గొంతు ఎండిపోయే.. పేగు మండిపోయే

Heartbreaking Photos Show Impact Of Kenya Drought On Its Giraffe Population - Sakshi

Giraffe Death In Kenya: ఆరు జిరాఫీలు.. నీటి కోసం గట్లు, గుట్టలు, చెట్లు, పుట్టలు.. అడవంతా తిరిగాయి. ఒంట్లో సత్తువ నశిస్తున్నా, నిలబడటానికి కూడా ఓపిక లేకున్నా దాహం తట్టుకోలేక వెతికాయి. కాస్త దూరంలో ఏదో బురదలా కనిపించగానే నీళ్లుంటాయని పరుగున అక్కడికెళ్లాయి. అంతే.. ఆ బురదలోనే చిక్కుకుని నీరు లేక గొంతెండి.. తిండిలేక పేగులు మండి చనిపోయాయి. (చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు)

గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న ఈ సంఘటన కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇటీవల జరిగింది. ఈ ఫొటోలను డిసెంబర్‌ 10న తీశారు. కొంతకాలంగా కెన్యా ఉత్తర ప్రాంతంలో వర్షాల్లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నీటి కోసం ఆ ప్రాంతంలోని ప్రాణులు అల్లాడుతున్నాయి. ఈ ఆరు జిరాఫీలు చనిపోయిన ప్రాంతానికి దగ్గర్లోని గరిస్సా కౌంటీలో 4 వేలకు పైగా జిరాఫీలున్నాయని, నీరు దొరక్కపోతే వీటికీ ప్రమాదం తప్పదని అక్కడి మీడియా చెబుతోంది. (చదవండి: అగ్ని పర్వతం బద్దలై.. బూడిదగా మారి‘నది’)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top