ధాన్యం కొనుగోలు తీరుపై విచారణ
పోలాకి: ప్రభుత్వ ధాన్యం కొనుగోలుపై సర్వత్రా రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రకమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సివిల్ సప్లై రాష్ట్ర కమిషనర్ ఆదేశాలతో జిల్లాలో గురువారం పర్యటించి విచార ణ చేపట్టిన అధికారుల బృందం పలువురు రైతు లు, మిల్లర్లతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందితో మా ట్లాడి వివరాలు సేకరించారు. కమిటీ సభ్యులు జి.శిరీష(అడ్మిన్ మేనేజర్), టి.సుశీల(విజిలెన్స్ మేనేజర్)లు జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి పోలాకి మండలంలో గురువారం పర్యటించిన నేపథ్యంలో సాక్షిలో ప్రచురితమైన ‘మూడొంతులు దళారీలవే’ అనే కథనంపై ఆరా తీశారు. వైఎస్సార్‌సీపీ మండల రైతువిభాగం అధ్యక్షుడు యేదూరి శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యు డు ధర్మాన కృష్ణచైతన్యలను సంప్రదించే ప్రయ త్నం చేయగా వారు అందుబాటులో లేకపోవటంతో ఫోన్‌లోనే సివిల్ సప్లై, వ్యవసాయశాఖ అధికారులకు వేర్వేరుగా వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. దళారీలు, మధ్యవర్తుల కు రైతులు ఎందుకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందో వివరించారు.


