రైతు డిక్లరేషన్‌ కాదు.. కాంగ్రెస్‌ ఫ్రస్ట్రేషన్‌: జీవన్‌రెడ్డి 

Jeevan Reddy Criticized Congress Leader Rahul Gandhi Statement - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ చేసిన ప్రకటన రైతు డిక్లరేషన్‌ కాదని, అధికారంలో లేకపోవడంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్‌ అని పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మె ల్యే కె.విద్యాసాగర్‌రావుతో కలసి శనివారం టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాహుల్‌ ఢిల్లీ వాసి, రేవంత్‌ గల్లీ సన్నాసి.. ఇద్దరూ కాంగ్రెస్‌కు ఐరన్‌ లెగ్‌లు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో చెత్తా చెదారం ఉందని, ఆ డిక్లరేషన్‌ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు వర్తించదా అని ప్రశ్నించారు. తెలంగాణను కేసీఆర్‌ పర్యాటక రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో బీజేపీ నేత జేపీ నడ్డా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ తదితరులు పర్యాటకుల్లా వస్తున్నారన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top