Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Yellow Gang Plans Attacks On Votes counting day
అంతకు మించి అరాచకం!

సాక్షి, అమరావతి: ఎన్నికల హింసకు తెగబడ్డ పచ్చ ముఠాలు ఈ కుట్రలకు పదును పెడుతుండటం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. పోలింగ్‌ సంద­ర్భంగా యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు పాల్ప­డిన టీడీపీ రౌడీ మూకలు ఓట్ల లెక్కింపు రోజు మరింత బరి తెగించేందుకు పథకం రూపొందించి­నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటివరకు పోలీ­సులు అరెస్ట్‌ చేసిన వారితోపాటు అదుపులోకి తీసు­కున్న వారిలో 75% మంది టీడీపీకి చెందిన­వారే కావడం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలకు అద్దంపడుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అలజడులు రేకెత్తించడం, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టించేందుకు భారీ కుట్రలకు తెర తీశాయి. పచ్చ ముఠాలు, అల్లరి మూకలు విసురుతున్న సవాల్‌ను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్‌ సందర్భంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు కార్డన్‌ – సెర్చ్‌ ఆపరేషన్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు శాఖసోదాలు నిర్వహిస్తోంది. నేర చరితులను అదుపులోకి తీసుకుంటోంది. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలను, రికార్డులు లేని వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టింది. బదిలీలతో అల్లరి మూకల అరాచకం..రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకలు యథేచ్చగా విధ్వంస కాండకు తెగబడ్డాయి. చంద్రబాబు, పురందేశ్వరిఈసీపై ఒత్తిడి తెచ్చి పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పన్నాగాన్ని అమలు చేశారు. ప్రధానంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులు, రాడ్లతో విరుచుకుపడటంతోపాటు బాంబు దాడులకు కూడా తెగబడి బీభత్సం సృష్టించాయి.గూండాగిరీ అంతా పచ్చముఠాదేపోలింగ్‌కు ముందు, అనంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినవారిని గుర్తించి పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఎన్నికల ముందు నమోదైన కేసులతో ప్రమేయం ఉన్న 1,522 మందిని గుర్తించి కొందరిని అరెస్ట్‌ చేసింది. మిగిలిన వారికి 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. వీరితో దాదాపు 1,300 మంది టీడీపీ వర్గీయులే కావడం గమనార్హం. ఇక పోలింగ్‌ రోజు దాడులు, ఘర్షణల కేసుల్లో ప్రమేయం ఉన్న 2,790 మందిని గుర్తించగా కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చారు. పోలింగ్‌ రోజుల అరాచకాలకు తెగబడ్డ వారిలో దాదాపు 2,400 మంది టీడీపీకి చెందిన వారే కావడం ఆ పార్టీ కుట్రలను బట్టబయలు చేస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 85 మందిపై హిస్టరీ షీట్లను తెరవగా వీరిలో 58 మంది టీడీపీ వర్గీయులే ఉన్నారు. టీడీపీకి చెందిన ముగ్గురిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించగా మరో ఇద్దరిని జిల్లాల నుంచి బహిష్కరించారు. పోలీసుశాఖ గత మూడు రోజులుగా 301 సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్‌ – సెర్చ్‌ ఆపరేషన్ల ద్వారా విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎటువంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేసింది. 482 లీటర్ల సారాయి, 3,332 లీటర్ల అక్రమ మద్యం, 436 లీటర్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలకు తెగబడే ప్రమాదం ఉన్నందున పటిష్ట బందోబస్తు కల్పించారు. 350 స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలకు కేంద్ర బలగాలు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు బలగాలు, సివిల్‌ పోలీసులు 24/7 మూడంచెల భద్రతతో పహరా కాస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు బాడీ వార్న్‌ కెమెరాలను సమకూర్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద వెయ్యికి పైగా అధునాతన ఫేస్‌ రికగ్నైజేషన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్‌), ఎస్పీ/ పోలీస్‌ కమిషనర్లు పాసులు జారీ చేసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు వచ్చిన అధికారులు, సిబ్బంది వివరాలను నమోదు చేస్తున్నారు. వీడియోగ్రఫీ ద్వారానే లోపలికి అనుమతిస్తున్నారు. అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను అనుసంధానిస్తూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పటిష్ట నిఘా కోసం స్ట్రాంగ్‌ రూమ్‌ల చుట్టూ ఫ్లడ్‌ లైట్లను అమర్చారు. స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్న ప్రదేశానికి 2 కి.మీ. పరిధిని రెడ్‌ జోన్‌గా ప్రకటించి డ్రోన్లు, బెల్లూను ఎగురవేయడాన్ని నిషేధించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్‌ కేంద్రాలకు సురక్షితంగా తరలించే ప్రక్రియను ఖరారు చేశారు.అమలులో నిషేధాజ్ఞలుస్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలున్న నగరాలు, పట్టణాల్లో ఓట్ల లెక్కింపు ముగిసేవరకూ వరకూ పోలీసు శాఖ నిషేధాజ్ఞలను విధించింది. 30 పోలీస్‌ యాక్ట్, సెక్షన్‌ 144 అమలులో ఉంటాయని ప్రకటించింది. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కర్రలు, కత్తులు, రాడ్లు, ఇతర ఆయుధాలతో సంచరించకూడదని హెచ్చరించింది. పెట్రోల్‌ బంకుల్లో విడిగా పెట్రోల్, డీజిల్‌ విక్రయించకూడదని ఆదేశించింది. అసత్య వార్తలు, ఫేక్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయకూడదని పేర్కొంది.ప్రజలు సహకరించాలి: డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాఅసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తాం. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. సంయమనం పాటించాలి. చట్టవ్యతిరేక, అసాంఘిక శక్తుల కదలికల గురించి టోల్‌ ఫ్రీ నంబర్లు 100, 112లకు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమివ్వాలి.కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టంఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశంపై ఈసీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. రాష్ట్రంలో 33 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. లెక్కింపు త్వరగా నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ప్రతిపాదించారు. పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత 15 రోజుల వరకు 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే కొనసాగనున్నాయి.

Pinnelli Ramakrishna Reddy comments on Julakanti Brahma Reddy
నేను ఎక్కడికి పారిపోలేదు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం

సాక్షి, పల్నాడు: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాను సిద్ధ­మని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైద­రా­బాద్‌లో విలేకరుల­తో మాట్లా­డారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మా­రెడ్డి మాచర్ల నియో­జ­­క­­వ­­ర్గ­ంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజ­లను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్ప­టం హాస్యాస్పదంగా ఉంది. ఏడు మర్డర్‌ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపో­యాడు. ఆ తర్వాత నియోజక­వర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబా­బు తీసు­కొచ్చి పల్నా­డు­లో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండ­లంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంట­చింతల మండలంలో తుమృకోట, పాలవా­యి­గేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెంది­నవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టి­ంచారు. కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతా­యని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్‌ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించు­కోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీ­సుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారి­పోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామా­జికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు. టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు.

Ap Elections 2024 May 22nd Political Updates Telugu
May 22nd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 22nd AP Elections 2024 News Political Updates..7:20 AM, May 22nd, 2024గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం: ఎమ్మెల్యే పిన్నెల్లిపల్నాడులో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ నేతలు గొడవలు చేశారు. పోలింగ్‌ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధంఅనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. పల్నాడులో వాళ్లు గెలిచే పరిస్థితి లేకపోవడంతో అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ వాళ్లు గొడవలు చేశారు. పోలింగ్ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకి నేను సిద్ధం.-ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి#YSRCPWinningBig#TDPLosing pic.twitter.com/cgi2SMXSmR— YSR Congress Party (@YSRCParty) May 21, 2024 7:00 AM, May 22nd, 2024ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్‌పోలింగ్‌ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగంకుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘావర్గాలురాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలుఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్నుగూండాలను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు.. అంతా టీడీపీ మూకలేస్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతరెడ్‌జోన్ల ఏర్పాటు.. నిషేధాజ్ఞలు విధింపు.. డ్రోన్‌ కెమెరాల వినియోగం నిషిద్ధం 6:55 AM, May 22nd, 2024సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధంజూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతిటీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడిఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారుపారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డినేను ఎక్కడికి పారిపోలేదు... ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసుల సూచన మేరకు హైదరాబాద్‌ వచ్చా ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6:45 AM, May 22nd, 2024పవన్‌ ఎక్కడ?పవన్‌ పర్యటనపైనా రాజకీయ వర్గాల్లో చర్చ14న ప్రధాని మోదీ నామినేషన్‌కు పవన్‌ హాజరుఅక్కడి నుంచి హైదరాబాద్‌ రాకఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేని పవన్‌రష్యా లేదా దుబాయ్‌ వెళ్లి ఉంటారంటున్న పార్టీ వర్గాలు 6:40 AM, May 22nd, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్‌ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 6:30 AM, May 22nd, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే.

Pawan is not available to anyone after the election
పవన్‌ ఏ దేశానికి వెళ్లారు?

సాక్షి, అమరావతి : ఎన్నికల పోలింగ్‌ అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడకు వెళ్లారన్నది స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. తాజాగా చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పేరుపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలతోపాటు సొంత పార్టీలోనూ చర్చకు దారితీసింది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఎక్కడకు వెళ్లారన్నదీ వారికీ తెలియక సతమతమవుతున్నారు. ఈ నెల 13న మంగళగిరిలోని ఓటు వేసిన పవన్‌ మరుసటి రోజు 14వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్‌ వచ్చారు. అప్పటి నుంచి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గానీ, హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గానీ పార్టీ నాయకులెవరికీ అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రష్యా లేదా దుబాయ్‌ వెళ్లి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు తరహాలోనే పవన్‌ కూడా తన విదేశీ పర్యటనపై గోప్యత పాటించడంతో రాజకీయవర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నాగబాబు ‘ఎక్స్‌’ ట్వీట్‌ పెను దుమారం రేపినా..పోలింగ్‌ అనంతరం పవన్‌ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఓ ట్వీట్‌ మెగా కుటుంబంలో, జనసేన పార్టీలో పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపైనా పవన్‌ నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలింగ్‌ ముగిసిన వెంటనే నాగబాబు ఎక్స్‌లో ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయి వాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే..’ అంటూ ట్వీట్‌ చేశారు. మెగా – అల్లు ఉమ్మడి కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్లి తన మిత్రుడు, అక్కడి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్‌రెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన్ని ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్‌ చేశారంటూ పెద్ద దుమారం రేగింది.ఆ ట్వీట్‌పై అల్లు అర్జున్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగానే నాగబాబుపై తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో నాగబాబు తన ఎక్స్‌ అకౌంట్‌ను ఒక రోజు బ్లాక్‌ చేసి, రెండో రోజు ఆ ట్వీట్‌ను డిలీట్‌ (తొలగించానంటూ) చేశానంటూ ప్రకటించారు. ఈ వ్యవహారంపై పవన్‌ స్పందించకపోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది.

Singapore Airlines Reacts On Flight Turbulence Latest News
విమానంలో భయానక ఘటన.. సారీ చెప్పిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌

బ్యాంకాక్‌: లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా సీలింగ్‌ తగిలి, చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. ఊహించని పరిణామంతో హతాశుడైన ఓ ప్రయాణికుడు (73) అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఘటనపై ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.అసలేమైంది?211 మంది ప్రయాణికులు, 18 సిబ్బందితో విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బోయింగ్‌ 777 రకం ఎస్‌క్యూ321 విమానం మంగళవారం ఉదయం మయన్మార్‌ దగ్గర్లోని అండమాన్‌ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరిగింది. విమానం బయల్దేరిన 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయి ర్‌హోస్టెస్‌ ప్రయాణికులకు అల్పాహారం అందిస్తున్న సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా విమానం కుదుపులకు లోనైంది. మూడు నిమిషాల వ్యవధిలో ఆరువేల అడుగులు అంటే 37వేల అడుగుల ఎత్తు నుంచి 31వేల అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో బెల్ట్‌ పెట్టుకోని ప్రయాణికులంతా ఒక్క ఉదుటున గాల్లోకి లేచి సీలింగ్‌కు ఢీకొన్నారు. Aftermath of Singapore Airlines flight 321 from London to Singapore which had to divert to Bangkok due to severe turbulence. One death passenger and several injured. Blood everywhere, destroyed cabin. #singaporeairlines #sq321 pic.twitter.com/C2FgrVt9yv— Josh Cahill (@gotravelyourway) May 21, 2024 Severe turbulence on #SingaporeAirlines flight from London to Singapore results in 1 death and several injured passengers. This is a reminder - always have your seat belts fastened when inflight. #SQ321 pic.twitter.com/NV9yoe32ZC— Bandit (@BanditOnYour6) May 21, 2024 మూడు నిమిషాల పాటు విమానం అటూఇటూ ఊగుతూ కిందకు పడిపోతుండటంతో లోపలున్న వారంతా చెల్లా చెదు రుగా పడిపోయారు. అసలేం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో అస్వస్థతకు గురై 73 ఏళ్ల బ్రిటిష్‌ జాతీయుడు అక్కడికక్కడే మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. 31 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్‌ దేశస్తులున్నారు.ఘటన తర్వాత విమానాన్ని దారి మళ్లించి దగ్గర్లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ల్యాండ్‌చేశారు. గాయపడని ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్‌కు పంపేశారు.

