10 జిల్లాల్లో కరువు : విజయసాయిరెడ్డి | vijayasaireddy urges centeral Govt help for AP | Sakshi
Sakshi News home page

10 జిల్లాల్లో కరువు : విజయసాయిరెడ్డి

Mar 20 2017 1:22 PM | Updated on Aug 9 2018 3:21 PM

10 జిల్లాల్లో కరువు : విజయసాయిరెడ్డి - Sakshi

10 జిల్లాల్లో కరువు : విజయసాయిరెడ్డి

ఏపీలో తీవ్రకరువు ఏర్పడిందని విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఢిల్లీ :
ఏపీలో తీవ్రకరువు ఏర్పడిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 13 జిల్లాలకు 10 జిల్లాలు కరువు బారిన పడ్డాయని రాజ్యసభలో వివరించారు. కరువుతో వందలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వేలమంది కార్మికులుగా వలసపోతున్నారని పేర్కొన్నారు.

పశుగ్రాసం లేక రైతులు పశువులను కబేళాలకు అమ్ముతున్నారని తెలిపారు. కేంద్రం స్పందించి ఏపీని ఆదుకోవాలని రాజ్యసభలో విజయసాయిరెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement