ప్రైవేటీకరణం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భయం సామాన్యులను ఇంకా వదలడం లేదు. వైద్య విద్య దూరమవుతుందని విద్యార్థులు బాధ పడుతుంటే, సర్కారు వైద్యం ఖరీదైపోతుందేమోనని పేద, మధ్య తరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై వైఎస్సార్ సీపీ అలుపెరుగని పోరాటం చేస్తోంది.
ప్రభుత్వం పునరాలోచించాలి
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుంది. దీని ప్రభావంతో వైద్యం కూడా పేద, మధ్య తరగతి వర్గాలకు భారమవుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి. – సాడి. జ్యోత్స్న, ఇంటర్ విద్యార్థిని, కేసరపడ గ్రామం, కంచిలి మండలం
వైద్య విద్య ప్రశ్నార్థకమే..
కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్య ప్రశ్నార్థకమవుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు రూ.15 వేలు అవ్వాల్సింది ప్రైవేటు కాలేజీలో దాదాపు కోటిన్నర ఖర్చవుతుంది.
– మామిడి వేణునాయుడు, మామిడివలస, బూర్జ మండలం
ప్రైవేటీకరణం
ప్రైవేటీకరణం


