● డ్రగ్స్ వద్దు బ్రో..!
గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడకండి.. వీటి బారిన పడి మీ అందమైన భవిష్యత్తును అంధకారం చేసుకోకండి.. డ్రగ్స్ వద్దు బ్రో..అంటూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నరసన్నపేటలో శుక్రవారం అభ్యుదయ యాత్ర చేపట్టారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి యువతలో చైతన్యం తీసుకురావడానికి సత్యవరం కూడలి నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకూ భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సభ ఏర్పాటు చేశారు. టెక్కలి డీఎస్‌పీ డి.లక్ష్మణరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఈగల్ క్లబ్ ఇన్‌చార్జి సీఐ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. – నరసన్నపేట


