కరువు తెచ్చిన అదృష్టం! నీళ్లలో ఏడాది పాటు...

Taiwan Drought Helps Man Recover iPhone Dropped In Lake A Year Ago - Sakshi

గత 56 సంవత్సరాలలో తైవాన్ లో తీవ్ర స్థాయిలో కరువు ఏర్పడింది. ఈ కరువు వల్ల చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అయితే, ఒకరికి మాత్రం అదృష్టం ఈ కరువు తెచ్చి పెట్టింది. మిస్టర్ చెన్ అనే వ్యక్తి కరువు వల్ల పోయిన తన ఐఫోన్ 11ను తిరిగి పొందగలిగాడు. చెన్ ఒక సంవత్సరం క్రితం తైవాన్ లోని అత్యంత ప్రసిద్ధ సరస్సులలో ఒకటైన సన్ మూన్ సరస్సులో గత ఏడాది పాడిల్‌బోర్డింగ్ చేస్తున్నప్పుడు ఆకస్మికంగా తన ఐఫోన్ 11 పడిపోయినట్లు పేర్కొన్నాడు.

తైవాన్ న్యూస్ ప్రకారం.. ఈ ద్వీపం తీవ్రమైన కరువు ఏర్పడటం వల్ల ఆ సరస్సు బంజరు భూమిగా మారిపోయింది. సన్ మూన్ సరస్సులో నీటి మట్టాలు రికార్డు స్థాయికి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తికి ఐఫోన్ 11 దొరికన తర్వాత తనను సంప్రదించినట్లు మిస్టర్ చెన్ పేర్కొన్నాడు. మిస్టర్ చెన్ పోయిన తన ఐఫోన్ 11 తిరిగి దొరికన సంతోషంలో నిద్రకూడా పట్టలేదని చెప్పారు. అదృష్టవశాత్తూ ఐఫోన్ 11కు కేసు, వాటర్ రెసిస్టెంట్ ఉండటం చేత సరస్సు అడుగులో ఒక ఏడాది ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ పనిచేసింది. మిస్టర్ చెన్ ఫోన్ ఛార్జ్ చేసిన తర్వాత బాగానే పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఐఫోన్ 11కు సంబందించిన బూట్ చేసిన ఫోటోలను ఫేసుబుక్ లో షేర్ చేసాడు. అలాగే, యూట్యూబ్ లో ఈ వీడియోకి 3 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి.

చదవండి: 

బిలియనీర్ల అడ్డాగా బీజింగ్!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top