కాంగ్రెస్‌కు గుడ్‌బై.. రేవంత్‌పై జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | Jagtial Jeevan Reddy Sensational Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు గుడ్‌బై.. రేవంత్‌పై జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Mar 25 2026 1:16 PM | Updated on Mar 25 2026 3:24 PM

Jagtial Jeevan Reddy Sensational Comments On Revanth Reddy

సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీమంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. మూడు వేల మందితో కలిసి జీవన్‌ రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌పై కూడా సంచలన ఆరోపణలు చేశారు. 

అనంతరం, జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ..‘శాసనమండలిలో ఏకైక సభ్యుడిగా నేనే నాయకుణ్ణి, నేనే సభ్యుడిగా పోరాడాను. 1995 ఎన్నికల్లో టీడీపీ గాలిలో కూడా జగిత్యాల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అది నాటి కాంగ్రెస్ ఐక్యతకు నిదర్శనం. చంద్రబాబు స్వయంగా వచ్చినా, ఎంఐఎం మద్దతిచ్చినా 93 ఎన్నికల్లో 75 శాతం ఓట్లతో నన్ను గెలిపించారు. 2006, 2008 రెండు ఉప ఎన్నికల్లో కూడా నాటి తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఏఐసీసీ ఎంపిక చేస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఒంటిచేత్తో పోరాటం చేశాను.

పది స్థానాల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అనైతికం. దశాబ్ద కాలంగా చేసిన పోరాటంపై ఆధిపత్యం చెలాయించడమే అవుతుంది. అంతకుముందు ఆధిపత్యం చేసిన వాళ్లే మళ్లీ ఆధిపత్యం చేయడమేంటి?. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై సమావేశం గాంధీభవన్‌లో నిర్వహిస్తే అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వస్తారు?. పార్లమెంట్ వంటి అత్యున్నత ఎన్నికల్లో ఒక పార్టీలో గెల్చి దానికి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఏం సంకేతం ఇస్తుంది?. సరే అభివృద్ధిలో కలిసి వస్తే పర్లేదు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వారి జోక్యం ఏంటి?.

మహేష్ కుమార్ గౌడ్, వంశీచందర్ వస్తే ఏంటి పరిష్కారం?. నా అనుచరుడిని నడిబజారులో దారుణ హత్య చేస్తే ఓపిక పట్టాలా?. మాకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై ఓపిక పట్టాలా?. ఎందుకు ఓపిక పట్టాలి?. కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి నోటితో నవ్వుతూనే నొసటితో వెక్కిరించే విధంగా సాగింది. శాసనసభ్యుడిగా, మండలి సభ్యుడిగా ఒంటరి పోరాటం చేసిన నేను కనీసం మంత్రి పదవికి అర్హుడిని కాదా?. ఒకనాడు పీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న నేను ఇవాళ నా హక్కుల కోసం నియోజకవర్గంలో పోరాడాల్సి రావడం ఎంత దౌర్భాగ్యం?. జీవన్ రెడ్డిని తొక్కేయాలనేది ఇవాళ కాంగ్రెస్ యోచన.

కాంగ్రెస్ కోసం కష్టపడ్డా.. కార్యకర్త హత్యపై రేవంత్ మౌనం

చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేసిన నేను ఇక నుంచి రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా. ఇంకెంత కాలం ఈ అవమానాలు?. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరూ ఎదుగొద్దని రేవంత్ ఇదంతా చేస్తున్నారా?. రాహూల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే నాలాంటి వాడిని అణగదొక్కుతారా?. వేం నరేందర్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement