అబ్బురపరిచిన.. వైజ్ఞానిక ప్రదర్శన
● సైన్స్ ఎగ్జిబిషన్‌లో 310 ప్రాజెక్టుల ప్రదర్శన
● రాష్ట్రస్థాయికి 11 ప్రాజెక్టుల ఎంపిక
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని గురజాడ విద్యాసంస్థల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. దీనిలో గ్రూప్ ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత, ఉపాధ్యాయ కేటగిరికు చెందిన 310 సైన్సు ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించారు. గ్రూప్ విభాగం నుంచి 7 ప్రాజెక్టులు, వ్యక్తిగత విభాగం నుంచి 2 ప్రాజెక్టులు, ఉపాధ్యాయ విభాగం నుంచి రెండు సైన్సు ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి రవిబాబు ప్రారంభించిన కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయ్‌కుమారి, పి.విలియన్స్, జిల్లా సైన్సు ప్రాజెక్టు అధికారి ఎన్.కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు
● ఇప్పిలి జెడ్పీహెచ్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఐ.సంజన, అనిల్‌లు కలిసి మల్టీపర్పస్ అగ్రికల్చర్ (సూర్యశక్తి ద్వారా సోలార్ ప్యానల్‌లో విద్యుత్ సరఫరాపై) ప్రాజెక్టును వివరించారు.
● సంతబొమ్మాళి మండలానికి చెందిన ఎంజేపీ స్కూల్ విద్యార్థులు బి.నరేష్, ఎ.సుధ ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన వాటర్ ఎక్స్‌ట్రాక్టింగ్ విజనరీ హౌస్(మురుగునీటి పునర్వినియోగం)ను తయారు చేశారు.
● సోంపేటకు చెందిన జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు బి.యోగేశ్వరి, నిఖిత, విజయలక్ష్మిలు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి న్యూ క్లియర్ పవర్ ప్లాంట్‌ను తయారు చేశారు.
● శ్రీకాకుళం గవర్నమెంట్ బాలికల స్కూల్‌కు చెందిన బి.హరిశ్రీ, తనుశ్రీ, బి.కృష్ణారావులు ఎమర్జింగ్ టెక్నాలజీతో యాంటీ సూసైడ్ ఫ్యాన్‌ను తయారు చేసి వివరించారు.
● పొందూరు గవర్నమెంట్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు కేకే పృథ్వీరాజ్, కె.దిలీప్‌కుమార్, బి.రమణలు హెల్త్ అండ్ హైజనిక్‌పై ప్రాజెక్టు తయారు చేశారు.
● జి.సిగడాం జెడ్పీహెచ్ స్కూల్‌కు చెందిన కె.గోపి, ఎం.ఆనంద్‌రాజులు కలిసి ప్యూరిఫికేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్‌పై ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించారు.
● సోంపేట ఏపీఎంఎస్ స్కూల్‌కు చెందిన విద్యార్థి కృష్ణవర్దన్ స్మార్ట్ సెన్సార్‌పై ప్రాజెక్టును తయారు చేశారు.
● టెక్కలి జెడ్పీహెచ్ పోలవరం స్కూల్‌కు చెందిన ఎన్.కౌషీ, కె.ఆచార్య కలిసి రియల్ టైమ్ విజిటర్స్ కౌంటర్ ప్రాజెక్టును తయారు చేశారు.
● టీచర్స్ ప్రాజెక్టుకు సంబంధించి లావేరు మండలంలోని అదపాక జెడ్పీహెచ్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న కె.కిరణ్‌కుమార్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ అప్లికేషన్‌పై ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించారు.
● గార మండలంలోని వాడాడ జెడ్పీహెచ్ స్కూల్‌కి చెందిన సైన్స్ టీచర్ బి.వెంకట్రావు ఇన్నోవేట్ లోకాస్ట్ టీచింగ్ టూల్స్‌పై ప్రాజెక్టును వివరించారు.
అబ్బురపరిచిన.. వైజ్ఞానిక ప్రదర్శన
అబ్బురపరిచిన.. వైజ్ఞానిక ప్రదర్శన


