కొత్త టీచర్లకు జీతాలు చెల్లింపు
శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్సీ–25 ఉపాధ్యాయులకు ఎట్టకేలకు జీతాలు మంజూరయ్యాయి. ‘వీరు చేసిన పాపమేమిటో’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బిల్లులో తప్పులు ఉండడంతో వాటిని సరిచేసి పంపించాలని ఎంఈఓకు టెక్కలి ఖజానా శాఖ అధికారులు సూచించారు. బిల్లులు సరిచేసి దాఖలు చేయడంతో మూడు నెలలకు సంబంధించిన జీతాలు మంజూరయ్యాయి. సర్పంచ్‌గా ఉంటూ ఉద్యోగానికి ఎంపిక కావడంతో సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల ఒక అభ్యర్థికి సంబంధించిన బిల్లు మాత్రం పెండింగ్‌లో ఉంది. అది కూడా ఒకటి రెండు రోజుల్లో క్లియర్ అవుతుందని అధికారులు చెబుతున్నారు.


