కుల ధ్రువీకరణ మంజూరుపై విచారణ
గార : మండలంలోని సతివాడ, శాలిహుండం, కొమరవానిపేట గ్రామాల్లో 15 కుటుంబాలకు ఎరుకుల కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుపై తహశీల్దార్ మునగవలస చక్రవర్తి అధ్యక్షతన గిరిజన సంక్షేమశాఖాధికారుల బృందం బుధవారం విచారణ చేపట్టారు. సతివాడ గ్రామంలో ఎరుకుల కుటుంబాల సమక్షంలో జరిగిన విచారణలో సీతంపేట ఐటీడీఏ అధికారుల బృందం పాల్గొంది. గతంలో గార తహశీల్దార్ బలివాడ దయానిధి మంజూరు చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఇప్పుడు అమల్లో లేకపోవడంతో వీరంతా జిల్లా కలెక్టర్‌తో పాటు జాతీయ ఎరుకుల కులస్ధుల సంఘ నాయకులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో మాజీ మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, ఆర్‌ఐ దివిలి రాజేంద్ర, పెదలాపు సుందర్, ముద్దాడ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.


