Jeevan Reddy: సినిమాలు లేకుంటే వ్యవసాయం చేస్తా: డైరెక్టర్‌

Director Jeevan Reddy Interesting Comments On Chor Bazaar Movie - Sakshi

Director Jeevan Reddy Interesting Comments On Chor Bazaar Movie: ‘‘నాకు సక్సెస్‌ను క్యాష్‌ చేసుకోవడం రాదు. ‘జార్జ్‌ రెడ్డి’ తర్వాత ఆ క్రేజ్‌ను ఉపయోగించుకోలేదని నా ఫ్రెండ్స్‌ అంటుంటారు. మనసుకు నచ్చిన కథలను తెరకెక్కిస్తుంటాను. లెక్కలు వేసుకోవడం రాదు.. సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటాను’’ అన్నారు డైరెక్టర్‌ జీవన్‌ రెడ్డి. ఆకాష్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో వీఎస్‌ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చోర్‌ బజార్‌’ ప్రేమకథా చిత్రం అయినప్పటికీ కథనం ఒక విలువైన డైమండ్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ కమర్షియల్‌గా సాగుతాయి. నేను అనుకున్న బచ్చన్‌ సాబ్‌ పాత్రకు ఆకాష్‌ వంద శాతం న్యాయం చేశాడు. ఈ చిత్రకథని పూరి జగన్నాథ్‌గారు వినలేదు.. మాపై అంత నమ్మకం ఆయనకు. ఇండస్ట్రీలో నాకు గురువు ఆర్జీవీ (రామ్‌గోపాల్‌ వర్మ). అయితే ప్రతి దర్శకుడితో స్నేహం ఉంది’’ అని పేర్కొన్నారు.

చదవండి: స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్‌ వద్ద పరీక్షలు
సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్‌
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ హీరో నరేష్‌ !

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top