Eary Eyed Bride Enters Wedding Venue With Pic Of Her Late Mother, Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

Viral Video: చనిపోయిన తల్లి ఫోటోతో మండపం వద్దకు పెళ్లి కూతురు..

Dec 15 2021 3:44 PM | Updated on Dec 15 2021 7:31 PM

Viral video: Teary Eyed Bride Enters Wedding Venue With Pic Of Her Late Mother - Sakshi

పెళ్లి కూతురు దుస్తుల్లో ముస్తాబైన యువతి తన తండ్రి చేతిని పట్టుకొని వివాహ వేదికపైకి నడుచుకుంటూ వస్తుంది. పెళ్లి కూతురు మరో చేతిలో చనిపోయిన తన తల్లి ఫోటోను పట్టుకుంది. 

ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది అద్భుతమైన ఘట్టం. తల్లిదండ్రులు, బంధువులతో జరుపుకునే అందమైన వేడుక. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ పెళ్లి కూతురు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివాహ వేదిక వద్దకు వస్తున్న వధువు చేతిలో చనిపోయిన తల్లి ఫోటో పట్టుకొని రావడం అందరిని కంటతడి పెట్టిస్తోంది.
చదవండి: మత్తు చల్లుతున్నారు.. అందుకే చూశారా?

పెళ్లి కూతురు దుస్తుల్లో ముస్తాబైన యువతి తన తండ్రి చేతిని పట్టుకొని వివాహ వేదికపైకి నడుచుకుంటూ వస్తుంది. పెళ్లి కూతురు మరో చేతిలో చనిపోయిన తన తల్లి ఫోటోను పట్టుకుంది. వేదిక వద్దకు వస్తున్న క్రమంలో తల్లిని తలుచుకొని వధువు కన్నీంటి పర్యమంతమయ్యారు. ఇటు తండ్రి కూడా కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశారు. బ్యాగ్రౌండ్‌లో చునార్‌ అనే ఆత్మీయ పాట ప్లే అవ్వడం వీడియోకు మరింత ఫీల్‌ తోడైంది.
చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్‌​ అన్‌లాక్‌ చేశాడు.. రూ.18 లక్షలు కొట్టేశాడు!

అనంతరం యువతి బంధువులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ వారు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. పెళ్లి కూతురిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హృదయ విదారక వీడియోను ఇస్లామాబాద్‌కు చెందిన ఫోటోగ్రాఫర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశారు.

ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారడంతో లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి. నెటిజన్లు సైతం వీడియో చూస్తూ కంటతడి పెట్టుకుంటున్నారు. ‘వీడియో చూస్తూ అందరం కన్నీళ్లు పెట్టుకున్నాం. హృదయానికి హత్తుకునేలా ఉంది. అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఈ వీడియో మా హృదయాలను ద్రవింపజే​స్తోది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement