పటి వరకు డబ్బు చెల్లించలేదు. దీంతో, అసలు ప్లస్ వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. కాగా, నోటీసుల అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బకాయిల వసూలుకు నోటీసులు.. ఇదిలా ఉండగా, అంతకుముందు.. జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట ఐదు అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్‌ను సీజ్ చేస్తామంటూ మైక్‌లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్‌కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్‌కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్
-
జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు
ఆర్మూర్: అధికారం చేజారగానే బీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఏకకా లంలో బకాయిల వసూ లుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. పూర్వా పరాలిలా.. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని జీవన్‌రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్‌కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట 5 అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్‌సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్‌రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్‌ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్‌కు సంబంధించి ట్రాన్స్‌కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో గురువారం హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్‌ను సీజ్ చేస్తామంటూ మైక్‌లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్‌కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్‌కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్
-
జీవన్‌రెడ్డి ఓడినా.. పదవి యోగం!
జగిత్యాలజోన్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి పదవీకాలం 2025 మే వరకు ఉండటంతో.. ఆయనకు పదవి యోగం వచ్చే అవకాశముందని జిల్లాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. శాసన మండలిలో కాంగ్రెస్ తరఫున ఏకైక ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ఉండటంతో.. జీవన్‌రెడ్డిని శాసన మండలి నాయకుడిగా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు కొత్తగా ఎన్నికై న 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మంది కొత్తవారు కావడంతో.. ప్రభుత్వంపై పట్టు ఉండే అవకాశం లేదు. దీంతో సీనియర్ నాయకుడితో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు, సాగునీటి వ్యవస్థపై మంచి పట్టున్న జీవన్‌రెడ్డికి వ్యవసాయ మంత్రి పదవిస్తే.. అసెంబ్లీలో బలంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ప్రతిపక్షాల నుంచి వచ్చే మాటల దాడులను తిప్పికొట్టేందుకు సరైన నాయకుడు జీవన్‌రెడ్డి అని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2024 ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలుండటం.. గతంలో కేసీఆర్‌పై రెండుసార్లు ఎంపీగా పోటీ చేయడంతో.. జీవన్‌రెడ్డిని పార్లమెంట్‌కు పంపేందుకు సైతం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బేస్ ఏర్పాటు చేసుకునేందుకు జీవన్‌రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకొని.. ఆ రెండు పార్లమెంట్ స్థానాల్లో పట్టు బిగించేందుకు కూడా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. జీవన్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని.. నా సేవలు పార్టీకి అవసరమనుకొని ఏ బాధ్యత అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఏనాడూ పదవుల కోసం తాపత్రయపడలేదని, పదవి వచ్చినా ఒక్కటే, రాకున్నా ఒక్కటేనని, ఎప్పుడూ ప్రజల మధ్యే ప్రజాసేవ కోసం కృషి చేస్తానని ప్రకటించడం విశేషం. -
Telangana: ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకే జై
సాక్షి, కరీంనగర్: ఎంపీలుగా గెలిచినా, రాజ్యసభకు వెళ్లినా..ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా ప్రస్తుత రాజకీయాల్లో అందరికీ శాసనసభలో అడుగుపెట్టి అధ్యక్షా అనాలనే ఉత్సుకత..ఆసక్తే ఎక్కువగా కనిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే గారూ అంటేనే వచ్చే కిక్కు వేరే లెవెల్ అన్నదే ఇప్పుడు రాజకీయనేతల మనసుల్లో నాటుకు పోయింది. ఆ క్రమంలో జిల్లాలో ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరెవరు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో దిగారని ఒక్కసారి చూస్తే.. ఇద్దరు ఎమ్మెల్సీలు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో ఎమ్మెల్సీ పాడికౌశిక్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఈయన 2021లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తన స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ఆ స్థానానిక ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక ఈటల రాజేందర్ హుజురాబాద్‌తోపాటు గజ్వేల్‌లోనూ పోటీ చేస్తున్నారు. ఒకవేళ రెండుచోట్ల రాజేందర్ విజయం సాధిస్తే.. ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక తథ్యం.) మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కూడా జగిత్యాల అసెంబ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన జీవన్‌రెడ్డి 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒకవేళ అసెంబ్లీపోరులో ఈయన గెలిస్తే.. 2025 వరకు అంటే దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. దీంతో ఈయన స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. నెల రోజులు ఇదే పరిస్థితి.. కిలో ఎంతంటే! ఇద్దరు ఎంపీలు సైతం! ఇద్దరు ఎంపీలు అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ అసెంబ్లీ బరిలో ఉన్నారు. వీరిద్దరూ విజయం సాధించినా.. ఆరునెలలు మాత్రమే వీరి పదవీకాలం మిగిలి ఉండటంతో ఉపఎన్నిక రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ గెలవకపోయినా.. వీరి పదవులకు వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. -
telangana: శాసనసభకు అయిదు కంటే ఎక్కువసార్లు ఎన్నికైంది వీరే..
తెలంగాణ నుంచి శాసనసభకు ఐదు లేదా అంతకన్నా ఎక్కువగా ఎన్నికైనవారి సంఖ్య నలబై అయిదు వరకు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ఏడుసార్లు శాసనసభకు ఎన్నికైన వారు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి , ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ ఈ ఘనత పొందారు. జానారెడ్డి 1983,1985 లలో టీడీపీ పక్షాన, 1989,1999,2004,2009,2014లలో కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఈటెల రాజేందర్ 2004 ,2008 ఉప ఎన్నిక, 2009, 2010 ఉప ఎన్నిక, 2014,2 018లలో టిఆర్ఎస్ పక్షాన, 2021 ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన గెలుపొందారు. ఆరుసార్లు గెలిచినవారిలో జి.గడ్డెన్న, టీ.జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సీ రాజేశ్వరరావు, తన్నీరు హరీష్ రావు, డాక్టర్ ఎమ్.చెన్నారెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు. ఇక ఐదుసార్లు గెలిచిన నేతలలో జి.రాజారాం, గంపా గోవర్దన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి.విఠల్ రెడ్డి, కె.హరీశ్వర్ రెడ్డి, పి.జనార్ధనరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసి, సలావుద్దీన్ ఒవైసి, అమానుల్లాఖాన్, జి.సాయన్న, డాక్టర్ పి.శంకరరావు, గురునాధరెడ్డి, జె.కృష్ణారావు, ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి, పి.గోవర్దనరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు -
అది కూడా తెలియదా?.. రాహుల్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు..
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ తన స్క్రిప్ట్ రైటర్ మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ఎమ్మెల్సీ కవిత శనివారం మెట్పల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పెద్దరికాన్ని మరిచి బతుకమ్మపై కామెంట్స్ చేశారు. తన పేరుతో(కవిత) ఎలిజిబెత్ రాణి అని మాట్లాడి ఆయన పెద్దరికాన్ని కోల్పోయారు. రాహుల్ గాంధీకి తెలివికి లేదు. తెలంగాణలో బీసీ గణన చేయాలనుకుంటున్నాడు అంటా. ఇలా అవగాహన లేకుండా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పెట్టారని చెబుతున్నారు. కానీ, 1937లోనే నిజాం రాజు ఫ్యాక్టరీని నెలకొల్పాడు. ఇలా అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గల్ఫ్ కార్మికులు తెలంగాణకు వచ్చేయాలి. ఇక్కడ ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది. ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడని నాయకులు ఇప్పుడు తెలంగాణకు అనుబంధం ఉంది అని చెప్పడం హాస్యాస్పదం. చక్కర కర్మాగారం ప్రైవేటీకరణ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు?. ఆ తర్వాత చక్కర కర్మాగారాన్ని పట్టించుకోకపోవడంతో మూతపడే పరిస్థితి వచ్చింది. 2015లో బీఆర్ఎస్ పార్టీ కర్మాగారం తెరిపిస్తానంటే.. బీజేపి ఎంపీ లీగల్ సమస్య తీసుకువచ్చాడు. అందుకే కర్మాగారం తెరిపించలేదు. చక్కర కర్మాగారం తెరిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసింది. కానీ లీగల్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ నుంచి బరిలో ఎంపీలు.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు -
రోడ్డెక్కిన పాడి రైతులు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాడి రైతులు మంగళవారం రోడ్డెక్కా రు. పాడి రైతులకు లీటరు పాలకు అదనంగా రూ.4 చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ రాస్తారోకో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌కు చేరుకుని సిరిసిల్ల–వేములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. 2019 జనవరి నుంచి 56 నెలలుగా పాడి రైతులకు లీటరుకు రూ.4 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో 4 కి.మీ. మేర రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సిరిసిల్ల టౌన్ సీఐ ఉపేందర్, ఎస్సై మల్లేశ్‌గౌడ్, ట్రాఫిక్ ఎస్సై రాజు ఎంత సముదాయించినా వినకుండా రాస్తారోకో చేశారు. పాడి రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్, రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. కాగా, రాస్తారోకోతో కరీంనగర్‌కు పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రికి వెళ్లే రోగులు ఇబ్బందులు పడ్డారు. పరీక్షలకు సమయం దాటిపోతోందని విద్యార్థులు వాపోయారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి స్కూల్ బస్‌లో పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు తరలించారు. 4 ఏళ్లుగా పాడి రైతులకు మోసం: జీవన్ రెడ్డి నాలుగేళ్లుగా తెలంగాణ పాడి రైతులను సీఎం కేసీఆర్ మోసగిస్తున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో ఫోన్ లో మాట్లాడారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని పాడిరైతులు సిరిసిల్లలో ఆందోళనకు దిగి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విడివిడిగా.. కూలంకషంగా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సమావేశమయ్యారు. గాందీభవన్‌లో సోమవారం ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఈ భేటీలు కొనసాగాయి. ప్రతి నాయకుడితో వేర్వేరుగా 10 నిమిషాలకు పైగా మాట్లా డిన మురళీధరన్, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అభిప్రాయ సేకరణ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను, మీ నాన్న ఫ్రెండ్స్: పొన్నాల మురళీధరన్‌ను కలిసిన సందర్భంగా ఆయన తండ్రి, కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పొన్నాల గుర్తు చేసుకున్నారు. తాను మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేరళతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకువచ్చామని, ఆ తర్వాతే రెండు రాష్ట్రాల్లో రొయ్యల పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. పార్టీలో పరిస్థితులు, టికెట్ల ఖరారులో పాటించాల్సిన సామాజిక సమతుల్యత గురించి వారు చర్చించినట్టు సమాచారం. బీసీలకు టికెట్ల కేటాయింపులో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై వీహెచ్ చర్చించినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సిద్దిఖీ కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ భేటీల్లో పాల్గొనగా, మరో సభ్యుడు, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కోర్టు కేసుల కారణంగా రాలేకపోయారని, మంగళవారం వస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. జగ్గారెడ్డి లేఖ: పీసీసీ మాజీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలి్పంచాలని, పార్టీ అనుబంధ సంఘాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వాలని మురళీధరన్‌ను జగ్గారెడ్డి కోరారు. టికెట్ల కేటాయింపు విషయంలోనూ పీసీసీ మాజీ అధ్యక్షుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ లేఖ ఇచ్చారు. నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం టీïపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ సభ్యులందరూ విధిగా హాజరు కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నమ్మకం నిలబెట్టుకుంటాం: రేవంత్ ట్వీట్ సీడబ్ల్యూసీ తొలి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అంగీకరించిన పార్టీ అధిష్టానానికి రేవంత్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, సమావేశాలను విజయవంతం చేస్తామంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీసీలు ఎందుకు గెలవడం లేదు? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పాటించాల్సిన సామాజిక సమతుల్యతపై ఈ భేటీల్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. 1989 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 50 శాతం సీట్లు ఎప్పుడూ రాలేదని, ఇందుకు కాంగ్రెస్ పార్టీని వెనుకబడిన వర్గాలు అక్కున చేర్చుకోకపోవడమే కారణమని కొందరు వివరించారు. తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత బీఆర్ఎస్ వైపు బీసీలు మొగ్గుచూపుతున్నారని, అత్యధిక సంఖ్యలో ఉండే బీసీల హృదయాల్లో చోటు సాధించని కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవుతోందని చెప్పారు. దీంతో ‘బీసీలకు సీట్లు ఇస్తే ఎందుకు గెలవడం లేదు?’అని మురళీధరన్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కాగా ఓ ముఖ్య నాయకుడు బదులిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోనే అలా జరుగుతోందని, మిగిలిన పార్టీల నుంచి బీసీ నేతలు గెలుస్తున్నారని, ఇందుకు కారణం ఏంటనేది సమీక్షించుకోవాల్సింది పార్టీయేనని చెప్పినట్టు సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గంలోని గ్రూపు గొడవలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమవుతున్నాయని ఓ నేత వివరించినట్టు సమాచారం. కర్ణాటకలోని లింగాయత్‌లు, గౌడ సామాజిక వర్గ నేతలు ఐక్యంగా ఉండి అక్కడ అధికారాన్ని దక్కించుకోవడాన్ని గుర్తు చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలను విన్న మురళీధరన్ ‘ఏం జరుగుతుందో వేచి చూద్దాం.’అంటూ బదులివ్వడం గమనార్హం. -
మంత్రి ఈశ్వర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్కు దమ్ముంటే డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు. గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను ఈశ్వర్ ప్రశ్నించాలని జీవన్‌రెడ్డి సూచించారు. -
దేశం రాహుల్ వెంటే..
సాక్షి, హైదరాబాద్: విచ్ఛిన్నకర శక్తులకు ఎదురొడ్డి దేశ ఐక్యత కోసం పాటుపడుతున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వెంటే దేశం నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టి.జీవన్‌రెడ్డి చెప్పారు. భారత్‌జోడో యాత్ర పేరు తో దేశవ్యాప్తంగా తిరిగి ప్రజలను చైతన్యపరుస్తున్న రాహుల్ అంటే బీజేపీ బెంబేలెత్తుతోందని, అందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిప డ్డారు. రాహుల్‌పై బీజేపీ అణచివేతకు నిరసనగా బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహ మౌన దీక్ష’ జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగి న దీక్ష అనంతరం నిర్వహించిన సభలో శ్రీధర్‌బా బు, జీవన్‌రెడ్డి మాట్లాడారు. రాహుల్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే దేశప్రజలు ఊరుకోరని, ఆ యనకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కాంగ్రెస్ కార్యక ర్తలు పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు. దేశంలోని ఆర్థిక నేరగాళ్లను దృష్టిలో పెట్టుకుని నాలుగేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టులకెక్కి, శిక్షలు వేయించి, ఉద్దేశపూర్వకంగా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించారని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారనే సాకుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ్యత్వాలను కేసీఆర్ రద్దు చేయించారన్నారు. ఇప్పుడు మోదీ కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ధ్వజమెత్తారు. తాము సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామన్న దుగ్ధతో ఆ దీక్షను భగ్నం చేసేందుకు ఉచిత విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలి: మన్సూర్ అలీఖాన్ విద్వేషాన్ని అడ్డుకుని దేశాన్ని రక్షించేందుకు రాహుల్, సోనియా, ఖర్గే పోరాడుతున్నారని ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తోందని, బీఆర్ఎస్, బీజేపీలను ఓడించేందుకు అందరూ రాహుల్‌కు అండగా నిలవాలని కోరారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ ఒకే నేరంపై వివిధ రాష్ట్రాల్లో కేసులు వేయడం, వాటిని కోర్టులు సమర్థించడం బాధ కలిగిస్తోందన్నారు. మౌనదీక్ష రాహుల్ కోసమే కాదని, దేశంలోని ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసమని వ్యాఖ్యానించారు. రాహుల్ ఎంపీగా ఉంటే ప్రధాని అవుతాడనే భయం మోదీకి పట్టుకుందని ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ లోక్‌సభలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించారన్నారు. ఈ దీక్షలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మల్లురవి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌తోపాటు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పాల్గొన్నారు. -
మారుతున్న సమీకరణలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో కీలకమైన ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సమీకరణలు మారుతున్నాయి. అంకాపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త, నైన్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పైడి రాకేష్‌రెడ్డి గురువారం ఢిల్లీలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో పార్టీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాకేష్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి రేవతిరెడ్డి, కుమార్తె సుచరితరెడ్డి, నియోజకవర్గ నాయకురాలు విజయభారతి ఉన్నారు. పార్టీ కండువా కప్పుకున్న వెంటనే రాకేష్‌రెడ్డి తన ఉద్దేశాన్ని చాటిన తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆర్మూర్ నియోజకవర్గంలో సామాన్యులను బెదిరింపులకు గురిచేస్తూ, బ్లాక్మెయిల్ చేసే తరహా రాజకీయాలకు చరమగీతం పాడే ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరినట్లు చెప్పడం విశేషం. టిప్పర్లతో గుద్ది చంపే తరహా హత్యారాజకీయాలకు తెరదించేందుకే వస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి కానీ బ్లాక్‌మెయిల్‌కు గురిచేసే వ్యవహారాలు కాదన్నారు. అన్ని వర్గాల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధిస్తే ఒక్క కుటుంబమే లాభం పొందిందన్నారు. పేదలకు మేలు చేసేందుకే బీజేపీలో చేరానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళతానన్నారు. ఇప్పటికే పేదలకు ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నానన్నారు. ఆపదలో ఉన్నవారికి పైడి రాకేశ్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా, ఇతర అన్ని రకాలుగా సహాయం చేస్తున్నామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో తన ముద్ర వేసుకుంటానన్నారు. ఇప్పటికే ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారన్నారు. రాకేశ్‌రెడ్డి రూ పంలో ఓ కరుడుగట్టిన, కమిట్మెంట్తో కూడిన కార్యకర్తలాగా తనను బీజేపీ పంపుతోందన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఆర్మూర్‌లో ఫ్యా క్షన్ రాజకీయాలను కూకటి వేళ్లతో పెకిలిస్తానన్నా రు. గత కొన్నేళ్లుగా పుట్టిన ఊరికి, చుట్టుపక్కల గ్రా మాలకు నిరంతరం సేవ చేస్తున్నానన్నారు. ప్రస్తు తం ఆర్మూర్ నియోజకవర్గంలో హత్యలు, అక్ర మాలు, కబ్జాలు నడుస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి లక్ష్యంగా.. రాకేష్‌రెడ్డి ప్రకటనలు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని లక్ష్యంగా చేస్తుండగా, ఇప్పటికే అందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో అందుకు తగినవిధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. కల్లెడ సర్పంచ్ దంపతులు లావణ్య, ప్రసాద్‌గౌడ్‌లను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కుట్ర చేసి కేసుల్లో ఇరికించినట్లు ఆరోపణలు, అదేవిధంగా నందిపేట సర్పంచ్ దంపతులు కలెక్టరేట్లో ఆత్మహత్యాయత్నం చేసిన విషయమై ఇప్పటికే నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలను రాకేష్‌రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. లక్కంపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత ఉపసర్పంచ్‌లను హతమార్చేందుకు ఆ గ్రామ సర్పంచ్ భర్త మహేందర్ సుపారీ ఇచ్చిన విషయమై జిల్లాలో సంచలనమైంది. ఎమ్మెల్యే ఇలాంటి వాళ్లను వెనకేసుకురావడం పట్ల రాకేష్‌రెడ్డి ప్రస్తావించారు.రాకేష్‌రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరితో కలిసేలా ప్లాన్ చేసుకోగా, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుండడంతో సమీకరణలు మారనున్నట్లు వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పకడ్బందీగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. -
జేపీఎస్‌లను రెగ్యులర్ చేయండి.. కేసీఆర్‌కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ..
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీర్‌కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే పంచాయతీ సెక్రెటరీలు సమ్మెకు దిగారని జీవర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు వాళ్లను రెగ్యులర్ చేయాలని కోరారు. కాగా.. తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏప్రిల్ 29 నుంచి నిరవదిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహ్యం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు కూడా పంపింది. మంగళవారం సాయంత్రం 5:00 గంటల్లోగా సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. విధుల్లో చేరిన తర్వాత రెగ్యులర్ చేసే విషయంపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది. చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
మరో ‘మహా’సభపై బీఆర్ఎస్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో కార్యకలాపాల విస్తరణపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 5న నాందెడ్‌లో జరిగిన తొలి సభ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ నెల 26న నాందేడ్‌కు 35 కి.మీ. దూరంలోని కాందార్ లోహలో సైతం భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ సభకు అధ్యక్షత వహించనుండటంతో జన సమీకరణను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. లక్షకు మందికిపైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సభ ద్వారా లాతూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ప్రభావం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్ల బాధ్యతను తెలంగాణ పీయూసీ చైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, పార్టీ మహారాష్ట్ర శాఖ కిసాన్‌సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ మోడల్‌కు ప్రాధాన్యత... కాందార్ లోహ బహిరంగ సభకు జన సమీకరణ కోసం కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ మహారాష్ట్ర గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ప్రచారం చేసేందుకు 20 ప్రచార రథాలు, 16 డిజిటల్ స్క్రీన్ ప్రచార వాహనాలను ఉపయోగిస్తోంది. 16 తాలూకాల పరిధిలోని 1,600 గ్రామాల్లో తెలంగాణ మోడల్‌ను విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ ప్రచార రథాలను ఉపయోగిస్తోంది. ఓవైపు తెలంగాణ మోడల్‌కు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలను వీడియోలు, ఇతర ప్రచార సామగ్రి రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికను అమలు చేస్తోంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సభా వేదిక ద్వారా ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో చేరికల కోసం కసరత్తు జరుగుతోంది. సభలో వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్లో చేరతారని చెబుతున్నా క్షేత్రస్థాయి కేడర్‌ను చేర్చుకొనేందుకే పార్టీ ప్రాధాన్యమిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే నాటికి నాందెడ్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక ఎన్నికలపై నజర్... త్వరలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీపై ఎలాంటి కదలికలు లేకున్నా అక్కడి రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. కర్ణాటక రాజకీయాలపై సర్వే సంస్థల ద్వారా ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక రాజకీయాల పరిశీలనకు త్వరలో సీఎం కేసీఆర్ ఒక బృందాన్ని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ప్రజలను అగ్నిగుండంలోకి నెట్టేశారు
సాక్షి, ఆదిలాబాద్: పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను సీఎం కేసీఆర్ అగ్నిగుండంలోకి నెట్టేశారని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం దక్కుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటు ఎదురైందన్నారు. హాథ్‌సే హాథ్ జోడో అభియాన్ కొనసాగింపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి భట్టి మొదలుపెట్టిన పాదయాత్ర రెండోరోజు శుక్రవారం బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో కొనసాగింది. శుక్రవారం రాత్రి సిరికొండలో పాదయాత్రకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపి వెంట నడిచారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ గిరిజన బిడ్డల బతుకుల బాగు కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, మీ కుటుంబం బాగు పడడానికి కాదంటూ సీఎం కేసీఆర్‌నుద్దేశించి విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాయమాటలు చెప్పి హౌసింగ్ శాఖనే ఎత్తివేసి ప్రజలను దగా చేశారని ఆరోపించారు. అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి పోడు భూముల పట్టాలివ్వకుండా గిరిజనులను వేధించి కేసులు పెడుతున్నారన్నారు. మీ అబ్బ సొత్తా..: కాంగ్రెస్ పాదయాత్రకు వెళ్లిన వారికి సంక్షేమ పథకాలు ఆపివేస్తామని అనడానికి మీరెవరంటూ బీఆర్ఎస్ నేతలను భట్టి ప్రశ్నించారు. రాష్ట్ర సంపద ఏమైన మీ అబ్బ సొత్తా అంటూ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న తర్వాత బోథ్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి కుప్టి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామన్నారు. అడ్డగోలుగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధర తగ్గించి రూ.500కే వంట గ్యాస్ ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకొని పీపుల్స్ గవర్నమెంట్‌ను తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..
పంజగుట్ట (హైదరాబాద్): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి దీని వెనుక ఎవరెవరున్నారో మొత్తం బయటకు తీయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ఏపీపీఎస్సీ పేపర్లు లీకేజీ కాలేదని, తొలిసారి తెలంగాణలో లీకేజీ కావడం రాష్ట్ర చరిత్రలోనే ఇదొక దుర్దినమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో కవిత ఉందా లేదా అనేదానికన్నా ఇది చాలా పెద్ద కేసని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం ఈ వ్యవహారంపై నోరువిప్పకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై బుధవారం ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన చోట ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్‌ను టీఎస్పీఎస్సీలో పెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ..తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి లీకేజీలు చూడలేదన్నారు. ఓఎమ్ఆర్ షీట్ నింపలేని వాడికి 103 మార్కులు వచ్చాయంటే కచ్చితంగా లీకేజీ జరిగిందని అర్థమవుతుందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అతడితోపాటు సీఎం కేసీఆర్ కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ..ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తాను మాజీ సభ్యుడినని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందన్నారు. కనీసం సెక్రటరీకి కూడా చెప్పకుండా చైర్మన్ గోప్యతను పాటించాలని కానీ, ఒక సెక్షన్ ఆఫీసర్ చేతికే పేపర్లు వెళ్లిపోవడం దారుణమన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ విశ్వసనీయత, పేరు ప్రతిష్టలు దిగజారిపోయాయన్నారు. సమావేశంలో ఈడబ్ల్యూఎస్ జాతీయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సీపీఐ యువజన నేత ధర్మేంద్ర, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, చెరుకు సుధాకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, సీనియర్ జర్నలిస్టు విఠల్ పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు బైబై చెప్పండి
సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్: బాన్సువాడ పర్యటనలో ‘నేను ముసలోణ్ణి అయ్యా. వయస్సు మీద పడింది..’అని చెప్పిన సీఎం కేసీఆర్ వెంటనే రాజకీయాల నుంచి విరమించుకుని ఫాంహౌస్‌లో ప్రశాంతంగా శేష జీవితం గడపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజలు కూడా కేసీఆర్‌కు బైబై చెప్పి కాంగ్రెస్‌కు స్వాగతం పలకాలని అన్నారు. రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగింది. తొలుత గండిపెల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. అనంతరం గౌరవెల్లి రిజర్వాయర్‌లో పరిహారం దక్కని ఆడబిడ్డలతో సమావేశం అయ్యారు. అనంతరం పాద యాత్రగా హుస్నాబాద్ చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదని విమర్శించారు. ప్రజలకు పూర్వ వైభవం రావాలంటే, పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, జానారెడ్డి, బలరాం నాయక్, సుదర్శన్‌రెడ్డి, రాజయ్య, ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర?
ఖలీల్‌వాడి: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరోమారు హత్యకు కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం నగరంలోని నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి కేసీఆర్ కాలనీ న్యూ హౌసింగ్ బోర్డులో బొంత సుగుణ అనే మహిళ ఇంట్లో పోలీసులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు రూరల్ ఎస్‌హెచ్‌వో లింబాద్రి తనిఖీలు చేపట్టారు. 95 జిలెటెన్ స్టిక్స్, 10 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా మాక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ తన ఇంట్లో వీటిని పెట్టినట్లు తెలిపింది. ప్రసాద్ గౌడ్ గత ఏడాది ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హైదరాబాద్‌లో హత్యాయత్నం కేసులో చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు. జనవరి 9న జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను కొనుగోలు చేసి మహిళ ఇంట్లో దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రసాద్‌గౌడ్ ఒకరిపై కత్తితో దాడిచేసిన కేసులో నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్నాడు. -
ఏసీడీ పేరిట కేసీఆర్ పన్ను
జగిత్యాలటౌన్: విద్యుత్ సంస్థలోని నష్టాలు పూడ్చుకునేందుకే వినియోగదారుల నుంచి ముందస్తు వినియోగ ధరావతు (ఏసీడీ) చార్జీలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. సంస్థను నిర్వహించడంలో విఫలమైన సీఎండీ ప్రభాకర్‌రావు తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ఏసీడీ చార్జీల పేరుతో వసూలు చేస్తున్న కేసీఆర్ పన్నును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయానికి నిర్దిష్ట విద్యుత్ సరఫరా వేళలు ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతిభవన్ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. తొలుత ఇందిరాభవన్ నుంచి రైతులు, కాంగ్రెస్ శ్రేణులతో విద్యుత్ ప్రగతిభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయని, సీఎం కేసీఆర్ ఇలాఖాలో ఏసీడీ చార్జీలు లేవని, కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే ఉత్తర తెలంగాణ ప్రజలపైనే భారం ఎందుకని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించిన ప్రభుత్వం..ప్రజలపై రూ.40వేల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు జగిత్యాల నుంచి ఉద్యమం మొదలుపెడతామని ఆయన హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి ఏలా విచారణ చేస్తారు ..?
-
గవర్నర్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు
నిజామాబాద్ సిటీ: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా కాకుండా బీజేపీ అనుబంధ విభాగం మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్లుగా ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీకి చెందినవారు దాడి చేస్తే సాటి మహిళగా స్పందించని గవర్నర్.. నేడు బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై నివేదికలు కోరడంతో ఆమె పనితీరు బయటపడిందని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ని రాజకీయ భవన్‌గా మార్చి తమిళిసై గవర్నర్ పదవికి మచ్చ తెస్తున్నారన్నారు. కవిత గురించి మరోసారి తప్పుగా మాట్లాడితే 62 లక్షల టీఆర్ఎస్ సైన్యం ఎంపీని నిజామాబాద్ నుంచి కోరుట్ల వరకు ఉరికించి కొడతారని హెచ్చరించారు. -
సీఎం గైర్హాజరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
రాయికల్: అహంకారంతో సీఎం ప్రధాని పర్యటనలో పాల్గొనకపోవడం.. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా పార్టీలకు అతీతంగా స్వాగతం పలకడం సంప్రదాయమ ని ఆయన స్పష్టం చేశారు. విపక్ష సీఎంలు స్టాలిన్, మమతబెనర్జీలు సైతం తమ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించినప్పుడు స్వాగ తం పలికి.. రాష్ట్రాభివృద్ధిపై నిలదీస్తారని వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరై రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 9 మండలాలు ఆంధ్రలో కలిసినప్పుడు సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు. -
ఎనిమిదేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది?
