కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు.. లోకేశ్‌ మెదడు ఎక్కడుంది?

Chandrababu Care Of Address For Drought Says Kakani Govardhan - Sakshi

ఏ రోజు అయినా చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షం, నీరు అవిరి అయిపోతుందని, ఎక్కడా పచ్చదనం కనిపించదని ఎద్దేవా చేశారకు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు కరువుతో అల్లాడిపోవాల్సిందేనని పేర్కొన్నారు.  రైతులు పనులు లేక వలసలు వెళ్లిపోయే పరిస్థితి ఉండేదని, రైతులు రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఒకడు నిష్టదరిద్రుడు. కొడుకు పరిమదరిద్రుడని ఏకి పారేశారు.  లోకేశ్‌ ఒక బచ్చా.. అతను కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారా అని సెటర్లు వేశారు. ఈమేరకు కాకాణి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.. ఇంకా ఆయన ఏమన్నారంటే..

వ్యవసాయం తెలియకుండా వ్యక్తిగత దూషణలా?
వ్యవసాయం, పంటలు, వ్యవసాయ విధానాల గురించి మాట్లాడటం చేతగాక వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. నువ్వు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లి ఎందుకు చదివావు. ఇక్కడ సరైన వసతులు లేకనా? ఎవరైనా వలస వెళ్తే.. కూలి పని చేసే కుటుంబం వేరే ప్రాంతానికి వ్యాపారానికో, ఇంకా అభివృద్ధి చెందడానికో ఆ ప్రాంతం నుంచి వలస వెళ్తారు. అది అర్థం చేసుకోలేక చంద్రబాబు హయాంలో నీరు లేక పంటలు లేక రైతులు బజారున పడ్డారు. అటువంటి పరిస్థితి నుంచి నేడు ప్రతి సంవత్సరం పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. చంద్రబాబు హయాంలో లా, ఇప్పుడు క్రాప్‌ హాలిడేలు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో సగటున సంవత్సరానికి 14 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

లోకేశ్‌ నీకు మెదడు మోకాలిలో ఉందా? అరికాలిలో ఉందా? మాట్లాడటానికి నోరు తిరగదు. పది పంటలు చూపిస్తే.. అందులో ఐదు పంటల పేర్లు చెప్పగలవా? నీ సార్థక నామధేయం కంది పంట పేరు చెప్పగలవా? పప్పూగాడు అని నీ పేరు కదా. ఆ పప్పు పంటలను గుర్తు పట్టగలవా లోకేశ్‌. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రికి అధికార పిచ్చి. తండ్రీకొడుకులకు తినటానికి, పంచుకోవటానికి, దోపిడీకీ అవకాశం లేకపోవటంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.  ఏం పనిలేక.. అబ్బాకొడుకులు ఉన్మాదంతో తిరుగుతున్నారు. అన్ని వర్గాలు సంతోషంతో ఉండటంతో నిద్రపట్టడం లేదు. 

రైతులపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
ఏదైనా మాట్లాడేటప్పుడు నీతిగా నిజాయితీగా మాట్లాడటం నేర్చుకుంటే మంచిది. నీకు, ఈప్రభుత్వానికి నక్కకు - నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. లోకేశ్‌ నోరు తెరిస్తే గబ్బు నోరు. విద్యుత్‌ ఛార్జీల పై ప్రశ్నించిన రైతులపై కాల్పులు జరిపించిన నీచుడు చంద్రబాబు. రైతులకు వ్యతిరేకంగా ఎన్నో విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు. ఈ జన్మ కాదు కదా.. వచ్చే జన్మలోనూ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి దరిద్రం ఉండకూడదు. రాష్ట్రం చేసుకున్న పాపం ఏమైనా ఉందంటే.. చంద్రబాబు లాంటి దరిద్రుడుకి లోకేశ్‌ లాంటి దరిద్రుడుకు జన్మ ఇవ్వటం ఒక్కటే. ఆ రెండు పొరపాట్లే రాష్ట్రానికి జరిగిన అరిష్టం.  అని మంత్రి ఫైర్ అయ్యారు.
చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి.. వారి కోసం ఒక్క పనైనా చేశారా?..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top