Ex Minister KTR Slams Telangana Congress Govt
‘కాంగ్రెస్‌ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్‌ వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ రాష్ట్రంలో కరెంట్‌ కోతలు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితిని చూస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నంవిద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నంకాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నంఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నంసాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నంట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నంచుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నంపాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నంరైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నంతడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాంపదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నంచివరికి ఇవాళ జోగిపేటలో.. విత్తనాల కోసం రైతుల మొక్కులు..క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం..!కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..!అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..!ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..!జై కిసాన్జై తెలంగాణఅంటూ కామెంట్స్‌ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నంవిద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నంకాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నంఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నంసాగునీరు లేక ఎండిన… pic.twitter.com/cqNnFuzvk4— KTR (@KTRBRS) May 22, 2024

Fssai Finds No Traces Of Eto From Mdh And Everest Masala Spice
ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌లకు క్లీన్‌ చిట్‌

భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా బ్రాండ్‌లు ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ సంస్థలకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (fssai) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆ రెండు సంస్థల అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లోక్యాన్సర్‌కు కారకమయ్యే ఎథిలీన్‌ ఆక్సైడ్‌ (eto) రసాయనాలు లేవని నిర్ధారించింది.కొద్ది రోజుల క్రితం భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్‌ అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లో పరిమితికి మించి ఎథిలీన్‌ ఆక్సైడ్‌ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) ఏప్రిల్‌ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్‌ఎస్‌ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ రీకాల్‌ చేసింది.అందులో ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్, సాంబార్‌ మసాలా మిక్స్‌డ్‌ మసాలా పౌడర్, కర్రీ పౌడర్‌ మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌ ఉన్నాయి.ఎఫ్‌ఎస్‌ఏఐ అప్రమత్తంఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్‌ సేప్టీ కమిషనర్లు, రిజినల్‌ డైరెక్టర్లను అప్రమత్తం చేసింది. వెంటనే ఎవరెస్ట్‌, ఎమ్‌డీహెచ్‌ మసాల పొడుల శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసి వాటిపై టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు మహరాష్ట్ర, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌లలో మసాల దినుసుల శాంపిల్స్‌ను కలెక్ట్‌ చేశారు.ఇథిలీన్ ఆక్సైడ్‌ గురించి అన్వేషణపలు నివేదికల ప్రకారం.. అధికారులు మసాల దినుసుల శాంపిల్స్‌ను పరీక్షించారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ఇథిలీన్ ఆక్సైడ్ కోసం నమూనాలను పరీక్షించారు.28 ల్యాబ్‌ రిపోర్టులు అయితే ఇప్పటివరకు 28 ల్యాబ్ రిపోర్టులు అందాయి. ఫుడ్ రెగ్యులేటర్‌ సైంటిఫిక్ ప్యానెల్ శాంపిల్స్‌ను విశ్లేషించగా వాటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని తేలింది.ఆ రెండు కంపెనీలకు క్లీన్‌ చిట్‌అంతేకాదు ఇతర బ్రాండ్‌లకు చెందిన మరో 300 మసాలా శాంపిల్స్ పరీక్ష నివేదికలను కూడా విశ్లేషించింది. అయితే భారతీయ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చూపిస్తూ క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థం ఆనవాళ్లు లేవని ఎమ్‌డీహెచ్‌, ఎవరెస్ట్‌లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

Sunrisers Hyderabad Skipper Pat Cummins Looking Forward to Qualifier 2
అదే మా కొంప‌ముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్‌

హైద‌రాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ విఫ‌ల‌మైంది. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(32), కమ్మిన్స్‌(30) పరుగులతో రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు , రస్సెల్‌,నరైన్‌, హర్షిత్‌ రనా, ఆరోరా తలా వికెట్‌ సాధించారు. అనంత‌రం 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేకేఆర్ ఊదిప‌డేసింది. కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేఆర్‌ బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(24 బంతుల్లో 58 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(51 నాటౌట్‌), గుర్భాజ్‌(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫ‌య‌ర్1లో ఓట‌మి పాలైన ఎస్ఆర్‌హెచ్ ఫైన‌ల్ చేరేందుకు మ‌రో అవ‌కాశం మిగిలి ఉంది. మే 24న జ‌ర‌గనున్న క్వాలిఫ‌య‌ర్‌-2లో ఆర్సీబీ లేదా రాజ‌స్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్‌"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మా​కు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్‌ ఉంది. సెకెండ్‌ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.ప్రస్తుత టీ20 క్రికెట్‌లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్‌ ఇచ్చాం. కానీ మా ప్లాన్‌ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్‌ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రారంభంలో పిచ్‌ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. ఇక క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్‌ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.

All eyes are on postal ballot votes
అందరి కన్నూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపైనే..

సాక్షి, అమరావతి : గతవారం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఈ ఓట్లలో అత్యధికం చెల్లని ఓట్లుగా మిగిలిపోవడంతో ఈసారీ అలాంటి పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఎంతమేర ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో ఏకంగా 56,545 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. అంటే.. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో 19.17 శాతం (దాదాపు ఐదో వంతు) ఓట్లు చెల్లనవిగా మిగిలిపోయాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన వివరాల ప్రకారం 4,44,218 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. ఇలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో అత్యధికులు బీఎల్వోలుగానో లేదంటే ఇతర రూపంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. దీంతో 2019 ఎన్నికలంటే దాదాపు 50 శాతం అధిక సంఖ్యలో ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో పెరుగుదల కనిపించింది. అయితే, ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను కలిసి పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై అందజేసిన వినతిపత్రాలతో ఈసారీ అధిక సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లని పరిస్థితే ఉంటుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం బ్యాలెట్‌ పత్రంపై గెజిటెడ్‌ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును చెల్లని ఓటుగా కాకుండా లెక్కింపులోకి తీసుకోవాలంటూ ఆయా పార్టీలు తమ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశాయి. దీంతో నమోదైన 4.44 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో నిబంధనల ప్రకారం గెజిటెడ్‌ అధికారి సంతకంతో ఎన్ని నమోదయ్యా­యి.. ఎన్నింటిపై సంతకంలేకుండా ఉన్నాయనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది.

Today Horoscope 22-05-2024 in Telugu
Rasi Phalalu: ఈ రాశివారి జీవితాశయం నెరవేరుతుంది

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.చతుర్దశి సా.5.56 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం: స్వాతి ఉ.7.16 వరకు, తదుపరి విశాఖ వర్జ్యం: ప.1.15 నుండి 2.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.19 వరకు, అమృతఘడియలు: రా.11.28 నుండి 1.11 వరకు. మేషం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాల్లో అనుకూలత.మిథునం: ఆర్థిక లావాదేవీలు అంతంతగానే ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.కర్కాటకం: ప్రయాణాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.సింహం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తిలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.కన్య: రుణయత్నాలు సానుకూలం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.తుల: నిరుద్యోగులకు కీలక సమాచారం. వాహనయోగం. చర్చల్లో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి సమస్యలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. సంఘంలో గౌరవం పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.మకరం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.కుంభం: మిత్రులు, బంధువులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.మీనం: శ్రమ మరింతగా పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement