మాజీ ప్రియురాలు ఫోన్‌​ అన్‌లాక్‌ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!

Chinese Man To Unlock His Girl Friend Phone Steals18 Lakhs - Sakshi

Chinese Man To Unlock His Girl Friend Phone: స్మార్ట్‌ ఫోన్‌లు రావడంతో ఫోన్‌ని కొట్టేసినా లాక్‌ ఓపెన్‌ చేయడం అంత ఈజీ కాదు. పైగా చాలా మంది తమ ఫోన్‌కి లాక్‌గా ముఖాన్ని గానీ లేదా ఫింగర్‌ ప్రింట్‌ని గాని ఉపయోగిస్తున్నారు. దీంతో దొంగలు కూడా టెక్నాలజీకి అనుగుణంగా కొత్త తరహాలోనే దొంగతనలు చేస్తున్నారు. అచ్చం అలానే చైనాలో ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలిని మోసం చేశాడు.

(చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కరోనా రావడంతో కోమాలోకెళ్లింది..! అప్పటికే..)

అసలు విషయంలోకెళ్లితే...చైనాలో నానింగ్‌కు చెందిన 28 ఏళ్ల హువాంగ్‌ తన మాజీ ప్రియురాలు డాంగ్‌ నిద్రపోతున్నప్పుడు ఆమె ఫోన్‌ని అన్‌లాక్‌ చేసి మరీ రూ.18 లక్షలు డబ్బులు కొట్టేశాడు. పైగా డాంగ్‌ ఫోన్‌ని యాక్సెస్‌ చేసేందుకు నిదురుపోతున్న ఆమెకు తarయకుండా ఆమె కనురెప్పలు ఎత్తి మరి ఫోన్‌లాక్‌ ఓపెన్‌ చేశాడు.. ఆ తర్వాత ఆమె ఫింగర్‌ ఫ్రింట్ల సాయంతో ఆమె ఖాతా నుంచి ఏకంగా రూ. 18 లక్షలు వరకు కొట్టేశాడు.

ఆపై ఆమె ఫోన్‌కి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా కొన్ని నెలలు తర్వాత హువాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే హువాండ్‌ ఈ నేరాన్ని డాంగ్‌ భోజనం చేసి మందులు వేసుకుని నిద్రపోతున్నప్పుడు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆ తర్వాత కోర్టు అతనికి రూ. 2లక్షలు జరిమానా తోపాటు మూడున్నర సంవత్సరాల  జైలు శిక్ష విధించింది.

(చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇ‍వ్వడంలో సుకేశ్‌ భార్యదే కీలక పాత్ర)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top