breaking news
Drought
-
AP: 388 మండలాల్లో కరువు
సాక్షి, అమరావతి: కరువు మండలాలపై ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచింది. వానల్లేక పొలాలు ఎండిపోతున్నా.. రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నా పట్టించుకోకుండా తీరిగ్గా స్పందించింది. రాష్ట్రంలో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ గురువారం జీవో జారీ చేసింది. ఇందులో 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్టు పేర్కొంది. ప్రకటించిన మండలాల్లో దాదాపు మూడొంతులు తీవ్ర కరువులోనే ఉన్నాయి. లోటు ఆగస్టులోనే స్పష్టం.. ప్రకటన అక్టోబర్‌లో.. కరువు అంచనాకు తీసుకున్న వర్షపాతం లెక్కలు ఆగస్టు 31తోనే ముగిసినా.. కరువు మండలాలను ప్రకటించడానికి నెల రోజుల సమయం తీసుకోవడం గమనార్హం. వర్షాభావ తీవ్రత ఆగస్టు నెలాఖరుకే స్పష్టమైంది. అయినా సర్కారు వెంటనే కదల్లేదు. కరువు ప్రతిపాదనలు పంపాలంటూ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సెప్టెంబర్ 18న మెమో పంపింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కరువు కమిటీ సెప్టెంబర్ 30న ఒక్క వర్చువల్ భేటీలో పరిశీలించి 21 జిల్లాల్లోని మండలాలను సిఫార్సు చేసింది. మర్నాడే జీవో ఇచ్చింది. నెలంతా నాన్చి, చివర్లో హడావుడిగా ప్రక్రియను ముగించారు. ఇదేనా ముందస్తు? మాన్యువల్ ప్రకారం ఖరీఫ్ కరువును అక్టోబర్ 31లోగా ప్రకటించాలని చెబుతున్న ప్రభుత్వం తాము ముందుగానే ప్రకటించామని చెప్పుకుంటోంది. దీనికి ముందస్తు కరువు ప్రకటన అని పేరు కూడా పెట్టింది. కానీ అక్టోబర్ 31 అనేది చివరి గడువు మాత్రమే. కరువు సూచికలు కనిపించిన వెంటనే ప్రకటించాల్సి ఉంటుంది. జూన్ నుంచి వానలు లేక మూడు నెలలుగా నష్టపోతున్న రైతులకు అక్టోబర్‌లో వచ్చిన ప్రకటన ముందస్తు ఎలా అవుతుందన్నది అసలు ప్రశ్న. ఆలస్యానికి మూల్యం రైతులదే కరువు ప్రకటన ఆలస్యమైతే దాని ఆధారంగా అందాల్సిన సాయం కూడా ఆలస్యమవుతుంది. రుణాల రీషెడ్యూల్, ఇన్పుట్ సబ్సిడీ, కేంద్రానికి నివేదిక, ఉపాధి హామీ అదనపు పనిదినాలు అన్నీ ఈ ప్రకటనతోనే ముడిపడి ఉన్నాయి. వర్షాభావం స్పష్టమైన వెంటనే ప్రకటించి ఉంటే ప్రత్యామ్నాయ పంటల విత్తనాల సరఫరా వంటి చర్యలకు అవకాశం ఉండేదని రైతు సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ప్రకటన వచ్చినా సాయం మాటే లేదు నెల ఆలస్యంగా వచ్చిన జీవోలోనూ రైతుకు ఊరటనిచ్చే మాట లేదు. మండలాల జాబితా, గెజిట్ ప్రచురణ ఆదేశాలు తప్ప ఇన్పుట్ సబ్సిడీ ఎంత, ఎప్పుడు, పంట నష్టం అంచనా ఎప్పటిలోగా, రుణాల రీషెడ్యూల్, వడ్డీ మాఫీ, కేంద్ర సాయం కోసం నివేదిక, పశుగ్రాసం, తాగునీటి ఏర్పాట్లు వంటి ఏ ఒక్కదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ప్రకటనకే నెల పడితే, సాయానికి ఇంకెన్ని నెలలు పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ, ప్రకాశంలో మరీ దారుణం తీవ్ర కరువు మండలాలు అత్యధికంగా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లోనే ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 28, అనంతపురంలో 27, నంద్యాలలో 26, అన్నమయ్యలో 25, చిత్తూరులో 24, మార్కాపురంలో 19, ప్రకాశంలో 18, కర్నూలులో 15, వైఎస్సార్ కడపలో 14 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో 22 మండలాలు తీవ్ర కరువులో ఉన్నాయి. కుప్పం.. అమరావతిలోనూ కరువే సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం తీవ్ర కరువు జాబితాలో ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రకటించిన 24 మండలాలూ తీవ్ర కరువులో ఉన్నవే. రాజధాని అమరావతి ప్రాంతమైన తుళ్లూరు మండలం కూడా తీవ్ర కరువు జాబితాలో ఉంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం మధ్యస్థ కరువులో ఉంది. డెల్టా శివారు భూములకూ దెబ్బ సాగునీటికి కొదవలేదనుకునే కృష్ణా డెల్టా సైతం కరువు జాబితాలో చేరింది. కృష్ణా జిల్లాలో 8 మండలాలు తీవ్ర, 9 మండలాలు మధ్యస్థ కరువులో ఉన్నాయి. తీవ్ర కరువు జాబితాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, నాగాయలంక, కోడూరు వంటి మండలాలు డెల్టా చివరి ప్రాంతాలే. బాపట్ల జిల్లాలో ప్రకటించిన 15 మండలాలూ తీవ్ర కరువు కిందే ఉన్నాయి. జాబితాలో లేని 300 మండలాలు రాష్ట్రంలో 688 మండలాలు ఉంటే కరువు జాబితాలో చోటు దక్కింది 388కే. కరువు ఛాయలు ఉన్నా మిగతా 300 మండలాల రైతులకు మొండిచేయి చూపారని రైతు సంఘాలు చెబుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు కరువు జాబితాలో చోటు ఇవ్వలేదు.సగం సీమలోనే.. 388 కరువు మండలాల్లో 186 రాయలసీమలోనే ఉన్నాయి. తీవ్ర కరువు మండలాలు 283 అయితే, వాటిలో 159 సీమలోనే ఉన్నాయి. అన్నీ తీవ్రమే అనకాపల్లి, బాపట్ల, మార్కాపురం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రకటించిన మండలాలన్నీ తీవ్ర కరువు కిందే ఉన్నాయి అగ్రస్థానం కడప అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 37 మండలాలు కరువు జాబితాలో ఉన్నాయి. -
ఇక కరువు మండలాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను గుర్తించి కరువు మండలాలుగా ప్రకటించేందుకు కసరత్తు ప్రారంభమైంది. వర్షపాతం లోటు, సాగు విస్తీర్ణం తగ్గడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మండలాల వారీగా పరిస్థితిని అంచనా వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, మార్కెటింగ్ ఎండీ రాహుల్‌రాజ్, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా తదితర అధికారులతో మంత్రి సమీక్షించారు. కేంద్ర వ్యవసాయశాఖ రూపొందించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం కరువు పరిస్థితులను గుర్తించాల్సి ఉంటుందన్నారు. కేవలం వర్షపాతం లోటును ప్రాతిపదికగా తీసుకోకుండా.. వర్షపాతం వ్యత్యాసం, ప్రామాణిక వర్షపాత సూచీ (ఎస్పీఐ), పొడి కాలం, విత్తిన విస్తీర్ణం, మొక్కల ఆరోగ్య సూచీలు (ఎన్‌డీవీఐ/ఎన్డబ్ల్యూఐ), వృక్ష కవచ సూచీ (వీసీఐ), నేల తేమ వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, భూగర్భజలాల పరిస్థితి, ప్రవాహ జలాలు, పశుగ్రాసం లభ్యత, తాగునీటి పరిస్థితి, ఉపాధి అవకాశాలు, ప్రజల వలసలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ అంశాల ఆధారంగా వ్యవసాయశాఖ వద్ద ఉన్న సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందించి కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ 100 శాతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. -
కరవు కోరలు.. నీటి కోత.. బిల్డింగ్ నిర్మాణాలకు బ్రేక్!
రాష్ట్రంలో ముదిరిన కరవు పరిస్థితులు, నీటి ఎద్దడి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. పట్టణ ప్రాంతాల్లో 10 శాతం మేర తాగునీటి సరఫరాలో కోత విధించడంతో పాటు తీవ్ర నీటిభయాలున్న ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. కరవు నివారణ చర్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మొదటి సమావేశంలో ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.వర్షాకాలంలో దాదాపు 18 శాతం వర్షపాత లోటు నమోదవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని 358 తాలూకాలకు గాను 265 తాలూకాల్లో కరవు పరిస్థితిని అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పట్టణ నీటి సరఫరాలో 10 శాతం కోతపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జలవనరుల శాఖను రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే ఆదేశించారు. మరోవైపు కరవు ప్రాంతాల్లో వ్యక్తిగత, వాణిజ్య భవన నిర్మాణాలు, సిమెంట్ రోడ్ల పనులను తక్షణమే నిలిపివేయాలని పర్యావరణ మంత్రి పంకజా ముండే అధికారులను ఆదేశించారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊరటపట్టణాల్లో పొదుపు చర్యలు చేపడుతూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రూ.6,728 కోట్లు కేటాయించినట్లు ఉపాధి హామీ శాఖ మంత్రి భరత్ గోగావాలే వెల్లడించారు. ఈ నిధులతో నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 375 రకాల పనులను చేపట్టనున్నారు.పశుగ్రాసానికి ప్రాధాన్యంతాగునీరు, పశుగ్రాసం సరఫరాకే తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. చెరువులు, కుంటల్లోని నీటిని తాగునీటి అవసరాలకే పరిమితం చేయనున్నారు. పశుగ్రాస కొరతను ఎదుర్కొనేందుకు ముగ్గురు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసి రాజస్థాన్ తరహా నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేస్తున్నారు. కరవు సహాయక చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వార్ రూమ్‌లు ఏర్పాటు కానున్నాయి. రైతులకు పంట నష్టపరిహారం అందిస్తూనే వ్యవసాయ రుణాల వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసే అంశంపై ఆర్బీఐతో సంప్రదింపులు జరపాల్సిందిగా సీఎస్‌ను ప్రభుత్వం ఆదేశించింది.ఇదీ చదవండి: మరింత అలసిపోయిన పసిడి ధర! -
ఎల్ నినో సంక్షోభం: 5 కోట్ల మందికి ‘ఒక్క పూట’ కూడా కష్టమే..
ఆసియాను భారీ వాతావరణ ముప్పు అతలాకుతలం చేయనుందా? సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావం కలిసి ఈ ఏడాది ఎల్ నినోను మరింత శక్తిమంతంగా మారుస్తున్నాయన్న హెచ్చరికలు ఆందోళనకరంగా మారాయి. దీని ప్రభావంతో ఆసియాలో సుమారు 5 కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూపీ) హెచ్చరించింది. భారత్, శ్రీలంకతో పాటు పలు దేశాలు ఇప్పటికే కరువు, నీటి కొరత, ఆహార భద్రతపై ముందస్తు చర్యలు ప్రారంభించాయి.ఎల్ నినో ఎందుకింత ప్రమాదకరం?ఐక్యరాజ్యసమితి వర్గాల హెచ్చరికల ప్రకారం ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా వేడెక్కుతున్న నీరు, వాతావరణ మార్పులు కలిసి పరిస్థితిని క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో గత కొన్ని దశాబ్దాల రికార్డులను అధిగమించే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కూడా ఎల్ నినో ప్రభావం క్రమంగా తీవ్రతరం అవుతున్నదని హెచ్చరించారు. వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు వ్యవసాయం, నీటి లభ్యత, ఆహార సరఫరాపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది.భారత్‌లో ఇప్పటికే కనిపిస్తున్న సంకేతాలేంటి?భారత్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతున్న రుతుపవన కాలంలోనే కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవగా, సెప్టెంబర్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరవు పరిస్థితుల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ పంటలైన వరి, పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్నల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉండటంతో తక్కువ ఆదాయ, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పెరగవచ్చని అంచనా.భారత్ ఏం చేస్తోంది?శాస్త్రవేత్తల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి పెట్టింది. రైతులకు రక్షణ చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 350కిపైగా జిల్లాల్లో నీటి సంరక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. తక్కువ నీటితో పండే, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలైన పప్పుధాన్యాలు, సజ్జలు వంటి వాటిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.శ్రీలంకలో నీటి కష్టాలు ముదిరాయా?ఎల్ నినో ప్రభావంతో శ్రీలంకలో గత దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నట్లు నివేదిక తెలిపింది. 1.6 లక్షలకుపైగా ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. పలు జలాశయాలు ఎండిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. యాలా నేషనల్ పార్క్ వంటి పర్యాటక ప్రాంతాలను సైతం మూసివేయాల్సి వచ్చింది. వన్యప్రాణులకు నీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో చెరువులు ఎండిపోవడంతో వేలాది చేపలు మృతి చెందాయి. సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే ప్రణాళికపై శ్రీలంక విపత్తు నిర్వహణ సంస్థ పనిచేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆ సామర్థ్యం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.ఆగ్నేయాసియాలో బియ్యం కొరత ముప్పు?ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఆహార భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈసారి బియ్యం ఉత్పత్తి 8 నుంచి 10 శాతం వరకు తగ్గవచ్చని అంచనాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కుటుంబ ఆదాయంలో గణనీయమైన భాగం ఆహారానికే ఖర్చవుతుంది. పంట దిగుబడులు తగ్గి ధరలు స్వల్పంగా పెరిగినా కుటుంబాలపై ఆర్థిక భారం పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహార భద్రతను కేవలం వ్యవసాయ సమస్యగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పలు దేశాలు పరిగణిస్తున్నాయి. సేంద్రియ ఎరువులు, పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే చర్యలు కూడా చేపడుతున్నాయి.వేడి, భారీ వర్షాలు.. తుపాన్ల ముప్పు కూడా?తూర్పు ఆసియాలో ఎల్ నినో ప్రభావం కేవలం వర్షాభావానికే పరిమితం కాకుండా తీవ్ర వేడి, భారీ వర్షాలు, తుపాన్ల రూపంలోనూ కనిపించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. దక్షిణ కొరియాలో జూలై అత్యంత పొడి నెలగా నమోదైన తర్వాత భారీ వర్షాలు కురిశాయి. 18 ఏళ్ల తర్వాత అక్కడ హీట్‌వేవ్ హెచ్చరిక వ్యవస్థను మార్చారు. జపాన్‌లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైన రోజును అధికారికంగా ‘క్రూరమైన వేడి’ రోజుగా గుర్తించారు. సూపర్ టైఫూన్ల ముప్పు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హాంకాంగ్‌లో తీవ్ర వేడి సమయంలో ఉద్యోగులకు చల్లదనం కల్పించే ఏర్పాట్లు కంపెనీలకు తప్పనిసరి చేశారు. చైనాలో 100 రోజుల వాతావరణ ప్రమాద నివారణ కార్యక్రమం ప్రారంభించగా, తైవాన్ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే పరిస్థితులపై సిమ్యులేషన్ నిర్వహించింది. మొత్తంగా అల్ నినో ప్రభావం ఆహారం, నీరు, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థలపై ఒకేసారి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు కీలకంగా మారాయి.ఇదీ చదవండి: ‘మరో రోహిత్ వేముల..’ దళిత పీహెచ్డీ విద్యార్థి ఆవేదన -
కరువు ప్రకటనపై దిగివచ్చిన బాబు సర్కార్
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు కరువు మండలాల ప్రకటనకు బాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మండలాల వారీగా నష్టాల అంచనాకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 24లోగా కరువు పరిస్థితులపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాన్ని కరువు కమ్మేసినా బాబు ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య తీరును ఎండగట్టారు. తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మొద్దునిద్ర వీడకపోతే ఆందోళనబాట పడతామని హెచ్చరించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎట్టకేలకు కరువు మండలాల ప్రకటనపై కసరత్తు ప్రారంభించింది. 54.3 శాతం లోటు వర్షపాతం..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్ 1 నుంచి సెప్టెంబర్ 20కి 54.3 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు రెవెన్యూ(విపత్తు నిర్వహణ) శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ప్రకటన చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ముందస్తు కరువు పరిస్థితుల అంచనా చేపట్టాలని సూచించింది. కరువు ప్రాంతంగా గుర్తించేందుకు వర్షాభావంతో పాటు వ్యవసాయ పంటలు, భూస్థితి తదితరాలపై చూపిన ప్రభావాన్ని కూడా లెక్కించాలని ఆదేశించింది. ఏ మండలంలో వర్షాభావం ఎక్కువగా ఉంది? ఎక్కడ సాగు దెబ్బతింది, ఏఏ పంటలు ఏంత మేర ఎండిపోయాయి? దిగుబడులు ఏ మేరకు తగ్గే పరిస్థితి ఏర్పడిందో పక్కాగా డేటా సేకరించాలని స్పష్టం చేసింది. ఈ నెల 24లోగా జిల్లాల వారీగా కరువు పరిస్థితులపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. నగరాలు, పట్టణాలు, మండలాలకు సంబంధించి నిర్దేశిత నమూనాల్లో కరువు ప్రతిపాదనలను పంపించాలని సూచించింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు నమోదైన వర్షపాతంతో పాటు పొడి వాతావరణం ప్రభావ సూచికల వివరాలను పరిగణనలోకి తీసుకుని అంచనా వేయాలంది. కరువు ప్రతిపాదనలలో క్షేత్రస్థాయి వాస్తవ నివేదికను కూడా పొందుపర్చాలని ఆదేశించింది. పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయి ఫొటోల ద్వారా నమోదు చేయాలని పేర్కొంది. ఆ ఫొటోలను, వివరాలను జిల్లా స్థాయిలో భద్రపరచాలని ఆదేశాలిచ్చింది. మండలాల వారీగా జిల్లాల నుంచి అందే ప్రతిపాదనల ఆధారంగా కరువు మండలాల ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈనెల 30లోగా అన్నీ సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. -
78% మండలాల్లో కరువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నాలుగింట మూడొంతుల ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుపోయింది. మొత్తం 663 గ్రామీణ మండలాలకుగాను ఏకంగా 78 శాతం మండలాలు అంటే.. 513 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయి. వర్షాభావ పరిస్థితులపై సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఏపీలోని 28 జిల్లాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 513 మండలాల్లో కరువు నెలకొందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.వీటిలో 268 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా, 245 మండలాల్లో మోస్తరుగా ఉందన్నారు. కరువు పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలనను వ్యవసాయ శాఖ చేపడుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయి బృందాలు పంట నష్టం, దిగుబడి నష్టాన్ని పరిశీలిస్తాయని, అనంతరం వ్యవసాయ శాఖ క్షేత్ర పరిశీలన నివేదికను జిల్లా కలెక్టర్లకు సమర్పిస్తుందని అధికారులు చెప్పారు. కరువు ప్రతిపాదనలను రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖకు కలెక్టర్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. దీనికి సెపె్టంబర్ 24 చివరి తేదీగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలను సెపె్టంబర్ 29న రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న కరువు మండలాలు ప్రకటించండి.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ప్రతీనెలా కేంద్రానికి నివేదికలు పంపించాలని ఆయన సూచించారు. ఉద్యాన పంటలపై ప్రభావం.. ఉద్యాన పంటలు కాపాడటానికి ఇప్పటికే రూ.190 కోట్లు కేటాయించామని, వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమీక్షలో సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న పంటలు హైరిస్క్ కేటగిరీలో ఉన్నాయని అధికారులు తెలిపారు. వర్షాభావంతో 17,916 హెక్టార్లలోని నారింజ, బత్తాయి, మామిడి, ఎర్ర మిరప, ఉల్లి, కూరగాయల పంటలు ప్రభావితం కానున్నాయని తెలిపారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు..ఇక రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ప్రజలు ఇబ్బందిపడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాగునీటికి బోర్లపైన ఆధారపడే ప్రాంతాలకు అవసరమైతే అదనంగా ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేలా చూడాలన్నారు. విశాఖలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటినుంచే కార్యాచరణ చేపట్టాలన్నారు. విశాఖ సమీపంలోని రిజర్వాయర్లు నింపేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టే అవకాశాలను పరిశీలించాలన్నారు. మేఘాద్రిగడ్డకు పోలవరం ఎల్ఎంసీ నుంచి ప్యాకేజీ–8 కింద పైపులైన్ ద్వారా నీటిని తరలించే పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. -
వైఎస్ జగన్ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ/గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జారీ చేసిన అల్టిమేటం నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో కదలిక కనిపించింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, కరువు మండలాలను ప్రకటించాలని జగన్ డిమాండ్ చేసిన మరుసటి రోజే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన సీఎం.. అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించనున్నట్లు శనివారం స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతుల సమస్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై వైఎస్ జగన్ ఈ నెల 17న పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కరువు మండలాలను ప్రకటించకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.వైఎస్ జగన్ ఫైర్రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై జగన్ సమీక్షించారు. కరువు కాలంలో రైతులను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. ఎల్‌నినో కంటే ‘ఎల్లో నినో’తోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జూన్ నుంచి వర్షపాతం లోటు కొనసాగుతున్నప్పటికీ కరువు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే సాగు గణనీయంగా తగ్గిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.చంద్రబాబు ప్రకటనఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. సెప్టెంబర్ 24 నాటికి జిల్లా స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, సెప్టెంబర్ 29 నాటికి రాష్ట్రస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని సూచించారు.రాష్ట్రంలో 513 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పంటల పరిస్థితి, వర్షపాతం లోటు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.హైరిస్క్ కేటగిరీలో 1,357 ఆర్ఎస్కేలురాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పరిస్థితులపై ప్రభుత్వం రిస్క్ ఆధారిత అంచనాలు చేపట్టింది. 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో పంటలను హైరిస్క్ కేటగిరీలో గుర్తించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఖరీఫ్‌లో వర్షపాతం లోటు నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు పంటల పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.తాగునీటి సమస్యపైనా సమీక్షఇదిలా ఉండగా.. సాగుతో పాటు తాగు నీటి విషయంలోనూ జగన్ వార్నింగ్ పని చేసింది. విశాఖపట్నంలో తాగునీటి సమస్యపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులతో పాటు తాగునీరు, సాగునీటి లభ్యతపై కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.ఇదీ చదవండి: బొత్స కూతురికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్ -
కరువుకు కేరాఫ్.. ఈ వాటర్ ‘మ్యాన్’
సాక్షి, అమరావతి: గుక్కెడు తాగు నీటి కోసం రాష్ట్రంలో పల్లెలు అల్లాడుతున్నాయి.. పొలాలకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.. నీరు, గడ్డి లేక పశువుల డొక్కలు ఎండుతున్నాయి.. అయినా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనను తాను వాటర్‌మ్యాన్ అని కీర్తించుకొంటూ సొంత పార్టీ నేతలతో సన్మానాలు చేయించుకోవడం చూస్తే.. అచ్చం అలనాటి నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారు. నాడు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. నేడు రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు సత్కారాలు చేయించుకుంటున్నారని మండిపడుతున్నారు. వర్షాభావం వల్ల పంటలకు ఈ ఖరీఫ్‌లో నీరు ఇవ్వలేమని, రైతులు వరి పంట వేయవద్దని చెప్పిన చంద్రబాబు.. వాటర్‌మ్యాన్ అని తనకు తాను ప్రచారం చేసుకోవడంపై జనం విస్తుపోతున్నారు. ఒక ఆంగ్ల పత్రికలో వాటర్‌మ్యాన్ అని ఒక పదం రాయించుకొని, ఆ పత్రిక కీర్తించిందని ఆయన టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయనే చెప్పుకోవడం.. వెనువెంటనే ఆయన కేబినెట్లోని అత్యుత్సాహపు మంత్రి ఒకరు చంద్రబాబును అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం, నాయకులంతా లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం, ఎల్లో మీడియా వాటిని ఊదరగొట్టడం అంతా ఒక టీవీ స్కిట్లా నిర్వహించారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎప్పుడూ వినిపించే మాట. 30 ఏళ్లుగా ఇది అనేకసార్లు రుజువైంది. ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారీ రైతు కళ్లలో నీళ్లే తప్ప పొలంలో నీళ్లు పారవు. 1995–2004 మధ్య వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారు. విద్యుత్ చార్జీలు పెంచి రైతు నడ్డి విరిచారు. అప్పుడూ కరువు వచ్చింది. 1997–98లో రైతు ఆత్మహత్యలు ఉప్పెనలా జరిగాయి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తే ఆ ప్యాకేజీ కోసం ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించి అన్నదాతను అవమానించిన గొప్ప మనిషి చంద్రబాబు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014–2019లో మళ్లీ ఆయన అధికారంలోకి రాగానే మళ్లీ కరువు వచ్చింది. 2024లో మళ్లీ చంద్రబాబు అధికారపీఠంపై కూర్చోగానే రాష్ట్రంలో కరువు ఛాయలు మొదలయ్యాయి. రెండేళ్లలో తీవ్ర కరువు వచ్చేసింది. వర్షాకాలంలో వర్షాలే లేవు. అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అడుగంటాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీళ్లు లేవు కాబట్టి ఈ ఖరీఫ్‌కు సాగు నీరు ఇవ్వలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. కృష్ణా డెల్టాలో వరి సాగుకు చుక్క నీరు వదిలే పరిస్థితి లేదని తేల్చేశారు. పంటలకు నీళ్లు ఇవ్వలేని చంద్రబాబును రైతులు తిట్టిపోస్తున్నారు. నారుమళ్లు వేసిన తాము ఏమవ్వాలని ప్రశి్నస్తున్నారు. కరువు మండలాలను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జనం నీటి కోసం అల్లాడుతుంటే పట్టించుకోకుండా తనను తాను వాటర్మ్యాన్గా భజన చేయించుకోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంటలకు నీరు ఇవ్వలేమని చెప్పిన బాబు వాటర్‌మ్యాన్ ఎట్లా అవుతారని ప్రశి్నస్తున్నారు. ఇది దగా కాదా? ప్రజలు ఇవి ఏమీ తెలియని పిచి్చవాళ్లని ఆయన అనుకుంటున్నారా అని మేధావులు విశ్లేషిస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్.. కరువుకు పర్యాయపదంగా మారిన తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలనే ఆతృతలో తాను వాటర్‌మ్యాన్ అని రాయించుకుని, డప్పు కొట్టుకుంటున్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు జలహారతి పడుతున్నారు. ప్రాజెక్టులను వదిలేసి పర్యాటకం, హైటెక్ వెంట పరుగులు తీసిన బాబు ఇప్పుడు పాయకరావుపేటలో నీటికి సాష్టాంగ నమస్కారం చేసి తన పబ్లిసిటీ గేమ్‌ను మరింత రక్తికట్టించారు. తాను చేయని పనులను చేసినట్టు, తాను పట్టించుకోని ప్రాజెక్టులను తానే కట్టినట్టు, తనవల్ల ఆగిన నీళ్లను తానే తెచి్చనట్టు డప్పు కొట్టుకుంటున్నారు. ఆ డప్పుకు పార్టీ నేతలు, ఎల్లో మీడియా కోరస్ పలుకుతున్నాయి. ప్రజలు పిచ్చివాళ్లు కాదు చంద్రబాబూ వాటర్‌మ్యాన్ బిరుదుకు గీటురాయి ఒక్కటే. కుళాయి తిప్పితే నీళ్లు రావాలి. కాలువలో నీళ్లు పారాలి. రైతు పొలంలో పంట నిలబడాలి. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఇవేమీ ఇంతకు ముందు జరగలేదు.. ఇప్పుడూ జరగడంలేదు. అనేక గ్రామాల్లో గుక్కెడు తాగు నీరు లేక జనం విలవిల్లాడుతున్నారు. పంటలు సాగు చేయకుండా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం మంత్రివర్గం, పార్టీ సమావేశాల్లో అపర భగీరథుడిగా బిల్డప్‌లు ఇచ్చుకుంటూ స్టాండింగ్ ఒవేషన్లు, అభినందన తీర్మానాలు, భజనలు చేయించుకొంటున్నారు. అసలు టీడీపీ ఆఫీసులో నాయకత్వ సదస్సు దేనికి పెట్టారు? నేతల శిక్షణకా, మీకు జేజేలకా? అని జనం ప్రశి్నస్తున్నారు. ఒకవైపు వాటర్మ్యాన్గా భజన చేయించుకుని వెనువెంటనే అదే సమావేశంలో ఎల్‌నినోపై చర్చించడం చూస్తుంటే ఇదంతా పిచ్చివాళ్ల సదస్సులా ఉందనే సెటైర్లు పేలుతున్నాయి.ఏం చెప్పినా జనం నమ్ముతారనే భ్రమలో ఉన్నారా? తాను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు వాటర్‌మ్యాన్ బిరుదును స్వయంగా ప్రకటించుకున్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు, జనం పడుతున్న బాధలతో సంబంధం లేకుండా ఒక పత్రికలో ఒక పదం రాయించుకుని దాన్నే బిరుదుగా స్వీకరించి తీర్మానం, చప్పట్లు, సన్మానాల ద్వారా తనపై ఉన్న కరువు ముద్రను చెరిపేసుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. కానీ నారుమడి ఎండిపోయిన రైతులు, ఖాళీ బిందెలతో కిలోమీటర్లు నడిచే మహిళలు, కరువు మండలాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్న జనం మాత్రం చంద్రబాబు నాటకాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన స్కిట్లను నమ్మడంలేదు. -
వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే రెండు నెలలు కరువు మరింత తీవ్రతరమవుతుందని, ఈ నేపథ్యంలో వరి పంటకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సూచించింది. దేశంలోనే కరువు తీవ్రతలో ఆంధ్రప్రదేశ్ మొదటి లేదా రెండో స్థానంలో ఉందని, ఇప్పటికే 52 శాతం లోటు వర్షపాతం నమోదైందని సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి తెలిపారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరువు పరిస్థితులపై చర్చించినట్లు మంత్రి పార్థసార«థి మీడియా సమావేశంలో చెప్పారు. కరువు తీవ్రత నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా, నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఆరుతడి పంటలు వేసేలాగ రైతులకు అవగాహన కల్పించాలని సీఎం సూచించినట్లు మంత్రి చెప్పారు. సాధారణంగా ఖరీఫ్‌లో ఇప్పటికే 90 శాతం నాట్లు పడాల్సి ఉండగా కేవలం 60 శాతమే నాట్లుపడ్డాయని మంత్రి చెప్పారు. ఆరుతడి పంటలకు 90వేల కిలోల విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేయడానికి గాను రూ.90 కోట్ల మంజూరు చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. పంటలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పశుగ్రాసం, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 14,829 నివాస ప్రాంతాల్లోని 3.93 కోట్ల ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక రూపంలో చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైతే కొత్త బోర్లు వేయడం లేదా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం, అవసరమైతే ట్యాంకర్లను పొరుగు రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకోవడం వంటి చర్యలను తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి సీఎం లేఖ రాయనున్నట్లు మంత్రి చెప్పారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు» పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులోని పనులకు సంబంధించి మేఘా సంస్ధ అభ్యర్ధన మేరకు ధరల వ్యత్యాసం కింద జీఎస్టీతో కలిపి రూ.557.97 కోట్లకు అనుమతి మంజూరు. » ఆంధ్రప్రదేశ్ ‘‘పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025–29’’ ముసాయిదాకు ఆమోదం. ఈ విధానం కింద ఇక పౌల్ట్రీ ఫారాలు తప్పనిసరిగా రిజి్రస్టేషన్ చేసుకోవాలి. బయోసెక్యూరిటీని మెరుగుపరుస్తారు. పాలసీలో వివిధ అంశాల కింద మొత్తం రూ.657.18 కోట్ల మేర ఆర్థిక ప్రోత్సాహకాలను సూచించారు. ఇందులో వడ్డీ రాయితీ ఉంది. అయితే ప్రోత్సాహకాలు పౌల్ట్రీ రైతులందరికీ వర్తించవు. రిజి్రస్టేషన్, అర్హత, ధ్రువీకరణ, ఆర్థిక పరిమితులు, బడ్జెట్ లభ్యత ఆధారంగానే ప్రోత్సాహకాలు మంజూరు చేస్తారు. » ఏపీ ట్రాన్స్‌కో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి తీసుకున్న మధ్యకాలిక రుణం తిరిగి చెల్లింపునకు పూచీకత్తుగా రూ.950 కోట్లకు ప్రభుత్వ హామీ. » ఏపీపీడీసీఎల్ పీఎఫ్సీ ఆర్ఈసీ నుంచి పొందిన రూ.1,050 కోట్లు అప్పునకు సంబంధించి ఏపీజెన్కో హామీకి ప్రభుత్వం ఆమోదం. -
తీవ్రకరువులో కుంభకర్ణుడి మాదిరిగా చంద్రబాబు తీరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ సవాల్ విసిరితే ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలోనూ తీవ్ర కరువు నెలకొంది. అంత తీవ్ర పరిస్థితులు ఉన్నా చంద్రబాబు స్పందించడం లేదు. పైగా కుంభకర్ణుడిలా నిద్ర నటిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటిదాకా 52 శాతం వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అయినా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు....ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్‌లో తక్కువ వర్షాలు పడ్డాయని తెలుసు. జులైలోనూ అదే పరిస్థితి. అయినా పంటలకు నీళ్లు ఇస్తామని ఫోజులు ఇచ్చారు. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా.. ఎకరాకు 15 వేలు నష్టపోయారు. కరువు డేంజర్ బెల్స్ మోగుతున్న చంద్రబాబు కనీసం స్పందించడం లేదు అని వైఎస్ జగన్ అన్నారు.ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు నీటిని విడుదల విషయంలో చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటితో తెలంగాణ, ఇటు కరువులో రైతుల గురించి ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి మీద చంద్రబాబు దృష్టి సారించారని జగన్ ధ్వజమెత్తారు. అవకాశమున్నా పొత్తిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి?. రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదీ చదవండి: అదే గనుక జరిగితే వైఎస్సార్సీపీదే విజయం -
మరుగుతున్న మహాసముద్రం
సాక్షి, విశాఖపట్నం : మహాసముద్రం ఉడుకుతోంది.. వాతావరణం గతితప్పుతోంది.. ప్రపంచాన్ని శాసించే పసిఫిక్ మహాసముద్రంలో నిప్పులు రగులుతున్నాయి.. ఎన్నడూ లేనివిధంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3.6 డిగ్రీలు అదనంగా నమోదవుతూ సరికొత్త విపత్తుకు ప్రమాదపు బాటలు వేస్తున్నాయి. 1877లో అత్యధికంగా నమోదైన 2.75 డిగ్రీల రికార్డును సైతం తుడిచిపెట్టేస్తున్న ఈ తీవ్ర ఎల్‌నినో పరిణామాలు.. దేశ వ్యవసాయ రంగానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రుతుపవనాలు ముఖం చాటేసి, భయానక కరువు పరిస్థితులు దాపురిస్తాయన్న ఆందోళనలు ప్రస్ఫుటిస్తున్నాయి. ఈ విపత్తు నుంచి గట్టెక్కాలంటే.. ఇప్పుడు ఎంజేఓ పవనాల కరుణ మినహా మరో మార్గం లేదంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం మునుపెన్నడూ లేని స్థాయిలో విశ్వరూపం దాల్చనుందని వాతావరణ శాఖగణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్ఎస్టీ) అసాధారణంగా పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. తాజా అంచనాల ప్రకారం.. ఈ ఏడాదికి ఉష్ణోగ్రతల తీవ్రత సాధారణ స్థాయి కంటే ఏకంగా 3.6 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఎక్కువగా నమోదు కానుంది. గత 150 ఏళ్ల ఎల్‌నినో చరిత్రలో ఇది అత్యంత ప్రమాదకరమైన రికార్డుగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఇంత భారీ స్థాయిలో పెరగడం వాతావరణ నిపుణులను, శాస్త్రవేత్తలను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశ్లేషించిన నమూనాల్లో ఏకంగా 80 శాతం పైగా వెదర్ మోడల్స్ ఈ భారీ ఉష్ణోగ్రత పెరుగుదలను ధ్రువీకరిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. 1877 కరాళ నృత్యం కంటే మహా తీవ్రం.! వాతావరణ చరిత్రను పరిశీలిస్తే, 1877–78 కాలంలో వచ్చిన ఎల్‌నినోను ప్రపంచంలోనే అత్యంత వినాశనకరమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. అప్పట్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అయితే, ఆనాటి ఉష్ణోగ్రతల కంటే ప్రస్తుత అంచనా 0.8 డిగ్రీల మేర ఎక్కువగా ఉండటం భయాందోళనల్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా అత్యంత తీవ్రమైన ఎల్నినోగా నమోదైన 2.75 డిగ్రీల మార్క్‌ను కూడా ప్రస్తుతం దాటేస్తున్నాయి. సముద్ర జలాల్లో చోటుచేసుకుంటున్న ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ వాతావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కడం వల్ల వాతావరణంలోని గాలి ప్రవాహాల్లో ఊహించని మార్పులు వచ్చి, ప్రపంచవ్యాప్తంగా వర్షపాత నమోదుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.పసిఫిక్ మహాసముద్ర సాధారణ ఉష్ణోగ్రతలు 27-28 డిగ్రీలు2026–27 అంచనా 31.6డిగ్రీలు 2002లో ఎల్‌నినో సమయంలో భారత్‌లో వర్షపాతం సాధారణం కంటే 19 శాతం తక్కువ 2009లో ఎల్‌నినో సమయంలో సాధారణం కంటే 22 శాతం తక్కువ2026–27లో అంచనా సాధారణం కంటే 25 శాతం తక్కువ 1877 నాటి అత్యధిక రికార్డు 30.75డిగ్రీలు ఈసారి ఎల్‌నినోతో ఉష్ణోగ్రత పెరుగుదల 3.6డిగ్రీలు2015–16లో ఎల్‌నినో సమయంలో సాధారణం కంటే 14 శాతం తక్కువఅన్నదాతకు అశనిపాతం.! ఈ అసాధారణ ఎల్‌నినో తీవ్రత.. భారత్‌పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. భారతదేశ వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఎల్‌నినో ఏర్పడిన ప్రతిసారీ దేశంలో రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. దీనివల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొని, కరువు కాటకాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ముప్పు పొంచి ఉంది. పంటలు ఎండిపోవడం, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడం, తీవ్రమైన తాగునీటి కొరత రావడం వంటివి దేశమంతటా విపత్కర పరిస్థితులకు దారి తీస్తాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆశలన్నీ ఎంజేవో పవనాలపైనే.! ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశానికి ఏకైక ఆశాకిరణం మాడెన్ జూలియన్ ఆసిలేషన్(ఎంజేఓ) మాత్రమే. వాతావరణంలో భూమధ్యరేఖ వెంబడి పడమర నుంచి తూర్పు వైపుగా కదిలే మేఘాలు, వర్షపాతం, వేగవంతమైన గాలుల సమూహాన్ని ఎంజేవో అంటారు. ఈ ఎంజేవో గనక హిందూ మహాసముద్రం మీదుగా సరైన సమయంలో, అనుకూలంగా పయనిస్తే, అది మన రుతుపవనాలను బలోపేతం చేసి మెరుగైన వర్షాలను తీసుకువస్తుంది. తద్వారా ఎల్‌నినో వల్ల ఏర్పడే ప్రమాదకరమైన వర్షాభావ పరిస్థితులను ఎంజేవో చాలా వరకు అడ్డుకుని ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ ఎంజేవో అంచనాలకు తగినట్లుగా సానుకూలంగా మారకపోయినా, లేదా దాని అనుకూల ప్రభావం మన దేశంపై పడకపోతే.. ఎల్‌నినో సృష్టించే విధ్వంసం వర్ణనాతీతంగా ఉంటుందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
కరువు కాటుకు మూగజీవాల బలి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కరువు రాయలసీమ రైతు బతుకును ఛిద్రం చేస్తోంది. పొలంలో పంట లేదు.. పశువులకు మేత లేదు.. చేతిలో డబ్బు లేదు. ఏళ్ల తరబడి కుటుంబ సభ్యుల్లా చూసుకున్న ఎద్దులు, ఆవులు, గేదెలను కళ్లముందే ఇతరులకు అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులది. పశువులను అమ్మాలని కాదు.. వాటిని బతికించలేక అమ్ముకుంటున్నాం అంటున్నారు రైతులు. రెండు నెలలుగా చినుకు జాడ లేక, సాధారణ వర్షపాతంలో 30 శాతం కూడా నమోదు కాక, పచ్చిమేత మాట అటుంచితే ఎండుగడ్డి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మార్కాపురం ప్రాంతాల్లోని సంతలకు పశువులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. రైతుల ఆవేదనకు ఈ పశువుల అమ్మకాలు అద్దం పడుతున్నాయి. అమ్ముడైన పశువులు తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తీవ్రకరువు పరిస్థితుల్లోనూ ప్రభుత్వం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేత లేక అమ్ముకుంటున్నాం పది ఎకరాల్లో పత్తి, మూడెకరాల్లో ఆముదం, ఉల్లి పంటలు వేశాం. సరైన వానల్లేవు. పత్తి పంట మొత్తం ఎండిపోయింది. పశువులకు మేత కూడా లేదు. ట్రాక్టర్ వరిగడ్డి రూ.18వేలు అమ్ముతున్నారు. అది కూడా దొరకడం లేదు. మనుషులం గంజైనా తాగి బతుకుతాం. మేత లేకపోతే పశువులు ఎలా బతుకుతాయి. వాటి బాధ చూడలేక తప్పనిసరి పరిస్థితుల్లో కాడెద్దులు అమ్ముకోవాల్సి వస్తోంది. – గోవిందు, రైతు, పులకుర్తి, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా పంట పోయింది.. పశువుల మేతా పోయిందిఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలు సాగుకునోచుకోలేదు. అరకొర వర్షాలతో కొన్నిచోట్ల మొక్కుబడిగా పంటలు సాగుచేసినా మొత్తానికి పంటలసాగు 40 శాతానికి మించలేదు. మార్కాపురం, కడప లాంటి జిల్లాల్లో 20 శాతం కూడా పంటలు సాగుకాలేదు. అరకొరగా సాగైన వేరుశనగ, కంది, ఆముదం, పత్తి పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. కృష్ణాజలాలు వస్తాయని నమ్ముకొని కొంతమేర సాగుచేసిన వరిపంట ఎండుతోంది. దీంతో పశువులకు గ్రాసం దొరికేపరిస్థితి లేకుండా పోయింది. సీమ వ్యాప్తంగా లక్షలాది ఎద్దులు, ఆవులు, బర్రెలు, కోట్లాది గొర్రెలు, మేకలతోపాటు పలురకాల మూగజీవాలు గ్రాసంకోసం అల్లాడిపోతున్నాయి.ఒక్కొక్క ఎద్దు లేదా బర్రెకు రోజుకు 5 కిలోల ఎండుగడ్డి లేదా 15 కిలోల పచ్చిగడ్డి అవసరమవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఆ స్థాయిలో గ్రాసం అందుబాటులో లేదు. గ్రాసంలేక కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు పశువులను సంతలకు తెచ్చి తెగనమ్ముకుంటున్నారు. తక్కువ ధరలకే విక్రయించి నష్టపోతున్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, పత్తికొండ, అనంతపురం జిల్లా కదిరి,గోరంట్ల ఇతర ప్రాంతాల్లోని సంతలకు పశువులు వేలాదిగా తరలివస్తున్నాయి. నెలరోజులుగా పశువుల విక్రయాలు పెరిగాయని సంత నిర్వాహకులు చెపుతున్నారు. కొన్న పశువులను వ్యాపారులు కేరళ, కర్ణాటక, తెలంగాణ, కోల్‌కతా ప్రాంతాల్లోని కబేళాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎటు చూసినా కరువే.. కర్నూలు జిల్లాలో.. కరువు తీవ్రతతో ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, నియోజకవర్గాల నుంచి నిత్యం పశువులు తరలిపోతున్నాయి. నంద్యాల జిల్లాలోనూ వరిసాగులేకపోవడంతో గ్రాసం దొరికే పరిస్థితులు లేక రైతులు పశువులను విక్రయిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ తీవ్ర కరువుపరిస్థితులు నెలకొన్నాయి. వేరుశనగ, కంది పంటలు ఎండిపోయాయి. బోర్లకింద సాగుచేసిన వరిపంట ఎండిపోవడంతో లక్షలాది పశువులకు గ్రాసం దొరక్క సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానంగా మార్కాపురం జిల్లా పూర్తిగా కరువు బారినపడి పంటలసాగు లేకుండా పోయింది. దీంతో గ్రాసం దొరక్క లక్షలాదిగా ఉన్న ఎద్దులు, బర్రెలు, గొర్రెలు, మేకలను తెగనమ్ముకుంటున్నారు. సీమ జిల్లాల్లో ఎద్దులు, ఆవులు 15 లక్షల పైగా ఉండగా బర్రెలు 18.75 లక్షలు, గొర్రెలు, మేకలు కోట్లలోనే ఉన్నాయి. ఎన్నడూ లేని కరువు గతంలో ఎన్నడూ లేని కరువు ఇది. వానా కాలం వచ్చి మూడు నెలలు అవుతున్నా ఇంత వరకు పదునైన వాన లేదు. ఉన్న ఐదెకరాల్లో కంది పంట వేశా. వానల్లేక పంట చేతికందే పరిస్థితి లేదు. మేత లేక పశువులు అల్లాడి పోతున్నాయి. పశుపోషణ భారమై అమ్ముకుంటున్నాం. గతంలో మహా అంటే 20, 25 రోజులు బెట్ట ఉండేది. పశువులను కాపాడుకునేందుకు బోదగడ్డి, జానాకు వంటివి తెచ్చి వేసేవాళ్లం. వానల్లేక ఇప్పుడు అది కూడా లేదు. – గోకారి, రైతు, పి.కోటకొండ, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లామూడు ఎకరాల్లో పత్తి అంతా పోయిందిమూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట అంతా ఎండిపోయింది. ఎకరాకు రూ.50వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. కోడుమూడు ప్రాంతంలో వర్షం అంతంత మాత్రమే కురిసింది. వేసిన పంట ఎండిపోయి పశువులకు మేత లేకుండా పోయింది. అందుకే అమ్ముకొంటున్నా. – వెంకటేష్, చిల్లబండ, కర్నూలు జిల్లామేత లేక అమ్మేస్తున్నానాకు నాలుగు ఎద్దులున్నాయి. పొలం గుత్తకు తీసుకొని పత్తి సాగు చేశా. వర్షాలు కురవక పంట వాడుముఖం పట్టింది. కరువు కారణంగా ఎద్దులకు గ్రాసం కూడా పెట్టలేని స్థితిలో వున్నా. వాటి పోషణ భారమై రెండు ఎద్దులను అమ్ముకొనేందుకు సంతకు తీసుకొచ్చా. – నర్సప్ప, రైతు, జగ్గాపురం నందవరం మండలం, కర్నూలు జిల్లాఎద్దులను అమ్ముకొని వలసపోతున్నాంఉన్న ఎద్దులకు మేతలేక, మేపలేక అమ్ముకొనేందుకు సంతకు తీసుకొచ్చా. నాకైతే పొలం కూడా లేదు. ఎవరైనా పొలం పనులకు పిలిస్తే ఎద్దులను బాడుగకు తీసుకొనిపోయేవాడిని. వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు. వ్యవసాయ పనులకు పిలిచే రైతుల్లేరు. అందుకే కుటుంబంతో పాటు వలస వెళ్లాలనుకుంటున్నా. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటలు బాగున్నాయంటున్నారు. అక్కడికి పోవాలని ఆలోచిస్తున్నాం. – మాదన్న, గోనెగండ్ల, కర్నూలు జిల్లా -
కరువు కోరల్లో సీమ రైతు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తీవ్ర వర్షాభావం.. దానికి తోడు చంద్రబాబు ప్రభుత్వ దారుణ నిర్లక్ష్యం.. రాయలసీమను మరోమారు కరువు కోరల్లోకి నెట్టాయి. రైతాంగానికి భరోసాగా కరువు సహాయక చర్యలు అనేకం చేపట్టాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో రైతు కుటుంబాలు గుడ్లనీరు కుక్కుకుని బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నాయి. జూన్ నుంచి ఆగస్టు ముగింపు దశకు చేరుకున్నా సీమ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అరకొరగా పడిన వానలకు సాగు చేసిన పత్తి, వేరుశనగ, కంది, ఉల్లి, మొక్కజొన్న వంటి పంటలు తేమ అందక ఎండిపోతున్నాయి. కాలువల కింద వరి సాగుకూ నీటి కొరత వెంటాడుతోంది. దాంతో పొలాలు బీళ్లుగా మారుతుండగా.. పశువులకు గ్రాసం కరువై.. రైతు కుటుంబాలు బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నాయి. రైతులు ఎద్దులతోపాటు పాడి పశువులను, గొర్రెలను, మేకలను తెగనమ్ముకుంటున్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ కేసీ కాలువ, తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువలు, హంద్రీ కాలువల పరిధిలో సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయకపోవడంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల రైతులు కనీసం కొంతమేరైనా నీరివ్వాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. పంటలమీద ఆశవదులుకొని అటు తెలంగాణ, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. సెపె్టంబర్ మొదటివారం నుంచి వలసలు మరింతగా పెరగనున్నాయి. పశువులు తెగనమ్మి వలసబాట..కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన పల్లె ఈరప్ప కుటుంబం ఇది. నాలుగు ఎకరాల పొలంలో పత్తి సాగుచేసింది. ఎకరాకు రూ. 25 వేల చొప్పున రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. మూడు నెలల పైరు.. వర్షాలు లేక నిలువునా ఎండిపోయింది. ఈరప్పకు నలుగురు ఆడబిడ్డలు. కరువుతో గ్రాసం దొరకదన్న భయంతో 1.20 లక్షలకు కొన్న రెండు ఎద్దులను కూడా ఇటీవల నష్టానికి అమ్మేశాడు. బతుకుదెరువుకోసం తెలంగాణాకు వలస వెళ్లేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. కరువు ప్రభావం–5 దశలు 1) చినుకు లేదు.. 2) పంటల సాగు తగ్గింది 3) సాగు చేసిన పంటలు ఎండిపోయాయి 4) పశుగ్రాసం కొరత, పశువుల అమ్మకాలు 5) వ్యవసాయం దెబ్బతిని కుటుంబాలతో రైతుల వలసలు మొదట పొలాలు ఎండాయి.. తర్వాత పశువులు అమ్ముకున్నారు.. ఇప్పుడు కుటుంబాలతో సహా రైతులు వలసబాట పడుతున్నారు.!బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నా మాకు 4 ఎకరాల పొలం ఉంది. పత్తి పంట సాగు చేశా. ఎకరాకు రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.లక్ష ఖర్చు అయ్యింది. పంట ఎండిపోయింది. అప్పులు తీరేపరిస్థితి కనిపించడంలేదు. నా ముగ్గురు సోదరులు నెల క్రితం బెంగళూరుకు వలస వెళ్లారు. రెండు రోజుల క్రితం పత్తి పంట పొలాన్ని గొర్రెలకు మేతగా వదిలేశాను. నేను కూడా కుటుంబంతో బెంగళూరుకు వెలస వెళ్లాలని నిర్ణయించుకున్నా. – గాది లింగప్ప, రైతు, నిట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం కేసీకి నీళ్లివ్వక పొలం బీడుపడింది.. కేసీ కాలువకు శ్రీశైలం నుంచి కృష్ణ నీళ్లు విడుదల చేస్తేనే మా 8 ఎకరాల్లో వరిపంట సాగవుతుంది. ఈ ఏడాది ఇప్పటికీ నీళ్లు విడుదల చేయలేదు. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పొలం మొత్తం బీడుపడింది. వరి పండకపోతే తిండిగింజలు, పశువుల మేత దొరికే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఆదుకోవాలి. పశు గ్రాసమన్నా సరఫరా చేయాలి. – శీలం భాస్కర్‌రెడ్డి, విశ్వనాథపురం, చాపాడుమండలం. వైఎస్సార్ కడప జిల్లా. పంటలన్నీ దెబ్బతిన్నాయి...కర్నూలు4,34,996 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,44,171 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. ఆదోని, ఆలూరు, మంత్రాలయం ప్రాంతాల్లో పత్తి, వేరుశనగ, కంది, సన్‌ఫ్లవర్, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. 14 వేల హెక్టార్ల సాధారణ వరి సాగుకు 2 వేల హెక్టార్లలోపే సాగు జరిగింది. పంటలు ఎండిపోవడంతో ఈ ప్రాంత రైతులు వలసలకు సిద్ధమయ్యారు. కొందరు ఎద్దులను, ఇతర పశువులను అమ్ముకొని వలసపోగా మిగిలినవారు బెంగుళూరు, తెలంగాణా ప్రాంతాలకు వలసకు సిద్ధమయ్యారు. అనంతపురం 3,43,394 హెక్టార్ల సాధారణ సాగుకు 1,87,598 హెక్టార్లలోనే పంటలు వేశారు. 1.48 లక్షల హెక్టార్ల వేరుశనగ కేవలం 44 వేల హెక్టార్లలో సాగైంది. 22,868 హెక్టార్ల సాధారణ వరి సాగుకు 4,168 హెక్టార్లలోనే బోరుబావులకింద సాగు జరిగింది. వర్షాభావంతో చీనీ తోటలు ఎండిపోతున్నాయి. పత్తి, మొక్కజొన్న, సజ్జ ఆముదం పంటలదీ ఇదే పరిస్థితి. కంది 90వేల హెక్టార్లలో సాగవుతోందని చెబుతున్నా వర్షాలు లేక పంట నిలువునా ఎండిపోతోంది. నంద్యాల2,20,230 హెక్టార్ల సాధారణ సాగుకు 1,33,039 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. 70,201 హెక్టార్లలో సాగవ్వాల్సిన వరి కేవలం 16 వేల హెక్టార్లలో సాగైంది. మొక్కజొన్న, కంది, మినుము, పత్తి పంటలూ వర్షాభావంతో దెబ్బతిన్నాయి. చిత్తూరు44,267 హెక్టార్ల సాధారణ సాగుకు కేవలం 10,026 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. 21,903 హెక్టార్ల వేరుశనగకు 2,615 హెక్టార్లు, 9,068 హెక్టార్ల వరికి 1,833 హెక్టార్లు, 1,495 హెక్టార్ల కందికి కేవలం 110 హెక్టార్లలో సాగు జరిగింది.మార్కాపురంకరువు తీవ్రతను సాగు గణాంకాలే చెబుతున్నాయి. 27,203 హెక్టార్ల సాధారణ కంది సాగు కేవలం 192 హెక్టార్లలో, 19,711 హెక్టార్ల పత్తి 3,953 హెక్టార్లలో. 6,202 హెక్టార్ల వరి కేవలం 33 హెక్టార్లలో. 3,104 హెక్టార్ల మొక్కజొన్న 331 హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, వేరుశనగ, ఆముదం తదితర పంటలు సాగుకు నోచుకోలేదు. కడప76,469 హెక్టార్ల సాధారణ సాగుకు కేవలం 24,092 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. అంటే సాగు మూడోవంతు కన్నా దిగువకు పడిపోయింది. కేసీ కెనాల్ ఆయకట్టుతోపాటు తెలుగుగంగ, మైలవరం, చిత్రావతి, గండికోట తదితర ప్రాజెక్టుల పరిధిలో 33,078 హెక్టార్లలో వరి సాగుకావాల్సి ఉండగా కేవలం 9,327 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 22,469 హెక్టార్ల పత్తికి 7,742 హెక్టార్లు, 5,992 హెక్టార్ల కందికి కేవలం 352 హెక్టార్లలో సాగు జరిగింది. 1495 హెక్టార్లలో సాగుకావాల్సిన మొక్కజొన్న 1213 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 3745 హెక్టార్లలో సాగు కావాల్సిన మినుము 1488 హెక్టార్లలో సాగైంది. -
కరువు కరాళ నృత్యం
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ప్రధానంగా జిల్లాలోని కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాలపై అధిక ప్రభావం చూపనుంది. ఇప్పటికే మడకశిర నియోజకవర్గంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్‌నినో ప్రభావం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కన్నా మడకశిర నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పడింది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో చెరువుల్లోకి నీరు చేర లేదు, వంకలు, వాగులు ప్రవహించలేదు. కుంటలు, చెక్‌డ్యాంలు నిండలేదు. దీంతో భూగర్భజల మట్టం ప్రమాదస్థాయికి పడిపోయింది. బోరు బావులు ఎండిపోతుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎండుముఖం పట్టిన వేరుశనగ నియోజకవర్గంలో మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 23,973 హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాధారణ సాగు కావాలి. అయితే వర్షాలు లేకపోవడంతో సాగానికి సగం సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దాదాపు 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వేరుశనగ సాగు చేసినా... పంట ఎండిపోతోంది. ప్రస్తుతం వర్షం వచ్చినా ఫలితం లేకుండా పోయింది. పెట్టుబడంతా మట్టి పాలైందని రైతులు వాపోతున్నారు. తాగునీటికి కష్టాలు నియోజకవర్గంలో తాగునీటి సమస్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 50 గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో నానా కష్టాలు పడుతున్నారు. వందలాది తాగునీటి బోర్లు ఎండిపోయాయి. కొత్త బోర్లు తవ్వించినా నీరు లభ్యం కావడం లేదు. నీటి కోసం ప్రజలు రోజూ ఏదో ఒక చోట చేస్తున్న నిరసనలే తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాభావం ఇలాగే కొనసాగితే ట్యాంకర్లకు కూడా నీరు దొరకడం కష్టంగా మారే పరిస్థితి ఉంది. కళావిహీనంగా వక్క తోటలు మడకశిర నియోజకవర్గం పండ్ల తోటలకు పెట్టింది పేరు. వక్క, దానిమ్మ తోటలు అధికంగా ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే వందలాది వ్యవసాయ బోరు బావులు ఎండిపోయాయి. వక్క, దానిమ్మ తోటలను కాపాడుకోవడం రైతులకు భారంగా మారింది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వక్క, దానిమ్మ తోటలు ఎండిపోయాయి. నిద్రమత్తులో చంద్రబాబు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉంది. కరువు నివారణకు కనీస జాగ్రత్తలు తీసుకోలేదని అన్నదాతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ముంచుకొస్తున్న కరువును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పంటల బీమా, నష్ట పరిహారం, ఉచితంగా ఎరువులు, మందులు, విత్తనాల పంపిణీ, ఉచిత బోర్ల పథకం, రుణాలమాఫీ లాంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా కరువు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.చెరువులన్నీ ఖాళీ మడకశిర నియోజకవర్గంలో మైనర్ ఇరిగేషన్ చెరువులు 47 ఉన్నాయి. 40 చెరువుల్లో నీరు లేదు. ఆరేడు చెరువుల్లో మాత్రమే కొద్దిపాటి నీళ్లున్నాయి. దీంతో దాదాపు 17 వేల ఎకరాల ఆయకట్టు భూములన్నీ బీడుగా మారే ప్రమాదం ఏర్పడింది. అదే విధంగా పంచాయతీరాజ్ చెరువులు కూడా ఎండిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలి వర్షాభావంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. చెరువుల్లో చుక్కనీరు లేదు. మడకశిర ప్రాంతంలో కరువు పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. వివిధ రకాల తోటలు, పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మడకశిరను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. రైతులను ఉదారంగా ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతులు వలస బాట పట్టడం ఖాయ. – బసవరాజు, రైతు, రొళ్ల -
ఏపీకి తుంగభద్ర నీరు వద్దా?
హొసపేటె: ఎల్‌నినో వల్ల ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకుంది. తాగు, సాగు నీటి కోసం ప్రజలు, రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో పొరుగు రాష్ట్రాల నుంచి తమకు రావాల్సిన నీటివాటా కంటే ఎక్కువ అడిగి ప్రజల కష్టాలను తీర్చాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా రాయలసీమకు తుంగభద్ర నుంచి రావాల్సిన నీటి విషయంలో చంద్రబాబు సర్కారు తీరు రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా కర్నూలు జిల్లాకు లో లెవెల్ కెనాల్(ఎల్ఎల్సీ) ద్వారా తుంగభద్ర నీరు వెళ్తుంది. తమకు ఎంత నీరు కావాలి, ఎప్పటి నుంచి ఎప్పటివరకు నీటిని విడుదల చేయాలి... అనే వివరాలతో కర్నూలు జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ లేఖలు పంపిస్తారు. కానీ ఇప్పటి వరకు కర్నూలు జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ లేఖలు తుంగభద్ర డ్యామ్ ఇంజనీర్లకు చేరలేదు. దీంతో డ్యామ్ అధికారులు కూడా కర్నూలుకు నీటి విడుదల గురించి పట్టించుకోవడం లేదు. ఆగస్టు మూడో వారం వచి్చనా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీటి వాటాపై ఏపీ అధికారుల నుంచి అధికారిక లేఖ (ఇండెంట్) తుంగభద్ర డ్యామ్ కార్యాలయానికి రాకపోవడం కర్ణాటక అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నిండుకుండలా తుంగభద్ర ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ సుమారు 80 టీఎంసీలతో నిండుకుండలా తొణికిసలాడుతుంది. ఆదివారం డ్యామ్‌కు 18,550 క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం 1,630 అడుగులకు చేరుకుంది. డ్యామ్ పూర్తిగా నిండేందుకు ఇంకా 3 అడుగులు మాత్రం మిగిలి ఉంది. కర్ణాటక ప్రభుత్వం తమ వాటా కింద హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకి నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కర్నూలుకు వచ్చే నీటిని అడ్డుకున్న కర్ణాటక రైతులు కర్నూలు జిల్లా నుంచి అధికారిక ఇండెంట్ రాకపోవడంతో ఎల్ఎల్సీ ద్వారా ఏపీకి వస్తున్న కొద్దిపాటి నీటిని కూడా కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం వద్ద ఏపీలోకి ప్రవేశించే చోట ఎల్ఎల్సీ 155వ కిలోమీటరు వద్ద భారీ సంఖ్యలో కర్ణాటక రైతులు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి నీటిని తమ పొలాలకు మళ్లించుకున్నారు. టీబీ డ్యామ్‌లో నీటిమట్టం సంతృప్తికరంగా లేదని, తమ పొలాలు ఎండిపోతాయనే సాకుతో ఏపీకి రావాల్సిన నీటిని అడ్డుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి తుంగభద్ర డ్యామ్ అధికారులకు అధికారిక ఇండెంట్ పంపించి కర్నూలు జిల్లాకు నీరు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. -
సాగునీరు ఇచ్చే సన్నద్ధత లేదా?
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో నీటి నిల్వలు పడి పోయాయనీ, అందువల్ల కృష్ణా డెల్లాకు సాగునీరు ఇవ్వలేమనీ జూలై 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రకటించింది. వరి పంట వేయ వద్దనీ, వరి పంట వేస్తే తర్వాత నీరు లేక నష్టపోయేది రైతులేననీ హెచ్చరిక జారీ చేశారు మంత్రిపుంగవులు. ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావంతో పాటు కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఖరీఫ్‌కు చాలాముందే ప్రకటించారు. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కాని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు.జూన్– జూలై నెలల మధ్య సాగు నీరు విడుదల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. జూన్ నెలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు నీరు విడుదల తేదీలను కూటమి మంత్రులు ప్రకటించారు. మంత్రుల ప్రకటనతో అప్పులు చేసి సేద్యానికి కావాల్సిన వనరులను రైతులు సమకూర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల ఇప్పుడు సాగు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం వల్ల రైతాంగం తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నారు.జల వనరుల వ్యవస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రకాశం బ్యారేజి నీటి నిల్వ 2.978 టీఎమ్సీలు కాగా, పూర్తి నీటి మట్టం 3.071 టీఎమ్సీలు. 96.97% నీటి నిల్వ ఉన్నందువల్ల సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని నిపుణులు చెబుతున్నారు. పులిచింతలలో ప్రస్తుతం 29.039 టీఎమ్సీల నీరు ఉంది. మరి కూటమి ప్రభుత్వం సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదు?కృష్ణా డెల్టాలో ప్రధాన సేద్యం వరి. అలాంటి వరి సేద్యం చేయవద్దంటే, రైతులు ఖరీఫ్ సేద్యానికి దూరం కావడమే కదా! ప్రకాశం బ్యారేజి కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేయకపోతే ఆ పంటల సేద్యం సాధ్యం కాదు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుని, పూడికలు తీసి నీటితో వాటిని నింపి ఉంటే, వాటి ద్వారా నీరు లభించేది. ఇది పాలకుల వైఫల్యం కాదా?రాష్ట్రంలోని 608 మండలాల్లో 250 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో కరవును ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కరవు మండలాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులను 250 రోజులకు పెంచి గ్రామీణ పేద కుటుంబాలకు పనులు కల్పించాలి. ఆ పనుల వేతనం పెంచాలి. రైతాంగానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా ఇవ్వాలి. వారు తీసుకున్న పంట రుణాలు రద్దు చేయాలి. తాగు నీటి సమస్య లేకుండా చూడాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రైతాంగం, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి.- బొల్లిముంత సాంబశివరావు, వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
రాష్ట్రమంతా తీవ్ర కరువు
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతా తీవ్ర కరువు ముంచుకొచ్చిందని, ఇప్పటివరకు పదిలక్షల ఎకరాల్లో సాగుకు విఘాతం కలిగిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మంగళవారం సచివాలయంలో కరువు పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలోని పరిస్థితుల గురించి సీఎంకు వారు వివరించారు. ఎల్‌నినో వల్ల ఊహించినదానికంటే అధికంగా నష్టం జరగనుందని పేర్కొన్నారు. కరువు నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే మూడునెలల్లో 40 శాతం లోటు వర్షపాతం అధికారులు మాట్లాడుతూ జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని, వచ్చే 3 నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాత మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సీఎంకు చెప్పారు. జూన్ – నవంబర్ మధ్య 844 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 551 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రభావం కన్పిస్తోందన్నారు. ఇప్పటికే దాదాపు 6.95 లక్షల ఎకరాల్లో పత్తి 2.68 లక్షల ఎకరాల్లో వరిపై, మొత్తం పది లక్షల ఎకరాలపై కరువు ప్రభావం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 15.90 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలకు రైతులు బీమా చేయించుకున్నారని వివరించారు. బీమా నమోదు చేయించే బాధ్యత కలెక్టర్లదేఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కరువు పరిస్థితులను సవాల్‌గా తీసుకుని అధికారయంత్రాంగం పనిచేయాలన్నారు. ప్రతిపంటకూ బీమా నమోదు చేయించే బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొన్నారు. తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని పేర్కొన్నారు. కరువు తీవ్రతను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని చెప్పారు. మంత్రి మొదలుకుని అధికార యంత్రాంగం మొత్తం క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజల్లోనే ఉండాలని పేర్కొన్నారు. ధరలు పెరగకుండా చర్యలు చేపట్టాలని, మొబైల్ రైతు బజార్లను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. విజయవాడ, గుంటూరుతో కలిపి రాజధానిగా చూడాలిరాజధాని నిర్మాణ పనుల సమీక్షలో సీఎం చంద్రబాబుఅమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారంగా కాకుండా విజయవాడ, గుంటూరుతో కలిపి చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారు. అందుకనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్ట్ పనులు జరగాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో మంగళవారం రాజధాని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని, నిర్దేశించిన సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. 95 ప్రాజెక్టులకు సంబంధించి రూ.50,999 కోట్ల విలువైన పనులు చేపట్టామని, నెలకు కనీసం 7.92 శాతం పనులు పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్లు వంటి అంశాల్లో అన్ని శాఖలు, ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. -
కరువొస్తోంది.. కొత్త సలహాలివ్వండి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 50 రోజులు దాటింది. అంటే సీజన్లో దాదాపు సగం కాలం గడిచిపోయింది. కానీ చినుకు జాడలేదు. ఓ మోస్తరు వర్షం కూడా పడడం లేదు. రాయలసీమలో పొలాలన్నీ బీటలు వారుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో విత్తనాలు నేలలోనే నిద్రపోతున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టాలో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. మెట్ట, మాగాణి అని తేడా లేదు. వర్షాధారం..బోర్ల కింద వ్యత్యాసం లేదు. ఎటు చూసినా భీతావాహ వాతావరణమే కన్పిస్తోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులను కరువు నుంచి ఎలా బయట పడేయాలన్న ఆలోచన చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికొదిలేసింది. రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించడం, కరువు సహాయక చర్యలకు ఉపక్రమించడం వదిలేసింది. ఇలాంటి సమయంలో రైతుకిచ్చే సలహాలు, సూచనలను మార్చి కొత్త సలహాలివ్వాలని యూనివర్సిటీ వీసీలను ఆదేశిస్తూ సోమవారం చంద్రబాబు ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి కష్ట కాలంలో ప్రభుత్వం స్పందించే విధానం ఇదేనా అని వ్యవసాయ నిపుణులు కూడా విస్తుపోతున్నారు. అత్యంత తీవ్రమైన కరువు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కరువు తాము ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్‌లో 25 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, జూలైలో 62 శాతం లోటు ఉంటుందని తొలుత అంచనావేశారు. కానీ 15వ తేదీ నాటికే ఏకంగా 82శాతం లోటు వర్షపాతం నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, అన్నమయ్య జిల్లాల్లో –60 నుంచి –99 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, 24 జిల్లాల్లో –20 నుంచి–50 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షాభావం కాదు. గత రెండు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితి రానుందని నిపుణులంటున్నారు. కరువు ఉపశమన చర్యలెక్కడ? ఇలాంటి విపత్తు వేళ ప్రభుత్వాలు సాధారణంగా కరువు ఉపశమన చర్యలు ప్రారంభిస్తాయి. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తాయి. కంటిజెన్సీ ప్లాన్ కింద ఉచితంగా విత్తనాలు, ఇతర సాగు ఉత్పాదకాలను పంపిణీ చేస్తాయి. ఇన్పుట్ సబ్సిడీలు ప్రకటిస్తాయి. సాధ్యమైనంత త్వరగా పంటల బీమా పరిహారాన్ని అందించే ఏర్పాటు చేస్తాయి. రుణాలను రీషెడ్యూల్ చేస్తాయి. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానిస్తాయి. పశువులకు మేత కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. తాగునీటి చర్యలు చేపడతాయి. కానీ వీటన్నిటినీ వదిలేసి కరువు ప్రభావిత ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనల్లో మార్పు తీసుకు రావాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేయడం విస్మయానికి గురిచేస్తోందని వ్యవసాయ నిపుణులంటున్నారు. సాయం వదిలేసి ఉచిత సలహాలెందుకు? వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం కరువు తీవ్రతను అంచనా వేస్తుంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలో సలహాలు సూచనలు ఇవ్వడం పరిపాటి. ఇందుకోసం పంటల వారీగా సీజన్‌కు ముందుగానే ప్రత్యేక బులిటెన్లు జారీ చేస్తారు. అయితే ఇవన్నీ చాలా సాధారణంగా ఉన్నాయని పేర్కొంటూ విధిగా వాటికయ్యే ఖర్చు–లాభాల లెక్కలను జతచేయాలంటూ యూనివర్శిటీ వీసీలను ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 50 రోజులు గడిచిన తర్వాత ఖరీఫ్ 2026 సీజన్ కోసం మీరు ఇచ్చిన సలహాలు, సూచనలను పునఃసమీక్షించాలంటూ జీవో ఇచ్చింది.జోన్ల వారీగా, నీటి లభ్యత వారీగా, భూ స్వామ్యత/భూమి పరిమాణం వారీగా కొత్త సలహాలు, సూచనలతో పాటు ఖర్చులు, లాభనష్టాలతో కూడినసమగ్ర నివేదిక పదిరోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ఈ జీవోలో ఆదేశించారు. లాభసాటి కాకపోతే ప్రత్యామ్నాయ సాగు పద్దతుల జోలికి పోవద్దంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. ఈజీవో చూస్తుంటే కరువు పరిస్థితులను ఎదుర్కొనే సమగ్ర ప్రణాళిక కంటే, కేవలం సలహాలు, సూచనలు ఇస్తూ కాలయాపన చేయాలన్న ఆలోచన కన్పిస్తోందని రైతులు మండిపడుతున్నారు.ఇలాంటి కరువు వేళ ఒకటి రెండుసార్లు విత్తనాలు వేయాల్సి ఉంటుంది. పంటలను కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇదంతా రైతులకు భారమే. ఇలాంటి విపత్తు వేళ ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలే తప్ప లాభసాటి కాకపోతే మానేయండంటూ సలహాలివ్వడమేమిటని రైతులు మండిపడుతున్నారు. -
‘కరవు సంక్షోభంపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు సంక్షోభం నేపథ్యంలో రైతులను ఆదుకోవడంలో, పొలాలకు నీటిని విడుదల చేయడంలో, కాలువలను ఆధునికీకరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (వ్యవసాయం, రైతు విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 ఖరీఫ్‌లు, 2 రబీలు పూర్తయి, ఇప్పుడు 3వ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని.. కానీ ఇంతవరకు ఎప్పుడూ లేనంతటి సంక్షోభాన్ని రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సీజన్లలో ఉత్పత్తులు లేక, అకాల వర్షాలతో వేరుశెనగ, ప్రత్తి పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయని.. ధరలు లేక ఉల్లి, అరటి, చినీ, మొక్కజొన్న, పొగాకు, మామిడి, ఆక్వా రైతులు రోడ్డున పడ్డారని ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన స్పందించి వాటర్ మేనేజ్మెంట్, కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు చేపట్టడంతోపాటు రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు చేపట్టాలని ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రమంతా లోటు వర్షపాతంప్రభుత్వ అధికారిక డేటా ప్రకారమే జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 6 వారాలు గడిచినా రాష్ట్రంలో 48.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ప్రాక్టికల్‌గా 11 జిల్లాలు మైనస్ 40 శాతం కంటే ఎక్కువ లోటుతో మరో 11 జిల్లాలు మైనస్ 30 శాతం పైగా లోటుతో, 5 జిల్లాలు మైనస్ 20 శాతం కంటే ఎక్కువ లోటు వర్షపాతంతో ఉన్నాయి. కేవలం నెల్లూరు జిల్లా మాత్రమే సాధారణ వర్షపాతంలో ఉంది. మిగతా రాష్ట్రమంతా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది.వ్యవసాయ శాఖ అధికారిక డేటా ప్రకారం పంటల సాగు పరిస్థితి దారుణంగా ఉంది. జూలై 15 నాటికి జరగాల్సిన మొత్తం సాగులో కొన్ని పంటలు కేవలం 60 శాతం మాత్రమే సాగైంది. రాయలసీమలో పండే మిల్లెట్స్ (ఆరిక, వరగ, ఊద తదితర) సాగు కేవలం 43 శాతం మాత్రమే జరిగింది. అత్యధిక పెట్టుబడి అయ్యే వేరుశెనగ సాగు ఈ సీజన్ మొత్తంలో కేవలం 16శాతం మాత్రమే జరిగింది. ప్రభుత్వం కనీసం విత్తనాలను కూడా సరిగ్గా సప్లై చేయలేకపోయింది. వేరుశెనగ సాగు దెబ్బతింటే రాయలసీమలో పశుగ్రాసం కొరత ఏర్పడి, రైతులు పశువులను అమ్ముకుని వలసపోయే దీన స్థితి వస్తుంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికకు ఆగస్టు 15 ఆఖరి గడువు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు.కాలువల నిర్వహణ శూన్యంగోదావరి, కృష్ణా డెల్టాల్లో నీటి నిర్వహణ, కాలువల ఆధునికీకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గోదావరి డెల్టాలో కాటన్ బ్యారేజ్ వద్దకు 17,250 క్యూసెక్కుల నీరు వస్తున్నా.. కాలువల్లో గుర్రపుడెక్క తీయకపోవడం, సమ్మర్ క్లోజర్లో మెయింటెనెన్స్ పనులు చేయకపోవడం వల్ల కోనసీమ జిల్లాలో నారుమళ్లు ఎండిపోతున్నాయి. నీరు సముద్రం పాలవుతున్నా, కిందకు వెళ్లడం లేదు. దీనిపై రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే, ఇరిగేషన్ మంత్రి గత ప్రభుత్వంపై నెపం నెట్టడం హాస్యాస్పదం.కృష్ణా డెల్టాలో జూలై 1 వరకు గోదావరిలో నీరు లేనప్పుడు వైఎస్సార్ నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్ నుంచే నీటిని వదిలారు. ప్రస్తుతం పులిచింతలలో 29.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ, ప్రకాశం బ్యారేజ్ వైపు వస్తున్న 4వేల క్యూసెక్కుల నీటి విడుదలను అకస్మాత్తుగా ఎందుకు నిలిపివేశారు. సీఎం డ్యాష్ బోర్డ్ డేటా ప్రకారం ఈ రోజు ఉదయం జీరో ఇన్ ఫ్లో కనిపిస్తోంది. తూర్పు, పశ్చిమ కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో టైలాండ్ భూముల్లో ఎదబెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క 100 ఎకరాలైనా నీరు లేక ఎండిపోయిందా?రైతు సంక్షేమ పథకాలకు మంగళం.. బకాయిలు నిలిపివేతగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రతి రైతును ఆదుకునేందుకు తెచ్చిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం తెచ్చిన 'స్వచ్ఛంద బీమా' (వాతావరణ బీమా) గడువు జూలై 15తోనే, దీన్ని పొడిగించమని విజ్ఞప్తి చేశాం.ఒకవేళ పాత ఉచిత బీమా ఉండి ఉంటే ఈ వాతావరణ సంక్షోభంలో రైతులకు వేల కోట్ల లబ్ధి చేకూరేది.ఇప్పటివరకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ క్లైమ్లు, సున్నా వడ్డీ బకాయిలు విడుదల చేయలేదు. తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ జీవో ఇచ్చినా రైతులకు డబ్బులు అందలేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఫైల్ ప్రభుత్వంలో ఉన్నా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేవలం రూ. 500 కోట్లు కేటాయించి, మార్క్ ఫెడ్ ద్వారా కనీస ధర 200 రూ లకకు కొనుగోళ్లు జరిపించి రైతులను ఆదుకోవచ్చు. వైఎస్ జగన్ హయాంలో మార్కెట్ జోక్యం చేసుకొని కొనుగోలు చేసిన విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు?ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ డిమాండ్లునిర్మాణాత్మక ప్రతిపక్షంగా అధికారిక డేటా ఆధారంగానే మేము ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తున్నాం. ఎంతసేపూ వ్యవసాయం బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేసుకోవడం మానేసి, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించాలి. రాబోయే 4-5 రోజుల్లో వర్షాలు పడకపోతే రాష్ట్రం భారీగా నష్టపోతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన స్పందించి వాటర్ మేనేజ్మెంట్, కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు చేపట్టాలి. అలాగే రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చర్యలు చేపట్టాలి. -
చినుకు రాలదు, చుక్క నీరుండదు.. జరగబోయేది ఇదే
-
సూపర్ ఎల్–నినోకు సిద్ధం కండి
ఇక అనుమానాలు అక్కరలేదు. ఈ ఏడాది ప్రపంచదేశాలకు మాత్రమే కాదు.. భారతదేశానికీ గడ్డుకాలమే. చుట్టపుచూపుగా కరవు కాటకాలను పరిచయం చేసి వెళ్లిపోయే ఎల్–నినో ఈ సారి తన విశ్వరూపాన్ని చూపనుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతాయని, సూర్యుడి ప్రతాపం కూడా ఎక్కువ కానుందని తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ సైతం హెచ్చరించింది. ఎక్కడో దక్షిణ అమెరికా ఖండంలోని పసఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు పెరిగితే వచ్చే వాతావరణ మార్పులను ఎల్–నినో అని, చల్లబడితే లా–నినా అంటారని మనకు తెలుసు. భారత్ లాంటి దేశాల్లో లా–నినా అధిక వృష్టికి కారణమవుతూంటుంది. ఈ రెండూ సాధారణంగా 3 నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చి పోతూంటాయి. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తరచూ రావడం ఒక సమస్య అయితే... ఒక్కోసారి ఒక్కోలా ప్రభావం చూపడం రెండో సమస్య. భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ఈ రెండు వాతావరణ అంశాల తీవ్రత పెరిగిపోయింది. వర్షపాతంలో విపరీతమైన తేడాలు నమోదవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎల్–నినో ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కరవు కాటకాలు.. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. లా–నినా సందర్భంలోనూ అధిక వర్షపాతాల స్థానంలో నగరాలను ముంచెత్తే క్లౌడ్‌బరస్ట్‌లు తరచూ నమోదు అవుతూండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సూపర్ ఎల్–నినో ఏర్పడుతుందన్న ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబరు లోగా... ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణ స్థాయిలో ఉంటుందని భారత వాతావరణ సంస్థ ఇప్పటికే తెలిపిన విషయాన్ని ఒక్కసారి ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ అంచనాల్లో సూపర్ ఎల్–నినో ప్రస్తావన లేదు. జూన్ నెలలో ప్రపంచ వాతావరణ సంస్థ వెలువరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకూ సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడేందుకు 80 – 90% అవకాశం ఉంది. ఇప్పటికే అగ్ని గుండాన్ని తలపిస్తున్న వాతావరణానికి ఈ సూపర్ ఎల్–నినో ఆజ్యం పోయనుందని, దీన్ని అత్యవసర వాతావరణ హెచ్చరికగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ స్వయంగా ప్రకటించడం సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది. రెండేళ్ల క్రితం 2023–24 లోనూ సూపర్ ఎల్–నినో ఏర్పడినా ఆ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఐదవదిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు – నవంబరుల మధ్య సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకూ ఉంటుందని అంచనా. అంటే వచ్చే ఏడాది కూడా మాడు పగిలే ఎండలు, వడగాడ్పులు తప్పవన్నమాట. ఎండలు పెరిగితే దాని ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందన్నది నిర్వివాద అంశం.మనపై ప్రభావం ఇలా... సూపర్ ఎల్–నినో ప్రభా వం 2026 నైరుతి రుతుపవనాలపై జూలై నెల నుంచి కనిపించడం ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ ఒకటవ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు ముందుకు కదలడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జూలైలో ఉత్తర, మధ్య, పశ్చిమ భారత దేశ ప్రాంతాల్లో వర్షపాతంలో లోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో కరవు పరిస్థితులు రావొచ్చు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఆసక్తికరంగా జూలై – ఆగస్టు నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురిసి వరదలు రావచ్చునని అంచనాలు చెబుతున్నాయి. సెప్టెంబరులో ముఖ్యంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సమస్య ఎదురు కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సూపర్ ఎల్–నినో ప్రభావం కారణంగా 2026– 27 రబీ సీజన్ పంటలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం పడుతుంది. -
కరువు కాలపు పంట బ్రహ్మజెముడు
ముళ్ళు లేని బ్రహ్మజెముడు (స్పైన్‌లెస్ కాక్టస్) కరువుప్రాంతాల్లో రైతులకు చక్కని పశుగ్రాసం సహా 5 రకాలుగా ఉపయోగపడే ఒక చక్కని పంట. వాతావరణ మార్పులను తట్టుకోగల పంట. తక్కువ నీటితో పెరుగుతుంది. సారహీనమైన నేలల్లో కూడా (చౌడు భూముల్లో తప్ప) పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న తోటల్లో మధ్యలో వరుసలుగా దీన్ని పెంచవచ్చు. ఇది చిన్న రైతులను ఆదుకునే పంట. కరువు పీడిత రైతులకు బహుళ ఆదాయ మార్గాలను సృష్టిస్తుంది. సుస్థిర జీవనోపాధిని కల్పిస్తుంది.హెక్టారుకు 80 నుంచి 100 టన్నులుముళ్ళు లేని బ్రహ్మజెముడు ఒక్కసారి నాటితే 25 సంవత్సరాలకు పైగా ఫలసాయాన్నిచ్చే దీర్ఘకాలిక పంట. చిన్న పండ్లతో సహా ఈ చెట్టులోని ప్రతి భాగం విలువైన పశువుల మేతగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో సమకూరే పచ్చిమేతను అందిస్తుంది. సంవత్సరానికి హెక్టారుకు 80 నుంచి 100 టన్నుల వరకు బ్రహ్మజెముడు ఆకుల దిగుబడి వస్తుంది. కరువు సమయంలో నమ్మకంగా, తక్కువ ఖర్చుతో కూడిన పశుగ్రాసాన్ని అందిస్తుంది. తద్వారా పశుగ్రాస ఖర్చులను తగ్గిస్తుంది. దీని ఆకులను అంగుళం ముక్కలుగా కోసి పశువులకు మేపాలి. పాలిచ్చే పశువులకు రోజుకు 10–15 కిలోలు (రోజువారీ పచ్చిమేతలో 25% వరకు) మేపవచ్చని కర్నాల్‌లోని ఎన్డీఆర్ఐ నిపుణులు చెబుతున్నారు. ఇతర పశువులకు రోజుకు 8–12 కిలోల వరకు, ఆర్నెల్లు పైబడిన దూడలకు 2–4 కిలోలు మేతగా ఇవ్వొచ్చు. క్రమంగా అలవాటు చెయ్యాలి.బయోగ్యాస్ తయారీకి ఉపయోగంముళ్ళు లేని బ్రహ్మజెముడు బయోగ్యాస్ తయారీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని ఆకులకు 60–65% మీథేన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. బయోగ్యాస్ తయారీ తర్వాత వెలువడే స్లర్రీ విలువైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. 3 కిలోల బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల విస్తీర్ణం గల బయో–లెదర్ షీట్‌ను తయారు చేయొచ్చు. దీనితో రెండు జతల బూట్లు లేదా మూడు చిన్న బ్యాగులు తయారు చేయవచ్చు. దీని పండ్లు పోషక విలువలతో కూడి ఉంటాయి. దీని ఆకులను కూరగానూ వండుకొని తినొచ్చు.ఎవరిని సంప్రదించాలి?ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును వ్యాప్తిలోకి తేవాలంటే రైతులకు దీని గురించి తెలియజె΄్పాలి. నాటుకునే బ్రహ్మజెముడు ఆకులను అందించాలి. మార్కెట్‌ను అనుసంధానం అవసరం. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు కలసి పనిచేస్తే ఈ కరువు కాలపు పంటను వేగంగా రైతులకు అందించవచ్చు.ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. అదనపు సమాచారం కోసం డా. శివ్ కుమార్ అగర్వాల్‌ను సంప్రదించవచ్చు. sk.agrawal@cgiar.org -
రైతన్న టెన్షన్.. టెన్షన్.. ఖరీఫ్‌పై కరువు ఛాయలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగుపై కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు అధిక ఉష్ణోగ్రతలు అన్నదాతను సాగుకు దూరం చేస్తున్నాయి. గత ఖరీఫ్ మాదిరిగా ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్ సాగు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో వర్షాభావం వెన్నాడుతుండటంతో ఖరీఫ్ సాగు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. క్షేత్ర స్థాయిలో డిమాండ్‌కు సరిపడా సబ్సిడీ విత్తనాలకు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు.యూరియా, డీఏపీ కొరత వేధిస్తోంది. ఖరీఫ్ సీజన్‌కు 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా, దాదాపు 1.10 లక్షల క్వింటాళ్ల మేర కోత పెట్టారు. 5.22 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తన కేటాయింపులు జరపగా, ఇప్పటి వరకు 4 లక్షల క్వింటాళ్లను నిల్వ చేసి, 3.50 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు. ఇండెంట్ ప్రకారం 3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం అవసరం కాగా, దాదాపు లక్ష క్వింటాళ్లకు కోత పెట్టగా, కేవలం 1.80 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశారు. వరి విత్తనాన్ని కూడా 2.27 లక్షల క్వింటాళ్లకు 1.60 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పొజిషన్ చేయగా, 1.35 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు సరఫరా చేశారు. మరో వైపు రాష్ట్రంలో ప్రస్తుతం 3 లక్షల టన్నుల యూరియా, 91 వేల టన్నుల డీఏపీ అందుబాటులో ఉందని చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఆ స్థాయిలో కన్పించడం లేదు. చేతిలో పెట్టుబడి లేక.. అప్పులు పుట్టక..అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి ఏడాది ఇవ్వాల్సిన రూ.20 వేల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం, ఈ ఏడాది ఎప్పుడిస్తుందో కూడా చెప్పలేక పోతోంది. కనీసం సరిపడా పంట రుణాలైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటి వరకు నిర్దేశించిన రుణ లక్ష్యం 2.32 లక్షల కోట్లలో 30 శాతం అంటే రూ.77 వేల కోట్లు కూడా దాటలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణా ల రీ షెడ్యూల్ తప్ప కొత్తగా ఇచ్చేది ఏమీ ఉండడం లేదంటున్నారు. కౌలు రైతుల విషయానికి వస్తే 10 లక్షల మందికి సీసీఆర్సీ ఇవ్వాలన్నది లక్ష్యంగా కాగా, నేటికి 4 లక్షల మందికి కార్డులు జారీ చేశారు. వీరికి రూ.8 వేల కోట్ల రుణాలివ్వాలనేది లక్ష్యం. అయితే రూ.100 కోట్లు కూడా దాటలేదు.446 మండలాల్లో లోటు వర్షపాతంసీజన్ ప్రారంభమై 45 రోజులు దాటింది. జూలై రెండో వారం వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. ఖరీఫ్ సీజన్లో సాధారణ వర్షపాతం 575 ఎంఎం కాగా, ఇప్పటి వరకు 100 ఎంఎంకు మించి వర్షపాతం పడలేదు. దాదాపు 30 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. తొమ్మిది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 13 జిల్లాల్లో లోటు, 4 జిల్లాల పరిధిలో అత్యధిక లోటు వర్షపాతం నమోదైంది. 153 మండలాల్లో ఒకటి కంటే ఎక్కువ డ్రైస్పెల్స్జూలై రెండో వారం వచ్చినా సరే కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదవుతోంది. ఈ నెలాఖరు వరకు ఇదే స్థితి కొనసాగేలా కన్పిస్తోంది. ఒక డ్రై స్పెల్ (పొడి వాతావరణం) అంటే వరుసగా 21 రోజుల పాటు వానలు లేకపోవడం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 45 రోజులు కావస్తోంది. దాదాపు 153 మండలాల్లో ఒకటి కంటే ఎక్కువగా డ్రైస్పెల్స్ ఏర్పడ్డాయి. నెల్లూరుతో సహా రాయలసీమ జిల్లాల్లో 98, కోస్తా జిల్లాల్లో 37, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 9, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 5, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 4 చొప్పున మండలాల్లో ఒకటి కంటే ఎక్కువగా నమోదైన డ్రైస్పెల్స్ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.15 శాతం దాటని పంటల సాగుఖరీఫ్ సాధారణ పంటల సాగు విస్తీర్ణం 80 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాల సాగు లక్ష్యంగా అంచనా వేశారు. జూలై రెండో వారం వచ్చినా పంటల సాగు కనీసం 15 శాతం దాటలేదు. 12 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. మిగిలిన పంటలన్నీ కలిపి 3 ఎక్షల ఎకరాలు దాటలేదు. నెల్లూరు జిల్లాలో మాత్రమే 1.27 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా, ఇప్పటికే రికార్డు స్థాయిలో 2 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నెల్లూరు తర్వాత తిరుపతిలో 80 శాతం, కర్నూలులో 40 శాతం విస్తీర్ణంలో పంటలు సాగ య్యాయి. మిగిలిన ఏ జిల్లాలోనూ 15–20 శాతం దాటలేదు. గోదావరి, కృష్ణా డెల్టాల కింద సాగునీరు ఇచ్చామని గొప్పలు చెబుతున్నా.. ఒక్క తూర్పు గోదావరిలోనే 20 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవ్వగా, మిగిలిన జిల్లాల్లో 1–10 శాతం లోపే ఉన్నాయి.అదును దాటుతున్నా జాడలేని వేరుశనగ సాగుఖరీఫ్ సీజన్లో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యేది వేరుశనగ పంట. రాయలసీమ జిల్లాల్లో నూటికి 70–80 శాతం విస్తీర్ణంలో ఈ పంటే సాగవుతుంది. ఏటా 18 లక్షల ఎకరాల్లో సాగయ్యే ఈ పంటను ఈ ఏడాది 14.30 లక్షల ఎకరాలకు కుదించారు. సాధారణంగా ఈ పంట సాగు జూలై నెలాఖరులోగా పూర్తవుతుంది. కానీ ఈ ఏడాది జూలై రెండో వారం దాటుతున్నా.. పట్టుమని లక్ష ఎకరాల్లోనూ విత్తనం వేయని దుస్థితి. వరి, వేరుశనగ తర్వాత ఎక్కువగా సాగయ్యేది పత్తి. గతేడాది ఆశించిన ధరలు లేకపోవడంతో ఈసారి పత్తి సాగుపై రైతులు విముఖత చూపారు. దీంతో ఇప్పటి వరకు 4 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగైంది.మిరప సాగుకు దూరంగా రైతులుగతేడాది కనీస మద్దతు ధరలు లేక తీవ్ర నష్టాలను చవిచూసిన మిరప, పొగాకు రైతులు ఈసారి ఆ పంటల సాగుకు ముందుకెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. ఫలితంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో నేటికీ ఏ విత్తనం పడలేదు. గుంటూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మిరప విత్తనం కొనే నాథుడే కరువయ్యాడు. ఏటా రూ.150–200 కోట్లకుపైగా జరిగే మిరప విత్తన వ్యాపారం, ఈసారి రూ.15 కోట్లు కూడా దాటలేదని విత్తన వ్యాపారులు చెబుతున్నారు. ఏటా 6 లక్షల ఎకరాల్లో సాగయ్యే మిరప.. గతేడాది 4 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది అందులో కనీసం 30 శాతం విస్తీర్ణంలో కూడా మిరప సాగయ్యే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు తీవ్ర నష్టాలను మిగిల్చిన నల్లబర్లి పొగాకు రైతులు కూడా ఈసారి ఖరీఫ్ సాగుకు విముఖత ప్రదర్శిస్తున్నారు. ఏ పంట వేయాలన్నా భయమేస్తోందిగత ఖరీఫ్‌లో 4 ఎకరాలల్లో మిరప సాగు చేశాను. ఎకరాకు 15–20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.2 లక్షలు పెట్టుబడి అయ్యింది. అంతకు ముందు ఏడాది క్వింటా రూ.14 వేలకు పైగా అమ్ముకున్న తాలు కాయలను ఈసారి రూ.3 వేలతో అమ్ముకోవాల్సి వచ్చింది. 16 క్వింటాళ్ల తాలు కాయలు అమ్ముకోగా 60 క్వింటాళ్ల మేలు రకం కాయలు ధర లేక కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టాను. 2023లో రూ.20–27 వేల వరకు ధర పలికింది. ఈసారి రూ.6–10 వేలకు మించి పలకలేదు. కోల్డ్ స్టోరేజ్‌లో మిరపను దాచుకున్న రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. క్వింటాకు ఏడాదికి రూ.700 చెల్లించాలి. ఎకరాకు రూ.1.50 లక్షలు నష్టపోయాను. ఏ పంట వేయాలన్నా భయమేస్తోంది. – దారం ఎలిసా రెడ్డి, దారంవారిపాలెం, ప్రకాశం జిల్లా -
40 ఏళ్లలో కరువుల తీవ్రతశాతం పెరిగింది
కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. దాంతో కరువు కాటకాలు తప్పడం లేదు. కరువుల బెడద మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రపంచవ్యాప్తంగా గత 40 ఏళ్లలో కరువుల తీవ్రత ఏకంగా 40 శాతం పెరిగినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధనలు తేలింది. వర్షపాతం స్థిరంగా ఉన్నచోట కూడా కరువుల తీవ్ర పెరుగుతున్నట్లు వెల్లడయ్యింది. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ అది తేమను ఒడిసిపట్టుకొనే సామర్థ్యం సైతం పెరుగుతోంది. దాంతో కరువులు తీవ్రత సైతం పైపైకి ఎగబాకుతోందని సైంటిస్టులు వెల్లడించారు. వాతావరణం వేడెక్కడానికి, కరువులు తీవ్రంగా మారడానికి మధ్య దగ్గర సంబంధం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన క్లైమేట్ హజార్డ్స్ సెంరట్ డైరెక్టర్ క్రిస్ ఫాంక్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. రాబోయే రోజుల్లో ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు మరింత పెరగడమే తప్ప తగ్గిపోయే సూచనలైతే కనిపించడం లేదు. దీన్నిబట్టి చూస్తే మరింత తీవ్రమైన కరువులకు మానవాళి సిద్ధపడక తప్పదని చెప్పొచ్చు. ఈ అధ్యయనం కోసం 1901 నుంచి 2022 వరకు వాతావరణ డేటాను సేకరించి, విశ్లేíÙంచారు. అట్మాస్ఫియరిక్ ఎవాపరేటివ్ డిమాండ్(ఏఈడీ) పెరుగుతుండడంతో కరువుల తీవ్రత కూడా పెరుగుతున్నట్లు తేలింది. గత 40 ఏళ్లలో ఇది 40 శాతం పెరిగినట్లు స్పష్టమయ్యింది. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగినా సరే అక్కడి వాతావరణం తేమను అధికంగా పీల్చుకుంటుంది. పంటలు, చిత్తడి నేలలు, అడవుల నుంచి తేమ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఫలితంగా నేల నిస్సారమైపోతోంది. పంటలు ఎండిపోతాయి. చిత్తడి నేలలు పొడి నేలలుగా మారిపోతాయి. మరో విషయం ఏమిటంటే.. 1981–2017 నాటి సగటుతో పోలిస్తే గత ఐదేళ్లలో కరువు పరిస్థితి 74 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు 58 శాతం ఏఈడీనే కారణం. 2022లో భూగోళంపై రికార్డు స్థాయిలో 30 శాతం భూభాగం కరువునకు గురయ్యింది. దీనికి 40 శాతం ఏఈడీనే కావడం గమనార్హం. – న్యూఢిల్లీ -
ఎడారి నేల జలకళ
రాజస్థాన్ అనగానే గుర్తొచ్చేది ఎడారి. అందులోనూ కరౌలీ జిల్లా అంటేనే నీటికోసం తండ్లాట. వరుస కరువులు. పచ్చదనం అంటే తెలియని పల్లెలు. ఈ దృశ్యాన్ని మార్చేశారు మహిళలు. చుక్క చుక్కను ఒడిసిపట్టి పొఖార్(నీటికుంట)లను సృష్టించారు. ఉపాధి లేక బందిపోట్లుగా మారిన పురుషులను వ్యవసాయం వైపు మళ్లించి.. మళ్లీ రైతులను చేశారు. బంజరు నేలల్లో ఇప్పుడు బంగారం పడిస్తున్నారు. దుఃఖనదిలా మారిన షేర్నిని మళ్లీ జీవనదిగా మార్చారు. మే నెల మండుటెండల్లోనూ కరౌలీ చెరువులు, పొఖార్లు నీటితో కళకళలాడుతున్నాయి. నెమ్మదిగా ప్రవహిస్తున్న సేర్ని నది ఒడ్డున పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పక్కనే పశువులు మేస్తూ ఉన్నాయి. ఒక దశాబ్దం క్రితం, ఎవరూ ఊహించని దీనిని మహిళలు సాధ్యం చేసి చూపించారు. అదెలా సాధ్యమైందంటే... రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లా.. కరువుకు మారుపేరు. వాతావరణ మార్పులతో వర్షపాతం తగ్గింది. భూములు బంజరుగా మారా యి. నీటి వనరులు లేవు. 50 ఏళ్ల కిందట జీవనాధారంగా ఉన్న వ్యవసాయం, పశుపోషణ లే కుండా పోయింది. వేరే మా ర్గం లేక చాలా మంది వలసపోయారు. ఉపాధి లేక కొందరు నగరాలకు వలస వెళ్లగా, మరికొందరు మై నింగ్వైపు మొగ్గుచూపా రు. ఇంకొందరు బందిపోట్లుగా మారారు. ఒక్క సారి ఇంటినుంచి వెళ్లిన వారు తిరిగి ఇంటికొస్తారో లేదో తెలియదని భయం. మైనింగ్ నుంచి వచ్చే సిలికా ధూళితో సిలికోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధికి కారణమయ్యింది. ఈ పనిలోకి వెళ్లినవారిలో 74శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. చాలామంది 40 ఏళ్లు దాటి జీవించలేదు. నీటికరువు ఆ ప్రాంత సామాజిక పరిస్థితిని కూడా మార్చేసింది. నీళ్లు లేని కారణంగా ఆ జిల్లాలోని గ్రామాలకు పిల్లనివ్వాలంటే భయపడేవారు. మరోవైపు వరుస కరువులు, పేదరికంతో తమ ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేసి పంపేవారు కరౌలీ జిల్లాలోని గ్రామస్తులు. అందరి జీవితాల్లో ఒకరకమైన నిరాశ. కరువు నుంచి లక్షాధికారుల వరకు.. 2010లో మార్పునకు బీజం పడింది. నీటి సంరక్షణ స్వచ్ఛంద సంస్థ తరుణ్ భారత్ సంఘ్వారి జీవితాల్లోకి వచ్చింది. ఒకప్పటి చెరువులన్నీ ఎండిపోయాయి. మట్టి, ఇసుకతో నిండిపోయాయి. వాటిని పునరుద్ధరణకు నడుం కట్టారు మహిళలు. ఆలంపూర్ గ్రామ సంపత్తి దేవి అనే మహిళ అప్పటిదాకా తాను కూడబెట్టిన మొత్తాన్ని ఖర్చు చేసి 2015–16లో కొండ కింద పొఖార్ను నిర్మించింది. వర్షాలు పడినప్పుడు కొండపైనుంచి వచ్చిన నీటితో పొఖార్ నిండిపోయింది. ఏడాదికి సరిపడా నీరు. బందిపోటు అయిన భర్తను వ్యవసాయానికి ఒప్పించింది. 58 ఏళ్ల జగదీష్, ఆయన భార్య కలిసి ఇప్పుడు ఆవాలు, గోధుమలు, చిరుధాన్యాలు, కూరగాయలు పండిస్తున్నారు. ప్రతి సీజన్లో లక్షరూపాయలు సంపాదిస్తున్నారు. అదే జిల్లాలోని భూర్ఖేడ గ్రామానికి చెందిన ప్రేమ్.. బిడ్డలకు చిన్నవయసులోనే పెళ్లి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో భర్త బందిపోటుగా మారాడు. ఈ పరిస్థితి మార్చాలనుకుంది. గ్రామ శివార్లలో పొఖార్ నిర్మించేందుకు నాలుగు బిగాల సొంత భూమిని ఇచ్చింది. చెరువు నీటితో గోధుమలు, చిరుధాన్యాలను పండిస్తూ గర్వంగా కుటుంబాన్ని పోషించుకుంటోంది. బందిపోటు నుంచి రైతుగా మారిన మరో వ్యక్తి భూర్ఖేడకు చెందిన 60 ఏళ్ల లజ్జా రామ్. ‘నా తండ్రి రైతు. ఆ కాలంలో తగినంత నీరు ఉండేది. నేను పెరిగేకొద్దీ వర్షపాతం తగ్గింది, బావులు ఎండిపోయాయి. వ్యవసాయం కష్టమైంది. పశువులు చనిపోయాయి, తరువాత మా ప్రాణాలు పోతాయేమో అనిపించింది. అలా దొంగగా మారిపోయాను. నేను లొంగిపోయేందుకు నా సోదరి ఒప్పించింది. ఇప్పుడు మా 10 బిగాల భూమిలో గోధుమలు, ఆవాలు, శనగలు, ముత్యాల మిల్లెట్లను పండిస్తున్నారు. ఎనిమిది గేదెలు, మేకలతో ఆనందంగా ఉన్నాం’అని చెబుతున్నాడు. జీవనదిగా మారిన సేర్ని... ఈ పదిహేనేళ్ల కాలంలో.. జిల్లాలోని చుట్టుపక్కల అడవిలో ఇటువంటి 16 పొఖార్లను నిర్మించారు. ఇవన్నీ వర్షపు నీటిని ఒడిసిపట్టేవే. వీటినుంచి డీజిల్ పంపుల ద్వారా సాగుకు వాడుకుంటారు. పొఖార్లతో భూగర్భజలం మట్టం పెరిగింది. నేలను తవి్వతే ఐదు నుంచి పది అడుగుల లోపే నీరు అందుతుంది. జిల్లాలోని సేర్ని నది.. 40 ఏళ్లకిందట ఏడాది పొడవునా ప్రవహించేది. వాతావరణ మార్పులు.. అది ఎండిపోయేలా చేశాయి. దీపావళి పండుగ అయిపోయిందంటే నదిలో చుక్క నీరు కనిపించకపోయేది. కానీ.. ఇప్పుడది జీవనదిగా మారింది. వేసవిలోనూ నీరు ప్రవహిస్తోంది. నీరు జీవం.. నీటితో స్థిరత్వం వస్తుంది. నీటి గతిని అనుసరించే నాగరికతలు ఏర్పడ్డాయి. ఇప్పుడా నీరే రాజస్థాన్ ఎడారి జీవితాలను మార్చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ కరవులో ఊళ్ళు బతికేదెట్లా?
ఆంధ్రదేశం నదులతో, కొండలతో, సముద్ర తీరంతో సుసంపన్నమైనది. గోదా వరి, కృష్ణ, పెన్నా వంటి నదులు, ఉప నదు లతో ఒకనాడు సస్యశ్యామలంగా వర్ధిల్లింది. ఆంధ్రదేశ భౌగోళిక, సాంస్కృతిక, తాత్విక సాంకేతిక సంపద ప్రసిద్ధమైనది. చరిత్రకా రుల ప్రకారం మొత్తం భారతదేశంలోనే ఇన్ని భౌగోళిక వనరులున్న ప్రాంతం మరొకటి లేదు. 974 కిలోమీటర్ల సముద్ర తీరం దీనికి ఆయువు. నదులు, చెరువులు, కాలువలు, గడ్డి మైదానాలతో; పండ్ల, ఫల, వృక్షాలతో ఆంధ్రదేశం సుసంపన్నమైనది. అంతేకాదు, దక్షిణాపథంలో ఆంధ్రదేశం కీలక స్థానంలో ఉంది. దానికితోడు తూర్పు తీరమైదానం సారవంతమైన పంట భూమి. అచటి రేవు పట్టణాలు దూరదేశాలతో వాణిజ్యం సాగించి ఐశ్వర్యవంతమైనాయి. కాకతీయులు విజృంభించే వరకు తీరాంధ్రమే ఆంధ్రదేశ రాజకీయా ధికారానికి కేంద్రమై, సాంస్కృతిక ఉద్యమాలకు పుట్టినిల్లయింది. దక్షిణాపథంలో పశ్చిమ ప్రాంతంలో విజృంభించిన రాజవంశాలు తీరాంధ్రాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాయి. ఆంధ్రదేశాన్ని ఆక్రమించినవారు సులభంగా దక్షిణాపథ ఆధిపత్యం సాధించగలరు. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్రా నదుల అంతర్వేదిపై ప్రతి రాజవంశం దృష్టి ఉండేది. అందుకే దాన్ని వశపరచుకోడానికై పల్లవులు, చాళు క్యులు, రాష్ట్రకూటులు, చోళులు, కల్యాణి చాళుక్యులు, విజయనగర రాజులు, బహుమనీ సుల్తానుల సంఘర్షణలు యావద్భారత చరిత్ర లోనే ఆసక్తిదాయకమైనవి. తత్ఫలితంగా ఈ రాజ వంశాలకు యుద్ధ రంగమై ఆంధ్రదేశం అశాంతికి, బాధలకు గురైంది. ఈదండ యాత్రల ద్వారా ద్రావిడులు, కన్నడిగులు, మరాఠీలు (కాయస్థులు), కాళింగులు అధిక సంఖ్యలో ఆంధ్ర దేశానికి వచ్చి నిలిచిపోయినారు. అందుచేతనే భారతజాతిలో వలెనే ఆంధ్రజాతిలో భౌతికమైన వైవిధ్యం కనిపిస్తుంది. ఒకప్పుడు వర్ధిల్లిన ప్రాంతంభారతదేశాన్ని పాలించిన శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు మన వ్యవ సాయ సంస్కృతిని విస్తృతపరిచారు. అంతేగాకుండా మన సంపద బంగారు, వెండి, రాగి ధనాగారాలతో ఎలా వర్ధిల్లిందో చూడండి: విజయనగరంలో బంగారు, వెండి, రాగి నాణేలు అమలులో ఉండేవి. గద్యాణం బంగారు నాణెం. దాన్నే ‘వరాహ’ అనేవారు. ఇది చాళు క్యుల కాలం నుండి వస్తున్న నాణెం. బహుశా వరాహ పదమే ‘వరహా’ అయివుంటుంది.కృష్ణరాయల గద్యాణం 119.7 వడ్ల గింజల ఎత్తు ఉండేది. ఘట్టి వరాహ, దొడ్డ వరాహ అనే ప్రత్యేక గద్యా ణాలు కూడ ఇచ్చేవారు. గద్యాణంలో సగం ‘ప్రతాప’. తరువాతవి ‘పణం’, ‘చిన్నం’. ఇవి అన్నీ బంగారు నాణేలే. ఎక్కువ వాడుకలో ఉన్న నాణెం పణం. ‘తార్’ అనేది వెండి నాణెం. ఇది పణంలో ఆరో వంతు. జిటలు, కాసు అనేవి రాగి నాణాలు. ఇవిగాక రాజ్యం పశ్చిమ ప్రాంతాల్లో పోర్చుగీస్, ఈజిప్షియన్ నాణేలు వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనారం ఈజిప్షియన్ నాణెం. ప్రౌఢరాయలు ‘దీనార టంకాల’తో శ్రీనాథుని తీర్థమాడించినాడు. ప్రభుత్వమేగాక రాష్ట్రపాలకులు నగరాధిపతులు (వర్తక శ్రేష్ఠులు) గూడా నాణేలు ముద్రించేవారు. ‘ప్రతి సంస్థానానికీ టంక శాల గుత్త చేసుకొని వారి వారి పేరటను ముద్రలు కల్పించుతూ వచ్చిరి’ అని అట్టవన తంత్రం చెబుతున్నది. నాణేల నాణ్యతను కంసాలులు ఒరపు రాతినుపయోగించి నిర్ణయించేవారు. గ్రామాల్లో దుర్భర పరిస్థితులుఇకపోతే ఇప్పుడున్న ఆంధ్రదేశ పరిస్థితి చరిత్రతో పోల్చుకుని చూస్తే దారుణంగా ఉంది. ముఖ్యంగా గ్రామాలు త్రాగునీరు లేక, సాగునీరు అందక, చివరకు పశుగ్రాసం కూడా అందక విలవిల్లాడు తున్నాయి. ఆంధ్రదేశంలో జీవించే పరిస్థితులు లేక దళితులు, బడుగు వర్గాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిస్థితి కరవును తలపిస్తూ ఉంది. కరవు రాష్ట్రజీవన వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రధా నంగా గ్రామాల్లో వృద్ధులు అన్నం లేక, గంజి లేక, సూరుల క్రింద ఉసూరుమంటూ జీవిస్తున్నారు. సామాజిక కార్యకర్తలుగా గ్రామాలకు వెళితే గుండెలు తరుక్కు పోయే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మూడుతాళ్ళ పాడులో దళిత స్త్రీలను ప్రశ్నిస్తే, ‘అన్నం వండుకొని మూడు రోజు లైంది’ అని చెప్పారు.ఒకవేళ అన్నం వండుకున్నా చింతపండు పచ్చడి తప్ప కూర వండుకోలేని దశలో ఉన్నామనీ, ఇటువంటి దయ నీయమైన పరిస్థితి మా జీవిత కాలంలో ఎప్పుడూ చూడలేదనీ వారు అన్నారు. అంటే ఒక కూర వండుకునే పరిస్థితిలో కూడా ఇవ్వాళ్టి గ్రామాలు లేవు. ఈ పరిస్థితుల్లో కూడా భర్తలకు ఏదైనా పని దొరికితే వారు తాగే వస్తున్నారని చెప్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా రోడ్డులోని గోవిందాపురం మాదిగవాడలో కొందరు స్త్రీలతో మాట్లాడితే, కనీసం పని దొరికి వారం రోజులైందనీ, దొరికినా వచ్చే తక్కువ కూలీకి బియ్యం, ఇతర వస్తువులు రాక పస్తులుంటున్నామనీ, తలకు నూనె కూడా పెట్టుకోక నెలలు అయ్యిందనీ, పిల్లలను బడికి పంపలేక పనికి తీసుకెళుతున్నామనీ చెప్పారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలో కూలీ లేక ఊళ్ళకు ఊళ్ళు తరలి వెళ్ళిపోతున్నాయి. వ్యవసాయ కూలీలే కాదు, చేనేత కార్మికులైతే దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట దేవాంగులు, పద్మశాలీలు... ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు కుటుంబాలు జీవిస్తున్నామనీ, సరైన మజూరు లేక, ఇండ్లస్థలాలు లేక ఎమ్మార్వో చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయామనీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చేనేతవారికి ప్రకటించిన లోన్లు అడిగితే... ‘ప్రకటనలు అలాగే ఉంటాయి, మాకు ఏమీ ఆర్డర్స్ రాలే’దని చెపుతున్నా రనీ, ఇటువంటి ఆర్థిక దుఃస్థితి మేము గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ చూడలేదనీ అంటు న్నారు. విజయవాడలో ఒక బ్రాహ్మణ వీధిలో ఉంటున్న 200 కుటుంబాల్లో కనీసం 50 కుటుంబాలైనా పస్తులు ఉంటా యనీ, పట్టణాలలో పనిలేదనీ, ఇండ్ల స్థలాలు లేవనీ చెప్పారు. పోరాటమే మార్గం!ఆకలికి కులం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కరవు వలన నిరాసక్తత, నిర్వీర్యత అలుముకొని ఉన్నాయి. అటు పొలం పనులైన నాట్లు, కోతలు, కలుపులు లేవు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పనిచేసు కోవాలంటే, బిల్డింగ్ కట్టే పనులే కాని వ్యవసాయ కూలీ పనులు లేవు. ఆంధ్ర దేశానికి గుండెకాయగా చెబుతున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపల చెరువులు, రొయ్యల చెరువుల వలన వ్యవసాయ పనులు పూర్తిగా మృగ్యమయ్యాయి. పశువుల పరిస్థితి దారుణంగా ఉంది. పశువుల దాహార్తి, పశుగ్రాస లేమి సామాజిక, ఆర్థికవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏటా వేసవి సీజన్లో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉన్నా అధికారులు సకాలంలో స్పందించ లేదు. వేసవిలో పశుగ్రాసం కొరత, వాతావరణ పరిస్థితుల కారణంగా పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఎండు గడ్డి, పచ్చగడ్డి సమ పరిమాణంలో అందించడంతోపాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణకు సరైన చర్యలు తీసుకోవాలి. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో భూమి ఎందుకు పంచటం లేదనేది, కార్పొరేట్ వ్యవస్థలకే భూమి ఎందుకు చవక రేట్లకు ఇస్తున్నారనేది నగ్న సత్యం. ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి కూలీలు మండుటెండల్లో ఎండుతున్నా వారికి మంచినీళ్ళు లేవు. వారికి కూలీ నెలలు తరబడి ఆపుతున్నారు. వారు దిక్కులేని పక్షుల్లా బతుకుతున్నారు. నిరాశా నిస్పృహలతో ప్రజలు జీవిస్తున్నారు. ఇది మంచిది కాదు. పాలక వర్గాలు రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించాలి. దేశానికి ఆయువైన గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నిండాలి. రైతులు, రైతు కూలీలు, వృత్తిదారుల ముఖాలలో నవ్వు వికసించాలి. అందుకు పోరాటాలే మార్గం. ప్రజలు చైతన్యవంతులై అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. దళిత బహుజనులు తమ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడినప్పుడే నిజమైన విముక్తి కలుగుతుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఆరు జిల్లాల్లో కరువు
సాక్షి, అమరావతి: వర్షాలు లేక, పంటలు పండక ఆరు జిల్లాల్లో కరువు తాండవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తేల్చింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఖరీఫ్ సీజన్లోనూ ప్రభుత్వం 49 కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్లో వాటి సంఖ్య ఇంకా పెరిగింది. ప్రస్తుతం ఆరు జిల్లాల పరిధిలోని 51 మండలాల్లో కరువు ఉన్నట్లు నిర్ధారించింది. వాటిలోని 37 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉండగా.. 14 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో ఈ మండలాలు ఉన్నాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17, కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్ జిల్లాలో 10 తీవ్ర కరువు, కరువు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే అనంతపురం జిల్లాలో 7, నంద్యాల జిల్లాలో 5, శ్రీ సత్యసాయి జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర కరువు, కరువు పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. లోటు వర్షపాతం, ఎండిపోయిన పంటల పరిస్థితితో పాటు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెవెన్యూ శాఖ కరువు మండలాలను నిర్ధారించింది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. -
అన్నదాత ఆక్రందన
(పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి/నెట్వర్క్) : చంద్రబాబు పాలన అంటేనే కరువు కాటకాలకు పుట్టినిల్లంటారు! అన్నదాతలు భయపడినట్లుగానే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరువు.. మరోవైపు తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు.. ఒకటేమిటి వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు! ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. చివరికి చేతికొచ్చిన పంటకూ మద్దతు ధర దక్కక విలవిల్లాడి పోతున్నారు. మిర్చి నుంచి టమాటా వరకు.. ధాన్యం నుంచి కంది దాకా ఏ పంట చూసినా మద్దతు ధర లభించక.. పెట్టుబడి ఖర్చులూ దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రధాన పంటలకూ మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొన్నా.. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద టన్ను కాదు కదా.. కనీసం క్వింటా పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదు. అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం లేదు.. కరువు సాయం లేదు.. పంట నష్ట పరిహారం జాడ లేదు... పంటల బీమా రక్షణ లేదు... వెరసి ‘కాల కూటమి’ పాలనలో రైతన్నల బతుకు దుర్భరంగా మారింది!16 లక్షల ఎకరాలు సాగుకు దూరంఈ దఫా ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా, అతికష్టమ్మీద 70 లక్షల ఎకరాల్లోపు పంటలు సాగయ్యాయి. దాదాపు 16లక్షల ఎకరాలు సాగుకు దూరమయ్యాయి.ప్రకృతి వైపరీత్యాలతో 10 లక్షల ఎకరాల్లో పంట తుడిచి పెట్టుకుపోయింది. రాయలసీమలో దాదాపు వందకు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో సుమారు10 లక్షల ఎకరాలు బీడువారి పోయాయి. మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ప్రభుత్వం పైసా పరిహారం విదిల్చలేదు. 14.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ కేవలం 6.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఆరు లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప 3.72 లక్షల ఎకరాల్లోనే పరిమితమైంది.కాకి లెక్కలతో రైతు నోట్లో మట్టికష్టకాలంలో రైతన్నకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కాకి లెక్కలతో వారి నోట్లో మట్టికొట్టింది. సూపర్‌సిక్స్‌లో ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయంలో పైసా విదిల్చిన పాపాన పోలేదు. ఖరీఫ్–23లో 2.37లక్షల మందికి చెల్లించాల్సిన రూ.164.05 కోట్లతోపాటు రబీ–2023–24 సీజన్లో 1.54 లక్షల మందికి జమ కావాల్సిన రూ.163.12 కోట్ల కరువు బకాయిలు ఊసెత్తడం లేదు. చివరకు గత జూలైలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన 32 వేల మందికి రూ.31.53 కోట్లు నేటికీ జమ చేయలేదంటే రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోంది.ఎరువులకూ దిక్కు లేదు..ఎరువుల కొరత రైతులను అడుగడుగునా వేధించింది. చంద్రబాబు పాలనలో ఆనవాయితీగా రైతులు మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై రూ.100–400 వరకు వసూలు చేస్తూ డీలర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. పుండుమీద కారం చల్లినట్టుగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు బస్తాకు రూ.255 వరకు పెంచాయి. నాసిరకం ఎరువుల నిర్వాకం సాక్షాత్తూ పౌరసరఫరాల మంత్రి తనిఖీల్లోనే బట్టబయలైంది.దిగజారిన దిగుబడులు.. దక్కని మద్దతుధాన్యం సహా ఈ ఏడాది ప్రధాన పంటల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా దిగుబడులు తగ్గినప్పుడు మార్కెట్లో మంచి రేటు పలకాలి. కానీ ఈ ఏడాది ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొంది. ఏటా ముందస్తు ధరలను అంచనా వేసే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెటింగ్ కేంద్రం సైతం ఈ ఏడాది ఖరీఫ్ పంట ఉత్పత్తులకు ఆశించిన ధరలు లభించడం లేదని తేల్చి చెప్పింది. అధిక వర్షాలతో పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు గోదాముల్లో పేరుకున్న నిల్వల కారణంగా మిరప, పత్తి ధరలు దారుణంగా క్షీణించాయని తేల్చింది.రూ.20,000 సూపర్ సిక్స్‌లో ఇస్తామని ఎగ్గొట్టిన పెట్టుబడి సాయం 2019–24 మధ్య విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది పడని రైతులు.. కూటమి పాలనలో పడరాని కష్టాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరా నిలిచిపోయింది. సబ్సిడీ విత్తనాలు అరకొరగానే ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా సగటున 4 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేస్తే.. కూటమి సర్కారు మాత్రం చేతులెత్తేసింది. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై వంద నుంచి 400 వరకు డీలర్లు దండుకున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తాకు రూ.250 వరకు పెంపుతో రైతులకు పెనుభారంగా మారింది.» కనీస మద్దతూ కరువు» ధాన్యం బస్తాకు దక్కాల్సింది రూ.1,725 » దళారులు చెల్లిస్తున్నదిరూ.1,350–రూ.1,550 టమాట మీద నిలవని మంత్రి అచ్చెన్న టమాట పంట ధరలు పతనమై అన్నదాతలు గగ్గోలు పెట్టగా.. కిలో రూ.8కి కొంటామని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తర్వాత డబ్బుల్లేవని మాట మార్చారు. మార్కెట్లో టమాట ప్రస్తుతం కిలో రూ.20 ఉంది. రైతులకు దక్కుతున్నది రూ.3నుంచి రూ.5. మిర్చి, పత్తి మినుముధరల పతనం2023–24 సీజన్లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేలు పలికిన మిర్చి... ప్రస్తుతం సగటున రూ.8 వేలు–రూ.11 వేలు కూడా లేదు. నిరుడు పత్తి క్వింటా రూ.10 వేలకు పైగానే పలకగా.. నేడు రూ.4 వేల నుంచి రూ.5,800కు పరిమితమైంది. మినుముల ధర గత సీజన్ లో క్వింటా రూ.10 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.6 వేల నుంచి రూ.7,000 మాత్రమే.నిరుడు దిలాసా.. నేడు లాస్ డ్రాగన్ ఫ్రూట్ టన్ను నిరుడు రూ.1.80 లక్షలు పలకగా, నేడు రూ.1.20 లక్షలకు పడిపోయింది. అరటి రూ.25 వేలు, ద్రాక్ష రూ.40 వేలు, బొప్పాయి రూ.11 వేలు, పుచ్చకాయలు రూ.7 వేలు, కర్బూజా రూ.12 వేలకు మించడం లేదు. దిగుబడి లేక దిగాలు.. పరిహారం అందక కుదేలు2.80 ఎకరాల్లో వరి సాగు చేశా. తుపాన్‌తో రూ.50 వేలకు పైగా నష్టపోయా. పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం మా మండలంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఎకరాకు రూ.5వేలు నష్టపోతున్నా. – భాస్కర్, పీవీ పురం, సత్యవేడు మండలం, తిరుపతి జిల్లాఎకరాకు రూ.లక్ష నష్టంఖరీఫ్లో ఆరు ఎకరాల్లో మిరప వేశా. ఎకరానికి రూ.లక్షన్నర వరకు ఖర్చుపెట్టా. బొబ్బర తెగులుతోపంట దెబ్బతింది. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు. నిరుడు క్వింటా రూ.20 వేలు వరకు ఉంటే ఈ ఏడాది రూ.10 వేలకు కూడా కొనేవారు లేరు. ఎకరానికి రూ.లక్ష వరకు నష్టం వాటిల్లుతోంది. మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.– వెన్నపూసల జగన్మోహన్రెడ్డి, కాచవరం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా గత ఐదేళ్లూ బాగుంది..8 ఎకరాల్లో 1,500 చీనీ చెట్లు సాగు చేశా. కూలీలు, మందులు, ఇతర పెట్టుబడి కింద రూ.6.50 లక్షలు ఖర్చు చేశా. హెక్టారుకు 25 టన్నుల దిగుబడి ఆశిస్తే వాతావరణం దెబ్బకొట్టింది. 10 టన్నుల దిగుబడే వచ్చింది. గత నాలుగైదు సంవత్సరాలు మంచి వర్షాలు కురిశాయి. దిగుబడులు బాగా వచ్చాయి. టన్ను రూ.50 వేలకు తక్కువ కాకుండా ధర పలకడంతో లాభాలు ఆర్జించా. వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద పరిహారం రూపంలో కూడా లబ్ధి పొందా. – రైతు నాగన్న, ముకుందాపురం, గార్లెదిన్న మండలం, అనంతపురం జిల్లాపత్తి రైతు చిత్తురాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించిరాలేదు. గతేడాది క్వింటా రూ.10 వేలకు పైగా పలికిన పత్తి... ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి రూ.4 వేల నుంచి రూ.5,800 మించి పలకని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో సైతం గరిష్టంగా క్వింటాకు రూ.6,500 మించి ధర లేదని రైతులు చెబుతున్నారు. పెసర పంటకు కేంద్రం మద్దతు ధర రూ.8,558 ప్రకటించినా, ప్రస్తుతం మార్కెట్లో రూ.6 వేల నుంచి రూ.6,500 మించి పలకడం లేదు. 2023–24లో క్వింటా రూ.10 వేలు పలికిన మినుముకు ఈ ఏడాది రూ.7 వేలకు మించి ధర లేదు. టమాటా రైతులకు తొలి కోత నుంచే కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో కిలో రూ.20 పలుకుతున్నా రైతులకు మాత్రం రూ.3–5కు మించి దక్కడం లేదు. ధర లేకపోవడంతో చీని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగయ్యే కోకో పంటకు ఈసారి ధర లేకుండా పోయింది. చామంతి గతేడాది కిలో రూ.130 పలుకగా, ప్రస్తుతం కిలో రూ.20–30కి మించని పరిస్థితి నెలకొంది.మిర్చి రైతు కంట్లో కారంమిరప రైతులు తెగుళ్లు, చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక, మార్కెట్లో గిట్టుబాటు «ధర లేక తీవ్రంగా నష్టపోయారు. 2023–24 సీజన్లో 5.92 లక్షల ఎకరాల్లో మిరప సాగవగా, 2024–25లో కేవలం 3.94 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఎకరాకు రూ.2.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. జెమినీ వైరస్, నల్లతామర, ఇతర తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 10–15 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాని పరిస్థితి. 2023–24 సీజన్లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేల వరకు పలకగా, ప్రస్తుతం సగటున క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.11 వేలకు మించి రావడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి తేజ రకానికి క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.12 వేలు.. లావు రకాలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు.. మధ్యస్థ రకాలకు రూ.10–11 వేలకు మించి ఇవ్వడం లేదు. తెల్లకాయలు గతంలో క్వింటా రూ.10వేలు నుంచి రూ.13 వేలు పలికితే ప్రస్తుతం రూ.3వేల నుంచి రూ.4 వేలకు మించి కొనడం లేదు. రాష్ట్రంలోని గిడ్డంగుల్లో 27 లక్షల బస్తాల నిల్వలు పేరుకుపోయాయి. గతంలో టీడీపీ హయాంలో 12 లక్షల టన్నుల మిరప ఎగుమతులు జరగగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా, రికార్డు స్థాయిలో 16.10 లక్షల టన్నులను ఎగుమతి చేయడం గమనార్హం.రైతు కష్టం..పశువుల పాలు టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి కూరగాయల మార్కెట్లో కిలో టమాటా ధర రూ.3 నుంచి రూ.5 మధ్య పలికింది. 27 నుంచి 30 కిలోల బరువున్న టమాటా ట్రే ధర రూ.100 నుంచి రూ.150 మాత్రమే. కూలి, రవాణా ఖర్చులు పోగా, రైతులకు ఒక్కో ట్రేకు రూ.70 కూడా మిగలడం లేదు.చివరికి ఆ ధరకు కూడా మంగళవారం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో పలువురు రైతులు తాము తెచి్చన టమాటా పంటను మార్కెట్లోనే పశువులకు పారబోసి వెనుదిరిగారు. ఉద్యాన, కూరగాయల రైతులను ఆదుకుంటామని చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం పత్తా లేకుండా పోయిందని, తమకు కష్టాలు తప్పడంలేదని రైతులు వాపోయారు. – బొబ్బిలి నాడు ప్రతీ పంటకు ‘మద్దతు’ఎన్నికల హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పతనమైన ప్రతిసారీ జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తి, పసుపుతో సహా సజ్జలు, కొర్రలు, రాగులు, శనగ, పెసలు, కంది, వేరుశనగ, జొన్నలు, ఉల్లి, టమాటా, బత్తాయి, అరటి రైతులకు అండగా నిలిచింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి వంటి పంటలకు సైతం ఎమ్మెస్పీని ప్రకటించి ఐదేళ్లూ ఆ ధరకు ఒక్క రూపాయి తగ్గకుండా చూసింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేశారు.అంటే.. రెట్టింపు కన్నా అధికం. ఇక చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన 3,403 టన్నుల పత్తి, రూ.18 కోట్ల విలువైన 8,459.56 టన్నుల టమాటాను సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ఖజానాలో సొమ్ములు లేకపోయినా..వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో రూ.100 కోట్లకు మించి డబ్బులు లేకున్నా పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారు. రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. శనగలు, మొక్కజొన్న, పత్తి, కందులు, పసుపు.. ఇలా తొలి ఏడాదిలోనే 14 రకాల ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించారు. 3,76,902 మంది రైతుల నుంచి రూ.4354.11 కోట్ల విలువైన 11,02,105 టన్నుల పంట ఉత్పత్తులను సేకరించి చిత్తశుద్ధిని చాటుకుంది. -
గ్లోబల్ ‘వార్నింగ్’ ఇటు వరద... అటు కరువు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రానున్న కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ప్రాంతాల వారీగా తీవ్రతను బట్టి వరదలు, కరువు వంటి పరిస్థితులు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు తీవ్ర కరువును, మరికొన్ని తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నాయి. ఈమేరకు ఐఐటీ గువహటి, ఐఐటీ మండీ, బెంగళూరుకు చెందిన సీఎస్‌టీఈపీ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ) సంస్థలు తాజాగా చేసిన సంయుక్త అధ్యయనంలో పేర్కొన్నాయి.దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వాతావరణంలో మార్పులు, వరదలొచ్చే అవకాశాలు, కరువులు వంటివాటిపై అధ్యయనం చేశారు. దీని ప్రకారం ఏపీలోని మూడు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు వెల్లడించారు. కరువు కోరల్లో విశాఖ, కర్నూలు రాష్ట్రంలోనే ప్రధాన నగరంగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో కరువు సమస్య పొంచివున్నట్టు అధ్యయనంలో తేలింది. దీంతోపాటు కర్నూలు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్ర కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఐటీ నిపుణులు తేల్చారు. గతంతో పోలిస్తే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ (భూ ఉపరితల ఉష్ణోగ్రత) 1 డిగ్రీ సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. ఎక్కువ ఉష్ణోగ్రతల ఒత్తిడి కారణంగా కొండచరియలు విరిగి పడటం వంటి ప్రమాదాలూ ఉండవచ్చునని పేర్కొన్నారు. వరదల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. ఇదిలా ఉండగా.. వరద ముప్పుతో పాటు గుంటూరుకు కరువు ప్రమాదం కూడా ఉందని తేల్చారు.శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు వరద ముప్పు చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరద ప్రమాదాన్ని, 118 జిల్లాలు అధిక వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు తేలింది. మరో 91 జిల్లాలు అత్యధిక కరువు ప్రమాదం, 188 జిల్లాలు అధిక కరువు ప్రమాదం ఉన్న కేటగిరీలో చేర్చారు. వరద ముప్పులో ‘ఆ మూడు’ రాష్ట్రంలో రానున్న సంవత్సరాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్లు అధ్యయనంలో తేల్చారు. వాతావరణంలో మార్పులు, తుపానులు, ఉష్ణోగ్రతల కారణంగా ఈ మూడు జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల వరదల కారణంగా విజయవాడ నీట మునిగిన విషయం తెలిసిందే. -
తీవ్రమైన కరువు కోరల్లో కెన్యా
కెన్యా నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువుతో కొట్టుమిట్టాడుతోంది. లక్షలాది మంది ప్రజలు తగినంత ఆహారం, నీరు లేకుండా అల్లాడిపోతున్నారు. వాతావరణ మార్పులతో తీవ్రమైన కరువు దేశ వ్యవసాయం, పశుసంపదపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో కెన్యా ప్రజల జీవనోపాధి కష్టమవుతోంది. తినడానికి తిండి, తాగడానికి మంచి నీరు కూడా లేక లక్షలాది మంది ప్రజలు అంటు వ్యాధులబారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. ఎండిపోతున్న జలాశయాలు కెన్యాలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన కరువు తాండవిస్తోంది. నదులు, సరస్సులు, జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. చిన్నపాటి చెరువులు ఎండిపోతున్నాయి. ఐక్యరాజ్యసమితి నీటి అభివృద్ధి నివేదిక ప్రకారం భూగర్భ జల మట్టాలు సైతం పడిపోతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు దేశాన్ని తీవ్రమైన కరువులోకి నెట్టేశాయి. 15 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ దీర్ఘకాలిక కరువు ధాటికి దాణా దొరక్క ఏకంగా 70 శాతం పశువులు ప్రాణాలు కోల్పోయాయి. పాడి ఆవులపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవనం ఇప్పుడు ఆదాయం లేక దుర్భరమైంది. ఆహార వనరులు కూడా తగ్గిపోయాయి. కరువు దెబ్బకు ఉన్న కాస్తంత ప్రధాన ఆహారాల ధరలు అమాంతం పైకిఎగశాయి. బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు ఐదేళ్ల సగటు కంటే 10 నుంచి 90 శాతం అధికంగా ఉన్నాయి. ఎంత లోతు తవ్వినా.. 2023లో కొన్ని ప్రాంతాల్లో దశాబ్దం కిందటి కంటే రెట్టింపు లోతులో బావులు తవ్వాల్సి వచ్చింది. తీవ్రమైన కరువు కారణంగా, చాలా మంది భూగర్భం నుంచి తీసుకువచ్చిన నీటిని తాగవలసి వస్తోంది. ఇది కూడా పరిశుభ్రంగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో నీటి విక్రయాలు పెరిగాయి. ఆ నీరు సైతం పరిశుభ్రంగా ఉండకపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు, కెన్యా కరువు ప్రతిస్పందన పథకం కింద సుమారు 30 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన కరువు సహాయాన్ని పొందారు.ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి తక్కువ పారిశ్రామికీకరణతో ఇక్కడ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తక్కువే. అయినా తక్కువ వర్షపాతం, గ్లోబల్ వార్మింగ్ కరువుకు కారణమవుతున్నాయి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, భవిష్యత్తులో కరువు ప్రభావాలను తగ్గించడానికి దేశానికి ఆర్థిక మద్దతును పెంచాలని కెన్యా ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని ఈ ఏడాది అజర్ బైజాన్‌లోని బాకు నగరంలో జరిగిన 2024 ఐక్యరాజ్యసమితి కాన్ఫెరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్29) సదస్సు పునరుద్ఘాటించింది. ఇలాంటి క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి దేశానికి సహాయపడటానికి అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింత ఆర్థిక మద్దతు అవసరమని నొక్కి చెప్పింది. – సాక్షి నేషనల్ డెస్క్ -
మానని గాయం
ఆధునిక కాలంలో మనిషి అంతరిక్షాన్ని అందుకోగలిగాడు; చంద్రమండలం మీద అడుగు మోప గలిగాడు; సహజ మేధకు పోటీగా కృత్రిమ మేధను సృష్టించాడు; విశ్వామిత్ర సృష్టిని తలపించేలా మనుషులకు దీటైన మరమనుషులను సృష్టించాడు. ఇంతటి మహత్తర ఘనతలను చూసినప్పుడల్లా ‘మానవుడే మహనీయుడు/ శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు... జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే!’ అనుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోతాం. రేపో మాపో అంగారక గ్రహం మీద ఆవాసాలను ఏర్పాటు చేసే దిశగా మనుషులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతాం. మనిషి సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టాలంటే, ఎన్ని గ్రంథాలైనా చాలవు.చరిత్రలో ఇన్ని ఘన విజయాలు సాధించిన మనిషికి అనాది పరాజయాలు కూడా ఉన్నాయి. ఆధునికత సంతరించుకుని, అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి–అమరత్వాన్ని సాధించే దిశగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే, ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని నేటికీ కనుక్కోలేకపోవడం మాత్రం ముమ్మాటికీ మనిషి వైఫల్యమే! యుద్ధాలలో ఉపయోగించ డానికి అధునాతన ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేయగలుగుతున్న మనిషి – అసలు యుద్ధాల అవసరమే లేని శాంతియుత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం కూడా వైఫల్యమే! ప్రపంచంలో మనిషికి క్షుద్బాధను మించిన దుర్భర బాధ మరొకటేదీ లేదు. పురాణ సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఆకలి ప్రస్తావన మనకు విరివిగా కనిపిస్తుంది. తాను ఆకలితో అలమటిస్తున్నా, అతిథికి అన్నం పెట్టి పుణ్యలోకాలకు వెళ్లిన రంతిదేవుడి కథ తెలిసినదే! ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్న విశ్వామిత్రుడి కథ పురాణ విదితమే! ఆకలి బాధ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది.అందుకు విశ్వామిత్రుడి కథే ఉదాహరణ. పురాణాల్లో అక్షయపాత్రలు పుణ్యాత్ముల ఆకలి తీర్చిన గాథలు ఉన్నాయే గాని, సామాన్యుల ఆకలి తీర్చిన ఉదంతాలు లేవు. ఆకలితో అలమ టిస్తున్నా, త్యాగం చేయడం గొప్ప సుగుణమని చెప్పే పురాణాలు – ఆకలికి శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చెప్పలేదు.ఆధునిక సాహిత్యంలో ఆకలి ప్రస్తావనకు కరవు లేదు. స్వాతంత్య్రోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అని ఎలుగెత్తిన గరిమెళ్ల – ఆ పాటలోనే ‘పన్నెండు దేశాలు పండుతున్నాగాని/ పట్టెడన్నమె లోపమండీ/ ఉప్పు పట్టుకుంటే దోషమండీ/ నోట మట్టి కొట్టుకుపోతామండీ/ అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండీ’ అంటారు. స్వాతంత్య్రం రాక ముందు మన దేశంలోని ఆకలి బాధలు అలా ఉండేవి. ప్రపంచమంతా ఆర్థికమాంద్యంతో అతలా కుతలమైన హంగ్రీ థర్టీస్ కాలంలో కలాలతో కవాతు చేసిన కవులందరూ ఆకలి కేకలు వినిపించిన వారే! ‘ఆకలి ఆకలి తెరిచిన/ రౌరవ నరకపు వాకిలి/ హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి/... ఈ ఆకలి హోరు ముందు/ పిడుగైనా వినిపించదు/ ఆకలి కమ్మిన కళ్లకు/ ప్రపంచమే కనిపించదు’ అన్న బైరాగి ‘ఆకలి’ కవిత పాఠకులను విచలితులను చేస్తుంది. ‘అన్నపూర్ణ గర్భగుడిని/ ఆకలి గంటలు మ్రోగెను/ ఆరని ఆకలి కీలలు/ భైరవ నాట్యము చేసెను/ ఘోర పరాజ యమా ఇది?/ మానవ మారణ హోమం/ తల్లీ! ఆకలి... ఆకలి!’ అంటూ సోమసుందర్ ఆకలి కేకలు వినిపించారు.‘నేను ఆకలితో ఉన్నాను/ నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు... నేను తిండిలేక నీరసిస్తున్నాను/ నాకు వాగ్దానాలు మేపుతున్నావు’ అంటూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పురోగతి ఒకవైపు, ఆకలి బాధలు మరోవైపుగా ఉన్న ఈ లోకంలో పాలకుల తీరును శ్రీశ్రీ ఎత్తిపొడుస్తారు. ఇప్పటికీ లోకం తీరు పెద్దగా మారలేదు. మానవుడు పంపిన ఉపగ్రహాలు అంగారకుడి వద్దకు వెళ్లినా, ఆకలి బాధలు సమసి పోలేదు; ఆకలి చావులు ఆగిపోలేదు.మనిషి ఘన విజయాల చరిత్రలో ఆకలి, అశాంతి– రెండూ మాయని మరకలు. ఈ రెండు మరకలూ పూర్తిగా చెరిగిపోయేంత వరకు మనిషి ఎన్ని విజయాలు సాధించినా, అవేవీ మానవాళికి ఊరటనూ ఇవ్వలేవు; మానవాళిని ఏమాత్రం ఉద్ధరించనూ లేవు. ఆకలికి, అశాంతికి మూలం మను షుల్లోని అసమానతలే! ప్రపంచంలో అసమానతలు తొలగిపోనంత వరకు ఆకలిని రూపుమాపడం, శాంతిని నెలకొల్పడం అసాధ్యం. నిజానికి సంకల్పం ఉంటే, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు గాని, అసమానతలను రూపుమాపే సంకల్పమే ఏ దేశంలోనూ పాలకులకు లేదు. అందువల్లనే ఆకలి, అశాంతి మనుషులను తరతరాలుగా పట్టి పీడిస్తున్నాయి. అకాల మరణాలకు కారణమవుతున్నాయి. ఆకలి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు పాతికవేల నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అంటే, ఏడాదికి సగటున ఏకంగా తొంభై లక్షల మంది ఆకలికి బలైపోతున్నారు. ఆకలితో మరణిస్తున్న వాళ్లలో పసిపిల్లలు కూడా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాల్లో దాదాపు యాభై శాతం ఆకలి చావులే! నాణేనికి ఇదొకవైపు అయితే, మరోవైపు వంద కోట్లమందికి ఆకలి తీర్చడానికి తగినంత ఆహారం ప్రతిరోజూ వృథా అవుతోంది. ఈ పరిస్థితిని గమనించే ‘అన్నపు రాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ వాపోయారు.ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఐదో స్థానంలో ఉన్న మన దేశం– ఆకలి సూచిలో నూట ఐదో స్థానంలో ఉండటం ఒక కఠోర వాస్తవం. అమృతోత్సవ భారతంలో ఆకలి సమస్య ఒక మానని గాయం! -
కోరలు చాచిన కరువు రక్కసి.. రైతన్న ఉక్కిరిబిక్కిరి
రాయదుర్గం/కర్నూలు(అగ్రికల్చర్): రాయలసీమ జిల్లాల్లో కరువు తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నా కూటమి సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదు. పైగా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోంది. వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది ఖరీఫ్ పంటలు చాలా ప్రాంతాల్లో తుడిచి పెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పులు రైతులకు గుది బండగా మారుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో మొత్తంగా 18 లక్షల ఎకరాలకు గాను 15 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. వర్షాభావం వల్ల 3 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాలేదు. సాగైన దాంట్లో దాదాపు 6–7 లక్షల ఎకరాల్లో పంటలు అతివృష్టి వల్ల దెబ్బతిన్నాయి. మిగతా చోట్ల అదునులో వర్షం కురవక పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం ఉన్నా ఆదుకునే చర్యలు చేపడుతుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం అన్నదాతల గోడు పట్టినట్టు లేదు. రాయలసీమ జిల్లాల్లో పెద్దగా కరువే లేదన్నట్టు.. కేవలం 54 మండలాలను మాత్రమే కరువు జాబితాలో చేర్చి చేతులు దులిపేసుకున్నారు. మిగిలిన మండలాల రైతులకు అన్యాయం చేశారు. కూటమి సర్కార్ తీరును విపక్షాలు, రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి. జిల్లాలో కనీసం 31 మండలాలను కరువు జాబితాలో చేర్చాలని, లేకుంటే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. రైతుల పట్ల చంద్రబాబు చిన్నచూపుఅధిక వర్షాలు, అనావృష్టి వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. పంట దిగబడులు పడిపోయినా రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం, ధరలు పడిపోవడంతో వ్యవసాయానికి కలసి రాలేదు. స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఏ ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. కర్నూలు జిల్లాలో అయితే కేవలం రెండు మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, హాలహర్వి, కొసిగి, దేవనకొండ, తుగ్గలి, పత్తికొండ, హొలగొంద, చిప్పగిరి తదతర మండలాల్లో రైతులు నష్టాల ఊబిలో కూరుకపోయారు. ఈ ప్రాంతం నుంచి దాదాపు 20 వేల కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లాయి. ఏ మండలంలో చూసిన బతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాలకు వలస పోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులు 2014–15 నుంచి 2018–19 వరకు ప్రతి ఏటా కరువు వచ్చింది. మళ్లీ ఇప్పుడు నాటి కరువు పరిస్థితులే పునరావృతం అయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పంటలు చేతికందక, అప్పుల బాధలు పెరిగిపోవడంతో దిక్కుతోచని రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఒక్క కర్నూలు జిల్లాలోనే 18 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క సెప్టెంబరు నెలలోనే వ్యవసాయ అధికారుల సమాచారం మేరకే ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంట కోత ప్రయోగాల ప్రకారం పత్తి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంట దిగుబడులు కూడా తగ్గిపోయాయి. ప్రదాన పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. వాస్తవం ఇలా ఉంటే జిల్లా యంత్రాంగం ఉద్దేశ పూర్వకంగా కరువును కప్పిపుచ్చుతోందని ఇట్టే తెలుస్తోంది. నాలుగేళ్లు సుభిక్షంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆశించిన రీతిలో వర్షాలు పడ్డాయి. ఏ జిల్లాలోనూ కరువు అన్న మాటే వినిపించలేదు. అయితే 2023లో దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపైనా చూపింది. ఈ నేపథ్యంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ఆలోచన లేకుండా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టారు. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న 1,79,815 హెక్టార్లకు సంబంధించి 1,69,970 మంది రైతులకు ఏకంగా రూ.251.21 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ జమ చేశారు. మరో వైపు రైతు సంక్షేమానికీ పెద్దపీట వేశారు. విత్తు మొదలు పంట విక్రయం వరకు చెయ్యి పట్టి నడిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రాయితీ పరికరాలన్నీ రైతు చెంతకే చేర్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అన్నదాతలకు అండగా నిలిచారు.వర్షాభావం ముంచింది ఈ ఏడాది ఒకవైపు వర్షాభావం, మరోవైపు అధిక వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. నేను మూడున్నర ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా. కేవలం 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. పంటను అమ్మగా వచ్చిన మొత్తం పెట్టుబడికి కూడా సరిపోలేదు. కరువు తీవ్రంగా ఉన్నా. ప్రభుత్వం గుర్తించకపోవడం అన్యాయం. భూగర్భ జలాలు కూడా బాగా తగ్గిపోయాయి. తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. – సంజీవరెడ్డి, ముక్కెళ్ల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలిఅత్యంత వెనుకబడిన గుమ్మఘట్ట మండలాన్ని కరువు జాబితాలో చేర్చాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుని సహాయ చర్యలు చేపట్టారు. వడ్డీ లేని రుణాలు, ఇన్పుట్ సబ్సీడీ, ఇన్సూరెన్స్, వాతావారణ బీమాను సకాలంలో అందించారు. కూటమి ప్రభుత్వం కనీసం కరువు మండలంగా కూడా గుర్తించకపోవడం దారుణం. – రాముడు, చెరువుదొడ్డి, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా -
రాష్ట్రంలో ‘రబీ’ నష్టం రూ. 320 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్/కర్నూలు(అగ్రికల్చర్): గత రబీ సీజన్ (2023–24)లో కరువు పరిస్థితుల కారణంగా గత ప్రభుత్వం ఆరు జిల్లాల పరిధిలో ప్రకటించిన 87 కరువు మండలాల్లో రూ. 320 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆరి్థకసాయం అందజేయాలంటూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ)కు సమగ్ర కరువు నివేదిక అందజేశారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో రాష్ట్రస్థాయిలో రబీ నష్టంపై సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రితే‹Ùచౌహాన్ నేతృత్వంలో ఆరుగురు కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. మరో నలుగురితో కూడిన కేంద్ర బృందం నెల్లూరు నుంచి వర్చువల్ పద్ధతిలో సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఆర్.కూర్మనాథ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, గ్రౌండ్ వాటర్ ఏడీ విశ్వేశ్వరరావు, జేడీఏ జగ్గారావు, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు ఎం.బ్రహ్మాజీ, పశుశాఖ జేడీ జెడ్.ఈశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ శివప్రసాద్‌తో కూడిన రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు కూడా సమీక్షకు హాజరయ్యారు. 24 రకాల పంటలకు దెబ్బ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో గత రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర బృందానికి రాష్ట్ర, జిల్లా అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 14 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో 18, నంద్యాలలో 13, ప్రకాశంలో 31, నెల్లూరులో 10... మొత్తంగా ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు జాబితాలో ప్రకటించినట్లు తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో 2.53 లక్షల హెక్టార్లలో 24 రకాల పంటలు దెబ్బతినడంతో రూ.1,207 కోట్లు విలువ చేసే 2.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు కోల్పోయినట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకు రెండు హెక్టార్లకు ఆరి్థకసాయం అందించడానికి వీలుగా 2.38 లక్షల మంది రైతులకు రూ. 228.03 కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రూపంలో అందించాలని కోరారు. పంటనష్టం కాకుండా ఉద్యానశాఖ, పశుశాఖ, ఉపాధిహామీ, గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరా తదితర వాటికి మరో రూ. 91.74 కోట్లు... మొత్తంగా రూ.319.77 కోట్లు కరువు సాయం అందించాలని కోరుతూ సమగ్ర కరువు నివేదికను కేంద్ర బృందానికి అందించారు. ఇక్కడే ఆరు జిల్లాల పరిధిలో జరిగిన పంటనష్టం గురించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఒక బృందం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు, మరొక బృందం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు వెళ్లాయి.నగరడోణ, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే కరువు నివారణ కర్నూలు జిల్లాలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలంటే ప్రధానంగా నగరడోణ రిజర్వాయర్, వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదించాలని రైతులు, రైతు సంఘాల నేతలు ఐఎంసీటీ ప్రతినిధులను కోరారు. కేంద్ర బృందం బుధవారం కర్నూలు కలెక్టరేట్లో రబీ కరువును ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. శనగ, జొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి కరువు తీవ్రతను తెలుసుకున్నారు. 2023–24 ఖరీఫ్, రబీల్లో వివిధ పంటల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లించాలని కోరారు. గురువారం జిల్లాల్లో కరువు పరిశీలన తర్వాత అన్ని బృందాలు విజయవాడ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. -
కరవు పాట
దేశానికి ఎదురయ్యే నానా సమస్యల్లో కరవు ఒకటి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధ వరకు ఎదిగినా, కరవు కాటకాలను పూర్తిగా రూపుమాపే స్థాయికి మాత్రం ఇంకా చేరుకోలేదు. రాజ్యానికి వాటిల్లే అనేకానేక ఆపదల్లో దుర్భిక్షాన్ని కూడా ఒకటిగా మన ప్రాచీన సాహితీవేత్తలు గుర్తించారు. అయితే, ఇందులో మానవ ప్రమేయాన్ని మాత్రం పాపం వారు గుర్తించలేకపోయారు. ‘అమానుషోగ్నిః, అవర్షం, అతివర్షం, మారకః, దుర్భిక్షం, సస్యోపఘాతః, జంతుసర్గః, వ్యాధిః, భూత పిశాచ శాకినీ సర్ప వ్యాళ మూషక క్షోభాశ్చేత్యాపదః’ అన్నాడు సోమదేవుడు. ఈ శ్లోకం ఆయన రాసిన ‘నీతి వాక్యామృతం’లోనిది. అంటే, మనుషుల వల్ల కాకుండా, ఇతర కారణాల వల్ల వాటిల్లే అగ్నిప్రమాదాలు, వర్షాలు లేకపోవడం, అతి వర్షాలు, మహమ్మారి వ్యాధులు, దుర్భిక్షం, పంటలకు నష్టం కలగడం, అడవి జంతువుల సంఖ్య విపరీతంగా పెరగడం, రోగాలు, భూత పిశాచాదులు, పాములు, అదుపు తప్పిన ఏనుగులు, ఎలుకలు– ఇవీ రాజ్యంలో కలిగే ఆపదలు. పురాతన రాజ్యాల్లోనే కాదు, దుర్భిక్ష పరిస్థితులు వర్తమాన దేశాల్లోనూ ఉన్నాయి.పురాతన కాలంలో ఆనకట్టలు కట్టే పరిజ్ఞానం లేకపోవడంతో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కోవడం కష్టంగా ఉండేది. ఆధునిక కాలంలో ఆనకట్టలు కట్టడం నేర్చుకున్నాం. నీటిపారుదలను మెరుగుపరచుకున్నాం. అయినా ఎక్కడో ఒకచోట కరవు తాండవిస్తూ ఉండటమే విచారకరం. ముందుచూపు లేకుండా అడవులను నరికివేయడం వల్లనే ప్రపంచంలో చాలా చోట్ల కరవు కాటకాలు తలెత్తుతున్నాయి. ఒకప్పటి పచ్చని నేలలు ఇప్పుడు బీడు భూములుగా, ఎడారులుగా మారుతున్నాయి. ‘విచారకరమైన సంగతేమిటంటే, అడవిని సృష్టించడం కంటే ఎడారిని సృష్టించడం సులువు’ అన్నాడు ఇంగ్లిష్ పర్యావరణ శాస్త్రవేత్త జేమ్స్ లవ్‌లాక్. కష్టమైన పనులు చేపట్టే బదులు సులువైన పనులు చేయడమే కదా మనుషుల సహజ లక్షణం. అందుకే సునాయాసంగా ఎక్కడికక్కడ ఎడారులను సృష్టిస్తున్నారు.కరవు సాహిత్యం మనకు కరవు కాదు. దుర్భిక్ష వర్ణన తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడితో మొదలైంది. అప్పట్లో కరవు కాటకాలకు ఆలవాలమైన పలనాటి సీమలో ఆకుకూరలతో జొన్నకూడు తినలేక శ్రీనాథుడు నానా తిప్పలు పడ్డాడు. చివరకు ఉక్రోషం అణచుకోలేక ‘ఫుల్ల సరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా/డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేమొ? తింత్రిణీ/పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటిలో/ మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్’ అంటూ సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడికే సవాలు విసిరాడు. కేవలం పలనాడులోనే కాదు, రేనాటి సీమలో కూడా శ్రీనాథుడికి కారం కలిపిన జొన్నకూడు తినవలసిన దుర్గతి తటస్థించింది. అప్పుడు ‘గరళము మ్రింగితి ననుచుం/బురహర గర్వింపబోకు పో పో పో నీ/ బిరుదింక గానవచ్చెడి/ మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ’ అని పరమశివుడిని సవాలు చేశాడు. దుర్భిక్ష దుర్గతిని అనుభవించి పలవరించిన తొలి తెలుగు కవి శ్రీనాథుడు.ఆధునికులలో విద్వాన్ విశ్వం రాయలసీమలోని పెన్నా పరివాహక ప్రాంతంలోని పల్లెల కరవు కష్టాలకు చలించిపోయి, ‘అదే పెన్న! అదే పెన్న!/ నిదానించి నడు/ విదారించు నెదన్, వట్టి/ ఎడారి తమ్ముడు’ అంట ‘పెన్నేటి పాట’ను హృదయ విదారకంగా రాశారు. కరవు మనిషిని నానా రకాలుగా దిగజారుస్తుంది. నేరాలకు పురిగొల్పుతుంది. ‘కరవు కాలంలో రొట్టెముక్కను దొంగిలించిన మనిషిని దొంగగా చూడరాదు’ అన్నాడు బ్రిటిష్ గీత రచయిత క్యాట్ స్టీవెన్స్. అయితే, కరవు కాలంలో మనుషుల్లో అంత ఔదార్యం మిగిలి ఉంటుందా అన్నది అనుమానమే! మొదటి ప్రపంచయుద్ధం దెబ్బకు 1914–23 కాలంలో భారత్ సహా నలబై ఐదు దేశాలు కరవు కాటకాలతో అల్లాడిపోయాయి. అప్పటి కరవుకాలంలో అమెరికా ఈ దేశాలను ఆదుకున్న తీరును, ఆనాటి కరవు తీవ్రతను వివరిస్తూ అమెరికన్ రచయిత, సామాజిక కార్యకర్త హెర్బర్ట్ హూవర్ ‘యాన్ అమెరికన్ ఎపిక్: ఫేమిన్ ఇన్ ఫార్టీ ఫైవ్ నేషన్స్’ అనే పుస్తకం రాశాడు. నేటి ప్రపంచంలో కరవు కరాళనృత్యం చేసే దేశాల్లో సోమాలియా ముందు వరుసలో ఉంటుంది. ప్రకృతి కారణాలే కాకుండా; యుద్ధాలు, సంక్షోభాలు అక్కడి కరవును మరింత కర్కశంగా మారుస్తున్నాయి. ‘ఆకలి నా అనుదిన ఆహారం/ కరవు నా ఊపిరి/ నిర్లక్ష్యమే నా సంరక్షణ/ దాతల జోలపాటకు నేను నిద్రపోతాను/ ఆ పాట ఎలా పాడాలో వితరణ సంస్థలకు తెలుసు’ అంటాడు ‘నేను సోమాలీ శిశువును’ అనే కవితలో సోమాలీ కవి అబ్ది నూర్ హజీ మహమ్మద్. నేడు కరవు, ఎడారీకరణలపై పోరాట దినం. ప్రస్తుత ప్రపంచంలో ఇరవై మూడు దేశాలు గడచిన ఆర్థిక సంవత్సరంలో కరవు ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. వీటిలో మూడు ఆఫ్రికన్ దేశాలైతే, వరుసగా నలభై ఏళ్ల నుంచి కరవుతోనే సతమతమవుతున్నాయి. కరవు కాటకాలు ఉన్నచోట అశాంతి, అలజడులు తప్పవు. మనుషుల్లో హింసా ప్రవృత్తి పెరుగుతుంది. ‘హింస కలుపుమొక్కలాంటిది. ఎంతటి కరవు వాటిల్లినా అది చావదు’ అన్నాడు ఆస్ట్రియన్ రచయిత సైమన్ వీసెంతాల్. నాజీల మారణకాండ నుంచి తప్పించుకుని, బతికి బట్టకట్టిన వాడాయన. కరవు కాటకాలు కనుమరుగైతే తప్ప ప్రపంచంలో శాంతి సామరస్యాలు సాధ్యంకావు. అయితే, అలాంటి రోజు ఎప్పటికైనా వస్తుందా? మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు ‘నిజంగానే నిఖిలలోకం / నిండు హర్షం వహిస్తుందా?/ మానవాళికి నిజంగానే/ మంచికాలం రహిస్తుందా?’ -
పద్ధతి ప్రకారం పరిహారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రక్రియలో దేనికైనా ఓ పద్ధతి అనుసరించడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం నడుచుకుంటే వ్యవస్థలూ సజావుగా పనిచేస్తాయి. రైతన్నలకు ఓ రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా టంఛన్‌గా క్యాలండర్ ప్రకారం అందుతున్నాయంటే ఇదే కారణం! గతేడాది దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. 2023 రబీలో కరువు బారిన పడ్డ ప్రాంతాల జాబితాను నిబంధనల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రకటించాలి. ఇందుకు ఆరు ప్రామాణికాలను పాటించడం తప్పనిసరి.ఈ క్రమంలో రబీ సీజన్లో రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు నిర్ధారించారు. 63 మండలాల్లో తీవ్రంగా, 24 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు లెక్క తేల్చారు. 2.37 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. 2.52 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు తేలింది. ఈ మేరకు మార్చి 16వతేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కరువు మండలాలను గుర్తించిన సమయంలోనే ప్రాథమిక నష్టాన్ని అంచనా వేశారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.చంద్రబాబు బృందం ఫిర్యాదుతో రెండు నెలల పాటు ర్యాండమ్ శాంపిల్ సర్వేను ఎన్నికల సంఘం నిలిపివేసింది. పోలింగ్ ముగిశాక ఈసీ ఆంక్షలు సడలించడంతో ర్యాండమ్ శాంపిల్ సర్వే జరిపి తుది అంచనాల నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరి ఇందులో అలసత్వానికి ఎక్కడ తావుంది? రైతుల నోటి కాడ ముద్దను నేల పాలు చేస్తూ చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయడం వల్లే కదా ఈసీ అడ్డుకుంది? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఏంఏ) విధివిధానాల ప్రకారమే కరువు మండలాలను ప్రకటిస్తారు. అంతేగానీ డ్రైస్పెల్స్ ఆధారంగా కాదు. దీని ప్రకారమే 2023 ఖరీఫ్ సీజన్లో 80 మండలాల్లో తీవ్రంగా, 23 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు గుర్తించారు. రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన బాబు కరువు మండలాల్లో ఆ సీజన్లో తీసుకున్న పంట రుణాలను ఆర్నెళ్ల పాటు రీ షెడ్యూల్ చేస్తారు. పంటలు కోల్పోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) చెల్లిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సీజన్లో నష్టపోతే అదే సీజన్ చివరిలో ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంటోంది. గత ఖరీఫ్‌లో కరువు ప్రభావిత మండలాల్లో పంట నష్టపోయిన 6.60 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు బృందం రెండు నెలల పాటు అడ్డుకుంది.పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరువు సాయాన్ని జమ చేసి సీఎం జగన్ ప్రభుత్వం రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ సీజన్లో కరువు మండలాలను ప్రకటించిన పాపాన పోలేదు. సకాలంలో పరిహారం జమ చేసి రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. 24.80 లక్షల మంది రైతన్నలకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే. ఈసీని పలుమార్లు అభ్యర్థించాం.. ⇒ ప్రాథమిక అంచనా ప్రకారం ఆరు జిల్లాల్లో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు గుర్తించాం. ప్రాథమిక నివేదిక తయారీ సమయంలోనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని ఆదేశించాం. ఏప్రిల్‌లో పలుమార్లు ఎన్నికల కమిషన్‌ను కలిసి అనుమతి కోసం అభ్యరి్థంచాం. పంట కోతలు పూర్తయినప్పటికీ పొలంలో పంట ఉన్నప్పుడు సేకరించిన వివరాల ఆధారంగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి సామాజిక తనిఖీతో జాబితాలు సిద్ధం అవుతాయి. తద్వారా రైతులెవరూ నష్టపోయే ఆస్కారం ఉండదు. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ ఎలాంటి జాప్యం జరగలేదు.. ⇒ కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ 2020 ప్రకారం ఖరీఫ్ కరువు మండలాలను అక్టోబర్ 31వ తేదీలోగా, రబీ కరువు మండలాలను మార్చి 31లోపు ప్రకటించాలి. దీని ప్రకారమే రబీ కరువు మండలాలను మార్చి 16న ప్రకటించారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగలేదు. కరువు మాన్యువల్ ప్రకారం డ్రైస్పెల్ ఒక్కటే పరిగణలోకి తీసుకోడానికి వీల్లేదు. దేశవ్యాప్తంగా దశల వారీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బృందం పర్యటన కొంత ఆలస్యమైంది. – కూర్మనాథ్, ఏపీ విపత్తుల సంస్థ ఎండీ -
మళ్లీ పాత తెలంగాణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే సామర్థ్యం, శక్తి లేవు. అందుకే రాష్ట్రంలో వనరులున్నా నీటికి, కరెంటుకు కొరత ఏర్పడుతోంది. కాంగ్రెస్ ఇందిరమ్మ పాలనలో పాత తెలంగాణ పునరావృతమైంది. రాష్ట్రంలో మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు.. అవే దృశ్యాలు తిరిగి కనిపిస్తున్నాయి. లత్కోర్, అసమర్థుల రాజ్యంలో ఉన్నాం కాబట్టే, కరెంట్, మిషన్ భగీరథ నడిపే తెలివిలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, వృద్ధాప్య పింఛన్, ఓవర్సీస్ స్కాలర్షిప్, చేనేతల బకాయిలు, బ్రాహ్మణ పరిషత్, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీల అమలు కోసం వెంటపడతాం. ఆయా పథకాల లబ్ధిదారులు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కర్చు కాల్చి వాతపెట్టాలి. రైతుబంధుకు నిధులు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా తమ తాబేదార్లకు బిల్లులు విడుదల చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి అసలేమీ తెలియదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇంతకాలం కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని ఆగాం. కానీ ఇక ఆగేది లేదు..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ‘పొలం బాట’ చేపట్టిన కేసీఆర్.. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంటలు, ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధారణం కంటే అధిక వర్షం కురిసినా.. ‘మానేరు వాగు, వరద కాలువ, ఎల్లంపల్లి, గోదావరి నదులు.. నాలుగు సజీవ జలధారలను జిల్లా ప్రజలు అనుభవించారు. కరీంనగర్ లక్షల టన్నుల ధాన్యం పండించింది. అలాంటిదాన్ని నాలుగు నెలల్లోనే ఎడారిగా మార్చారు. కరీంనగర్, సిద్దిపేట ప్రజల దాహార్తి తీర్చిన ఎల్ఎండీలో నీటి కటకట. ఎడారిని తలపిస్తూ స్మశానంలా మారింది. రోజూ తాగునీరు వచ్చే కరీంనగర్లో ఇపుడు రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. గోదావరి బేసిన్లో ఉన్న కరీంనగర్, ఇతర జిల్లాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తెలంగాణలో ఇపుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి వాస్తవానికి ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. నీటిని నిల్వ చేసుకునే, వాడుకునే తెలివిలేక, నాణ్యమైన కరెంటు సరఫరా చేయక పోవడం వల్ల పంటలు ఎండినయ్. ఎండిన పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. మరోవైపు రైతుబంధు ఇప్పటికీ పూర్తిగా వేయలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారంటే సీఎం లిస్టు ఇమ్మన్నాడు. మేం 209 మంది వివరాలు సీఎస్‌కు పంపాం. కానీ ఇప్పటికీ ఉలుకు పలుకూ లేదు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి, పరామర్శించే దాకా వదలం..’ అని కేసీఆర్ అన్నారు. నేను వస్తున్నా అనగానే నీళ్లిస్తున్నారు.. ‘తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ తీరే కారణం. నేను నల్లగొండకు వెళ్తున్నా అనగానే.. సాగర్ నుంచి, కరీంనగర్‌కి వస్తున్నా అనగానే.. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నారు. అదేంటి అంటే కేసీఆర్ మాకు చెప్పలేదు అంటున్నారు.. సీఎం నువ్వా? నేనా? సీఎంగా నువ్వు, నీ యంత్రాంగం ఏం చేస్తున్నాయి? ఒక 25 రోజుల ముందు నీళ్లు ఇచ్చి ఉంటే.. నల్లగొండ, కరీంనగర్లో పంటలు ఎండేవి కావు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? బ్యాంకర్ల నుంచి రైతులకు నోటీసులు వస్తుంటే ఉలుకూ పలుకూ లేదెందుకు?..’ అని మాజీ సీఎం నిలదీశారు. సీఎంకు తులం బంగారం దొరకడం లేదా? ‘కేవలం నాలుగు నెలల్లో పథకాలను ఆగమాగం చేశారు. గొర్రెల పంపిణీ బంద్ అయింది. 1.30 లక్షల మందికి దళితబందు రెండో విడత నిలిపివేశారు. రూ.12 లక్షలిస్తామని చెప్పి ఇవ్వలే. కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు.. తులం బంగారం సీఎంకు దొరకడం లేదా? ఇంట్లో ఇద్దరికీ వద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పి 30 లక్షల మంది కుటుంబాలకు ప్రతి పింఛన్ మీద రూ.24,000 చొప్పున బకాయి పడ్డారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని మోసం చేశారు, మహాలక్ష్మీ లేదు మన్నూ లేదు. ప్రతి మహిళకు రూ.2 వేలిస్తామని శఠగోపం పెట్టారు..’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలు పులులై తరిమి కొడతరు ‘ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కారి్మకుల ఆత్మహత్యలు చూసి చలించిన నేను భిక్షాటన చేసి వారి కుటుంబాలను ఆదుకున్నా. తెలంగాణ వచ్చాక చేనేతలకు చేతినిండా పని కలి్పంచాం. రంజాన్, బతుకమ్మ, స్కూలు యూనిఫామ్‌లు అంటూ పని ఇచ్చాం. వారు కష్టం చేసి ప్రభుత్వానికే పంపారు. వీటికి సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు ఇస్తలేరు. ఈ విçషయంపై కోర్టుకు పోతాం. సిరిసిల్లలో ధర్నా చేస్తాం. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటాడా? చేనేత కారి్మకులు నిరో«ద్లు అమ్ముకోవాలని అంటారా? చేనేతలు పులులై తరిమి కొడతరు..’ అని బీఆర్ఎస్ అధినేత హెచ్చరించారు. మేం వ్యవసాయానికి ఊపిరిలూదాం ‘మేం అస్తవ్యస్తమైన తెలంగాణ రైతు ఆర్థిక స్థితిని తిరిగి గాడిన పెట్టాం. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి వలస వెళ్లిన రైతులను తిరిగి గ్రామాలకు వచ్చేలా చేసి వ్యవసాయానికి ఊపిరిలూదాం. మీరు తాబేదార్లకు బిల్లులు చెల్లించి రైతుల నోట్ల మట్టి కొట్టారు. ఇపుడు చాలామంది రైతుల అప్పుల పాలై వడ్డీలు కడుతున్నారు. మేము తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 7,600 మెగావాట్ల నుంచి 18,600 మెగావాట్లకు తీసుకుపోయినా ఎందుకు కొరత వస్తోంది? దీనికి కూడా కేసీఆర్ చెప్పలేదు అంటారా?..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 50 వేలమంది రైతులతో మేడిగడ్డకు పోతా.. ‘కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి తోకా తొండం తెల్వదు. మేడిగడ్డ బ్యారేజీ మీద మూడు పిల్లర్లు కుంగిపోయినయి. కాంగ్రెస్ హయాంలోనూ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయ్. 25 సెం.మీల వానకు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి కంపెనీ కట్టిన ఎంఎండీ కొట్టుకుపోయింది. మేము కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలేదు. నిండ నింపి గంగమ్మ లెక్క చేసినం.. అందుకే ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయ్. జూన్‌లో 25 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ఈసారి నీటిని ఎత్తిపోయకుంటే నేను 50 వేలమంది రైతులతో మేడిగడ్డ వద్దకు పోయి పండవెట్టి తొక్కుతా. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో చిన్న ఇంజినీరింగ్ లోపాన్ని పెద్దది చేసి చూపే విఫలయత్నం చేశారు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజధానిలో ట్యాంకర్లా? ‘హైదరాబాద్‌లోని ప్రతి పేదవారి ఇంట్లో నల్లా ఉండాలన్న లక్ష్యంతో, రూ.1కే నల్లా కింద అందరికీ నల్లాలు ఇచ్చినం. బిందెలు కనబడకుండా చేసినం. కానీ ఇపుడు బిందెలు, ట్యాంకర్లుæ కనిపిస్తున్నయ్. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ బయల్దేరిండు. ఇక ఆగడు..గద్ద లెక్క వాలుతా.. మీ భరతం పడతాం.. మెడలు వంచుతాం..’ అని మాజీ సీఎం స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన గుజరాత్‌లోనే లేదని, అసలు బీజేపీకి ఓ విధానం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెండు, మూడురోజుల్లో ఖచ్చితంగా స్పష్టమైన జవాబు ఇస్తానని తెలిపారు. -
రైతులపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: రైతులపై కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ కోసం రైతులు ప్రతి ఏడాది కరువు రావాలని కోరుకుంటున్నారని అన్నారు. బెళగావీలో జరిగిన ఓ కార్యక్రమంలో రుణ మాఫీల గురించి మాట్లాడారు. దీనిపై బీజేపీ మండిపడింది. "వ్యవసాయానికి కరెంట్, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ రుణ మాఫీ రద్దు కోసం రైతులు కరువు రావాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకోవడం ఏ మాత్రం సరికాదు." అని మంత్రి శివానంద పాటిల్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివానంద పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని దుయ్యబట్టింది. పాటిల్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. సీఎం సిద్ధరామయ్య మంత్రి వర్గం తెలివిలేనివాళ్లతో నిండిపోయిందని విమర్శించింది. ఇదీ చదవండి: 'నేమ్‌ప్లేట్‌పై కన్నడ తప్పనిసరి..' బెంగళూరులో భాషా వివాదం -
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
70 శాతానికిపైగా భూభాగంలో కరువు పరిస్థితులు
న్యూఢిల్లీ: భారత్‌లోని 718 జిల్లాలకుగాను 500కుపైగా జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని డౌన్ టు ఎర్త్ అనే సంస్థ అంచనావేసింది. భారత్‌లో పర్యావరణ సంబంధ రాజకీయాలు, అభివృద్ధిపై ఈ సంస్థ పరిశోధన చేస్తోంది. భారత్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై డౌన్ టు ఎర్త్ సంస్థ ఒక నివేదిక విడుదలచేసింది. నివేదిక ప్రకారం.. ► 718 జిల్లాలకుగాను 500 జిల్లాల్లో అంటే 70శాతానికిపైగా భూభాగంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ► ఈశాన్య భారతం, తూర్పుభారతంలో కొన్ని ప్రాంతాలు, జమ్మూ కశీ్మర్తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరం సహా దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో మధ్యస్థ/తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ► ‘ఈసారి రుతుపవనకాలంలో ఆగస్టులో ప్రతి రోజూ కురవాల్సిన వర్షాలు ఆగి ఆగి కొద్దిరోజులు విరామాలు ఇస్తూ పడ్డాయి. ఇలా ‘బ్రేక్’లు ఇస్తూ పడిన వర్షాలే భారత్‌లో కరువుకు 70 శాతం కారణం’ అని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ చెప్పారు. ► 53 శాతం జిల్లాల్లో మధ్యస్థ కరువు పరిస్థితులు ఉన్నాయి. ► ఈ ఏడాది ఆగస్టులో ఎక్కువ రోజులు వర్షాలు పడనేలేదు. ఏడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పొడి వాతావరణం నెలకొంది. ఈనెలలో ఇన్ని రోజులపాటు వర్షాలు లేకపోవడం అనేది 21వ శతాబ్దిలో మూడో అతిపెద్ద విరామంగా రికార్డులకెక్కింది. గత 123 సంవత్సరాల చరిత్రలో ఆగస్టులో ఇంతటి పొడివాతావరణం నెలకొనడమూ ఇదే తొలిసారి. ► ‘2022 ఏడాదిలో పోలిస్తే 2023లో సాగు విస్తీర్ణం 33 శాతం పెరిగినా.. తగ్గిన వర్షాల కారణంగా దిగుబడి పెరుగుతుందో, తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి’ అని క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్ పేర్కొంది. ► ప్రతిఏటా ‘సాధారణ వర్షపాతం’ కేటగిరీ కింద ఉండే దాదాపు 20 రాష్ట్రాల్లో ఈసారి సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం. ► 1971–2020 సుదీర్ఘకాలం నుంచి చూస్తే ఈసారి వర్షపాతంలో లోటు ఐదు శాతం కనిపిస్తోంది. -
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్‌కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
‘కృష్ణా’లో కరువు తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న అన్ని ప్రధాన జలాశయాలకు శనివారం నాటికి వరద ప్రవాహం దాదాపుగా ఆగిపోయింది. ఆల్మట్టిలోకి కేవలం 900 క్యూసెక్కులు చేరుతుండగా, దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి ఎలాంటి వరద రావడం లేదు. జూరాల రిజర్వాయర్‌కు 3,000 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్‌లోకి 587 క్యూసెక్కులు చేరుతుండగా, శ్రీశైలానికి ఎలాంటి వరద రావడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల రిజర్వాయర్లు గత జూలై నెలాఖరు నాటికి నిండగా, తర్వాత కురిసే వర్షాలతో వచ్చే వరదను నేరుగా శ్రీశైలం జలాశయానికి విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఆగస్టు ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావం నెలకొని ఉండటంతో శ్రీశైలానికి ఎగువన ఉన్న జలాశయాలకు ఎలాంటి వరద రాలేదు. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో 108 టీఎంసీల వరద రావాల్సి ఉంది. శ్రీశైలం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 107.194 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం నుంచి జలవిద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు నీళ్లను విడుదల చేస్తుండటం, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కాల్వలకు నీళ్లను తరలిస్తుండటంతో జలాశయంలో నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌కు సైతం ఎలాంటి ప్రవాహం రావడం లేదు. సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 150.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. జలాశయం నిండడానికి మరో 161 టీఎంసీల వరద రావాల్సి ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సాగు, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలు పోటాపోటీగా వినియోగించుకుంటే వేసవిలో తాగునీటికి కటకటలాడాల్సి వస్తుందని ఇటీవల రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు హెచ్చరిక జారీ చేసింది. త్రిసభ్య కమిటీ భేటీని వాయిదా వేయాలి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని 22 లేదా 23వ తేదీలకు వాయిదా వేయాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ రాష్ట్రం కోరింది. శ్రీశైలం జలాశయం నుంచి తెలుగు గంగ/ చెన్నై తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ/గాలేరు నగరి సుజల స్రవంతి అవసరాలకు 4 టీఎంసీలు, కేసీ కాల్వకు 2.5 టీఎంసీలు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 4.5 టీఎంసీలు కలుపుకుని 16 టీఎంసీలను కేటాయించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలను సైతం తెలియజేయాలని కృష్ణా బోర్డు ఇక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, 21న తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కోరారు. -
ఒంటరిగా మారిన ఉత్తరకొరియా.. కరువు ముంగిట కిమ్ ‘రాజ్యం’
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు రాజ్యమేలుతోంది. 1990ల నాటి కరువు కంటే తీవ్ర పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో సుమారు 30 లక్షల మంది ప్రాణాలొదిలారు. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార పదార్థాలు లభ్యం కావడం లేదు. సరిహద్దులను పూర్తిగా మూసివేయడంతో పరిస్థితి విషమంగా మారింది. సరిహద్దుల వెంట ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే జనం ఆకలితోచనిపోతున్నట్లు సమాచారం. దేశంలో ఆహార కొరత ఏర్పడిన విషయాన్ని సాక్షాత్తూ అధ్యక్షుడు కిమ్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. మరోవైపు, ప్రభుత్వం క్షిపణులు, అ«ణ్వాయుధాల తయారీకి భారీగా ఖర్చు పెడుతోంది. -
జన విస్ఫోటనంతో దుర్బల భారత్!
వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలకు పెను విపత్తుగా పరిణమిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఆకస్మిక వరదలు, అదే సమయంలో మరికొన్ని దేశాల్లో కరువులు.. ఇవన్నీ వాతావరణ మార్పుల ఫలితాలే. ఈ విపత్తు వల్ల ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకూ ముప్పు ఉన్నప్పటికీ భారత్‌కు మాత్రం ఇంకా ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని, దేశంలోని అధిక జనాభాయే ఇందుకు కారణమని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) కార్యనిర్వాహక డైరెక్టర్ ఎరిక్ సొల్హీమ్ స్పష్టం చేయడం గమనార్హం. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచమంతటా కనిపిస్తున్నాయని చెప్పారు. అధిక జనాభా వల్ల భారత్ మరింత దుర్బల దేశంగా మారనుందని హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ♦ భూగోళం ఎదుర్కొంటున్న అన్ని రకాల పర్యావరణ సమస్యలు భారత్‌కు కూడా ఎదురవుతున్నాయి. ♦ భారత్‌లో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాలు ఇప్పటికే కాలుష్యంతో నిండిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత గురించి తెలిసిందే. ♦ నానాటికీ పెరిగిపోతున్న జనాభా, తద్వారా మానవ కార్యకలాపాలు ఈ కాలుష్యానికి, విపత్కర పరిస్థితులకు కారణమవుతున్నాయి. ♦ వాతావరణ మార్పుల ముప్పు అమెరికాతో పోలిస్తే భారత్‌కు అధికంగా ఉంది. ♦ భారత్‌లో ప్రకృతి విధ్వంసం కొనసాగుతోంది. మానవ ఆవాసాలు, వ్యవసాయం కోసం అడవులను యథేచ్ఛగా నరికేస్తున్నారు. ప్రకృతి సమతుల్యతకు దోహదపడే జంతుజాలం నశిస్తోంది. జీవవైవిధ్యం క్రమంగా కనుమరుగవుతోంది. ♦ పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ప్రకృతిని బలి చేయక తప్పడం లేదు. పరిమిత జనాభా కలిగిన దేశాలు, జనాభా పెరుగుదలను నియంత్రిస్తున్న దేశాల్లో ఇలాంటి పరిస్థితి పెద్దగా లేదు. ♦ భారత్‌లో జనాభా పెరుగుదలను నియంత్రిస్తే కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చు. వాతావరణ మార్పులను కూడా నియంత్రించవచ్చు. ♦ భారత్ జనాభా 142 కోట్ల పైమాటే. జన విస్ఫోటనంతో ప్రపంచ కాలుష్య దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానానికి చేరే రోజులు ఎంతో దూరంలో లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ భూగోళంపై పర్యావరణాన్ని చక్కగా కాపాడుకుంటేనే మనుషులకు, జీవజాలానికి ఆవాస యోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణపై తక్షణమే దృష్టి పెట్టాలి. ♦ చైనాలో 100 శాతం విద్యుదీకరణ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇతర దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నమే జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమికి డేంజర్ బెల్స్.. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే
భూమి ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు, వాటికి కారణాలు తదితరాలపై 40 మంది ప్రముఖ అంతర్జాతీయ ప్రకృతి, సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన ఎర్త్ కమిషన్ బృందం తాజాగా అధ్యయనం నిర్వహించింది. అందులో తేలిన ఆందోళనకర అంశాలతో కూడిన నివేదిక జర్నల్ నేచర్‌లో పబ్లిషైంది. మానవ ఆధిపత్య యుగం (ఆంత్రోపొసీన్) క్రమంగా భూమి తాలూకు కీలక వ్యవస్థల స్థిరత్వాన్ని సమూలంగా కదిలించి వేస్తోందని హెచ్చరించింది. నివేదికలో వెల్లడించిన అంశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి... మితిమీరిన వనరుల దోపిడీ. లెక్కలేని నిర్లక్ష్యం. ఇంకా అనేకానేక స్వయంకృతాపరాధాలతో భూమిని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. పుట్టింది మొదలు గిట్టి మట్టిలో కలిసేదాకా నిత్యం సకలం సమకూర్చే ఆధారాన్నే మొదలంటా నరికేసుకుంటున్నాం. భావి తరాలనే గాక భూమిపై ఉన్న సకల జీవరాశులనూ పెను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నాం. గ్లోబల్ వార్మింగ్, కరువు, పెను వరదల వంటి ఉత్పాతాల రూపంలో భూమి చేస్తున్న ఆక్రందనను ఇకనైనా చెవిన పెట్టకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేందుకు ఇంకెంతో కాలం పట్టదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. ఫలితంగా భూమికి డేంజర్ బెల్స్ చెవులు బద్దలయ్యే స్థాయిలో మోగుతున్నాయని సైంటిస్టులు తాజాగా తేల్చారు. భూమి తాలూకు ఎనిమిది రకాల భద్రతా పరిమితుల్లో ఏకంగా ఏడింటిని ఎప్పుడో దాటేశామని వారు వెల్లడించారు... ప్రతి ఖండంలోనూ.. సమతుల్యత పూర్తిగా దెబ్బ తిని అతి సమస్యాత్మకంగా మారిన పలు ప్రాంతాలను అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ ఎక్కడపడితే అక్కడ ఇలాంటి హాట్స్పాట్లు ఉండటం కలవరపరిచే అంశమేనని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిలో చాలా ప్రాంతాల్లో వాతావరణ మార్పులే సమస్యకు ప్రధాన కారణమని తేలింది. ‘‘ముఖ్యంగా ఆసియాలో పర్వత ప్రాంతాలతో సమాహారమైన హై మౌంటేన్ క్రయోస్పియర్ శరవేగంగా మార్పుచేర్పులకు లోనవుతోంది. హిమానీ నదాల కరుగుదల మొదలుకుని జరగకూడని ప్రతికూల పరిణామాలన్నీ భయపెట్టే వేగంతో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అతి త్వరగా ఆ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా పెను కుదుపులకు లోనవడం ఖాయం’’ అని సహ అధ్యయనకర్త ప్రొఫెసర్ క్రిస్టీ ఎబి హెచ్చరించారు. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే... భూమి భద్రతకు సంబంధించి స్థూలంగా 8 రకాల సూచీలను కీలకంగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. వీటిలో మూడు కంటే ఎక్కువ సూచీలు ఆమోదిత పరిమితి దాటితే భూమికి ముప్పు తప్పదని భావిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా 7 సూచీలు ఆమోదిత పరిమితిని ఎప్పుడో దాటేసి ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్టు ఎర్త్ కమిషన్ అధ్యయనం తేల్చడం అందరినీ భయపెడుతోంది... ఏం చేయాలి ► పర్యావరణపరంగా సురక్షిత స్థాయిని భూమి ఎప్పుడో దాటేసింది. రోజురోజుకూ మరింత ప్రమాదం దిశగా వెళ్తోంది. ► భూమిపై వాసయోగ్యతను నిర్ధారించే జీవ భౌతిక వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దే పని తక్షణం మొదలు పెట్టాలి. ► అప్పుడు బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి కీలక వనరుల లోటును భూమి తనంత తానుగా భర్తీ చేసుకోగలదు. ‘‘భూమికి గనక మనిషికి చేసినట్టే ఇప్పటికిప్పుడు వార్షిక హెల్త్ చెకప్ చేయిస్తే ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయిందంటూ రిపోర్టు వస్తుంది. కీలక అవయవాలన్నీ దాదాపుగా మూలకు పడుతున్నాయని తేలుతుంది’’ – క్రిస్టీ ఎబి, సహ అధ్యయనకర్త, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో క్లైమేట్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ‘‘భూ స్థిరత్వాన్ని ఆమోదనీయ స్థాయికి తీసుకొచ్చేందుకు దేశాలన్నీ కలసికట్టుగా తక్షణం ఓ భారీ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భూమి ఏమాత్రమూ ఆవాసయోగ్యం కాకుండా పోయేందుకు ఇంకెంతో కాలం పట్టదు!’’ – ప్రొఫెసర్ జొయీతా గుప్తా, అధ్యయనంలో కీలక భాగస్వామి డేంజర్ హాట్ స్పాట్స్‌కు నిలయాలు ► తూర్పు యూరప్ ► దక్షిణాసియా మధ్యప్రాచ్యం ► ఆగ్నేయాసియా ► ఆఫ్రికాలో పలు ప్రాంతాలు ► బ్రెజిల్లో చాలా ప్రాంతాలు ► అమెరికాలో పలు ప్రాంతాలు ► మెక్సికో చైనా కొసమెరుపు: సూచనల మాటెలా ఉన్నా కీలకమైన అన్ని మౌలిక సూచికలూ పూర్తిగా నేల చూపులు చూస్తున్నాయి. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వనరుల భర్తీ దేవుడెరుగు, భూమి తాలూకు వాసయోగ్యతకే, మరోలా చెప్పాలంటే జీవరాశుల ఉనికికే ఎసరొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్నది సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్న మాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.. లోకేశ్ మెదడు ఎక్కడుంది?
ఏ రోజు అయినా చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షం, నీరు అవిరి అయిపోతుందని, ఎక్కడా పచ్చదనం కనిపించదని ఎద్దేవా చేశారకు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు కరువుతో అల్లాడిపోవాల్సిందేనని పేర్కొన్నారు. రైతులు పనులు లేక వలసలు వెళ్లిపోయే పరిస్థితి ఉండేదని, రైతులు రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఒకడు నిష్టదరిద్రుడు. కొడుకు పరిమదరిద్రుడని ఏకి పారేశారు. లోకేశ్ ఒక బచ్చా.. అతను కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారా అని సెటర్లు వేశారు. ఈమేరకు కాకాణి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.. ఇంకా ఆయన ఏమన్నారంటే.. వ్యవసాయం తెలియకుండా వ్యక్తిగత దూషణలా? వ్యవసాయం, పంటలు, వ్యవసాయ విధానాల గురించి మాట్లాడటం చేతగాక వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. నువ్వు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లి ఎందుకు చదివావు. ఇక్కడ సరైన వసతులు లేకనా? ఎవరైనా వలస వెళ్తే.. కూలి పని చేసే కుటుంబం వేరే ప్రాంతానికి వ్యాపారానికో, ఇంకా అభివృద్ధి చెందడానికో ఆ ప్రాంతం నుంచి వలస వెళ్తారు. అది అర్థం చేసుకోలేక చంద్రబాబు హయాంలో నీరు లేక పంటలు లేక రైతులు బజారున పడ్డారు. అటువంటి పరిస్థితి నుంచి నేడు ప్రతి సంవత్సరం పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. చంద్రబాబు హయాంలో లా, ఇప్పుడు క్రాప్ హాలిడేలు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో సగటున సంవత్సరానికి 14 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. లోకేశ్ నీకు మెదడు మోకాలిలో ఉందా? అరికాలిలో ఉందా? మాట్లాడటానికి నోరు తిరగదు. పది పంటలు చూపిస్తే.. అందులో ఐదు పంటల పేర్లు చెప్పగలవా? నీ సార్థక నామధేయం కంది పంట పేరు చెప్పగలవా? పప్పూగాడు అని నీ పేరు కదా. ఆ పప్పు పంటలను గుర్తు పట్టగలవా లోకేశ్. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రికి అధికార పిచ్చి. తండ్రీకొడుకులకు తినటానికి, పంచుకోవటానికి, దోపిడీకీ అవకాశం లేకపోవటంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏం పనిలేక.. అబ్బాకొడుకులు ఉన్మాదంతో తిరుగుతున్నారు. అన్ని వర్గాలు సంతోషంతో ఉండటంతో నిద్రపట్టడం లేదు. రైతులపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు ఏదైనా మాట్లాడేటప్పుడు నీతిగా నిజాయితీగా మాట్లాడటం నేర్చుకుంటే మంచిది. నీకు, ఈప్రభుత్వానికి నక్కకు - నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. లోకేశ్ నోరు తెరిస్తే గబ్బు నోరు. విద్యుత్ ఛార్జీల పై ప్రశ్నించిన రైతులపై కాల్పులు జరిపించిన నీచుడు చంద్రబాబు. రైతులకు వ్యతిరేకంగా ఎన్నో విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు. ఈ జన్మ కాదు కదా.. వచ్చే జన్మలోనూ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి దరిద్రం ఉండకూడదు. రాష్ట్రం చేసుకున్న పాపం ఏమైనా ఉందంటే.. చంద్రబాబు లాంటి దరిద్రుడుకి లోకేశ్ లాంటి దరిద్రుడుకు జన్మ ఇవ్వటం ఒక్కటే. ఆ రెండు పొరపాట్లే రాష్ట్రానికి జరిగిన అరిష్టం. అని మంత్రి ఫైర్ అయ్యారు. చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి.. వారి కోసం ఒక్క పనైనా చేశారా?.. -
రామోజీ అబద్దాల సాగు
-
పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనక తప్పదు! ముందుంది పెను ముప్పు?
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో కాళ్లకింది నేల ఉన్నపళంగా కుంగిపోతున్న తీరు పర్యావరణపరంగా మానవాళి ముందున్న పెను ముప్పును కళ్లకు కట్టింది. పరిస్థితి చేయి దాటకముందే మేల్కొనాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. జోషి మఠ్ సమస్యకు కారణమైన అడవుల విచ్చలవిడి నరికివేత, పెచ్చరిల్లిన వాతావరణ కాలుష్యం వంటివి ప్రపంచమంతటినీ వేధిస్తున్న సమస్యలే. వాటి పర్యవసానాలను గ్లోబల్ వార్మింగ్, ఆకస్మిక వరదలు, తీవ్ర కరువుల రూపంలో అన్ని దేశాలూ చవిచూస్తూనే ఉన్నాయి. ఈ ప్రాకృతిక విపత్తుల తీవ్రత కొన్నేళ్లుగా బాగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇవన్నీ మనిషి అత్యాశకు ప్రకృతి ప్రతిస్పందన తాలూకు సంకేతాలే. వాటిని ఇప్పటికైనా అర్థం చేసుకుని తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ‘‘లేదంటే అతి త్వరలో పరిస్థితి పూర్తిగా చేయి దాటడం ఖాయం. ఇప్పుడు జోషి మఠ్‌లో జరుగుతున్నది రేపు అన్నిచోట్లా జరుగుతుంది. ప్రకృతితో ఇష్టారాజ్యపు చెలగాటం అంతిమంగా వినాశనానికే దారి తీస్తుంది’’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ తదితరాల వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ధోరణి కొన్నేళ్లుగా వేగవంతమవుతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలు క్రమంగా నీట మునుగుతాయి. మానవాళిపై పెను ప్రభావం చూపగల పరిణామమిది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో పదో వంతుకు పైగా సముద్ర తీర ప్రాంతాల్లోనే వ్యాపించి ఉంది. మహా నగరాల్లో కూడా అధిక శాతం అక్కడే ఉన్నాయి. అవన్నీ మునగడమో, పూర్తిగా నివాసయోగ్యం కాకుండా పోవడమో జరుగుతుంది. ఫలితంగా కోట్లాది మంది పొట్ట చేత పట్టుకుని వలస బాట పడతారు. వారందరికీ పునరావాసం, ఉపాధి తదితరాలన్నీ అతి పెద్ద సవాళ్లుగా నిలుస్తాయి. మానవాళి చరిత్రలో ఇది పెను విపత్తుగా మారినా ఆశ్చర్యం లేదు. అంతేగాక మితిమీరిన కాలుష్యం ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తోంది. సురక్షితమైన తాగునీటికి చాలా దేశాల్లో ఇప్పటికే తీవ్ర కొరత ఏర్పడింది. మున్ముందు ఇది మరింత తీవ్రతరం కానుంది. ప్రజలు సరైన తిండికి, తాగునీటికే కాదు, పీల్చేందుకు స్వచ్ఛమైన గాలికి కూడా నోచుకోని పరిస్థితి తలెత్తనుంది! మాటలకే పరిమితం పర్యావరణ నష్టాలకు అడ్డుకట్టే వేసేందుకు చారిత్రక పారిస్ ఒప్పందం మొదలుకుని పలు కాప్ శిఖరాగ్రాల దాకా పేరుకు ప్రయత్నాలెన్నో జరుగుతున్నాయి. కానీ చిత్తశుద్ధితో కూడిన చర్యలు మాత్రం కన్పించడం లేదు. కర్బన ఉద్గారాల తగ్గింపు తదితరాలకు సంబంధించి గొప్ప లక్ష్యాలు నిర్ణయించుకోవడం, తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా సాగుతోంది. ఎవరికి వారు పొరుగు దేశమే ప్రధానంగా బాధ్యత తీసుకోవాలన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎటు చూసినా విపత్తులే... ► మంచు ఖండమైన అంటార్కిటికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా కరుగుతున్నాయి. దీని దుష్ప్రభావం పర్యావరణంపై చాలా రకాలుగా ఉండబోతోంది. ► ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా ముందుగా ఇంగ్లండ్ తదితర యూరప్ దేశాలు అతి శీతల వాతావరణంతో అల్లాడాయి. తర్వాత అమెరికా దాని దెబ్బకు 10 రోజులకు పైగా దాదాపుగా స్తంభించిపోయింది. దేశ చరిత్రలో ఎన్నడూ ఎరగనంతటి చలి గాలులు, మంచు తుఫాన్లతో అల్లాడింది. వేల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం చవిచూసింది. ► అమెరికాలో ఇటీవలి దాకా కార్చిచ్చులతో అల్లాడిన కాలిఫోర్నియా ఇప్పుడేమో కనీవినీ ఎరగని వరద బీభత్సంతో తల్లడిల్లుతోంది. ► ఉత్తర భారతం కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతటి చలితో వణుకుతోంది. ► పొరుగు దేశం పాకిస్తాన్ గతేడాది దేశ చరిత్రలో ఎన్నడూ చూడనంతటి వరదలతో అతలాకుతలమైంది. మూడొంతుల ప్రాంతాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఆ ప్రభావం నుంచి పాక్ ఇప్పటికీ కోలుకోలేదు. ఏటా 10 సెం.మీ. కుంగిన జోషీ మఠ్! జోషి మఠ్‌లో నేల 2018 నుంచి ఏటా 10 సెంటీమీటర్ల చొప్పున కుంగుతూ వస్తోందట! అధునాతన శాటిలైట్ ఇమేజ్ విశ్లేషణ ఆధారంగా జరిగిన ఒక తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి
తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. అంతే కాదు ఇంట్లో నిద్ర పట్టని వారు నిద్ర లేమితో బాధ పడేవారుతమ రిసార్ట్‌లకు వచ్చి హాయిగా నిద్ర పోయేలా యోగా, ఆహారం, మసాజ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇండియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. మీకూ నిద్ర కావాలా? ప్రయాణం కట్టండి. రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కథ ఒకటి ఉంటుంది. దాని పేరు ‘సుఖాంతం’. అందులో 60 ఏళ్లకు చేరుకున్న ఒక గృహిణి తన బాల్యం నుంచి కంటి నిండా నిద్ర పోనివ్వని ఇంటి పనులు ఎన్ని చేసిందో, భార్యగా కోడలిగా తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిద్రకు ఎలా ముఖం వాచిందో తలుచుకుంటూ ఆఖరుకు మంచి నిద్ర కోసం గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. ఆ కథకు చాలా పేరు వచ్చింది. స్త్రీల నిద్రను ఇల్లు పట్టించుకోదు. వాళ్లు తెల్లారే లేవాలి. రాత్రి అందరూ నిద్ర పోయాక వంట గది సర్ది నిద్రకు ఉపక్రమించాలి. పగలు కాసేపు కునుకు తీద్దామన్నా పని మనిషి, పాలవాడు, పేపర్‌వాడు, అమేజాన్ నుంచి... స్విగ్గీనుంచి... అంటూ ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉంటారు. స్త్రీలకు కంటి నిండా నిద్ర పోయే హక్కు లేదా? అయితే కోవిడ్ వచ్చాక ప్రపంచ వ్యాప్తంతో పాటు భారతదేశంలో కూడా నిద్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలలో భీతి, తెలియని ఆందోళన, పరుగు ఇవన్నీ చాలామందిని నిద్రకు దూరం చేశాయి. నీల్సన్ సంస్థ మన దేశంలోని 25 నగరాల్లో 5,600 మందిని సర్వే చేస్తే 93 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు, భార్యాభర్తల్లో అనురాగం తగ్గిపోవడం, సౌకర్యమైన బెడ్రూమ్ లేకపోవడం, గుర్గుర్మంటూ తిరిగే ఫ్యాను, లేదా భార్యా/భర్త తీసే గురక, రోడ్డు మీద ట్రాఫిక్ సౌండు, అన్నీ బాగున్నా కొందరిలో వచ్చే ‘నిద్రలేమి’ సమస్య... ఇవన్నీ నిద్రకు దూరం చేస్తాయి. ఆ సమయంలో ఎక్కడికైనా పారిపోయి హాయిగా నిద్ర పోతేనో అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రపంచమంతా ఒకేసారి వచ్చింది. అందుకే ఇప్పుడు ‘స్లీప్ టూరిజమ్’ ట్రెండ్‌గా మారింది. మనిషికి కావలసింది ఆ రెండే ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ కొత్త ట్రెండ్‌కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్ సర్దుకోండి. లండన్‌లో తొలి ‘స్లీప్ హోటల్’... 2000 సంవత్సరంలో లండన్‌లో జెడ్వెల్ అనే హోటల్ ‘సౌండ్‌ప్రూఫ్’ గదులతో తనను తాను ‘స్లీప్ హోటల్’గా ప్రమోట్ చేసుకుంది. ఆ తర్వాత పోర్చుగీసులో తొలి ‘స్లీప్ స్పా హోటల్’ అవిర్భవించింది. ఇప్పుడు అమెరికాలో హోటళ్లలో ‘స్లీప్ స్వీట్రూమ్స్’ ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ కేవలం నిద్ర కోసమే. గతంలో విహారాలు బాగా తిరిగి ఆ మూల ఈ మూల చూసి రావడానికి ఉద్దేశింపబడేవి. స్లీప్ ట్రావెల్స్ మాత్రం కేవలం ఒక చోటుకు వెళ్లి హాయిగా నిద్ర పోవడమే పనిగా పెట్టుకునేది. రిసార్టులు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు వీటి కోసం ఎలాగూ ఉన్నా భారతదేశంలో తమకు నచ్చిన చోటుకు వెళ్లి నిద్ర పోవడానికి ‘క్యారవాన్’లు అద్దెకు దొరుకుతున్నాయి. అంటే వాటిని బుక్ చేసుకొని అలా విహారానికి వెళుతూ ఏ చెరువు ఒడ్డునో అడవి మధ్యనో ఆదమరిచి నిద్రపోవచ్చన్నమాట. మంచి పరుపులు, మసాజ్‌లు... మన దేశంలో ముఖ్యమైన ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఖరీదైన రిసార్ట్లు అన్నీ ఇప్పుడు స్లీప్ టూరిజమ్‌కు ఏర్పాట్లు చేశాయి. కొన్ని హోటళ్లు ‘స్లీప్ డాక్టర్ల’తో సెషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. వాళ్లు గెస్ట్‌లతో మాట్లాడి వారి నిద్ర బాధకు విరుగుడు చెబుతారు. ఆయుర్వేద మసాజ్‌లు, గదిలో ఉండాల్సిన సువాసనలు, నిద్ర వచ్చేందుకు చేసే స్నానాలు, శాస్త్రీయమైన మంచి పరుపులు, అంతరాయం కలిగించని గదులు, నిద్రను కలిగించే ఆహారం... ఇవన్నీ ప్యాకేజ్‌లో భాగంగా ఇస్తున్నారు. ఇవాళ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎన్నో హోటళ్లు స్లీప్ ట్రావెల్ కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. -
Virus spillover: తర్వాతి వైరస్ మహమ్మారి రాక...హిమానీ నదాల నుంచే!
లండన్: వాతావరణ మార్పులు ప్రపంచమంతటా కనీవినీ ఎరగని ఉత్పాతాలకు దారి తీస్తున్న వైనం కళ్లముందే కన్పిస్తోంది. కొన్ని దేశాల్లో కరువు, మరికొన్ని దేశాల్లో ఎన్నడూ చూడనంతటి వరద విల యం సృష్టిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు, వాతావరణ మార్పుల దుష్ప్రభావం మరో తీవ్ర ప్రమాదానికి కూడా దారితీసే ఆస్కారం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత స్థాయి శరవేగంగా పెరుగుతుండటంతో హిమాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీ నదాలన్నీ అంతే వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. ‘‘ఈ హిమానీ నదాల గర్భంలో బహుశా మనకిప్పటివరకూ తెలియని వైరస్‌లెన్నో దాగున్నాయి. హిమానీ నదాల కరుగుదల వేగం ఇలాగే కొనసాగితే భూమిపై విరుచుకుపడబోయే తర్వాతి వైరస్ మహమ్మారి వచ్చేది గబ్బిలాల నుంచో, పక్షుల నుంచో కాక.. నదాల గర్భం నుంచే అది పుట్టుకురావచ్చు’’ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా వచ్చే వైరస్లు వన్యప్రాణులకు, అక్కణ్నుంచి మనుషుల్లో ప్రబలుతాయని అంచనా వేస్తున్నారు. దీన్ని వైరస్ స్పిలోవర్గా పిలుస్తున్నారు. ఇందుకోసం ఆర్కిటిక్‌లోని మంచినీటి సరస్సు లేక్ హాజెన్ తాలూకు మన్ను, మడ్డి తదితరాలను శాస్త్రవేత్తల బృందం విశ్లేషించింది. అవశేషాల తాలూకు ఆర్ఎన్ఏ, డీఎన్ఏ నమూనాలను వైరస్‌లతో జతపరిచి చూశారు. హిమానీ నదీ గర్భాలు బయటికి తేలే పక్షంలో, అక్కడి కళేబరాల నుంచి తెలియని తరహా వైరస్లు వచ్చి పడే ప్రమాదముందని తేల్చారు. అధ్యయన ఫలితాలను రాయల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించారు. -
IPCC: వాతావరణ మార్పులతో దేశాలన్నీ అతలాకుతలం
వాతావరణ మార్పులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చిపడుతున్న అకాల వరదలు, కరువులతో దేశాలకు దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అపార ఆస్తి, ప్రాణ నష్టాలతో అల్లాడుతున్నాయి.æ అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తుతాయని, వాటి తీవ్రత కూడా గతం కంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వాతావరణ మార్పుల ప్యానల్ (ఐపీసీసీ) వేసిన అంచనాలు నూటికి నూరు శాతం నిజమవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ► వారాంతపు వరదలతో ఆస్ట్రేలియా అల్లాడింది. దేశంలో చాలాచోట్ల ఇంకా కుండపోత కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల పాటు అతి తీవ్ర వర్షాలు తప్పవంటూ వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ► మధ్య ఆఫ్రికా దేశమైన చాద్ రిపబ్లిక్‌ది విచిత్ర పరిస్థితి. నిన్నామొన్నటిదాకా దుర్భరమైన కరువుతో దేశమంతా అల్లాడిపోయింది. ఇప్పుడేమో గత 30 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ► థాయ్‌లాండ్‌ను కూడా నెల రోజులుగా భారీ వరదలు ఊపిరి సలపనివ్వడం లేదు. 77 రాష్ట్రాలకు గాను ఏకంగా 59 రాష్ట్రాలు వరద బారిన పడ్డాయి. 4.5 లక్షల ఇళ్లు దెబ్బ తినడమో కూలిపోవడమో జరిగింది. 40 శాతం ప్రాంతాలు ఇంకా మునకలోనే ఉన్నాయి. తాజాగా సోమవారం 8 దక్షిణాది రాష్ట్రాలకు భారీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి! ► ఫిలిప్పీన్స్దీ ఇదే పరిస్థితి. తుఫాను కారణంగా వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ► భారీ వరదలతో మెక్సికో తీరం అల్లాడుతోంది. ► భారత్‌లోనూ తుఫాన్ల దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు అల్లాడిపోయాయి. హైదరాబాద్‌నైతే కొన్ని వారాలుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కారణాలెన్నో...! గ్లోబల్ వార్మింగ్ మొదలుకుని మితిమీరిపోయిన శిలాజ ఇంధన వాడకం దాకా తాజా వాతావరణ మార్పులకు కారణాలెన్నో! ప్రధాన కాలుష్య కారణమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు 90 శాతం దాకా శిలాజ ఇంధనమే కారణమవుతోంది. అడవుల విచ్చలవిడి నరికివేత, అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న పెట్రో ఉత్పత్తుల వెలికితీత వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు మరో పదేళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రత ఏకంగా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగితే ఆశ్చర్యం లేదని ఐపీసీసీ సర్వే హెచ్చరించింది! ‘‘ఇప్పటికైతే వాతావరణ మార్పులు అకాల వర్షాలకు, భారీ వరదలకు కారణంగా మారుతున్నాయి. వర్షపాతపు తీరుతెన్నులను కూడా అవి చాలావరకు మార్చేస్తున్నాయి’’ అని వివరించింది. నైజీరియాలో వరదలు.. 600కు చేరిన మరణాలు అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో ఈ సీజన్లో ఆగస్ట్ నుంచి సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా 603 మంది మృతి చెందారు. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలకు గాను 33 రాష్ట్రాల్లో వరదలతో అతలాకుతలమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాలని చినుకు చెప్పే చిత్రమైన కథలు! నన్ను చూస్తుంటే... ఏడవండి!!!
అమెరికా, యూకే, యూరప్‌లకు చినుకు కరవొచ్చింది...అట్లాంటి ఇట్లాంటిది కాదండోయ్! 500 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిది! డ్యాములు అడుగంటిపోయాయి.. నదులూ ఇంకిపోయాయి! వడగాడ్పులతో జనమూ బెంబేలెత్తిపోయారు! అయితే ఏంటి? అంటున్నారా? నిజమే కానీ.. కరువు, వర్షాభావం అనేవి...ఆ ప్రాంతాలకు దూరపుచుట్టాలు కూడా కాదు. అందుకే 2022 నాటి ఈ వాతావరణ దృగ్విషయానికి ప్రాధాన్యమేర్పడింది... అంతేకాదు.. రాలని చినుకుపుణ్యమా అని గతానికి చెందిన కథలెన్నో ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి! ఏమా కథలు.. వాటి విశేషాలంటే...!!!! స్విట్జర్లాండ్ పేరు చెబితే మంచు పర్వతాలు.. లండన్ పేరు విన్న వెంటనే అంచనాలకు అందని వాతావరణం గుర్తుకు వస్తాయి. ఈ రెండు ప్రాంతాలే కాదు.. యూరప్‌లోని చాలా దేశాలన్నీ పచ్చగా.. లేదంటే మంచుతో కప్పబడి ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఐదు వందల ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో వర్షాభావం.. తత్ఫలితంగా కరవు.. యూరప్‌తో పాటు అమెరికాలోనూ కనిపిస్తోంది. ఏడాది పొడవునా వేసవిని తలపించే ఎండలు.. తరచూ పలుకరించిన వడగాడ్పులతో పాశ్చాత్యదేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే పలు దేశాల్లోని నదులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. బోసిపోయిన ఈ జలవనరులు ఇప్పుడు గత చరిత్ర ఆనవాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంనాటి బాంబు మొదలుకొని జర్మన్లు వాడిన యుద్ధ నౌక.. కోట్ల ఏళ్ల క్రితం తిరుగాడిన రాక్షసబల్లుల ఆనవాళ్లు... మధ్యయుగాల నాటి కరవు పరిస్థితులను సూచించే గుర్తులు బయటపడ్డాయి. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిలో భాగమైన పలు నగరాలు.. చారిత్రక అవశేషాలు కూడా ఈ ఏడాది కరవు పుణ్యమా అని ఇంకోసారి ప్రజలకు గతాన్ని గుర్తు చేస్తున్నాయి!! ఆఫ్రికా కొమ్ము నుంచి.... 2022లో పాశ్చాత్యదేశాలు అనేకం కరవులో చిక్కుకున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. ఆఫ్రికా ఖండంలోని పైభాగం (హార్న్ ఆఫ్ ఆఫ్రికా) మొదలుకొని ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో విపరీత పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో భాగమైన ఇథియోపియా, సొమాలియా, కెన్యాల్లో నాలుగేళ్లుగా సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఆకలి కేకలు తీవ్రం కాగా.. ఫ్రాన్స్‌లో కోతకొచ్చిన మొక్కజొన్న పంట మొత్తం నశించిపోయింది. ఈ దేశంలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందీ అంటే.. ఎండలు పెరిగిపోయి.. ఉప్పునీరు ఎక్కువ ఆవిరవుతూండటం వల్ల దేశంలో ఉప్పు ఉత్పత్తి రెట్టింపు అవుతోంది!! వర్షాభావం వల్ల జర్మనీలోని రైన్ ఓడరేవులో నీరు కాస్తా అడుగంటిపోయి రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల సరుకుల రవాణా ఆలస్యం అవడం మాత్రమే కాకుండా ధరలు కూడా పెరిగిపోతున్నాయి. జర్మనీలోని పారిశ్రామిక ప్రాంతం గుండా ప్రవహించే రైన్ నదిలో నౌకల ద్వారా తిండిగింజలు మొదలుకొని రసాయనాలు, బొగ్గు వంటి అనేక సరుకులు దేశం ఒక మూల నుంచి ఇంకోమూలకు చేరుతూంటాయి. నీళ్లు తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు పడవల సామర్థ్యంలో 30 –40 శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఇబ్బంది.. జర్మనీ స్థూల జాతీయోత్పత్తిలో 0.5 శాతాన్ని తగ్గిస్తుందని అంచనా. విద్యుదుత్పత్తికీ అంతరాయం... యూరప్ వర్షాభావం, కరువు పరిస్థితులు విద్యుత్తు సరఫరాపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. స్పెయిన్‌లో జల విద్యుదుత్పత్తి 44 శాతం వరకూ తగ్గిపోగా, అణువిద్యుత్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. వేడెక్కిన ఇంధనాన్ని చల్లబరచేందుకు తగినన్ని నీళ్లు లేక ఫ్రాన్స్‌లో కొన్ని అణువిద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించారు కూడా. ఇటలీలో బయటపడ్డ బాంబు... ఇటలీలోని ప్రధాన నది ‘పో’ ఈ ఏటి వర్షాభావం పుణ్యమా అని దాదాపుగా ఎండిపోయింది. దీంతో మాన్టువా ప్రాంతంలో నది అడుగు భాగంలోంచి రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు ఒకటి బయటపడింది. పేలని ఈ బాంబును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు గాను స్థానికులు సుమారు 3000 మందిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. నదిలో నౌకల రవాణా, పరిసరాల్లోని ట్రాఫిక్‌ను కూడా నిలిపివేసి సుమారు 500 కిలోల బరువున్న బాంబును ఇంకో ప్రాంతానికి తరలించారు. అంతేకాదు.. ఈ ‘పో’ నదిలోనే 1943లో జర్మనీ వాళ్లు వాడిన భారీ సరుకు రవాణా నౌక ఒకటి కూడా బయటపడింది. కొన్ని నెలల ముందే దీని ఆనవాళ్లు నదిలో కనిపించినప్పటికీ వర్షాభావం కొనసాగడంతో ప్రస్తుతం అది నీటిలోంచి బయటపడినట్లుగా పూర్తిగా కనిపిస్తోంది. ఇక ఇటలీలోని రోమ్ నగరానికి వస్తే.. టైబర్ నది అడుగంటిన కారణంగా ఎప్పుడో రోమన్ల కాలంలో నీరో చక్రవర్తి కట్టినట్టుగా భావిస్తున్న వంతెన ఒకటి అందరికీ దర్శనమిచ్చింది. ఈ వంతెన క్రీస్తు శకం 50వ సంవత్సరం ప్రాంతంలో కట్టి ఉంటారని అంచనా. చర్చీలు, చారిత్రక అవశేషాలు... యూరోపియన్ దేశం స్పెయిన్‌లో వర్షాభావం.. క్రీస్తు పూర్వం ఐదువేల సంవత్సరాల నాటి అవశేషాలను మరోసారి చూసే అవకాశాన్ని కల్పించింది. యూకేలోని నిలువురాళ్లు స్టోన్ హెంజ్ గురించి మీరు వినే ఉంటారు. వృత్తాకారంలో ఉండే ఈ భారీ సైజు రాళ్లను ఎవరు? ఎందుకు? ఏర్పాటు చేశారో ఇప్పటికీ మిస్టరీనే. ఈ స్టోన్ హెంజ్ తరహా రాళ్లు స్పెయిన్ లోనూ ఉన్నాయి. కాకపోతే వాల్డెకానాస్ రిజర్వాయర్‌లో ఉంటాయి ఇవి. కాసెరెస్ ప్రాంతంలోని ఈ రిజర్వాయర్ ఇప్పుడు దాదాపు అడుగంటింది. డోల్మెన్ ఆఫ్ గులాడాల్ పెరాల్ అని పిలిచే ఈ రాతి నిర్మాణాలను జర్మనీ పురాతత్వ శాస్త్రవేత్త హూగో ఓబెర్మెయిర్ 1926లో గుర్తించారు. అయితే ఫ్రాన్సిస్కో ఫ్రాంకో నియంతృత్వ రాజ్యంలో 1963లో ఈ ప్రాంతంలో రిజర్వాయర్ కట్టడంతో డజన్ల కొద్దీ భారీ రాళ్లున్న స్టోన్ హెంజ్ కాస్తా మునిగిపోయింది. స్పెయిన్ , పోర్చుగల్ సరిహద్దుల్లోనూ ఓ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో అసెరెడో పేరున్న గ్రామం ఒకటి బయటపడింది. రిజర్వాయర్ నిర్మాణం కారణంగా ఈ గ్రామం 1992లో మునిగిపోగా 30 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు చూడగలుగుతున్నారు. అలాగే స్పెయిన్ , బార్సిలోనాలోని బ్యుయెన్ డియా రిజర్వాయర్‌లో నీళ్లు ఇంకిపోవడంతో తొమ్మిదవ శతాబ్దం నాటి చర్చి ఒకటి వెలుగు చూసింది. ఇన్నేళ్లుగా నీళ్లలో మునిగి ఉన్నా ఈ చర్చి చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. నన్ను చూస్తుంటే... ఏడవండి!!! నన్ను చూసి ఎడ్వకురా అన్న నానుడి మీరు వాహనాల వెనుక భాగంలో చూసి ఉండవచ్చు కానీ.. యూరప్‌లో ఈ ఏడాది వర్షాభావం కారణంగా ‘‘నన్ను చూస్తున్నారంటే... ఇక మీకు ఏడుపే మిగిలింది’’ అని రాసున్న రాళ్లు బయటపడ్డాయి. నదుల వెంబడి ఉండే ఈ రాళ్లపైని ఈ రాతలు గతకాలపు కరవు చిహ్నాలన్నమాట. రాతలు కనిపించే స్థాయికి నీటి మట్టం పడిపోయిందంటే.. ముందుంది కరవు కాలం అని హెచ్చరికన్నమాట. మధ్య యూరప్ లోని పలు ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. వీటిని ‘‘హంగర్ స్టోన్స్’’ లేదా కరవు రాళ్లని పిలుస్తారు. చెకస్లోవేకియా పర్వత ప్రాంతం నుంచి జర్మనీ మీదుగా నార్త్ సీలోకి ప్రవహించే ఎల్బే నదిలో ఈ ఏడాది ఈ హంగర్ స్టోన్స్ బయటపడ్డాయి. ఎప్పుడో 1616 తరువాత ఇవి మొదటి సారి మళ్లీ బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. పదిహేనవ శతాబ్దం నాటి ఈ రాయిపై ‘‘వెన్ డూ మిచ్ సైన్స్ ్ డాన్ వైన్ ’’ అని ఈ రాళ్లపై రాసుంది. దీనిర్థమే ‘‘నన్ను చూస్తూంటే.. ఏడవండి’’ అని. 2013లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. ఏళ్ల కరవు కాటకాలను అనుభవించిన తరువాతే రాళ్లపై ఈ రాతలు ప్రత్యక్షమై ఉంటాయని తెలిపింది. 17వ శతాబ్దపు ఉద్యానవనాలు... యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ వర్షాభావం గత చరిత్ర ఆనవాళ్లను కళ్లెదుటకు తెస్తోంది. డెర్బిషైర్లో లేడీబౌవర్ రిజర్వాయర్ నీళ్లు అడుగంటిపోవడంతో 1940 ప్రాంతంలో ఈ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా జలసమాధి అయిన డెర్వెంట్ గ్రామమూ అందులోని చర్చి ఇప్పుడు మళ్లీ అందరికీ దర్శనమిస్తున్నాయి. అలాగే కొలిఫోర్డ్ లేక్ రిజర్వాయర్‌లో వందల ఏళ్ల క్రితం నాటి వృక్షాల అవశేషాలు బయటపడగా ఇంగ్లాండ్ ఆగ్నేయ ప్రాంతంలోని స్వీడన్ లో పాతకాలపు ఉద్యానవన అవశేషాలు కనిపిస్తున్నాయి. 17వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న లైడయార్డ్ పార్క్‌లో ఎండ తాకిడికి గడ్డి మాడిపోవడంతో కిందనున్న నేల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పార్కు ఏర్పాటుకు ముందు కొంచెం పక్కగా వేసిన మొక్కల తాలూకూ గుర్తులిప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. లాంగ్లీట్ ప్రాంతంలోనూ ఇలాంటి ఉద్యానవన ఆనవాలు ఒకటి బయటపడినట్లు సమాచారం. యునైటెడ్ కింగ్డమ్లో ఈ ఏడాది కరవు పరిస్థితి ఎంత భీకరంగా ఉందీ అంటే.. ఇంగ్లాండ్ మొత్తానికి ఆధారమైన... లండన్ మధ్యలో ప్రవహించే థేమ్స్‌కు నీరిచ్చే ప్రాంతాల్లో చుక్క నీరు లేదంటే అతిశయోక్తి కాదేమో!!! ఈ ఏడాది వేసవిధాటికి స్పెయిన్‌లోని లిమా నదిపై నిర్మించిన రిజర్వాయర్ అడుగంటిపోవడంతో బయటపడిన పురాతన రోమన్ గ్రామం. రెండువేల ఏళ్ల కిందటి ఈ గ్రామం రోమన్ సామ్రాజ్యకాలంలో సైనిక స్థావరంగా ఉపయోగపడేదని పురాతత్త్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనాటి కట్టడాలు, సైనిక స్థావరాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అగ్రరాజ్యం అమెరికాలోనూ... అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది వర్షాభావం తీవ్రంగా ఉంది. కాలిఫోర్నియాలో రాలని చినుకు కారణంగా లేక్‌మీడ్ దాదాపుగా అడుగంటిపోయింది. అలాగే టెక్సస్ రాష్ట్రంలోని దాదాపు 60 శాతం ప్రాంతం వర్షాభావాన్ని ఎదుర్కొంటోంది. నీళ్లు లేక ఎండిపోయిన జల వనరుల్లో సుమారు 11.3 కోట్ల ఏళ్ల క్రితం నాటి రాక్షసబల్లుల కాలిముద్రలు బయటపడ్డాయి. టెక్సస్‌లోని డైనోసార్ వ్యాలీ స్టేట్పార్క్లో బయటపడ్డ ఈ పాదముద్రలు అక్రోకాన్ థోసారస్ అనే రకం రాక్షసబల్లికి చెందిందని స్టేట్పార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. బతికి ఉండగా ఇది సుమారు 15 అడుగుల ఎత్తు ఉండేదని బరువు ఏడు టన్నుల వరకూ ఉండి ఉండవచ్చునని తెలిపింది. అలాగే ఈ ప్రాంతంలోనే సారోపొసైడన్ రకం రాక్షసబల్లి ఆనవాళ్లూ గ్లెన్ రోజ్లో బయటపడింది. ఇది బతికుండగా 60 అడుగుల ఎత్తు, 44 టన్నుల బరువు ఉండి ఉండేదని అంచనా. సాధారణ పరిస్థితుల్లో ఈ రాక్షసబల్లుల పాదముద్రలు నీటిలో మునిగి ఉండేవని, పైగా మట్టితో నిండిపోయి అస్సలు కనిపించేవి కావని స్థానికులు తెలిపారు. వర్షం పడితే.. మళ్లీ ఈ పాదముద్రలు నీటిలో మునిగిపోతాయి. అయితే వీటిని వీలైనంత వరకూ జాగ్రత్తగా కాపాడేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్ అధికారులు చెబుతున్నారు. లేక్మీడ్లోనూ యుద్ధ నౌక... అమెరికాలోని లాస్‌వేగస్‌కు కొంత దూరంలో ఉండే లేక్ మీడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుల్లో లేక్‌మీడ్ ఒకటి. ఈ సరస్సుపైనే ప్రఖ్యాత హూవర్ డ్యామ్ నిర్మాణం జరిగింది. వర్షాభావం కారణంగా ఈ ఏడాది లేక్‌మీడ్ సరస్సు సామర్థ్యంలో కేవలం 27 శాతం మాత్రమే నీళ్లు ఉన్నాయి. 2000 సంవత్సరంతో పోలిస్తే 175 అడుగుల దిగువన లేక్‌మీడ్ జలమట్టం ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో హూవర్ డ్యామ్ ద్వారా జల విద్యుదుత్పత్తిని తగ్గించుకోవడంతోపాటు అరిజోనా, నెవెడా, మెక్సికో ప్రాంతాల్లో నీటి వినియోగాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టడం ఇది వరసుగా రెండో ఏడాది కావడం గమనార్హం. లేక్మీడ్కు నీటిని అందించే కొలరాడో నదీ పరీవాహక ప్రాంతంలో కొన్నేళ్లు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. - గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే!
వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. పాకిస్తాన్లో వరద బీభత్సం, చైనాలో కరువు కాటకాలు, భారత్‌లో కనీవినీ ఎరుగని వాతావరణ మార్పులు... వీటన్నింటికీ అదే కారణమని భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చోటా షిగ్రి హిమానీ నదాన్ని వారు కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు వెల్లడైంది. గత జూన్‌లో ఏర్పాటు చేసిన డిశ్చార్జ్ మెజరింగ్ వ్యవస్థ ఆగస్టుకల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఇండోర్ ఐఐటీ గ్లేసియాలజిస్ట్ మహమ్మద్ ఫరూక్ ఆజం చెప్పారు. ‘‘గత మార్చి, ఏప్రిల్‌లో మన దేశంలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. హిమానీ నదాలు కరిగిపోవడమే అందుకు కారణం. గత వారం మా బృందమంతా షిగ్రి దగ్గరే ఉండి పరీక్షించాం. మంచు భారీగా కరిగిపోతోంది’’ అంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అరేబియా సముద్రంలో అత్యధిక వేడిమి కారణంగా నీరంతా ఆవిరి మేఘాలుగా మారి ఎడతెరిపి లేకుండా వానలు కురిసి లానినో ప్రభావం ఏర్పడింది. దాంతో వాతావరణమే విపత్తుగా మారి పాక్‌ను అతలాకుతలం చేస్తోంది’’ అన్నది శాస్త్రవేత్తల వివరణ. హిమాలయాలు కరిగిపోతే...? గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు హిమాలయాల్లో మంచు గత నాలుగు దశాబ్దాల్లో కరిగిన దాని కంటే 2000–2016 మధ్య ఏకంగా 10 రెట్లు ఎక్కువగా కరిగిపోయింది! దక్షిణాసియా దేశాలకు ఇది పెను ప్రమాద హెచ్చరికేనంటున్నారు. కారకోరం, హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 55 వేల హిమానీ నదాలున్నాయి. హిమాలయ నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర 8 దేశాల్లో 130 కోట్ల మంది మంచినీటి అవసరాలు తీరుస్తున్నాయి. 5,77,000 చదరపు కిలోమీటర్లలో వ్యవసాయ భూములకు నీరందిస్తున్నాయి. 26,432 మెగావాట్ల సామర్థ్యం ఉన్న హైడ్రోపవర్ స్టేషన్లున్నాయి. హిమాలయాల్లో మంచు కరిగిపోతే వీటన్నింటిపైనా ప్రభావం పడటమే గాక 2050 నాటికి దక్షిణాసియా దేశాల్లో 170 కోట్ల మందికి నీటికి కటకట తప్పదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలూ జరగవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో పాకిస్తాన్ వాటా కేవలం 1 శాతమే. కానీ వాతావరణ మార్పులు ఇప్పుడు ఆ దేశాన్ని బలి తీసుకుంటున్నాయి. చైనాలో కరువు సంక్షోభం ► 17 ప్రావిన్స్‌లలో వరసగా 70 రోజుల పాటు ఎండలు దంచిగొట్టాయి. వడగాడ్పులకి 90 కోట్ల మంది అవస్థలు పడ్డారు ► చైనాలో ఏకంగా సగ భాగంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి ► చైనాలో అతి పెద్ద నది యాంగ్జె ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. 1865 తర్వాత ఈ నది నీటిమట్టం బాగా తగ్గిపోవడం మళ్లీ ఇప్పుడే. ► చైనాలోని దక్షిణ ప్రావిన్స్‌లైన హుబై, జియాంగ్జీ, అన్‌హుయాయ్, సిచుయాన్‌లలో నీళ్లు లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడుతున్నాయి ► చైనాలో జల విద్యుత్‌లో 30శాతం సిచుయాన్ ప్రావిన్స్ నుంచే వస్తుంది. ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది ► చైనాలో కరువు పరిస్థితులు 25 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తే, 22 లక్షలకు పైగా హెక్టార్లలో వ్యవసాయ భూమి ఎండిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా: కరువుపై మేఘమథన అస్త్రం!
చాంగ్కింగ్(చైనా): దక్షిణ చైనాలో కరువు ఉరుముతోంది. ఎండలు మండిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోంది. తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్నిచోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరువు సమస్యను అధిగమించడానికి మేఘ మథనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి, వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్, హూబే ప్రావిన్స్‌ల్లోనూ ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారినుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్‌లో 45 డిగ్రీల సెల్సియస్(113 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ చైనాలో వరిసాగు అధికం. పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియాన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి, కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా 26 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. -
Europe Drought 2022: జాడలేని వాన చినుకు.. అల్లాడిపోతున్న యూరప్
బ్రిటన్‌లో థేమ్స్ నది ఎండిపోతోంది. ఫ్రాన్స్‌లో ఎండ వేడిమికి కార్చిచ్చులు ఎగసిపడుతున్నాయి. నదుల్లో నీళ్లు లేక చచ్చిపోయిన చేపలు గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. స్పెయిన్‌లో రిజర్వాయర్లు నీళ్లు లేక బోసిపోతున్నాయి. మొత్తంగా యూరప్‌లో సగభాగాన్ని కరువు కమ్మేస్తోంది. లండన్: వాతావరణంలో మార్పుల ప్రభావం యూరప్‌ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు ముంచుకొస్తోంది. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్‌లో రెండు నెలలుగా వాన చినుకు జాడ కూడా లేదు! దాంతో యూరప్‌లోని సగం ప్రాంతాల్లో కరువు పడగ విప్పింది. యూరోపియన్ యూనియన్‌లో 46% ప్రాంతాల్లో ప్రమాదకంగా కరువు పరిస్థితులున్నాయి. వాటిలో 11% ప్రాంతాల్లోనైతే అతి తీవ్ర కరువు నెలకొంది! దక్షిణ ఇంగ్లండ్‌లో థేమ్స్ నదిలో ఏకంగా 356 కి.మీ. మేర ఇసుక మేటలు వేసింది. నది జన్మస్థానం వద్ద వానలు కురవకపోవడం, ఎగువ నుంచి నీళ్లు రాకపోవడంతో ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది! ఫ్రాన్స్‌లోని టిల్లె నదిలో సెకనుకు సగటున 2,100 గాలన్లు నీరు ప్రవహించే చోట్ల కూడా ఇప్పుడు చుక్క నీరు కనిపించడం లేదు. దక్షిణ, మధ్య, తూర్పు ఇంగ్లండ్‌లో ఏకంగా 8 ప్రాంతాలను కరువు ప్రభావితమైనవిగా బ్రిటన్ ప్రకటించింది. 1935 తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం ఇదే తొలిసారి! ఇంగ్లండ్‌లో కొద్ది వారాలుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ పైగానమోదవుతున్నాయి. ఈ ఏడాది జూలై అత్యంత పొడి మాసంగా రికార్డులకెక్కింది. ఇవే పరిస్థితులు తూర్పు ఆఫ్రికా, మెక్సికోల్లో కనబడుతున్నాయి. 500 ఏళ్లకోసారి మాత్రమే ఇంతటి కరువు పరిస్థితులను చూస్తామని నిపుణులు చెబుతున్నారు. నదులు ఎండిపోతూ ఉండడంతో జల విద్యుత్కేంద్రాలు మూతపడుతున్నాయి. 2018లో కూడా కరువు పరిస్థితులు వచ్చినా ఇంత టి పరిస్థితులను ఎదుర్కోలేదని అధ్యయనవేత్లలు అంటున్నారు. అక్టోబర్ దాకా ఇవే పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రమైతే ఇళ్లల్లో తోటలకు నీళ్లు పెట్టడం, కార్లు శుభ్రం చేయడం, ఇంట్లోని పూల్స్‌లో నీళ్లు నింపడంపై నిషేధం విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ప్రమాద ఘంటికలు... ► బ్రిటన్‌లో జూలైలో సగటు వర్షపాతం 35% మాత్రమే నమోదైంది. ► దాంతో ఆవులు తాగే నీళ్లపై కూడా రోజుకు 100 లీటర్లు అంటూ రేషన్ విధిస్తున్నారు. ► మొక్కజొన్న ఉత్పత్తి 30%, పొద్దుతిరుగుడు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు తగ్గనుందని అంచనా. ► బంగాళదుంప రైతులంతా నష్టపోయారు. ► జర్మనీలోని రైన్ నదిలో నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. చాలాచోట్ల 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ నదిపై రవాణా ఆగిపోతే∙8 వేల కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది. ► ఇటలీలో గత 70 ఏళ్లలో చూడనంతటి అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ► ఇటలీలోని అతి పెద్ద నది పో సగం వరకు ఎండిపోయింది. ► ఫ్రాన్స్‌లో 100కు పైగా మున్సిపాల్టీల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు. ► ఎండ తీవ్రతకు ఫ్రాన్స్‌లో గిర్నోడ్ లో 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు వ్యాపించింది. ► స్పెయిన్‌లో ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ► హంగరీలో నదులన్నీ బురద గుంతలుగా మారిపోతున్నాయి. -
టీడీపీ అధికారంలో ఉంటే ఆ దరిద్రం తప్పదు: ఎంవీఎస్ నాగిరెడ్డి
-
కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు: ఎంవీఎస్ నాగిరెడ్డి
-
ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం
ఎండవేడిమి పెరిగిపోతోంది. ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం ఎక్కువైపోయింది. కరోనా అదుపులోనికి రావడంతో పరిశ్రమల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో విద్యుత్ వాడకం ఎక్కవైపోయింది. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లయ్ చేయడానికి థర్మల్ కేంద్రాలను బొగ్గు కొరత వేధిస్తోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా కోల్ ఇండియా దగ్గర సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ కేంద్రంలో శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు ఉక్కబోత, విద్యుత్ కోతతో జనాలు అల్లాడిపోవాల్సిందే. దేశంలోని విద్యుత్ అవసరాలను 70% థర్మల్ పవర్ కేంద్రాలే తీరుస్తూ ఉంటే ఆయా కేంద్రాల్లో బొగ్గుకి కొరత ఏర్పడడంతో చాలా రాష్ట్రాలు పవర్ కట్లు విధిస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, బిహార్ జమ్మూ కశ్మీర్, తమిళనాడు, కర్ణాటకలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలపై పడి ఆర్థిక రంగం కూడా కుదేలైపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. వేసవికాలం కావడంతో హఠాత్తుగా దేశవ్యాప్తంగా పెరిగిపోయిన విద్యుత్ వినియోగంతో పాటు బొగ్గు పంపిణీలో లోపాలు సమస్యని మరింత పెంచాయి. విద్యుత్‌కి డిమాండ్ ఎలా పెరిగింది ? ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్నాళ్లూ రోజుకి సగటున 187 గిగావాట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉంటే ఏప్రిల్ 1–12 తేదీ మధ్యలో సగటున రోజుకి 194 గిగావాట్లకు పెరిగిపోయింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో రోజుకి ఎనిమిది గంటలు విద్యుత్ కోతలు విధించే పరిస్థితులు వచ్చాయి. బొగ్గు కొరత ఎలా ఉంది ? దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రాను రాను బొగ్గుకి కొరత ఏర్పడింది. నేçషనల్ పవర్ పోర్టల్ గణాంకాల ప్రకారం ఇంపోర్టెడ్ కోల్ బేస్డ్ (ఐసీబీ) విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పాతాళానికి పడిపోయాయి. అదే విధంగా 79 దేశీయ పవర్ ప్లాంట్లు కూడా తీవ్ర బొగ్గు కొరతని ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ 19 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 700కిపైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2.2 కోట్ల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇవి కేవలం తొమ్మిది రోజులకే సరిపోతాయి. శాఖల మధ్య సమన్వయ లోపం గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారీ వర్షాల కారణంగా బొగ్గు తవ్వకాలు నిలిచిపోవడంతో దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు బొగ్గు తవ్వకాలు సమృద్ధిగా జరుగుతున్నప్పటికీ కేంద్రంలోని శాఖల మధ్య సమన్వయ లోపమే దేశంలో విద్యుత్ కోతలకి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ మొదట్లో కోల్ ఇండియా 27% అదనంగా బొగ్గు తవ్వకాలు జరిపింది. విద్యుత్, బొగ్గు గనులు, రైల్వే శాఖ అధికారులతో కూడిన ఒక అంతర్గత కమిటీ బొగ్గు పంపిణీ వ్యవహారాలు చూస్తుంది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ బొగ్గు పంపిణీకి సరిపడనంత రాక్స్‌ని కేటాయించడం లేదని ఆరోపిస్తూ ఉంటే, లోడింగ్, అన్‌లోడింగ్‌లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అవకతవకలకు పాల్పడుతోందని రైల్వే శాఖ ఎదురుదాడికి దిగింది. ► థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 17 నుంచి 26 రోజులకు సరిపడే నిల్వలుంటేనే అవి పూర్తయ్యేలోగా తిరిగి బొగ్గు నిల్వలు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం తొమ్మిది రోజులకి సరిపడా నిల్వలు మాత్రమే ఉండడం ఆందోళనకరంగా మారింది. ► ప్రతిరోజూ రైల్వే శాఖ 453 రాక్స్‌ను కేటాయిస్తేనే విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు పంపిణీ సాధ్యమవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కేవలం 412 రాక్స్ ద్వారా మాత్రమే బొగ్గుని పంపిణీ చేస్తూ ఉండడంతో కొరతకి దారి తీసింది. ► ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హరియాణాలలో బొగ్గు నిల్వలు కేవలం ఆరు రోజులకు సరిపడా ఉన్నాయని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) చైర్మన్ శైలేంద్ర దూబే వెల్లడించారు. ► రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఇన్నాళ్లుగా టన్ను బొగ్గుకి 100 డాలర్లు ఇస్తే, ఇప్పుడు అది ఏకంగా 300 డాలర్లకు చేరుకుంది. ► విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుని వాడే విద్యుత్ ప్లాంట్లలో 6.6 కోట్ల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం 2.2 కోట్ల టన్నులు మాత్రమే ఉంది. ► విదేశీ బొగ్గు కొరతని అధిగమించడానికి కేంద్రం రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకి బొగ్గుని దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రపంచంలో బొగ్గు ఎగుమతుల్లో మూడో స్థానంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో యూరప్ దేశాలు బొగ్గు దిగుమతులపై నిషేధం విధించారు. దీంతో భారత్ రష్యా నుంచి బొగ్గుని దిగుమతి చేసుకొని సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా..
Giraffe Death In Kenya: ఆరు జిరాఫీలు.. నీటి కోసం గట్లు, గుట్టలు, చెట్లు, పుట్టలు.. అడవంతా తిరిగాయి. ఒంట్లో సత్తువ నశిస్తున్నా, నిలబడటానికి కూడా ఓపిక లేకున్నా దాహం తట్టుకోలేక వెతికాయి. కాస్త దూరంలో ఏదో బురదలా కనిపించగానే నీళ్లుంటాయని పరుగున అక్కడికెళ్లాయి. అంతే.. ఆ బురదలోనే చిక్కుకుని నీరు లేక గొంతెండి.. తిండిలేక పేగులు మండి చనిపోయాయి. (చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు) గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న ఈ సంఘటన కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇటీవల జరిగింది. ఈ ఫొటోలను డిసెంబర్ 10న తీశారు. కొంతకాలంగా కెన్యా ఉత్తర ప్రాంతంలో వర్షాల్లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నీటి కోసం ఆ ప్రాంతంలోని ప్రాణులు అల్లాడుతున్నాయి. ఈ ఆరు జిరాఫీలు చనిపోయిన ప్రాంతానికి దగ్గర్లోని గరిస్సా కౌంటీలో 4 వేలకు పైగా జిరాఫీలున్నాయని, నీరు దొరక్కపోతే వీటికీ ప్రమాదం తప్పదని అక్కడి మీడియా చెబుతోంది. (చదవండి: అగ్ని పర్వతం బద్దలై.. బూడిదగా మారి‘నది’) -
యంగెస్ట్ ప్రెసిడెంట్..నీళ్ల కోసం గెలిచింది
‘ఇంటి ముందుకు నీళ్లు రావాలి. అది నా లక్ష్యం’ అంది షారుకళ. 22 ఏళ్ల ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టూడెంట్ తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్‌గా గెలుపొందింది. తెన్‌కాశీ సమీపంలోని తన ఊరి చుట్టుపక్కల ఎప్పుడూ నీళ్ల కోసం అవస్థలే. ఆ నీటి కోసం ఆమె నిలబడింది. ‘రాజకీయాల్లో యువత రావాలి. పనులు ఇంకా బాగా జరుగుతాయి’ అంటోంది. తమిళనాడులో ‘కరువు’ ఆధార్ కార్డ్ తీసుకుంటే దాని మీద అడ్రస్ ‘తెన్‌కాశీ’ అని ఉంటుంది. నీటి కటకట ఎక్కువ ఆ ప్రాంతంలో. హటాత్ వానలు కురిస్తే కొన్ని పల్లెలు దీవులు అవుతాయి. తెన్కాశీకి సమీపంలో ఉండే లక్ష్మీయూర్‌లో పుట్టిన షారుకళ చిన్నప్పటి నుంచి ఇదంతా చూస్తోంది. వాళ్ల నాన్న రవి సుబ్రహ్మణ్యం రైతు. తల్లి స్కూల్ టీచర్. వాళ్లిద్దరూ ఒక్కోసారి చుట్టుపక్కల ఊళ్లలో నీటి బాధలు చూళ్లేక సొంత డబ్బులతో ట్యాంకర్లు తిప్పారు. కాని అది ఒకరిద్దరి వల్ల జరిగే పని కాదు. ఏం చేయాలి? అవును.. ఏం చేయాలి అనుకుంటుంది షారుకళ. ఎన్నికలొచ్చాయి తమిళనాడులో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం 9 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. తెన్‌కాశీ కూడా జిల్లా అయ్యింది. అన్ని చోట్ల స్థానిక ఎన్నికలు ఊపు మీద జరిగాయి. ‘ఇది మంచి చాన్స్ అనుకుంది’ షారుకళ. కోయంబత్తూరులోని హిందూస్తాన్ యూనివర్సిటీలో పి.జి చేస్తున్న షారుకళ సెలవలకు ఇంటికి వచ్చి ఈ తతంగం మొదలైనప్పటి నుంచి నేను కూడా ఎలక్షన్స్‌లో నిలబడతా అని చెప్పసాగింది. సరదాకి చెబుతోంది అనుకున్నారు తల్లిదండ్రులు. నామినేషన్స్ సమయానికి ఆమెకు స్థానిక నాయకుల మద్దతు దొరకడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంగానే సరేనన్నారు. షారుకళ నామినేషన్ వేసింది. ఆమె ఊరు వెంకటపట్టి పంచాయతీ కిందకు వస్తుంది. ఆ పంచాయితీకి గత 15 ఏళ్లుగా గణేశన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అతడు మరణించడం వల్లా, ఆ స్థానం ఈసారి స్త్రీలకు రిజర్వ్ కావడం వల్ల అతని భార్య ప్రధాన పోటీదారు అయ్యింది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా నామినేషన్స్ వేశారు. గట్టి అభ్యర్థి షారుకళ కాని షారుకళ వెరవలేదు. ఢీ అంటే ఢీ అంది. ప్రత్యర్థులు ఊరికే ఉండలేదు. ఆమె మీద బాగా ప్రతికూల ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయి చదువుకోడానికి పట్నం వెళ్లిపోతుంది. లేదంటే రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అప్పుడేం చేస్తారు’ అని ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయికి పొగరు. వాళ్ల ఇంటికి వెళితే కుక్కను వదులుతుంది’ అనీ ప్రచారం చేశారు. కాని షారుకళ అందరినీ కలిసింది. ‘మన పంచాయితీలోని ప్రతి ఊళ్లో ప్రతి గడప దగ్గరకు నీళ్లు వచ్చేలా చేయడం కోసం ఎన్నికల్లో నిలబడ్డాను’ అని చెప్పింది. ‘మన ఊళ్లల్లో పిల్లలు బాగా ఆటలాడతారు. వారి కోసం గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల కోసం లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. పార్కులు కూడా కావాలి. ఇవన్నీ నేను గెలిస్తే ఏర్పాటు చేస్తాను’ అని షారుకళ చెప్పింది. ‘యువతకు అవకాశం ఇవ్వండి. చేసి చూపిస్తారు’ అని చెప్పింది. మహిళలు చాలామంది షారుకళను అభిమానించారు. ‘మా ఇంటి ఆడపిల్లలా ఉన్నావు. నీకే ఓటేస్తాం’ అన్నారు. గెలుపు వెంకటపట్టి పంచాయతీలో మొత్తం 6,362 ఓట్లు ఉన్నాయి. ప్రత్యర్థి మహిళకు 2,540 ఓట్లు వచ్చాయి. ఆమె మీద 796 ఓట్ల మెజారిటీతో షారుకళ గెలిచింది. మరో ముగ్గురు మహిళలకు డిపాజిట్లు లేవు. గ్రామస్తులు ఆమెకు రంగులు జల్లి దండలు వేసి సత్కరించుకున్నారు. ‘అమ్మా.. మాతో ఉండు. మా సమస్యలు నెరవేర్చు’ అని చెప్పుకున్నారు. ‘ఆ... ఆ అమ్మాయికి ఏం తెలుసు... రేపటి నుంచి వాళ్ల నాన్న ఆట ఆడిస్తారు’ అనే మాటలు షారుకళ చెవిన పడ్డాయి. వెంటనే షారుకళ ‘మన పంచాయతీకి నేను మాత్రమే ప్రెసిడెంట్. మా నాన్నో, లేదా మా ఇంటి మగవాళ్లో నా మీద గాని నా పదవి మీద గాని పెత్తనం చేయరు. నిర్ణయాలు నావే. ప్రజలు నాతోనే మాట్లాడాలి’ అని స్పష్టం చేసింది. ఆ అమ్మాయి స్పష్టత, ఆత్మవిశ్వాసం, సంకల్పం చూస్తుంటే భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లో పెద్ద పేరు అవుతుందని అనిపిస్తోంది. -
కోవిడ్‌తో నిమిషానికి ఏడుగురు.. ‘ఆకలి వైరస్’కు 11 మంది
కైరో: ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, గ్లోబల్ వార్మింగ్, అంతర్యుద్ధ పరిస్థితులు ఆకలి కేకల్ని పెంచేస్తున్నాయి. తినడానికి తిండి లేక ఆకలిబాధతో ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది మరణిస్తున్నట్టుగా పేదరిక నిర్మూలనపై కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘‘ది హంగర్ వైరస్ మల్టిప్లైస్’’ అన్న పేరుతో ఆక్స్‌ఫామ్ సంస్థ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారితో నిమిషానికి ఏడుగురు మరణిస్తూ ఉంటే, అదే సమయంలో ఆకలి బాధ తట్టుకోలేక నిమిషానికి 11 మంది మరణించడం హృదయ విదారకర పరిస్థితులకు అద్దం పడుతోందని ఆ సంస్థ సీఈఓ అబ్బీ మ్యాక్స్‌మ్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ గణాంకాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మన ఊహకి కూడా అందని దుర్భర పరిస్థితుల్ని ఎందరో ఎదుర్కొంటున్నారు. అంతర్యుద్ధాలు, పర్యావరణ మార్పులతో ఏర్పడే విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు కోట్లాది మందిని తిండికి దూరం చేశాయి’’ అని ఆయన అన్నారు. ‘‘మార్కెట్లపై బాంబులు వేస్తున్నారు. పండిన పంటల్ని ధ్వంసం చేస్తున్నారు. వాతావరణ మార్పులతో దుర్భర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఆకలిని పెంచేస్తున్నాయి. ఇలాంటి విపత్తు నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది’’ అని మ్యాక్స్‌మ్యాన్ అన్నారు. నివేదికలో అంశాలివే.. ► ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య 2 కోట్లు పెరిగింది. ► ఆహార కొరతని ఎదుర్కొంటున్న వారిలో దాదాపుగా 66% మంది మిలటరీ సంక్షోభం నెలకొన్న దేశాల్లోనే ఉన్నారు ► కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులతో 5,20,000 మంది ఆకలితో నకనకలాడిపోతున్నారు ► కోవిడ్–19 ప్రభావం, వాతావరణ మార్పులతో గత ఏడాదికాలంలోనే ఆహార ఉత్పత్తుల ధరలు 40% పెరిగాయి ► గత ఏడాది కాలంలో ప్రపంచ దేశాల్లో కరువు పరిస్థితులు ఆరు రెట్లు పెరిగిపోయాయి ► కరోనా కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై చేసే ఖర్చు 5,100 కోట్ల డాలర్లు పెరిగింది. ఆకలి కేకల్ని నిర్మూలించడానికి ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన ఖర్చు కంటే మిలటరీపై చేస్తున్న ఖర్చు ఆరు రెట్లు ఎక్కువ. ► అఫ్గానిస్తాన్, ఇథియోపియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమన్ దేశాల్లో ఆకలి కేకలు అత్యధికంగా ఉన్నాయి. -
Pareshamma: ఒప్పించి.. మెప్పించింది!
ఐదేళ్ల శ్రమకు దక్కిన గౌరవం ఇది. నేలతల్లి గొంతు తడిని నిలిపిన ఫలితం. గ్రామీణ మహిళకు అందిన ఈ పురస్కారం. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె కరువుకు కేరాఫ్. భూగర్భ జలాలు అడుగంటిపోవడం ఇక్కడ రైతులకు కొత్తేమీ కాదు. సాగు చేయడానికి నేల ఉంది, పంట పండడానికి నీరు లేదు. తంబళ్లపల్లెతోపాటు చుట్టుపక్కల పదహారు గ్రామాలు ఇప్పుడు ఆ దుస్థితి నుంచి గట్టెక్కాయి. ఆ గట్టెక్కడంలో వేల అడుగులు నడిచింది పారేశమ్మ. ఆమె శ్రమకుగాను యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నేషనల్ వాటర్ మిషన్లు బుధవారం నాడు నేషనల్ ఉమెన్ వాటర్ చాంపియన్ అవార్డును ప్రకటించాయి. తంబళ్లపల్లె మండలం, గోపిదిన్నెకు చెందిన పారేశమ్మ ఐటీఐ పూర్తి చే సింది. గోపిదిన్నెకు చెందిన ఎరుకులప్పను కులాంతర వివాహం చేసుకుంది. అతడు తంబళ్లపల్లె పంచాయతీలో పారిశుద్ద్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. పారేశమ్మ తల్లిదండ్రులకు రెండున్నర ఎకరాల పొలం ఉన్నప్పటికీ సాగునీటి ఇబ్బందులతో వ్యవసాయం చేయడం కుదరలేదు. బతుకుతెరువు కోసం తంబళ్లపల్లెలో స్థిరపడ్డారు. వెంటపడి వినిపించింది! తంబళ్లపల్లి వచ్చిన తర్వాత తాను కూడా ఏదో ఒక పని చేయాలి, ఏ పని దొరుకుతుందా అని ఆలోచిస్తున్నప్పుడు 2015లో ‘ఫౌండేషన్ ఫర్ ఎకోలాజికల్ సెక్యూరిటీ’ సంస్థ పర్యావరణం, నీటి సంరక్షణ, రైతుల కోసం పనిచేస్తున్న విషయం తెలిసి పని అడిగింది. నెలకు రూ. 4,500 గౌరవ వేతనంతో తంబళ్లపల్లె పంచాయతీ లో రీసోర్స్‌పర్సన్‌గా నియమితురాలైంది. తంబళ్లపల్లె పరిసరాల్లోని 16 పల్లెల్లో విధులు నిర్వహించాలి. వ్యవసాయంలో ఎంతో అనుభవం కలిగిన రైతులకు సూచనలివ్వాలి. చెప్పడానికి పారేశమ్మ సిద్ధంగా ఉన్నప్పటికీ వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వాళ్లు అలవాటు పడిన పద్ధతిలో మార్పు తీసుకురావడం మాటలు కాదు. అందులోనూ సేద్యంలో అనుభవం లేని పారేశమ్మ చెప్తుంటే పట్టించుకునేదెవరు? ఆమె ప్రయత్నం అంతా తాతకు దగ్గులు నేర్పించడం వంటిదే అన్నమాట. కొన్నిరోజుల్లోనే పారేశమ్మకు పరిస్థితి అర్థమైపోయింది. అయితే ఆమె ఆ రోజు ఈ పని తనవల్ల కాదని వదిలేసుంటే పారేశమ్మ గురించి రాయడానికి ఏమీ ఉండేది కాదేమో! ఆమె పట్టుదలతో కొనసాగింది. ఒక్కొక్క పల్లెకు ఒకటికి పదిసార్లు వెళ్లింది. ఉదయం ఆరున్నరకు వెళ్తే మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి తిరిగొచ్చేది. మళ్లీ సాయంత్రం నాలుగింటికి వెళ్తే రాత్రి 8 గంటల దాక పల్లెల్లోనే. వాస్తవ నీటి పరిస్థితులు, అధిక నీటి వినియోగమయ్యే పంటలసాగుతో కలిగే ఇబ్బందులను వివరిస్తూ వచ్చింది. చెవినిల్లు కట్టుకుని చెప్పినట్లే చెప్పింది. చెప్పగా చెప్పగా రైతులు వినడం మొదలైంది. ఆ తర్వాత వారిలో ఆలోచన రేకెత్తింది. నిజమే కదా! అని సమాధానపడ్డారు. అలా పారేశమ్మ రైతులను పంటల సాగులో మార్పుకు ఒప్పించింది. రైతులకు అవగాహన కల్పిస్తున్న పారేశమ్మ చాంపియన్ పొలాల్లో కందకాలు తవ్వుకుంటే నీరు పొలంలోనే ఇంకిపోయి తేమ శాతం పెరుగుతుందని వివరించింది. భుగర్భజలాలు పెరగడంపై అవగాహన కల్పించేది. ఉపాధి హామీ పథకం పనుల్లో అధికంగా నీటినిల్వ పనులు చేసేలా ప్రోత్సహించింది. ఇప్పుడు ఈ పల్లెల్లో ఒక వర్షానికే కుంటలు నిండిపోతున్నాయి. రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి పారేశమ్మ ఒంటరిపోరాటం చేసింది. ఆమె కృషికి గుర్తింపుగా వాటర్ చాంపియన్ అవార్డు ఆమెను వరించింది. – టైలర్ షామీర్ బాషా ,బి. కొత్తకోట, చిత్తూరు జిల్లా పదహారు పల్లెలు తంబళ్లపల్లె, పులసవాండ్లపల్లె, గోళ్లపళ్లోపల్లె, చెవిటివారిపల్లె, ఎగువబోయపల్లె, బలకవారిపల్లె, చెన్నప్పగారిపల్లె, నాయనప్పగారిపల్లె, దబ్బలగుట్టపల్లె, కురవపల్లె, మట్టావాండ్లపల్లె, బురుజు, బోడికిందపల్లె, కొండకింద మేకలవారిపల్లె, ఇట్నెనివారిపల్లె, చేలూరివాండ్లపల్లెల్లో ఇంటికి ఒకరిని సంఘంలో చేర్చాను. వారితో నిత్యం పొలాల్లో, గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఏయే పల్లెల్లో భూగర్భజలాల మట్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసి వివరించాను. ఏయే పంటలకు ఏ మేరకు నీటి వినియోగం అవుతుందో చెప్పేదాన్ని, నీటివనరును బట్టి ఏ పంటలు సాగు చేయాలనే అవగాహన కల్పిస్తూ అందుకు అనువైన పంటల గురించి వివరించాను. అందరూ కలిసిరావడంతోనే విజయం సాధించాం. – పారేశమ్మ, రీసోర్స్ పర్సన్,ఎఫ్ఈఎస్ ఇదీ ప్రణాళిక! ఈ పల్లెల చుట్టూ కొండలు, గుట్టలు ఉంటాయి. పల్లెల చుట్టూ సహజంగా ఉన్న ప్రకృతి వనరులను కాపాడుకోవడం. భూమికోత నివారణ, మొక్కల పెంపకం ద్వారా అడవుల సంరక్షణ, భూగర్భజలాల వృద్ధికి నష్టం కలిగించే పనులు చేపట్టకపోవడం కార్యక్రమాలను సంఘాల ద్వారా అవగాహన కల్పించింది పారేశమ్మ. ఈ గ్రామాల్లో రైతులు వరి, టమాట పంటలనే ఎక్కువగా సాగు చేస్తారు. సగం పొలంలో రైతుకు ఇష్టమైన పంట వేసుకుని, మిగిలిన సగం పొలంలో కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు లాంటి చిరుధాన్యాలు, సజ్జలు, రాగులు, వేరుశెనగ సాగు చేశారు. గత ఏడాది 60 మంది రైతుల చేత 75 ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చేయించారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడితో 480 టన్నులు వచ్చింది. కోవిడ్ ప్రభావంతో ధరలు తగ్గాయి. కొందరు రైతులు పంటను అమ్మకుండా మార్కెట్ మెరుగయ్యే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫొటోలు: షేక్ మహ్మద్ రఫీ, సాక్షి, తిరుపతి -
కరువు తెచ్చిన అదృష్టం! నీళ్లలో ఏడాది పాటు...
గత 56 సంవత్సరాలలో తైవాన్ లో తీవ్ర స్థాయిలో కరువు ఏర్పడింది. ఈ కరువు వల్ల చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అయితే, ఒకరికి మాత్రం అదృష్టం ఈ కరువు తెచ్చి పెట్టింది. మిస్టర్ చెన్ అనే వ్యక్తి కరువు వల్ల పోయిన తన ఐఫోన్ 11ను తిరిగి పొందగలిగాడు. చెన్ ఒక సంవత్సరం క్రితం తైవాన్ లోని అత్యంత ప్రసిద్ధ సరస్సులలో ఒకటైన సన్ మూన్ సరస్సులో గత ఏడాది పాడిల్‌బోర్డింగ్ చేస్తున్నప్పుడు ఆకస్మికంగా తన ఐఫోన్ 11 పడిపోయినట్లు పేర్కొన్నాడు. తైవాన్ న్యూస్ ప్రకారం.. ఈ ద్వీపం తీవ్రమైన కరువు ఏర్పడటం వల్ల ఆ సరస్సు బంజరు భూమిగా మారిపోయింది. సన్ మూన్ సరస్సులో నీటి మట్టాలు రికార్డు స్థాయికి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తికి ఐఫోన్ 11 దొరికన తర్వాత తనను సంప్రదించినట్లు మిస్టర్ చెన్ పేర్కొన్నాడు. మిస్టర్ చెన్ పోయిన తన ఐఫోన్ 11 తిరిగి దొరికన సంతోషంలో నిద్రకూడా పట్టలేదని చెప్పారు. అదృష్టవశాత్తూ ఐఫోన్ 11కు కేసు, వాటర్ రెసిస్టెంట్ ఉండటం చేత సరస్సు అడుగులో ఒక ఏడాది ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ పనిచేసింది. మిస్టర్ చెన్ ఫోన్ ఛార్జ్ చేసిన తర్వాత బాగానే పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఐఫోన్ 11కు సంబందించిన బూట్ చేసిన ఫోటోలను ఫేసుబుక్ లో షేర్ చేసాడు. అలాగే, యూట్యూబ్ లో ఈ వీడియోకి 3 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి. చదవండి: బిలియనీర్ల అడ్డాగా బీజింగ్! -
టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో..
అంకారా: టూరిజానికి ప్రసిద్ది చేందిన టర్కీ దేశంలో త్వరలోనే తీవ్ర కరువు తాండవించబోతుందని ఆదేశ నిపుణులు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో టర్కీ ఎడారిగా మారబోతోందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ నీటితో కళకళలాడే ఇస్తాంబుల్ ఏడారిలా మారబోతుందని హెచ్చరిస్తున్నారు. రాబోయే 45 రోజుల్లో టర్కీ దేశంలోని నదులు, జలాశయాలతో పాటు డ్యామ్‌లు సైతం ఎండిపోయి తీవ్ర కరువు సంభవించనుందట. టర్కీలోని ప్రధానం నగరాల్లో వచ్చే కొన్ని నెలల్లో నీళ్లు ఎండిపోయి ఎడారిని తలపించనున్నాయంట. అయితే దీనికి ప్రధాన కారణం దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదు చేసుకోవడంతో దశాబ్ద కాలానికి కరువుకు దారితీసింది. దీనివల్ల దాదాపు 17 మిలియన్ల టర్కీ ప్రజలు నీటి కొరతను ఎదుర్కోనున్నారు. జనవరి నెల నుంచి మరో 110 రోజుల్లో అక్కడి డ్యాములు, రిజర్వాయర్లలోని నీరు కూడా ఎండిపోయే పరిస్థితి రానుంది. ఇక టర్కీలోని అతిపెద్ద నగరాలైన ఇజ్మిర్, బ్యూర్సాలోని డ్యామ్‌లు ఇప్పటికే 36శాతం, 24శాతం మేర నీళ్లు ఎండిపోయాయి. ఇక గోధుమను ఉత్పత్తి చేసే ప్రాంతాలైన కోన్యా ప్లేన్, ఎడ్రైన్ ప్రావిన్స్‌లలో కూడా సాగుకు నీరు లేక రైతులు విలవిల్లాడుతున్నారు. గ్రీస్, బుల్గారియా సరిహద్దుల్లోని ఈ ప్రాంతాలకు సాగుబడికి చేయడమే కష్టంగా మారింది. 2020లో అక్కడ నవంబర వరకు కనీసం 50 శాతం కూడా వర్షపాతం నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో గత నెలలో వర్షం కోసం వరుణుడిని ప్రార్థించాలంటూ మత వ్యవహారాల డైరెక్టరేట్ సూచించింది. నీటి డిమాండ్‌ను అదుపులో ఉంచే చర్యలకు బదులుగా మరిన్ని ఆనకట్టలను నిర్మించడం ద్వారా టర్కీ నీటి సరఫరాను విస్తరించాలని నిర్ణయించింది. -
రూ.లక్ష ఎద్దులు రూ.50 వేలకే
కర్ణాటక ,కెలమంగలం: క్రిష్ణగిరి జిల్లాలోనే కాక కర్ణాటకలోని కోలారు జిల్లాలో కూడా ఈ ఏడాది కరువు పీడించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరువుతో పశువులకు మేత, తాగునీరు అందక పోవడంతో రైతులు పశువులను కెలమంగలం సంతలో విక్రయాలకు తరలించారు. కెలమంగలంలో ప్రతి ఆదివారం వారసంత జరుగుతుంది. ఈ సంతలో పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు పశువులను కొనుగోళ్లకు వస్తుంటారు. కోలారు, క్రిష్ణగిరి, బెంగళూరు గ్రామీణ జిల్లాల నుండి రైతులు పశువులను విక్రయించేందుకు తీసుకొస్తారు. ఆదివారం సంతలో 800కు పైగా పశువులు విక్రయాలకు వచ్చాయి. రూ. లక్ష విలువ చేసే జత ఎద్దులు రూ. 50 వేలుకు అమ్మేందుకు రైతులు సిద్ధమైనా కొనుగోలుదారులు లేకపోయారు. పశుగ్రాసం కొరత వర్షాలు లేక , పొలం పనులు లేక, ఇంట్లో గ్రాసం కరువై భారంగా భావించి తక్కువ ధరలకే పశువులను రైతులు తెగనమ్ముతున్నారు. గత ఏడాది జిల్లా మంత్రి బాలక్రిష్ణారెండ్డి కరువు వల్ల పశుగ్రాసం కొరతతో ప్రభుత్వం ద్వారా ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేశారని, ఈసారి పట్టించుకొనే నాథుడే లేదని సంతలో రైతులు వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా వర్షాలు అంతంత మాత్రమేనని, ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణమని తెలిపారు. అధికారులు ఉచితంగానో, డబ్బుకో పశుగ్రాసం సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. -
కర్ణాటకలో తాండవిస్తున్న కరవు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర కర్ణాటకలోని బెలగావి జిల్లాలో తీవ్ర కరవు పరిస్థితులు తాండవిస్తున్నవి. 2018, అక్టోబర్ నుంచి 2018, డిసెంబర్ నెల వరకు సరాసరి 152..5 మిల్లీ మీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా, కేవలం 50.6 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే పడింది. ఇదే జిల్లాలోని అథాని తాలూకాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ 135.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, కేవలం 40 మిల్లీమీటర్ల వర్షం పాతం కురిసింది. ఎక్కువగా జొన్నలు పండించే అక్కడి రైతులు ఈఏడాది పంట వేయలేదు. ప్రత్యామ్నాయంగా ఆవులు, మేకలు కాస్తూ బతుకుతున్నారు. లీటరు పాలు మార్కెట్లో 30 రూపాయలు పలుకుతుండడంతో ఆవు పాల వ్యాపారం కాస్త రైతులకు లాభసాటిగానే సాగుతూ వచ్చింది. అయితే బొత్తిగా వర్షాలు లేకపోవడం పశువుల పోషణకు కూడా శాపంగా మారింది. నీళ్లు లేక ఆవులను అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అక్కడ ఈసారి పంటలు వేయకపోవడంతో ‘ప్రధాన మంత్రి ఫాసల్ భీమా యోజన కింద అక్కడి రైతులకు భీమా కూడా దక్కదు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలోనే రాష్ట్రంలోని 30 జిల్లాలకుగాను 23 జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో కూడా 16 జిల్లాల్లో కరవు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని ‘సెంట్రల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైలాండ్ అగ్రికల్చర్’ తెలిపింది. బెలగావి జిల్లాను మాత్రం శాశ్వత కరవు ప్రాంతంగా గుర్తించారు. వాతావరణ పరిస్థితుల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ‘కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్’ వరుణ మిత్ర పేరిట ఫోన్ సేవలు వినియోగంలోకి తేగా, ఒక్క 2018లోనే దానికి 15,25,000 ఫోన్‌కాల్స్ వచ్చాయి. వాటిలో 90 శాతం రైతులు చేసినవే. ఒక్క బెలగావి జిల్లా నుంచి 52,471 కాల్స్ వచ్చాయంటే అక్కడి పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. 700, 800 అడుగుల లోతుకుపోతేగానీ బోరింగ్‌ల్లో నీళ్లు రావడం లేదు. మరో దిక్కు రాష్ట్రంలోని పలు రిజర్వాయర్‌లో నీటి మట్టం 15 శాతానికి దిగువకు పడిపోయాయి. ఇప్పటికే రుతుపవనాల రాక పక్షం రోజులు ఆలస్యం అవడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. -
వానమ్మ.. రావమ్మా..
సాక్షి, ఆదిలాబాద్: వానమ్మ.. రావమ్మా.. అంటూ తొలకరి వర్షాల కోసం ఆదిలాబాద్ రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. జిల్లాలో మృగశిర కార్తె ప్రవేశంతోనే రైతులు పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడడమే తప్పా.. పెద్ద వర్షాల జాడలేదు. అయినా నీటివసతి ఉన్న రైతులు వితనాలు వేసేశారు. దీంతో మిగతా రైతులు ఆగమాగం అవుతున్నారు. ఒకరిని చూసి మరొకరు భూమిలో విత్తనం వేస్తున్నారు. ఇప్పటికే 20 నుంచి 30 శాతం మంది పత్తి విత్తనాలు పెట్టారు. ఇక వరుణుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండుమూడు రోజుల్లో వర్షాలు కురువని పక్షంలో పెట్టుబడిలోనే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అప్పటికి.. ఇప్పటికీ గతేడాది తొలకరి వర్షాలు రైతులను మురిపించాయి. పోయినేడు ఇదే సమయానికి 70 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. సాధారణంగా జిల్లాలో రైతులు పత్తి పంటను అధిక విస్తీర్ణంలో పండిస్తారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2 లక్షల హెక్టార్ల వరకు సాగయ్యే పరిస్థితి ఉండగా, అందులో పత్తి పంటనే 1.47 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఏడాది వర్షాల రాక ఆలస్యం కావడంతో రైతులు పత్తి విత్తనాలు నాటడంలో డోలయాన పరిస్థితి కనిపిస్తోంది. నీటి సౌకర్యం ఉన్న కొంత మంది బడా రైతులు పత్తి విత్తనాలు నాటడంతో వర్షాధారంపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వారిని చూసి పలు వురు చిన్న, సన్నకారు రైతులు కూడా విత్తనాలు వేశారు. ఈ రెండుమూడు రోజులు వర్షాలు పడితే నే ఆ విత్తనం మొలకెత్తే అవకాశం ఉంది. లేదంటే భూమిలోనే విత్తు నాశనమయ్యే పరిస్థితి ఉంది. అంతా రెడీ.. వర్షాకాలం మొదలుకావడంతో పంటలు వేయడానికి రైతులు సర్వం సిద్ధం చేసుకున్నారు. దుక్కులు దున్ని చదును చేశారు. ఇక విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే తొలకరి ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ధైర్యం చేసి తెచ్చిన విత్తనాలను నాటితే వర్షాలు రాక చెయ్యికి అందదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విత్తనాలు నాటాల్సి వస్తోంది. కష్టాల్లో కర్షకుడు ఏటా ప్రకృతి వైపరిత్యాలతో కర్షకుడు ఏదో రీతిన నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది తొలకరి జోరుగా మురిపించగా, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో పెట్టుబడి గణనీయంగా పెరిగి రైతు ఆర్థిక పరిస్థితి కుదేలైంది. పంట చేతికొచ్చే సమయంలో అతివృష్టి కారణంగా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇసుక మేటలతో చేల్లు ధ్వంసమయ్యాయి. రైతులు నష్టపోయా రు. ఇలా రైతన్నను భారీ వర్షాలు అప్పట్లో దెబ్బతీశాయి. సాహసం చేయడం పత్తి రైతుకు అలవాటైంది. మృగశిర కార్తె ప్రవేశంతో పత్తి విత్తనం నాటిన పక్షంలో సరైన సమయంలో పత్తికి పూత, కాత వస్తుందనే నమ్మకంతో రైతులు ఈ సమయంలో విత్తు నాటేందుకు సాహసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర వర్షాభావం గతేడాదితో పోల్చితే ఈసారి తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, మావల, జైనథ్ మండలాల్లో తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. సాధారణ వర్షం కంటే –60 శాతం నుంచి –99 శాతం వరకు తక్కువ వర్షపాతం ఉంటే దానిని తీవ్ర వర్షాభావంగా పరిగణిస్తారు. ప్రస్తుతం పై మూడు మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. –20 శాతం నుంచి –59 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని వర్షాభావ పరిస్థితిగా పరిగణిస్తారు. జిల్లాలోని బేల, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్‌లలో ఈ పరిస్థితి ఉంది. సాధారణ వర్షపాతం కంటే –19 శాతం నుంచి +19 శాతం వరకు వర్షం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. బజార్హత్నూర్, బోథ్ మండలాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇక సాధారణ వర్షపాతం కంటే +20 శాతం, అంతకంటే ఎక్కువ కురిస్తే దానిని అతివర్షపాతంగా పరిగణిస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఒక తాంసి, భీంపూర్ మండలాల్లోనే అధిక వర్షపాతం కురిసింది. -
అప్పుడే దేశంలో కరవు తాండవం!
సాక్షి, న్యూఢిల్లీ : నేడు భారత్‌లోని 42 శాతం భూభాగంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (డీఈడబ్ల్యూఎస్)’ వెల్లడించింది. మొత్తం దేశ జనాభాలో 40 శాతం జనాభా అంటే, దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ రాష్ట్రాల్లో, ఈ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించకపోవడం శోచనీయం. అయితే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలోని అనేక జిల్లాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించాయి. వర్షాలు పడాలంటే మరో రెండు, మూడు నెలలు పడుతుంది కనుక కరవు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ డెవలపర్, గాంధీనగర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విమల్ మిశ్రా తెలిపారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు, రెండూ వైఫల్యం చెందడం వల్ల ఈ కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని మిశ్రా తెలిపారు. దేశంలో ఏడాదిలో కురిసే వర్షపాతంలో నైరుతి రుతుపవాల వల్ల 80 శాతం, ఈశాన్య రుతు పవనాల వల్ల 20 శాతం వర్షాలు కురుస్తాయి. 2018, జూన్–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కురవాల్సిన వర్షపాతంలో 9.4 శాతం తగ్గినట్లు, అదే ఈశాన్య రుతుపవాల వల్ల అక్టోబర్–డిసెంబర్ మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతంలో 44 శాతం తగ్గినట్లు భారత వాతావరణ పరిశోధన కేంద్రం లెక్కలే తెలియజేస్తున్నాయని మిశ్రా వివరించారు. రుతుపవనాల కన్నా ముందు అంటే, మార్చి–మే నెలల మధ్య కురవాల్సిన వర్షపాతం కూడా ఈ సారి బాగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య కురిసే వర్షపాతంలో కూడా 36 శాతం తగ్గింది. ఫలితంగా దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం 32 శాతం పడిపోయింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోని 31 రిజర్వాయర్లలో నీటి మట్టం 36 శాతం పడిపోయింది. మున్ముందు కరవు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, పర్యవసానంగా గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయని మిశ్రా హెచ్చరించారు. ఎల్‌నైనో పరిస్థితుల కారణంగా 2015 నుంచి (2017 మినహా) వరుసగా దేశంలో వర్షపాతం తగ్గుతూ వస్తోంది. -
కృష్ణమ్మ చెంత కరువు కరాళనృత్యం..
సాక్షి, కృష్ణా : ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన పాలకుల నిర్లక్ష్యంతో తీర ప్రాంతంలో కరవు కరాళనృత్యం చేస్తోంది. ఏటా రెండు పంటలు, ఆక్వాసాగుతో కళకళలాడే ప్రాంతం కృత్తివెన్ను మండలం. కృష్ణా,గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతం కావడంతో ఇక్కడ కరవు అనే పదమే వినిపిం చేది కాదు. ఇలాంటి పచ్చని ప్రాంతంలో రెండు పంటలు కాదు కదా ఒక్క పంటకు కూడా నీరి వ్వకుండా రైతులను వ్యవసాయ కూ లీలుగా మార్చేసింది ప్రభుత్వం. 2014 ఎన్నికల తరువాత ఐదేళ్లలో రెండవ పంట కు నీరన్నదే లేదు. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుందని ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకే సాగునీరు లేకుండాపోవ డం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువైన తాగునీరు.. సాగు సంగతి అలా ఉంటే కనీసం తాగునీరు అందించడంలో ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారు. ఒ కానొక సమయంలో ప్రజలు తాగునీటి కోసం పోరాటానికి దిగిన సంఘటనలు లేకపోలేదు. దీనికి స్థానిక ఎమ్మెల్యే సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే నీటి కొరత ఏర్పడిందన్న వాదనలు వినిపిం చాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో రెండు పంటలతో సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతం టీడీపీ అధికారం చేపట్టాక సాగునీరు, తాగునీటికి కరువై తీవ్రదుర్భిక్షాన్ని అనుభవించిందని ప్రజల్లో నాటుకు పోయింది. తీవ్ర దుర్భిక్షం నిత్యం రెండు పంటలతో కళకళలాడే ప్రాంతం మాది. ఐదేళ్ల టీడీపీ పాలనలో సాగునీరు లేక పంటలు పండక రైతులే కూలీలుగా మారి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వ్యవసాయం మీద మక్కువతో రైతులు కష్టాలు ఎదురైనా పంటను సాగు చేస్తున్నారు.రైతులకు మేలు చేసే ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది. – ఆగిశెట్టి బాజ్జీ, గరిశపూడి గుక్కెడు నీటికి కష్టాలు సాగునీటి సంగతి దేవుడెరుగు. కనీసం తాగేందుకు కూడా నీరివ్వలేని దౌర్భాగ్యపు స్థితిలో టీడీపీ పాలన సాగించింది. వరుసగా మూడేళ్లపాటు లక్ష్మీపురం రక్షిత మంచినీటి చెరువుకు నీరురాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. – పులగం రాము, లక్ష్మీపురం -
బాబు.. కరువు.. కవలలు
సాక్షి,అనంతపురం అగ్రికల్చర్: టీడీపీ పాలనలో రైతులు పొట్ట నింపుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వరుస కరువులతో వ్యవసాయమే కాదు పాడి, పశుపోషణ కూడా భారంగా మారింది. పశుగ్రాసం లేక కాడెద్దులు, పాడి ఆవులు, గేదెలు కబేళాలకు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు హయాంలో చూస్తుండగానే పశుసంపద కరిగిపోయింది. ఇటీవల పశుసంవర్ధకశాఖ చేపట్టిన సర్వేలో ఈ దారుణ విషయాలు వెలుగుచూశాయి. వరుస కరువులు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పాలించిన కాలంలో కరువులు రాజ్యమేలాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆయన 14 ఏళ్ల హయాంలో 10 ఏళ్లు సాధారణం కన్నా తక్కువ వర్షాలు పడ్డాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 553 మి.మీ కాగా... అందులో 10 సంవత్సరాలు సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా కరువు మండలాలు జాబితాలోకి చేరడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. 25 లక్షల ఎకరాల వేరుశనగ లాంటి వ్యవసాయ పంటలతో వేలాది ఎకరాల్లో పట్టు, పండ్లతోటలు కూడా వర్షాభావానికి గురయ్యాయి. వీటితో పాటు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక పాడి, పశుపోషణ రైతుకు భారం కావడంతో పశుసంపద తరిగిపోయింది. మేత సమస్య తీవ్రం కావడంతో కాడెద్దులు, పాడి పశువులను అయినకాటికి తెగనమ్ముకున్న పరిస్థితి ఏర్పడింది. పశుసంపద తరిగిపోవడంతో రైతుకు సేద్యం భారంగా పరిణమించింది. కనుమరుగవుతున్న పశుసంపద వరుస కరువులతో జిల్లాలో పశుసంపద బాగా తగ్గిపోయింది. పశుసంవర్ధకశాఖ గణాంకాల మేరకు.. 2007తో పోల్చుకుం టే 2012లో మూగజీవాల సంఖ్య 24 శాతం తగ్గిపోయింది. 2019లో మరో 25 శాతం మేర పడిపోయింది. 2007లో జిల్లా వ్యాప్తంగా 14.47 లక్షల సంఖ్యలో పశుసంపద ఉండగా 2012 నాటికి 10.29 లక్షలకు పడిపోయింది. తాజాగా నిర్వహించిన సర్వేలో అది కాస్త 7.75 లక్షలకు పరిమతమైంది. మేకలు కూడా 2007లో 10 లక్షలు ఉండగా 2012 నాటికి 8.98 లక్షలకు తగ్గిపోయాయి. ఇపుడు 8.38 లక్షలకు చేరుకున్నాయి. వ్యవసాయం, పాడి బాగా దెబ్బతినడంతో చాలా మంది గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పందులు, కుక్కలు, గాడిదలు లాంటి మిగతా జీవాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. రైతు ప్రభుత్వమంటూ గొప్పలకు పోవడం తప్ప చంద్రబాబు సాధించిన ఘనత ఏదీ లేదంటూ రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి అవకాశం ఇస్తే మొదటికే మోసం వస్తుందని జనం భావిస్తున్నారు. ఎక్కడికెళ్లినా జీవాలకు మేత దొరకడం లేదు. మైదాన ప్రాం తాల్లో మేత లేదు. పొలాల వద్ద కూడా అదే పరిస్థితి గడ్డి కొరత వల్ల ఇప్పటికే సగం జీవాలను అమ్ముకున్నాం. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. – వన్నూరప్ప, గొర్రెల కాపరి, కనగానపల్లి -
కాడి పట్టింది
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని రాతన గ్రామానికి చెందిన లాలూబీ తన భర్త పెద్ద మౌలాలితో కలిసి ఉన్న నాలుగన్నర ఎకరాలతో పాటు, మరికొంత పొలం గుత్తకు తీసుకుని పంటలు పండించుకుంటూ జీవించేవారు. తీవ్ర వర్షాభావం, పంట పెట్టుబడులు భారీగా పెరగడం, దిగుబడులు తగ్గడం తదితర కారణాలతో తీవ్ర నష్టాలను చూశారు. పంటల సాగు, కుటుంబ పోషణకు చేసిన అప్పులు కూడా పెరిగిపోయాయి. అప్పుల బాధ తాళలేక 2014 నవంబర్ 20న పెద్ద మౌలాలి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాలూబీ భర్తను కోల్పోయింది, కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. ఇద్దరు కుమారులు, కోడళ్లు, వారి పిల్లల బాధ్యత లాలూబీపై పడింది. ఉన్న పొలంతో పాటు మరికొంత పొలాన్ని గుత్తకు తీసుకుని వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వరుస కరువులతో పంటలు పండకున్నా చేసిన అప్పులు తీర్చేందుకు పిల్లలతో పాటు కూలి పనులకెళుతోంది. పెద్దకొడుకు చాంద్‌బాష పొలం పనులతో పాటు, జేసీబీ డ్రైవర్‌గా, చిన్న కుమారుడు మున్నా సైకిల్ షాపు నడుపుకుంటూ లాలూబీకి చేదోడువాదోడుగా ఉంటున్నారు. అప్పుల బాధతో కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకున్నా, ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి పరిహారం రాకపోయినా కుంగిపోకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఆత్మస్థైర్యంతో నిలబడి కుటుంబాన్ని నడుపుతోంది. -
మనిషి సృష్టించిన ప్రకృతి విపత్తు ఇది!
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని డార్లింగ్ నదిపై కార్పెట్లా పరచుకున్న మృత జీవాలకు సంబంధించిన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కలచివేస్తున్నాయి. నదిపై తేలియాడుతున్న మృత చేపలు కాలుష్యం, కరువుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వివరాలు... మెనిండీ సిటీలో కేంద్రీకృతమైన డార్లింగ్ నదీ భాగంలో గత కొన్ని రోజులుగా వేలాది సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. కరువు, వేడిమి తీవ్రత కారణంగా ఈ సంఖ్య నానాటికీ పెరగవచ్చని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నీటి ఎద్దడి, నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, ప్లాస్టిక్ వర్థ్యాల వల్ల ఆల్గే విషపూరితం కావడం వంటి అంశాల కారణంగా ఈ దుష్ప్రరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే డార్లింగ్ నదిలోని జీవ జాలాలన్నీ కనుమరుగైపోయినా ఆశ్చర్యపడనవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రణాళికలు రచించాలని సూచించారు. అదొక్కటే మార్గం..కానీ అసాధ్యం కదా.. ప్రస్తుతానికైతే పైపుల ద్వారా నీటిని నదిలోకి వదలడం ద్వారా కొన్ని జీవాలను రక్షించవచ్చని న్యూ సౌత్‌వేల్స్ నీటి పారదల శాఖ మంత్రి నియాల్ బ్లేయర్ పేర్కొన్నారు. ఇది అసాధ్యంతో కూడుకున్నదే అయినా వేరే మార్గం లేకే ఇలా మాట్లాడాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నది కాలుష్యంతో నిండిపోయింది. మంచి నీరు వస్తేనే జీవ జాలాలకు మనుగడ ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. వర్షాలు లేక కరువు తాండవిస్తోంది. ప్రకృతి కన్నెర్ర చేసినపుడు డబ్బు వెచ్చించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదు. అయితే నదిని కాలుష్యం కాకుండా చూసుకునే బాధ్యత మాత్రం మనపై ఉంది’ అని వ్యాఖ్యానించారు. కాగా నదిలోకి విరివిగా వ్యర్థాలు వదిలిన కారణంగానే ఇలాంటి హృదయ విదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ‘మనిషి సృష్టించిన ప్రకృతి విపత్తు ఇది’ అని పర్యావరణ హితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మల్బరీ సాగులో మహిళా రైతులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో పలువురు మహిళా రైతులు పట్టు పురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలు మల్బరిని విరివిగా సాగు చేస్తూ, మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పోషిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లికి చెందిన నర్ర ధనజ ఐదేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నారు. మల్బరీ సాగు ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నర్ర ధనజ, స్వామిరెడ్డి దంపతులను సన్మానించారు. మల్బరీ సాగులో ప్రతి యేటా రూ.3 లక్షలు ఖర్చు చేసి రూ. 11 లక్షలు ఆదాయం పొందుతున్నట్లు ధనజ తెలిపారు. ఆమెతోపాటు ఆ ఊళ్లో అనేక మంది మహిళా రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రైతాంగం అనాదిగా సాధారణంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తుండగా అతివృష్టి, అనావృష్టి వలన పంటలను నష్టపోయిన సందర్భాలు అనేకం. ఇదే సమయంలో తుమ్మనపల్లి మహిళా రైతులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను ఆర్జించే మల్బరీ పంటపై దృష్టి సారించారు. పంట కాలం తక్కువ.. లాభం ఎక్కువ.. మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు రూ.10 వేలు ఖర్చవుతుండగా, సుమారు రూ. 55 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఆరు సార్లు పంటను పొందుతున్నారు. తుమ్మనపల్లిలో 50 మంది మహిళా రైతులు 2–3 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోటలు పెంచుతున్నారు. మల్బరీ తోట పక్కనే షెడ్ నిర్మించుకుని శ్రద్ధగా పట్టు పురుగులు పెంచుతున్నారు. ఇక్కడి సాగు తీరును తెలుసుకునేందుకు ఇతర జిల్లాల నుంచి రైతులు వచ్చి చూసి వెళ్తుండటం విశేషం. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ అవగాహన పెంచుకుంటే నష్టం రాదు నాకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేస్తున్నా. సంవత్సర కాలంలో నాలుగు నుంచి ఐదు సార్లు పట్టు గూళ్ల దిగుబడి పొందవచ్చు. తక్కువ వ్యవధిలో, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. అయితే, మల్బరీ పంట సాగుపై అవగాహన పెంచుకుంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. మా ఊళ్లో చాలా మంది రైతులు మల్బరీ పంటనే సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. – గోపగాని సరిత, మహిళా రైతు, తుమ్మనపల్లి హేళన చేసిన వారే సాగులోకి వస్తున్నారు నాకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు సంవత్సరాల నుంచి మల్బరీ సాగుచేస్తున్నా. మా కుటుంబ సభ్యుల సహకారంతో పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కల్పించుకుని మల్బరీ పంట సాగు మొదలు పెట్టాను. మొదట్లో ఇరుగు పొరుగు వారు హేళనగా చూశారు. పంట చేతికి వచ్చిన తర్వాత లాభాల గురించి తెలుసుకుని వాళ్లు కూడా మల్బరీ సాగుకు ముందుకు వస్తున్నారు. ఆహార పంటల కంటే మల్బరీ సాగే ఉత్తమం. – నిమ్మల వనజారెడ్డి, మహిళా రైతు, తుమ్మనపల్లి ఆరేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నా నాకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేపట్టేందుకు ఉద్యాన శాఖాధికారులను సంప్రదించాను. వారు మల్బరీ సాగు విధానం గురించి వివరించారు. గత ఆరు సంవత్సరాల నుంచి మల్బరీ సాగు చేస్తున్నా. మల్బరీ సాగులో ఏమైనా సందేహాలు వస్తే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకుంటున్నా. ఉద్యోగిలా నెల నెలా ఆదాయం పొందుతున్నా. సంతోషంగా ఉంది. – కాసిరెడ్డి కవిత, మహిళా రైతు, తుమ్మనపల్లి -
64% వర్షాన్ని పీల్చుకుంటున్న భూమి!
ఎక్కువ వర్షం పడినప్పుడు సాధారణంగా ఎక్కువ నీరు చెరువులు, నీటి ప్రాజెక్టుల్లోకి చేరటం రివాజు. కానీ, ఇటీవల కాలంలో అలా జరగడం లేదని, పెరుగుతున్న భూతాపం వల్ల భూమాత దాహం అంతకంతకూ పెరిగిపోవడమే ఇందుకు మూలకారణమని ఒక అధ్యయనంలో తేలింది. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా గతంలో మాదిరిగా వాగులు, వంకలు, నదుల్లోకి వరద నీరు ఎక్కువగా చేరటం లేదని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ బృందం అధ్యయనంలో వెల్లడైంది. 160 దేశాల్లో 5,300 నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిశీలన కేంద్రాలు, 43 వేల వర్షపాత నమోదు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఇదే అర్థమవుతోందని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ప్రతినిధి శర్మ ఇటీవల వెల్లడించారు. మనం ఇప్పటి వరకు అనుకుంటున్న దానికన్నా భూదాహం ఎక్కువగా ఉందన్నారు. వంద వాన చుక్కలు నేల మీద పడితే అందులో నుంచి 36 చుక్కలు మాత్రమే సరస్సులు, నదులు, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. మనుషులకు అందుబాటులో ఉండే (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘బ్లూ వాటర్’ అంటారు) ఇదే. మిగతా మూడింట రెండొంతుల వర్షపు నీరు కురిసినప్పుడే మట్టిలోకి ఇంకిపోతున్నాయని (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘గ్రీన్ వాటర్’ అంటారు) ఈ అధ్యయనంలో తేలింది.వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాల సంఖ్య పెరిగినా నదులు, రిజర్వాయర్లలోకి వరద నీరు గతంలో మాదిరిగా పోటెత్తకపోవడానికి నేల ఉష్ణోగ్రత గతంలో కన్నా పెరిగి, ఆవిరైపోయే నీటి శాతం పెరిగింది. అందువల్లే వర్షపు నీటిని భూమి ఎక్కువ మొత్తంలో తాగేస్తోంది. సాధారణ వర్షాలకు నీరు పారి తరచూ రిజర్వాయర్లలోకి నీరు చేరుతుంటేనే రిజర్వాయర్లలో నీరు ఉంటుంది. భారీ వర్షపాతం నమోదైన అరుదైన సందర్భాల్లో మాత్రమే నదులు, రిజర్వాయర్లలోకి నీరు వస్తున్నదని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. అంటే, గతంలో కన్నా భూమి త్వరగా బెట్టకు వస్తున్న సంగతిని రైతులు గుర్తించాలి. కందకాల ద్వారా ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింపజేసుకుంటేనే పంటలు, ముఖ్యంగా ఉద్యాన తోటలు బాగుంటాయని గుర్తించమని ఈ అధ్యయనం చెబుతోంది. -
రెండు డాలర్లంత వర్షం
ముసలి రెమిజియా గుర్రపు వీపును గట్టిగా కరచుకుని తన చిన్న ముఖాన్ని పైకెత్తుతూ ‘‘నరకంలో ఆత్మల కోసం ఇదిగో నా దమ్మిడీ. ఇక వర్షం పడుతుంది ఫెలిపా’’ అన్నది.ఫెలిపా చుట్ట తాగుతూ ఏ జవాబు ఇవ్వలేదు. కరువు గురించి ఎన్నో శోకాలను విన్నది ఆమె. అంతిమంగా చెయ్యి పైకెత్తి ఆకాశాన్ని ఒక కొస నుంచి మరో కొస వరకు పరీక్షగా చూసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. ఒక్క మబ్బు కూడా లేదు. ఆకాశపు తెల్లదనం రెమిజియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. ‘‘మన బ్రతుకులు అంతమయ్యే రోజు వచ్చింది రెమిజియా’’ అన్నది ఫెలిపా.పంటల్ని నాశనం చేస్తూ కరువు ప్రారంభమైంది. నిరాశ నిండిన ఎన్నో కుటుంబాలు పొలాలను వదిలేసి తమ గుర్రాల మీద ఎక్కి వర్షాభావం లేని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.కాని వృద్ధులైన రెమిజియా అందుకు నిరాకరించింది ఏదో ఒకరోజు వర్షం వస్తుందనీ. తన కొడుకును స్ట్రెచర్ మీద తీసుకెళ్తూ మనవడినొక్కడినే తనకు వదిలిన నాటి నుండి రెమిజియా ముభావంగా ఉంటూ పొదుపును అవలంబించసాగింది. తన సొరకాయ బుర్రను కొంత బూడిదతో నింపి ఒకటొకటిగా నాణేలను అందులో వేస్తూ పోయింది. మనవణ్ణి గుండెకు వేలాడదీసుకుని జీవితాన్ని స్వీకరించింది ఆమె. ‘‘నేను బతుకుతున్నది నీ కోసమే బిడ్డా! నువ్వు కూడా నీ తండ్రి లాగా జీవితం కోసం విపరీతమైన తంటాలు పడటం, లేక వయసు మీరకముందే చనిపోవడం నాకిష్టం లేదు’’ అంటుంది ఆమె ఆ పిల్లవాడితో. అంతా సవ్యంగా జరిగిపోతుంది. కానీ కొన్నాళ్ల తరువాత ఎందుకు ఎలా అని తెలియకుండా కరువు వచ్చింది. ఒక నెల వర్షం లేకుండా గడిచింది. తర్వాత రెండు నెలలు, ఆపైన మూడు నెలలు. ఒక్కోసారి ‘నరకంలో ఉన్న ఆత్మల కోసం కొవ్వొత్తుల్ని వెలిగించాలి’’ అంటుంది. కానీ వర్షం కురవలేదు. ఎన్నో కొవ్వొత్తుల్ని వెలిగించినా మొక్కజొన్న చేను వడలిపోయింది. ముసలి రెమిజియా పడక మీదికి పోయి దేవుణ్ని ప్రార్థించింది. నరకంలోని ఆత్మలకు మరిన్ని కొవ్వొత్తుల్ని వెలిగిస్తానని వాగ్దానం చేసి నిరీక్షించింది. ఆమెకు కొండశిఖరాల మీద వర్షం కురుస్తున్న చప్పుడు వినిపించినట్టనిపించింది.ఆశాభావంతో రాత్రి ఆమె నిద్ర పోయింది. కానీ ఉదయం లేచి చూసేసరికి ఆకాశం తెల్లని తాజా దుప్పటిలా ఖాళీగా, నిర్మలంగా ఉంది.జనాలకు ధైర్యం సడలిపోయింది. ఒక చల్లని ఉదయం పూట రొసెండో తన భార్య, ఇద్దరు పిల్లలు, ఆవు, కుక్క, బక్కచిక్కిన గాడిదను తీసుకుని వెళ్లిపోయాడు. సామానంతా గాడిద వీపు మీద తీసుకెళ్తూ ‘‘దీన్ని నేను తట్టుకోలేను రెమిజియా, ఈ ఊరి మీద ఏ దుష్టశక్తివో పాపిష్టి కళ్లు పడ్డాయి’’ అన్నాడు. రెమిజియా గుడిసె లోపలికి పోయి రెండు రాగి నాణాలతో బయటకు వచ్చింది. వాటిని రొసెండోకు ఇస్తూ ‘‘నరకంలోని ఆత్మల కోసం నా పేరు మీద ఈ డబ్బుతో కొవ్వొత్తుల్ని కొని వెలిగించు’’ అన్నది. రొసెండో ఆ నాణాల్ని తీసుకుని, వాటిని చూసి, తలపైకెత్తి ఆకాశాన్ని చాలాసేపు చూశాడు.‘‘నీకు రావాలనిపించినప్పుడు టవేరాకు వచ్చెయ్. అక్కడ మాకు చిన్న భూమి చెక్క దొరికింది. నీకు ఎప్పుడూ మా స్వాగతం ఉంటుంది’’ అన్నాడు. ‘‘నేనిక్కడే ఉంటాను రొసెండో. ఈ కరువు ఇట్లానే ఉండిపోదు’’ అన్నది రెమిజియా.రెమిజియా మనవడు ఎండల ధాటికి నీగ్రో లాగా నల్లబడిపోయాడు.‘‘నానమ్మా! ఒక పంది చచ్చిపోయినట్టుంది’’ అన్నాడు వాడు.రెమిజియా పందుల దొడ్డి వైపు పరుగెత్తింది. ముట్టెలు వడలిపోయి తీగల్లాగా తయారయి పందులు గురగురమంటూ రొద చేస్తూ ఒగరుస్తున్నాయి. అవి అన్నీ ఒకచోట గుమిగూడాయి. వాటిని పక్కకు తరిమి చూడగానే చచ్చిపడి ఉన్న ఒక పంది కనిపించింది ఆమెకు. అది బతికి ఉన్న పందులకు ఆహారంగా పనికి వచ్చిందని ఆమెకు అర్థమైంది. తనే స్వయంగా వెళ్లి నీళ్లు తెస్తే పందులు బతుకుతాయి కనుక అలా చేయాలని నిశ్చయించుకున్నది ఆమె.సూర్యోదయం కాగానే ఆమె ముదురు గోధుమరంగులో ఉన్న తన చిన్న గుర్రాన్ని తీసుకుని బయలుదేరింది. తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నమైంది. సొరకాయ బరువు తగ్గింది. అయినా నరకంలోని ఆత్మలు జాలి చూపుతాయని తను పొదుపు చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని ఆమె వెచ్చించింది. గుర్రానికి శ్రమ ఇవ్వకూడదని ఆమె నడచి వెళ్లటం ప్రారంభించింది.జనాలు ఆ ఊరిని వదిలి వెళ్లటం కొనసాగింది. ప్రతిరోజూ ఒక గుడిసె ఖాళీ అవుతోంది. నేల బూడిదరంగుకు మారి దాని మీద పగుళ్లు కనబబడసాగినై.రెమిజియా ఆశను పోగొట్టుకోలేదు. వర్షం వచ్చే సూచనల కోసం ఆమె ఆకాశాన్ని పరీక్షగా చూసింది. తన మోకాళ్ల మీద వంగి ‘‘నరకంలోని ఆత్మలారా, మీరు సహాయం చేయకపోతే మేము మాడిపోతాము’’అని వేడుకుంది.కొన్నిరోజుల తరువాత ఒక ఉదయాన గుర్రం తన కాళ్ల మీద నిలబడలేక పోయింది. అదేరోజు మధ్యాహ్నం ఆమె మనవడు జ్వరంతో కాలిపోతూ మంచం పట్టాడు. రెమిజియా ప్రతి గుడిసెకూ పోయింది. చాలా దూరంలో వున్న గుడిసెలకు కూడా వెళ్లింది. ఆ గుడిసెల వాసులతో ‘‘మనం సెయింట్ ఇసిడోరోకు రుద్రాక్ష విత్తుల దండ చేయిద్దాం’’ అన్నది. వాళ్లు ఒక ఆదివారం పొద్దున పెందరాళే బయలుదేరారు. ఆమె తన మనవణ్ణి చేతిలో పెట్టుకొని నడుస్తోంది. పదిహేను ఇరవైమంది పురుషులు, స్త్రీలు ఎండకు నల్లబడిన శిథిల దేహాల పిల్లలు, బంజరు నేలల మీది తోవల మీదుగా సాగిపోతూ శోకాలు పెడుతున్నారు. వాళ్లు మేరీ కన్య బొమ్మను, వెలిగించిన కొవ్వొత్తుల్ని పట్టుకుని నడుమ నడుమ ఆగి మోకాళ్ల మీద వంగుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఒక బక్కపలచని వృద్ధుడు మండే కళ్లతో, నగ్నమైన ఛాతితో, పొడుగుగా పెరిగిన గడ్డంతో వుండి ఆ ఊరేగింపు మొదట్లో నడుస్తున్నాడు ఆకాశం వైపు చూస్తూ...‘సెయింట్ ఇసిడోరో, ఓ కర్షకుడా / సూర్యుణ్ని కప్పేసి వర్షాన్ని తెప్పించు’ అంటూ వేడుకుంటున్నాడు.అందరూ వెళ్లిపోయారు. రొసెండో వెళ్లిపోయాడు. బుద్దిమాంద్యం వున్న తన కూతుర్ని తీసుకుని టోరిబియో వెళ్లిపోయాడు. ఫెలిపె, ఇతరులు, వేరేవాళ్లుఅందరూ వెళ్లిపోయారు. కొవ్వొత్తులు వెలిగించడానికి ఆమె వాళ్లందరికీ డబ్బు ఇచ్చింది. ఆఖరున వెళ్లినవాళ్లు ఎవరో ఆమెకు తెలియదు. వాళ్లు ఒక రోగిష్టి అయిన వృద్ధుణ్ని తీసుకుపోయారు. దుఃఖభారంతోవాళ్లు కుంగిపోయారు. ఇక వర్షం పడుతుందనే ఆశ అందరిలో అడుగంటిపోయింది. ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లేముందు వృద్ధులు ‘దేవుడు ఈ ప్రాంతాన్ని శిక్షిస్తున్నాడు’ అనుకున్నారు.యువకులు, పిల్లలు అక్కడేదో దుష్టశక్తి తనపాడు దృష్టితో కీడు కలిగిస్తున్నదని అనుకున్నారు.రెమిజియా ఆశను వదులుకోలేదు. ఆమె కొన్ని నీటి చుక్కల్ని సేకరించింది. మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాలని అనుకున్నదామె. ఎందుకంటే సొరకాయ బుర్ర దాదాపు ఖాళీ అయింది. తన చిన్న తోట లోని భూమి రహదారిలా మారిపోయి అంతటా ధూళి నిండింది.నరకంలోని ఒక మూలలో నడుముల దాక ఉన్న మంటల్లో కాలుతూ ఆ ఆత్మలు పరిశుద్ధమవుతున్నాయి. భూమ్మిద వర్షాన్ని కురిపించి జలమయం చేసే శక్తి ఆ ఆత్మలకే వుండటం విడ్డూరం, వ్యంగ్యభరితం. గడ్డం వున్న ఒక వికృతమైన ముసలి స్త్రీ ఇలా అన్నది ‘‘కారంబా! పోసో హోండో అనే వూళ్లో ముసలి రెమిజియా కొవ్వొత్తుల కోసం రెండు డాలర్లు వెచ్చించింది కాబట్టి అక్కడ వర్షం కురవాలి’’ఆమె సహచరులు అప్రతిభులయ్యారు. ‘‘రెండు డాలరా! అయ్య బాబోయ్’’మరొక ఆత్మ అన్నది ‘‘ఆమెకు ఎందుకు ఇంకా సహాయం అందలేదు. మనుషులతో మనం వ్యవహరించేది ఇలాగేనా’’‘‘ఆమె కోరికను మనం మన్నించాలి’’ అని గర్జించింది మరొక ఆత్మ.‘‘పోసొ హోండోకు రెండు డాలర్లంత వర్షం కురిపించాలి’’ఆ ఆత్మలన్నీ చాలా సంతోషించాయి. ఎందుకంటే వర్షం కోసం అంత పెద్ద మొత్తాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎవ్వరూ చెల్లించలేదు. అంత డబ్బు వెచ్చించి కొవ్వొత్తులు వెలిగించినందుకు ఎంత పుష్కలమైన వర్షం కురిపించాలో తలుచుకునేసరికి నరకంలోని ఆ ఆత్మలు అదిరిపడ్డాయి. దేవుడు తమను తన దగ్గరికి పిలిపించుకునేదాకా ఇలా మంటల్లోకలుతున్నంత కాలం వర్షాన్ని కురిపిస్తూనే వుండాలి కదా అని నివ్వెరపోయాయి ఆ ఆత్మలు.పోసోహోండాలో ఒక ఉదయాన ఆకాశం నిండా ముబ్బులు కమ్మినయ్. రెమిజియా తూర్పు దిక్కున ఉన్న ఆకాశాన్ని చూసింది. ఆమెకు పలుచనైన ఒక నల్లని మేఘం కనిపించింది. ఒక గంట తరువాత పెద్ద పెద్ద మేఘాలు జంటలుగా గుమిగూడి ఒకదాన్నొకటి తోసుకుంటూ వేగంగా కదలసాగినయ్.రెండుగంటల తర్వాత చిక్కని చీకటి ఏర్పడి రాత్రి అయిందా అనిపించింది.తక కలుగుతున్న సంతోషం సున్నా అవుతుందేమోనన్న భయం కమ్ముకోగా రెమిజియా ఏమీ మాట్లాడకుండా కేవలం చూస్తూ ఉండిపోయింది. ఆమె మనవడు ఇంకా జ్వరంతో మంచం మీద పడి వున్నాడు. వడు ఎముకల గూడులా చాలా బక్కగా వున్నాడు. పెద్ద ఉరుము ఉరిమింది. ఆమె తనలో తానే నవ్వుకుని, చేతులతో చెంపలను గట్టిగా పట్టుకుని, కళ్లను విశాలంగా చేసింది. చాలాకాలం తర్వాత మళ్లీ వర్షం పడుతోంది. వేగంగా కదులుతూ టపటపనే చినుకులతో పాటు పడుతున్నట్లుగా వర్షం రోడ్డును చేరి, గుడిసె పై కప్పు మీద చప్పుడు చేస్తూ గుడిసె దాటేసి పొలాల మీద కురవడం ప్రారంభించింది. రెమిజియా వెనక గుమ్మం వైపు పరుగెత్తి చిన్న వరదలాంటి నీరు పారుతూ వస్తుంటే నేల అణగిపోయి దట్టమైన ఆవిరులను చిమ్మటం గమనించింది. ఆమె విజయోత్సాహంతో బయటికి పరుగెత్తింది.‘‘వర్షం వస్తుందని నాకు తెలుసు’’ అంటూ బిగ్గరగా అరిచింది. ఆకాశం వైపు చేతులు చాస్తూ ‘‘వాన పడుతోంది...ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు’’ అంటూ కేరింతలు కొట్టింది. ఆమె ఇంటి లోపలికి పరుగెత్తి మనవణ్ని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుని వాడికి వర్షాన్ని చూపించింది. ఆకాశం నుండి వర్షం ధారాపాతంగా కురుస్తోంది. వర్షపు చినుకుల బలమైన తాకిడి ధాటికి తాటాకుల గుడిసె పైకప్పు పగులుతోంది. రెమిజియా కళ్లు మూసుకుని కొన్ని దృశ్యాలను దర్శించింది. విరగకాసిన తన పంటచేను చల్లని గాలి తరగల్లో కదలాడుతోంది. బయట ఎడతెరిపి లేకుండా బీభత్సంగా వర్షం. వారం రోజులు, పదిరోజులు, పదిహేను రోజులు గడిచాయి. వర్షం ఒక గంట సేపు కూడా ఆగక ఇంకా కురుస్తూనే వుంది. బియ్యం, వెన్న, అప్పుడు అన్నీ నిండుకున్నాయి. ఆహారపదార్థాల్ని కొనడానికి రెమిజియా వర్షంలోనే నగరానికి బయలుదేరింది. పొద్దున బయలుదేరిన ఆమె తిరిగి మధ్యరాత్రి ఇల్లు చేరింది. ఒక మధ్యాహ్నంవేళ పెద్ద కంచర గాడిద తలను లోపలికి దూర్చింది. ‘‘కిందికి దిగ లోపలికి వస్తే కొంచెం వెచ్చగా వుంటుంది’’ అన్నదామె.కంచర గాడిద బయటే వుండిపోయింది. అతడు ‘‘ఆకాశం నీళ్లుగా మారిపోయింది. నేను నీ పరిస్థితిలో వుంటే ఈ లోతట్టు ప్రదేశాల్ని వదిలి ఆ కొండమీదికి పోయేవాణ్ని’’ అన్నాడు.‘‘నేను యిక్కణ్నుంచి వెళ్లిపోవటమా? లేదు స్వామీ, ఈ వర్షం ఒకటి రెండు రోజుల్లో ఆగిపోతుంది’’ అన్నదామె.‘‘చూడమ్మా ఇది వరద పరిస్థితి. నేను కొన్ని భయంకర దృశ్యాల్ని చూశాను. వరద నీరు జంతువుల్నీ, ఇళ్లనూ, చెట్లనూ, మనుషుల్నీ లాక్కుపోతోంది. నేను దాటి వచ్చిన నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. పైగా నదుల జన్మస్థానాల్లో కుండపోతగా వర్షంకురుస్తోంది’’ అన్నాడతడు.‘స్వామీ, కరువు భయంకరంగా వుండింది. అందరూ పారిపోగా నేనొక్కదాన్నే తట్టుకుని ఇక్కడే వుండిపోయాను’’ అన్నది రెమిజియా.‘‘కరువు చంపకపోవచ్చు. కాని వరద ముంచేస్తుంది తల్లీ’’అన్నాడు ఆ ఆసామి. చీకటి పడుతుండటంతో అతడు వెళ్లిపోయాడు. ఆ రాత్రివేళ వెళ్లొద్దని ఆమె బతిమాలింది. కాని అతడు వినలేదు. ‘‘పరిస్థితి మరింత విషమించబోతుందమ్మా, నదులు గట్లను తెంపుకునిఅంతాజలమయం అవుతుంది’’ అంటూ వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. రెమిజియా గుడిసె లోపలికి పోయింది. లోపల పిల్లవాడు జడుసుకుంటున్నాడు. ఆ ఆసామి చెప్పింది నిజమైంది. అబ్బ, అది ఎంత భయంకరమైన రాత్రి! మధ్యమధ్యన ఉరుములు మెరుపులతో అత్యంత ఉధృతమైన కుంభవృష్టి ఎడతెరిపి లేకుండా కురిసింది. మురికినీళ్లు సుళ్లు తిరుగుతూ గుమ్మం తలుపులోని సందులోంచి లోపలికవచ్చినేల మీద నిండిపోయాయి. దూరాన గాలి ఈల వేస్తోంది. చెట్టు విరిగిన చప్పుడు ఫెళఫెళమని వినిపించింది. రెమిజియా తలుపు తెరిచింది. దూరాన మెరిసిన మెరుపు పోసా హోండోను వెలుతురు మయం చేసింది. కొండవాలు మీంచి నీళ్లే నీళ్లు... రహదారి నదిగా మారిపోయింది.‘‘ఇది వరద కావచ్చునా’’ రెజిమియాకు మొదటిసారిగా అనుమానం వచ్చింది. కాని ఆమె గుమ్మం తలుపులు మూసి లోపలికి పోయింది. గడచిన కరువు తీవ్రత కన్న, రాబోయే వర్షపు తీవ్రత కన్న బలమైన ఆశాభావం కలిగింది ఆమెకు. ఒక మధ్యరాత్రి వేళ గుడిసె పక్క గోడ నుంచి దభీమని చప్పుడు రావటంతో ఆమెకు మెలకువ వచ్చింది. మంచంలోంచి కిందికి దిగేసరికి తన మోకాళ్ల దాకా నీళ్లు వచ్చిన సంగతి తెలిసింది ఆమెకు.అబ్బ, ఎంతటి కాళరాత్రి! నీళ్లు ప్రవాహరూపంలో లోపలికి దూసుకువచ్చి లోపల మొత్తం నిండిపోయాయి. మరో మెరుపు మెరిసింది. పెద్ద ఉరుముతో ఆకాశం వణికినట్టనిపించింది.‘‘మేరీ కన్యాకా కరుణించు’’ అంటూఏడ్చింది. కానీ ఈ పరిణామానికి కారణం మేరీ కన్యక కాదు.నరకంలోని ఆత్మలు. అవి ‘‘ఈ వర్షం సగం డాలరుకే సమానం, సగం డాలరుకే’’ అంటూ అరిచాయి.ఎప్పుడైతే ఆ వరద నీరు గుడిసెను కదపడం మొదలెట్టిందో అప్పుడు రెమిజియా ఆశాభావాల్ని వదలి తన మనవణ్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె వాడిని సాధ్యమైనంత గట్టిగా ఎదకు హత్తుకుని నీళ్లలోంచి అతి ప్రయత్నపూర్వకంగా నడిచింది.ఎలాగో ఆమె తన గుడిసె తలుపును తీసి బయటికి నడిచింది. తను ఎక్కడికి పోతుందో ఆమెకు తెలియదు. గాలికి ఆమె వెంట్రుకలు విడివడి పోయాయి. దూరాన ఒక మెరుపు మెరిసింది. నీటి మట్టం ఇంకాఇంకా పెరుగుతోంది. తన మనవణ్ని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆమె. తూలి పడబోయింది కాని ఎలాగో నిలదొక్కుకుంది.ఉధృతంగా వీస్తున్న గాలి ఆమె కంఠస్వరాన్ని కబళించి దాన్ని జలమయమైన ఆ ప్రదేశం మీద పరిచింది.‘‘ఆమె గౌను నీళ్ల మీద తేలింది. ఆమె జారిపోతోంది. ఏదో వస్తువు తన వెంట్రుకలకు తట్టుకుని తలను ముందుకు పోకుండా ఆపినట్టనిపించింది ఆమెకు.‘‘ఇదంతా ముగిసిన తర్వాత బంగాళాదుంపలు నాటుతాను’’ అనుకున్నదామె.తన మొక్కజొన్న చేను మురికి నీళ్లలో మునిగిన దృశ్యం కనబడింది ఆమెకు. ఆమె తన వేళ్లను మనవడి ఛాతీలోకి గుచ్చిపట్టింది. గాలి ఊళ వేసింది. ఆకాశాన్ని పగలగొడుతున్నట్లు పెద్ద ఉరుము ఉరిమింది.ఆమె వెంట్రుకలు ఒక ముళ్ల చెట్టుకు తట్టుకున్నాయి. గుడిసెల్నీ, చెట్లనీ లాక్కెళ్తూ వరద నీరు పొర్లింది. నరకంలోని ఆత్మలు ‘‘ఈ వర్షం సరిపోదు, రెండు డాలర్లంత వర్షం, రెండు డాలర్లంత వర్షం కురవాలి’’ అంటూ ఉధృతంగా గర్జించాయి. డొమినికన్ మూలం : ఖ్వాన్ బాష్ తెలుగు : ఎలనాగ -
ఏపీని ఉదారంగా ఆదుకోండి
సాక్షి, అమరావతి: వరుస విపత్తుల వల్ల రాష్ట్రానికి కలిగిన తీవ్ర నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించి వీలైనంత ఎక్కువ ఆర్థికసాయం అందించేలా సిఫార్సు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర కరువు బృందానికి విజ్ఞప్తి చేశారు. అటు కరువు, ఇటు తుపాన్లు రాష్ట్రానికి ఏటా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, అందువల్లే విభజన సమయంలోనే ఆంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని కోరానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంతో శుక్రవారం సచివాలయంలో సీఎం భేటీ అయ్యారు. కేంద్ర బృందాల పర్యటనల్లో ఆయా జిల్లాల్లో వారు పరిశీలించిన అంశాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కరువు వల్ల వరి, మొక్కజొన్న, జొన్న, శనగ తదితర ఆహార పంటలతోపాటు పొగాకు, పత్తి, మిర్చి తదితర వాణిజ్య పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని కేంద్ర బృంద సభ్యులు తెలిపారు. తాగునీటికి తీవ్ర ఎద్దడి ఉందని గమనించామన్నారు. వైఎస్సార్, కర్నూలు,చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితిని అధికారులు వివరించారు. నిబంధనలను సడలించాలి విపత్తు బాధిత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ చాలా స్వల్పమని సీఎం అన్నారు. ‘‘హెక్టారుకు వరికి కేంద్రం రూ. 13,800 కేంద్రం ఇస్తే, రాష్ట్రం మరో రూ. 1,200 అధికంగా రూ. 15 వేలు ఇస్తోంది. దేశంలో నెలకున్న ప్రస్తుత వ్యవసాయ సంక్షోభ పరిస్థితుల్లో కేంద్రం నిబంధనలను సడలించి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండూ సమస్యల సాగుగా మారింది. అతికష్టం మీద తాగునీటిని సరఫరా చేస్తున్నాం. రాష్ట్రం 7 ఏళ్లుగా కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 9 జిల్లాల్లో 347 మండలాలను కరవు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వర్షాభావంవల్ల 13.60 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 16.52 లక్షల చిన్న, సన్నకారు రైతులు నష్టపోయారు. రూ. 1,401.54 కోట్ల సహాయం కోరుతూ కేంద్రానికి నివేదిక పంపాం. కేంద్ర బృందాలు వీటిని సానుభూతితో పరిశీలించి ఏపీకి చేయూత అందించేలా చూడాలి’ అని చంద్రబాబు కోరారు. సమావేశంలో నీరజా అడిడాన్, శ్రీవాత్సవ, అజయ్ కుమార్, అమితవ్ చక్రవర్తి, ముఖేష్ కుమార్, విక్టర్ అమల్ రాజ్, రాజీవ్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో కరవు కాటు
-
పల్లె గుమ్మానికి పస్తుల తోరణం
జిల్లాలో అనేక ప్రాంతాల్లో పేదరికం విసిరిన బతుకులు వలసదారుల్లో తరలిపోతున్నాయి. పండుగలాంటి పల్లె వాకిట పస్తుల తోరణాలు వేలాడుతున్నాయి. కరువు రక్కసి నోట చిక్కిన ఇళ్లు.. తాళం బుర్రలు కప్పుకుని కన్నీరొలుకుతున్నాయి. వానజాడ లేక, సాగర్ నీళ్లు రాక తడారిన పంట పొలాలు నెర్రెలిచ్చి ఘొల్లుమంటున్నాయి. ఎటు చూసినా ప్రభుత్వం నిర్దయకు గురైన పల్లెలు, ఆసరా కరువైన రైతుల బతుకులు, పనుల్లేక పస్తులు నిండి ఎండిన కూలీల డొక్కలు.. అన్నం ముద్దకై సొంత గూటిని, కన్న ఊరిని వదిలి కన్నీరై కదిలిపోతున్నాయి.. మెతుకు దొరికే తావు చూపండయ్యా అంటూ ఏకరువు పెడుతున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో: తీవ్ర వర్షాభావ పరిస్థితు నేపథ్యంలో జిల్లాలో ఎన్నడూలేని విధంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా 40 శాతం లోటు వర్షపాతం 54 మండలాల్లో ఏర్పడింది.అధికారులు 13 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీటిలో 11 మండలాలను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. బొల్లాపల్లి, చిలకలూరిపేట, దుర్గి, యడ్లపాడు, రెంటచింతల, రొంపిచర్ల, శావల్యాపురం మండలాలు మాత్రమే ఉన్నాయి. జల్లాలో గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, మాచవరం, పిడగురాళ్ల రూరల్, నూజెండ్ల, ఈపూరు, నాదెండ్ల వంటి మండలాలు కరువుతో అల్లాడుతున్నాయి. కరువు మండలాలకు అందని సాయం వెల్దుర్తి, మాచర్ల, బొల్లాపల్లి మండలాలలో తాగు నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఏ పంటనైనా వేసుకొండి సాగు నీరిస్తామని సీఎం నారా చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీంతో అప్పటికే సాగులో ఉన్న పత్తి, కంది పంటలను దున్నేసిన రైతులు మాగాణి సాగు చేశారు. అనంతరం అక్టోబరు 25వ తేదీ నుంచి మాగాణి పంటలు సాగు చేస్తే నీటి సరఫరా చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. నవంబరు నుంచి వారబందీ విధానం ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విధానం ప్రస్తుతం రైతులకు శాపంగా మారింది. వినుకొండ, నరసరావుపేట ప్రాంతాలలో వరి పొలాలు నెర్రెలిచ్చాయి. ఉపాధి పనులెక్కడ ? కరువు మండలాల్లో పని దినాలను 200లకు పెంచాలి. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో పనుల్లేక ప్రజలు వలస బాట పడుతున్నారు. ఈ ప్రాంతంలో కరువు బియ్యం, పశుగ్రాసం అందించాలి. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఇన్పుట్ సబ్సిడీ కోసం, కరువు మండలాల్లో ఎంత మేర నష్ట వాటిల్లిందో సర్వే నిర్వహించాలి. రబీలో పంటలు సాగు చేసేందుకు సబ్సిడీపైన విత్తనాలు సరఫరా చేయాలి. ప్రభుత్వం మాత్రం కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుంది. బొల్లాపల్లి మండలంలో.. బొల్లాపల్లి మండలంలో 11,500 హెక్టార్లు సాగులో ఉంది. అయితే 3 వేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తే 2 వేల హెక్టార్ల వరకు నష్టపోయింది. మిరప 4 900 హెక్టార్లకుగాను 2500, కంది 1650 హెక్టార్లకుగాను 900, మిగిలిన రకాలు 500 హెక్టార్లకుగాను 300 హెక్టార్లతో పంట దెబ్బతింది. ఇంకా లింగంగుంట తండా, చెంచుకుంట తండా, పాపాయపాలెం, వీరప్పకుంట తండా, హనుమాపురం తదితర తండాల నుంచి ఉపాధి కరువై పొట్ట చేత పట్టుకుని పనుల కోసం వలస వెళ్లారు. -
సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో కరువు విలయతాండవం
-
కరువును జయించిన సిరిధాన్యాలు!
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో కొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.వరి వంటి పంటలు కొన్ని జిల్లాల్లో ఎండిపోయాయి. అయితే, వర్షాధారంగా సాగులో ఉన్న కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు వంటి సిరిధాన్య పంటలు మాత్రం కరువును తట్టుకున్నాయి. నెల నుంచి రెండున్నర నెలల వరకు వాన దేవుడు మొహం చాటేసినప్పటికీ.. సిరిధాన్య పంటలు తట్టుకొని బతికాయి. వర్షాభావం వల్ల ఎదుగుదల మందగించి, దిగుబడి కొంత తగ్గినప్పటికీ ఈ పంటలు రైతులను నిరాశపర చకపోవటం విశేషం. అధిక పెట్టుబడులు అవసరమైన ఇతర పంటలు రైతులను నష్టాల ఊబిలోకి నెడుతూ ఉంటే.. స్వల్ప ఖర్చుతోనే సాగైన సిరిధాన్య పంటలు మెట్ట రైతులకు కొండంత భరోసానిస్తున్నాయి. అటవీ కృషి వ్యవసాయ పద్ధతిలో డాక్టర్ ఖాదర్ వలి (మైసూరు) వద్ద శిక్షణ పొంది, ఆయన అందించిన ‘అటవీ చైతన్య ద్రావణం’ ఉపయోగించి సిరిధాన్యాలను విజయవంతంగా సాగు చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రైతుల అనుభవాలు ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. వత్తుగా చల్లితే కలుపు బెడద ఉండదు! వర్షాధార వ్యవసాయ భూములు 60% వరకు ఉన్నాయి. ఇటువంటి భూములు వేలాది ఎకరాలు పడావు పడి ఉన్నాయి. 15 ఏళ్లుగా బీడుపడిన అటువంటి భూమిలో తెలంగాణకు చెందిన నలుగురు స్నేహితులు ఉమ్మడిగా కొర్రలు, అరికల వంటి సిరిధాన్యాలను వర్షాధారంగా సాగు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు. విత్తనం వత్తుగా వేశారు. కలుపు తీయలేదు. ఎరువులూ వేయలేదు. పిచికారీలూ చేయలేదు. తక్కువ ఖర్చుతో, అద్భుత పోషక – ఔషధ గుణాలు కలిగిన సిరిధాన్య పంటలను కేవలం వర్షాధారంగా సాగు చేసి ఎకరానికి కనీసం 5–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తామని భరోసాతో చెబుతున్నారు. మెట్ట ప్రాంత రైతులకు, ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఈ పంటలు ఎంతో అనువైనవని వారు చెబుతున్నారు. కరువును తట్టుకోవటంతో పాటు అప్పులు చేయాల్సిన అవసరం లేని పంటలని చాటిచెబుతున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎమ్మెస్సీ, బీఈడీ చదువుకున్న మైల నర్సింహ, త్రిపురారానికి చెందిన ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి(అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ గ్రీన్‌కార్డ్ కలిగిన ఈయన గత ఏడాది తిరిగివచ్చేసి వ్యవసాయం చేస్తున్నారు), హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆనాజిపురానికి చెందిన పూదిరె భాస్కర్, అల్వాల్‌కు చెందిన అభ్యుదయ రైతు రామానుజం క్రాంతికిరణ్ ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగిన స్నేహితులు. ‘ప్రకృతి ఆధారిత వ్యవసాయం’ పేరిట రెండేళ్లుగా వాట్సాప్ గ్రూపును నిర్వహిస్తూ రైతుల్లో ప్రకృతి సేద్యంపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైసూరుకు చెందిన అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలీ వద్దకు వెళ్లి సిరిధాన్యాల సాగులో జూన్‌లో శిక్షణ పొందివచ్చారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో సిరిధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహించారు. అధిక పెట్టుబడులకు అప్పులు చేసి పత్తి, వరి తదితర పంటలు సాగు చేయడానికి బదులు తక్కువ పెట్టుబడితో, అధిక లాభాలనిచ్చే సిరి«ధాన్య పంటలను సాగు చేయమని రైతులకు చెప్పడంతోపాటు.. ఈ నలుగురు మిత్రులు కూడా సాగు చేశారు. కౌలు భూమిలో సిరిధాన్యాలు పండిస్తున్న శ్యాం ప్రసాద్‌రెడ్డి, భాస్కర్, నర్సింహ, క్రాంతి చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని ఇరవై నాలుగు ఎకరాలలో, చౌటుప్పల్ మండలంలోని లక్కారంలో మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకొని సిరిధాన్యాల పంటలను ఈ ఏడాది జూలై ఆఖరులో విత్తారు. ఎర్ర నేల పదెకరాల్లో అండుకొర్రలు, ఏడెకరాల్లో ఊదలు, 6 ఎకరాల్లో కొర్రలు, 4 ఎకరాల్లో అరికెలు విత్తారు. మరో ఏడెకరాల నల్లరేగడి నేలలో సామలు విత్తారు. ఎర్త్‌మూవర్‌తో చదును చేయించి ట్రాక్టర్‌తో ఫ్లౌ, కల్టివేటర్ వేయించారు. ఎకరానికి సాధారణంగా 3 కిలోల వరకు ఈ సిరిధాన్య విత్తనాలను రైతులు చల్లుతూ ఉంటారు. అయితే, వీరు ఎకరానికి 4 కిలోల విత్తనాన్ని 3 రెట్లు ఇసుకలో కలిపి వెదజల్లారు. కొన్ని చోట్ల విత్తనం లోతుగా పడి మొలవలేదు. 70% విత్తనం మొలిచింది. తర్వాత 5 వారాల పాటు చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. మొదట్లో ఏపుగా పెరిగిన మొక్కలు తర్వాత వాడిపోవటం ప్రారంభమైంది. ఇక ఎండిపోతుందా అనుకున్న దశలో మంచి వర్షం పడింది. ఆశలు వదులుకున్న ఈ నలుగురు మిత్రులు చెలక వైపు వారం వరకు వెళ్లలేదు. తీరా వెళ్లి చూసే సరికి పంట తిప్పుకొని.. ఏపుగా పెరగటంతో ఆశ్చర్యపోయారు. తర్వాత కురిసిన ఒకటి, రెండు వర్షాలతో పంట బాగా ఎదిగింది. దీర్ఘకాలిక పంట అరిక తప్ప మిగతా 4 పంటలు కోతకు వచ్చాయి. వచ్చే వారంలో కోతలు కోయబోతున్నారు. ఈ సిరిధాన్యాల పంటలో కలుపు తీయటం గాని, ప్రత్యేకంగా ఎలాంటి పై మందులు, రసాయన/సేంద్రియ ఎరువులు వాడ లేదు. దుక్కి, విత్తనాల కొనుగోలు, విత్తనాలు చల్లే ఖర్చులు మినహా అదనపు ఖర్చులు చేయకపోవటం విశేషం. నూర్పిళ్ల తర్వాత సిరిధాన్యాల ధాన్యాన్ని పొట్టు తీసి బియ్యంగా, రవ్వగా, పిండిగా మార్చి నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ఈ నలుగురు యువ రైతులు సమాయత్తమవుతున్నారు. – ఎం. వేణు, సాక్షి, చిట్యాల, నల్లగొండ జిల్లా ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి మా గుండ్రాంపల్లి గ్రామ శివారులో ఉన్న భూములు గత 15∙ఏళ్ళుగా సాగునీరు లేక పడావు పడి ఉన్నాయి. అలాంటి భూమిని నలుగురు యువ రైతులం కౌలుకు తీసుకొని సిరిధాన్య పంటలు పండిస్తున్నాం. అంతా స్వయంగా పొలం పనులు చేస్తూ సిరిధాన్యాల విత్తనాలు చల్లాం. డబ్బు ఖర్చయ్యే ఎలాంటి రసాయన ఎరువులు, మందులు ఈ పంటలకు అసలు వాడలేదు. దీంతో మాకు ఖర్చు చాలా తగ్గిపోయింది. 5 వారాలు వర్షం లేకపోయినా, పడావు భూముల్లో పంటలు విజయవంతంగా పండించాం. విత్తనాలు వెదజల్లాం. అండుకొర్రలు, సామలు, ఊదలు బాగా పండాయి. ఎకరానికి ఐదారు క్వింటాళ్లు వస్తాయి. కొర్రలు, అరికలు 3–4 క్వింటాళ్లు వస్తాయి. పశువుల ఎరువు తోలుకొని, నాగలి సాళ్లకు వేసుకొని, అంతరసేద్యం చేసుకునే రైతులకు ఎకరానికి 7–8 క్వింటాళ్ల సిరిధాన్యాల దిగుబడి ఖాయంగా వస్తుందని నా నమ్మకం. విత్తనాలను ఉచితంగా ఇస్తాం. – మైల నర్సింహ (99492 59239), గుండ్రాంపల్లి, చౌటుప్పల్ మండలం, నల్లగొండ జిల్లా రెండున్నర నెలలు వర్షం లేకపోయినా.. లక్ష్మీనారాయణరెడ్డిది ఎస్. కొత్తపల్లి. అనంతపురం జిల్లాలో హిందుపూర్‌కు దగ్గర్లో ఉంటుంది. అటవీ కృషి పద్ధతిపై డాక్టర్ ఖాదర్ వలి గారి వద్ద శిక్షణ పొందిన తర్వాత మా పది ఎకరాలలో కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరికెలను సాగు చేస్తున్నారు. మే, జూన్‌లో వర్షాలు పడిన తర్వాత జూన్‌లో 8 ఎకరాల్లో సిరిధాన్యాల విత్తనాలు వెదజల్లారు. జూన్ 4న నారు పోసి, జూన్ 24న 2 ఎకరాల్లో నీరు పెట్టి నాట్లు వేశారు. తర్వాత పూర్తిగా వర్షాధారంగానే సాగు చేశారు. జూలై, ఆగస్టులో చుక్క వర్షం కురవలేదు. సెప్టెంబర్ మూడో వారంలో, అక్టోబర్ మొదటి వారంలో రెండు వర్షాలు పడ్డాయి. అటవీ చైతన్య ద్రావణాన్ని పంటలపై 3 సార్లు పిచికారీ చేశారు. రెండున్నర నెలలకు పైగా వర్షం కురవకపోవడం వల్ల ఆ ప్రాంతంలో వర్షాధారంగా సాగవుతున్న సీజనల్ పంటలు ఎండిపోయాయి. కానీ, లక్ష్మీనారాయణరెడ్డి పొలంలో సిరిధాన్య పంటలు మాత్రం బెట్టను తట్టుకున్నాయి. పెరుగుదల మందగించిందే తప్ప పంట ఎండిపోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత రెండు వర్షాలు పడ్డాయి. వాడిపోయిన పంట ఆశ్చర్యకరంగా మళ్లీ పచ్చబడి, కంకులేసింది. ఒకటి, రెండు వారాల్లో కోతలు కోయబోతున్నారు. వరుసలుగా నాటిన అరికె పంట నాటిన పంటే బాగుంది! 5 రకాల సిరిధాన్యాల్లో ఊదలు, అండుకొర్ర, అరికె పంటలు బాగా పెరిగాయి. కొర్ర బాగానే వచ్చింది కానీ పక్షులు పూర్తిగా తినేశాయి. మాకేమీ మిగల్చలేదు. సామలు సరిగ్గా పెరగలేదు. వెదజల్లిన పంటల కన్నా నాట్లు వేసిన పంట బాగుంది. నాటిన అరికెల దుబ్బుకు 30కి పైగా పిలకలు ఉన్నాయి. ఊద, కొర్రలో 10–15 పిలకలు వచ్చాయి. అండుకొర్ర కూడా చాలా పిలకలు వచ్చాయి. సాధారణంగా రాగులు వేస్తుంటాం. రాగి అయితే ఎండిపోయి ఉండేది. అంతకన్నా తక్కువ నీటితోనే పండేవి కాబట్టే కొర్ర, అండుకొర్ర, అరికె, ఊద, సామ పంటలు రెండున్నర నెలలు ఎండిపోకుండా బతికి ఉన్నాయి. నెలకో వర్షం పడినా ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేవి. ఇప్పుడు ఎకరానికి 3 క్వింటాళ్ల వరకు రావచ్చనుకుంటున్నాం. ఇంతటి కరువులోనూ మాకు దక్కిన ఆ పాటి సిరిధాన్యాలే మాకు మహాప్రసాదం వంటివి. రైతులంతా ఈ పంటలు పండించుకోవాలి. – ఎస్. లక్ష్మీనారాయణరెడ్డి(99017 30600), ఎస్.కొత్తపల్లి, చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా ఖరీఫ్‌లో ఒకటే వర్షం కురిసినా ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి అటవీ చైతన్య ద్రావణంతో కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు వంటి సిరిధాన్యాలను ఈ ఖరీఫ్‌లో 40 ఎకరాల్లో సాగు చేశాం. మా దగ్గర ఒకే వర్షం పడింది. మా చుట్టు పక్కల ఇతర పంటలు ఎండిపోయాయి. మా పొలంలో సిరిధాన్యాల పంటలు బెట్టను తట్టుకొని నిలబడ్డాయి. పంట కోతకు వచ్చింది. వచ్చే వారం కోస్తాం. ఎకరానికి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇంకో రెండు, మూడు వర్షాలు పడి ఉంటే ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. మహబూబ్‌నగర్‌లో ఒక్క వర్షంతోనే పెరుగుతున్న సిరిధాన్య పంటలు; – బసవరాజ్ (93466 94156), గొరిట, నాగర్‌కర్నూల్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా 7.5 క్వింటాళ్ల దిగుబడి గుంటూరు జిల్లా పుల్లడిగుంట వద్ద కొర్నెపాడులో రైతు శిక్షణా కేంద్రం వద్ద నల్ల రేగడి భూమిలో 10 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో 5 రకాల సిరిధాన్యాలను సాగు చేశాం. నేలలో ఘనజీవామృతం వేశాం. ఒకటి రెండు సార్లు జీవామృతం పిచికారీ చేశాం. వర్షాధారంగానే సాగు చేశాం. ఇటీవల సామలు నూర్చాం. ఎకరానికి 7.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కొర్రలు, ఊదల కంకులు ఔరా అనిపించేంతగా చాలా పెద్దగా పెరిగాయి. ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. మెట్ట రైతులకు సిరిధాన్య పంటలు వరప్రసాదాలే. అందుకే రైతులకూ శిక్షణ ఇస్తున్నాం. – యడ్లపల్లి వెంకటేశ్వరరావు (9849005182), అధ్యక్షుడు, రైతునేస్తం ఫౌండేషన్ కొర్నెపాడులోని తన పొలంలో డా. ఖాదర్‌తో యడ్లపల్లి వెంకటేశ్వరరావు నీటి వసతి ఉన్న భూముల్లోనూ సిరిధాన్యాలను సాగు చేయవచ్చు వర్షాధారంగా వ్యవసాయం చేసే మెట్ట ప్రాంత భూములతోపాటు.. సాగు నీటి సదుపాయం ఉన్న ఆయకట్టు భూముల్లో కూడా సిరిధాన్యాలను సాగు చేసుకోవచ్చు. నాలుగు వర్షాలు పడితే చాలు. వర్షాల మధ్య ఎక్కువ రోజులు ఎడం వచ్చినప్పటికీ తట్టుకొని బతికి మంచి దిగుబడిని అందిస్తాయి. నీటి వసతి ఉన్న భూముల్లోనూ పండుతాయి. ఏడాది పొడవునా వర్షాలు కురిసే ప్రాంతాల్లో సైతం సామలు వంటి సిరిధాన్యాలు పండుతాయి. ఎర్ర నేలలు, రాళ్ల నేలలు, నల్ల నేలల్లోనూ పండుతాయి. – డాక్టర్ ఖాదర్ వలీ, అటవీ కృషి నిపుణులు, మైసూరు మిక్సీలతోనే సిరిధాన్యాల పొట్టు తీయిస్తాం చాలా ఏళ్లుగా పడావుగా ఉన్న 30 ఎకరాల్లో ఈ ఖరీఫ్‌లో 5 రకాల సిరిధాన్య పంటలను సాగు చేశాం. డా. ఖాదర్ వలి గారి వద్ద నుంచి తెచ్చిన అటవీ చైతన్య ద్రావణాన్ని రెండుసార్లు పిచికారీ చేశాం. ఇసుకలో కలిపి విత్తనం చల్లాం. కొన్ని చోట్ల పంట పల్చగా వచ్చింది. పల్చగా మొలిచిన చోట్ల కలుపు పెరిగి, పంట సరిగ్గా ఎదగలేదు. వత్తుగా మొలిచిన చోట్ల పంట బాగానే వచ్చింది. ఈ వారంలో నూర్పిడి చేయబోతున్నాం. నూర్చిన సిరిధాన్యాలను బుచ్చి పద్ధతిలో మిక్సీలతోనే శుద్ధి చేసి పొట్టు తీసి.. వినియోగదారులకు అందించాలన్నది మా ఆలోచన. సిరిధాన్యాల సాగుపై సదస్సు నిర్వహించాం. అటవీ చైతన్య ద్రావణాన్ని చాలా మంది రైతులకు ఇచ్చాం. వచ్చే ఏడాదికి సిరిధాన్యాలు సాగు చేసే చాలా మంది రైతులకు ఈ ద్రావణాన్ని, విత్తనాలను అందిస్తాం. – దత్తా శంకర్ (86398 96343), ధ్యానహిత, షాబాద్, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సిరిధాన్య పంటలో దత్తా -
కరువు ఛాయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు ఛాయలు అలముకున్నాయి. వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 17 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. ఈ నెలలో ఇప్పటివరకు ఏకంగా 82 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కొన్ని జిల్లాల్లోనైతే వంద శాతం లోటు నమోదైంది. పైపెచ్చు ఎండలు మండిపోతున్నాయి. అనేక జిల్లాల్లో సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఖరీఫ్‌లో వేసిన పంటల పరిస్థితి అధ్వానంగా మారింది. మరోవైపు రబీలో పంటల సాగు విస్తీర్ణం సాగిల పడింది. రబీ మొదలైన తర్వాత ఈ 25 రోజుల్లో కేవలం నాలుగు శాతం మేర మాత్రమే పంటలు వేశారు. ఈ యాసంగిలో మొత్తం 33.06 లక్షల ఎకరాల సాధారణ సాగు అంచనా ఉండగా, ఇప్పటి వరకు 1.22 లక్షల ఎకరాల్లో సాగు నమోదైంది. ఇందులో శనగ పంట 30 వేల ఎకరాల్లో, వేరుశనగ 70 వేల ఎకరాల్లో, మొక్కజొన్న 12 వేల ఎకరాల్లో వేశారు. గత రెండేళ్లుగా సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండి జలకళను సంతరించుకునేవని, కానీ ఈసారి ఆ పరిస్థితులు లేకపోవడంతో సాగు అంచనాలను చేరుతుందా లేదా అన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రబీలో ఇప్పుడే కరువు ఛాయలు కనిపిస్తున్నందున మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఖరీఫ్ పంటలపై ప్రభావం... పంట చేతి కందే సమయంలో వర్షాలు కురవకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రధానంగా చివరి దశలో ఉన్న పత్తి, కంది ఎండిపోతుండటంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు ఆశాజనకంగా కురవక పోవడంతో అనేక మెట్ట పంటలు ఎండిపోతున్నాయి. జూన్‌లో 15 శాతం అధిక వర్షపాతం నమోదైనా, జూలైలో 30 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో 18 శాతం అధిక వర్షపాతం కురవగా, సెప్టెంబర్‌లో ఏకంగా 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇక అక్టోబర్‌లో ఇప్పటివరకు ఏకంగా 82 శాతం లోటు నమోదైంది. మొత్తంగా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 16 శాతం లోటు రికార్డు అయింది. కీలకమైన సెప్టెంబర్‌లో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. మొత్తం 584 మండలాలుంటే, ఏకంగా 320 మండలాల్లో వర్షపాతం కొరత వేధిస్తుంది. ఎండల తీవ్రత, వర్షాభావం, గులాబీ పురుగు కారణంగా పత్తి దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అంచనా ప్రకారం 35 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి జరగాల్సి ఉండగా, కేవలం 30 లక్షల టన్నుల లోపు మాత్రమే ఉండొచ్చని అంటున్నారు. ఎండలు తీవ్రం కావడంతో గింజ పట్టే దశలో ఉన్న కంది పరిస్థితి దారుణంగా మారింది. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పంటలను సాగు చేస్తే నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. -
ఎటుచూసినా ఎండిపోయిన పంటలు.. బీడుపడిన భూములే!
సాక్షి, అమరావతి: కనుచూపు మేరలో ఎటు చూసినా ఎండిపోయిన పంటలు.. బీడుపడిన భూములే. చిన్న కొండల్లా గడ్డివాములుండాల్సిన రైతుల కళ్లాలన్నీ బోసిపోతున్నాయి. మేతలేక లారీల్లో కబేళాలకు తరలుతున్న పశువులు.. చినుకు జాడలేక, బతుకుతెరువు కనిపించక కంటతడి పెట్టుకుంటున్న రైతన్నలు... రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. రాష్ట్రంలో కరువు విలయతాండవానికి ప్రత్యక్ష నిదర్శనాలవీ. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం వల్ల పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఖరీఫ్ ఆరంభంలో జూన్‌లో కురిసిన వర్షాలను చూసి రైతులు శ్రమకోర్చి విత్తిన పంటలు తదుపరి చినుకు జాడలేక పూర్తిగా ఎండిపోయాయి. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని అనధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట చేతికి రాకుండాపోయింది. పత్తి, కంది, ఉల్లి, సజ్జ, మొక్కజొన్న తదితర పంటలతోపాటు టమోటా, మిరప తదితర కూరగాయల తోటలు మాడిపోయాయి. పంటల సాగుకోసం అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన అన్నదాతలు కుంగిపోతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. సెప్టెంబరుతో ముగిసిన ఖరీఫ్‌లోనే కాకుండా ప్రస్తుత రబీ సీజన్లోనూ తీవ్ర దుర్బిక్ష పరిస్థితులే కొనసాగుతున్నాయి. కురవాల్సిన దాంట్లో సగం వర్షమే ఖరీఫ్‌లో వరుస కరువుల వల్ల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోతోంది. అధికారిక గణాంకాల ప్రకారమే.. రాష్ట్రంలో జూన్ 1తో ఆరంభమైన ఖరీఫ్ సీజన్లో ఇప్పటిదాకా(అక్టోబరు 21) కురవాల్సిన కనీస సగటు వర్షం కంటే 27.4 శాతం తక్కువ కురిసింది. వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కనీసం కురవాల్సిన దానిలో సగం వర్షమే కురవడం గమనార్హం. రాష్ట్రంలో 689.4 మిల్లీమీటర్ల కనీస సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 500.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ శ్రీకాకుళం జిల్లా మినహా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోనూ లోటు వర్షపాతమే ఉండేది. అక్టోబర్ రెండోవారంలో తిత్లీ తుపాన్ వల్ల కురిసిన భారీ వర్షంతో అక్కడ 7.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ముప్పావు ప్రాంతంలో దుర్భిక్షమే అధికారిక వర్షపాత గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో ముప్పావు ప్రాంతంలో తీవ్ర కరువు నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలుండగా, 470 మండలాల్లో కురవాల్సిన కనీస వర్షం కంటే 19 నుంచి 52.9 శాతం తక్కువ వర్షం పడింది. శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ.. సాధారణం కంటే 19 శాతం మించి తక్కువ వర్షం కురిస్తేనే ప్రభుత్వం లోటు వర్షపాత మండలాలుగా గుర్తిస్తుంది. అందువల్లే వర్షాభావ మండలాల జాబితాలో 470 మండలాలే ఉన్నాయని, లేకపోతే 600కు పైగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కేవలం 19 మండలాల్లోనే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రైతుల కష్టాలపై కనికరం లేని సర్కారు రాష్ట్రంలో 470 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో కేవలం 296 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. కరువు వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తోంది. గత ఏడాది రెయిన్గన్లతో ఒక్క సెంటు కూడా పంటలు ఎండిపోకుండా కాపాడామని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెయిన్ గన్ల ఊసే ఎత్తడం లేదు. రూ.2,250 కోట్ల పెట్టుబడి మట్టిపాలు ఎకరా పొలంలో వేరుశనగ సాగుకు సగటున రూ.15,000 ఖర్చవుతుంది. సెప్టెంబరుతో ముగిసిన ఖరీఫ్ సీజన్లో 16.50 లక్షల ఎకరాల్లో రైతులు వేరుశనగ పంట వేయగా, 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. దీనివల్ల రైతులు ఈ పంట సాగు కోసం పెట్టిన రూ.2,250 కోట్ల పెట్టుబడి మట్టిపాలైంది. - 2016 ఖరీఫ్‌లో 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండగా ప్రభుత్వం 301 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. - 2017 ఖరీఫ్ సీజన్లో ఆగస్టు మూడో వారం వరకూ 241 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండేది. ఆగస్టు చివరల్లోనూ, సెప్టెంబరులోనూ అల్పపీడనాల వల్ల వర్షం కురవడంతో లోటు వర్షపాత మండలాల సంఖ్య 93కు తగ్గింది. అయితే ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు. - 2018లో 470 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం 296 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. - 2016లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకాగా, 301 మండలాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ ఏడాది 3 లక్షల హెక్టార్లలో పంటల సాగు తగ్గినా కరువు మండలాలను పెంచాల్సిందిపోయి తగ్గించడం గమనార్హం. రబీలో 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్లో (అక్టోబరు 1 నుంచి 20వ తేదీ మధ్య) ఏకంగా 65 శాతం సగటు లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 61 శాతం, రాయలసీమలో 74 శాతం లోటు వర్షపాతం రికార్డయ్యింది. ఖరీఫ్‌లో కంటే రబీలో కరువు తీవ్రత మరింత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 21 రోజుల్లో కురవాల్సిన దానికంటే 65 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో సగటున 109.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా, 43.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. రాయలసీమ జిల్లాల్లో 78 మిల్లీమీటర్ల కనీస వర్షం కురవాల్సి ఉండగా. 20.1 మిల్లీమీటర్లు (74 శాతం లోటు) కురిసింది. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాన్ వల్ల భారీ వర్షం కురవడంతో సాధారణం కంటే 66 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన 12 జిల్లాల్లో కురవాల్సిన దానికంటే చాలా తక్కువ వర్షం కురవడం గమనార్హం. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు ‘‘వరుసగా నాలుగేళ్లు కరువు వల్ల పంటలు పండక పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మూడు ఎకరాల్లో వేరుశనగ వేశా. వర్షాల్లేక మొక్కలు గిడసబారి పోయాయి. పెట్టిన పెట్టుబడులు పోయాయి. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ – భాస్కర్‌రెడ్డి, రైతు, వేపలపల్లె, చిత్తూరు జిల్లా పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇవ్వాలి ‘‘వేరుశనగ పంటే కాదు మిగిలిన పంటలూ కరువు వల్ల ఎండిపోయాయి. ఎకరాకు 15 నుంచి 20 బస్తాల వేరుశనగ రావాల్సి ఉండగా ఒకటి రెండు బస్తాలు కూడా రావడం లేదు. ప్రభుత్వం తక్షణమే పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి’’ – సరస్వతి, మహిళా రైతు, కురబలకోట, చిత్తూరు జిల్లా చివరకు అప్పులే మిగిలాయి ‘‘నాకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కలిపి రెండెకరాలకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. జూన్‌లో కురిసిన వానకు విత్తనాలు వేశా. ఆ తరువాత వానల్లేక పైరంతా ఎండిపోయింది. రూపాయి కూడా ఆదాయం రాలేదు. చివరకు అప్పులే మిగిలాయి’’ – దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, దేవలంపల్లి, లక్కిరెడ్డిపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా ఇంతటి కరువు ఎన్నడూ చూడలేదు ‘‘నాలుగేళ్లుగా పశ్చిమ ప్రకాశంలో వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయాం. ఈ ఏడాది కూడా వర్షాలు లేకపోవడంతో పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నేను ఎకరా మిర్చి సాగు చేయగా రూ.25 వేలు పెట్టుబడి అయింది. పత్తికి రూ.12 వేల ఖర్చు వచ్చింది. వానల్లేక పంటలు ఎండిపోయాయి. పొట్టకూటి కోసం వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతటి కరువు గతంలో ఎన్నడూ చూడలేదు’’ – కె.వెంకటరెడ్డి, రైతు, వేములపేట, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా కబేళాలకు పశువులు.. రైతన్నల వలసలు దుర్బిక్షం ప్రభావం వ్యవసాయంతోపాటు పశు సంపదపైనా పడింది. పశువులకు మేత, నీరు సమకూర్చే పరిస్థితి కూడా లేక రైతన్నలు వాటిని నిస్సహాయంగా కబేళాలకు అమ్మేస్తున్నారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న పాడిపశువులను కోతకు ఇవ్వడం ఇష్టంలేని కొందరు గోశాలలకు తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి ఎద్దడి భయం గొలుపుతోంది. కందుకూరు, కొండెపి, వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఐదు నియోజకవర్గాల్లోని 320 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తేనే ప్రజలు గొంతు తడుపుకోగలుగుతున్నారు. వరుణుడి కరుణ లేక పంటలు పండక, సొంత ఊళ్లల్లో పనులు లేక రైతులు వలసబాట పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, సూరత్ నగరాలకు చేరుకుని, కూలీ పనులు చేసుకుంటున్నారు. చాలామంది రైతులు తిరుపతి, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. -
అనంత కరువు..!
-
ముల్లె సర్దిన పల్లె
ఖరీఫ్ సీజన్ ముగిసి..రబీ కూడా ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేవు.వస్తాయన్న ఆశా లేదు. కరువు విలయ తాండవం చేస్తోంది. కుటుంబాలు గడవడమే కష్టమైపోతోంది. ఈ తరుణంలో వలసలే దిక్కవుతున్నాయి. పొట్టకూటి కోసం పిల్లాపాపలతో సుదూర ప్రాంతాలకు పల్లె ప్రజలు పయనమవుతున్నారు. వ్యవసాయ కూలీలే కాదు..చిన్న, సన్నకారు రైతులు సైతం మూటాముల్లె సర్దుతున్నారు. కర్నూలు, ఆదోని టౌన్: ఆదోని డివిజన్..కరువుకు పెట్టింది పేరు. వరుసగా నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో ఆశించిన వర్షాలు లేవు. తుంగభద్ర దిగువ కాలువ ఉన్నా..ఎప్పుడూ వాటా నీరు రాలేదు. టీబీ డ్యాంలో గరిష్ట స్థాయి నీటి మట్టమున్నా..ఆయకట్టు తడవడం లేదు. వర్షాధారంపై ఆధారపడి సాగుచేస్తున్న పంటలు పండడం లేదు. ఈ ఏడాది జూన్‌లో మురిపించిన వర్షాలు ఆ తరువాత మొండికేశాయి. పంటల సాగు చేసిన అప్పులు భారమయ్యాయి. రబీలోనైనా పంటలు సాగు చేద్దామంటే..ఆ పరిస్థితులూ కనిపించడం లేదు. ఎండలు మండిపోతూ వేసవి తలపిస్తున్నాయి. పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చేందుకు సన్న, చిన్న కారు రైతులు బెంగళూర, ముంబయి తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. మూడు రోజులుగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు బెంగళూరుకు వలస వెళ్లే కూలీలతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి రోజుకు 500 కుటుంబాలకు పైగానే బెంగళూరుకు వలస వెళ్తున్నాయి. రైల్వే స్టేషన్లోనూ వందలాది కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఎలా బతకాలి? నాకున్న రెండెకరాల పొలంతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకున్నాను. వ్యవసాయ పనులు, పంటల సాగుకు దాదాపు రూ.30వేలు దాకా పెట్టుబడి పెట్టాను. కౌలు కూడా రాలేదు. ఎలా బతకాలి? భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు, వయసు మీదపడిన తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక బెంగళూరుకు వలస వెళ్తున్నాం. – బీరప్ప, రైతు, సుంకేసుల -
కందకాలే మామిడి చెట్లను బతికించాయి!
కరువుతో భూగర్భ జలాలు అడుగంటి పెద్దలు నాటిన మామిడి చెట్లు ఒకటొకటీ నిలువునా ఎండిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కని సంక్షోభ సమయంలో ‘సాక్షి సాగుబడి’ స్ఫూర్తితో, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పెద్దల సాంకేతిక సలహాల మేరకు కందకాలు తవ్వి తాతల నాటి మామిడి చెట్లను విజయవంతంగా కాపాడుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రైతు బాపు ప్రసాద రెడ్డి సంబరంగా చెబుతున్నారు. బాపు ప్రసాద రెడ్డి కుటుంబ ఉమ్మడి సేద్యం కింద పాకాల మండలం దామలచెరువు గ్రామపరిధిలో తాతల నాటి మామిడి తోటలున్నాయి. 2016లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో పెద్ద మామిడి చెట్లు కొన్ని ఎండిపోయాయి. ఆ దశలో ‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘చేను కిందే చెరువు’ శీర్షికన ప్రచురించిన కథనం ద్వారా తక్కువ ఖర్చుతోనే కందకాలు తవ్వుకుంటే భూగర్భ జలాలను పెంచుకొని నీటి భద్రత సాధించవచ్చని తెలుసుకొని, ప్రాణం లేచి వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి, అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009) లను ఫోను ద్వారా సంప్రదించి, వారి సూచనల ప్రకారం వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున జేసీబీతో కందకాలు తవ్వించామని బాపు రెడ్డి వివరించారు. కందకం పొడవు 25 మీటర్ల తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో 25 మీటర్ల పొడవున మరో కందకం తవ్వించామని తెలిపారు. జేసీబీతో తవ్వించడానికి ఎకరానికి రూ. 2,500 వరకు ఖర్చయిందన్నారు. ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు పూర్తిగా ఇంకి భూగర్భ జలాలు పెరిగాయని, ఆ తర్వాత నుంచి ఒక్క మామిడి చెట్టు కూడా ఎండిపోలేదన్నారు. అంతేకాదు, ఈ రెండేళ్లలో మామిడి తోట చాలా కళగా ఉంది. పంట దిగుబడి కూడా బాగా వచ్చిందని ఆయన సంతోషంగా చెప్పారు. అయితే, ధర అంత బాగాలేదు. ధర బాగుంటే మరింత లాభదాయకంగా ఉండేదన్నారు. చనిపోయిన చెట్ల స్థానంలో సీతాఫలం, జామ మొక్కలు నాటాలని భావిస్తున్నామన్నారు. కందకాల వల్ల నిజంగా ఎంతో మేలు జరుగుతున్నదని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదని బాపురెడ్డి(90301 81344) అన్నారు. -
అర్ధ రూపాయి విలువ
మార్కెట్ గేటు వద్ద సుబ్బయ్య బియ్యం అమ్ముతూ ఉంటాడు. రోజులు మంచివైనా కాకపోయినా అతని వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయల్లా ఉండేది. కరువు రోజుల్లో మిల్లులు మూతపడి బియ్యం చేతికందేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మనుష్యులు కళ్ళు లోతుకి పోయి రోడ్లపై ఎప్పుడు పడిపోతారా అన్నట్లు ఉండే వారు. అలాంటి రోజుల్లో కూడా అతని దుకాణం తెరిచే ఉండేది. కనీసం రెండు బస్తాల్లో బియ్యం నిండుగా ఉండేందుకు అతను తిరగని చోటు లేదు. అలా సంపాదించి అమ్మేవాడు. అటువంటి రోజుల్లో బియ్యం రోజంతా అమ్మినా నెలాఖరుకు యాభై రూపాయల లాభం వస్తుందనే ఆశ కూడా ఉండేది కాదు. దాన్ని వర్తకంలో మందగొడి రోజులనేవాళ్ళు. మనల్ని పోషించే ఆ భగవంతుడికి మాయ ఏమిటో తెలీకుండా ఉంది. ఆయన పంట పుష్కలంగా పండినా, అతి తక్కువగా పండినా, రెండూ అనంగీకారంగానే ఉండేవి. కానీ సుబ్బయ్య పంట కోతకొచ్చిన సమయంలోను, మామూలు వర్తకంలోనూ కలిగే ఎత్తు పల్లాలు అన్నీ చవి చూశాడు. బియ్యం వ్యాపారం అతని రక్తంలో కలిసిపోయింది. అతని తండ్రి వాలు డస్కు దగ్గర కూర్చొని డబ్బు లెక్కిస్తుంటే, తను జీత భత్యాలు లేని పనివాడుగా సహాయం చేశాడు. ఆ రోజుల్లో తనని కట్టి పడేసిన ఆ బియ్యం బస్తాలంటే అసహ్యించుకునేవాడు. ధ్యాసంతా కిక్కిరిసిన వీధులు, సినిమాలు, ఫుట్ బాల్ ఆటలు, మల్ల యుద్ధాలపై ఉండేది. వాటినన్నిటినీ జనంతో నిండిన తమ దుకాణం ద్వారంలోంచి చూసేవాడు. కానీ తండ్రి, తనని దుకాణానికి దాదాపు కట్టి పడేసి, జీవితంలోని ఇతర ఆనందాలకు దూరం చేశాడు. ఆయన అంటుండేవాడు, ‘పిల్లలు దారి దోపిడీ వాళ్ళలా తయారవకుండా ఉండాలంటే వాళ్ళని గుర్రాన్ని కొరడాతో కొట్టినట్లు అదమాయించాలి.’ ఆయన ఈ సిద్ధాంతాన్ని పాటించి పిల్లల్ని ఎలా పెంచాడంటే, ఈ చిన్న పిల్లాడికి ఆ తరువాత జీవితంలో బియ్యం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తండ్రి చనిపోయాక ఆయన స్థానాన్ని ఎంతగా భర్తీ చేశాడంటే ఎవ్వరూ వాళ్ళిద్దరి మధ్యా తేడా గమనించ లేకపోయారు. చాలామంది ఆ ముసలాయనే అక్కడ కూర్చొని డబ్బు లెక్కిస్తున్నాడు అనుకునేవాళ్లు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచింది. సుబ్బయ్య ఇంటి దగ్గర అయిదు ఆవులు, గేదెలు పెంచగలిగాడు. వాటి పాలు, పెరుగు, వెన్నని అతను, భార్య అయిదుగురు పిల్లలు బాగా అనుభవించి గుండ్రంగా బెలూన్లా తయారయ్యారు. పక్క గ్రామంలో ముప్పై ఎకరాల భూమి సంపాదించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న మనుష్యులకి అధిక వడ్డీకి అప్పులిచ్చి ఓ పది ఇళ్ళు సొంతం చేసుకున్నాడు. వాటి మీద వచ్చే అద్దెలు ప్రతి నెలా తన బ్యాంక్ పొదుపు ఖాతాలోకి వచ్చి పడేవి. సుబ్బయ్య మితి మీరిన డబ్బుతో ఉబ్బిపోయాడు. తన పిల్లల్ని స్కూలుకి పంపి వాళ్లకి కావలసిన బుట్టా వేసిన టోపీలు, వెల్వెట్ కోట్లు కొన్నాడు. రోజూ తన ఇంట్లోని హాలులో దీపం క్రింద కూర్చొని గొంతు చించుకు అరిచే ఒక ప్రైవేటు మాస్టారుని కుదిర్చాడు. ఇంటిపైన పెద్ద గదులున్న ఇంకో రెండు అంతస్తులు కట్టించాడు. రోజంతా ఇనుప గల్లా పెట్టె దగ్గర కూర్చొని, ఒక పక్క దాన్ని చూసుకుంటూ, రెండవ పక్క తన పని వాళ్ళు సంచుల్లో బియ్యం ఎలా కొలుస్తున్నారోనని కన్నేసుంచేవాడు. అది అతనికి పూర్తి సంతృప్తిని, కలతలు లేని జీవితాన్ని ఇచ్చింది. ఆ బియ్యం అమ్మటం, డబ్బులు లెక్కపెట్టుకోవటం నుంచి విశ్రాంతి చెందేది నిద్రపోయే సమయంలో మాత్రమే . ఇలా నిరంతరం కొనసాగకుండా ఉండటానికి ఇతర కారణం కనిపించలేదు. అవే పనులు, ఇష్టాలు జరిగి పోయాయి. డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతూ, దుకాణంలోకి బియ్యం వస్తూ, బయటకి పోతూ జరిగిందే మరల మరల జరగటమే జీవితమైపోయింది సుబ్బయ్యకి. తన తరువాత తన కొడుకుల్లో ఎవరో ఒకడు ఈ కార్యక్రమం సాగిస్తాడని అతని పూర్తి నమ్మకం. జననమరణాలకు, జీవితంలో వచ్చే మార్పులతో సంబంధం లేకుండా నిరంతరం ఇది కొనసాగుతుందని అతని నమ్మకం. కానీ ప్రపంచ యుద్ధం వచ్చాక దీనికి అంతరాయం కలిగింది. సుబ్బయ్య భయపడిపోయాడు. మొదట్లో ఇదే ముగింపు అనుకున్నా, కొంత తేరుకున్నాక ఈ పరిస్థితి అంత భయపడవలసిన విషయంగా అనిపించలేదు. అతని లాభాలు ఇదివరకటిలా కుప్పలుగా పెరగకపోయినా, సైగాన్, బర్మాల నుండి బియ్యం సరఫరా కాకపోవటంతో తన వద్ద ఉన్న సరుకుకు బంగారం విలువ వచ్చింది. ప్రజలు దుకాణం ముందు ఎల్లవేళలా గుమిగూడుతూ గల్లాపెట్టె మూత పడనియ్యలేదు. ఉన్న ఇంటి పక్కనే ఇంకో పెద్ద ఇల్లు కొన్నాడు. దాన్ని గోడౌన్‌గా ఉపయోగించుకొని, ఇంకా కొన్ని గ్రామాలు కూడా కైవసం చేసుకున్నాడు... భార్య ఒంటిమీద నగలు ఒకటి తరువాత ఒకటి, అలా ఇంకా ఇంకా తొడిగాడు. మొత్తానికి రేషనింగ్ వచ్చే వరకూ యుద్ధం సుబ్బయ్యకి చాలా బలంగా ఉపయోగపడింది. అతను జీవితంలో మొదటిసారిగా గాభరాపడి చింతించాడు. తను ఏమి అమ్మాలో, ఎంతకు అమ్మాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని భావించాడు. తనంటే ఇష్టపడే కొద్ది స్నేహితులతో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కేవాడు ‘‘ప్రభుత్వానికేమి తెలుసు వ్యాపారం సంగతి? పన్నులు కట్టుకుంటూ, దొంగల్ని పట్టుకుంటూ, మురికి కాలువలు త్రవ్వుతూ కాలక్షేపం చెయ్యక దీనిలో తల దూర్చటం దేనికి? ప్రభుత్వాన్ని, ఆహార సంస్థలని పరిహాసం చేసే ప్రజల మాటలు విని గొప్పగా ఆనందించేవాడు. వాళ్ళతో పూర్తిగా ఏకీభవించి వాళ్ళతో మొర పెట్టుకునేవాడు, మీలో చదువుకున్నవాళ్ళు ప్రభుత్వానికి అసెంబ్లీలో ఈ విషయాలు తెలియజేసి పుణ్యం కట్టుకోరాదా?. ఇది చాలా అవమానకరం.’’ త్వరలో తెలుసుకున్నాడు, తను ఇంకా మనగలుగుతున్నాడు. కానీ ఇంకో వేషంలోకి మారక తప్పదు. ఆఫీసర్ల కోసం పడిగాపులు కాచి అనేక మందిని కలిసి, ఫారాలని నింపి, చివరికి చౌక ధాన్యం డిపో ద్వారా వ్యాపారం కొనసాగించాడు. అయినప్పటికీ దీనికీ , తన పాత వ్యాపారానికీ ఏ మాత్రం పోలిక లేదు. తన ఊరి పొలాల్లో తన రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వానికి అప్పజెప్పెయ్యాలనే విషయం తెలిసిన తరువాత విచారంగా నిట్టూర్చాడు. ఈ వ్యవహారమంతా దుర్మార్గమనిపించింది. ‘నా పంటకి వాళ్ళు ధర కట్టాలా! నేను పండించుకున్నదాన్ని వాడుకోవటానికి ఒకరి అనుమతి పొందటమా! ఈ ప్రణాళిక అంతా క్రూరంగా బాధించడమే అనిపించింది’ కానీ ఈ పరిస్థితిలో బాహాటంగా ఎక్కువ వ్యతిరేకతని చూపకుండా పరిస్థితులకి తలవంచక తప్పలేదు.అతని జిత్తులమారి మెదడు మాత్రం పనిచెయ్యటం మొదలెట్టింది. అలాంటి ఏ మెదడూ ఎప్పుడూ పనిచేసి ఫలితాలు సాధించక పోలేదు. నిద్ర తక్కువగా పోయేవాడు, భోజనంలో రుచి తెలిసేది కాదు. రాత్రి సమయమంతా అతని మనసు ఈ సమస్యపైనే. చివరికి ఒక పరిష్కారం దొరికింది. తనలోనే బాధ వ్యక్తం చేసుకున్నాడు.– ‘నాకు పొలాల్లో ధాన్యం ఉంది. గోడౌన్లో సంచుల నిండా సరుకు ఉంది. నా తెలివి వుపయోగించి వాటిని వినియోగం చేసుకోకపోతే నేను నాశనమై పోతాను. ప్రభుత్వం మాత్రం ఏమి కోరుతోంది? అది ఏమి చెయ్యాలని అనుకుంటోందో, దాన్ని కాగితం మీద చక్కని రూపంలో ఉంచుతుంది. దానికి చిక్కున పెట్టే తంత్రాంగం ఏదో ఒకటి చెయ్యాలి. దాని విలువ దానికుంటుంది.’ అమ్మకానికి, తన వాడకానికి కావలసిన బియ్యం దాచి, బయటకు కాగితం మీద గాని కనిపించే రీతిలో గాని ఉంచలేదు. తన వద్ద ఉన్న నిలువలు, లెక్కలు పరిశీలించే వ్యక్తులకు అధిక ధనం కుమ్మరించాల్సొచ్చింది. కానీ అందుకు ఏ మాత్రం బాధపడలేదు. అందుకోసం ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే, దాని అర్థం వేయి రూపాయల విలువ గల ధాన్యాన్ని వెదికి చూసే కళ్ళని కప్పి వేసినట్లే. పూర్తి అంగీకారంగానే ప్రజలు డబ్బు ఎంతైనా వెచ్చించి బియ్యం కొనటానికి సిద్ధంగా ఉన్నారు. ధరల నిర్ణయానికి తనే (సోల్ మాస్టర్). ఈ ఆలోచన రాగానే ఈ నిషిద్ధాలు, అదుపులు అన్నీ తనకి ఒక వరం లాంటివే అని తనలో తనే భాష్యం చెప్పుకున్నాడు. తార్కికంగా అనుకున్నాడు, ‘దేవుడు అన్నీ మంచికే చేస్తాడు’ అని. వారానికి రెండు సార్లు కొన్ని అణాలు దానంగా ఇచ్చేవాడు. తన విషయంలో దేవుడు చల్లగా చూస్తున్నందుకు ప్రతి శుక్రవారం గుళ్ళో కొబ్బరికాయ కొట్టి వచ్చేవాడు. క్రమేణా తన పనిలో అనుభవం సంపాదించి అన్ని పరిస్థితులకు తనే యజమానిగా మారిపోయాడు. డిపో దగ్గర హస్త లాఘవంతో బియ్యం కొలిచేటప్పుడు నైపుణ్యాన్ని వినియోగించి ఆ రోజు పూర్తి అయ్యేసరికి ఎవరిదీ కాని కొంత బియ్యం మిగల్చగలిగేవాడు. దుకాణం తెరవటంలో ఆలస్యం, మూసెయ్యటం, తిరిగి తెరవటం లాంటివి పదే పదే చేసి బియ్యం అమ్ముడు అయ్యేందుకు అందరూ తన చుట్టూ తిరిగేట్లు చేసేవాడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తన దగ్గర బియ్యంలేక, తన దగ్గర బియ్యం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా ఉండేవి. ఈ విధమైన నేర్పరితనంతో ప్రతి వారం చాలా మొత్తంలో బియ్యం నిలువ చెయ్యగలిగేవాడు. తన గ్రామం నుంచి మాత్రం పంటలో కొద్ది భాగం మాత్రమే ఆహార సంస్థకు చేరేది. అతి త్వరలో ఇంటి వెనుక వీధిలో ఉన్న ఒక ఇంటిని గోడౌన్‌గా చేసి, దాన్లో బియ్యం బస్తాల్ని నేలమీద నుంచి కప్పు వరకూ ఒకదానిపై ఒకటి పేర్చగలిగాడు. ‘‘నా నామమాత్రమైన భుక్తి కోసం’’ అంటూ ఆ ఇంట్లో కాగితాలు, పాత బస్తాలు ఉంచి అవన్నీ కాగితం మిల్లుకి ఇవ్వటానికి దాస్తున్నట్లు అందరికీ అవగాహనయ్యేట్లు చేశాడు. బియ్యం ఎప్పుడూ తనకి బాగా తెలిసిన ఖాతాదారులకే అమ్మేవాడు. అందులోనూ కొద్ది మొత్తాల్లో మాత్రమే ఇచ్చేవాడు. డబ్బు అడ్వాన్సుగా తీసుకొని తరువాత రమ్మనేవాడు. అందరితో ఒక సందేహం వెలిబుచ్చుతూ ఉండేవాడు ‘ఒకతని వద్ద కొద్ది బియ్యమే ఉన్నాయి. నాకు తెలియదు అతని వద్ద ఇంకా వున్నాయో లేదో. అయితే అయింది, డబ్బు నాకిచ్చి వెళ్ళండి.’ ఒకొక్కసారి ఇచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చి వేసి ‘‘క్షమించండి , ప్రస్తుతం సరుకు అందుబాటులో లేదు, ఆ మనిషి తన దగ్గర ఉందన్నాడు. మీకు తెలుసు ఈ రోజుల్లో ఇలాంటివి ఊహించటం ఎంత కష్టమో!......’’ ఒక రోజు సాయంత్రం మామూలుగా దుకాణం మూసేసి తాళం చెవి జేబులో పెట్టుకొని రోడ్డెక్కాడు. అతని ఎదురుగా ఒక మనిషి ఆగి అన్నాడు,‘‘ఓహ్! నా అదృష్టం కొద్దీ దుకాణం కట్టేశారు’’ వీధిలో నిలబడి మాట్లాడే వాళ్ళని సాధారణంగా సుబ్బయ్య పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ అలా ఎదురుపడ్డ వాళ్ళని తప్పించుకునేవాడు. కారణం వాళ్ళందరూ తన కోసం ఒకే పనిమీద, అంటే బియ్యం కోసమే వచ్చేవాళ్ళు. బియ్యం కోసం వాళ్ళు మొరపెట్టుకోవడం అతనికి విసుగు తెప్పించేది. బియ్యం దొరకనప్పుడు బియ్యం, బియ్యం అని రోజంతా అడిగే బదులు జొన్నో, మొక్కజొన్నో ఎందుకు తినరు? మనుష్యులందరూ బంగారం ఎలా సంపాదించలేరో చాలా మంది బియ్యం కూడా కొనే స్థితిలో ఉండరు. ‘‘ఇప్పుడు నాకు వేరే పని ఉంది. ఇక్కడ ఆగి నీతో మాట్లాడలేను’’ అన్నాడు సుబ్బయ్య. మర్యాద పాటించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను సుబ్బయ్య వెనుకే అడుగులు వేస్తూ వెంబడించాడు. అతను సుబ్బయ్య భుజం పట్టుకొని, ‘‘నువ్వు దుకాణం తెరవాలి, బియ్యం ఇవ్వాలి. నిన్ను నేను వెళ్ళనివ్వను.’’ అతని మాటల్లో తీవ్రతకి సుబ్బయ్య ఆగాడు. ‘‘నా ఇద్దరు పిల్లలు తిండి లేక ఏడుస్తున్నారు. నా ముసలి తల్లి శోష వచ్చి పడిపోయే స్థితిలో ఉంది. వాళ్ళు ఆకలితో మలమలా మాడుతున్నారు. నా రేషన్ కార్డ్ మూడు రోజుల క్రితమే ఉపయోగించాను. ఇంకేమాత్రం వాళ్ళని ఆ స్థితిలో చూడలేను... దయచేసి ఎలాగో అలా బియ్యం ఇయ్యి. ఇవ్వాళ బియ్యం కోసం ఊరంతా తిరిగాను... కానీ ఎక్కడా ఒక్క గింజ కూడా దొరకలేదు. నేను బియ్యం తెస్తానని ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు. వాళ్ళు... దేవుడికే తెలియాలి నేను ఉట్టి చేతులతో వెడితే ఏమి చేస్తారో.’’ ‘‘అయితే ఎంత కావాలి?’’ ‘‘ఒక శేరు ఇప్పించు. ఇంటి దగ్గర ఆరు ప్రాణాలు ఉన్నాయి తినటానికి.’’ సుబ్బయ్య అతన్ని చీదరగా చూస్తూ, ‘‘పెందలాడే ఎందుకు రాలేక పోయావు?’’ అన్నాడు. ‘‘చెప్పాను కదా ఊరంతా తిరిగానని.’’ ‘‘నీ దగ్గర ఎంత ఉంది?’’ అతను అర్ధ రూపాయి తీసి చూపించాడు. ఆ నాణాన్ని సుబ్బయ్య విసుగ్గా చూసి,‘‘దానితో నీకు శేరు బియ్యం వస్తాయనుకుంటున్నావా !’’‘‘కానీ రూపాయకి మూడు శేర్లు వస్తాయి కదా? అవునా, కాదా?’’ ‘‘అదంతా ఇప్పుడు మాట్లాడకు. రేషనింగ్ ధరలు లేదా, ఇంకా అలాంటి అసందర్భపు మాటలు మాట్లాడితే పస్తులు ఉండాల్సి వస్తుంది.’’ ఉద్రేక పడ్డాడు. కడుపు మాడుతున్నప్పుడు కూడా ప్రజలు పిచ్చి పిచ్చి అభిప్రాయాలను పట్టుకొని వేలాడుతుంటారు . ‘‘నీ దగ్గర ఇంకొక అర్ధ రూపాయి ఉంటే చెప్పు, బహుశా ఒక శేరు బియ్యం వస్తాయి’’ సుబ్బయ్య అన్నాడు. బాధపడుతూ అతను తల ఊపాడు, ‘‘ఇది నెలాఖరు, నా దగ్గర ఇదే ఉంది.’’ ‘‘అయితే నీకు ఒక శేరు మాత్రమే వస్తాయి. నాకు తెలిసిన ఎవరైనా ఈ ధరకి ఒప్పుకుంటారు.’’ ‘‘సరే’’ అన్నాడు ఆ మనిషి, ‘‘ఏమీ లేనిదానికంటే నయం’’ ‘‘ఆ నాణాన్ని ఇలా ఇయ్యి’’ సుబ్బయ్య అన్నాడు. ఆ నాణెం తీసుకొని ‘‘నాతో రాకు. అతనున్నాడు చూశావూ, చాలా అనుమానం మనిషి. ఎవరినైనా నాతో చూస్తే వెంటనే వద్దు అంటాడు. నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను. అతను ‘వద్దు’ అంటే అది నీ అదృష్టం మీద ఆధారపడుతుంది. అంతే. నాణెం ఇవ్వు.’’ సుబ్బయ్య ఆ అర్ధ రూపాయి తీసుకొని వెళ్ళాడు. ఆ రెండవ మనిషి వీధి మూల నిలబడ్డాడు. ‘ఎంతసేపు నేనిలా నిలబడాలి?’ అని వెనక్కి తిరిగిన సుబ్బయ్యని అడుగుదా మనుకున్నాడు. కానీ అది అతన్ని చికాకు పరుస్తుందని భయపడి మానుకున్నాడు. తనకొచ్చిన సందేహం తీరింది, ఎందుకనంటే సుబ్బయ్య వెళ్లి మూడు గంటలు పైగా అయింది. ఇంకా అతని జాడ లేదు. రాత్రి బాగా పొద్దు పోయింది. జన సంచారం పలుచబడింది. మనుష్యులు నీడల్లా మాత్రమే కనిపిస్తున్నారు. ఊరు సద్దుమణిగింది. అతను చాలా సార్లు తనలోనే గొణుక్కున్నాడు, ‘‘ఏమి జరిగుంటుంది? సుబ్బయ్య ఎక్కడ? ఎక్కడికెళ్ళి ఉంటాడు అబ్బా! ఇంటికెప్పుడు వెళ్ళాలి, అన్నం ఎప్పుడు వండుకోవాలి? పిల్లలు, ఆహా!’’ వెనక్కి తిరిగి సుబ్బయ్య వెళ్ళిన దిశలోనే నడిచాడు. కానీ గమ్యాన్ని చేరలేకపోయాడు. ఎందుకంటే, సుబ్బయ్య ఆ దిక్కుగా వెళ్ళినట్లు నటించి తన రహస్య గోడౌన్ ఎక్కడో తెలుస్తుందని వేరొక పక్కకి వెళ్ళాడు. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ఉన్న వీధుల్లోంచి పైకి క్రిందికీ తిరిగి, సుబ్బయ్య దుకాణానికి తిరిగి వచ్చాడేమోనని చూడటానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడా లేడు. వేసిన తలుపు తాళం వేసినట్లే ఉంది. ఏమి చెయ్యాలో తోచక గమ్యం లేకుండా ఆ వీధిలోనే తచ్చాడి, చివరికి సుబ్బయ్య ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. సుబ్బయ్య భార్య తలుపు తీసింది. వచ్చింది తన భర్తే అనుకోని ‘ఈ రోజు బాగా ఆలస్యమయింది...’ అని కొత్త మనిషిని చూసి తన తప్పు తెలుసుకుంది. అతను అడిగాడు, ‘‘సుబ్బయ్య ఇంట్లో ఉన్నాడా?’’ ‘‘లేదు ఆయన ఇంకా ఇంటికి రాలేదు.’’ అని కంగారుగా చూసింది. మరుసటి ప్రొద్దున్న ఆరు అయ్యే సరికి వాళ్లకి ధైర్యం సన్నగిల్లింది. ఆమె అడగక తప్పలేదు, ‘‘గోడౌన్ లో చూశావా?’’ ‘‘ అది ఎక్కడ?’’ ఆమెకి చెప్పక తప్పలేదు. ఆమెకు మాత్రమే ఆ స్థలం ఎక్కడో తెలుసు కనుక. వాళ్ళిద్దరూ సందులు దాటుకుంటూ ఒక బిల్డింగ్ దగ్గరికి చేరారు. దాని తలుపు లోపల గడియ వేసి ఉంది. తలుపు కొట్టారు. ఆ ఇల్లు మంచి రక్షణకోసం బలంగా కట్టినది. ఎలుకలు కూడా రాజమార్గంలోంచి మినహా లోపల ప్రవేశించ లేవు. చివరికి ముందు వెంటిలేటర్ బద్దలు కొట్టాల్సి వచ్చింది. గదిలో ఒక మూల టార్చి లైట్ నేల మీద పడి ఉంది. దానికి కొద్దిగా ప్రక్కన అర్ధ రూపాయి నాణెం, ఇంకా కొద్దిగా అవతల గుట్టగా క్రింద పడిపోయి ఉన్న బస్తాల కిందనుంచి ఒక చెయ్యి బయటకి వచ్చి కనిపించింది. విచారణలో తేల్చిందేమిటంటే, ‘ప్రమాదవశాత్తూ బియ్యం బస్తాలు దొర్లి మీద పడటం వల్ల ప్రాణం పోయింది’ అని. - మూలం : డాక్టర్ ఆర్.కె.నారాయణ్ - అనువాదం: వేమవరపు భీమేశ్వరరావు -
కాటేసిన కరువు
ఎండిపోయిన పైర్లు.. బీళ్లుగా మారిన పొలాలు.. కబేళాలకు తరలుతున్న పశువులు, వలస బాట పట్టిన రైతన్నలు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాల్లో ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అన్నదాతలు కరువు కాటుకు చిక్కి విలవిల్లాడుతున్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతటి కరువును తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని రైతులు బోరుమంటున్నారు. దుర్భిక్షం ధాటికి పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం సైతం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంట చేతికి రాక, ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. రాయలసీమ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన పంట భూములు కరువు ధాటికి బీళ్లుగా మారాయి. జూన్ ఆరంభంలో అరకొర వర్షాలకు విత్తిన పైర్లు వాడిపోయాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆలూరు, అనంతపురం జిల్లాలోని కదిరి, గుత్తి, వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు, పెద్దమండ్యం తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన వేరుశనగ పైర్లను ట్రాక్టర్లతో దున్నేస్తున్న దృశ్యాలు కంటతడి తెప్పిస్తున్నాయి. తేమలేక ఎండిపోయిన ఉల్లిని చాలామంది రైతులు పీకకుండానే అలాగే పొలాల్లో వదిలేశారు. టమోటా, మిరప, బెండ తదితర కూరగాయల తోటలు సైతం చేతికి రాకుండా పోయాయి. అప్పులు చేసి వేసిన పంటలు కరువు కాటుకు మట్టిలోనే కలిసి పోవడంతో రైతన్నలు కుమిలిపోతున్నారు. చేసిన అప్పులు భయపెడుతున్నాయి. చాలాచోట్ల తాగడానికి గుక్కెడు నీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. దుర్భిక్షం వల్ల మేత, నీరు సమకూర్చడం కష్టం కావడంతో చాలామంది రైతులు విధిలేని పరిస్థితుల్లో పశువులను కారుచౌకగా కబేళాలకు విక్రయిస్తున్నారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లారీల్లో కబేళాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికే రాయలసీమ నుంచి ఎంతోమంది అన్నదాతలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారు. వేరుశనగ రైతులకు రూ.2,250 కోట్ల నష్టం రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట 90 శాతానికి పైగా ఎత్తిపోయింది. ఇప్పటికే పంట కాలం పూర్తికావడం వల్ల పశువుల మేతకైనా మొక్కలు బాగా పెరిగే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రెయిన్ గన్లతో సెంటు భూమి కూడా ఎండిపోకుండా పంటలను కాపాడామని ఘనంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెయిన్ గన్ల ఊసే మర్చిపోయింది. రాయలసీమలో 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది దీంతో రైతులు రూ.2,250 కోట్ల మేర నష్టపోయినట్లు అనధికారిక అంచనా. మండుతున్న ఎండలు.. వట్టిపోతున్న బోర్లు రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధికారిక గణాంకాల ప్రకారం 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, ఇందులో 90 శాతం పంట ఎండిపోయింది. కర్నూలు జిల్లాలో 50.3 శాతం, అనంతపురం జిల్లాలో 47.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటలన్నీ ఎండిపోయాయి. వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం రాయలసీమలో అక్కడక్కడా కొద్దిపాటి వర్షం పడింది. ఎండిపోయిన పంటలు ఈ వర్షానికి కొంచెం పచ్చగా మారినా మళ్లీ ఎండ తీవ్రత వల్ల వాడిపోతున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చేతికందాల్సిన దశలో ఉల్లిపంట చాలావరకు ఎండిపోయింది. దిగుబడి 25 నుంచి 30 శాతం లోపే వచ్చిందని రైతులు వాపోతున్నారు. వర్షాధారంగా వేసిన పంటలే కాకుండా బోర్ల కింద వేసిన పైర్లు కూడా ఎండిపోతున్నాయి. వరుస కరువులతో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. చందోలిలో నీటికి కటకట కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలో 400 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామస్థులు తాగునీరు దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామంలో గత నాలుగేళ్లలో 14 బోర్లు వేసినా అన్నీ ఎండిపోయాయని, ఒక బోరులో మోటారు వేస్తే కొద్దిసేపు సన్నటి ధార వచ్చి ఆగిపోతోందని సర్పంచి లక్ష్మీదేవి కుమారుడు రంగప్ప తెలిపారు. గ్రామంలోని బోర్ల నుంచి నీరు రానందున గ్రామస్థులు పొలాల్లో కొద్దికొద్దిగా బోర్ల నుంచి వస్తున్న నీరు తెచ్చుకుంటున్నారని, పంటలు ఎండిపోతున్నందున పొలాల యజమానులు అభ్యంతరం చెబుతున్నారని రంగప్ప వివరించారు. గొర్రెలు, మేకలు ఉన్న వారు ఎడ్ల బండిలో డ్రమ్ములు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. సీమలో 51.1 శాతం వర్షంపాత లోటు రాయలసీమలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ) వరకూ రాయలసీమ జిల్లాల్లో 329.2 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 160.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 51.1 శాతం తక్కువ వర్షం కురవడం వల్ల పంటలు ఎండిపోయాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ కరువు తీవ్రత అధికంగానే ఉంది. వర్షాభావం వల్ల పంటలు చేతికి రాలేదు. గుంటూరు జిల్లాలో 16.1 శాతం లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ పల్నాడు ప్రాంతంలో కరువు ఎక్కువగా ఉంది. ఇలాంటి కరువు ఎప్పుడూ చూడలేదు రాయలసీమ జిల్లాల్లో కరువు వల్ల పనులు దొరక్క, ఉపాధి కోసం ఇప్పటికే చాలామంది రైతులు, రైతు కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వలస వెళ్ల లేని వారు గ్రామాల్లో రచ్చబండలు, గ్రామ చావిళుపై కూర్చుని తీవ్రంగా మథన పడుతున్నారు. పెద్దవయసు వారు పొద్దుపోక మేక–పులి ఆట ఆడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలోని సుంకులమ్మ గుడి వద్ద కూర్చున్న కొందరు రైతులను ‘సాక్షి’ పలుకరించగా.. ఇంతటి కరువును తాము ఇప్పటివరకూ చూడలేదని 65 ఏళ్ల వీరన్న, 64 ఏళ్ల తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే మా గ్రామం నుంచి చాలామంది పనుల్లేక వలస వెళ్లారు. త్వరలో పీర్ల పండుగ ఉందని ఆగాం. పండుగ తర్వాత పౌర్ణమికి మేము కూడా బెంగళూరుకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని చందోలి గ్రామంలోని పలువురు రైతన్నలు చెప్పారు. చివరకు అప్పులే మిగిలాయి ‘‘రెండెకరాల్లో పత్తి, ఒకటిన్నర ఎకరాల్లో వేరుశనగ పంటలు వేశా. నీరు సరిపోదనే ఉద్దేశంతో పత్తికి డ్రిప్ పెట్టా. రూ.40 వేలు వెచ్చించి రాళ్లతో పెద్ద తొట్టి కట్టించా. బోరు నుంచి మొదట నీటిని ఈ తొట్టిలోకి మోటారు ద్వారా ఎక్కించి, తర్వాత తొట్టి నుంచి డ్రిప్ ద్వారా పొలానికి అందించి పంటలను రక్షించుకునేందుకు ప్రయత్నించా. దురదష్టవశాత్తూ పత్తి పంట రెండడుగుల ఎత్తు కూడా పెరగకముందే బోరు ఎండిపోయింది. పత్తి, వేరుశనగ పంటలు చేతికి రాలేదు. ఇన్నాళ్లూ నేను చేసిన కష్టమంతా మట్టిపాలైంది. చివరకు అప్పులే మిగిలాయి’’ – కురువ ఆనంద్, పత్తికొండ, కర్నూలు జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి ‘‘వేరుశనగ ఎండిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గత నాలుగేళ్లుగా వర్షాభావంతో పంటలు పండలేదు. ఐదు ఎకరాల్లో వేరుశనగ వేస్తే పూర్తిగా ఎండిపోయింది’’ – చింతల రాయుడు,టీఎన్ పాళ్యం, అనంతపురం జిల్లా రూ.30 వేల పెట్టుబడి మట్టిపాలు ‘‘నాకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ వేశా. ఇందుకోసం రూ.30 వేలు పెట్టుబడిగా పెట్టా. జూన్‌లో కురిసిన వానకు పంట వేశా. ఆ తరువాత చినుకు జాడేలేదు. దీంతో పంటంతా ఎండిపోయింది. కనీసం పశువుల మేతకు కూడా పనికిరాలేదు. పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలైంది’’ – దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, దేవలంపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా -
కేరళలో నదులెండిపోతున్నాయి..!
తిరువనంతపురం: ఇటీవల సంభవించిన భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో ప్రస్తుతం కరువు పరిస్థితి నెలకొంది. పెరియార్, పంపా, కంబనీ నదుల్లో ఎన్నడూ లేనంతస్థాయిలో నీటిమట్టం పడిపోయింది. చాలా జిల్లాల్లో భూగర్భ నీటిమట్టం తగ్గిపోయి బావులు ఎండిపోయాయి. నేలను గుళ్లబారేలా చేసి రైతన్నలకు సాయపడే వానపాముల జాడే లేకుండా పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి తలెత్తడానికి గల కారణాలపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆ రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక పర్యావరణ మండలిని ఆదేశించారు. నీటిమట్టం తగ్గిపోవడంపై రాష్ట్ర జనవనరుల నిర్వహణ సంస్థ, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడంపై నెహ్రూ బొటానిక్ గార్డెన్ అండ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మలబార్ బొటానిక్ గార్డెన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్‌లు అధ్యయనం చేస్తాయని విజయన్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ మేరకు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 491 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
బాబు సర్కార్ అన్నింటా వైఫల్యం!
వైఎస్ఆర్ జిల్లా: చంద్రబాబు సర్కార్ అన్నింటా వైఫల్యం చెందిందని కడప మేయర్, వైఎస్సార్సీపీ నేత సురేష్ బాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద కరవుపై పోరు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, రవీంద్రనాథ్, అంజద్ బాషా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో వైఫల్యం కనబడుతోందని విమర్శించారు. జిల్లాలో 50 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినా ఇంతవరకు సాయం అందించలేదని వెల్లడించారు. నాలుగేళ్లుగా కరవు విలయతాండవం చేస్తుంటే రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే బీమా, బాబు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఆగిపోయిందని అన్నారు. అన్నదాతలకు అండగా కరవుపై పోరాటం చేపట్టామని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ.. జిల్లాకు సాగునీరు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని తెలిపారు. కరువు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. మంచి పరిపాలకుడు ఉంటే భగవంతుడు కరుణిస్తాడని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఉన్నపుడు వర్షాలు పడ్డాయి...బాబు పాలనలో వర్షం జాడే లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమ కరువు కోరల్లో చిక్కుకుందని, రైతులను, ప్రజా సమస్యలను చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. జమ్మలమడుగు వైఎస్సార్సీపీ సమన్వయకర్త సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..ఇంత వరకు జమ్మలమడుగులో ఒక్క విత్తనం కూడా వేయలేదని తెలిపారు. మా దగ్గర ఒక మంత్రి, ఒక విప్, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. వారు ఒక్క రోజు కూడా కరువు గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. మంత్రి సాగునీరు తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని, కేవలం కమీషన్ల కోసం వెంపర్లాట తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. జగనన్న సీఎం అయితేనే రైతులకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. గోవింద రెడ్డి మాట్లాడుతూ..వంద టీఎంసీ నీళ్ల కోసం కడపలో జలాశయాలు కట్టానని చంద్రబాబు అంటున్నారు..మరి ఈ కరువు పరిస్థితి ఎందుకు వచ్చింది చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది మీరు కాదా అని సూటిగా అడిగారు. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారని, ఆయన చర్యల వల్ల రైతులు ఖరీఫ్ సాగు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో సకాలంలో వర్షాలు లేక కనీసం పశువులకు మేత కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. కుందూ నదిలో నెల్లూరుకి 20 వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుందని, ఆ నీటిని తెలుగుగంగ ప్రాజెక్టుకు తరలిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు...ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు... కానీ ఏమైంది బాబు కుమారుడికి మాత్రమే జాజ్ వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్సార్ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమన్నారు. కరవు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న వైఎస్సార్ జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భుజస్కందలపై వేసుకుందని వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు ఆయన బంధువులకు న్యాయం చేస్తున్నారు తప్ప రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు..ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు పూర్తి అనర్హుడు..మంత్రి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు భజన మనుకుని తన సొంత నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. -
సీమలో కరువు..కోస్తాలో వర్షాలు
సాక్షి, అమరావతి: రాయలసీమలో కరువు, కోస్తాలో భారీ వర్షాల పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. భారీ వర్షాలవల్ల రిజర్వాయర్లలో 965 టీఎంసీలకుగాను 550 టీఎంసీల నీరు చేరిందని, ఇంకా 415 టీఎంసీలకు అవకాశం ఉందన్నారు. జల సంరక్షణ చర్యలవల్ల 410 టీఎంసీలు అదనంగా నిల్వ చేయగలిగామన్నారు. గోదావరి నీటిని నాగార్జునసాగర్ కుడికాలువకు మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వైకుంఠపురం ప్రాజెక్ట్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లతో సీఎం శాఖల వారీగా వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిపారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం నుంచి వీలైనంత ఎక్కువ నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించాలని సీఎం సూచించారు. నాలుగేళ్లలో వివిధ రంగాల్లో 511 అవార్డులు సాధించామని, ప్రజల జీవన ప్రమాణాల్లో నాణ్యత పెరగాల్సి ఉందన్నారు. డిసెంబర్ కల్లా అన్ని గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి జనవరిలో జరిగే జన్మభూమిలో ప్రజల ముందు ఉంచాలని సూచించారు. విజన్ డాక్యుమెంట్లు మండల, జిల్లాల వారీగా రూపొందించాలన్నారు. 19 పథకాలకు సంబంధించి నిధుల వినియోగం పెరగాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. జనవరికల్లా మరో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మంజూరై ఇంకా ప్రారంభం కాని 2.44 లక్షల ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలన్నారు. చంద్రన్న బీమా పరిహారం బాధిత కుటుంబాలకు త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ నివేదికల్లో జాప్యం వల్ల బీమా పరిహారం చెల్లింపులో ఆలస్యం జరుగుతోందన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, డీజీపీ ఆర్పీ ఠాకూర్, మంత్రులు నారాయణ, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, లోకేష్, నక్కా ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ ఎంత కరువుందో..వైరల్!
-
ఇదేమి ‘మందా’ ఓరి యలమందా!
సిడ్నీ : ఆస్ట్రేలియాలో మనుషులకేమోగానీ పశువులకు తీవ్రమైన నీటి కరువు వచ్చి పడింది. కాల్వలు, గుంటలు, బావులు ఎండి పోవడంతో అవి బావురుమంటున్నాయి. వాటిని బతికించడం కోసం రైతులు వాటర్ ట్యాంకులు తెప్పించి మరీ వాటి దాహం తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కోసారి వాటర్ ట్యాంకర్ నీటి కోసం కూడా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు వాటిని తోలుకొని పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తన పశువుల దాహం తీర్చేందుకు తాను తరచుగా గంటసేపు వాటితో ప్రయాణించాల్సి వస్తోంది. 1300 పశువులు కలిగిన అంబర్ లియా అనే ఆవిడ మీడియాకు తెలియజేసింది. పశువుల దాహం తీర్చేందుకు తెప్పించిన ఓ వాటర్ ట్యాంకర్ వద్ద దాహం తీర్చుకునేందుకు ఎగబడుతున్న పశువుల మందను ద్రోన్ కెమెరా ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని వీక్షించిన వారికి అక్కడ ఎంత కరువు పరిస్థితులున్నాయో చెప్పకనే తెలుస్తుంది. -
అనంతపురంలో కమ్ముకుంటున్న కరువు మేఘాలు
-
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు
-
వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి
-
‘ప్రచారం మీదున్న శ్రద్ద వ్యవసాయం మీద లేదు’
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వానికి ప్రచారం మీదున్న శ్రద్ద వ్యవసాయం మీద లేదంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు. మీడియా సమావేశంలో కన్నా మాట్లాడుతూ.. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైందని, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేయలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోన్న ఇంతవరకు ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ధ్వజమెత్తారు. కర్నూలు క్వారీలో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
కరువుపై అధికారిక లెక్కలున్నా పట్టించుకోవట్లేదు
-
రెయిన్ గన్స్ ఏమయ్యాయి?
సాక్షి, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా కరువు ఊహించని స్థాయిలో ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్సార్ కడపతో పాటు మరో ఆరు జిల్లాల్లో వర్షపాతం అతి తక్కువగా నమోదైందని తెలిపారు. అయినా కూడా కేబినెట్ భేటీలో కరువుపై చర్చించకపోవడం దారుణమని అన్నారు. వర్షాభావ పరిస్థితులపై అధికారిక లెక్కలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి, సాగు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ నీళ్లు అంటూ గొప్పలు చెబుతున్నా కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని వెల్లడించారు. దాదాపు 20 లక్షల హెక్టార్ల భూమి బీడుగా మారిందని వివరించారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు ఏవని నిలదీశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయరా అని ప్రశ్నించారు. రాయలసీమ పూర్తిగా దుర్భిక్షం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రాయలసీమలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెయిన్ గన్స్ ఏమయ్యాయి? నిలదీశారు. చంద్రబాబు రైతులను పూర్తిగా వంచించారని ఆరోపించారు. -
జాడలేని చినుకు కమ్ముకొస్తున్న కరువు
కడప నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మళ్లీ కరువు మేఘాలు కమ్ముకున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌లో దుర్భిక్షంతో పంటలు పోగొట్టుకుని అప్పుల పాలైన అన్నదాతలు ఈ ఏడాది ఖరీఫ్‌లో పరిస్థితి బాగుంటుందని, పంటలు పండించుకుని నాలుగు రూకలు కళ్లజూద్దామని ఆశపడ్డారు. చినుకు జాడ లేకపోవడంతో అవన్నీ అడియాశలవుతున్నాయి. వర్షాల్లేక సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అరకొరగా అక్కడక్కడా విత్తిన పంటలు కూడా తడిలేక వాడిపోతున్నాయి. తమ బతుకులు బాగుపడేదెలా దేవుడా! అనుకుంటూ వరుణుడి కరుణ కోసం రైతన్నలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీడు భూములు దుర్భిక్షానికి అద్దం పడుతున్నాయి. ఏడు జిల్లాల్లో తీవ్ర కరువు రాయలసీమతోపాటు మొత్తం ఏడు జిల్లాల్లో దుర్భర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపాతం గణాంకాలే ఇందుకు నిదర్శనం. వైఎస్సార్ జిల్లాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జూన్ ఒకటో తేదీతో ఆరంభమైన ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకూ చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో 60 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉంది. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. వేరుశనగ విత్తనం వేసే సీజన్ కూడా దాటిపోయింది. ఈ ఖరీఫ్‌లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఆగస్టు రెండో తేదీ నాటికి 9.6 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది. విత్తనాలు ఆమ్ముకుంటున్న రైతులు వేరుశనగ విత్తడం కోసం రైతులు విత్తనకాయలు కొనుగోలు చేసిన వాటిని వలిచి విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. సీజన్ దాటినా వర్షం జాడ లేకపోవడంతో వేరుశనగ పప్పును కిరాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇక వర్షం పడినా వేరుశనగ సాగుకు అనుకూలం కాదని, సీజన్ దాటిపోయినందున ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అధిక ధరలకు విత్తనకాయలు కొని చౌకగా పప్పులు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షపాతం లోటు రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో 247.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది ఈ నెలల్లో 215.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 2016లో ఇదే కాలంలో 283.2 మిల్లీమీటర్లు, 2017లో 239.9 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఈఏడాది ఇంకా తక్కువ కురిసింది. జూన్‌లో ఒక శాతం లోటు నమోదైన వర్షపాతం జూలైలో ఏకంగా 20 శాతానికి చేరింది. అన్నదాతకు దెబ్బమీద దెబ్బ రాష్ట్రంలో వరుస కరువులు అన్నదాతలను అప్పుల్లోకి నెట్టేస్తున్నాయి. 2016, 2017లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 2017లో ఖరీఫ్‌లో ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించకుండా రైతులకు తీరని అన్యాయం చేసింది. 2016లో అతి తక్కువ మండలాలను కరువు జాబితాలో చేర్చి మోసం చేసింది. ఎండుతున్న పంటలు రాయలసీమ జిల్లాల్లో చినుకు లేకపోవడంతో నామమాత్రంగా సాగైన పంటలు కూడా వాడిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేరుశనగ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పత్తి మొక్కలు వాడిపోయాయి. జొన్న, పెసర తదితర పంటలు కూడా ఎండిపోతున్నాయి. చాలామంది రైతులు పొలాలను దున్ని పదును లేక విత్తనాలు వేయకుండా వదిలేశారు. రాయలసీమ జిల్లాల్లో వర్షాభావం వల్ల భూగర్భ జలమట్టం పాతాళంలోకి పడిపోయింది. బోర్లలో నీరు లేక పండ్ల తోటలు సైతం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు అమ్ముకుంటున్నాం ‘‘వాన కోసం రెండు నెలలుగా ఎదురు చూశాం. కానీ, ఇప్పటికి బలమైన పదును వానలు కురవలేదు. వేరుశనగ సాగు చేయడానికి సిద్ధమైనా వానలు కురవలేదు. ఇక సాగు చేయలేని పరిస్థితి నెలకొనడంతో విత్తనాలలు అమ్ముకుంటున్నాం. గతంలో విత్తనం వేయలేని దుర్భరస్థితి ఎప్పుడు రాలేదు’’ – నాగసుబ్బయ్య, రైతు, కత్తులూరు, వేంపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా నేడు ఉన్నతస్థాయి సమీక్ష ఏడు జిల్లాల్లో ఖరీఫ్‌లో తీవ్ర దుర్భిక్షం నేపథ్యంలో ముఖ్యమైన పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించేందుకు ఏడు జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ మురళీధర్‌రెడ్డి శుక్రవారం కడపలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పడిపోయిన సాగు విస్తీర్ణం అధికారిక గణాంకాల ప్రకారం చూసినా 2016తో పోల్చితే ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు భారీగా పడిపోయింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2016 జూన్, జూలై నెలల్లో 13,93,933 హెక్టార్లలో పంటలు సాగు కాగా, ఈ సంవత్సరం ఇదే కాలంలో సాగు 8,04,844 హెక్టార్లకు పడిపోయింది. 2016తో పోల్చితే 2018లో 5.89 లక్షల హెక్టార్లలో పంట సాగు పడిపోవడం కరువు తీవ్రతను చాటుతోంది. గత ఏడాదితో పోల్చినా సాగు తగ్గిపోయింది. -
మొలకెత్తని ఆశలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : చినుకమ్మ జాడ లేదు.. నేలలో చెమ్మ లేదు.. వేసిన విత్తనం వేసినట్టే ఉంది.. అక్కడక్కడా మొల కెత్తిన విత్తనాలూ ఎండకు మాడిపోతున్నాయి.. ముఖ్యంగా పత్తి పరిస్థితి దారుణంగా ఉంది! మొక్కజొన్న, పండ్లతోటలదీ అదే దుస్థితి. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. అందులో 10 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. అందులో దాదాపు 2 లక్షల ఎకరాల్లో విత్తనం మొలకెత్తలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మొక్క జొన్న సహా ఇతర వాణిజ్య పంటలు 6 లక్షల ఎకరా ల్లో సాగైనా మూడున్నర లక్షల ఎకరాల్లో విత్తనం మొలకెత్తకపోవడమో, మొలకెత్తినా వాడిపోవడమో జరిగింది. నైరుతి రుతుపవనాలు మొదటి వారం మురిపించినా.. తర్వాతి రెండు వారాలు ముఖం చాటేయడంతో విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ రెండు వారాలు ఎండలు వేసవిని తలపించడంతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. పండ్ల తోటలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటలకు నీటి కొరత ఏర్పడింది. మొదట్లో మురిపించి.. రాష్ట్రంలో శనివారం నాటికి ఒకట్రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైంది. అయితే ఇదంతా జూన్ 5–12 తేదీల మధ్యే కురిసిందే కావడం గమనార్హం. ఆ తర్వాత 10 నుంచి 12 రోజులు వేసవిని తలపించాయి. ఆదిలాబాద్‌లో సాధారణ వర్షపాతం 128.7 మి.మీ. కాగా అంతకంటే ఎక్కువగా 181.1 మి.మి. కురిసింది. అయితే ఇందులో 90 శాతం జూన్ 3–10 మధ్యే నమోదైనదే కావడం గమనార్హం. మొదట్లో మోస్తరు వర్షాలు కురవడంతో రైతులు దాదాపు 40 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినా అందులో సగానికంటే ఎక్కువగా మొలకెత్తలేదు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో రైతులు దాదాపు 65 వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న ఇతర వాణిజ్య పంటలు సాగు చేశారు. కానీ ఆ తర్వాత వాన జాడ లేకపోవడంతో దాదాపు 90 శాతం విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ మొలకెత్తిన విత్తనాలు దాదాపుగా ఎండిపోయాయి. శనివారం నాటికి కరీంనగర్లో సాధారణ వర్షపాతం మైనస్ 23 మి.మి., రాజన్న సిరిసిల్లలో మైనస్ 52 శాతం నమోదైంది. సాధారణం కంటే 99 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైన మహబూబ్‌నగర్ జిల్లాలోనూ పంటల పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, వనపర్తి ప్రాంతాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14–23 మధ్య వానల్లేక మొలకెత్తిన విత్తనాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ పడ్డ చిరుజల్లులు పంటలకు కాస్త ఉపశమనం ఇచ్చాయని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అటు వర్షాలు.. ఇటు రైతుబంధు.. మొదట్లో మోస్తరు వర్షాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేలు ఇవ్వడం రైతుల్లో ఉత్సాహం నింపింది. చేతిలో డబ్బు ఉండటంతో మోస్తరు వర్షాలకే రైతులు పంటలు సాగు చేశారు. జూన్ 12 నాటికి రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడానికి రైతుబంధు కారణమని వ్యవసాయ అధికారులు చెపుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ నెల 3–10 మధ్య 144 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో ఆ జిల్లాలో 1.5 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొదట్లో మోస్తరు వర్షాలు కురిసినా తర్వాత వానల్లేక దాదాపు 60 వేల ఎకరాల్లో పత్తి పరిస్థితి డోలాయమానంలో పడింది. ‘‘మొదట్లో మంచి వర్షాలతో రైతులు వెంటనే విత్తనాలు నాటారు. భూమిలో తేమ శాతం పెరిగినప్పుడు విత్తనాలు వేస్తే 15 రోజుల పాటు వర్షాలు రాకపోయినా ఇబ్బంది ఉండదు. కానీ మోస్తరు వర్షాలకే విత్తనాలు నాటితే భూమిలో ఉన్న వేడి అలాగే ఉండటం వల్ల విత్తనం మొలకెత్తదు. రైతులు ఈ విషయంలో రైతుల తొందరపాటు ఇబ్బందిగా మారింది’’ అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు విశ్లేషించారు. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిలోని చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట ప్రాంతాల్లో అప్పుడే మొలచిన పత్తి మొక్కలకు బకెట్ల ద్వారా నీటిని పట్టారని, గడచిన రెండ్రోజులుగా వర్షాలు ప్రారంభం కావడంతో ఇప్పుడు మొక్కలకు ఇబ్బంది ఉండదని ఆ అధికారి చెప్పారు. వాడిపోతున్న పండ్ల తోటలు రెండు వారాల పాటు వానల్లేకపోవడంతో పండ్ల తోటల రైతులు నిరాశలో కూరుకుపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగైదు లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 80 శాతం బత్తాయి సాగు చేస్తున్నారు. కాయ దశలో ఉన్న బత్తాయి ఏపుగా ఎదగాలంటే ప్రస్తుతం నీరు పుష్కలంగా అందించాలి. అయితే జూన్ 10–22 మధ్య వర్షం లేకపోవడం, అంతకు ముందు మోస్తరు వర్షాలే కురవడంతో భూగర్భ జల నీటిమట్టం పడిపోయింది. బోర్లు వట్టిపోయి పండ్ల తోటలు వాడిపోతున్నాయి. -
900 ఏళ్ల నాడు అలా జరిగినందువల్లే..
ఖరగ్‌పూర్ : ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా భాసిల్లిన సింధునాగరికత అంతరించడానికి గల కారణాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 900 ఏళ్లపాటు కొనసాగిన కరువు కారణంగానే 4,350 ఏళ్లక్రితం సింధు నాగరికత తుడిచిపెట్టుకు పోయిందని తెలిపారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల కరువు వచ్చిందని.. కొన్నేళ్ల తర్వాత తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు అక్కడి నుంచి మైదానాలకు వలస వెళ్లారని భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వీరంతా గంగా యమునా లోయ గుండా ప్రయాణిస్తూ ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, దక్షిణ వింధ్యాచల్, దక్షిణ గుజరాత్‌కు చేరుకున్నారన్నారు. ఇందుకు గల ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. జియోలజీ, జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్కు చెందిన పరిశోధకులు.. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని క్రమంగా అది కరువుకు దారితీసిందని తెలిపారు. ఈ పరిస్థితి 9 వందల ఏళ్ల పాటు కొనసాగడం వల్ల అప్పటివరకు సిరిసంపదలతో వర్థిల్లిన సింధు నాగరికత వైభవం కోల్పోయిందని నివేదికలో పేర్కొన్నారు. వారి పరిశోధనకు ఆధారాలుగా లడఖ్‌లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను ఐఐటీ బృందం జతచేసింది. -
కరువు కరాళ నృత్యం
గుడ్లూరు:గుడ్లూరు మండలంలో కరువు కరాళ నత్యం చేస్తోంది. వందలాది మంది కూలీలకు పనులు కల్పిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న అన్నదాతలు ఐదేళ్ల నుంచి కరువు ధాటికి విలవిల్లాడుతున్నారు. పంటలు పండక పోవడంతో వారే కూలీలుగా మారి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. వలస పోయిన రైతులు ఒక్కొక్కరికి 5 నుంచి 10 ఎకరాల భూములు ఉన్నాయి. ఉన్న ఊరిని, నమ్ముకున్న భూమిని వదిలేసి ముఠా కూలీలుగా, హోటళ్లలో సర్వర్లుగా మారారు. కూల్‌డ్రింక్‌లు విక్రయిస్తూ భారంగా జీవనం గడుపుతున్నారు. సోమశిల కాలువ పూర్తి చేసి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు అందించి ఉంటే భూములు బీడుగా మారేవి కావు. రైతులు ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సిన అవసరం ఉండేది కాదు. వలసవెళ్లిన వందలాది రైతు కుటుంబాలు రాళ్లపాడు ప్రాజెక్టు కుడికాలువ కింద గుడ్లూరు మండలంలోని పూరేటిపల్లి, దారకానిపాడు, చెంచిరెడ్డిపాలెం, వెంకంపేట, బసిరెడ్డిపాలెం, రాళ్లపాడు, గుండ్లపాలెం, గుడ్లూరు గ్రామాల్లో 6 వేల ఎకరాల భూమి సాగయ్యేది. వరి, పత్తి పంటలను ఇక్కడి రైతులు పండిస్తారు. ఐదేళ్ల నుంచి సక్రమంగా వర్షాలు కురవకపోవడం వలన ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడంతో పంటలు పండటం లేదు. రాళ్లపాడుకు పూర్తి స్థాయిలో నీరందించేందుకు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలుపెట్టిన సోమశిల కాలువ పనును ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఈ ఏడాది కూడా పంటలు పండకపోవడం వల్ల దారకానిపాడులో 100 కుటుంబాలు, బసిరెడ్డిపాలెంలో 120 కుటుంబాలు, వెంకంపేట, రాళ్లపాడు గ్రామాల నుంచి 70 కుటుంబాల చొప్పున రైతులు పొలాలను వదిలి బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్, విజయవాడ, ఒడిశా, నెల్లూరు, బెంగళూరు పట్టణాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం గుడ్లూరు మండలంలో ఉన్న 28 మేజర్, మైనర్ చెరువులు కింద 5 వేల ఎకరాల్లో పంటలు పండేవి. చెరువులకు కూడా చుక్క నీరు చేరకపోవడం వల్ల చెరువుల కింద ఉన్న మాగాణి భూములు కూడా బీడుగా మారాయి. పాజర్ల, స్వర్ణాజీపురం, అడవిరాజుపాలెం, చినలాటరపి, అమ్మవారిపాలెం గ్రామాల నుంచి వందల మంది ఇతర ప్రాంతాల్లో కూల్‌డ్రింక్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. మండలంలో కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సోమశిల కాలువ పూర్తి అయ్యే వరకు తమ బతుకులు ఇలాగే ఉంటాయని రైతులు మనోవేదనతో చెబుతున్నారు. ఇప్పటికే ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతుండటం వల్ల గ్రామాలు నిర్మానుష్యంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ నెలాఖరుకు అన్ని గ్రామాల నుంచి పనులు కోసం వేలాది మంది వలస బాట పట్టే అవకాశం ఉంది. కొంత మంది మహిళా కూలీలు పనుల కోసం జరుగుమల్లి, టంగుటూరు, పొన్నలూరు, కొండాపురం, కందుకూరు మండలాలకు శనగ కోతలకు వెళ్తున్నారు. మండలంలో గత నాలుగు సంవత్సరాల నుంచి 4,476 హెక్టార్లలో పంటలు పండాల్సి ఉండగా కేవలం 729 హెక్టార్లలో మాత్రమే పంటలు పండుతున్నాయి. ఈ గణాంకాలే మండలంలో కరువు ఎలా తాండవం చేస్తుందో అర్థం అవుతుంది. ముఠా కూలీలుగా బతుకుతున్నారు మాకు నాలుగెకరాల పొలం ఉంది. పంటలు పండకపోవడంతో నా కొడుకు, కోడలు విజయవాడకు వలసపోయారు. ముఠా కూలీలుగా పని చేసుకుని బతుకుతున్నారు. నలుగురుకి అన్నం పెట్టిన మేము ఈ రోజు అదే అన్నం కోసం వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామంలో 120కి పైగా కుటుంబాలు పనుల కోసం వలసపోయాయి. కొంత మంది ఇళ్లకు తాళాలు వేసుకుని పోయారు. కొందరేమో వృద్ధులను ఇళ్ల వద్ద వదిలిపోయారు. – ఈశ్వరమ్మ, బసిరెడ్డిపాలెం కూల్‌డ్రింక్ షాపు పెట్టుకున్నాం రాళ్లపాడు ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో దారకానిపాడులో వంద కుటుంబాలు పనుల కోసం దూర ప్రాంతాలకు వలసపోయారు. కొంతమంది కూల్ డ్రింక్ దుకాణాలు నడుపుకుంటున్నారు. నేను కూడా 4 ఎకరాల భూమిని వదిలి వరంగల్‌లో జ్యూస్ దుకాణం నడుపుకుంటున్నా. అదే సోమశిల కాలువ పూర్తి చేసి ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కావు. ఇప్పటికైనా కాలువ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – హరిబాబు, దారకానిపాడు -
కరువుతో అల్లాడుతున్నా సీఎం పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: గత వానాకాలంలో తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతా ల్లో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయి సాగు, తాగు నీళ్లు లేక చాలా ఊళ్లు అల్లాడుతున్నా సీఎం కేసీఆర్ ఏమీ పట్టనట్టువ్యవహరిస్తున్నారని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. కరువును ముందుగానే అంచ నా చేసుకుని నీటి కష్టాల్లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిపోయి నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 100 మండలాల్లో కరువు నెలకొని ఉన్నా రక్షిత నీటి ప్రాజెక్టులకు రూ.లక్షలు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేకపోవటం దారుణమన్నారు. 12 జిల్లాల్లో రుణాలను రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ అమలు కావటం లేదని, దీనిపై త్వరలోనే తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ అవుతామన్నారు. కరువును అంచనా వేసేందుకు బీజేపీ కిసాన్ మోర్చా నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారని, వారి ద్వారా అందిన వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు. -
పరిహారం..పరిహాసం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులతో జిల్లా యంత్రాంగం తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్, రబీ పంట నష్టం అంచనాలను అధికారులు మొక్కుబడిగా ప్రభుత్వానికి నివేదించగా ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో జిల్లా రైతాంగం మరింత ఆందోళన చెందుతోంది. జూన్ ఒకటినుంచి మే 31 వరకు ఈ ఏడాది సాధారణ వర్షపాతం 871.5 ఎంఎం కాగా గత జూన్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 385.2 ఎంఎం వర్షపాతమే నమోదైంది. రబీలో 43.5 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. జనవరి నుంచి చినుకు లేదు. చెరువులు ఎండిపోయాయి. బోర్లు ఒట్టిపోయాయి. పశ్చిమ ప్రాంతంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పశువులకు మేత, దప్పిక తీరే దారిలేని పరిస్థితి ఉంది. మొత్తంగా 88 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సాగైన పంటలు ఆదిలోనే ఎండిపోయాయి. అరకొరగా పండినా దిగుబడులు తగ్గాయి. గిట్టుబాటు ధరల్లేకపోవడంతో సగం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దీంతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. జిల్లాలో 14 లక్షల ఎకరాలకుపైగా సాగు భూమి ఉండగా ఖరీఫ్, రబీలో రైతులు 10 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, శనగ, మిర్చి పంటలు సాగు చేశారు. ఎకరాకు 30 వేలకు తగ్గకుండా పెట్టుబడులు పెట్టారు. ఇక కౌలు లెక్కలు సరేసరి. రైతులు ఎకరాల్లెక్కన పెట్టిన పెట్టుబడే రూ.3 వేల కోట్లు దాటింది. తీవ్ర వర్షాభావంతో ఇందులో 70 నుంచి 80 శాతం పంటలు చేతికి రాకుండా పోయాయి. ప్రధానంగా గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, మార్కాపురం తదితర పశ్చిమ ప్రకాశం ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మొత్తంగా రైతులు రూ.2400 కోట్లు నష్టపోయారు. అయితే పంట నష్టం అంచనాలను గణించిన ప్రభుత్వ అధికారులు జిల్లాలోని కరువు కింద ప్రకటించిన 55 మండలాల పరిధిలో 1,23,233.58 హెక్టార్లలో అన్ని పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు. 1,65,086 మంది రైతులకు రూ.125,60,36,502 చెల్లించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇందులో ప్రధానంగా 50 వేల హెక్టార్లలో కంది, 25 వేల హెక్టార్లలో శనగతో పాటు పత్తి, మిర్చి తదితర పంటలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అధికారులు పేర్కొంటున్న 1.23 లక్షల హెక్టార్లలో కంది, మిర్చి, పత్తి, శనగ సాగుకు సైతం రైతులు రూ.863 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. అయితే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించింది కేవలం రూ.125 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లో రైతుల పెట్టుబడులు రూ.2,400 కోట్లు ఉన్నాయి. కానీ అధికారులు అంచనాలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేదు. మొక్కుబడిగా అధికారులిచ్చిన గణాంకాలను, దానికి సంబంధించిన పరిహారం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. -
‘బాబు గొప్పలతో రాష్ట్రానికి అన్యాయం’
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగంలో లేని అభివృద్ధిని చూపిస్తూ సీఎం చంద్రబాబు గొప్పలు చెబుతుండడంతో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. ఒకవైపు మునుపటికన్నా సాగుభూమి విస్తీర్ణం తగ్గుతూ పోతూంటే, రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని ఉంటే అసలు అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయరంగం బాగా ఉండేదని, చంద్రబాబు పాలనలో రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతోందని తెలిపారు. -
రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుపోయింది
-
ముంచుకొస్తున్న ముప్పు..!
కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. నీటికరువు వెంటాడుతోంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నోళ్లు తెరుచుకున్నాయి. పశువులు, పక్షులు సైతం నీరు లేక అల్లాడుతున్నాయి. తాగడానికి సైతం నీరు దొరకకపోవడం గమనార్హం. పరిస్థితి ఇప్పుడే ఇలాగుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరువు రక్కసిని తలుచుకుని కకావికలం అవుతున్నారు. చెన్నూర్‌రూరల్ : గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో చెరువులు, కుంటల్లో నీరు అంతంత మాత్రంగానే వచ్చింది.వేసవి కాలం ప్రారంభం కాక ముందే గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు ఎండి పోయి దర్శనమిస్తున్నాయి.దీంతో మూగజీవాలకు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో చెరువులు, కుంటల్లో నీరు లేక బోసి పోతున్నాయి. పశువులకు తాగేందుకు కరువే.. మండలంలోని కత్తెరసాల, చింతలపల్లి, సుద్దాల, కిష్టంపేట, బావురావుపేట, కమ్మరిపల్లి, కాచన్‌పల్లి, కొమ్మెర, పొక్కూరు, ఆస్నాద తదితర గ్రామాల సమీపాల్లోని చెరువుల్లో, నదుల్లో గతంలో ఏడాదంతా పుష్కలంగా నీరుండి మూగజీవాలకు నీరు కరువు ఉండేది కాదు. పగలంతా మేత మేసి సాయంకాలం పశువులు చెరువుల్లో దాహార్తి తీర్చుకునేవి. కానీ గత ఖరీఫ్‌లో వర్షాలు కురవక పోవడంతో వేసవికి ముందే చెరువులు, వాగులు, కుంటలు, నదుల్లో చుక్క నీరు లేకుండా ఇంకి పోయి, అలాగే భూగర్భజలాలు అడుగంటి చివరకు బావుల్లో సైతం చుక్క నీరు లేకుండా కావడంతో పశువులు, కుళాయిలు, చేతిపంపుల వద్ద నీటి బొట్టును వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చుక్క నీరు లేక నదులు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలు కళ తప్పి వెల వెల బోతూ దర్శనమిస్తున్నాయి. పశువులకు తాగేందుకు నీరు సక్రమంగా దొరకడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువులు, కుంటలు ఎండి పోయి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు, కాపర్లు పశువులకు, జీవాలకు తాగునీరందించేందుకు చాలా తిప్పలు పడుతున్నారు. బోరుబావుల దగ్గరికి వెళ్లి పశువులకు తాగునీటిని పెట్టాల్సి వస్తుందని, చెరువుల్లో ఎక్కడో గుంతల్లో ఉన్న నీటిని తాగుతున్నాయని రైతులు, కాపర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నిర్మించిన నీటితొట్లు శిథిలావస్థకు చేరుకోగా, మరి కొన్ని నీరు లేక నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకొని శిథిలావస్థకు చేరుకున్న నీటితొట్లకు మరమ్మతులు చేయించి, నీటితొట్లలోకి నీరు వచ్చే విధంగా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
కరవు, కాంగ్రెస్‌లది అవినాభావ సంబంధం
పచపదరా(రాజస్థాన్): భారీ హామీలు, శంకుస్థాపనలతో ప్రజల్ని మోసగించడం తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రూ. 43,129 కోట్లతో రాజస్థాన్‌లో నిర్మించనున్న బార్మర్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు పనుల్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పేరు కోసం రైల్వే ప్రాజెక్టుల్ని ప్రకటించేవారు. అవి కనీసం వెలుగు చూడలేదు. రాజస్థాన్‌లో కరవు, కాంగ్రెస్‌లు కలిసికట్టుగా సాగేవి, ఆ పార్టీ తప్పుకున్నాక రాష్ట్రానికి కరవు నుంచి విముక్తి దొరికింది’ అని మోదీ పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రూ. 500 కోట్లతో హాడావుడిగా ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ ప్రకటించిందని, కనీసం లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేయలేదని ప్రధాని తప్పుపట్టారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 10,700 కోట్లు చెల్లించిందని చెప్పారు. కాంగ్రెస్ కేవలం గరీబీ హటావో నినాదాలు మాత్రమే ఇస్తే.. దాన్ని సాధ్యం చేసేందుకు పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, 4 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బార్మర్ ప్రాజెక్టు ఘనత తమదేనంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రకటించుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు 2013లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మరోసారి మోదీ శంకుస్థాపన చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. -
ఎడారి చేస్తున్నారు
-
వంశధారతోనే కరువుకు శాశ్వత పరిష్కారం
-
ఈ ఏడాది కరువే?!
235 జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఆయా జిల్లాల్లో కరువు పరిస్థితులు వేసవిలో దారుణ పరిస్థితులు తాజాగా వివరాలు వెల్లడించిన ఐఎండీ సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ ఏడాది కూడా కరువు పరిస్థితులు తలెత్తబోతున్నాయి. రుతుపవనాలు పూర్తిగా విస్తరించినా.. సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో అక్కడక్కడా కుంభవృష్టి కురిసినా.. ఎక్కడా సాధారణం కంటే ఎక్కువగా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 235 జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొనబోతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ ఏడాది రుతుపవనాలు వల్ల సాధారణం కన్నా6.1 శాతం వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వేసవి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో మొత్తంగా 28 శాతం మించి వర్షపాతం నమోదుకాలేదని ఐఎండీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హిందూ, పసిఫిక్ మహాసముద్రాల్లో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాల్లో కదలికలు పెద్దగా లేవని ఐఎండీ ఉన్నతాధికారి శివానంద చెప్పారు. -
'అనంత'లో తాండవిస్తున్న కరువు
-
అప్పులు పెరిగి.. ఆత్మస్థైర్యం కోల్పోయి..
కలసపాడు: వరుస కరువులు.. ఏటా తగ్గిన దిగుబడి.. చేతికొచ్చిన పంటకు గిట్టుబాట్టు ధరలు లేవు..పెట్టిన పెట్టుబడిలో సగం ఫలితం కూడా అందలేదు.. ఆశ చావక ఐదేళ్లుగా వ్యవసాయ జూదంలో అప్పులు చేసి ఓడిపోయిన కౌలు రైతు సీటా విఠలయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. కలసపాడు మండలం చింతలపల్లె పంచాయతీ పరిధిలోని జాతివర్తిపల్లె గ్రామానికి చెందిన సీటా విఠలయ్య వ్యవసా యంపై ఆధారపడి బతుకుతుండేవాడు. గ్రామంలో మోతుబరి రైతుల పొలాలను కౌలుకు తీసుకుని పంటలు వేయడం మొదలు పెట్టాడు. ఐదేళ్ల నుంచి కరువు వెంటాడుతున్నా వ్యవసాయాన్ని మాత్రం వదలలేదు. పైరుకు గిట్టుబాటు ధరలేదు. అప్పులు పెరిగి పోయాయి. రుణదాతల ఒత్తిడి తీవ్రమైంది. విధిలేని పరిస్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పదెకరాల్లో ఎండిన పంటలు: ఈ ఏడాది విఠలయ్య చేసిన అప్పులకు తోడు మరో రెండు లక్షలు అప్పులు చేసి పొలంపై పెట్టుబడులు పెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదెకరాల్లో పత్తి, నాలుగు ఎకరాల్లో సజ్జ ,ఎకరంలో వరి సాగు చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటికీ వర్షాలు లేకపోవడంతో విఠలయ్య వేసిన పంటలు పూర్తిగా ఎండి పోయాయి. దీంతో అప్పులు తీర్చే మార్గంలేక మృత్యు ఒడికి చేరుకున్నాడు. విఠలయ్యకు భార్య వీరమ్మ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పైసా రుణం ఇవ్వని బ్యాంకులు కౌలు రైతులకు అప్పులు ఇస్తున్నామన్న ప్రభుత్వం కౌలు రైతు విఠలయ్యకు మాత్రం పైసా కూడా అప్పు ఇవ్వలేదు. మండలంలో దాదాపు 300 మందికి పైగా ఉన్న కౌలు రైతులకు ఇప్పటికీ కలసపాడులోని ఏ బ్యాంకు రుణం మంజూరు చేయకపోవడం గమనార్హం. -
గిరిజన గోస
♦ అభివృద్ధికి దూరంగా గిరిజన గూడేలు ♦ ఆచరణకు నోచని పాలకుల హామీలు ♦ కోట్లు ఖర్చు చేస్తున్నా దరి చేరని ఫలాలు ♦ నీరు, రోడ్లు, విద్య, వైద్యమూ కరువు ♦ దుర్భర జీవితాలు గడుపుతున్న చెంచులు ♦ గూడేలపై దయ చూపాలని వేడుకోలు పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. వెరసి గిరిజనుల్ని అభివృద్ధికి దూరం చేశాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి.. నాగరికత కొత్త పుంతలు తొక్కుతోంది.. అయినా గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండటం లేదు. గిరిజన సంక్షేమశాఖ చెంచుల అభ్యున్నతి కోసం ఐటీడీఏ ద్వారా కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా కనీసం తాగునీరు, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదు. అక్కడ విద్యుత్ వెలుగులు కనిపించవు.. నేటికీ కిరోసిన్ దీపమే దిక్కు. ప్రభుత్వాలు ఊదరగొడుతున్న స్వచ్ఛత మచ్చుకైనా కనిపించదు. ఆ దిశగా అవగాహన కల్పించడంలో పాలకులకు శ్రద్ధ లేదు. పుల్లలచెరువు మండలంలోని చెన్నపాలెం చెంచులు ఆధునికతకు దూరంగా దయనీయ జీవనం గడుపుతున్నారు. పుల్లలచెరువు : మండల కేంద్రం పుల్లలచెరువుకు 15 కిలోమీటర్ల దూరంలో చెన్నపాలెం చెంచుగూడెం ఉంది. నల్లమల అభయారణ్యంలో ఈ గూడెంలో దాదాపు 80 కుటుంబాలు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నాయి. ఇక్కడ నేటికీ విద్యుత్తు సౌకర్యం, రహదారులు, నివాసం ఉండేందుకు పక్కా గృహాలు కానీ లేవంటే ఆశ్చర్యపోక తప్పదు. వర్షాకాల సమయంలో చెట్ల నీడలోనే ఆశ్రయం పొందుతున్నారు. మొత్తం 80 కుటుంబాలకు ఇక్కడున్న నాలుగు చేతి పంపులే ఆధారం. అవి మరమ్మతులకు గురి అయితే సమీపంలో ఉన్న చెలమ నీరే దిక్కు. గిరిజనుల కోసమే తాము ఉన్నామంటూన్నా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రకటిస్తున్నా ఆ ఫలాలు చెంచులకు చేరడం లేదు. రేషన్ సరుకులకు కాలినడకే.. చెన్నపాలం గిరిజనులు రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఏడు కిమీ దూరంలో ఉన్న గారపెంట చెంచుగూడేనికి కాలినడకనే వెళ్లి తెచ్చుకోవాలి. స్థానికంగా రేషన్ సరుకులు అందించాలని అనేకసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. అనుకోని ఆపదొస్తే వల్లకాటికే.. ఈ గూడేనికి సరైన రహదారి లేదు. అనుకోని అపాయం, అనారోగ్యం సంభవిస్తే వైద్యం అందుబాటులో లేదు. బయట ప్రపంచానికి తెలియకుండానే కాటికి తీసుకెళ్లాల్సిందేనని, ఇంతకు మించి గత్యంతరం లేదని, అత్వవసర పరిస్థితుల్లో ఆకు పసరునే నమ్ముకోవాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. విద్యుత్ వెలుగులు కరువు.. గిరిజన గూడేల్లో కొన్ని సంవత్సరాల కిందట కొంత మేరకు విద్యుత్తు లైన్లు వేశారు. కానీ, అవి నేటికీ పూర్తికాలేదు. దీంతో రాత్రి అయితే అంధకారంలోనే మగ్గాల్సిన పరిస్థితి. ఈ కాలంలోను కరెంటు వెలుగులు కరువయ్యాయని, బయట ప్రపంచం చూడాలంటే 15కిమీ లో ఉన్న పుల్లలచెరువుకు రావాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ జిల్లా అధికారులు గూడేన్ని సందర్శించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని చెంచులు కోరుతున్నారు. -
రైతు మిత్రులు సంత పాలు
కాటేసిన కరువు! పాడి పశువులు ఉన్న ఇంట్లో కరువు కాటకాలకు చోటు ఉండదు’ అనేది సూక్తి. పెద్దవాళ్లు ఈ మంచిమాట చెప్పి పశువును కాపాడితే అది మనిషికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చెప్పేవాళ్లు. ఇంటి పోషణ బాధ్యత పంచుకుని యజమానికి సాయంగా నిలుస్తుందనేవాళ్లు. రైతుకి అసలైన బాంధవ్యం పశువుతోనే. ఆ సూక్తులకు కాలం చెల్లినట్లే ఉంది. పాడి ఆవు, గేదెను బతికించుకోవడానికి గుప్పెడు గడ్డిపరకలు కరువయ్యాయి. వర్షం కూడా జనం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన నగరాలకే పరిమితమవుతున్నట్లే ఉంది. నడిరోడ్లను, భవనాలను చెరువులుగా మారుస్తూ ‘గతంలో ఇవి చెరువులే, చెరువులను ఆక్రమించి భవనాలు కట్టేసుకున్నార’ని గుర్తు చేస్తోంది. ఎండి బీడువారిన నేల మీద నాలుగు చినుకులు చిలకరిస్తే పచ్చగా గడ్డి మొలుస్తుందని వానకు కూడా మనసు రాలేదు చాన్నాళ్లపాటు. దాంతో రైతులు తమ పశువులను సంత పాలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకుం టున్నారు. తనతోపాటు పొలంలో కష్టపడిన ఎడ్లు, ఇంటిని పాడితో కళకళలాడించిన ఆవులు, గేదెలు కళ్లెదుటే ఆకలితో నకనకలాడుతుంటే రైతులు చూడలేకపోతున్నారు. ఎవరైనా ఒక మోపు గడ్డి వేసి వాటి ప్రాణాలను కాపాడుకునే వాళ్లకు అమ్మి అవి క్షేమంగా ఉన్నాయని తృప్తి పడదామంటే అదీ కష్టంగానే ఉంది. కబేళాలో కోసి మాంసాన్ని అమ్ముకునే వ్యాపారి తప్ప పశువును కొనడానికి ఎవరూ రావడం లేదు. వనపర్తి జిల్లా పెబ్బేరు సంతకెళ్తే గుండెను రంపంతో కోస్తున్నంత బాధ కళ్ల ముందు కనిపిస్తుంది. ఇన్ని రోజులు తనతోపాటు కష్టపడిన పశువును వదల్లేక రైతుల ముఖాల్లో ఎంతో దైన్యం. ఎంత కష్టమైనా నీ ఇంటి ముందు కొట్టంలోనే ఉంటానని చెప్పడానికి మాటలు రాక పశువులు మౌనంగా కన్నీళ్లు కారుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాలో పెబ్బేర్ సంతకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు, రైతులు వచ్చి ఎద్దులు, ఆవులు, గేదెలను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు సంతకు వచ్చిన పశువుల్లో అధిక శాతం కబేళాలకు తరలి వెళ్తున్నాయి. వాటిని మేపడానికి మేత లేదు, పశుగ్రాసం కొనడానికి రైతు దగ్గర డబ్బుల్లేవు. పశువులను కొనడానికి సంతకు వచ్చిన వారిలో వ్యాపారులు తప్ప రైతులు ఉండడం లేదు. పశుగ్రాసం కొరతతో... గడ్డి కొని పశువును కాపాడుకుందామంటే... ఒక్క ట్రాక్టర్ ఎండు వరి గడ్డి పదివేలకు పైగానే పలికింది. ఆ పైన రవాణా ఖర్చులు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు మేత కొనలేక పాడి పశువులను పోషించలేక సంతకు తరలించాల్సి వచ్చింది. వాన చుక్క జీవం పోస్తుంది. వాన పడక ప్రాణం తీస్తుంది. – సాక్షి, వనపర్తి నా వల్ల కాలేదు నాకు నాలుగు ఆవులు, రెండు జతల ఎద్దులు ఉన్నాయి. వాటికి మేత లేక ఇబ్బంది పడుతున్నాను. గడ్డి ధర కొనే పరిస్థితి లేదు. ఏమి చేయాలో అర్థం కాక సంతకు తీసుకొచ్చా. వర్షాలు కురిసి పచ్చిక మొలిచే వరకు వాటి ప్రాణాలను కాపాడడం చాలా కష్టం. అవి కడుపు మాడ్చడం ఇష్టంలేక అమ్మేయాలని వచ్చాను. – శ్రీనివాసులు, కాకురాల, గద్వాల గడ్డికొనలేకనే... నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. పత్తి, వేరుశనగ వేశాను. ఒక జత ఎద్దులు, మూడు ఆవులు ఉన్నాయి. వరి పంట వేయకపోవడంతో గడ్డికి తీవ్రకొరత ఏర్పడింది. గడ్డి, దాణా కొనాలంటే అప్పులు చేయాల్సి వస్తోంది. – రామచంద్రయ్య, శేరుపల్లి, వనపర్తి -
చింత తీర్చని చినుకు
► కరుణిస్తున్న వరుణుడు ► సాధారణ వర్షపాతానికి చేరువుగా గణాంకాలు ► వరుస కరువుతో చల్లారని భూతాపం ► ఇంకిపోతున్న జలాలు ► సాగుపై రైతన్న ఊగిసలాట కొద్దిరోజులుగా అడపాదడపా వరుణుడు కరుణిస్తున్నాడు. గతేడాది ఇదే సీజనుతో పోల్చితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు రైతులకు ఆశాజనకమే. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వరుస కరువుతో నెర్రెలిచ్చిన నేలకు ఈ తడి సరిపోవడం లేదు. భూగర్భ జలాలు అందనంత లోతుకు పోయాయి. అందుకే నీరందడం లేదు. సాగు చేద్దామంటే రైతుకు ధైర్యం చాలడం లేదు. మరికొంత వర్షం పడితే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. చిత్తూరు, సాక్షి: వరుసగా రెండేళ్ల కరువుతో భూగర్భజలాలు అథఃపాతాళానికి పడిపోయాయి. సాగునీరే కాదు తాగునీటికి కూడా ఇబ్బంది పడ్డారు ప్రజలు. వర్షాకాలం వచ్చి రెండు నెలలకు పైగా అవుతోంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. కానీ భూతాపం ఇంకా చల్లారలేదు. పడిన నీరు పడినట్లే ఇంకిపోతోంది. ఫలితంగా చెరువులు, కుంటలు నిండటం లేదు. బోర్లలో నీటి మట్టాలు పెరగడం లేదు. జిల్లాలోని చిన్నాచితక రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. జిల్లాలోని తూర్పు మండలాల్లో అధికంగా సాగయ్యే వరిఈసారి సగం కూడా సాగవలేదు. కాకుంటే కొన్ని మండలాల్లో తాగునీటి కష్టాలు మాత్రతీరే అవకాశం ఉంది. మరో రెండు నెలలు వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఇప్పుడు వేసిన పంట, రబీపై ఆశలు పెట్టుకోవచ్చు. 25.36 మీటర్ల లోతులో నీటి మట్టాలు.. జూన్ మొదటి నుంచి ఇప్పటి వరకు సగం వర్షాకాలం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఆగస్టు మొదటి వారం వరకు సాధారణ వర్షపాతం 117.4 మిల్లీమీ టర్లు కాగా 100.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురి సింది. 32 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గుడిపల్లి, చిత్తూరు, కార్వేటినగరం, పెనుమూరు, కేవీబీ పురం, పెదమండ్యం, ములకలచెరువు, తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లో సాధారణం కన్నా 20 శాతం అధికంగా వర్షం కురిసింది. జీడీ నెల్లూరు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం కంటే 67 శాతం తక్కువ కురిసింది. గణాం కాలు చూస్తే సీజన్ అనుకూలంగానే ఉన్నాయి. కానీ భూగర్భజల వనరుల శాఖ జులై నెలాఖరుకు ఇచ్చిన తాజా నివేదిక పరిశీలిస్తే జిల్లాలో దుర్భర పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. జూన్ కంటే ముందు 25.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలం ఇప్పుడు 24.29 మీటర్లలో ఉంది. ఇది 60 శాతానికి తగ్గితే కానీ కష్టాలు తీరవు. గుడిపాల, నిమ్మనపల్లి, పాలసముద్రం, సోమల మండలాల్లో మంచి వర్షం కురిసింది. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో భూగర్భజలాలు ఇంకా సరాసరి 50 మీటర్ల లోతులోనే ఉన్నాయి. గుడిపాల, నిమ్మనపల్లి, పాలసముద్రం మండలాల్లో 27 మీటర్ల నుంచి 22 మీటర్ల వరకు వచ్చింది. అయితే తాగునీటి సమస్య మాత్రం కొంతమేర తగ్గింది. సంక్షోభంలో వరిసాగు.. జిల్లాలోని తూర్పు మండలాల్లో వరి గణనీ యంగా సాగవుతుంది. జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 17 వేల హెక్టార్లు. ఈ సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు కేవలం ఆరు వేల హెక్టార్లలో మాత్రమే సాగయింది. తాజా వర్షాల వల్ల కొన్ని చోట్ల కుంటల్లో నీరు చేరింది. బోర్లు రీచార్జయ్యాయి. ఈ సీజన్‌కు వరకు కొంతమేర పంట సాగు చేసుకునేందుకు ఏ ఇబ్బందీ లేదు. అయినా రైతుల ముఖంలో మాత్రం ఆనందం కనిపించడం లేదు. జిల్లాలో పంటలు సాగయ్యే సాధారణ విస్తీర్ణం 2.11 లక్షల హెక్టార్లు. ఇప్పటి వరకు 1.50 లక్షల హెక్టార్ల మేరకు సాగయింది. 1.04 లక్షల హెక్టార్లు ఆరుతడి పంటలైన వేరుశనగ, ఇతరాలు సాగయ్యాయి. పంటల సాగు సగానికి తగ్గడానికి కారణం ప్రధానంగా భూగర్భజలాలు పాతాళానికి చేరుకోవడమే. -
కరువును తరిమేద్దాం: హరీశ్‌రావు
- గోదావరి జలాలతో తెలంగాణ పునీతం - ఇటు కాళేశ్వరం, అటు శ్రీరాంసాగర్ పునరుద్ధరణ సాక్షి, సిద్దిపేట: ‘తలాపున గోదావరి నది ఉన్నా.. తెలంగాణ ప్రజలు సాగునీటికి, తాగునీటికి అల్లాడి పోయారు. కరువుతో పల్లెలు వల్లకా డులయ్యాయి. ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చింది. గోదావరి నీళ్లు మన బీడు భూములకు మళ్లిద్దాం. కరువును తరిమేద్దాం’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా లోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో వేసిన మొక్కజొన్న పంటలు మాడిపోతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కూడా కాళేశ్వరం వద్ద 220 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఇలా వృథాగా వెళ్తున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే 22 లక్షల ఎకరాల భూములను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు తోపాటు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సొరంగమార్గం ద్వారా కాల్వలు నిర్మించి రెండేళ్లలో సాగునీటిని అందించేందుకు పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయన్నారు. వలసలు నిర్మూలించి పల్లెలకు పాత కళ తెచ్చేందుకు కుల వృత్తులను ప్రోత్స హిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడు తోందన్నారు. గొల్లకురుమలకు సబ్సిడీ గొర్రెలు అందచేస్తున్నామని, దీంతో పల్లెల్లోనే సంపదను సృష్టించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. సామూహిక గొర్రెల పాకలు ఏర్పాటు చేస్తాం.. కులవృత్తులను నమ్ముకొని జీవించే వారు కలసికట్టుగా ఉంటారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో సామూహిక గొర్రెల పాకలను ఏర్పాటు చేస్తామని, ఊరికి చెందిన గొర్రెల మందలన్నీ ఇక్కడే ఉంటాయని ఆయన చెప్పారు. ఈ మేరకు సిద్దిపేట రూరల్ మండలంలో ఆయన శనివారం గొర్రెల పాకను ప్రారంభించారు. రాష్ట్రంలోనే ఇది మొదటిదని, త్వరలో రాష్ట్రమంతటా ఇటువంటివి నిర్మిస్తామన్నారు. వర్షాలు సకాలంలో పడాలంటే పల్లెలు పచ్చగా ఉండాలని, అందుకోసం ప్రతీ ఒక్కరు హరిత ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. -
ఖటీఫ్
వేరుశనగ విత్తకు ఇక ఐదు రోజులే! ఇప్పటికీ 20 శాతం మించని సాగు వర్షాభావంతో అల్లకల్లోలంగా వ్యవసాయం జిల్లాలో వర్షం తుంపర్లు, చిరుజల్లులకే పరిమితం సాగులోని పంటలు కూడా ఎండుముఖం ‘ప్రత్యామ్నాయానికి’ వ్యవసాయ శాఖ చర్యలు ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం : 8.00 లక్షల హెక్టార్లు ఇప్పటి వరకు సాగు : 1.62 లక్షల హెక్టార్లు వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం : 6.04 లక్షల హెక్టార్లు ఇప్పటి వరకు సాగు : 1.33 లక్షల హెక్టార్లు సాధారణ వర్షపాతం : 120 మిల్లీమీటర్లు ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం : 83 మిల్లీమీటర్లు అనంతపురం అగ్రికల్చర్: చినుకు రాలక పంటల సాగు పడకేసింది. ప్రకృతి కరుణించకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సీజన్లో 8లక్షల హెక్టార్లలో వర్షాధార పంటలు సాగులోకి రావాల్సి ఉండగా.. వర్షాభావంతో ఇప్పటికీ 20 శాతం మించలేదు. 6.04 లక్షల హెక్టార్లలో వేరుశనగ వేస్తారని అంచనా వేయగా.. 22 శాతంతో 1.33 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. మిగతా పంటలు 2లక్షల హెక్టార్లలో వేసే అవకాశం ఉందని అంచనా వేయగా.. అవి కూడా 20వేల హెక్టార్ల వద్దే నిలిచిపోయాయి. క్రాప్ బుకింగ్ చేస్తే కచ్చితమైన వివరాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా రైతుల బలం, బలహీనతగా పరిగణించే ప్రధాన పంట వేరుశనగ విత్తుకు నెలాఖరు వరకూ సమయం ఉంది. ఆ తర్వాత వేసినా ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆగస్టులో ప్రత్యామ్నాయ పంటలే ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే జొన్నలు, రాగులు, ఉలవలు, పెసలు, అలసంద, కొర్ర, సజ్జ తదితర పంటలు ఎన్ని వేసినా 2 నుంచి 3లక్షల హెక్టార్లకు మించకపోవచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత సీజన్లో 3 నుంచి 4లక్షల హెక్టార్లు బీళ్లుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ముఖం చాటేసిన నైరుతి ఎన్నో ఆశలు పెట్టుకున్న నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో వర్షాలు పడలేదు. నైరుతి రాకమునుపే అంటే.. జూన్ 8వ తేదీలోగా జిల్లాలో మంచి వర్షం కురిసింది. ఆ తర్వాత తేలికపాటి నుంచి తుంపర్లకే పరిమితమైంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా.. 59 మిల్లీమీటర్లకు మించలేదు. పంటల సాగుకు కీలకమైన జూలై నెలలో 67.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 23 మి.మీ., నమోదైంది. నాలుగు రోజుల కిందట రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసినా ‘అనంత’లో తుంపర్లు, చిరుజల్లులకే పరిమితం కావడం.. ఇక వర్షం వస్తుందనే నమ్మకం కూడా రైతుల్లో సన్నగిల్లింది. 22 మండలాల్లో మోస్తరుగా పంటల సాగు జూన్‌లో అక్కడక్కడ కురిసిన మోస్తరు వర్షాలకు 22 మండలాల్లో మాత్రమే కొంత వరకు వేరుశనగ పంటలు విత్తుకున్నారు. తాడిమర్రి మండలంలో అత్యధికంగా 11వేల హెక్టార్లు, ఆత్మకూరులో 10వేల హెక్టార్లు, కనగానపల్లిలో 9,200 హెక్టార్లు, గుడిబండలో 7,600 హెక్టార్లు, చెన్నేకొత్తపల్లిలో 6,600 హెక్టార్లు, బ్రహ్మసముద్రంలో 6,500 హెక్టార్లు, గుమ్మగట్టలో 6వేల హెక్టార్లు, బత్తలపల్లిలో 5,300 హెక్టార్లు, నల్లమాడలో 5,200 హెక్టార్ల విస్తీర్ణంలో విత్తనం పడింది. బుక్కరాయసముద్రం, బుక్కపట్టణం, కొత్తచెరువు, ముదిగుబ్బ, ఓడీ చెరువు, తనకల్లు, చిలమత్తూరు, గుత్తి, పామిడి, ధర్మవరం, ఉరవకొండ, గుంతకల్లు, అమరాపురం, మడకశిర, కుందుర్పి, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల్లో మోస్తరుగా వేరుశనగ వేశారు. మొత్త మ్మీద ధర్మవరం వ్యవసాయ డివిజన్లో 36వేల హెక్టార్లు, కదిరి డివిజన్లో 20వేల హెక్టార్లు, అనంతపురం డివిజన్లో 16వేల హెక్టార్లు, మడకశిర డివిజన్లో 15వేల హెక్టార్లు, కళ్యాణదుర్గం డివిజన్లో 12వేల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. మిగతా డివిజన్లు, మండలాల్లో నామమాత్రంగా పంట వేశారు. మిగతా పంటల విషయానికొస్తే కంది 13వేల హెక్టార్లు, పత్తి 8,500 హెక్టార్లు, మొక్కజొన్న 2,600 హెక్టార్లు, ఆముదం 1,600 హెక్టార్లు, జొన్న 1,300 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు వందల హెక్టార్లకే పరిమితమయ్యాయి. అన్ని రకాల పంటలు కలిపి తాడిమర్రి, ఆత్మకూరు మండలాల్లో 12వేల హెక్టార్ల చొప్పున వేశారు. వేసిన పంటలు కూడా ఎండుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నెలాఖరుకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఆగస్టులో పంటసాగుకు పంపిణీ చేయడానికి వీలుగా ఈనెలాఖరుకు ప్రత్యామ్నాయ విత్తనాలు తెప్పించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. 5.50 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం ఇప్పటికే 67వేల క్వింటాళ్లతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక కమిషనరేట్‌కు పంపినట్లు చెప్పారు. అందులో ఉలవలు 31,623 క్వింటాళ్లు, జొన్నలు 18,974 క్వింటాళ్లు, కొర్రలు 6,325 క్వింటాళ్లు, అలసందలు 3,795 క్వింటాళ్లు, పెసలు 3,795 క్వింటాళ్లు, రాగులు 1,265 క్వింటాళ్లు, పొద్దుతిరుగుడు 1,265 క్వింటాళ్లు అవసరమని నివేదించామన్నారు. -
కరువు, చంద్రబాబు కవలలు
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ - మునగాలలో ఇంటింటి ప్రచారం నంద్యాలరూరల్: కరువు, చంద్రబాబు కవల పిల్లల్లాంటి వారని పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కవల పిల్లల మధ్య విడదీయరాని సంబంధం ఉంటుందని, ఇదే తరహాలో చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ కరువు ఉంటుందని తెలిపారు. మండల పరిధిలోని మునగాల గ్రామంలో శనివారం సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇటు వర్షం రాక, అటు కాల్వకు నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామ రైతులు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో రైతులు కరువు కాటకాలతో అల్లాడి పోయారన్నారు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. అరకొరగా పండిన పంటలకు సైతం గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు మంచి రోజులు రావన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని, చంద్రబాబు మాత్రం రూ. 5వేల కోట్లు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఆ ఊసెత్తలేదన్నారు. వైఎస్సార్ పాలనలో రైతులు కరువును చూడలేదని, మళ్లీ రాజన్న రాజ్యం వచ్చేలా రైతులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తండ్రి బాటలో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి రైతుల అండదండలు ఎంతో అవసరమన్నారు. అధికారంలోకి వస్తే చిన్న, సన్న కారు రైతులకు నాలుగేళ్లపాటు ఏటా రూ.12,500 చొప్పున ఇచ్చేందుకు ప్లీనరీలో హామీ ఇచ్చారని చెప్పారు. చెప్పిన మాట అమలు చేయడం జగన్‌కే సాధ్యమన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో సౌమ్యుడు, పరిపాలన అనుభవం ఉన్న శిల్పామోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు పునాది వేయాలని కోరారు. ప్రచారంలో పీలేరు, సత్యవేడు, పూతలపట్టు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, సునిల్‌కుమార్, వేపంజరి వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆదిమూలం, నాయకులు ఖలీల్ అహమ్మద్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు విజయశేఖర్‌రెడ్డి, పురుషోత్తమరెడ్డి, పోలూరు మహేశ్వరరెడ్డి, మునగాల మాజీ సర్పంచ్ నాగపుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
తీవ్ర కరువుంటేనే కేంద్ర సాయం
- కేంద్ర మార్గదర్శకాల్లో ‘మధ్యస్థ కరువు’ కేటగిరీ ఎత్తివేత - ఫలితంగా విపత్తు సాయానికి భారీ కోత పడే అవకాశం సాక్షి, హైదరాబాద్: కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తీవ్ర కరువు, మధ్యస్థ కరువు, సాధారణ కరువు కేటగిరీలున్నాయి. వాటిల్లో మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు రెండు కేటగిరీలే ఉంటాయి. ఇక సాధారణ కరువు అంటే కరువు లేనట్లేనని ప్రకటించే అవకాశముంది. మధ్యస్థ కరువు ప్రాంతాలన్నీ కూడా సాధారణ కరువు కేటగిరీలోకి రానున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంటే తీవ్ర కరువుగా గుర్తిస్తే తప్ప ఆయా రాష్ట్రాల రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సాయం వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎటువంటి స్పందనా తెలియపరచలేదని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. 6 అంశాల ఆధారంగా కరువు నిర్ణయం కేంద్ర నిబంధనల ప్రకారం ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుం టారు. అందులో 1) వర్షాభావ పరిస్థితులు, 2) వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్), 3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ), 4) నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యూఐ), 5) సాగు విస్తీర్ణం, 6) దిగుబడుల లెక్క. వీటిలో ఐదు అంశాలు అనుకూలంగా ఉంటే కరువుగా ప్రకటిస్తారు. ఒక్కోసారి సడలింపులు ఇస్తా రు. అప్పుడు నాలుగింటిని గీటురాయిగా తీసుకుంటారు. ఇక వర్షపాతం విషయానికి వస్తే 50 శాతానికి తక్కువగా ఉండాలి. వర్షానికి వర్షానికి మధ్య 21 రోజులకు మించి అంతరం ఉండాలి. సాగు విస్తీర్ణాన్నీ లెక్కి స్తారు. పంటల దిగుబడి 50 శాతానికి పడిపోవాలి. పశుగ్రాసానికి కొరత ఏర్పడాలి. అందులో ఇప్పటివరకు మధ్యస్థ, తీవ్ర కరువు ఉన్నప్పుడు కరువు మండలాలు ప్రకటించారు. ఆ ప్రకారం కేంద్రం సాయం ప్రకటించేది. ఇకనుంచి కరువు సాధారణంగా ఉంటే ఆయా మండలాలను లెక్కలోకి తీసుకోరని అధికారులు అంటున్నారు. మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేయడం వల్ల కరువు మండలాలు తగ్గే అవకాశముందని అంటున్నారు. మొత్తంగా తీవ్ర కరువు పరిస్థితులను ఈ ఆరు అంశాల తీవ్రతను బట్టి నిర్ణయిస్తారని తెలుస్తోంది. కాగా కొత్త మార్గదర్శకాలపై ఇప్పటికే కర్ణాటక అభ్యంతరాలు వ్యక్తంచేసింది. మధ్యస్థ కరువు కేటగిరీని ఎత్తివేయడం వల్ల రాష్ట్రాలే తమ సొంత ఖజానా నుంచి రైతులకు సాయం చేయాల్సి వస్తుంది. కేంద్ర మార్గదర్శకాల్లో మధ్యస్థ కరువుకు అవసరమైన సాయాన్ని రైతులకు రాష్ట్రాలే చేయాలని పేర్కొనడంపైనా విమర్శలు వస్తున్నాయి. -
నేటి నుంచి ఇన్పుట్ సబ్సిడీ పత్రాల పంపిణీ
– ప్రభుత్వ ప్రచారానికి వ్యవసాయశాఖ కర్నూలు(అగ్రికల్చర్): 2016 కరువుకు సంబంధించి జిల్లాలోని 26 మండలాలకు రూ.325 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. ఇందుకు సంబంధించి రైతులకు ఈ నెల 22 నుంచి 28 వరకు 26 కరువు మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సభలు నిర్వహించి 3,10,766 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తూ బుధవారం ప్రొసీడింగ్స్ వచ్చాయని, జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొని సబ్ డివిజన్ ఏడీఏలకు విడుదల చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అంటే రైతులకు పత్రాలు పంపిణీ చేసినా పరిహారం బ్యాంకు ఖాతాలకు జమ కావడానికి రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇన్పుట్ సబ్సిడీ మంజూరు పత్రాల పేరుతో ప్రభుత్వం ప్రచారం కోసం వ్యవసాయ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏఏ రైతుకు ఎంత ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది అనే వివరాలు పత్రాల్లో లేవు. వ్యవసాయాధికారులే అక్కడికక్కడ రాసి రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. -
లీకువీరులెవరు?
