ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విచారణ
ఎచ్చెర్ల: రాజీవ్ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో శ్రీకాకుళం ప్రాంగణంలో విద్యార్థినులు తమపై వేధింపులు జరుగుతున్నాయని మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ (ఐసీసీ) ద్వారా విచారణ కొనసాగుతోంది. విద్యార్థులు మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు అనంతరం ఇక్కడ ఐసీసీ కమిటీ వేసిన విషయం విదితమే. కమిటీ సభ్యులు ప్రొఫెసర్ శ్రావణికనకకుమారి, అడ్వకేట్ పద్మజ, హెచ్‌సీ సరితలు వి ద్యార్థినుల వసతి గృహాలకు వెళ్లి వేధింపులపై ఆరా తీశారు.
డీఎంపై ఫిర్యాదుపై విచారణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్, ఆ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై గురువారం విజయవాడ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టారు. కానీ ఈ వ్యవహరాన్ని గోప్యంగా ఉంచారు. వాస్తవానికి జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉండగా విజయవాడ కా ర్పొరేషన్ అధికారులు కమిటీగా గోప్యంగా వచ్చి ఫిర్యాదుదారు పోలాకి మండలం సుస రాం గ్రామం శ్రీదుర్గా మోడరన్ రైస్ మిల్లు యజమాని తమ్మినేని భూషణరావుని పిలిపించి విచారణ చేశారు. ఈ వైఖరిపై చాలామంది మిల్లర్లు అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కరినే విచారించడం, ఆ సమయంలో డీఎం సీఎస్ లేకపోవడం వంటివి అనుమానాలకు తావిస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులు కాకుండా వేరే శాఖలోని ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తే మిల్లర్లకు న్యాయం జరిగేదని వారంటున్నారు. కమిటీ కూడా ఫిర్యాదు వివరాలు రాతపూర్వకంగా అడిగినందుకు ఆయన మరో ఫిర్యాదు చేశారు. 2024లో తమ మిల్లుకు 32, 908 క్వింటాళ్ల టార్గెట్ ఇస్తే ఈఏడాది 12,990 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారని, ఒక్కో మిల్లుకు ఒక్కోలా టార్గెట్ ఇచ్చారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అధికారులకు విన్నవించినా చర్యలు లేవని, దీంతో 8వ తేదీన గ్రీవె న్స్‌లో ఫిర్యాదు చేశానన్నారు. టార్గెట్ పెంచాల ని కలెక్టర్ సివిల్ సప్లై డీఎంకు ఆదేశించినా అమలు చేయలేదన్నారు. ఈ నెల 15న కలెక్టర్ తనను పిలిపించి మాట్లాడారని తెలిపారు. అయినా తనకు ఇంతవరకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఒక రైస్‌మిల్లు నుంచి ఏసీకేకు రూ.2500 వరకు డీఎం తీసుకుంటున్నారని ఆరోపించారు.


