టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ..

Intresting Conversation Between MLA Jeevan Reddy And Komatireddy Rajagopal Reedy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్మూర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల మధ్య ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సీఎల్పీ కార్యాలయంలో శనివారం వీరిద్దరూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. ‘జీవన్.. మా గురించి చాలా మాట్లాడుతున్నావు ఏంటి..?’ అని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందిస్తూ.. ‘అవును మా బాస్‌ను ఒక్క మాట అంటే వంద మాటలంటాం.. బరాబర్‌గా అంటాం’ అని అన్నారు. నేను సీఎం కేసీఆర్‌ను ఏం అనలేదు.. మీడియా వాళ్లు కేసీఆర్‌కు హెల్త్‌ బాగోలేదని చెబితే.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసి ఏమో అని మాత్రమే అన్నాననిని రాజగోపాల్ రెడ్డి జవాబిచ్చారు. 

అసలు సీఎం కేసీఆర్ హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని, తనకు పైనుంచి ఆదేశాలు ఉన్నందునే నిన్ను తిట్టాను అని జీవన్ రెడ్డి తెలిపారు. మేము తెలంగాణ తెస్తే మమ్మల్నే తిడుతున్నారని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసినందుకు తమ కుటుంబంపై తమకు గౌరవం ఉందని జీవన్‌ రెడ్డి తెలిపారు. సోనియా గాంధీని ఎప్పుడూ విమర్శించమని, ఎందుకంటే ఆమె తెలంగాణ ఇచ్చిన దేవత.. తాము కేవలం రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను తిడతామన్నామని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రాదని, మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని జీవన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
చదవండి: హైదరాబాద్‌: మహిళలపై వేధింపులు తగ్గట్లే! 

గెలిస్తే మాకేంటి, ఓడితే మాకేంటి
మరోవైపు సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై .జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  ఈ మేరకు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వ‌ద్ద శ‌నివారం ఆయ‌న మాట్లాడుతూ.. జనరల్ హెల్త్ చెకప్ కోసం సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లార‌ని, కానీ 5 రాష్ట్రాల న్నారని ధ్వజమెత్తారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే త‌మకేంట‌ని.. ఓడితే త‌మకేంట‌న్నారు. ఆ రెండు పార్టీలు కట్టగట్టుకొని ఎక్కడైనా దూకి చస్తే త‌మకేంట‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ది మామూలు గుండె కాద‌ని, కోట్లాది మంది అభిమానం ప్రజల అభిమానం పొందిన గుండెని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించిన ఉక్కు గుండె అని చెప్పుకొచ్చారు.
చదవండి: కరెంట్‌, మంచి నీళ్లు బంద్‌ చేస్తాం.. కేటీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top