Health
-
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇంత ప్రమాదకరమైనదా..? పాపం ఆ వ్యక్తి..
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో లుక్ మార్చుకోవాలనుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు కొందరు. అనుభవజ్ఞులైన నిపుణుల సమక్షంలో చేయించకోకపోతే జీవితాలే అల్లకల్లోలమవుతాయనే ఉదంతాలు ఎన్నో జరిగాయి. అందులోనూ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్.. ఏదైనా తేడాకొడితే..నేరుగా మన బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుంది. కోలుకుంటామా లేదా అనేది చెప్పడం కూడా కష్టమే. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు కేరళలోని ఎర్నాకుళంకి చెందిన సనీల్. అందంగా ఉండాలని చేయించుకున్న హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అతడి జీవితాన్ని ఎంతలా నరకప్రాయంగా చేసిందో వింటే..నోటమాట రాదు. ఇంత ప్రమాదరకరమైనదా.. ?హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనిపిస్తుంది.49 ఏళ్ల సనీల్ తన లుక్ అందంగా మార్చుకోవాలనుకుని కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లోని ఇన్సైట్ డెర్మా క్లినిక్‌ని సంప్రదించాడు. ఆ ఆస్పత్రి గురించి పూర్తిగా తెలుసుకునే యత్నం చేయకుండానే కేవలం ప్రకటనల ఆధారంగా సంప్రదించాడు. అయితే అక్కడ వైద్యులు అతడిని పరిశీలించి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. అలా అతడికి సదరు ఆస్పత్రి వైద్యులు చేద్దాం అనుకున్నా..నాలుగుసార్లు అనుకోని అవాంతరాలతో వాయిదా పడింది. అప్పుడైనా ఇలా ఎందుకు జరగుతుందని ఆలోచించినా బావుండేదేమో అంటున్నాడు సనీల్ బాధగా. చివరికి ఫిబ్రవరి 2025లో ఒకరోజు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సమయాత్తమయ్యాడు. రెండు రోజుల అనంతరం డిశ్చార్జ్ అయినా తర్వాత నుంచి ఇన్ఫెక్షన్ల బారినపడ్డాడు. మార్చి 1 నాటికి, అతడి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తలపై పసుపు రంగుమచ్చలు, ఒక విధమైన స్రావాలు కారడం మొదలైంది. అయితే సదరు క్లినిక్ ఇవన్నీ సాధారణ సమస్యలే అని, ఆస్పత్రికి రావాల్సిందిగా తెలిపారు సనీల్కి. దీంతో ఆస్పత్రికి వచ్చినా..పరిస్థితి మెరుగుపడలేదు కదా..మరింతగా పరిస్థితి దిగజారిపోయింది. నొప్పి తగ్గించే స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్ మందులు ఇచ్చారు. దాంతో సనీల్ శరీరంలో బీపీ, చక్కెరస్థాయిలు ప్రమాదకర స్థాయిలో అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ నరకయాతన భరించలేక అక్కడే సమీపంలో ఉన్న సనీల్ లౌర్డ్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నవ్య మేరీ కురియన్ వెంటనే అతన్ని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చాకో సిరియాక్ వద్దకు పంపారు. అక్కడ ఆయన సనీల్ పరిస్థితిని చూసి..మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు నిర్థారించారు. తక్షణమే సనీల్ని సర్జరీకి సిద్ధం కావాలని చెప్పారు. అలా సనీల్ ఇప్పటివరకు పదమూడు సర్జరీలకు పైగా చేయించుకున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ని నెక్రోటైజింగ్ ఫాసిటిస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీనికి శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, అత్యవసర శస్త్ర చికిత్స వంటి వాటితో పోరాడటమే ఏకైక మార్గం. ఈ ఇన్ఫెక్షన్ ఎముక కనిపించేంత వరకు కణజాలాన్ని తినేస్తుందట. తన తలలో ఒక రంధ్ర ఏర్పడిందని..ప్రస్తుతం తనకు ఇంకా చికిత్స కొనసాగుతుందని అన్నారు. అంతేగాదు ఆ ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతమంతా..ఒక విధమైన స్రావాలు కారడంతో వాక్యూమ్-అసిస్టెడ్ డ్రైనేజ్ పంప్‌ను అమర్చారు. ఆయన ఎక్కడకు వెళ్లినా.. దాన్ని కూడా తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను ఆర్థికంగా, మానసికంగా వేదనకు గురయ్యేలా చేసిన సదరు క్లినిక్‌పై ఫిర్యాదు చేయడమే గాక మూతపడేలా చేశాడు. అలాగే అందుకు బాధ్యులైన సదరు వైద్యులకు శిక్ష పడేదాక వదలనని, తనలా మరెవరూ ఇలాంటి బాధను అనుభవించకూడదని కన్నీటి పర్యంతమయ్యాడు సనీల్. అతడిగాథ వింటే..అందానికి సంబంధించిన శస్త్రచికిత్సల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో చెప్పడమే గాక మనోగత అందానికే ప్రాధాన్యం ఇవ్వాలనే విషయం చెప్పకనే చెబుతోంది.(చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..) -
అప్పడాలు ఇలా తింటే ఆరోగ్యమే..!
భోజనంలో సైడ్ డిష్‌గా కరకరలాడే అప్పడాలు ఉంటే అబ్బో ఆ భోజనం పొట్ట ఫుల్‌గా మనసు నిండుగా ఉంటుంది. అబ్బా.. తలుచుకుంటేనే నోరూరిపోయే ఈ అప్పడాలను ఇష్టపడని వారంటూ ఉండరు. చిన్నాపెద్ద అనే తేడాలేకుండా ఎంతో ఇష్టంగా తినే అప్పడాలు వాస్తవానికి అంత ఆరోగ్యకరమైనవి కాదు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులు అస్సలు తినకూడదు. అయితే అప్పడాలు వేయించిన ఘుమఘమకి నోరూరిపోతుంటుంది. తినకుండా ఉండాలంటే చాలా కష్టమే. అలాంటివాళ్లు వాటిని మిస్ చేసుకుంటున్నాం అనే బాధ లేకుండా హాయిగా తినే చక్కటి మార్గం ఏంటో.. పోషకాహార నిపుణుల మాటల్లో తెలుసుకుందామా..!.మెటబాలిక్ హెల్త్ కోచ్ కరణ్ సారిన్ అప్పడాలంటే ఇష్టపడని వారెవరుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆరోగ్యకరంగా తినడం తెలిస్తే చాలు..అని అంటున్నారు. సాధారణంగా మినపప్పుతో చేసే ఈ అప్పడాలు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారని అన్నారు. అయితే మినపప్పు ఆరోగ్యానికి మంచిదే అయినా..ఇందులో వినియోగించే మసాలా, సోడియం, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ. అందువల్ల ఇది ఆరోగ్యానికి అంత మంచికాదని తేల్చి చెప్పారు. అదీగాక దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల తీసుకుంటే రక్తంలో చక్కెర స్తాయిలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుందట. అయితే కాస్త తెలివిగా పరిమిత ప్రమాణంలో ఆరోగ్యకరంగా తింటే ఎలాంటి సమస్య ఉండదని నమ్మకంగా చెబుతున్నారు న్యూటిషనిస్ట్ కరణ్. అంతేగాదు అదెలాగా ప్రయోగాత్మకంగా వీడియో రూపంలో చూపించారు కూడా. ఇది శుద్ధి చేసిన పిండే అయినప్పటికీ దీనిలో చక్కెర శాతం ఉండదు. కానీ ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్(GI) మాత్రం ఎక్కువే. అందుకని దీన్ని కూరగాయలు, సలాడ్ల రూపంలో తీసుకుంటే హెల్దీగా ఉంటుందట. అలా ఆయన స్వయంగా తిని చూపించారు. అంతేగాదు రెండు గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా సమస్థాయిలో ఉన్నాయో స్పష్టంగా చూపించారు. దీన్ని చిరుతిండిలా ఉల్లిపాయలు, టమోటాలు, దోసకాయ, వంటి అధిక ఫైబర్ టాపింగ్స్‌తో జత చేసి హాయిగా తినేయొచ్చని అంటున్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అప్పడాలను ఇలా హెల్దీగా తినేయండి. View this post on Instagram A post shared by Karan Sarin (@sweetreactions) (చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..) -
నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్
హైరా హైరా హాయ్ రబ్బ..హైరా హైరా హాయ్ రబ్బ.. అంటూ యూత్అను అలరించి ఫిఫ్టీ కేజీ తాజ్‌మహల్, తేనె కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్. తన అందం, అభినయంతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందీమాజీ ప్రపంచ సుందరి. అయితే బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి,గర్భధారణ, పాపకు జన్మనిచ్చిన తరువాత ఆమె శరీరంలో చాలా మార్పులొచ్చాయి. ప్రసవం తర్వాత,ఐశ్వర్య శరీర బరువుపై చాలా విమర్శలొచ్చాయి. ముఖ్యంగా వివిధ ప్రపంచ వేదికల మీద ఐశ్వర్య లుక్‌పై చాలా వ్యాఖ్యానాలు, అవమానకర సెటైర్లు చెలరేగాయి. తన శరీర ఆకృతిని జడ్జ్ చేస్తూ, బాడీషేమింగ్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో వచ్చిన వ్యాఖ్యలపై ఎప్పుడూ మౌనంగా, గౌరవ ప్రదంగా కనిపించిన ఐశ్వర్య స్పందించింది. 78వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో తనదైన శైలిలో అటు అభిమానులను, తన డ్రీమీ లుక్‌తో ఇటు ఫ్యాషన్ నిపుణులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది.తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లు, గాసిప్‌లు, తన వెయిట్‌పై ఎన్నడూ స్పందించని ఐశ్వర్య మాత్రం ఒక సందర్భంలో ఆ లెక్క తేల్చేసింది. తనను విమర్శించిన వారిందరికీ ఘాటు రిప్లై వచ్చింది.ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా2011లో తల్లి అయిన తర్వాత, బరువు కారణంగా తీవ్రంగా ట్రోలింగ్‌కు గురైంది. గతంలో డేవిడ్ ఫ్రాస్ట్‌తో జరిగిన ఇంటర్వ్యూలో, ఐశ్వర్య తన గర్భధారణ బరువును తగ్గించుకోవడం గురించి అడిగినప్పుడు అసలు దీని గురించి అంత చర్చించాల్సి అవసరం లేదని, ఇది చాలా సహజమని చెప్పుకొచ్చింది. నేను బరువు పెరిగానా లేదా, నీరు పట్టిందా, ఇవేవీ నేను పట్టించుకోను. నా బాడీతో చాలా హాయిగా , సంతోషంగా ఉన్నాను. పాప ఆరాధ్యను చూసుకోవాల్సిన సమయంలో కూడా బయటకు వచ్చాను, లావుగా ఉన్నాననీ, బహిరంగంగా బయటకు వెళ్లడం మానేయలేదని అదే తనకు ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని ప్రకటించింది. కావాలంటే రాత్రికి రాత్రే బరువు తగ్గించుకోవచ్చు. కానీ నాకు అవసరం లేదనిపించింది. నా గురించి జనాలు మాట్లాడుకుంటూ బిజీగా ఉండే నాకేమీ సమస్యలేదు. కానీ నేను మాత్రం బిడ్డతో చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేసింది.మాతృత్వం తనను వెనక్కి నెట్టలేదని నిరూపించింది ఐశ్వర్య రాయ్, కెరీర్, కుటుంబాన్ని సమతుల్యం చేస్తూ, అవమానాలు, అవహేళన వ్యాఖ్యలకు కృంగిపోకుండా, ఒక మహిళగా ఉండాల్సిన ఆత్మ విశ్వాసం, సెల్ఫ్ లవ్ ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరిస్తూ ఒక రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే! -
వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!
ఇటీవలి కాలంలో వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి? అనేదానిపై తీవ్రంగా చర్చ నడిచింది. ఇన్ఫోసిస్ నారాయణ లాంటివాళ్లు ఎక్కువ పనిగంటలు, అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ విషయంలో తాజాగా జరిగిన ఒక పరిశోధన విస్తుపోయే అంశాలను వెల్లడించింది. వారానికి 52 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పనిచేసే వారిలో మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుందని పరిశోధకులు గుర్తించారు.ఆక్యుపేషనల్ & ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ (BMJ ప్రచురణ) జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం అనేక అంశాలను లేవనెత్తింది. అవేంటో చూద్దాం.కరియర్కోసమో, ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించాలనే కాంక్షతోనో మితిమీరి పనిచేస్తే కొన్ని దుష్ర్బభావాలు తప్పని అధ్యయనం తేల్చి చెప్పింది. వారానికి 52 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయడం వల్ల మెదడు పనితీరు దెబ్బ తింటుంది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, మరియు భావోద్వేగ నియంత్రణలో తీవ్ర మార్పులులొస్తాయని కనుగొంది. విశ్రాంతిని పట్టించుకోకుండా,అతిగా పనిచేయడంవల్లశరీరంతోపాటు, మెదడుకు కూడా తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. అంతేకాదు, మెదడు ఆకృతిలో కూడా మార్పులు సంభవిస్తున్నాయని తేల్చారు. ముఖ్యంగా కూర్చుని పనిచేసే వారి మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోతోందిట. ఇలాంటి వారిలో తీవ్రమైన డిప్రెషన్ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రకటించింది. ఇదీ చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదాయోన్సే విశ్వవిద్యాలయం, చుంగ్-ఆంగ్ విశ్వవిద్యాలయం , పుసాన్ నేషనల్ విశ్వవిద్యాలయం నుండి దక్షిణ కొరియా పరిశోధకుల బృందం నిర్వహించిన ఈ అధ్యయనం 110 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ స్టడీ చేసింది. ఇందుకోసం అధునాతన మెదడు ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించింది. అధిక పని చేసే వ్యక్తులు వారి మెదడుల్లో గుర్తించదగిన నిర్మాణాత్మక మార్పులను చూపించారని, అధిక పని చేసే వ్యక్తులు తరచుగా నివేదించే భావోద్వేగ , ఏకాగ్రత లేకపోవడం, అభిజ్ఞాన సమస్యలు తదితర మార్పులు ఉన్నాయని గుర్తించారు. చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకిఎక్కువ గంటల పని, మెదడు నిర్మాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?పరిశోధకులు వారానికి 52 గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే ఆరోగ్య కార్యకర్తలను తక్కువ గంటలు పనిచేసే వారితో పోల్చారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) ఆధారిత పద్ధతులు, వోక్సెల్-ఆధారిత మోర్ఫోమెట్రీ (VBM) ,అట్లాస్-ఆధారిత వాల్యూమ్ విశ్లేషణలను ఉపయోగించి, అధికంగా పని చేసే వ్యక్తులు కార్యనిర్వాహక పనితీరు (నిర్ణయం తీసుకోవడం , పని చేసే జ్ఞాపకశక్తి వంటివి) భావోద్వేగ నియంత్రణలో తేడాలను గమనించారు. ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి ఎడమ మధ్య ఫ్రంటల్ గైరస్, ఇన్సులా,సుపీరియర్ ఫ్రంటల్ గైరస్, భావోద్వేగ సమతుల్యత మరియు సమస్య పరిష్కారంతో ముడిపడి ఉన్న మెదడు భాగాలో పెరుగుదలను గుర్తించారు. ఇది దీర్ఘకాలిక ఒత్తిడి ,అలసటకు కారణమైన న్యూరోఅడాప్టివ్కు చిహ్నమని తెలిపారు.ఎడమ కాడల్ మిడిల్ ఫ్రంటల్ గైరస్ అధిక పని చేసే సమూహంలో వాల్యూమ్‌లో 19 శాతం పెరుగుదలను చూపించింది. కార్యనిర్వాహక మరియు భావోద్వేగ విధులతో ముడిపడి ఉన్న 17 ఇతర మెదడు ప్రాంతాలలో కూడా గణనీయమైన వాల్యూమ్ పెరుగుదల కనిపించింది.ధూమపానం , వ్యాయామం వంటి గందరగోళ జీవనశైలి కారకాలకు సర్దుబాటు చేసిన తర్వాత కూడా ఈ మార్పులను గమనించారు. ఎక్కువ పని గంటల దుష్ప్రభావాలు మెదడు పనితీరును, ఆకృతిని దెబ్బతీయడంతోపాటు, మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుందని ఈ స్టడీ తేల్చింది.చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీఅధ్యయనం చేసిన సిఫార్సులుయజమానులు, విధాన రూపకర్తలు తక్షణ చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు అధ్యయనవేత్తలు. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలపై పరిష్కార ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి.అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఇప్పటికే అధిక పని మూలంగా ఏటా 8 లక్షలమంది చనిపోతున్నారని అంచనా వేసినందున, కొన్ని సూచనలు చేసింది. పని-జీవిత సమతుల్యత గురించి సంభాషణలో మెదడు ఆరోగ్యం ప్రాధాన్యతనివ్వాలియజమానులు మెరుగైన షిఫ్ట్ షెడ్యూల్‌లను రూపొందించాలి. విరామాలను ప్రోత్సహించా.లి మానసిక భారాన్ని తగ్గించడానికి వారపు గంటలను పరిమితం చేయాలి.కార్మికులు ఉద్యోగుల వారి మానసిక , భావోద్వేగ స్థితులను పర్యవేక్షించాలి. విశ్రాంతి .కోలుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి . బర్న్అవుట్ సంకేతాలు కనిపించినప్పుడు సహాయం తీసుకోవాలి.అలాగే విధాన నిర్ణేతలు గరిష్ట పని గంటల చుట్టూ కఠినమైన మార్గదర్శకాలను నిర్దేశించాలి మరియు ఉద్యోగి శ్రేయస్సును కాపాడటానికి నిబంధనలను అమలు చేయాలి. కొన్నిసార్లు ఎక్కువ గంటలు అవసరమని అనిపించవచ్చు. కానీ ఆ తరువాత ఊహింని విధంగా మెదడుకు జరిగే నష్టానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! ఆరోగ్యానికి మంచిదేనా?
ఇటీవల హెల్దీగా ఉందాం అనే నినాదం ప్రజల్లో బాగా వళ్తోంది. అందురూ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకునేందుకే ఇష్టపడుతున్నారు. పైగా తమ శరీరానికి సరిపోయే డైట్‌ని ఫాలోఅయ్యి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడొక కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీబిల్డర్ తనపైన అధిక ప్రోటీన్ ఫుడ్ ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం అని రోజుకి 30 గుడ్లు చొప్పున నెలకు 900 గుడ్లు తింటే త్వరితగతిన కండరాలు ఏర్పడి బాడీబిల్డర్‌గా మారడానికి తోడ్పడుతుందో లేదా తెలుసుకోవాలని తనమీదే స్వయంగా ప్రయోగం చేసుకున్నాడు. చివరికి ఏమైందంటే..యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీ బిల్డర్ జోసెఫ్ ఎవెరెట్ ప్రముఖ బాడీబిల్డింగ్ లెజెండ్ విన్స్ గిరోండా చెప్పే 900 ఎగ్స్ డైట్‌ని పరీక్షించాలనుకున్నాడు. గిరోండా తాను రోజు 30 గుడ్డు తింటానని, అదే తన కండల తిరిగిన దేహం రహస్యమని చెబుతుంటారు. అది ఎంతవరకు నిజం అని తెలుసకునేందుకు ఈ యూట్యూబర్ తనమీద ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం రోజుకి 30కి పైగా గుడ్లను డైట్లో తీసుకునేవాడు. అతను గుడ్డు తెల్లసొన ఆమ్లెట్లు, పచ్చసొన స్మూతీలు ఆహారంతో చేర్చుకునేవాడు. వాటితో పాటు రైస్, మాంసం, పెరుగు, పండ్లు, తేనె తదితరాలు తీసుకున్నాడు. ఈ ఆహారం తోపాటు వెయిట్ లిఫ్టింగ్‌కి సంబంధించిన అన్ని వ్యాయామాలు చేశాడు. ఆ తర్వాత తన బాడీలో జరిగిన మార్పులపై వైద్య పరీక్షలు జరిపించగా..మంచికొలస్ట్రాల్ స్థాయిలు పెరగడం తోపాటు, రక్తంలో చెడు కొలస్ట్రాల్‌కి సంబంధించి గణనీయమైన మార్పులు కనిపించాయి.ఈ డైట్ మంచిదేనా..? ప్రముఖ డైటీషియన్ కనిక మల్హోత్రా ఇలాంటి డైట్‌తో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డులోని పచ్చసొనలో ఉండే అధిక కొలస్ట్రాల్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందన్నారు. ఇది గుడ్డు జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు. అంతేగాదు అధికంగా గుడ్లు తీసుకోవడం వల్ల.. కొంతమంది వ్యక్తుల్లో పొట్ట ఉబ్బరం, గ్యాస్, విరేచనలు వంటి జీర్ణ సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. అంతేగాదు ఇలా గుడ్లు అధికంగా తీసుకుంటే పోష అసమతుల్యత వస్తుందన్నారు. అలాగే పచ్చిగా లేదా తక్కువగా ఉడికించి తీసుకుంటే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కండరాల పెరుగుదల కోసం గుడ్డు అధికంగా తీసుకోవాల్సిందేనా..గుడ్డు కండరాల పెరుగుదలకు ఉపయోగపడినప్పటికీ..అధికంగా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని తేల్చి చెప్పారు. గుడ్డులోని పచ్చసొన కండరాల ప్రోటీన్ సంశ్లేషణను సమర్థవంతంగా పెంచుతుందన్నారు. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఇతర వాటిలో కంటే ఎక్కువ. పైగా దీన్ని ఉడకించి తింటేనే సులభంగా అరుగుతుంది లేదంటే శరీరం దాన్ని అరిగించుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందన్నారు. చెప్పాలంటే సోయా లేదా గోధుమలు, పాలు తదితరాల కంటే గుడ్డులో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కువ కాబట్టి దీన్ని తగు మోతాదులో తీసుకుంటే కండరాల పెరుగుదలకు, బాడీ బిల్డింగ్‌కి ఉపయోగపడుతుందని తెలిపారు. అంతకు మించి అంటే..మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స) -
డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స
అద్భుతమా, అసంబద్ధమా? ఏమిటిది! నియంత్రణ లేని కదలికలకు నియమబద్ధమైన కదలికలతో చికిత్సా?! ‘పార్కిన్సన్స్’ డిసీజ్ అంటే నడక అదుపు తప్పటం, చేతులు కదలకపోవటం, కాళ్లు మెదలకపోవటం, తల వణకడం, ఉన్నట్లుండి అదిరి పడటం, నాడీ వ్యవస్థకు, ఇంద్రియాలకు మధ్య సమన్వయం గాడి తప్పటం!! దేహం ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు నృత్యం చెయ్యటం ఎంత దుర్లభం! పైగా దుర్లభమే దుర్భరానికి చికిత్స అవటం ఇంకెంత విడ్డూరం! అయితే ఇది విడ్డూరమేమీ కాదు, ప్రయోగాత్మకంగా నిర్థారణ అయిన విషయమే అంటోంది ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ (ఐ.ఎ.డి.ఎం.టి). పార్కిన్సన్లో ఏ కదలికా లయబద్ధంగా ఉండదు. డాన్స్‌లో లయబద్ధంగా లేని ఒక్క కదలికా ఉండదు. కానీ ఐ.ఎ.డి.ఎం.టి. పార్కిన్సన్స్ వ్యాధిని నయం చేయటానికి, వ్యాధిగ్రస్తుల్ని శక్తిమంతం చేయటానికి భారతీయ నృత్య రీతుల్ని ఒక చికిత్సా విధానంగా ఉపయోగిస్తోంది. విశాలమైన ఒక నిశ్శబ్దపు గది, వెనుక నుంచి మంద్రస్థాయిలో వినిపించే తబలా బీట్ వంటి ఒక సంగీత వాద్యం ఈ చికిత్సలో ముఖ్య భాగంగా ఉంటాయి. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా వృద్ధులు అంతా కలిసి ఆ గదిలో ఉంటారు. అందరూ కూడా పార్కిన్సన్స్ బాధితులే. మనసును తాకుతున్న నేపథ్య ధ్వనికి అనుగుణంగా వాళ్ల చేతులు మబ్బుల్లా తేలుతాయి. చేతి వేళ్లు మృదువైన హావభావాలు అవుతాయి. పాదాలు లయకు అనుగుణంగా కదులుతాయి. గొప్ప పారవశ్యంతో మదిలోంచి జనించే ఉద్దేశపూర్వకమైన ఆంగికం (అవయవాల కదలిక)తో వారు ఒక మహా విజయాన్ని సాధిస్తారు. పార్కిన్సన్స్లో ప్రమేయం లేని కదలికలు మాత్రమే ఉంటాయి కనుక ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని కదలించటం అన్నది మహా విజయమే. తప్పిన పట్టు తిరిగి వచ్చేస్తోంది‘‘ఇక్కడికి వచ్చిన వారు కొన్ని నెలల క్రితం వరకు కూడా పడిపోతామేమో అనే భయం లేకుండా నడవలేకపోయిన వారే. కానీ వారిని ఈ నృత్య చికిత్స ఎంతగానో మెరుగు పరిచింది’’ అంటారు ఐ.ఎ.డి.ఎం.టి. అధ్యక్షురాలు, ‘డ్రామా థెరపీ ఇండియా’ వ్యవస్థాపకురాలు అన్షుమా క్షేత్రపాల్. పార్కిన్సన్స్లో నాడీ వ్యవస్థ–శరీరావయవాల పరస్పర చర్యల మధ్య సమన్వయం (మోటార్ కంట్రోల్) దెబ్బతింటుంది. మానసికంగానూ పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు పట్టుతప్పుతారు. ఈ స్థితిలో వారికొక ఉనికిని, వ్యక్తీకరణ శక్తిని, మునుపటి ఆనందకరమైన జీవితంలోకి మార్గాన్ని నృత్య చికిత్స ఏర్పరుస్తుందని అన్షుమా చెబుతున్నారు. ఈ సంస్థల శాఖలు ముంబై, పుణే, బెంగళూరులలో ఉన్నాయి.నృత్యం తెచ్చే మార్పేమిటి?పార్కిన్సన్స్ మెదడు క్రియాశీలతను, డోపమైన్ కేంద్రమైన ‘బేసల్ గాంగ్లియా’ను ప్రభావితం చేస్తుంది. దాంతో స్వచ్ఛంద కదలికలు కష్టతరం అవుతాయి. కానీ మెదడు మాత్రం ‘లయ’లకు స్పందిస్తుందని అన్షుమా అంటున్నారు. ‘‘సంగీతాన్ని వింటున్నప్పుడు మెదడులో దెబ్బతినని సర్క్యూట్లు (పార్కిన్సన్స్ వల్ల దెబ్బతిన్నవి కాకుండా) వేర్వేరు నాడీ రహదారుల ద్వారా కదలికలను తెస్తాయి. నాడీ శాస్త్రపరంగా, ఈ నృత్య చికిత్స బలాల్లో ఒకటి రిథమిక్ ఆడిటరీ స్టిమ్యులేషన్ (ఆర్.ఎ.ఎస్.) ఉద్దీపన చెందటం. దీనివల్ల అవయవ సమన్వయం ఏర్పడుతుంది. డోపమైన్, ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ల వంటి న్యూరో ట్రాన్సిమీటర్ హార్మోన్లు పెరుగుతాయి. దాంతో కదలికలు మాత్రమే కాదు, మానసిక స్థితీ మెరుగుపడుతుంది’’ అని ఆమె అంటున్నారు.గర్బా నృత్యంపై తొలి ప్రయోగంగుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’పై 2024లో ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనంలో పార్కిన్సన్స్ రోగులపై ఈ డ్యాన్స్ చక్కటి ప్రభావం చూపినట్లు వెల్లడైంది. పార్కిన్సన్స్కు చికిత్సగా నృత్య రీతుల్ని ఆశ్రయించటం 2009లో ముంబైలోని ‘పార్కిన్సన్స్ డిసీ జ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ సొసైటీ ’ ప్రయత్నాలతో మొదలైంది. అదే సమయంలో ఆర్జెంటీనాలో టాంగో, సల్సా డ్యాన్సులు పార్కిన్సన్స్కు చికిత్స గా ఉపయోగపడతాయా అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఆ స్ఫూర్తితో 2010లో మన దగ్గర శా స్త్రీయ నృత్యాల చికిత్సా తరగతులు వారానికి రెండుసార్లు 3 నెలల పాటు ముంబైలో జరిగాయి. ప్రస్తుతం దేశంలోని అనేక కమ్యూనిటీ సెంటర్లు భరతనాట్యం, గర్బా, కూడియట్టంలతో చికిత్స చేస్తున్నాయి.పార్కిన్సన్స్ లక్షణాలు – కారణాలుప్రధానంగా ఇవి శారీరకమైనవి. వణుకు, బిగదీసుకుపోవటం, కదలికలు నెమ్మదించటం, భంగిమలో అస్థిరత వంటివి కనిపిస్తాయి. క్రమంగా ఆందోళన, కుంగుబాటు మొదలౌతుంది. ఎవ్వరితోనూ కలవలేక, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అపారమైన దుఃఖం మిగులుతుంది. మెదడులో డోపమైన్ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు సక్రమంగా పని చెయ్యకపోవటం లేదా నశించటం పార్కిన్సన్స్కు ప్రధాన కారణం. మనిషి తను కదలాలనుకున్నట్లు కదలటానికి డోపమైన్ అవసరం. డోపమైన్ లోపించటం వల్ల కదలికలు అస్తవ్యస్తం అవుతాయి. మెదడులో డోపమైన్ ఉత్పత్తి తగ్గటానికి గల కారణాలపై పరిశోధకులింకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఒక కారణం మాత్రం వృద్ధాప్యం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో సుమారు ఒక శాతం మందికి పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. డోపమైన్‌ను భర్తీ చేసే మందులు, మెదడు ఉద్దీపన వంటి వైద్య చికిత్సలలో పురోగతి సాధించినప్పటికీ ఫలితాలైతే అనుకున్నంతగా లేవు.రోగులు తమకు తామే వైద్యులుసాధారణ వైద్యంలా ఈ ‘డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ ఎవరో సూచించేది కాదు. ఎవరికి వారుగా అనుసరించేది. ఎలా కదలాలన్నదీ ఎవరూ చెప్పరు. కదిలే మార్గాలను ఎవరికి వారే అన్వేషించేలా మాత్రం ప్రోత్సహిస్తారు. నడక లేదా భంగిమను సరిదిద్దుతారు. శ్వాసపై నియంత్రణ కల్పిస్తారు. ఊహాశక్తిని, వ్యక్తీకరణను లయబద్ధం చేస్తారు. చికిత్సలో పాల్గొనే వారిలో కొంతమంది కూర్చుని నృత్యం చేస్తారు. మరికొందరు స్థిరంగా నిలబడతారు. కొందరు మరింత స్వేచ్ఛగా కదులుతారు. మొత్తానికి వాళ్లంతా రోగుల్లా కాకుండా, దేన్నో సృష్టిస్తున్నట్లుగా ఉంటారు.సాక్షి నేషనల్ డెస్క్(చదవండి: హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..) -
హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..
తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, సింగర్‌గా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శింబు అసలు పేరు సిలంబరసన్. అయితే అంతా ముద్దుగా శింబుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్ థగ్ మూవీ షూటింగ్ ప్రమోషన్లతో బిజిగా ఉన్నాడు శింబు. ఒకప్పుడు ఆయన ఫుడ్స్టైల్ అంత ఆరోగ్యకరమైన రీతీలో ఉండేది కాదని అంటున్నారు శింబు ఫిట్నెస్ ట్రైనర్. ఆయన ఎంతో పట్టుదలతో ఆరోగ్యకరమైన అలవాట్లును అనుసరిస్తూ దాదాపు 30 కిలోలు బరువు తగ్గారని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లను అనుసరించిన విధానం..ఆయన పాటించిన నియామాలు వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుందంటున్నారు. ఎందుకంటే తాము ఇచ్చే డైట్‌లోని ఆహారాలు శింబుకి అస్సలు నచ్చనవి అట. అయినా సరే అతడు పట్టుదలతో మంచి పోషకాహారాన్ని ఎలా ఇష్టంగా తినేవాడో వివరించారు. మరీ అంతలా బరువు తగ్గేందుకు అనుసరించిన ఫిట్నెస్ మంత్ర ఏంటో ఆయన ఫిట్నెస్ ట్రైనర్ మాటల్లో విందామా..!.స్మార్ట్‌గా కనిపిస్తూ..యుంగ్ హీరోలకు తీసిపోని దూకుడుతో కనిపించే శింబు(42) పిట్నెస్ సీక్రెట్ గురించి ఓ ఇంటర్యూలో ప్రశ్నించగా..స్థిరత్వం, మితంగా ఆహారం తీసుకోవడమేనని సమాధానమిచ్చారు. ఆయన వెయిట్‌లాస్ జర్నీ ఎందిరికో స్ఫూర్తిగా నిలిచింది కూడా. 2020 నుంచి మంచి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించి బరువు తగ్గానని ఆయన చెప్పారు. ఇక ఆయన ఫిట్నెస్ ట్రైనర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ..శింబు ప్రతి ఉదయం 4.30 గంటలకు నడకతో తన రోజుని ప్రారంభిస్తాడని అన్నారు. ప్రారంభంలో వారానికి నాలుగురోజులు వ్యాయామాలు చేసేవాడని, ఆ తర్వాత ఐదు రోజులకు మార్చుకున్నాడని అన్నారు. అంతేగాదు “ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు” ప్రాధాన్యత ఇచ్చేలా తన డైట్‌ని మార్చుకున్నాడని అన్నారు. కేలరీలు తక్కువుగా ఉండే సలాడ్లు, జ్యూస్‌లు ఎలా ఇష్టంగా తీసుకునేందుకు యత్నించాడో కూడా తెలిపారు. అలాగే రాత్రిపూట తేలికపాటి ఆహారమే తీసుకుని కొద్దిపాటి ఆకలితో నిద్రపోవడం వంటివి పాటించారట శింబు. ఇలా రాత్రిపూట కొంచెం ఆకలితో నిద్రపోవడం మంచిదేనా..ఇది సరైనదేనని న్యూట్రిషనిస్ట్ ఆశ్లేషా జోషి అంటున్నారు. కొంచెం ఆకలితో పడుకోవడం జీర్ణాశయానికి ఎంతో మంచిదని అంటున్నారు. ఎందుకంటే రాత్రిపూట మన జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల రాత్రిపూట అధిక కేలరీలతో కూడిన ఆహారం అధిక బరువు, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రిపూట అదిక కేలరీలను నివారించడమే అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు. అలాగని ఆకలితో కాకుండా పోషకాహారంతో కూడిన ఆహారం మితంగా శరీరానికి అనుగుణంగా తీసుకోవడం ముఖ్యమని సూచించారు. ఇక్కడ అందరి ఆకలి సంకేతాలు ఒకేలా ఉండవు కాబట్టి ఆయా వ్యక్తుల వారి శరీర సంకేతానికి అనుగుణంగా తీసుకోవాలని అన్నారు. ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఫుడ్..పండ్లు కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు, ఆల్కలీన్ అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిపెట్టడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా అందుతుంది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..! వైరల్‌గా కొబ్బరిబోండాల వ్యాపారి) -
అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : యూఎస్ ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్!
సీనియర్ సిటిజనులను పట్టిపీడిస్తున్న అల్జీమర్స్ (Alzheimer )వ్యాధి నిర్ధారణలో కీలకమైన పురోగతి ఊరటగా నిలుస్తోంది. ఈ వ్యాధిని సహాయపడటానికి రక్తాన్ని పరీక్షించే పరికరం అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ రక్తపరీక్షను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదించింది. అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే తొలి ఇన్ విట్రో డయాగ్నస్టిక్ పరికరం కావడం విశేషం. ఈ ఏడాది జూన్నుంచి అమెరికాలో ఇది అందుబాటులోకి వస్తుంది. జపాన్ కంపెనీ అభివృద్ధి చేసిన సరికొత్త మెడికల్ టెస్ట్‌కు అమెరికాలోని ఎఫ్‌డీఏ గతవారమే ఆమోదముద్ర వేసింది. తద్వారా పెట్ స్కాన్లు వెన్నెముక ద్రవ విశ్లేషణలు లేకుండానే ఈ పరీక్ష ద్వారా30 నిమిషాల్లో ఫలితాన్ని తెలుసుకోవచ్చు.అల్జీమర్స్ ముందస్తు గుర్తింపు, సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌డీఏ దీనికి ఆమోదముద్ర వేసింది. "అల్జీమర్స్ వ్యాధి చాలా మందిని ప్రభావితం చేస్తుందని, రొమ్ము క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ రెండింటి బాధితుకల ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారని FDA కమిషనర్ మార్టిన్ ఎ మకారీ ఒక ప్రకటనలో తెలిపారు. 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 10 శాతం మందికి అల్జీమర్స్ ఉందని ,2050 నాటికి ఆ సంఖ్య రెట్టింపు కానుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కొత్త వైద్య ఉత్పత్తులు రోగులకు సహాయ పడతాయని ఆశిస్తున్నామన్నారు. ఈ చర్య రోగులకు ఈ వినాశకరమైన నాడీ సంబంధిత వ్యాధి పురోగతిని నెమ్మదింపజేసేలా, ముందుగానే చికిత్స ప్రారంభించడంలో ఇది సహాయ పడుతుంది. అలాగే ఖరీదైన, ఇన్వాసివ్ PET ఇమేజింగ్ లేదా కటి పంక్చర్ (lumbar punctures)ల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.పరీక్ష ఎలా పనిచేస్తుందిఫుజిరేబియో డయాగ్నోస్టిక్స్ అభివృద్ధి చేసిన లూమిపల్స్ రక్త పరీక్ష రక్తంలోని రెండు ప్రోటీన్ల నిష్పత్తిని కొలుస్తుంది. అమిలాయిడ్ 1-42 β-అమిలాయిడ్ 1-40 - ఈ రెండింటి నిష్పత్తి మెదడులోని అమిలాయిడ్ ఫలకాలతో పరస్పర సంబంధం కలిగి ఉంది.ప్రస్తుత రోగనిర్ధారణ పద్ధతులతో పోలిస్తే అల్జీమర్స్ రక్త పరీక్ష చాలా వరకు ఖచ్చితంగా ఉంటుందని అంచనా. 499 మంది రోగులతో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో, ఈ పరీక్ష అధిక రోగనిర్ధారణ విశ్వసనీయతను ప్రదర్శించిందిసానుకూల ఫలితాలు వచ్చిన వారిలో 91.7 శాతం మందికి PET స్కాన్లు లేదా స్పైనల్ టాప్స్ లేకుండా అల్జీమర్స్-సంబంధిత ఫలకాలు నిర్ధారించినారు. ప్రతికూల ఫలితాలు వచ్చిన వారిలో 97.3 శాతం మందికి ఎటువంటి ఫలకాలు (plaques) లేవు. జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా గందరగోళం వంటి అభిజ్ఞా క్షీణత లాంటి ప్రారంభ సంకేతాలను చూపిస్తున్న 55 ఏళ్లు ,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం ఈ పరీక్ష ఉద్దేశించబడింది. అమెరికాలోని సర్టిఫైడ్ ప్రయోగశాలలలో ఈ పరీక్ష అందుబాటులో ఉంటుందని ఫుజిరెబియో నిర్ధారించింది. ఇది నేరుగా రోగులకు అందుబాటులో ఉండదు. వైద్యుడి సిఫారసు అవసరం. అయితే ఇది భారతదేశంలో లేదా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ పరీక్ష ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. అయితే, US డేటా ఆధారంగా ఇతర దేశాలలో నియంత్రణ ఆమోదాలు అనుసరించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?