మర్రిగూడ: ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది తెలంగాణ వీరులు ఆత్మబలిదానాలు చేసుకుంటే వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టిన ఎనిమిదేళ్ల నుంచి ఏం అభివృద్ధి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి, దామెరభీమనపల్లి, వట్టిపల్లి, మర్రిగూడ, శివన్నగూడ గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన మాట్లాడారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మునుగోడులో 22వేల మెజారిటీతో గెలిపిస్తే రూ.22వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్దన్‌రెడ్డి బిడ్డకు మొదటిసారి పార్టీ నుంచి అవకాశం వచ్చిందని, గెలిపించుకొని మహిళాశక్తిని నిరూపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజల కోసం జీవితాంతం పోరాడుతానని ఓటర్లను కోరారు. డ్రామాలు మానుకుని గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా డ్రామాలు మానుకుని పరిపాలనపై టీఆర్ఎస్, బీజేపీ దృష్టి సారించాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. ‘బీజేపీ మంత్రాలతో చింతకాయలు రాలవు. టీఆర్ఎస్ తంత్రాలతో ప్రజల సమస్యలు తీరవు. ఆ రెండు పార్టీల చీకటి దోస్తీ ప్రజలకు అర్థమైపోయింది’అని సోమవారం ట్విట్టర్లో రేవంత్ పోస్ట్ చేశారు. -
అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ప్రారంభం
శామీర్‌పేట్: శామీర్‌పేటలోని నల్సార్ విశ్వ విద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార న్యాయ కేంద్రాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి బీపీ జీవన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపార చట్టాల్లో సమకాలీన సమస్యలకు సంబంధించిన బోధనకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని అన్నారు. అనంతరం అంతర్జాతీయ న్యాయ పరిశోధన కార్యాలయ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ ప్రొఫెసర్లు వెంకట్, డాక్టర్ కేవీకే శాంతి, మల్లిఖార్జున్, రాజేశ్‌కపూర్ పాల్గొన్నారు. -
రేషన్ షాపుల్లో జీఎస్టీ బొమ్మ పెట్టాలి: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రేషన్ షాపుల్లో పెట్టా ల్సింది నేతల బొమ్మ లు కాదని, జీఎస్టీ బొమ్మ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బొమ్మల పంచాయితీ మాత్రమే కానీ అభివృద్ధి కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ.5 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు. 8 ఏళ్లలో జీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలపై రూ.3 లక్షల కోట్ల భారం పడిందని, జీఎస్టీ వల్ల ప్రజలకు పన్నుల భారం తప్ప ప్రయోజనం లేదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నువ్వంటే నువ్వని కొట్లాడుతున్నాయని విమర్శించారు. రైతుబంధు సాకుతో ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలన్నీ ఆపేశారని, 2014కు ముందు ఉన్న వాటిని నిలిపివేసి పేర్లు మార్చి గొప్ప లు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
కవితపై బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: జీవన్‌రెడ్డి
-
ఆంక్షల నడుమ సీఎల్పీ బృందం పర్యటన
భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలోని ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ) బృందం పర్యటనకు అడుగడుగునా పోలీసు ఆంక్షలు ఎదురయ్యాయి. ముంపు బాధితుల పరామర్శకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వాన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, సీతక్క, కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులతో కూడిన బృందం మంగళవారం వచ్చింది. భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రస్వామిని దర్శించుకున్నాక స్థానికంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పాటు గోదావరి వరద పెరుగుతున్నందున దుమ్ముగూడెం పర్యటన వాయిదా వేసుకోవాలని భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్ కోరినా నేతలు ససేమిరా అన్నారు. దీంతో పోలీసుల కళ్లుగప్పి సీఎల్పీ నేతల కాన్వాయ్ దుమ్ముగూడెం మండలం వైపు వెళ్తుండగా పోలీసులు సినీఫక్కీలో ఛేజ్చేస్తూ గుర్రాలబైలు వద్ద అడ్డుకున్నారు. పోలీసులు ఎంతకూ అనుమతించకపోవడంతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. చివరకు గుర్రాలబైలు నుంచి లచ్చిగూడెం, మారాయిగూడెం, చేరుపల్లి మీదుగా భద్రాచలానికి సీఎల్పీ నేతల కాన్వాయ్‌ను మళ్లించారు. ఆపై భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన నేతలు బూర్గంపాడు మీదుగా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజీ పరిశీలనకు బయలుదేరారు. అయితే, సీఎల్పీ బృందాన్ని బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఎల్పీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు నేతల వాహనాలను బలవంతంగా కొత్తగూడెం వైపు మళ్లించి రాకపోకలను పునరుద్ధరించారు. అక్కడినుంచి నేతలను కొత్తగూడెం మీదుగా కాళేశ్వరం వెళ్లాలని సూచించిన పోలీసులు మార్గమధ్యలో పాల్వంచ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆపై సీఎల్పీ బృందాన్ని వాహనాల్లో బందోబస్తు నడుమ ఇల్లెందుకు తరలించారు. అనంతరం కాళేశ్వరం మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా నాయకులు వాహనాల నుంచి కిందకు దిగారు. దీంతో ఇల్లెందులోని సింగరేణి గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అయితే, గెస్ట్‌హౌస్ తాళాలు లేకపోవడంతో 11గంటల వరకు ఆవరణలోనే నాయకులు పడిగాపులు కాశారు. చివరకు తాళాలు తీసుకురాగా, భోజనం అనంతరం కాళేశ్వరం బయలుదేరనున్నట్లు నాయకులు వెల్లడించారు. తెలంగాణనా.. పాకిస్తానా? ఇది తెలంగాణనా లేకపోతే పాకిస్తానా.. అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందస్తు సమాచారమిచ్చి గోదావరి ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న తమను టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని ఆరోపించారు. దుమ్ముగూడెం పర్యటనకు వెళ్తుంటే మావోల ప్రభావిత ప్రాంతమని, అశ్వాపురం వెళ్తుంటే అనుమతులు లేవని అడ్డుకున్నారని తెలిపారు. ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పాతరేయడం ఖాయమన్నారు. గోదావరి వరద ముంపు బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. -
జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో నలుగురి అరెస్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో నలుగురు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్మూర్ నియోజక వర్గం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లావణ్యగౌడ్ భర్త ప్రసాద్ గౌడ్ ఈ నెల 1వ తేదీన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసించే ఆర్మూర్ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి కత్తి, గన్ చూపించి బెదరించడమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడిని విచారించగా హత్యకు ఉసిగొలిపిన వారి సమాచారం వెల్లడైంది. కేసులో ఏ2గా ఉన్న ప్రసాద్‌గౌడ్ భార్య లావణ్యతో పాటు ఏ4గా ఉన్న సంగరత్న పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కొండా సంతోష్‌గౌడ్ (46), బొంత సుగుణ (40), సురేందర్ (56), దయాసాగర్(36)లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సస్పెన్షన్‌కు గురైన లావణ్యగౌడ్‌ను తిరిగి సర్పంచ్‌గా నియమించాలంటూ ప్రసాద్‌గౌడ్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నాడు. స్పందన లేకపోవడంతో ఆయన అంతుచూసేందుకు ప్రణాళిక వేసి దొరికిపోయాడు. ఈ ఘటనలో ఇంకా పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారు: జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌరవుల పక్షాన చేరిన కర్ణుడని ఆయన అభివర్ణించారు. పాండవుల వెంట ఉంటే రాజ్యం ఇస్తామని చెప్పినా అనాడు కర్ణుడు విననట్లు.. ఇప్పుడు రాజగోపాల్ కూడా అలాగే చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడమంటే చేతకానీతనమేనని జీవన్ రెడ్డి విమర్శించారు. రాజీనామాతో అభివృద్ధి అనేది సరైన వ్యూహం కాదని తెలిపారు. హుజురాబాద్‌కు, మునుగోడుకు సంబంధమే లేదని, రాజగోపాల్‌రెడ్డి ఇకపై అసెంబ్లీలో అడుగు పెట్టడని జోస్యం చెప్పారు. మునుగోడులో గెలిచేది తామేనని స్పష్టం చేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని మండిపడ్డారు. గత మూడేళ్లలో రాజగోపాల్‌రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఏదైనా ఉందా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి ఫైట్ చేస్తామంటే కాంగ్రెస్ అడ్డుపడిందా అని నిలదీశారు. చదవండి: కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం.. మనుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ప్రజలు ఎలా చూస్తారనేది చూడాలన్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచే అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో టీ కాంగ్రెస్‌లో పంచపాండవులు మిగిలారని జీవన్ రెడ్డి వెల్లడించారు. సీఎల్పీనేత భట్టివిక్రమార్క.. ధర్మరాజు అయితే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని భీముడని, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును అర్జునుడిగా పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డిని కర్ణుడితో పోల్చారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశమైంది. ఎమ్మెల్యేలు అందుబాటులో లేని కారణంగా జూమ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ మీటింగ్‌లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. చదవండి: జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందాం: సీఎం కేసీఆర్ -
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసులో సంచలన విషయాలు
-
రేవంత్, వెంకట్‌రెడ్డి మధ్య ఏం జరుగుతోందో తెలియదు: జీవన్‌రెడ్డి
జగిత్యాలటౌన్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య ఏం జరుగు తోందో తనకు తెలియదని.. మునుగోడు సభ విషయంలో వెంకట్‌రెడ్డికి ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ అని, కొత్త చేరికల సందర్భంగా అసంతృప్తి చోటుచేసుకోవడం సహజమన్నారు. ఇంతకాలం పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌ను వీడటం బాధాకరమేనని అన్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు, టీఆర్ఎస్కు మధ్య పోటీ జరిందని.. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్‌తో అవినీతియమైన టీఆర్ఎస్ పాలన చూసి జయశంకర్ ఆత్మక్షోభిస్తుందన్నారు. చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా? -
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కేసు దర్యాప్తు వేగవంతం
-
ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రసాద్ గౌడ్ వార్నింగ్
-
ప్రసాద్ గౌడ్ ను చూసి గట్టిగ అరిచిన జీవన్ రెడ్డి
-
తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేశారని ఎమ్మెల్యేపై కక్ష
-
తలుపు తట్టి.. తలకు తుపాకీ గురిపెట్టి..
