
కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
● మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలి ● జాయింట్ కలెక్టర్ నవీన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. జి ల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఒక్కో హాల్‌లో అ బ్జర్వర్లకు ఒక సహాయకుడు ఉండాలని సూచించా రు. లేబర్ ఆరెంజ్‌మెంట్‌కు సంబంధించి డ్వామా పీడీ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. శిక్షణ తరగతులకు సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్ మే 25న జరగనుండగా, దీని కోసం చేపట్టాల్సిన పనులపై కూడా సమీక్షించారు. తరగతుల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన సూచనలు అనుసరించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై పూర్తి శిక్షణ అందజేయాలని, 23వ తేదీన ఆర్‌ఓలకు ఏఆర్‌ఓలకు కూ డా శిక్షణ తరగతులు జరగనున్నాయని తెలిపారు. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి మూడు అంచెల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. మీడియా సెంటర్ ఏర్పాట్లపై జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారితో సమీక్షించి చేపట్టాల్సిన పనులపై సూచనలు అందజేశారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తదితర ఏర్పాట్లపై డిప్యూటీ సీఈఓతో సమీక్షించారు. కౌంటింగ్ హాల్ ఏర్పాట్లపై ఆరా తీశారు. సీసీ టీవీ ఏర్పాట్లు, వీడియోగ్రాఫర్స్ ఏర్పాట్లపై సూచనలు అందజేశారు. అనంతరం సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించి మొబైల్ కలెక్షన్ కౌంటర్, మెటల్ డిటెక్టర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుపై పోలీసులకు సూచనలు అందజేశారు. కౌంటింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై సుడా వీసీకి, కౌంటింగ్ కేంద్రంలో కావాల్సిన స్టేషనరీ ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సీఈఓకి తగు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వర రావు, సుడా వీసీ ఓబులేసు, సర్వశిక్షాఅభియాన్ పీఓ జయప్రకాశ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఎన్‌ఐసీ సిరాజ్, కిరణ్, డీసీఓ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికలు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ప్రారంభించారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల పరిశీలకుల సూచనల మేరకు ఏర్పాట్లు ప్రారంభించారు. జిల్లాలోని 8 నియోజక వర్గాలకు సంబంధించి 18 స్ట్రాంగ్ రూముల్లో ఎల క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్ర పర్చారు. కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లు పరిశీలించి, అనంతరం ఈవీఎంల లెక్కింపు నిర్వహించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొత్తం
సీసీ కెమెరాలు నిఘా, వీడియో చిత్రీకరణలో కొనసాగనుంది. కళాశాల ఆవరణలో సైతం టెంట్లు వే స్తున్నారు. మరో పక్క అధికారులు ట్రాఫిక్ మేనేజ్ మెంట్‌పై దృష్టిపెట్టారు. జిల్లా మొత్తం ఓట్ల లెక్కింపు ఇక్కడే కావటంతో భారీగా రాజకీయ పార్టీల శ్రేణులు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధిక సంఖ్యలో వాహనాలను అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, అధిక జనాలు గుమిగూడకుండా చర్యలు తీసుకునేలా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కౌంటింగ్ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతను కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రాధిక పర్యవేక్షిస్తున్నారు.

కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి