‘హద్దు’ అదుపు లేకుండా..! | - | Sakshi
Sakshi News home page

‘హద్దు’ అదుపు లేకుండా..!

Dec 18 2025 7:27 AM | Updated on Dec 18 2025 7:27 AM

‘హద్ద

‘హద్దు’ అదుపు లేకుండా..!

‘హద్దు’ అదుపు లేకుండా..! ● హద్దులు దాటుతున్న సారా విక్రయాలు ● ఒడిశా నుంచి ఆంధ్రా గ్రామాల్లోకి దర్జాగా రవాణా ● సరిహద్దు గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు

450 లీటర్ల నాటు సారా స్వాధీనం

● హద్దులు దాటుతున్న సారా విక్రయాలు ● ఒడిశా నుంచి ఆంధ్రా గ్రామాల్లోకి దర్జాగా రవాణా ● సరిహద్దు గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు

పాతపట్నం : ఒడిశా రాష్ట్రంలో తయారవుతున్న నాటుసారా ఆంధ్రా పల్లెల్లోకి దర్జాగా చేరుతోంది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల మీదుగా ప్యాకెట్ల రూపంలో విచ్చిలవిడిగా రవాణా అవుతోంది. ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ శాఖ పోలీసులు జిల్లాలో సారా బట్టీలపై తరచూ దాడులు నిర్వహిస్తూ తయారీదారులు, విక్రయదారులను పట్టుకుంటున్నా ఒడిశా సారాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

ఒడిశా రాష్ట్రంలో సరిహద్దు గ్రామాల పరిధిలో సారాబట్టీలు ఎక్కువ. అక్కడ తయారైన సారాను ఆంధ్రా సరిహద్దు గ్రామాలకు ఆటోలు, కార్ల ద్వారా తరలిస్తున్నారని సమాచారం. కొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన పెద్ద బురుజోల, చిన్న బురుజోల, మారంగి, సౌర తలసింగ్‌, గొఠాయ్‌, సింగిపూర్‌, హడ్డుబంగి బట్టి నుంచి 10 వేలు నుంచి 15 వేలు సారా ప్యాకెట్లు వారంలో రెండు, మూడు రోజులు రవాణా జరుగుతున్నా చాలావరకు పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం. కొత్తూరు మండలం నివగా, దిమిలి, రాయల, మాకవరం, మాతల, పొనుటూరు, కుద్దిగాం, బలద, కడుము, మదనాపురం, మెళియాపుట్టి మండలం గొప్పిలి, కరజాడ, గోకర్ణపురం, బాణాపురం, మెళియాపుట్టి, చాపర, వసుంధర, పాతపట్నం మండలం కాపు గోపాలపురం, హరిజన గోపాలపురం, కింగ, సవర సిద్దమనుగు, ఎగువ సిద్దమనుగు, బొన్ని, బైదలాపురం, పెద్దసున్నాపురం, సరాలి, చంగుడి, అంతరాబ తదితర గ్రామాల్లో సాయంత్రం అయ్యే సరికి మందుబాబులు ఒడిశాలోని హడ్డుబంగి, పర్లాకిమిడితో పాటు మండలానికి ఆనుకొని ఉన్న పలు ఒడిశా గ్రామాలకు వెళ్లి నాటుసారా తాగుతుంటారు. వచ్చేటప్పుడు కూడా కొన్ని ప్యాకెట్లు తీసుకొచ్చి గ్రామాల్లో రహస్యంగా విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో సారా అరికట్టడంలో తలమునకలైన ఎకై ్సజ్‌ పోలీసులకు ఈ ఒడిశా సారా మరింత తలనొప్పులను తెచ్చిపెడుతోంది. ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్‌ అధికారులు అప్పుడప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసినప్పటికీ, ఒడిశా రాష్ట్రంలో సరిహద్దు గ్రామాల పరిధిలో సారాబట్టీలు ఎక్కువ. అక్కడ తయారైన సారా ఆంధ్రలోకి తరలిస్తున్నారు. ఇప్పటికై నా ఎకై ్సజ్‌ అధికారులు స్పందించి ఒడిశా సారా రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

నిఘా పెట్టాం

ఒడిశా రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల నుంచి ఆంధ్రా రహదారుల్లో నాటు సారా అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. అక్రమ రవాణా అరికట్టేందుకు ఒడిశా ఎకై ్సజ్‌ అధికారులతో కలిసి సరిహద్దు గ్రామాల్లో సారా బట్టీలపై దాడులు చేస్తున్నాం. అక్రమ రవాణా జరిపే వ్యక్తులను గుర్తించి కేసులు పెడుతున్నాం.

– కోట కృష్ణారావు,

సీఐ, ఎకై ్సజ్‌ స్టేషన్‌, పాతపట్నం

‘హద్దు’ అదుపు లేకుండా..! 1
1/2

‘హద్దు’ అదుపు లేకుండా..!

‘హద్దు’ అదుపు లేకుండా..! 2
2/2

‘హద్దు’ అదుపు లేకుండా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement