కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా! | Congress Leader Jeevan Reddy Shocking Comments On Party Again | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా!

Apr 1 2025 3:37 PM | Updated on Apr 1 2025 4:27 PM

Congress Leader Jeevan Reddy Shocking Comments On Party Again

జగిత్యాల జిల్లా:  ‘కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా’  అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం మరోసారి చర్చకు దారి తీసింది.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన ఓ కార్యకర్తతో జీవన్ రెడ్డి  అన్న మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. తన మనసులోని మాటను బయటపెట్టారు.

ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి.  కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మపురి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ తో  అవాక్కయ్యేలా మాట్లాడారు జీవన్ రెడ్డి. ‘ నేనే మీ పార్టీలో వద్దామనుకున్నా.. ఏదో ఉందని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావ్’ అంటూ పార్టీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాచు.

‘మీ పార్టీకి.. మీకో దండం’ అంటూ ఆనాడే వ్యాఖ్యలు
తన ముఖ్యఅనుచరుడైన గంగారెడ్డి గతేడాది హత్య గావించబడ్డ దగ్గర్నుంచీ జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీపై  అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉన్న సమయంలోనే తన అనుచరుడు హత్యకు గురి కావడంతో జీవన్ రెడ్డి బహిరంగంగానే పార్టీ తీరుపై నిరసన స్వరం వినిపిస్తున్నారు.  ‘ ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకునైనా సేవ చేస్తా. మీ పార్టీకి మీకో దండం అంటూ గతంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్నో అవనానాలు భరించామని. ఇక భౌతికంగా లేకుండా చేయలేని చూస్తే చేసేది  ఏముంటుందటూ జీవన్ రెడ్డి ఆ సమయంలో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement