● జూన్‌ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ దుంపల లక్ష్మణరావు | Sakshi
Sakshi News home page

● జూన్‌ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ దుంపల లక్ష్మణరావు

Published Wed, May 22 2024 6:20 AM

● జూన

తెలంగాణ ఈ సెట్‌లో కొత్తూరు విద్యార్థి ప్రతిభ

కొత్తూరు: కొత్తూరు మండలం జోగిపాడుకు చెందిన అలివిల్లి కేతేశ్వరరావు తెలంగాణ ఈ సెట్‌ ఫలితాల్లో ప్రతిభను కనబరిచాడు. ఈ నెల 20 తేదీన తెలంగా ణ ప్రభుత్వం ఈసెట్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కేతేశ్వరరావు మెటరాలజీలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. కేతేశ్వరరావు విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కాలేజిలో డిప్లమా పూర్తి చేశాడు. కేతేశ్వరావు తల్లిదండ్రులు మిన్నారావు హైమావతి. తండ్రి విశాఖపట్నంలో ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఫస్టు ర్యాంకు సాధించడంపై విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అభినందించారు.

వైఎస్సార్‌సీపీదే అధికారం

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు కోసం, జూన్‌ 4 ఫలితాల కోసం వేయి కళ్లతో బడుగు బలహీన వర్గాలన్నీ ఎదురు చూస్తున్నాయని కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ దుంపల లక్ష్మణరావు (రామారావు) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుపేదలు, వృద్ధులు, మహిళలు ఓటు అనే ఆయుధంతో వైఎస్సార్‌సీపీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు అనుకూల మీడి యాతో ఎన్ని కుయుక్తులు చేసినా అంతిమంగా మళ్లీ సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జూన్‌ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, అందులో సందేహమే లేదన్నారు. అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచే నాయకుడు, పేదలకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అనే ఆస్తిని అందించి సుదీర్ఘకాలంలో వాటి ఫలితాలు అందుకునేలా ప్రణాళిక సిద్ధం చేసిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని తెలిపారు.

జిల్లాలో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, మూలపేట పోర్టు, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, బుడగట్లపాలెం ఫిషింగ్‌హార్బర్‌, హిరమండలం వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వంటి అనేక పనులు చేసినందుకు సిక్కో లు ప్రజలు జిల్లాలో 8కి 8 గెలిపించి సీఎంకు బహుమతిగా ఇస్తారన్నారు.

● జూన్‌ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్‌
1/1

● జూన్‌ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement