దాహం బాబోయ్‌ దాహం: జనాల్లోకి నల్లత్రాచు!

దాహం బాబోయ్‌ దాహం: జనాల్లోకి నల్లత్రాచు!


కరువు కటకటలాడుతోంది. ఎక్కడ చూసినా తాగడానికి నీళ్లు లేవు. దీంతో దాహంతో అలమటించిపోయిన ఓ నల్లత్రాచు (కింగ్‌ కోబ్రా) ఏకంగా జనావాసాల్లోకి చొచ్చుకొచ్చింది. అదృష్టం బావుండి అది.. పాముల గురించి తెలిసిన ఓ వ్యక్తి కంట పడింది. దాహంతోనే అది అడవిని వదిలి గ్రామానికి వచ్చిందని గుర్తించిన ఓ వ్యక్తి స్థానిక అటవీ పోలీసుల సాయంతో ఆ నల్లత్రాచుకు నీళ్లు తాగించాడు. కర్ణాటకలోని కైగా టౌన్‌షిప్‌ సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.ఈ ప్రాంతంలో కొంతకాలంగా కరువు తాండవిస్తున్నది. ఈ నేపథ్యంలో నీళ్లు దొరకక బాగా దాహంతో పాములు అప్పుడప్పుడు ఇలా జనావాసాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే దాహంతో అలమటించిన ఓ నల్లత్రాచు ఇటీవల జనావాసాల్లోకి వచ్చింది. పాములు పట్టే వ్యక్తి సాయంతో దానిని పట్టుకున్న స్థానిక పోలీసులు.. దానికి మినరల్‌ వాటర్‌ బాటిల్‌తో నీళ్లు తాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. నీళ్లు తాగించిన అనంతరం జంతు సంరక్షణ కేంద్రానికి ఆ నల్లత్రాచును తరలించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top