2016 కరువుకు సంబంధించి 26 మండలాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు.
19 నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ పత్రాల పంపిణీ
Jun 13 2017 11:20 PM | Updated on May 25 2018 1:22 PM
కర్నూలు(అగ్రికల్చర్): 2016 కరువుకు సంబంధించి 26 మండలాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం జిల్లాకు రూ.325 కోట్లు మంజూరు చేసింది. అయితే నిధులు మాత్రం విడుదల కాలేదు. ముందుగా 26 మండలాల్లో ఏ రైతుకు ఎంత ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరైంది.. తదితర వివరాలతో పత్రాలు పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ఇన్‌పుట్ సబ్సిడీ పత్రాలు పంపిణీ చేస్తారని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. అయితే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ భీమా పరిహారాలు వస్తే ఇందులో ఏది ఎక్కువగా ఉంటే దానిని మాత్రమే ఇస్తారు.
Advertisement


