మనవాడైతే చాలు..
న్యూస్‌రీల్
శ్రీకాకుళం
జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలకు రంగం సిద్ధమైంది. కోడిరామ్మూర్తి స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. –8లో
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ముంపు ముప్పును
తప్పించండి
హిరమండలం: గొట్టా బ్యారేజీ సమీపంలో వంశధార చెంతనే ఉన్న తుంగతంపర గ్రామానికి చెందిన మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. కరకట్టలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏటా వర్షాకాలంలో గ్రామంలోకి వరద నీరు చొచ్చుకొస్తోందని, పంటలు ముంపుబారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గొట్టా బ్యారేజీకి ఎగువనున్న గట్టుకు గండిపడటంతో ముంపు సమస్య తప్పడం లేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గండి పూడ్చడంతో పాటు నదీ తీరాన కరకట్ట నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని వంశధార అధికారులు తెలిపారు.
మంచినీటి పథకాల పనులు పూర్తి చేయాలి
అరసవల్లి: ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు చెందిన మంచినీటి పథకాల పనులు వెంటనే పూర్తి చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. 2019 నుంచి మంజూరైన పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఎక్కడైనా నిధులుమంజూరై పనుల నిలిపివేత జరిగితే వాటి వివరాలను వెంటనే తనకు సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, డీఈలు పాల్గొన్నారు.
వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలో సూర్యమహాల్ జంక్షన్ వద్ద వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరత తీర్చవచ్చన్నారు. నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
వెనకొచ్చినా బిల్లు !
ఈ ఫొటోలో ఉన్న రోడ్డు చూడండి. 2024 మార్చి 28న జిల్లా కేంద్రంలోని పీఎన్ కాలనీ మూడో లైన్‌లో రూ.10.93 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారిది. దీని బిల్లు ఇంతవరకు చెల్లించలేదు. ఇదే కాలనీలో ఎనిమిదో లైన్‌లో రూ.13.05లక్షలతో 2024 డిసెంబర్ 21 రహదారి వేసారు. దానికి సంబంధించిన బిల్లు కూడా చెల్లింపులు చేయలేదు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లను పట్టించుకోకుండా.. నేతల సిఫార్సులున్న వారికి అధికారులు పెద్దపీట వేస్తున్నారు. కీలక నేత పంపించే జాబితాలో ఉన్న వారికే చెల్లింపులు చేస్తున్నారు. ఆ జాబితాలో పేరు లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు. ఏ ప్రాతిపదికన బిల్లులు చెల్లిస్తున్నారో చెప్పాలంటూ సమాచార హక్కు చట్టాన్ని సైతం ఆశ్రయిస్తున్నారు.
ఏంటీ దారుణం?
టీడీపీ పాలనలో కొందరు కాంట్రాక్టర్ల దుస్థితి దారుణంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మా బిల్లులు మాకివ్వండి మహాప్రభో అంటూ ప్రాధేయపడుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో సామాన్య కాంట్రాక్టర్ల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చేసిన పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నలుగురైదుగురు కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి. చెల్లింపుల విషయంలో అధికారులు సైతం డమ్మీలుగా మిగిలిపోతున్నారు. కీలక నేత చెప్పిన వాళ్లకే బిల్లులు చెల్లించి, మిగతా వారికి మొండిచేయి చూపిస్తున్నారు.
నిబంధనలకు తూట్లు..
కార్పొరేషన్ పరిధిలో చాలా పనులకు చెల్లింపులు జరగలేదు. దాదాపు రూ.8 కోట్లకు సంబంధించి 200 వర్క్స్ వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వాస్తవానికి బిల్లులు చెల్లింపుల విషయంలో నిర్దేశిత మార్గదర్శకాలు ఉన్నాయి. ముందుగా చేసిన పనికి ముందుగా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఒకేసారి జరిగిన పనులకు ఒకేసారి చెల్లింపులు చేయాలి. కానీ, శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌లో నిబంధనలు పాటించకుండా, ప్రలోభాలకు, సిఫార్సులకు లోనై ఇష్టానుసారంగా బిల్లులు చెల్లిస్తున్నారు. అందరికీ ఒకే విధానం అమలు చేయడం లేదు. కావాల్సిన వారికి త్వరితగతిన చెక్‌ల ద్వారా చెల్లింపులు చేస్తుండగా.. కాని వారికి సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసి వదిలేస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసిన వాటికి సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. ప్రభుత్వ స్థాయిలో లాబీయింగ్ చేసుకున్న వాళ్లకే త్వరితగతిన నిధులు జమ అవుతాయి. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఇదే జరుగుతోంది.
అధికార పార్టీ కోటరీ..
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అధికార పార్టీకి చెందిన కోటరీ రాజ్యమేలుతోంది. అక్కడ ఏ పనులు చేపట్టాలన్నా.. ఏ బిల్లులు చెల్లించాలన్నా వారి చేతుల్లోనే ఉంటుంది. ఆ కోటరీ అంతా కీలక నేత కనుసన్నల్లో పనిచేస్తోంది. ఏదైనా వర్క్ చేస్తే దానికి 2 శాతం కమీషన్ తీసుకోవడం ఆనవాయితీ నడుస్తోంది. కానీ, ఇక్కడ 5 శాతం, 10 శాతం, 15 శాతం కూడా ఇచ్చుకోవాల్సిందే. ఆ మేరకు పర్సంటేజీ ఫిక్స్ చేసేశారు. ఇవన్నీ కీలక నేతకే చేరుతున్నాయి. ఆ స్థాయిలో ముడుపులిచ్చిన వాళ్లకే పనులు జరుగుతున్నాయి. ఆ ముడుపులు ఇచ్చిన వాళ్లు కూడా అస్మదీయులై ఉండాలి. ఆ స్థాయిలో ముడుపులు ఇవ్వడం గిట్టుబాటు కాదనుకుంటే బిల్లు మర్చిపోవాల్సిందే. ప్రస్తుతం కార్పొరేషన్‌లో అదే జరుగుతోంది. ఈ విషయంలో అధికార యంత్రాంగం డమ్మీగా మారిపోయింది.
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అడ్డగోలు బాగోతం
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతం
కీలక నేత కనుసన్నల్లో వివక్ష
అత్యధిక పర్సంటేజీలకే అగ్రతాంబూలం
ప్రేక్షక పాత్రకు పరిమితమైన అధికారులు
కలెక్టర్‌కు ఫిర్యాదులు..
బిల్లుల చెల్లింపుల్లో వివక్షపై సంబంధిత కాంట్రాక్టర్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులను ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. కొందరికి చెల్లింపులు చేసి, మరికొందరివి పెండింగ్‌లో పెట్టడంపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసి కాంట్రాక్టర్లు వివరణ కోరుతున్నారు. ఏ ప్రాతిపదికన కొందరికి చెల్లింపులు చేశారు...ఏ ప్రాతిపదికన కొందరివి పెండింగ్‌లో పెట్టారో తెలియజేయాలని కోరుతున్నారు. అధికారులు ఇచ్చే వివరణ ఆధారంగా కోర్టును ఆశ్రయిస్తున్నారు.
పండగలా జగనన్న పుట్టిన రోజు వేడుకలు
నరసన్నపేట: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పండగలా నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో.. ఇలా అన్ని చోట్లా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ, కార్యక్రమాలు ఎంతో విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ తరహాలోనే జగనన్న పుట్టిన రోజు వేడుకలు కూడా కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. పార్టీ కుటుంబ సభ్యులందరూ ఏకమై వాడవాడలా హోర్డింగులు పెట్టాలని, కేక్‌కటింగ్‌లు, సంబరాలు జరపాలని, రక్త దాన శిబిరాలు నిర్వహించాలని, పేదలకు సాయమందించేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
మనవాడైతే చాలు..
మనవాడైతే చాలు..
మనవాడైతే చాలు..
మనవాడైతే చాలు..
మనవాడైతే చాలు..
మనవాడైతే చాలు..


