వైభవంగా అశ్వవాహన సేవ | Sakshi
Sakshi News home page

వైభవంగా అశ్వవాహన సేవ

Published Wed, May 22 2024 6:20 AM

వైభవంగా అశ్వవాహన సేవ

నరసన్నపేట: స్థానిక వేంకటేశ్వరాలయం ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అశ్వవాహన సేవ జరిగింది. ఆలయం వద్ద నుంచి స్వా మి వారిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపేటతో పాటు బొంతల వీధి, కలివరపు పేటలో ఊరేగింపు నిర్వహించారు. వందల మంది భక్తులు స్వామి వారి ఊరేగింపులో పాల్గొన్నారు.

అశ్వవాహన సేవను వైఎస్సార్‌ సీపీ నాయకులు పాగోటి రాజారావు, ఆలయ ట్రస్టీ ప్రతినిధి పి.కృష్ణప్రసాద్‌లు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. అర్చకులు కృష్ణమాచార్యులు, బ్రహ్మోత్సవాల కమిటీ ప్రతినిధులు మావుడూరి జగదీష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement