
సుభలయలో కార్డన్‌సెర్చ్
హిరమండలం: సుభలయలో పోలీసులు మంగళవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్‌ఐ జి.నారాయణస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది సుభలయలో ఇంటింటా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా అల్లర్లకు, వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. బెట్టింగులు కొనసాగితే సమాచారం అందించాలని సూచించారు. ఎక్కడైనా జూదాలు, పందాలు కొనసాగితే పోలీసు స్టేషన్‌కు కానీ, సచివాలయంలో కానీ తెలియజేయాలన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.