
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వీడియోతో సహా వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్ చేసింది. టీడీపీ కీలకనేత టీడీ జనార్ధన్‌ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘‘మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగింది. తాడేపల్లి పార్క్ విల్లాలో విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి వచ్చారు.. 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు చంద్రబాబు నమ్మినబంటు టీడీ జనార్ధన్ వచ్చారు. 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపారు’’ అని వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది.
‘‘విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్‌పై విమర్శలు, విషపు వ్యాఖ్యలు.. విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్ నమ్మి.. దగ్గర పెట్టుకుని పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవిస్తే ఇంకా మూడేళ్లు పదవీ కాలం ఉన్నా చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఇది నమ్మకం ద్రోహం కాదా?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్‌సీపీ నిలదీసింది.
విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు..
మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం
తాడేపల్లి పార్క్ విల్లాలో..
విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి
13 నిమిషాల తర్వాత అదే విల్లాకు @ncbn నమ్మినబంటు టీడీ జనార్ధన్.… pic.twitter.com/XYgtZsJSE4— YSR Congress Party (@YSRCParty) May 25, 2025