బంజారాహిల్స్(హైదరాబాద్): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిందితుడు తుపాకీతో కాల్చేందుకు యత్నిస్తుండగా ఎమ్మెల్యే కేకలు వేయడంతో పరుగున వచ్చిన గన్మెన్లు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గం మాకునూరు మండలం కల్లాడి సర్పంచ్ లావణ్య... పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎమ్మెల్యేతో మొదటినుంచీ విభేదాలు ఉండటం, భార్యపై సస్పెన్షన్ ఎత్తివేత ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఆమె భర్త, టీఆర్ఎస్కే చెందిన పెద్దగాని ప్రసాద్‌గౌడ్ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అంతం చేయాలనే పథకం వేసినట్లు సమాచారం. నాలుగురోజులు రెక్కీ పథకంలో భాగంగా ప్రసాద్‌గౌడ్ రెండు తుపాకులు, ఒక బటన్ చాకు (కత్తి)ని కొనుగోలు చేశాడు. 4 రోజుల పాటు బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసం వేమిరెడ్డి ఎన్క్లేవ్ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఎమ్మెల్యే ఏ సమయంలో వస్తున్నాడు.. ఎవరెవరు ఇంటి వద్ద ఉంటారు.. అన్నీ పరిశీలించాడు. సోమ వారం రాత్రి 7.30 గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంటికి వచ్చి సెక్యూరిటీ గార్డులు, గన్మెన్లతో కొద్దిసేపు మాట్లాడాడు. ఎమ్మెల్యే నియోజక వర్గానికే చెందిన సర్పంచ్ భర్త కావడం, గతంలో కూడా ఇలాగే వచ్చాడు కదా అని గన్మెన్లు, సెక్యూరిటీ గార్డులు ఇంట్లోకి అనుమతించారు. నేరుగా బెడ్రూమ్కు వెళ్లి.. రాత్రి 8.30 గంటల వరకు మెయిన్ హాల్లో తచ్చాడిన ప్రసాద్‌గౌడ్.. గన్మెన్లు, సెక్యూరిటీ గార్డులు సమీపంలో లేకపోవడం చూసి నేరుగా లిఫ్ట్‌లో మూడో అంతస్తులోని జీవన్‌రెడ్డి పడక గది వద్దకు వెళ్లి తలుపు కొట్టాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న ఎమ్మెల్యే తలుపులు తీసి ఎదురుగా నిలబడ్డ ప్రసాద్ ను చూసి షాక్ తిన్నారు. ‘ఏంటి? ఏం కావాలి?’ అని అడుగుతుండగానే ప్రసాద్ తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. ఎమ్మెల్యే పెద్దగా కేకలు వేస్తూ, తలుపులు మూస్తూ తప్పించుకునే ప్రయ త్నం చేశారు. ఆయన అరుపులు విన్న గన్మెన్లు, సె క్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకుని ప్రసాద్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మె ల్యేకు ప్రాణహాని తప్పింది. ఒక చేతిలో నాటు తుపాకీ, ఇంకో చేతిలో కత్తితో ఉన్న ప్రసాద్‌ను అదు పులోకి తీసుకున్న గన్మెన్లు వెంటనే బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని రెండు తుపాకులు, కత్తి, నిందితుడి కారు (టీఎస్ 16ఎఫ్ బీ 9517) స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 307, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాక్‌కు గురైన జీవన్‌రెడ్డి నిందితుడు నేరుగా బెడ్రూమ్ వరకు వచ్చి కాల్చేందుకు యత్నించడంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మధ్యాహ్నం వరకు కూడా కోలుకోలేదు. ఏ మాత్రం అటూఇటూ అయినా ప్రాణాలు పోయేవని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం, నగర ప్రజలకు పోలీసుల సూచన -
టీఆర్ఎస్కు అధికారంలో కొనసాగే హక్కు లేదు: జీవన్ రెడ్డి
-
బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా ?.. 'చోర్ బజార్' రివ్యూ
టైటిల్: చోర్ బజార్ నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు తదితరులు దర్శకుడు: జీవన్ రెడ్డి నిర్మాత: వీఎస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి విడదల తేది: జూన్ 24, 2022 ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 'రొమాంటిక్' మూవీతో నటనపరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు 'చోర్ బజార్' సినిమాతో మరోసారి సందడి చేశాడు. గెహనా సిప్పీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి 'జార్జ్ రెడ్డి'ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) అమితాబ్ బచ్చన్ అభిమానిగా నటించింది. శుక్రవారం (జూన్ 24)న విడుదైలన 'చోర్ బజార్' ప్రేక్షకుల మనసును చోరీ చేసిందో తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే. కథ: హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ. 200 కోట్లు విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రం అపహరణకు గురవుతుంది. దొంగలను పట్టుకునే క్రమంలో ఆ వజ్రం చోర్ బజార్ అనే ఏరియాలో పడుతుంది. మరోవైపు చోర్ బజార్‌ను అన్ని తానై నడిపిస్తుంటాడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి). దీంతో ఎలాగైన ఆ వజ్రాన్ని పట్టుకునేందుకు చోర్ బజార్లో కాపు కాస్తారు పోలీసులు. మరి ఆ వజ్రాన్ని పోలీసులు పట్టుకున్నారా ? చివరిగా అది ఎక్కడికి చేరింది ? బచ్చన్ సాబ్ ప్రేమించిన మూగ అమ్మాయి సిమ్రాన్ (గెహనా సిప్పీ)ని దక్కించుకున్నాడా? చోర్ బజార్‌ను శాశ్వతంగా మూయించాలనుకున్నా గబ్బర్ సింగ్ (సుబ్బరాజు) ఏం చేశాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే 'చోర్ బజార్' చూడాల్సిందే. విశ్లేషణ: డైరెక్టర్ జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి'తో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతకుముందు ఆయన 'దళం' సినిమాకు ఒక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాల అనుభవం 'చోర్ బజార్' మూవీని తెరకెక్కించడంలో కనిపించలేదనే చెప్పవచ్చు. వజ్రాన్ని దొంగతనం చేసే సన్నివేశంతో ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు తర్వాత పూర్తిగా తడబడ్డారు. డైమండ్ చోరి తర్వాత వచ్చే సీన్లన్ని చప్పగా సాగుతాయి. డైమండ్ చోరీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో లవ్, చోర్ బజార్ మనుషుల కథ, ఉమెన్ ట్రాఫికింగ్, అమితాబ్ బచ్చన్ మీద అభిమానంతో ఇళ్లు వదిలేసి వచ్చిన యువతి కథ వంటి పలు ఉప కథలు గందరగోళానికి గురిచేస్తాయి. మరీ స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, గజిబిజి సీన్లతో నిండిన ఎడిటింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. రెండు పాటలు, సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించింది. నటీనటులు మాట్లాడే తెలంగాణ యాస కొంత ఇబ్బందిపెడుతుంది. ఎవరెలా చేశారంటే? ఆకాష్ పూరి నటన ఇంతకుముందు చిత్రాల్లానే ఇందులో ఉంది. అలాగే పూరీ స్టైల్ హీరోగా కనిపిస్తాడు. ప్రతి సినిమాలో అలాగే కనిపించేసరికి రొటీన్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తుంది. ఇక మూగ అమ్మాయిగా గెహనా సిప్పీ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. మూగ అమ్మాయిగా హీరోయిన్ ఎలివేట్ అయ్యే సన్నివేశాలు అంతగా లేకున్నా ఉన్నంతలో బాగానే నెట్టుకొచ్చింది. సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) బాగుంది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ అంతగా వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 'చోర్ బజార్'ను వీక్షించాలంటే మాత్రం ఎంతో ఓపిక కావాలి. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
నాకు సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడం రాదు: డైరెక్టర్
Director Jeevan Reddy Interesting Comments On Chor Bazaar Movie: ‘‘నాకు సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడం రాదు. ‘జార్జ్ రెడ్డి’ తర్వాత ఆ క్రేజ్‌ను ఉపయోగించుకోలేదని నా ఫ్రెండ్స్ అంటుంటారు. మనసుకు నచ్చిన కథలను తెరకెక్కిస్తుంటాను. లెక్కలు వేసుకోవడం రాదు.. సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటాను’’ అన్నారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చోర్ బజార్’ ప్రేమకథా చిత్రం అయినప్పటికీ కథనం ఒక విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ కమర్షియల్‌గా సాగుతాయి. నేను అనుకున్న బచ్చన్ సాబ్ పాత్రకు ఆకాష్ వంద శాతం న్యాయం చేశాడు. ఈ చిత్రకథని పూరి జగన్నాథ్‌గారు వినలేదు.. మాపై అంత నమ్మకం ఆయనకు. ఇండస్ట్రీలో నాకు గురువు ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ). అయితే ప్రతి దర్శకుడితో స్నేహం ఉంది’’ అని పేర్కొన్నారు. చదవండి: స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
దేశాన్ని అమ్మడమే ప్రధాని మోదీ పని
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మడమే పనిగా పెట్టుకున్నారని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. మంత్రి కేటీఆర్ దావోస్‌లో పెట్టుబడులు రాబడుతూ దుమ్ము లేపుతుంటే ప్రధాని మోదీ, తెలంగాణపై దుమ్మెత్తి పోసేందుకు హైదరాబాద్ వచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలసి శుక్రవారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మేకిన్ ఇండియా నినాదాన్ని ప్రధాని మోదీ.. ఫేక్ ఇన్ ఇండియాగా మార్చారని, అంబానీ, అదానీలకు దేశాన్ని ధారాదత్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ఏ బీజేపీ కార్యకర్త త్యాగం చేశాడో చెప్పాలన్నారు. తెలంగాణ వ్యతిరేకి మోదీ: బాల్క సుమన్ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని బాల్క సుమన్ విమర్శించారు. టీఆర్ఎస్ది త్యాగాల కుటుంబమైతే బీజేపీ మాత్రం భోగాల కుటుంబంగా మారిందన్నారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని చెప్పడం అదానీకోసమేనన్నారు. కేసీఆర్ ప్రత్యామ్నాయ ఎజెండాను చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని ఆయన అన్నారు. -
రైతు డిక్లరేషన్ కాదు.. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వరంగల్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేసిన ప్రకటన రైతు డిక్లరేషన్ కాదని, అధికారంలో లేకపోవడంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మె ల్యే కె.విద్యాసాగర్‌రావుతో కలసి శనివారం టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాహుల్ ఢిల్లీ వాసి, రేవంత్ గల్లీ సన్నాసి.. ఇద్దరూ కాంగ్రెస్‌కు ఐరన్ లెగ్‌లు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో చెత్తా చెదారం ఉందని, ఆ డిక్లరేషన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వర్తించదా అని ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్ పర్యాటక రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో బీజేపీ నేత జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ తదితరులు పర్యాటకుల్లా వస్తున్నారన్నారు. -
ధరలు తగ్గించాలి.. ధాన్యం కొనాలి
సాక్షి, నెట్వర్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీల్ని తగ్గించాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయా లనే డిమాండ్లతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కలెక్టరేట్ల ఎదుట, నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నా, రాస్తారోకోలు నిర్వహించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్షలు నిర్వహించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు శనిలా దాపురించారన్నారు. మహబూబాబాద్‌లో బెల్లయ్యనాయక్, ఖమ్మంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్, ఇల్లెందులో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొని నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ నాయకులు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ కలెక్టరేట్ వద్ద బైఠాయించిన నాయకులు సంగారెడ్డిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించగా, ఏఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం గ్యాస్‌బండకు దండవేసి ప్రధాన రహదారిపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. కాగా, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించడంతో పాటు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చే క్రమంలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. -
‘కేంద్రం మెడలు వంచి ధాన్యాన్ని కొనిపిస్తాం’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం మెడలు వంచి తెలంగాణ ధాన్యాన్ని కొని పించి తీరుతామని పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ బట్టేబాజ్, బ్రెయిన్లెస్ ఎంపీగా మారిపోయారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు సంజయ్ తెలంగాణలో పుట్టాడా? గుజరాత్లో పుట్టాడా అనే అనుమా నం కలుగుతోందన్నారు. బీజేపీ నేతలు ధాన్యం సేకరణపై ఒక్కొక్కరు ఒక్కో తరహాలో మాట్లాడుతున్నారని, ప్రతి గింజ కేంద్రంతో కొనిపిస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు తమను అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీజేపీకి పీసీసీ చీఫ్ రేవంత్ సామంతుడిలా మారారని, తెలంగాణ వ్యతిరేకుల గూటి పక్షి రేవంత్ అని వ్యాఖ్యానించారు. సంజయ్‌కు మతి తప్పిందని, ఆయ న్ను వెంటనే మెంటల్ ఆస్పత్రికి తరలించాలని ఎద్దేవా చేశారు. ఈనెల 11న ఢిల్లీలో ధర్నా చేస్తామని, చేతనైతే మోదీని బతిమిలాడి తెలంగాణ ధాన్యం కొనిపించాలని సూచించారు. -
రాహుల్ సారథ్యం వహించాలి
సాక్షి. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) తీర్మానించింది. సోనియా, రాహుల్‌ల నాయకత్వమే అటు దేశా నికి, ఇటు పార్టీకి శ్రీరామరక్ష అని, గాంధీ–నెహ్రూ ల కుటుంబమే పార్టీ బాధ్యతలు తీసుకుని కేడర్‌ను ముందుకు నడపాలని కోరింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్కలు హాజ రు కాగా, నియోజకవర్గ పర్యటనలో ఉన్న మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాజరు కాలేదు. సమావేశంలో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, సీడబ్ల్యూసీ సమావేశంలో జరిగిన చర్చ, జీ–23 నేతల వ్యాఖ్యలు, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ చర్చ అనంతరం సోనియా, రాహుల్‌ల నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తూ తెలంగాణకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల పక్షాన తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతిపై భట్టి విక్రమార్క, టి.జీవన్‌రెడ్డిలు సంతకాలు చేశారు. అసెంబ్లీలో సమయం ఇవ్వలేదు బడ్జెట్ సమావేశాలపై చర్చిస్తూ.. ప్రజల పక్షాన మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి తగిన సమయం ఇవ్వలేదని, అటు స్పీకర్ సహకరించలేదని, ఇటు మంత్రులు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రెచ్చగొట్టేలా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఇటీవల మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సీనియర్లు భేటీ కావడం, ఈ భేటీకి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు హాజరుకావడంపై ఎమ్మెల్యే సీతక్క ఆరా తీసినట్టు తెలిసింది. సోనియా, రాహుల్‌పై విమర్శలు తగవు: భట్టి సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి భట్టి విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు వచ్చినా సోనియా, రాహుల్‌లు ఆ పదవిని వద్దనుకుని దేశం కోసం నిలబడ్డారని చెప్పారు. కపిల్ సిబాల్ లాంటి నాయకులు సోనియా, రాహుల్‌లపై విమర్శలు సరికావన్నారు. 1970లో అధికారాన్ని కోల్పోయి 1980లో పూర్వ వైభవం సంతరించుకున్న తరహాలోనే 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ హవా 2023– 24లో దేశంలో వీస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. -
నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ సమస్యపై మెట్పల్లి రైతులు అసెంబ్లీకి వస్తే లాఠీచార్జి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గురించే మాట్లాడతారే తప్ప.. కాయిలా పడిన చక్కెర కార్మగారం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ శాసన మండలికి రారని.. అసెంబ్లీలో ప్రశ్నిస్తే దాటవేత ధోరణిలో వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇస్తున్నామంటూ రాయితీలకు కోత పెట్టడం ఏమిటని నిలదీశారు. -
సభలో నవ్వులు పూయించిన కేటీఆర్
-
టీఆర్ఎస్లో చేరిక! జగ్గారెడ్డి ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్‌లకు ఇళ్లు, జాగ్వార్ కార్ ఇస్తే.. తాను కార్ పార్టీ( టీఆర్ఎస్) లోకి రావడానికి రెడీ అని అన్నారు. ఇళ్ల గృహ ప్రవేశం కాగానే టీఆర్ఎస్ పార్టీలో వస్తానని అసెంబ్లీ ఆవరణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జర్నలిస్ట్‌లతో సరదా సంభాషించారు జగ్గారెడ్డి. అవసరం అనుకుంటే ఒక టర్మ్ అసెంబ్లీ ఎన్నికలకు సైతం పోటీ కూడా చేయనని అన్నారు. తన అసెంబ్లీ సెగ్మెంట్లోని ప్రజలకు చెబుతానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌లో చేరలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ..
సాక్షి, హైదరాబాద్: ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల మధ్య ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సీఎల్పీ కార్యాలయంలో శనివారం వీరిద్దరూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. ‘జీవన్.. మా గురించి చాలా మాట్లాడుతున్నావు ఏంటి..?’ అని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందిస్తూ.. ‘అవును మా బాస్‌ను ఒక్క మాట అంటే వంద మాటలంటాం.. బరాబర్‌గా అంటాం’ అని అన్నారు. నేను సీఎం కేసీఆర్‌ను ఏం అనలేదు.. మీడియా వాళ్లు కేసీఆర్‌కు హెల్త్ బాగోలేదని చెబితే.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి ఏమో అని మాత్రమే అన్నాననిని రాజగోపాల్ రెడ్డి జవాబిచ్చారు. అసలు సీఎం కేసీఆర్ హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని, తనకు పైనుంచి ఆదేశాలు ఉన్నందునే నిన్ను తిట్టాను అని జీవన్ రెడ్డి తెలిపారు. మేము తెలంగాణ తెస్తే మమ్మల్నే తిడుతున్నారని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసినందుకు తమ కుటుంబంపై తమకు గౌరవం ఉందని జీవన్ రెడ్డి తెలిపారు. సోనియా గాంధీని ఎప్పుడూ విమర్శించమని, ఎందుకంటే ఆమె తెలంగాణ ఇచ్చిన దేవత.. తాము కేవలం రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను తిడతామన్నామని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రాదని, మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని జీవన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చదవండి: హైదరాబాద్: మహిళలపై వేధింపులు తగ్గట్లే! గెలిస్తే మాకేంటి, ఓడితే మాకేంటి మరోవైపు సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై .జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. జనరల్ హెల్త్ చెకప్ కోసం సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారని, కానీ 5 రాష్ట్రాల న్నారని ధ్వజమెత్తారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే తమకేంటని.. ఓడితే తమకేంటన్నారు. ఆ రెండు పార్టీలు కట్టగట్టుకొని ఎక్కడైనా దూకి చస్తే తమకేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ది మామూలు గుండె కాదని, కోట్లాది మంది అభిమానం ప్రజల అభిమానం పొందిన గుండెని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించిన ఉక్కు గుండె అని చెప్పుకొచ్చారు. చదవండి: కరెంట్, మంచి నీళ్లు బంద్ చేస్తాం.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
కేసీఆర్‌కు పాలాభిషేకాలు ఎందుకు..?
-
ఆర్మూర్‌లో దాడి జరిగింది, కానీ.. గన్నారంలోనే జరగాల్సింది: ఎమ్మెల్యే
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో టీఆర్ఎస్ నేతలలు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ హెచ్చరించారు. నోటికెంత వస్తే అంత మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టే ఆర్మూర్‌లో దాడి జరిగిందన్నారు. వాస్తవానికి గన్నారంలోనే జరగాల్సిందని, సీఎంతో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను తిడుతుంటే కొట్టడం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. బీజేపీ నాయకులకు ఎదురు తిరగాలని, ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అర్వింద్, రేవంత్ రెడ్డిలు తెలంగాణకు శనిలా మారారని విమర్శించారు. తమ ఆట మొదలైందని, కేసీఆర్‌ను విమర్శిస్తే వేటాడి వెంటాడుతామని హెచ్చరించారు. చదవండి: సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్ దేశమంతా కేసీఆర్ వైపు చూస్తోందని, దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లు విషం కక్కుతున్నారని, దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేసీఆర్ బర్త్ డే రోజు బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పథకాలు అమలు చేయాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు.. ఆ పార్టీల ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రస్తావించారు. చదవండి: మేడారం మహాజాతరలో అద్భుతం ఆవిష్కృతం -
ఎన్నికల్లో జై భీమ్.. బడ్జెట్లో నై భీమ్
సాక్షి, హైదరాబాద్: దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎ.జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జైభీమ్ నినాదమిస్తున్న బీజేపీ.. బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం దళిత గిరిజనుల అభ్యున్నతికి నిధులు కేటాయించకుండా నై భీమ్ అంటోందని విమర్శించారు. నమో అంటే నక్కజిత్తుల మోదీ అని, బీజేపీది గాడ్సేయిజం అయితే టీఆర్ఎస్ది అంబేడ్కరిజం అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో గురువారం జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికో వేషం, ప్రాంతానికో మోసంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీకి విశాల ధృక్పథం లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తోడుదొంగల్లా ఢిల్లీలో కూడబలుక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. దేశ జనాభాలో 28 శాతం ఉన్న దళిత, గిరిజనుల కోసం తెలంగాణ రా్రష్ట్రం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా కేంద్ర బడ్జెట్లో వారి కోసం కేవలం రూ.12 వేల కోట్లు కేటాయించడాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారన్నారు. గాంధీని చంపిన గాడ్సేకు సెల్యూట్ కొడుతున్న బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌ను అంబేడ్కర్ వ్యతిరేకులుగా చిత్రీకరించే కుట్రలు చేస్తోందన్నారు. జపాన్, ఫ్రాన్స్, నేపాల్ వంటి దేశాలు రాజ్యాంగాన్ని తిరిగి రాసుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తూ, దేశంలో గుణాత్మక మార్పు కోసమే సీఎం కేసీఆర్ నడుం బిగించారని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. దళితులకు న్యాయం జరగనందునే..: కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని పాలించినా దళితులకు న్యాయం జరగనందునే సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చర్చను లేవనెత్తారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దమ్ముంటే కేసీఆర్ ప్రతిపాదనపై పార్లమెంటులో చర్చ పెట్టాలని సవాల్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని లొట్టపీసు చట్టమని అవమానించిన బీజేపీ ఎంపీపై ఆ పార్టీ ఏం చర్య తీసుకుంటుందని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చినా అంబేడ్కర్ పేరు చిరస్థాయిగా, సుస్థిరంగా ఉంటుందని గువ్వల బాలరాజు అన్నారు. -
టీఆర్ఎస్లోకి బీజేపీ ఎంపీటీసీ అరుణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో నందిపేట బీజేపీ ఎంపీటీసీ అరుణ చావన్ ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. అరుణతో పాటు బీజేపీ నేతలకు కవిత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నంది పేట జెడ్పీటీసీ యమున ముత్యం, ఎంపీటీసి మురళి, టీఆర్ఎస్ పార్టీ నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్, సిలిండర్ లింగం పాల్గొన్నారు. -
మాకొద్దీ 317 జీఓ
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. జీఓలోని లోపాలను సవరించాలని, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళనకు దిగాయి. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హక్కులను కాలరాసే జీవో ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఎలాంటి సం ప్రదింపుల్లేకుండా జీవోను అమలు చేయడం ఘోరమన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి పాలేరు తీరులా ఉందని విమర్శించారు. జీవోను సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. సొంత జిల్లాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం లేకుండా జీవో ఉందని కోదండరాం విమర్శించారు. జిల్లాల వారీగా పెద్ద మొత్తంలో ఖాళీలున్నాయని, ఉద్యోగులను సొంత జిల్లాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒంటరి మహిళలు, వికలాంగులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిరసన.. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు హైదరాబాద్‌లో టీచర్ల ఆందోళన జిల్లాల్లో ఆందోళనలు ఇలా.. ♦నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయాల ముందు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. నిజామాబాద్‌లో కలెక్టర్ నారాయణ రెడ్డికి, కామారెడ్డిలో కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపతం సమర్పించారు. బాన్సువాడలో ఉపాధ్యాయుల సంతకాల సేకరణ చేపట్టారు. ♦కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ♦రంగారెడ్డి కలెక్టరేట్, వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉద్యోగుల అభ్యంతరాలను పట్టించుకోకుండా కేటాయింపులు జరపడంతో పలువురు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ దామాషాలను ఒక్కో జిల్లాలో ఒక్కోలా పాటించారన్నారు. ♦హనుమకొండ, మహబూబాబాద్, జనగామ కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. హనుమకొండలో జరిగిన నిరసనలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. ♦సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు అశోక్ కుమార్ నేతృత్వంలో నిరసన తెలిపారు. మెదక్‌లో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపి అదనపు కలెక్టర్ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ♦ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్ల వద్ద టీచర్లు ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం చేసిన అప్పీళ్లను కూడా పరిశీలించడం లేదని విమర్శించారు. ♦ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట టీచర్లు ధర్నా చేశారు. యూటీఎఫ్‌తో పాటు టీఈజేఎస్, కాంగ్రెస్, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.


