కెన్యా దేశానికి చెందిన ప్రియమైన క్రెగ్ అనే ఏనుగు తన రెండు దంతాలతో ప్రసిద్ధి చెందింది. ఒక్కో దంతం 45 కిలోలతో ఆ ఏనుగు ఖ్యాతి గడించింది. అయితే ఆ ఏనుగు కన్నుమూసింది. ఇటీవల అంబోసెలి నేషనల్ పార్క్‌లో ఆ ఏనుగు మరణించింది. చనిపోయేనాటికి ఏనుగు వయస్సు 54 ఏళ్లు.
1972లో అంబోసెలి నేషనల్ పార్క్‌లో జన్మించిన క్రెగ్.. ఇప్పుడు అదే పార్క్‌లో మరణించింది. సూపర్ టస్కర్ అనే అరుదైన వర్గానికి చెందిన ఏనుగు. ఈ వర్గానికి చెందిన ఏనుగుల దంతాలు ఒక్కొక్కటి 45 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి.
క్రెగ్ యొక్క దంతాలు చాలా పొడవుగా ఉండి నడుస్తున్నప్పుడు నేలను తాకేవి. కెన్యా వన్య ప్రాణ సంరక్షణలో క్రెగ్ ప్రముఖ పాత్ర పోషించింది. క్రెగ్ మరణం తర్వాత అతని దంతాలను జాగ్రత్తగా తొలగించి సంరక్షణ కోసం భద్రపరిచింది. క్రెగ్ వారసత్వాన్ని కాపాడే క్రమంలో ఆ దంతాలను భద్రపరిచారు.


