ఇదేమి ‘మందా’ ఓరి యలమందా!

Hundreds Of Thirsty Cows Flocking To A Water Tanker - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియాలో మనుషులకేమోగానీ పశువులకు తీవ్రమైన నీటి కరువు వచ్చి పడింది. కాల్వలు, గుంటలు, బావులు ఎండి పోవడంతో అవి బావురుమంటున్నాయి. వాటిని బతికించడం కోసం రైతులు వాటర్‌ ట్యాంకులు తెప్పించి మరీ వాటి దాహం తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కోసారి వాటర్‌ ట్యాంకర్‌ నీటి కోసం కూడా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు వాటిని తోలుకొని పోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

తన పశువుల దాహం తీర్చేందుకు తాను తరచుగా గంటసేపు వాటితో ప్రయాణించాల్సి వస్తోంది. 1300 పశువులు కలిగిన అంబర్‌ లియా అనే ఆవిడ మీడియాకు తెలియజేసింది. పశువుల దాహం తీర్చేందుకు తెప్పించిన ఓ వాటర్‌ ట్యాంకర్‌ వద్ద దాహం తీర్చుకునేందుకు ఎగబడుతున్న పశువుల మందను ద్రోన్‌ కెమెరా ద్వారా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాన్ని వీక్షించిన వారికి అక్కడ ఎంత కరువు పరిస్థితులున్నాయో చెప్పకనే తెలుస్తుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top