వ్యవసాయ అధికారులపై సీఎం ఆగ్రహం సాక్షి, అమరావతి: పంటల బీమాకు, పెట్టుబడి రాయితీని లింకు పెట్టి రైతులకు రూ.500 కోట్లు శఠగోపం పెట్టేందుకు సర్కారు జారీ చేసిన కుట్ర ఉత్తర్వులు బయటకు పొక్కడం పట్ల వ్యవసాయ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలా రహస్య సమాచారం బయటకు వెళుతుంటే ఏమి చేస్తున్నారు? లీకు వీరులెవరో నిఘా వేయండి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి. ఎవరు పడితే వారు మీడియాతో మాట్లాడకుండా కట్టడి చేయండి..’ అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారికి సీఎం హకుం జారీ చేశారు. ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కు తీసుకోని పక్షంలో జిల్లా, డివిజనల్ కేంద్రాల్లో రైతులతో ధర్నాలకు దిగుతామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించడంతో చంద్రబాబు సర్కారు దిగి వచ్చి వెనక్కు తగ్గిన విషయం విదితమే. పంటలబీమా, పెట్టుబడి రాయితీ వేర్వేరుగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని శనివారం సీఎం ఇచ్చిన ఆదేశం మేరకు వ్యవసాయ అధికారులు తాజాగా ఆదివారం కొత్త మార్గదర్శకాలు తయారు చేశారు. రాయలసీమ నాలుగు జిల్లాల్లోని రైతులకు రూ.1597.51 కోట్ల పెట్టుబడి రాయితీ, రూ. 534 కోట్ల పంటల బీమా కలిపి మొత్తం 2131.51 కోట్లు, కోస్తాలోని ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పంటలు కోల్పోయిన రైతులకు రూ.82.51 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని వ్యవసాయ అధికారులు గణాంకాలు రూపొందించారు. ఆధార్ ఆధారిత రైతుల బ్యాంకు ఖాతాలకు పెట్టుబడి రాయితీ, పంటలబీమా మొత్తాలను ఆన్లైన్ ద్వారా జమ చేయాలంటూ మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ ఆయా జిల్లాల అధికారులకు ఆదివారం జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో కరువు బాధిత రైతులకు పాత నిబంధనలు (ఈనెల 13వ తేదీన జారీ చేసిన మెమో) ప్రకారమే పెట్టుబడి రాయితీ పంపిణీ చేయాలి. రాయలసీమ జిల్లాల రైతులకు మాత్రం ఆదివారం జారీ చేసిన కొత్త మెమో ప్రకారం పంటల బీమా, పెట్టుబడి రాయితీ ఇవ్వాలంటూ వ్యవసాయశాఖ పంపిన ఈమెయిల్ ఆదేశాలు ఆదివారం క్షేత్రస్థాయి అధికారులకు అందాయి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సులో ఈ అంశంపై మాట్లాడతారని, తర్వాత పెట్టుబడి రాయితీ, పంటల బీమా మొత్తాలను రైతుల ఖాతాలో ఆన్లైన్ ద్వారా జమ చేసే కార్యక్రమం ఆరంభిస్తారని రాయలసీమ జిల్లాకు చెందిన ఒక కలెక్టరు తెలిపారు. -
19 నుంచి ఇన్పుట్ సబ్సిడీ పత్రాల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): 2016 కరువుకు సంబంధించి 26 మండలాల్లో ఇన్పుట్ సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం జిల్లాకు రూ.325 కోట్లు మంజూరు చేసింది. అయితే నిధులు మాత్రం విడుదల కాలేదు. ముందుగా 26 మండలాల్లో ఏ రైతుకు ఎంత ఇన్పుట్ సబ్సిడీ మంజూరైంది.. తదితర వివరాలతో పత్రాలు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ఇన్పుట్ సబ్సిడీ పత్రాలు పంపిణీ చేస్తారని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. అయితే రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ భీమా పరిహారాలు వస్తే ఇందులో ఏది ఎక్కువగా ఉంటే దానిని మాత్రమే ఇస్తారు. -
ఇన్పుట్ సబ్సిడీ విడుదల
- 2014 సంవత్సరంలో పంట నష్టం - ఐదు మండలాలకు రూ.73,24,66,362 విడుదల కర్నూలు(అగ్రికల్చర్): 2014 సంవత్సరంలో ఎంపికైన కరువు మండలాలకు ఎట్టకేలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో 20 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా.. పత్తికొండ, చిప్పగిరి, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు మండలాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మండలాల్లో 82,058 మంది రైతులు 75,515.26 హెక్టార్లలో పంటలు కోల్పోయారు. వీరికి పెట్టుబడి రాయితీ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.73,24,66,362 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ పరిహారాన్ని గత ఏడాదే విడుదల చేయగా, ట్రెజరీలో బిల్లులు ల్యాప్స్ అయ్యాయి. ఇందువల్ల ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది. -
‘కరువు, చంద్రబాబు కవలలు’
నెల్లూరు: కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు విఫలమైందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కరువు, చంద్రబాబు కవల పిల్లలని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలోనే నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. కృష్ణా పోర్టుకు శంకుస్థాపన చేసి చంద్రబాబు చేతులు దులుపుకుంటే ఆ పనులను వైఎస్సార్ పూర్తి చేశారని గుర్తు చేశారు. సోమశిల జలాశయ సామర్థ్యాన్ని 72 టీఎంసీలకు పెంచింది వైఎస్సారేనని తెలిపారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. -
రాయలసీమ బంద్ : నిలిచిన ఆర్టీసీ బస్సులు
-
కమలం కరువు భేరి
► తుమకూరులో శ్రీకారం ► హాజరైన కేంద్రమంత్రులు ►పార్టీలో విభేదాల్లేవు: యడ్డి తుమకూరు: తమ మధ్య ఎటువంటి విభేదాలు, అంతర్గత కలహాలు లేవు, పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో మేమంతా కలిసే పాల్గొంటున్నాం, రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందంటూ వచ్చిన వార్తలు కేవలం మీడియా సృష్టేనని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ మురళీధర్‌రావు, ఇతర సీనియర్ నాయకులు 40 రోజుల రాష్ట్రవ్యాప్త కరువు పర్యటనను గురువారం తుమకూరులో ఆరంభించారు. తుమకూరు సిద్ధగంగా మఠాధీశుడు శివకుమార్స్వామీజీ దర్శనం చేసుకున్నారు. అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 రోజుల పాటు అన్ని జిల్లాలు, తాలూకాల్లో పర్యటించి కరువుపై సమాచారాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. నిత్యం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కరువు అధ్యయన పర్యటన సాగుతుందని చెప్పారు. పార్టీలో ఎలాంటి అనైక్యత లేదని తేల్చిచెప్పారు. త్వరలో సిద్ధగంగ మఠానికి ప్రధాని మోదీ కేంద్రమంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ.. ఇటీవల అనారోగ్యానికి గురైన శివకుమార్స్వామీజీ ఆరోగ్యంపై విచారించిన ప్రధాని నరేంద్రమోదీ త్వరలోనే మఠానికి వచ్చి స్వామీజీని దర్శించుకుంటారని తెలిపారు. రాష్ట్ర కరువు నివారణ అధ్యయన పర్యటనను స్వామీజీ ఆశీర్వాదంతో తుమకూరు జిల్లా నుంచి ప్రారంభించడం సంతోషకరమన్నారు. అనంతరం తుమకూరు నగరంలోని దళితవాడలో కరువు నివారణ, తాగునీరు తదితర సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి రమేశ్ జిగజణగి, నేతలు జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్ప, శోభ, శ్రీరాములు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వం మెడలు వంచుతాం’
అనంతపురం అర్బన్ : ‘చంద్రబాబుకు రాయలసీమ కరువు, ఇక్కడి రైతులు, కూలీలు, ప్రజల కష్టాలు కనిపించడం లేదు. కరువు గురించి కనీసం మాట్లాడటం లేదు. రైతులను ఆదుకోకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అవసరమైతే రాయలసీమలోని నాలుగు జిల్లాల బంద్ చేపడతాం. అంతిమంగా ప్రభుత్వం మెడలు వంచుతామ’ని సీపీఎం, సీపీఐ నాయకులు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో 30 గంటల ‘కరువుపై రాయలసీమ బైఠాయింపు’ కార్యక్రమాన్ని చేపట్టారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు వి.రాంభూపాల్, డి.జగదీశ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబుళేసు, మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి పాల్గొని.. ప్రసంగించారు. సీఎం చంద్రబాబు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు తప్ప సీమ రైతులను ఆదుకుందామనే కనీస స్పృహ లేదని మండిపడ్డారు. రెయిన్గన్ల ద్వారా ఆరు లక్షల ఎకరాల్లో పంటను కాపాడామంటూ రైతులను, ప్రజలను మోసం చేశారన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా దగా చేశారని, ఉపాధి కూలీలకు సీమలో రూ.250 కోట్ల బకాయిలను చెల్లించలేదని తెలిపారు. కరువు, పంటలకు గిట్టుబాటు ధరలపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడటం లేదని, దీన్ని బట్టి చూస్తే ఆయనకు ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. రాయలసీమలో ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ రాలేదని, ఒక్కరికీ ఉద్యోగం కల్పించింది లేదని అన్నారు. రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, లేదంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల సీపీఎం, సీపీఐ నాయకులు చలమయ్య, రామాంజినేయులు, ఈశ్వరయ్య, షడ్రక్, జిల్లా నాయకులు ఎంవీ రమణ, కాటమయ్య, జాఫర్, నారాయణస్వామి, మల్లికార్జున, నాగేంద్ర, లింగమయ్య, సీపీఐ ఎంఎల్ నాయకుడు పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. -
వారి కళ్లకు కరువు కనిపించదు
విశ్లేషణ తరచుగా నేను బెంగళూరు వెళుతూ ఉంటాను. సంవత్సరానికి కనీసం నాలుగు సార్లయినా వెళతాను. ఇన్ని పర్యాయాలు ఆ నగరానికి వెళ్లినా, కర్ణాటక తీవ్ర దుర్భిక్షంతో నకనకలాడుతున్న సంగతి ఏనాడూ నా అనుభవానికి రాలేదు. మహా నగర జీవితమంటేనే అంత కాబోలు. అక్కడికి ముప్పయ్ కిలోమీటర్ల దూరంలోనే కరువు తాండవిస్తున్న సంగతి సంకేతప్రాయంగా కూడా అవగతం కాదు. 176 తాలూకాలలో 139 కంటే ఎక్కువ తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారని నాకు చెప్పారు. ఇంకా విషాదం ఏమిటంటే, గడచిన పదహారు సంవత్సరాలలో పదకొండేళ్లుగా కర్ణాటక రాష్ట్రం కరువుతో అలమటిస్తున్నది. ‘అనంత’ కరువు ఆంధ్రప్రదేశ్లోనిదే అయినా బెంగళూరుకు కూతవేటు అవతలే ఉంది అనంతపురం జిల్లా. ‘న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’(ఏప్రిల్ 28)లో వెలువడిన ఒక వార్తా కథనం నా కళ్లల్లో నీళ్లు రప్పించింది. ‘మా నాన్న వచ్చాడా?’– ఇది అప్పుడే స్కూలు నుంచి వచ్చిన 12 సంవత్సరాల దివాకర్ వేసిన ప్రశ్న. ఇందుకు పినతండ్రి ఈశ్వరయ్య, ‘రాలేదు, వచ్చే నెలలో వస్తాడు. వచ్చేటప్పుడు నీకు బెంగళూరు నుంచి బోలెడు బొమ్మలు తెస్తాడు’ అని జవాబిచ్చాడు. అంతే, చేతిలోని పుస్తకాల సంచీ చిరాకుగా విసిరేసి, యూనిఫారమ్ మార్చుకుని, తన సైకిల్ వేసుకుని తాళాలు బిగించి ఉన్న ఇళ్ల మధ్య నుంచి సాగుతున్న వీధిలోకి వెళ్లిపోయాడు. జిల్లా కేంద్రం అనంతపురం గురించీ, ఆ జిల్లాలోని పల్లెలు ఎలా వెలవెలపోతున్న తీరు గురించి వివరిస్తూ జర్నలిస్ట్ హరీశ్ గిలాయ్ రాసిన కథనం మరొకటి. అది గ్రామీణ భారతపు విషాదాన్ని వెల్లడించే కథనం. అయితే దీనిని ఎవరూ చదవరు. ఆ జిల్లాలోని నల్లమాడ మండలం, కూటపల్లి గ్రామం స్మశానాన్ని మరపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సగానికి పైగా ఇళ్లకు తాళాలు కనిపిస్తాయి. అక్కడ అటూ ఇటూ తిరుగుతున్న పెద్దలు కనిపిస్తారు. లేదంటే వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. నిజనిర్ధారణ సంఘం తరఫున వెళ్లిన అదితి మాలిక్, గీతికా మంత్రిల నివేదిక (ది న్యూస్ మినిట్, మే 9) మన గుండెలను కదిపి కుదిపే వాస్తవాలను వెల్లడిస్తుంది. కొంతమంది తమ పిల్లలను కూడా అక్కడే వదిలిపెట్టి, కూలీనాలీ వెతుక్కుంటూ ఎలా వలసపోయారో ఆ నివేదిక చెప్పింది. భూక్యా శ్యాములమ్మ వయసు పన్నెండేళ్లు. అనంతపురం జిల్లా కరెడ్డిపల్లి గ్రామంలోనే ఉండి తన తమ్ముడినీ, చెల్లెలినీ పోషిస్తోంది. బక్కపలచగా ఉండే శ్యాములమ్మ పక్క ఊళ్లో ఉన్న చౌకధరల దుకాణం నుంచి పాతిక కిలోల బియ్యం మోసుకువస్తుంది. ఆమె తండ్రి తాగుడుకు బానిసై గత ఏడాదే చనిపోయాడు. అందుకే ఆ కుటుంబానికి ఆమే దిక్కయింది. ఇది బాలీవుడ్ సినిమాలో దృశ్యంలా కనిపించవచ్చు. కానీ అదొక వాస్తవిక చిత్రమన్న సంగతిని మనం మరిచిపోరాదు. ఆ గ్రామానికే చెందిన రమాదేవి కథ కూడా అంతే. తల్లిదండ్రులు ఇద్దరూ పని వెతుక్కుంటూ కేరళ వెళ్లారు. ‘కొన్నిసార్లు నా రక్షణ గురించి నాకు భయమేస్తూ ఉంటుంది’అని చెప్పింది రమాదేవి. ఇంట్లో ఆడపిల్ల ఒక్కర్తిని విడిచిపెట్టి తల్లిదండ్రులు పనుల కోసం వెళ్లిపోయారంటే ఆ కరువు ఎంత భయంకరమైన స్థాయిలో ఉంటుంది? అన్న ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ వాళ్లకు మరో మార్గం లేదు. తల్లిదండ్రులు ఎవరైనా కూడా తమ బిడ్డలను వదిలిపెట్టి దూరంగా ఉండాలని అనుకోరు. ఇదికూడా హాలీ వుడ్ సినిమా హోమ్ ఎలోన్‌లోని దృశ్యం కాదు. ఇలా వందలమంది చిన్నారులను వదిలిపెట్టి ఎందరో పనులు వెతుక్కుంటూ వలస వెళ్లారు. వరసగా ఆరో సంవత్సరం కూడా అనంతపురం జిల్లా కరువు బారిన పడింది. దైవభూమి దృశ్యం దైవభూమిగా ఇంకెంత మాత్రం చెప్పడానికి వీలుకాని కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో నివశించే కుటుంబాలు వారానికి 10 నుంచి 15 బకెట్ల నీటితో జీవనం సాగిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (మే 8)లో వార్తా కథనం రాసిన షుజా ఫిలిప్ అట్టప్పాడి గురించి కళ్లకు కట్టారు. అక్కడ నిరుడే కాదు, ఈ సంవత్సరం కూడా కరువు తాండవిస్తోంది. నిజానికి కేరళ గడచిన 115 సంవత్సరాలలో ఏనాడూ చూడనంత కరువును ఇప్పుడు చూస్తోంది. 2016 అక్టోబర్‌లోనే ఆ రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించారు. కానీ, ఆ రాష్ట్రంలోని నగరాలు తిరువనంతపురం గానీ, కోచి గానీ, లేదంటే కోజికోడ్ వెళితే ఇంత దారుణమైన కరువు కాటకాలు తాండవిస్తున్నాయన్న సంగతి మచ్చుకైనా తెలియదు. ఇక తమిళనాడులోని కరువు ప్రాంతాలలో ఐదురోజులు పర్యటించిన తరువాత స్వరాజ్ అభియాన్ ప్రముఖుడు యోగేంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో క్షోభను వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దారుణమైన నిర్లక్ష్యం అక్కడి యంత్రాంగాన్ని పూర్తిగా స్తంభించిపోయేటట్టు చేసింది. దీనితో రాష్ట్రంలో బలవన్మరణాలు పెరి గాయి’’ అని ఆయన రాశారు. అలాగే, ‘‘పశువుల మరణాలు రాష్ట్రంలో కరువు పరిస్థితికి సూచనలు’’అని కూడా యాదవ్ రాశారు. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర కొద్ది రోజుల క్రితం వరకు కొందరు తమిళనాడు రైతులు చేసిన దీక్షకు మీడియాలో పెద్ద చోటే దక్కింది. రూ. 40,000 కోట్ల మేరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్‌తో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. కానీ ఇది జాతిని కదిలించలేకపోయింది. ‘‘ఇది మునుపెన్నడూ లేని పరిస్థితి’’అని వ్యవసాయ వాతావరణ పరిశోధన విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎస్. పన్నీర్‌సెల్వం ‘ఇండియా స్పెండ్’తో చెప్పారు. తమిళనాడులోని 32 జిల్లాలకు గాను 21 జిల్లాలు కరువు కోరలలో చిక్కుకున్నాయని ఆయన వెల్లడించారు. గడచిన 140 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడనంత కరువును ప్రస్తుతం ఆ రాష్ట్రం అనుభవిస్తోంది. కానీ ఈ రాష్ట్రంలో కూడా అంతే. చెన్నై లేదా కోయంబత్తూరు, మరేదైనా ఇతర నగరానికి వెళ్లండి! అసలు ఆ నగరాలకి కొద్దిదూరంలోనే కరువు కరాళ నృత్యం చేస్తున్న ప్రాంతాలు ఉన్న సంగతి కాస్త కూడా తెలియదు. నగరాలకు సమస్యలెందుకు రావు? మరొక అంశం కూడా నాకు వింతగా అనిపిస్తుంది. ఈ కరువుకాటకాలెప్పుడూ పల్లెప్రజలనే ఎందుకు ప్రధానంగా పట్టి పీడిస్తాయి? ఎంతో అరుదుగా తప్ప నగరాల జోలికీ, పట్టణాల జోలికీ ఆ దుర్భిక్షం ఎందుకు తాకదు? ఇందుకు నేను దేవుణ్ణి నిందించను. ఆయన అంత పక్షపాతంగా అయితే ఉండడు. ఎలాంటి తప్పు లేకున్నా పల్లెల్లో నివశిస్తున్న ప్రజలను దేవుడు శిక్షించడని నేను చెబుతాను. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలే కరువు కాటకాలకు ఎందుకు లక్ష్యంగా మారుతున్నారు? గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోని లాతూర్ ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు. కానీ చెన్నై సంగతి అలా కాదు. అక్కడ ఏర్పడిన నీటి కరువును తట్టుకోవడానికి ఆ నగరం నీళ్లను మోసుకొచ్చే రైళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే కరువు నీటి సమస్యను మాత్రమే తీసుకుని రాదు. దానితో ఇంకా అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అయితే అవేవీ నగరాల అనుభవంలోకి రావు కూడా. ఇదంతా ఏమిటంటే, అభివృద్ధి క్రమం చోటు చేసుకున్న అసమతౌల్యత ఫలితమే. అసలు అభివృద్ధి విధానమే నగరాలు, పట్టణాలు కరువు పరిణామాల బారిన పడని రీతిలో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. గ్రామాలు, పట్టణాల మధ్య విభజన సుస్పష్టం. దుర్భిక్షం ద్వారా తలెత్తే పరిణామాల బారిన పడకుండానే నగరవాసులకు పూచీ పడినట్టు ఉంటుంది. గ్రామాల గుండా ప్రవహించే కాలవలు, నదులు ఎండిపోతుంటాయి. కానీ నగరాలలో కుళాయి నీరు మాత్రం ఎలాంటి దుర్భర పరిస్థితులలో కూడా రోజులో ఉదయం కొన్ని గంటలు, సాయంత్రం కొన్ని గంటల పాటైనా ధారగా ప్రవహిస్తూనే ఉంటుంది. న్యూఢిల్లీ తనకు అవసరమైన నీటిని హిమాచల్ ప్రదేశ్‌లోని రేణుకా డ్యాం నుంచి తెచ్చుకుంటుంది. అలాగే ముంబై నగరం సమీపంలోని పశ్చిమ కనుమల నుంచి తెచ్చుకుంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాలు సమస్యలతో ఎంత సతమతమవుతున్నా ఈ నగరాలు ఏమీ పట్టనట్టే ఉండిపోతున్నాయి. పట్టణవాసులు, నగరవాసులు తమదైన ప్రపంచంలో తేలియాడుతూ ఉంటారు. తాము నివశిస్తున్న పట్టణానికీ లేదా నగరానికీ S కొద్దిదూరంలోనే ఉన్న కష్టాలను వారు గమనించరు. మన నాగరిక ప్రపంచం మనలని అలాంటి ధోరణికి తీసుకువెళ్లింది. సెల్ఫీల ప్రపంచంలో స్వార్థం తారస్థాయికి చేరుకుంది. వ్యాసకర్త: దేవిందర్‌శర్మ వ్యవసాయ నిపుణులు ఈ మెయిల్ : hunger55@gmail.com -
సీమ ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వ నిర్లక్ష్యం
- మేల్కోకపోతే రైతులకు కన్నీళ్లే - సీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ఉయ్యాలవాడ : కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమకు నీటి వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సీమలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఆదివారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న నంద్యాల పట్టణంలో తలపెట్టిన జలచైతన్య సభను విజయవంతం చేయాలని కోరారు. నీటి వాటాలపై చట్టబద్ధత కోసం పార్టీలకతీతంగా పోరాటానికి రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాల పంపకాల్లో సీమకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజనతో మరుగున పడిన దుమ్మగూడెం ప్రాజెక్ట్ చేపడితే సీమకు 165 టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకుల స్వార్థ రాజకీయాలతో రాబోయే కాలంలో ప్రజలు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జల చైతన్య సభకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు ఆరికట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎన్‌రెడ్డి, ఉయ్యాలవాడ, అల్లూరు, నర్సిపల్లె గ్రామాల సర్పంచ్‌లు మిద్దెసుబ్బరాయుడు, ఆరికట్ల శివరామకృష్ణారెడ్డి, పల్లెమద్దిలేటిరెడ్డి, ఉప సర్పంచ్ కూలూరు రామకృష్ణారెడ్డి, దండే ఆదినారాయణరెడ్డి, ఖాతా దస్తగిరిరెడ్డి, గాండ్లశేషయ్య పాల్గొన్నారు. -
కరువు గోస.. వలస బాట
మళ్లీ ముంబైకి తరలుతున్న పాలమూరు జనం రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో ఖాళీ అవుతున్న పల్లెలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధ దంపతుల పేర్లు లీల్యానాయక్, మణికిబాయి. వీరిది మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం పల్లెగడ్డతండా. వారి కుమారుడు కిషన్‌నాయక్, కోడలు శాంతాబాయి. మూడెకరాల భూమి ఉంది. మూడేళ్లుగా సరైన వర్షాల్లేక పంటలు పండటం లేదు. ఉపాధి హామీ పనులను నమ్ముకుంటే ఇక్కడ బతకలేమంటూ.. కిషన్‌నాయక్, శాంతాబాయి తమ ఇద్దరు పిల్లలను తీసుకుని కూలి చేసుకునేందుకు రెండు నెలల కింద ముంబై వలస వెళ్లారు. ఇప్పుడు లీల్యానాయక్, మణికిబాయిలు పింఛన్ మీదే ఆధారపడి బతుకుతున్నారు సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాను కరువు కాటేసింది. ఉన్న చోట పనులు దొరకక.. చేసిన అప్పులు పెరిగిపోతుండటంతో జనం వలసబాట పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో పనిచేయగిలినవారంతా ముంబైకి కూలి పనులకు వెళుతున్నారు. పనిచేయలేని వృద్ధులు మాత్రం కళ్లలో ప్రాణాలు పెట్టుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. దీంతో పాలమూరు పల్లెలన్నీ బోసిపోయాయి. జిల్లాలోని మద్దూరు, కోయిల్‌కొండ, నవాబ్‌పేట, ధన్వాడ, మరికల్, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు మండలాల ప్రజలు రోజూ 200 నుంచి 250 మంది ముంబై, పుణె వంటి నగరాలకు వలసబాట పడుతున్నారు. ఇప్పటివరకు 20 వేల మందికిపైగా వలస వెళ్లినట్లు అంచనా. రోజూ వందల మంది.. అధికారిక సమాచారం ప్రకారమే మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నిత్యం 200 మందికిపైగా వలస వెళ్తున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య రెండింతలు ఉంటుందని అంచనా. మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో నారాయణపేట, వనపర్తి డిపోల రోజూ రెండు ఆర్టీసీ బస్సులు ముంబైకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ బస్సుల ఆక్యుపెన్సీ రేటు 72 శాతంగా ఉంది. నిత్యం సుమారు 100 మంది వాటిలో వెళుతున్నారు. ఇక కోయిల్‌కొండ నుంచి నిత్యం రెండు తుఫాన్ వాహనాలు, నారాయణపేట నుంచి ప్రైవేటు మినీ బస్సులు ముంబైకి వెళుతున్నాయి. మరికొందరు రైలుమార్గం ద్వారా వెళ్తున్నారు. ఇలా రోజూ 250 మంది వరకు నాలుగు నెలల్లో 20 వేల మంది వలసబాట పట్టినట్లు సమాచారం. ఆదుకోని ‘ఉపాధిహామీ’ జిల్లాలో ఉపాధి హామీ పనులు కూడా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 2.89 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 6.23 లక్షల మంది సభ్యులున్నారు. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరానికి కేవలం 2 కుటుంబాలు మాత్రమే వందశాతం పనిదినాలు పూర్తి చేశాయి. రోజు కూలీ సగటున కేవలం రూ.132 మాత్రమే రావడం, అది కూడా నెలల తరబడి వేచిచూడాల్సి రావడమే దీనికి కారణం. అదే బయట కూలీ పనికి వెళితే రోజుకు రూ.300 వరకు వస్తున్నాయి. దీంతో పాలమూరు వాసులు ముంబై, పుణె వంటి వంటి నగరాలకు వలసవెళ్తున్నారు. పంటలే లేవాయే.. జిల్లాలో పంటల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పడిపోయింది. వర్షాకాలంలో వరి సాధారణంగా 38 వేల హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా.. ఈసారి 20 వేల హెక్టార్లలోనే సాగైంది. పత్తి కూడా 56 వేల హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా.. 23 వేల హెక్టార్లలో మాత్రమే వేశారు. యాసంగి (రబీ)లో వరి 24 వేల హెక్టార్లలో సాగుకావాల్సి ఉండగా 21 వేల హెక్టార్లలో.. వేరుశనగ 28 వేల హెక్టార్లలో సాగు కావాల్సిఉండగా.. 16 వేల హెక్టార్లలోనే సాగైంది. ఇలా పంటల సాగు పడిపోవడంతో వ్యవసాయ రంగంపై ఆధారపడిన కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో వలసబాట పడుతున్నారు. సాగుచేసే వీలులేకనే వలస మూడెకరాల పొలం ఉన్నా బోర్లు ఎండిపోయాయి. ఉన్న ఊరిని వదిలి పుణెకు వలస వెళ్తున్నాం. పదిహేను సంవత్సరాలుగా అక్కడ ఓ మేస్త్రీ దగ్గర టైల్స్ వేసే పనులు చేస్తున్నాం. ఏడాదిలో రెండుసార్లు పండుగలకు ఊరికి వచ్చి ఇంటిని, కుటుంబ సభ్యులను చూసి వెళ్తాం. ప్రభుత్వ సహకారం ఉంటే మాకు ఇక్కడ చేసేందుకు పని దొరుకుతుంది. ఇలా వలస వెళ్లే పరిస్థితి రాదు. – పిన్యానాయక్, బుద్ధారం, ధన్వాడ, మహబూబ్‌నగర్ బీఈడీ చదివి మట్టిపని చేశా మా నాయన నన్ను కష్టపడి చదివించాడు. టీటీసీ, బీఈడీ రెండూ పూర్తి చేసిన. డీఎస్సీ నోటిఫికేషన్ పడుతదని చూసి, చూసి అలిసిపోయిన. కిందటి విద్యా సంవత్సరంలో మద్దూరులో ప్రైవేటు స్కూల్లో పనిచేస్తే నెలకు రూ.3 వేలు ఇస్తమన్నరు. చేసేదేమీ లేక ముంబై వెళ్లి మట్టిపని చేశా. ఇప్పుడు గురుకుల పోస్టులు పడ్డయని తెలిసి.. వచ్చి ప్రిపేర్ అవుతున్నా. పాలమూరు జిల్లాను కరువు అలుముకుంది. గిరిజనుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.. – సురేశ్‌నాయక్, పల్లెగడ్డతండా, మద్దూరు -
యూరోప్ కాలుష్యంతో.. అనంతలో కరువు
-
సమస్యలపై ఏ‘కరువు’
హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలి రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలివ్వాలి విత్తన వేరుశనగ సబ్సిడీ చాలట్లేదు పండ్లతోటలకు రక్షక తడులు అందించాలి జిల్లా అభివృద్ధి సమీక్షలో ప్రజాప్రతినిధుల వినతి అనంతపురం అర్బన్ : రైతులు పంటలు కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని, నీటి ఎద్దడితో జనం అల్లాడిపోతున్నారని, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు ఏకరువు పెట్టారు. ఆదివారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్, గ్రామీణ గృహనిర్మాణ, సమాచార శాఖమంత్రి కాలవ శ్రీనివాసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. గుంతకల్లు మండలం వైటీ చెరువు తెప్ప ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు పంటరుణాలు రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్రసాయం, పంటల బీమా కలిపి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామంటున్నారని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సాయం ప్రకటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. కరువును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఇలాగైతే రైతుల కష్టాలు ఎలా తీరుతాయని మండిపడ్డారు. హంద్రీనీవా ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిపై లోతుగా చర్చించాలని కోరారు. ఇన్చార్జి మంత్రి స్పందిస్తూ ట్రయల్‌రన్ నిర్వహించి హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇన్చార్జి మంత్రి బాధ్యతలు తీసుకున్నాక.. పరిచయం చేసుకుందామని ఇక్కడికి వచ్చానని, త్వరలో మరో సమావేశం నిర్వహించి అన్ని సమస్యలపైనా విస్తృతస్థాయిలో చర్చిస్తానని చెప్పారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ, విత్తన వేరుశనగకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సరిపోవడం లేదని, దీనికి తోడు విత్తన నాణ్యత కూడా లేదని తెలిపారు. సైలేజ్ గడ్డిని పశువులు తినడం లేదని, రైతులు కోరిన గ్రాసాన్ని అందజేయాలని సూచించారు. పండ్లతోటలకు రక్షక తడులు అందించి కాపాడాలని, నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని తదితర సమస్యలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం దృష్టికి తెచ్చారు. ఇన్చార్జి మంత్రి దేవినేని మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి రథానికి రెండు చక్రాలు లాంటివారన్నారు. సమష్టిగా జిల్లాను అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. భైరవానితిప్ప, పేరూరు ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. హంద్రీ నీవా కాలువ వెడల్పు కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నామని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయన్నారు. ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, గోనుగుంట్ల సూర్యానారయణ, వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వీరన్న, జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, కత్తినసింహారెడ్డి, శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి, కలెక్టర్ జి.వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఇంకుడు గుంతల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. అనంతపురంలో రైతులు నానాకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. కరువును తట్టుకోలేక పెడ్డ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కరువు నివారణ చర్యలు చేపట్టి రైతులకు ఉపాధి మార్గం చూపించాలని డిమాండ్ చేశారు. కరువు దెబ్బకు బ్రతకుదెరువు కోసం లక్షల మంది రైతన్నలు పొట్టచేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసవెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. అనంతపురంలో హంద్రీనీవ పెండింగ్ పనులను, డిస్టిబ్యూటరీలను త్వరితగతిన పూర్తిచేసి ఆయకట్టు ద్వారా రైతులకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
తమిళనాడులో స్తంభించిన జనజీవనం
-
తమిళనాడులో స్తంభించిన జనజీవనం
చెన్నై: రైతులకు మద్దతుగా అఖిలపక్షాల ఆధ్వరంలో జరుగుతున్న రాష్ట్ర బంద్ తో మంగళవారం తమిళనాడులో జనజీవనం స్తంభించింది. దుకాణాలు, హోటళ్లు మూతబడ్డాయి. ఆటో, వ్యాన్, లారీ, ప్రైవేటు వాహనాల సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. రాజధాని చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా థియేటర్లలో ప్రదర్శనలు, షూటింగ్‌లు ఆగిపోయాయి. రైల్ రోకోలు, రాస్తారోకోలకు డీఎంకే నేతృత్వంలోని అఖిల పక్షం సిద్ధమైంది. తమిళ మానిల కాంగ్రెస్, బీజేపీ, పీఎంకేలు బంద్‌కు దూరం అని ప్రకటించగా, ఎండీఎంకే మాత్రం తటస్థంగా వ్యవహరిస్తోంది. డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకేల అనుబంధ రవాణా సంస్థలు బంద్ ప్రకటించడంతో ప్రభుత్వ బస్సుల సేవలు ఆగే అవకాశాలు ఉన్నాయి. ఆటో, వ్యాన్, లారీ, ప్రైవేటు వాహనాల సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించడంతో ఆ సేవలు ఆగినట్టే. అన్ని రకాల సేవల నిలుపుదలతోపాటుగా, తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేసే విధంగా రైల్‌రోకోలు, రాస్తారోకోలు సాగించేందుకు నేతలు సిద్ధం అయ్యారు. తిరువారూర్‌లో జరిగే నిరసనకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేతృత్వం వహించనున్నారు. అన్ని రకాల సేవలు బంద్ కానున్న నేపథ్యంలో అన్నా కార్మిక సంఘం ద్వారా బస్సుల్ని రోడ్డెక్కించేందుకు రవాణా మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్ చర్యలు చేపట్టారు. బస్సుల మీద ప్రతాపం చూపించే యత్నం చేస్తే కఠినంగా వ్యవహరింస్తామని హెచ్చరికలు చేశారు. ఈ బంద్‌ను అడ్డుకునే విధంగా రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. లక్షల మంది సిబ్బంది భద్రతా విధుల్లో నిమగ్నం అయ్యారు. ఈ బంద్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ వ్యతిరేకించారు. బంద్ ముసుగులో శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇక, ఢిల్లీలో నిరసనకు విరామం ఇచ్చిన రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలోని 70 మంది అన్నదాతలు చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఉదయం చెన్నైకు చేరుకునే ఈ బృందం రైల్ రోకో చేయాలని నిర్ణయించడంతో చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బంద్ నేపథ్యంలో రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉందని చాటుకునే రీతిలో ఆగమేఘాలపై పంట బీమా నష్ట పరిహారం పంపిణీకి సీఎం ఎడపాడి కే పళనిస్వామి చర్యలు తీసుకోవడం గమనార్హం. సోమవారం సాయంత్రం సచివాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురు రైతులకు పరిహారం పంపిణీ చేశారు. -
ఎరువులే రైతు గుదిబండలు
అభిప్రాయం పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లు.. ఈ మూడింటి భారం దించిన రోజున సేద్యం దండగ కాదు పండగే అవుతుంది. వ్యవసాయం బతుకు దెరువు మాత్రమే కాదు. అది పల్లె జీవన విధానం. మట్టి మనుషుల సంస్కృతి. దేశ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) వ్యవసాయం వాటా 16 శాతం మాత్రమే కానీ దేశ జనాభాలో 53 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. వ్యవసాయం పండగ కావాలంటే పంటల ఉత్పాదకతలో మెరుగుదల ఉంటాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు లాభాలను చూడగలిగి తేనే రైతు బతుకుతాడు. కానీ ఏ రాష్ట్రంలో చూసినా వ్యవసాయం ఆశాజనకంగాలేదు. దాదాపు 17 రాష్ట్రాల్లో రైతు వార్షిక ఆదాయం రూ 20 వేలే ఉంది. అంటే నెలకు రూ. 1,666లు అన్నమాట. ఇలాగైతే వ్యవసాయం బతకటం చాలా కష్టం. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య గణనీ యంగా తగ్గుతోంది. 1999 నుంచి 2000 సంవత్సరంలో 60 శాతం ఉండగా.. 2011–12 కు వచ్చే సరికి 49 శాతానికి పడిపోయింది. 2004 నుంచి 2012 మధ్య కాలంలో 3 కోట్లమంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలేశారు. 2019–20 నాటికి మరో 2.5 కోట్ల మంది శ్రామికులు వ్యవసాయాన్ని వదిలిపెట్టవచ్చని అంచనా. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే పంట ఉత్పత్తిలో మెరుగుదల ఉండాలి. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయాన్ని రాబట్టడంతో పాటు, లాభాలు చూడగలిగితే రైతు బతుకుతాడు. దేశంలో ఏ ప్రాంతం, రాష్ట్రం కేసి చూసినా మన పలెటూళ్లలో రైతుకు ఎరువులు, విత్తనాలే గుదిబండలు. ఎదుగుతున్న పైరుకు అదును మీద ఎరువులు వేయాలంటే రైతు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. యూరియా కట్టకైనా, కాంప్లెక్స్ ఎరువుకైనా షావుకారే దిక్కు. షావుకారి దోపిడీకి మా నాయన రామకృష్ణారెడ్డి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మాకు ఏడు ఎకరాలు ఉండేది. చెరువు కింద భూమి. వరి పండేది. మా కుటుంబానికి జీవనాధారం ఆ భూమే. అప్పటికే అప్పు సప్పో చేసి నాటు పట్టేది. ఇక మందు కట్టలు అంటే మా ఊరి షావుకారు దగ్గరకు వెళ్లాల్సిందే. ఆయన లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేది. మందు కట్ట ధర మీద రూ 150 ఎక్కువ రాసుకునేటోడు. పంట చేతికి అందే నాటికి దానికి రూ 3 చొప్పున వడ్డీ లెక్కకట్టేవాడు, ఇక్కడ ఇంకో షరతు ఉండేది. చేనులో పండిన పంట మందు కట్టలు ఇచ్చిన షావుకారికే అమ్మాలి. అది కూడా మార్కెట్ ధరతో సంబంధం లేకుండా, ఆయన నిర్ణయించిన ధరకే. ఆ పంటను కూడా మా నాయనే తీసుకుపోయి, సిద్దిపేట మార్కెట్లో అమ్మి డబ్బు తెచ్చి షావుకారు చేతిలో పెట్టే వాడు. అంత దుర్మార్గమైన దోపిడీ ఉండేది. నా యవ్వనపు తొలినాళ్లలో నక్సలిజం వైపు నా అడుగులు పడటానికి ఇలాంటి దోపిడీ ఓ కారణం. పల్లెల్లో ప్రతి రైతు పరిస్థితి ఇదే. దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న రైతాంగం కాళ్లకింది పునాది కదిలిపోతున్న సందర్భంలో పాలకుల ఆలోచనెప్పుడూ రైతుల కన్నీళ్లకు, కష్టాలకు జవాబు చెప్పే సూక్ష్మస్థాయి శోధనగానే ఉండాలి.. తెలంగాణలో 20 ఏళ్ల నుంచి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పందిరి మెట్ల మాదిరిగా పెనవేసుకొనిపోయిన కరువు, అప్పులు, ఆడబిడ్డ పెళ్లి, చేతి వృత్తుల విధ్వంసం, చెరువుల విలుప్తం.. వరుస కరువు, ఎరువుల భారం, ఎదిగిన ఆడబిడ్డ పెళ్లిళ్లే రైతు ఆత్మహత్యలకు కారణం. ఈ మూడింటి భారం దించిన రోజున వ్యవసాయం దండగ కాదు పండగే అవుతుంది. రైతన్న రాజన్న ఆయితాడు. ఇప్పటి వరకు రాజ్య పాలన చేసిన వాళ్లెవరూ ఆ స్థాయి శోధన కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఉద్యమ నేతగా, పెద్ద రైతుగా కేసీఆర్ రైతు కష్టాలకు మూలాలను అన్వేషించారు. పాలకపక్ష నేతగా అన్నదాత కన్నీళ్లు తుడిచే పరిష్కారం చూపెడుతున్నారు. ఒక్కొక్క సమస్యను విడగొట్టి రైతు కష్టాలు బాపే వైపు అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సమగ్ర ప్రగతికి సాగు భూమి, చేతి వృత్తుల అభివద్ధే వెన్నెముకలని ఉద్యమం తొలినాళ్లలోనే గుర్తించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధులు నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తానని పంతం పట్టారు. రెండేళ్లలో గోదావరి జలాలు తెలంగాణ బీడు భూముల్లోకి మలిపేందుకు కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు. పల్లెను మళ్లీ పచ్చగా నిలబెట్టే మహాయజ్ఞం చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 36 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేస్తూ నాలుగు విడతల్లో 17 వేల కోట్లు రుణాలు మాఫీ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఆ పని చేయలేక నిక్కినీల్గుతున్నవేళ.. కేసీఆర్ ఉచిత ఎరువుల పంపిణీ పథకం రైతన్నకు మళ్లీ వ్యవసాయంపై భరోసాను ఇచ్చింది. రాష్ట్రంలో 57 లక్షల మంది సన్నచిన్నకారు రైతుల చేతిలో 1.57 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాలుసరి 25 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు వాడుతున్నారు. వాస్తవానికి రైతులు అవగాహనా లోపంతోనే మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారని, రాష్ట్ర రైతుల అవసరాలకు 17.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరిపోతాయని వ్యవసాయ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఈలెక్కన చూస్తే ఎరువుల సబ్సిడీ మీద రాష్ట్ర ప్రభుత్వానికి యేటా 6,300 కోట్ల భారం పడుతుందని అంచనా. యూరోపియన్ దేశాలతో పాటు బ్రెజిల్, చైనా, ఇండోనేసియా, కజకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, సౌత్ ఆఫ్రికావంటి దేశాల్లో వ్యవసాయం సబ్సిడీలపై భారీగానే ఖర్చు చేస్తున్నాయి. అయితే రైతుకు అత్యంత అవసరమైన ఎరువుల మీద ఏ దేశంలోనూ ప్రణాళికబద్ధమైన విధానాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎరువులపై సబ్సిడీ ఇచ్చి, ఆ డబ్బు నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఈ విధానం భవిష్యత్తులో ప్రపంచ దేశాల సబ్సిడీ అమలుకు ఒక ఆసక్తికరమైన అంశంగా మారనున్నది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త టీఆర్ఎస్ శాసన సభ్యుడు, రాష్ట్ర శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
కోటా.. కోత!
టీబీ డ్యాంలో 2.054 టీఎంసీల నిల్వ – ఎల్ఎల్సీ వాటాగా 1.146 టీఎంసీలు – తాగునీటికి 650 క్యుసెక్కులకు ఇండెంట్ పెట్టిన ఇంజినీర్లు – 300 క్యుసెక్కులకు తగ్గిన నీటి ప్రవాహం – దాహంతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత ప్రజలు – నోరు మెదపని అధికార పార్టీ నేతలు కర్నూలు సిటీ: కరువు కోరలు చాస్తోంది. భూగర్భ జలాల నీటి మట్టం రోజు రోజుకు తగ్గుతోంది. పశ్చిమ ప్రాంత ప్రజల గొంతెండుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అధికార పార్టీ నేతలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. తుంగభద్ర డ్యాం నుంచి జిల్లాకు ఎల్ఎల్సీ వాటా నుంచి రావాల్సిన నీటిని రాబట్టడంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 650 క్యుసెక్కుల నీరు ఏపీ సరిహద్దు వద్ద రావాల్సి ఉండగా.. 300 క్యుసెక్కులు కూడా రాని దుస్థి«తి నెలకొంది. ఈ విషయంపై జిల్లాలోని టీడీపీ నేతలకు జల వనరుల శాఖ ఇంజినీర్లు సమాచారం ఇచ్చినా ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి ఉంది. ఫలితంగా టీబీ డ్యాం అధికారులు నీటి విడుదలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే డ్యాంలో నిల్వ తక్కువగా ఉందనే కారణంతో బోర్డు అధికారులు నీటి ప్రవాహాన్ని రెండు రోజుల నుంచి రోజురోజుకూ తగ్గిస్తున్నారు. అయినా నేతలు నోరు మెదపకపోవడంతో బోర్డు అధికారులు ఏకంగా నీటి విడుదలను నిలిపేసేందుకు తెగబడినట్లు తెలుస్తోంది. నీటి ప్రవాహం తగ్గడంపై కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక బోర్డు అధికారులకు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెంచినట్టే పెంచి తగ్గించారు. ఈ కారణంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. దాహం తీర్చేదెట్టా...! జిల్లాకు తుంగభద్ర జలాలే ప్రధానం. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు టీబీ డ్యాం ఉమ్మడి జలాశయం. ఈ డ్యాంలో ప్రతి ఏటా వాటా నీటికి గండి పడుతున్నా నేతలు పట్టించుకోవడం లేదు. ప్రతి వేసవిలో పశ్చిమ పల్లె దాహం తీర్చేందుకు కనీసం 3 టీఎంసీల నీరు నిల్వ చేసే వారు. అయితే ఈ ఏడాది అశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వాటా నీరు తగ్గింది. కానీ బోర్డు అధికారులు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత నీరు పక్క జిల్లాకు తరలిపోయింది. దీంతో డ్యాం డెడ్ స్టోరేజీకి చేరింది. ప్రస్తుతం 2.054 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వాటా ప్రకారం జిల్లాకు 1.146 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఇందులో నుంచి తాగునీటి కోసం 650 క్యుసెక్కుల నీరు ఇవ్వాలని ఇంజినీర్లు ఇండెంట్ పెట్టారు. మొదట్లో ఆ ప్రకారం నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత డ్యాంలో నీరు లేదనే సాకుతో నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఈ నీటిపైనే జిల్లాలోని 9 మండలాల్లో 17 సమగ్ర రక్షిత తాగు నీటి పథకాలు, 164 గ్రామాలకు చెందిన 4,19,836 మంది జనాభా దాహం ఆధారపడి ఉంది. వస్తున్న నీటిలో 0.2 టీఎంసీల నీరు కూడా జిల్లాకు చేరని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరో రెండు నెలలు ప్రజల దాహాం ఏలా తీరుస్తారో నాయకులు, అధికారులకే తెలియాలి. కోర్టు అక్షింతలు వేసినా మారని తీరు మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం నీటి విడుదలలో బోర్డు అధికారులు ఎగువ రాష్ట్రామైన కర్ణాటక ఒత్తిళ్లకు తలొగ్గి దిగువ రాష్ట్రాల హక్కులకు భంగం కల్గించారు. దీంతో కొంత మంది ఎల్ఎల్సీ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందించి బోర్డు అధికారులపై తీవ్రంగా అగ్రహించింది. చివరికి బోర్డు అధికారులు ఇకపై తప్పులు జరుగకుండా చూస్తామని కోర్టుకు ఆఫిడవిట్ సమర్పించారు. కొద్ది రోజులకే గుట్టు చప్పుడు కాకుండా టీబీ డ్యాంలో 0.9 టీఎంసీల నీటిని పక్క జిల్లాకు మళ్లించినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. దీంతో పాటు ఎల్ఎల్సీ వాటా నుంచి సైతం కొద్దిమేర నీటిని మళ్లించారు. ఈ విషయం జిల్లాలోని అధికార పార్టీ నేతలకు తెలిసినా నోరు మెదపకపోవడం గమనార్హం. ముందుగానే మేల్కొని ఉంటే కనీసం 1.3 టీఎంసీల తుంగభద్ర జలాలు జిల్లాకు వచ్చేవనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఎల్ఎల్సీ ఇంజినీర్లు పర్యవేక్షణ లేకుండా నీటిని కాల్వకు వదులుతుండడంతో నీరు వృథా అవుతోంది. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం, జల వనరుల శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ కారణంతోనే వచ్చిన నీరు సైతం సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. టీబీ డ్యాంలో నీటి నిల్వ తగ్గడంతో ఈ డ్యాంకు ఎగువన ఉన్న భద్ర ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నీటితో ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లు బోర్డు అధికారులు చెబుతుండటం గమనార్హం. నీటి ప్రవాహం తగ్గింది. తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువకు వస్తున్న నీటి ప్రవాహం తగ్గిన మాట వాస్తవమే. ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయాం. ఇప్పటి వరకు 0.23 టీఎంసీల నీరు వచ్చి ఉండొచ్చు. డ్యాంలో నీటి నిల్వ తగ్గడంతోనే నీటి విడుదలను తగ్గించినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. – చంద్రశేఖర్ రావు, పర్యవేక్షక ఇంజినీర్, జల వనరుల శాఖ -
అనంత వేదన పట్టదా బాబూ ?
చంద్రబాబు విధానాల వల్లే వ్యవసాయ సంక్షోభం మూడేళ్లలో 4 లక్షల మంది వలస.. 180 మంది ఆత్మహత్య కరువు పోవాలంటే చంద్రబాబు పీఠం దిగాలి రైతు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరంలో కదంతొక్కిన అన్నదాతలు, వైఎస్సార్సీపీ శ్రేణులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ధర్మవరం : రైతులు, ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. కరువు, చంద్రబాబు కవలపిల్లలని, ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించితే కానీ రాష్ట్రంలో కరువు పోదని అన్నారు. కరువు సహాయక చర్యలు, రైతాంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతుధర్నా చేపట్టారు. ముందుగా బత్తలపల్లి మండల కేంద్రం నుంచి ధర్మవరం వరకు 13 కిలో మీటర్ల మేర భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాకు నియోజకవర్గంలోని రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు తరిమెల శరత్‌చంద్రారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోటి సూర్యప్రకాష్‌బాబు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఈ మూడేళ్ల పాలనలో రైతులకు అందుతున్న అన్ని పథకాలను నిలిపివేశారన్నారు. వైఎస్సార్ హయాంలో ఉపాధి హామీ ద్వారా వలసలను నివారిస్తే..ప్రస్తుతం ఉపాధి నిధులను రోడ్లు వేసేందుకు మళ్లించి ‘తమ్ముళ్ల’కు ప్రయోజనం కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల జిల్లాలోని రైతులు కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారన్నారు. గతంలో నలుగురికి పని ఇచ్చిన రైతులు ప్రస్తుతం ఆత్మాభిమానాన్ని చంపుకుని రోడ్లు ఊడ్చే కూలీలుగా మారారని, మురికికాలువల పక్కన జీవిస్తున్నారని తెలిపారు. మరికొందరు భిక్షాటన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కోర్ డ్యాష్‌బోర్డు ద్వారా తనకు నేరుగా తెలుస్తుందని చెప్పుకునే చంద్రబాబు.. అనంతపురం జిల్లాలో కరువు, వలసలు, రైతు ఆత్మహత్యల గురించి తెలుసుకోకపోవడం విడ్డూరమన్నారు. గత ఖరీఫ్‌లో నాలుగు రోజుల్లోనే ఐదు లక్షల ఎకరాల్లో పంటను కాపాడామని చెప్పి జిల్లా రైతాంగాన్ని మోసం చేశారని, రెయిన్గన్ల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా ఇస్తామని చెప్పి ఆరు నెలలు కావస్తున్నా ఒక్క రైతుకూ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాలోని అన్ని చెరువులకు నీరిస్తామని గొప్పలు చెప్పుకున్నారని, కనీసం ఒక్క ఎకరానికీ ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. బిల్లులు ఆపేసి పండ్లతోటల రైతులను నాశనం చేస్తున్నారన్నారు. రూ.కోట్లు ఎలా వెనకేసుకోవాలి.. తన కొడుకును ఎలా వృద్ధిలోకి తీసుకురావాలనే ధ్యాస తప్ప చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రమూ పట్టడం లేదన్నారు. రైతు సమస్యలపై పోరాడే నాయకుడు ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబును గద్దె దించి.. జగన్మోహన్రెడ్డిని సీఎం చేసి రైతాంగానికి పూర్వవైభవం తీసుకొద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ధర్మవరం ఆర్డీఓ బాలానాయక్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు పోతుకుంట రామయ్య, బగ్గిరి బయపరెడ్డి, వడ్డిరామలింగారెడ్డి, ఇందుకూరి నారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు గడ్డం కుళ్లాయప్ప, కౌన్సిలర్లు బీరే ఎర్రిస్వామి, చందమూరి నారాయణరెడ్డి, చిన్న తిమ్మన్న, గొట్లూరు సింగిల్‌విండో అధ్యక్షులు గిరక రామాంజినేయులు, సర్పంచ్ల సం ఘం అ«ధ్యక్షులు గెలివి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పరిహారం మహాప్రభో!
- వరుస కరువుతో బతుకు భారమైంది - 2015-16కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంకా ఇవ్వలేదు - అధికారుల ఎదుట ఆదోని మండల రైతులు ఆవేదన – ‘మీ కోసం’కు వినతుల వెల్లువ అయ్యా..వంద కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాం. భూమాతను నమ్ముకుని కాయాకష్టంతో బ్రతుకుతున్నాం. కరువుతో అల్లాడిపోతున్నాం... బ్రతుకు బండిని లాగుతున్నాం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. కల్లూరు (రూరల్): ‘మాది ఆదోని మండలం బసరకోట గ్రామం. మాకు ఆస్పరి మండలం డి.కోటకొండలో పొలం ఉంది. అదే మాకు ఆధారం. వరుస కరువులతో కొన్నేళ్లుగా పంటలు పండటం లేదు. 2015–16 సంవత్సరానికి సంబంధించి 57 మంది రైతులకు ఇప్పటి వరకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. చాలా నెలల క్రితమే పెట్టుబడి రాయితీ మంజూరు పత్రాలు (ఇన్పుట్ సబ్సిడీ 2015–16) ఇచ్చారు. ఇప్పటి వరకు పైసా కూడా ఇవ్వలేద’ని ఆ గ్రామానికి చెందిన బాధిత రైతులు అధికారుల ఎదుట వాపోయారు. పరిహారం రాకపోవడానికి కారణమేమిటని వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని రైతులు స్వామి, దాసు, పెద్ద ఆంజనేయులు, చిన్న ఆంజనేయులు, పెద్ద నర్సన్న, చిన్న నర్సన్న, పరమేశ్వరప్ప, కిరీటప్ప, రాముడు, హనుమంతు తదితరులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలిసి విన్నవించారు. ఇలాంటి పలు సమస్యలపై జిల్లా నుంచి పలువురు కలెక్ట్టరేట్కు వచ్చారు. వీరి నుంచి జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ వినతులు స్వీకరించారు. అందులో కొన్ని.. అర్బన్ హెల్త్ సెంటర్లో పని చేస్తున్న డాక్టర్లకు, ఏఎన్ఎంలకు పెండింగ్‌లో ఉన్న 22 నెల పరా్ఫ్ మెన్స్ అలవెన్స్ ఇప్పించండని ఏఎన్ఎంలు ఎన్. సువర్ణ, ఎస్.శోభారాణి, ఎం.పద్మావతి, వి.సూర్యకళ, సుజాత, వి.పద్మావతి, భాగ్యమ్మ జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్‌కు పెండింగ్ వేతనాలు, అమ్మ అమృతహస్త బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.లలితమ్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మునెప్ప, నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి జేసీకి కోరారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో సక్రమంగా వేతనలు ఇవ్వడమే కాక భారీగా పెంచారని చెప్పారు గుత్తిపెట్రోల్ బంకు సమీపంలోని 32వార్డులోని బీఆర్ విజ్జీనగర్లో గురుదత్త గుడి నుంచి 160 మీటర్ల పొడవున సీసీ రోడ్డు వేయాల్సి ఉండంగా 60 మీటర్ల వరకు మాత్రమే వేసి మిగతా 100 మీటర్ల రోడ్డును పక్క వీధిలోకి మళ్లించరు. దీనిపై విచారించి న్యాయం చేయాలని జేసీకి సయ్యద్ అమ్ము, జయచంద్ర, నాగేశ్వరరావు, లాజర్, సామేల్, ప్రభాకర్, హుస్సేన్‌లు ఫిర్యాదు చేశారు. డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు నరేష్, సురేంద్ర, మరి, మహేష్, అశోక్ జేసీకి ఫిర్యాదు చేశారు. పాములపాడు మండలం బానుముక్కల గ్రామంలో తన పేరు మీద ఉన్న భూమిని తహసీల్దార్, వీఆర్ఓ ఆన్లైన్ అడంగల్‌లో నమోదు చేయడం లేదని చాకలి గంగమ్మ జేసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే జాయింట్ కలెక్టర్ హరికిరణ్ పాములపాడు తహసీల్దార్ నాగేంద్రతో మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకం ఉన్నా ఆన్లైన్ అడంగల్‌లో బాధితుల భూమిని ఎందుకు నమోదు చేయలేదో సమాధానం చెప్పాలని ఆదేశించారు. బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంలోని సర్వే నంబర్ 73–2లో 7.18 సెంట్ల పొలం ఉందని, ఈ పొలాన్ని ఇతరులు ఆక్రమించుకున్నట్లు రైతు మిద్దె రామ్మోహన్‌రెడ్డి జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఆదోని షాహి ఈద్గాలో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఆ ప్రాంతంలో లైటింగ్, శానిటేషన్, పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని ఆ ఈద్గా ప్రెసిడెంట్ అలి హజ్మసాహబ్, సెక్రటరీ అబ్దుల్ రషీద్ అధికారులకు విన్నవించారు. -
రైతన్న క’న్నీటి’ గాథలు
-
ఎండిన మిరపకు నష్ట పరిహారం ఇవ్వాలి
► రైతు సంఘం కార్యదర్శి ఏరువ పాపిరెడ్డి తర్లుపాడు: కరువు వలన ఎండిపోయిన మిరప పంటను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం కార్యదర్శి ఏరువ పాపిరెడ్డి కోరారు. ఈ నెల 4న గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండలంలోని నాయుడుపల్లె, చెన్నారెడ్డిపల్లె, సీతానాగులవరం, తుమ్మలచెరువు, మీర్జాపేట, కారుమానుపల్లె గ్రామాల్లో రైతు సంఘం నాయకులు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మిరప పంట తెగుళ్లతో గణనీయంగా తగ్గటంతో పాటు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు పొలాలను వదలేశారన్నారు. ఎకరాకు 1.50లక్షల వరకు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయంలో ధరలు పడిపోవటంతో రైతులు అప్పుల పాలయ్యారన్నారు. మిర్చి పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎకరాకు 50వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. దళారుల మాయజాలంతో పండించిన మిరప పంటకు ధరలు లేవని, క్వింటా 5వేలకు మించి అమ్మటం లేదన్నారు. మార్క్‌ఫెడ్ ద్వార క్వింటా మిర్చి 10వేల రూపాయలకు కొనుగోలు చేయించాలని కోరారు. వర్షాలు లేక తీవ్ర కరువు ఏర్పడి బోర్లు ఎండిపోయి మిర్చి పంటలు నిలువున వదలి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ఏడాది క్వింటా 15వేలు అమ్మకం చేసినా మిర్చి ఈ ఏడాది 5వేలకు దిగజారిందని, 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామన్న ప్రభుత్వం బడ్జెట్లో దాని ఊసే లేదన్నారు. గిట్టుబాటు ధర కోసం, కరువు వలన ఎండిన మిర్చి, పత్తి పంటలను నమోదు చేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న జరిగే ధర్నా కార్యక్రమంలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తవనం నారాయణరెడ్డి, వెన్నా సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఊరు ఖాళీ.
-
తమిళనాడుకు కేంద్రం భారీ సాయం
న్యూఢిల్లీ: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు రూ.2,014.45 కోట్ల సాయాన్ని ప్రకటించింది. తమిళనాడుకు విడుదల చేయాల్సిన ఆర్థిక సాయంపై ఈ నెల 23న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విపత్తు సహాయ నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి ఈ సహాయాన్ని అందించేందుకు కమిటీ ఆమోదించింది. ఇందులో రూ.1748.28 కోట్లు కరవు సాయం కాగా, రూ. 264.11 కోట్లు 'వార్దా' తుపాను సాయం, రూ.2.05 కోట్లు జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద విడుదలైంది. వర్దా తుపానుతో పాటు వర్షాభావ పరిస్థితులవల్ల కరువుతో అల్లాడుతున్న తమ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా తమిళనాడు... కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర బృందం తమిళనాడులో పర్యటించి, పరిస్థితిని అంచనా వేసింది. ఐఎంసీటీ ఇచ్చిన నివేదక ప్రకారం కేంద్రం శనివారం తమిళనాడుకు ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. కాగా కరువు కోరల నుంచి రైతులను ఆదుకోవాలంటూ తమిళనాడు రైతులు గత కొద్దిరోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రైతుల ధర్నాకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతూ, తక్షణమే కరువు సాయాన్ని విడుదల చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మరోవైపు కేంద్రం సాయంపై అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పెదవి విరిచారు. కరువు సాయానికి ప్రభుత్వం సరిపడా నిధులు మంజూరు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రానికి కూడా రూ.1235.52 కోట్ల సాయాన్ని కేంద్రం విడుదల చేసింది. కరువుతో అల్లాడుతున్న ఆ రాష్ట్రానికి కేంద్రం జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి ఈ సాయాన్ని అందిస్తోంది. -
దాహం బాబోయ్ దాహం: జనాల్లోకి నల్లత్రాచు!
-
దాహం బాబోయ్ దాహం: జనాల్లోకి నల్లత్రాచు!
కరువు కటకటలాడుతోంది. ఎక్కడ చూసినా తాగడానికి నీళ్లు లేవు. దీంతో దాహంతో అలమటించిపోయిన ఓ నల్లత్రాచు (కింగ్ కోబ్రా) ఏకంగా జనావాసాల్లోకి చొచ్చుకొచ్చింది. అదృష్టం బావుండి అది.. పాముల గురించి తెలిసిన ఓ వ్యక్తి కంట పడింది. దాహంతోనే అది అడవిని వదిలి గ్రామానికి వచ్చిందని గుర్తించిన ఓ వ్యక్తి స్థానిక అటవీ పోలీసుల సాయంతో ఆ నల్లత్రాచుకు నీళ్లు తాగించాడు. కర్ణాటకలోని కైగా టౌన్షిప్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో కొంతకాలంగా కరువు తాండవిస్తున్నది. ఈ నేపథ్యంలో నీళ్లు దొరకక బాగా దాహంతో పాములు అప్పుడప్పుడు ఇలా జనావాసాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే దాహంతో అలమటించిన ఓ నల్లత్రాచు ఇటీవల జనావాసాల్లోకి వచ్చింది. పాములు పట్టే వ్యక్తి సాయంతో దానిని పట్టుకున్న స్థానిక పోలీసులు.. దానికి మినరల్ వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. నీళ్లు తాగించిన అనంతరం జంతు సంరక్షణ కేంద్రానికి ఆ నల్లత్రాచును తరలించారు. -
కరువు.. దరువు
కనికరం లేని సర్కారు – కరువు మండలాల్లో చర్యలు శూన్యం – పనుల్లేక వలస పోతున్న గ్రామీణ ప్రజలు – మేత లేక కబేళాలకు తరలుతున్న పశువులు – సాంకేతిక కారణాలతో రైతులకు అందని ఇన్పుట్ సబ్సిడీ – తాగునీటికి అల్లాడుతున్న పల్లెలు – నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం హాలహర్వి మండలంలోని చాకిబండ గ్రామంలో శిరుగాపురం పంప్‌హౌస్ నుంచి రోజు విడిచి రోజు నీరు సరఫరా కావాల్సి ఉండగా.. పది నుంచి 20 రోజులకోసారి సరఫరా జరుగుతోంది. స్థానికంగా ఒక్కో బిందె నీరు రూ.20లకు విక్రయిస్తుండటంతో గ్రామస్తులు గొంతెండుతోంది. విధిలేని పరిస్థితుల్లో నాలుగు కిలోమీటర్ల దూరంలోని బేవినహాలు వక్రేణి నుంచి ట్రాక్టర్, ఎద్దుల బండిపై అతి కష్టంపై నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించినా.. చేపట్టిన చర్యలు నామమాత్రమే. మేత లేక పశువులను కబేళాలకు తరలిస్తుండగా.. సామాన్య, మధ్య తరగతి రైతులు పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. అనేక మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇప్పటికే దాదాపు 140 గ్రామాల్లోని ప్రజలు చుక్కనీటి కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ప్రస్తుత వేసవిలో ఈ గ్రామాలకు ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీటిని అందించేందుకు రూ.10.62 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే గత ఏడాదికి సంబంధించిన నిధులే ఇప్పటికీ అందని పరిస్థితుల్లో ఈ వేసవిలో చేపట్టే కార్యక్రమాలకు నిధులు విడుదల అవుతాయా? లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరుకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. అలాగే ఫిబ్రవరి నెల నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేస్తున్న పనులకు కూడా కూలీలకు వేతనాలు అందని పరిస్థితి. దాదాపు రూ.10కోట్ల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉండటం.. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు జంకుతున్నారు. కరువు మండలాల్లో చర్యలు శూన్యం జిల్లాలోని 36 కరువు మండలాల్లో పశువులకు మేత, నీరు, నీటి తొట్ల నిర్మాణాలు, ఇతరత్రా పనులు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం రూ.16.20 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం కేవలం రూ.6 కోట్లను మాత్రమే విడుదల చేసింది. ఈ అరకొర నిధులతో పలు ప్రాంతాల్లో గడ్డి విత్తనాలు, పశుగ్రాసం, మొలకగడ్డి పెంచుకునేందుకు చర్యలు చేపట్టారు. మెజారిటీ గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆయా గ్రామాల్లోని రైతులు పశువులను కబేళాలకు తరలించి వలసలు వెళ్తున్నారు. రైతులకు అందని ఇన్పుట్ సబ్సిడీ 2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 40 మండలాలకు చెందిన రైతులకు రూ.275 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదలైనా, పలు సాంకేతిక కారణాలతో 20 శాతం మినహా మిగిలిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందని పరిస్థితి నెలకొంది. అలాగే 2014 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా జిల్లాలోని పత్తికొండ, దేవనకొండ, మద్దికెర, తుగ్గలి, ఆలూరు మండలాల్లోని రైతులకు రూ.77 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందాల్సి ఉంది. తాగునీటికి కటకట వేసవి ప్రారంభంలోనే జిల్లాలో తాగునీటికి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే దాదాపు 140 గ్రామాలు తీవ్ర దాహార్తిని ఎదుర్కొంటున్నాయి. మున్సిపల్ ప్రాంతాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో సైతం వారానికి ఒకటి లేక రెండు సార్లు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది 100 మజరా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, 40 మజరా గ్రామాలకు హైరింగ్ ద్వారా నీటిని అందించాలని, 846 బోర్లలో ఫ్లషింగ్, 1151 బోర్లలో డీపెనింగ్ చేయాలని.. ఇందుకు రూ.10.62 కోట్లు అవసరమవుతాయని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.2.78 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. చతికిల పడిన ఎన్టీఆర్ గృహ నిర్మాణం జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం చతికిల పడింది. ఈ నెలాఖరు నాటికి జిల్లాకు మంజూరైన గృహాలన్నీ పూర్తి చేయాలనే లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాకు జీఓలు 103, 114 ప్రకారం 14,850 గృహాలు కేటాయించగా.. 13,534 గృహాలు మంజూరయ్యాయి. అయితే క్షేత్ర స్థాయి సిబ్బంది లేకపోవడం, గృహ నిర్మాణ లబ్ధిదారుల వాటా ఉన్న కారణంగా గృహ నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి. అలాగే జీఓ నెంబర్ 104 ప్రకారం 4,246 గృహాలు కేటాయించగా.. 3,437 మందిని అర్హులుగా తేల్చారు. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ వివిధ కారణాల వల్ల ఈ పథకం పనులు చురుగ్గా సాగడం లేదు. -
9 కరువు పీడిత రాష్ట్రాలకు సుప్రీం సమన్లు
న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైనందుకు ఆంధ్రప్రదేశ్ సహా తొమ్మిది కరువు పీడిత రాష్ట్రాలకు సుప్రీంకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తగినంత సమయం లభించినా తొమ్మిది రాష్ట్రాలు ఆహార భద్రత పథకాన్ని ప్రజలకు సక్రమంగా అందించడంలో విఫలమయ్యాయని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్, హరియాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు వెళ్లాయి. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు కూడా ఆహార కమిషన్లను ఇంకా ఏర్పాటు చేయకపోయినా, ఇప్పటికే ఆ ప్రక్రియను మొదలుపెట్టడంతో ఆ రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కోర్టు సమన్లు ఇవ్వలేదు. -
భారీ ప్రాజెక్టులు అనవసరం
- కరువు నివారణపై మర్రి చెన్నారెడ్డి స్మారక ట్రస్ట్ రౌండ్ టేబుల్ - సమావేశంలో నిపుణుల అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు నివారణ తోపాటు వ్యవసాయానికి నీళ్లు అందించేందుకు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు పరిష్కారం కాదని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. దివంగత నీటిపారుదల రంగ నిపుణుడు టి. హనుమంతరావు సూచించిన చతుర్విద జలప్రక్రియ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనమిక్ సోషల్ స్టడీస్(సెస్)లో కరువు నివారణకు సంబంధించి జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి, ఇక్రిశాట్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వీరమణి, కర్ణాటక కరువు పర్యవేక్షక కేంద్రం మాజీ డైరెక్టర్ వీఎస్ ప్రకాశ్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మ య్య, నీటిపారుదల రంగం నిపుణులు ప్రదీప్ తలషెరీ, డాక్టర్ సోమ్‌కుమార్ తోమార్, డాక్టర్ డి.నరసింహారెడ్డి, డాక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమావేశ వివరాలను ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. కరువు నివారణకు హనుమంతరావు రూపొందించిన చతుర్విద జలప్రక్రియ ఎవరూ ఊహించని ఫలితాలనిచ్చిందని, కరువు కాలంలో, మండు వేసవిలోనూ నీటి లభ్యతతో ఆదుకుందని చెప్పారు. దీనిని రాజస్థాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేసి ఎంతో ప్రయోజనం పొందిందని, రాష్ట్రంలోనూ ఆదిలాబాద్‌లో, మెదక్‌జిల్లా జహీరాబాద్ సమీపంలోని గొట్టిగారిపల్లిలో గత 15 ఏళ్లుగా కరువులోనూ నీరు అందుబాటులో ఉంటోందన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా విద్యుత్ చార్జీలు, మెయింటెనెన్స్ ఇతరాలు కలుపుకుని ఏడాదికి ఎకరానికి రూ.1.28 లక్షల ఖర్చు అవుతుందని తేలిందని చెప్పారు. హనుమంతరావు రూపొందించిన చతుర్విద జలప్రక్రియ ద్వారా ఎకరానికి రూ.7 వేల ఖర్చుతో మూడు పంటలకు నీటిని ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినా ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పర్యావరణ కమిటీ ఎదుట ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను కోరాలని నిర్ణయించామన్నారు. ఎక్కడ వర్షం పడితే అక్కడే దానిని స్టోరేజ్ చేసుకుంటే అది అక్కడే ఉంటుందని, ఇందుకోసం తక్కువ ఖర్చుతో సులభమైన విధానాన్ని అమలు చేయవచ్చని చెప్పారు. తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం రాజస్థాన్‌లో ఈ ప్రక్రియను అమలు చేయించగా లేనిది ఇక్కడ దానిని ఎందుకు అమలు చేయించలేక పోతున్నామో అర్థం కావడం లేదన్నారు. టి.హనుమంతరావు వద్ద శిక్షణ పొంది, ఆయన సేవలను ఉపయోగించుకున్న వెదిరె శ్రీరాం ఈ ప్రక్రియపై ఇటీవల ముద్రించిన పుస్తకంలో కనీసం హనుమంతరావు ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరమన్నారు. -
కరువు కోరల్లో ‘అనంత’ రైతులు
-
కరువు కోరల్లో ‘అనంత’ రైతులు
అమరావతి: రాష్ట్రంలో కరువుతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలు కరవు కోరల్లో చిక్కుకున్నాయని చెప్పారు. మిగిలిన 12 జిల్లాల్లోనూ అనేక మండలాల్లో పంటలు వేయలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలు శూన్యమని చెవిరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కరువు రక్కసి బారిన పడిన రైతులను ఆదుకోవాలని ఆయన సూచించారు.


