ఎంఎంఎస్ ఎన్నికల్లో రాజకీయం
కొత్తూరు: రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన మండల మహిళ సమాఖ్య అధ్యక్ష ఎన్నికలను టీడీపీ వర్గీయులు రాజకీయం చేసి వదిలేశారు. కొత్తూరు మండల మహిళ సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన రెండు వర్గాల వారి మధ్య తోపులాట జరిగింది. ఎంఎంఎస్ ఎన్నిక కోసం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామైక్య సంఘాల అధ్యక్షులు (వీఓ) కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే తీర్మానాలను వెంట తీసుకురాని వీఓలను కార్యాలయంలోకి పోలీస్‌లు అనుమతించలేదు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం రేగి తోపులాటకు దా రి తీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. మండలంలో 46 వీఓ అధ్యక్షులకు గాను 41 మంది వచ్చినా ఇక్కడ ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఎన్నిక వాయిదా వేసినట్లు వెలుగు లీగల్ కోఆర్డినేటర్ సాహు తెలిపారు.