జాన్వీకపూర్, సారా అలీఖాన్‌లు, ప్రముఖ సెలబ్రిటీలు IV డ్రిప్ థెరపీలు చేయించుకున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వారి ప్రకాశవంతమైన చర్మ రహస్యం ఆ థెరపీనే అని పలువురు నిపుణులు చెబుతున్నారు కూడా. ప్రస్తుతం ఈ కొత్త ఇన్ఫ్యూషన్ థెరపీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ఇదేంటి..?. ఆరోగ్యానికి మంచిదేనా తదితర విశేషాలు గురించి సవివరంగా చూద్దాం. ఇది ఒక కొత్త ఇన్ఫ్యూషన్ థెరఫీ. దీని సాయంతో హీరోయిన్, సెలబ్రిటీలు మిలమిలాడే నవయవ్వన శరీరంతో మెరిసిపోతుంటారట. ఈ థెరపీలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్లేలా ఇంజెక్ట్ చేయించుకుంటారట. తద్వారా శరీర రోగనిరోధక వ్యవస్థను, శక్తిని పెంచి..చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే గాక వృద్ధాప్య ప్రభావాలని తగ్గిస్తుందట. ఇందులో ఏముంటాయంటే..ఈ డ్రిప్స్‌లో విటమిన్ సీ, జింక్, మెగ్నీషియంతో పాటు కొల్లాజెన్ వంటి ప్రోటీన్లు, గ్లూటాతియోన్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు తదితరాలు ఉంటాయని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు. దీన్ని ఒక్కోసారి కొద్దిమొత్తంలో నోటి ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ✨ Revitalize Your Health with Our IV Drip Therapy! ✨Feeling drained or need a boost? Our private clinic offers premium IV drips tailored just for YOU!Why IV Therapy? 🌟 Immediate Absorption 🌟 Enhanced Immunity 🌟 Glowing Skin 🌟 Increased Vitality pic.twitter.com/7ICKp3ouXM— Eskulap Clinic (@polskaklinika) February 11, 2025 ఎలా పనిచేస్తుందంటే..నిజానికి గ్లూటాథియోన్ అనేది మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసే యాంటీఆక్సిడెంటే. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. కణాల నష్టంతో పోరాడటమే గాక, చర్మ రంగుకు కారణమైన మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. దీన్ని మూడు అమైనా ఆమ్లాలు సిస్టీన్, గ్లూటామిక్ , గ్లైసిన్ అనే ఆమ్లాలతో రూపొందిస్తారు. శరీరంలోని ప్రతికణంలో ఇది కనిపిస్తుంది, కానీ వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు తక్కువ గ్లూటాథియోన్‌ను ఉత్పత్తి చేస్తాయట. ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందట. అందువల్ల ఇలా IV డ్రిప్ థెరపీ రూపంలో తీసుకుంటారట సెలబ్రిటీలు. ఇవి నేరుగా రక్తప్రవహంలోకి వెళ్లి శరీరం త్వరగా గ్రహించడానికి అనుమతిస్తుందట. ఇది ఇచ్చిన మోతాదుని అనుసరించి వారాలు లేదా నెలలు వరకు ఆ థెరపీ సమర్థవంతమైన ప్రభావం ఉంటుందట. సాధారణంగా ఇది ఒక ఏడాదికి పైగా ప్రభావవంతంగా ఉంటుందట.సురక్షితమేనా?వాస్తవానికి కాస్మెటిక్ స్కిన్ లైటనింగ్ కోసం US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) దీనిని ఉపయోగించడాన్ని ఆమోదించదు. దీర్ఘకాలికంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనేందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో దీన్ని యూఎస్ ఆరోగ్య అధికారులు అనుమతించరట. అలాగే కౌమర దశలో ఉన్న అమ్మాయిలకు ఇవ్వకూడదు కూడా. సౌందర్యాన్ని ప్రతిష్టగా భావించేవారు..తెరపై కనిపించే కొందరు సెలబ్రిటీలు తప్పసరి అయ్యి ఈ అనారోగ్యకరమైన పద్ధతికి వెళ్తారని చెబుతున్నారు నిపుణులు. కానీ వాళ్లంతా నిపుణులైన వైద్యుల సమక్షంలోనే చేయించుకుంటారు కాబట్టి కాస్త ప్రమాదం తక్కువనే చెప్పొచ్చు. ఇక ఆరోగ్యవంతులైన యువతకు ఈ గ్లూటాథియోన్ అనేది సహజసిద్ధంగానే శరీరంలో తయారవుతుంది కాబట్టి ఆ అవసరం ఏర్పడదని అంటున్నారు నిపుణులు. దీన్ని 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారెవ్వరూ తీసుకోకూడదట. చర్మం కాంతిగా నవయవ్వనంగా ఉండాలనుకునే వారంతా..యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం, పుష్కలంగా నీరు త్రాగడం, మంచి నిద్ర తదితరాలను మెయింటైన్ చేస్తే చాలని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!) -
IBD లక్షలమందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి, మొహమాటం వద్దు!
హైదరాబాద్: ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఐబీడీ ( Inflammatory Bowel Disease (IBD)) చాలామంది నోట ఇది వినిపిస్తుంది. దీర్ఘకాల వ్యాధి కావడంతో ఇది జీవనశైలినే మార్చేస్తుంది. దీనికి వెంటనే చికిత్స అవసరం. ప్రపంచవ్యాప్తంగా కోటి మంది, మన దేశంలోనే 15 లక్షల మంది ఈ వ్యాధి బాధితులున్నారు. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ లాంటి సమస్యలతో కలిపి వచ్చే ఐబీడీని వెంటనే గుర్తిస్తున్నా, సామాజిక సమస్యల కారణంగా దీనిపై ఎవరూ పెద్దగా చర్చించడం లేదు. ఈ నెల 19న ప్రపంచ ఐబీడీ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సరిహద్దులు లేవని, అందరం కలిసి సామాజిక అపోహలను తొలగిద్దామని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష సూచించారు.ఐబీడీ చికిత్స కోసం ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఒక ప్రముఖ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అందులో మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, ఐబీడీకి శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు, డైటీషియన్లు, సైకాలజిస్టులు ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా కేటాయించిన 20 పడకలు, అత్యాధునిక సదుపాయాలతో అనేకమంది రోగులకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి అత్యాధునిక చికిత్సలు అందిస్తోంది. పలు జిల్లాల నుంచి వైద్యులు రోగులను ఇక్కడకు పంపుతున్నారు. ముఖ్యంగా ఈఎంఆర్ ఆధారిత ఫాలోఅప్ కార్యక్రమం ఉండడం, అందరికీ వ్యక్తిగత సంరక్షణ కోసం వారానికోసారి ఐబీడీ క్లినిక్ ఏర్పాటుచేయడం ఇక్కడి ప్రత్యేకతలు.“ఐబీడీ అనేది కేవలం కడుపు సమస్యే కాదు. అది మన మొత్తం శరీరం, మనసునూ ప్రభావితం చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు, సమస్య తీరు, దాని లక్షణాలైన.. తరచు విరేచనాలు కావడం, కడుపునొప్పి, మలద్వారం నుంచి రక్తం కావడం, నీరసం వల్ల రోగులు దీని గురించి చివరకు కుటుంబసభ్యులకు కూడా చెప్పరు. మౌనంగా బాధను భరిస్తుంటారు. పేగు సంబంధిత సమస్యలంటేనే సమాజంలో ఉన్న చిన్నచూపు వల్ల ఐబీడీ గురించి కూడా మాట్లాడరు. దీని కారణాల గురించి కూడా అనేక అపోహలున్నాయి. ఇలా చెప్పకపోవడంతో వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది, వారు సమాజం నుంచి దూరమవుతారు, ఆందోళన, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఐబీడీ అనేది ఆహారం వల్లనో, పరిశుభ్రత లేకపోవడం వల్లనో వస్తుందని.. ఇది కేవలం అరుగుదల సమస్య అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐబీడీ అనేది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. దానికి దీర్ఘకాలం పాటు చికిత్స అవసరం” అని డాక్టర్ హర్ష చెప్పారు.ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!“ఐబీడీకి ప్రస్తుతం కచ్చితమైన చికిత్స తెలియదు గానీ, దాన్ని మందులు, ఆహారంలో మార్పులు, మానసిక చికిత్స, నిపుణులతో క్రమం తప్పకుండా సంప్రదించడం ద్వారా దీన్ని చాలావరకు నియంత్రించవచ్చు. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడిని అధిగమించడం, సహచరుల మద్దతు ముఖ్యమైనవి. ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, రిలేషన్లో ఉన్న యువకులకు ఇది అవసరం. ఆహారంపై అవగాహన కూడా ముఖ్యం. మంట వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే అన్నం, అరటిపండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు తినాలి. కారాలు, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఆహారాలు తినకూడదు. ఎవరికి వారికే ఆహారం మారుతుంది కాబట్టి, డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.చదవండి: వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే అంతేగా!అసలు అన్నింటికంటే ముందు మౌనం వీడాలి. బహిరంగంగా చర్చించాలి. అది క్లినిక్‌లో అయినా, తరగతుల్లో అయినా, కార్పొరేట్ ఆఫీసుల్లో అయినా. ఐబీడీ గురించి మాట్లాడితే అపోహలు పోతాయి. సానుభూతి పెరుగుతుంది. రోగులు చికిత్స పొందడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం వస్తుంది” అని డాక్టర్ హర్ష వివరించారు. ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్ష -
ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!
వైద్యవిధానం విప్లవాత్మక మార్పులతో పురోగమిస్తుంది. నయం కానీ వ్యాధులను సరికొత్త చికిత్సా విధానంతో నయంచేసి రోగుల్లో సరికొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. తాజాగా వైద్య విధానంలో అలాంటి పరిణామామే చోటు చేసుకుంది. అంతేగాదు మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో కొత్త ఆశలను అందిస్తోంది. ఈ ఘనత సాదించింది లాస్ ఏంజిల్స్‌లోని యూఎస్ సర్జన్లు. అసలేం జరిగిందంటే..నలుగురు పిల్లల తండ్రి ఆస్కార్ లారైన్జార్ కేన్సర్ కారణంగా రెండు మూత్రపిండాలు, మూత్రశయంలోని దాదాపు సగ భాగాన్ని కోల్పోయాడు. దాంతో అప్పటి నుంచి అతడు డయాలసిస్‌పైనే ఆధారపడుతున్నాడు. అతడి సమస్యను నయం చేసేలా అమెరికన్ యూరాలజిస్ట్లు అవయవా దాత నుంచి సేకరించిన మూత్రపిండాలు, మూత్రశయంని మార్పిడి చేశారు. ఈ సంక్లిష్టమైన సర్జరీ దాదాపు ఎనిమిది గంటలు పైనే పట్టింది. 41 ఏళ్ల ఆస్కార్ లారైన్జార్కి ఈ శస్త్రిచికిత్స పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అలాగే మార్పిడి చేసి కొత్త మూత్రపిండాల సాయంతో మూత్ర విసర్జన చేయగలిగాడు కూడా. అతనికి ప్రస్తుతం మూత్రపిండాల పనితీరు మెరుగ్గానే ఉండటంతో డయాలసిస్ అవసరం తగ్గింది కూడా. ఈ సర్జరీ జరిగిన కొన్ని గంటల అనంతరమే..అతడు సాధారణ మూత్ర విసర్జన చేయగలిగాడు. పాపం ఆ వ్యక్తి గత ఏడేళ్లుగా ఈ మూత్ర విసర్జన చేయలేకపోయాడు. ఈ శస్త్ర చికిత్స అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ మేరకు సదరు వైద్య బృందం మాట్లాడుతూ..మూత్రాశయ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్సల గురించి గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే క్లినికల్ ట్రయల్ కోసం మరో నాలుగు శస్త్ర చికిత్సలు చేసేలే ప్లాన్లు ఉన్నాయి. నిజానికి ఈ పద్ధతిలో అవయవ తిరస్కరణకు అడ్డుకట్ట వసేలా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అణిచివేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఇంతవరకు బలహీనమైన మూత్రాశయాలతో బాధపడుతున్న చాలామంది బాధితులకు ప్రేగులోని భాగంతో తిరిగి మూత్రశయం తయారు చేయడం వంటి పరిమిత ఎంపికలే గతంలో ఉండేవని అన్నారు. దీంతో ఆయా వ్యక్తుల్లో తరుచుగా ఈ సమస్యల తిరగబెట్టడమే లేదా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నమవ్వడమో జరిగేదన్నారు. కానీ ప్రస్తుతం తాము చేసిన ఆధునిక మూత్రాశయ మార్పిడి చికిత్సతో అంతకుముందు ఉత్ఫన్నమైన ప్రమాదాలకు తెరపడినట్లయ్యిందన్నారు. అలాగే కేన్సర్ వంటి మహమ్మారి వ్యాధులతో బాధపడే వారిలో కొత్త ఆశలను నింపింది. సదరు బాధితుడు లారైన్జార్ చేసిన శస్త్రచికిత్స వైద్యశాస్త్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచించడమే గాక అతను పూర్తిస్థాయిలో కోలుకుంటే గనుక చాలామంది రోగులకు జీవితంపై కొత్త ఆశను అందిస్తుంది.(చదవండి: ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్ ) -
ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్
ఇటీవల కాలంలో చేతిలో మొబైల్ లేనిదే మన ప్రపంచమే ఆగినంతగా మారిపోయింది జీవితం. అది లేకపోతే మన గమనం లేదు అని చెప్పొచ్చు. అంతలా ప్రతిదానికి ఆ స్మార్ట్‌ఫోన్ పైనే ఆధారపడిపోతున్నారు అందరూ. ఏం కావాలన్న ఠక్కున జేబులోంచి ఫోన్ తీసి చెక్ చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. అలా ఫోన్ చూడనిదే పూట గడవదు అన్నంతగా యువత, పెద్దలు అడిక్ట్ అవుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తాజాగా తమిళ హీరో మాధవన్ కూడా ఫోన్ వాడకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పడమే కాదు చక్కటి హెల్త్ టిప్స్‌ని కూడా పంచుకున్నారు.ఎన్నో వైవిధ్యభరితమైన మూవీలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన నటుడు మాధవుడు. అమ్మాయి కలల రాకుమారుడిగా మంచి క్రేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న నటుడు. ప్రతి మూవీ అత్యంత విలక్షణంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడమే గాక, విలన్ పాత్రలతో కూడా మెప్పించి, విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఆయన ఎప్పటికప్పుడూ ఫిట్నెస్, పోషకాహారం తదితరాల గురించి సోషల్‌మీడియాలో నెటిజన్లతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఈసారి ఒక సెమినార్లో ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి మాట్లాడారు మాధవన్. ఈ డిజటల్ పరికరాలకు అలా అంకితమైపోతే..మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడమేగాక మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక్కసారి ఫోన్‌కి బ్రేక్ ఇచ్చి..మనతో మనం మమేకమైతే భావోద్వేగ పరంగా మెరుగవ్వడమే కాకుండా మంచి సంబధాలను నెరపగలుగుతామని అన్నారు. అంతేగాదు ఎప్పుడైనా.. మొబైల్‌ని పట్టుకోని చేతికి..వినియోగించే చేతికి తేడాని గమనించారా...? అని అడిగారు. సింపుల్‌గా చెప్పాలంటే మీ చేతి వేళ్లను బట్టి మీరెంతలా ఫోన్ వినియోగిస్తున్నారో చెప్పేయొచ్చని అంటున్నారు మాధవన్. వేళ్లల్లో గుంతలు కనిపిస్తున్నాయా..వేళ్ల ఎముకలు పక్కటెముకలు మాదిరిగా వంకర తిరిగి ఉన్నాయా..?.. గమనిస్తున్నారా అని ప్రశ్నించారు. అలా మారిన వేళ్లను మొబైల్ ఫోన్ ఫింగర్స్(mobile phone fingers) అంటారని, అవి మితిమీరిన ఫోన్ వాడకాన్ని చెప్పకనే చెప్పేస్తాయని అంటున్నారు. అంతేగాదు ఆ రక్తసికమైన ఫోన్ మీ శరీరం తీరుని పూర్తిగా మార్చేస్తోందని అన్నారు. అందువల్ల ఫోన్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం అని పిలుపునిచ్చారు నటుడు మాధవన్మొబైల్ ఫోన్ ఫింగర్స్ అంటే..చేతి వేళ్లు సహజసిద్ధంగా లేకుండా..మారిపోవడాన్ని మొబైల్ ఫోన్ వేళ్లు అంటారు. అంటే అధికంగా మొబైల్ ఫోన్ వినియోగించే వారి చేతి వేళ్లు తిమ్మిర్లు వచ్చి.. జాయింట్లు తప్పడం లేదా గ్యాప్ రావడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. వాటినే మొబైల్ ఫింగర్స్ అటారట. ఎక్కువసేపు పోన్ని వినియోగించేవారి చేతిలో కండరాలు దృఢత్వం కోల్పోయి తిమ్మిర్లు, మణికట్టు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తరుచుగా స్క్రోలింగ్, టైప్ చేయడం, ఎక్కువసేపు పట్టుకోవడం తదితర కదలికలు వల్ల ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు నిపుణులు. దీన్ని తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు.ఎలా నిరోధించాలంటే..సాధ్యమైనంతవరకు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలి. పనిచేయడం, వీడియోలు చూడటం, చదవటం వంటి కార్యకలాపాలకు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లను ప్రత్యామ్నాయంగా వినియోగించాలి. ఎందుకంటే ఈ పరికరాలు తగిన సెటప్‌ని అందిస్తాయి..పైగా చేతులు, వేళ్లపై తగిన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే వినియోగించక తప్పదు.. అనుకునేవారు..క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం, చేతులు సాగదీయడం లేదా రెండు చేతులతో ఫోన్ పట్టుకోవడం వంటివి చేస్తే..చేతులపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఒకరకంగా మీ కళ్ల ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలే చేకూరుస్తుందని అన్నారు. మెదడుపై కూడా మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు. నెమ్మదిగా ఫోన్ వాడకాన్ని తగ్గించడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు నిపుణులు.నిర్ణిత వేళలో ఫోన్ రహిత సమయంగా పెట్టుకోవడం వంటివి చేయాలి. సోషల్ మీడియా వినియోగం తగ్గించడం తోపాటు యాప్‌ల వినియోగాన్ని తగ్గించాలి. దీనివల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు.. ) -
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నతనంలోనే చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అయితే అధికబరువుతో దారితీస్తున్న అనారోగ్యాలపై పెరుగుతున్న అవగాహన కారణంగా అధికబరువును తగ్గించేందుకు కసరత్తుల భారీగానే చేస్తున్నారు. ఆహారంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. తమ సక్సెస్ స్టోరీను సోషల్‌మీడియాలో ఫాలోయర్స్‌తో పంచుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్. పదండి ఆమె వెయిట్‌లాస్ జర్నీ గురించి తెలుసుకుందాం. కోపాల్ అగర్వాల్ చిన్న వయసులోనే 101 బరువుతో బాధపడేది. ఇష్టమైన దుస్తులు వేసుకోవాలంటే కుదిరేదికాదు. పైగా ఏనుగులా వున్నావ్.. నీతో ఎవరు డేటింగ్ చేస్తారు... ఇలాంటి వెక్కింపులు, వేళాకోళాలు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేది. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించు కుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. చక్కటి ఫలితాన్ని సాధించింది. 101 కిలోల బరువు వద్ద మొదలైన ఆమె వెయిట్ లాస్జర్నీ 62 కిలోలకు చేరింది.కోపాల్ అగర్వాల్ తన అద్భుతమైన సక్సెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తను పాటించిన ఆహార నియమాలు, వ్యాయామల గురించి అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనం తీసుకునేది. క్రమం తప్పకుండా కఠిన వ్యాయామం చేసింది. దీంతో సుమారు 40 కిలోల బరువును తగ్గించుకుంది. ఇపుడు ఇష్టమైన మోడ్రన్ దుస్తులు కూడా వేసుకుంటోంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక శ్రేయస్సు , కాన్ఫిడెన్స్ కూడా మెరుగుపడిందని ఆమె చెప్పింది. మరో వీడియోలో, తాను కేవలం ఆరు నెలల్లో 32 కిలోలు తగ్గినట్టు చెప్పుకొచ్చింది అగర్వాల్. View this post on Instagram A post shared by KOPAL AGARWAL | Fitness | Nutrition | Skincare | Travel (@_kopal.agarwal_)బరువు తగ్గడానికి తీసుకున్న రోజువారీ ఆహారం:అల్పాహారం: ఒక రోటీ, 5 గుడ్డులోని తెల్లసొన, ఒక గిన్నె పోహా 2 పనీర్ ముక్కలతో అధిక ప్రోటీన్ కలిగిన ఫ్రూట్స్, పెరుగుమధ్యాహ్నం: పుచ్చకాయ , స్ట్రాబెర్రీలు బ్లాక్ కాఫీ, కొబ్బరి నీరుభోజనం: ఆకుకూరలతో 100 గ్రాముల చికెన్, కిచ్డీ పెరుగుతో పచ్చి కూరగాయలతో పనీర్ భుర్జీమధ్యాహ్నం: గ్రీన్ టీరాత్రి భోజనం: ఆకుకూరలతో సాటేడ్ పనీర్ సలాడ్, 100 గ్రాముల చికెన్, గుడ్డు భుర్జీదీంతో పాటు, రాత్రి తొందరగా నిద్రపోవడం, ఉదయాన్నేతొందరగా మేల్కోవడం లాంటివి పాటించింది. ఇంకా ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు త్రాగడం , పరగడుపున గోరువెచ్చని నీరు సేవించడం, ప్రతిరోజూ కనీసం 10వేలు అడుగులు నడవడంతన దినచర్యలో భాగం చేసుకుంది. చక్కెర ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తీసుకుంటూ, జంక్ ఫుడ్‌కు కంప్లీట్‌గా నో చెప్పింది. మొత్తానికి కష్టపడి తన శరీర బరువు 101 నుండి 62 కిలోలకు చేరి వావ్ అనిపించుకుంది.నోట్ : ఇదే టిప్స్ అందరికీ పాటించాలనే నియమం ఏదీ లేదు. కానీ కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం, పూర్తి నిబద్దత, ఓపికతో ప్రయత్నిస్తే బరువు తగ్గడం కష్టమేమీ కాదు. అయితే బరువు తగ్గే ప్రయత్నాలను ప్రారంభించేందు ముందు, బరువు పెరగడానికి గల కారణాలును వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించుకుని ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. -
Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు కేన్సర్ తీవ్రతరమైన స్థాయిలో ఉందని ఆయన కార్యాలయం వెల్లడించింది. వైద్య పరీక్షల్లో బైడెన్‌కు తీవ్రమైన ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎముకలకు వ్యాపించిందని చెబుతున్నారు. 82 ఏళ్ల బైడెన్ గత కొన్ని రోజులుగా మూత్ర విసర్జన సంబంధిత సమస్యలతో బాధపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా..ఈ విషయం వెల్లడైందని వైద్యులు చెబుతున్నారు. చెప్పాలంటే బైడెన్ సివియర్ కేన్సర్ స్టేజ్‌తో పోరాడుతున్నారు. త్రీవతరమైన దశలో ఉన్న ఈ కేన్సర్‌ని నిర్వహించడం సులభమేనని త్వరితగతిని ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకుంటారని బైడెన్ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే ఈ కేన్సర్ ఏవిధంగా ప్రాణాంతకంగా మారుతుందా..? ఆ కేన్సర్ కణాలు ఎముకలకు వ్యాపించడం అంటే..ప్రోస్టేట్ కేన్సర్(Prostate cancer)ని వైద్యులు మొదటగా ఏ స్థాయిలో ఉందో నిర్థారిస్తారు. ఇక్కడ బైడెన్‌కు 9 స్కోరుతో అత్యంత తీవ్ర స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉందని వెల్లడైంది. పైగా ఆ కేన్సర్ ఎముకల వరకు వ్యాపించిందని తెలిపారు. అదెలా జరుగుతుందంటే..ప్రోస్టేట్ కేన్సర్ పురుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా నెమ్మదిగా పెరుతుంది. ఒక్కోసారి శరీరంలోని ఇతర భాగాలకు అంటే..ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అంటే ఇక్కడ వెన్నెముక, తుంటి, పెల్విస్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుందట. ఈ దశని క్రిటికల్ స్టేజ్‌గా పేర్కొన్నారు వైద్యులు. దీనివల్ల రోగికి తీవ్రమైన నొప్పి, వెన్నుపాము కుదింపు, చలశీలతకు సంబంధించిన సమస్యలు ఉత్ఫన్నమవుతాయిని చెబుతున్నారు. అంతేగాదు ప్రోస్టేట్ కేన్సర్ ఎముక నిర్మాణాన్ని ప్రేరేపిస్తుందట. ఎముకను పెళుసుగా మార్చి విరిగిపోయేలా చేస్తుందట. అందువల్ల ఆయా బాధితులకు రాత్రిపూట ఎముక సంబంధిత నొప్పులు తీవ్రతరమవుతాయట. అందులోనూ 80 ఏళ్లు పైబడిన వారిలో, ఎముకలకు వ్యాపించే ప్రోస్టేట్ కేన్సర్ అనేది అత్యంత ప్రాణాంతకమైదిగా పేర్కొన్నారు నిపుణులు. ముందస్తుగా ఎలా గుర్తించాలంటే..బాడీ వెనుక లేదా తుంటిలో నిరంతర ఎముక నొప్పి. నాడీ సంబంధిత సమస్యలను అలక్ష్యం చేయకూడదు. బయాప్సీ ఫలితాల ఆధారంగా ప్రోస్టేట్ కేన్సర్ స్టేజ్‌ని నిర్థారిస్తారు.చికిత్స: హార్మోన్ థెరపీ, రేడియేషన్, కీమోథెరపీ, ఎముకలను లక్ష్యంగా చేసుకునే శస్త్రచికిత్సలతో నయం చేస్తారు. ఇంత ప్రాణాంతక స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నప్పుడూ..పూర్తినివారణ సాధ్యం కాదని చెబుతున్నారు నిపుణులు. కేవలం దాన్ని నిర్వహించగలం.. అంతే అన్నారు. ఇక్కడ రోగి జీవన నాణ్యత మెరుగుపరిచేలా చికిత్స అందిస్తారు. కేవలం ఆయా బాధితులు మూత్ర సంబంధిత సమస్యలకు, ఎముకల బలం కోసం విటమిన్ డి స్లపిమెంట్స్ వంటి వాటితో చికిత్స అందించి పరిస్థితి మెరుగుపడేలా చేయగలరే తప్ప పూర్తి స్థాయిలో ఈ సమస్య నుంచి బయటపడటం జరగదని తెలిపారు. అలాగే కొన్ని రకాల కేన్సర్లను మొదటి స్టేజ్‌లో ఉంటేనే పూర్తి స్థాయిలో నివారించడం సాధ్యపడుతుందని నొక్కి చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..! ) -
'ఐ' లవ్ యు అండ్ ప్లీజ్ టేక్ కేర్..!
చూసే ప్రక్రియలో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు ఆ సమస్యలను వైద్యపరిభాషలో ‘విజువల్డిస్టర్బెన్సెస్’ అంటారు. అంటే... చూపులో కలిగే అంతరాయాలని అర్థం. ఇవి చాలా కారణాలతో వస్తాయి. అనేక సమస్యల వల్ల ఇలా జరుగుతుంది. ఇందులో కొన్ని తాత్కాలికమైనవి. మరికొన్ని శాశ్వతంగా చూపును పోగొట్టేవి. అయితే తాత్కాలికమైనవే ఎక్కువ. కాకపోతే కొన్ని తాత్కాలికమైన వాటిని నిర్లక్ష్యం చేస్తే అది శాశ్వత అంధత్వానికి దారితీసే ముప్పు ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలూ, చికిత్సలతో అంతా మామూలైపోయే ఈ అంతరాయాల గురించి తెలుసుకుందాం...అన్ని అవయవాల్లోకీ చూపు వల్లనే దాదాపు 80% సమాచారం మనకు తెలుస్తుంది. అందుకే సర్వేంద్రియాణాంనయనం ప్రధానమనీ, కన్నుంటేనే కలికాలమనీ... ఇలాంటి ఎన్నో సామెతలూ,జాతీయాలూ, నుడికారాలూ ఉన్నాయి. అంతటి దృష్టిజ్ఞానానికి కలిగే అవరోధాలనూ, వాటిని పరిష్కరించుకునేమార్గాలను తెలుసుకోవడం అవసరం. ఆ అవరోధాలేమిటో, వాటిని అధిగమించే మార్గాలేమిటో చూద్దాం...అంతరాయాలను గుర్తించే లక్షణాలు చూపునకు కలిగే అంతరాయాలు (దృష్టిదోషాలు) తాత్కాలికమైనవా లేదా దీర్ఘకాలికమైనవా అనేది కొన్ని సాధారణ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఆ లక్షణాలు ఎలా వ్యక్తమవుతాయంటే... ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా), ఒకే వస్తువు అనేక వస్తువులుగా కనిపించడం (పాలియోపియా), మనం చూసే వస్తువు మసగ్గా కనిపించడం (బ్లర్రింగ్ ఆఫ్ విజన్), కళ్ల ముందు నల్లటి చుక్కలు లేదా మెరుపు తీగలు తేలిపోతున్నట్టు కనిపించడం (ఫ్లాషెస్ అండ్ ఫ్లోటర్స్), మనకు కనిపించే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం అదృశ్యమైనట్టు కనపడకుండా పోవడం జరగవచ్చు. దీన్ని వైద్యపరిభాషలో ‘స్కోటోమాస్’ అంటారు. ఫీల్స్ డిఫెక్ట్స్ : మనం చూసే ప్రాంతపు వైశాల్యమంతటా అంతా ఒకేలా కనిపించకపోవచ్చు. ఇలాంటి సమస్యలను ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటారు. ఉదాహరణకు...హెమీ అనోపియా...దృశ్యంలో సగభాగం స్పష్టంగా ఉండి, మరో సగభాగం స్పష్టంగా లేకపోవడం. క్వాడ్రాంటనోపియా : మనం చూసే ప్రాంతంలో పావు భాగం స్పష్టంగా లేకపోవడం. కన్‌స్ట్రిక్షన్ : మనం చూసే దృశ్య వైశాల్యం రానురాను క్రమంగా తగ్గిపోవడం. టన్నెల్ విజన్ : కన్‌స్ట్రిక్షన్ సమస్య వచ్చాక ఒక సొరంగంలోంచి లేదా ట్యూబ్‌లోంచి ఎదుటి వస్తువును చూస్తున్నట్లు ఉండటాన్ని ‘టన్నెల్ విజన్’ అంటారు. కలర్డ్ హ్యాలోస్ : టన్నెల్ విజన్ కాకుండా ఒకవేళ రంగురంగుల వలయాలు ఉన్నట్లు భ్రమ కలగడమే ‘కలర్డ్ హ్యాలోస్’. లాస్ ఆఫ్ కలర్ విజన్ : ఒకవేళ కొందరిలో ఎదుటనున్న దృశ్యం రంగుల్లో గాక నలుపు–తెలుపుల్లో కనిపించడాన్ని ‘లాస్ ఆఫ్ కలర్ విజన్’గా చెబుతారు. పైన పేర్కొన్న ఈ లోపాలన్నీ రకరకాల తాత్కాలిక, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మనకు కనిపించే లక్షణాలుగా చెప్పవచ్చు.తాత్కాలిక అంతరాయాలను కలిగించే కొన్ని కంటి సమస్యలు మైగ్రేన్ : ఇది తీవ్రమైన తలనొప్పితో తాత్కాలికంగా కంటి చూపు కనిపించకుండా చేసే సమస్య. యువతలోనే ఎక్కువ. ఒకవైపు కంటిలోగాని లేదా తలలో ఒక పక్క గాని వచ్చే నొప్పి ఇది. అందుకే మామూలు వ్యక్తులు దీన్ని పార్శ్వపు నొప్పి అంటారు. ఈ నొప్పి వస్తున్నప్పుడు వికారంగా ఉండటం లేదా కొందరిలో వాంతులు కావడం జరుగుతుంది. కొందరిలో వాంతి తర్వాత పరిస్థితి చక్కబడుతుంది. మరికొందరిలో ఏదో కాంతి ఆవరించినట్లుగా కనిపిస్తుంటుంది. దీన్నే ‘విజువల్ ఆరా’ అంటారు. మరికొందరిలో ‘స్కోటోమాస్’ రూపంలో కనిపించవచ్చు. అంటే ఎదురుగా కనిపించే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం అదృశ్యమైనట్టు కనపడకుండా పోవడం. ఇక మరికొందరిలో కళ్ల ముందు మిరిమిట్లు గొలిపే వెలుగు దివ్వెలు, మెరుపులూ కనిపించవచ్చు. చికిత్స : నొప్పిని తక్షణం తగ్గించే మందులతోపాటు... భవిష్యత్తులో ఈ తరహా తలనొప్పి రాకుండా నివారించే మందులు... ఇలా రెండు రకాల మందులను ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాడాలి. ట్రామా (గాయాలు): కంటికి దెబ్బతగిలినప్పుడు తక్షణం కనిపించే లక్షణాలు, ఆ తర్వాత కనిపించే లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. చూపు మసకబారవచ్చు. కంటిముందు మెరుపులు కనిపించడం, వెలుగు రేకలు తేలుతున్నట్లు ఉండటం, కంటిలోని ద్రవం (విట్రియల్) బయటకు రావడం, దీర్ఘకాలంలో గ్లకోమా, రెటీనా పొరలు విడిపోవడం, కంటి నరం దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. చికిత్స : కంటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు (ట్రామా కేసుల్లో) అత్యవసరంగా తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం తక్కువ. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా దీర్ఘకాలం ΄ాటు ఫాలో అప్‌లో ఉండాలి. పొగతాగడం వల్ల: దీని వల్ల వచ్చే తాత్కాలిక అంధత్వం (టొబాకో ఆంబ్లోపియా) అన్నది ఆ అలవాటును మానివేయడం వల్ల తగ్గిపోతుంది. రే–చీకటి (నైట్ బ్లైండ్నెస్): ఇది ఆహారంలో విటమిన్–ఏ మోతాదులు తగ్గడం వల్ల కలిగే కంటి సమస్య. మరికొందరిలో ఇది రెటీనాకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంటే... రెటినైటిస్ పిగ్మెంటోజా వంటి వాటి వల్ల రావచ్చు. కొందరిలో హై మయోపియా (తీవ్రమైన దగ్గరి దృష్టి... అంటే చాలా దగ్గర్నుంచి చూస్తేగానీ స్పష్టంగా కనిపించకపోవడం) వల్ల లేదా గ్లకోమా వల్లగానీ ఈ సమస్య రావచ్చు.లక్షణాలు : ఈ సమస్య వచ్చినవారిలో రాత్రిపూట సరిగా కనిపించకపోవచ్చు. ఇక విటమిన్–ఏ లోపం తీవ్రంగా ఉన్నవారిలో కార్నియా కరిగిపోయే పరిస్థితి వస్తుంది. వైద్యపరిభాషలో దీన్నే ‘కెరటోమలేసియా’ అంటారు. ఇది పిల్లల్లో ఎక్కువ. దీన్ని అత్యవసరమైన పరిస్థితిగా గుర్తించి చికిత్స అందించాలి. చికిత్స : ఆహారంలో తగినంత విటమిన్ ఏ ఉన్న పదార్థాలు ఇవ్వడం, విటమిన్–ఏ మాత్రలు వాడటం, ముందస్తు నివారణగా (్ర΄÷ఫిలాక్టిక్ చికిత్సగా) విటమిన్–ఏ ఇస్తారు.డ్రగ్స్ : కార్టికోస్టెరాయిడ్స్, కీళ్లనొప్పుల కోసం దీర్ఘకాలం పాటు వాడే కొన్ని రకాల మందులు, క్షయవ్యాధికి వాడే కొన్ని మందుల వల్ల స్కోటోమాస్ వచ్చి క్రమంగా చూపు తగ్గుతూ పోవచ్చు. ఒక్కోసారి ఇది శాశ్వత అంధత్వానికి దారితీసే ముప్పు ఉంటుంది. అందుకే చూపు తగ్గుతున్నట్లు గ్రహించగానే డాక్టర్‌ను సంప్రదించి, వాడుతున్న మందులను వివరించి, తగిన చికిత్స తీసుకోవాలి. దాంతో కోల్పోయిన చూపు తిరిగి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పక్షవాతం (స్ట్రోక్ ): పక్షవాతం వచ్చినవారిలో మెదడులోని కొన్ని భాగాలకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఆ భాగాలు చచ్చుబడిపోతాయి. మెదడులో చూపునకు సంబంధించిన ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గితే తాత్కాలికంగా చూపునకు అంతరాయం కలగవచ్చు. మామూలుగానైతే ఇది తాత్కాలిక సమస్య. అయితే అతి కొద్ది సందర్భాల్లో మాత్రం ఇది శాశ్వత అంధత్వానికీ దారితీయవచ్చు. చికిత్స : ఇందులో నివారణే చికిత్సతో సమానం. డయాబెటిస్‌ను, రక్త΄ోటును అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ ముప్పును తప్పించుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ : మెదడులో వచ్చే గడ్డలు... చూపును మెదడుకు చేరవేసే ‘ఆప్టిక్ నర్వ్’ను నొక్కివేయడం వల్ల గానీ లేదా కంటికీ, నరానికీ రక్తప్రసరణనిచ్చే రక్తనాళాన్ని నొక్కివేయడం వల్ల గానీ అంతరాయం కలగవచ్చు. దాంతో ఒక్కోసారి ΄ాక్షిక అంధత్వం రావచ్చు. లేదా మొత్తం దృశ్యం కాకుండా సగమే కనిపించవచ్చు. ఇలాంటప్పుడు తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ఒకవేళ గడ్డలుంటే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగింపజేసుకోవాలి. అప్పుడు చూపు చాలావరకు మళ్లీ రావచ్చు.డయాబెటిక్ రెటినోపతి : డయాబెటిస్ ఉన్నవారిలో కంటికి రక్తాన్ని అందించే అత్యంత సూక్ష్షా్మతి సూక్ష్మమైన రక్తనాళాల్లోని లోపలి ΄÷ర ఎండోథీయమ్ కణాలు మృతిచెందడం వల్ల రెటీనాకు ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు. దాంతో రెటీనా దెబ్బతినే అవకాశాలెక్కువ. ఇది చూపు కోల్పోయే పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. లక్షణాలు : చిన్న అక్షరాలు చదవడం కష్టం కావచ్చు. క్రమంగా లేదా అకస్మాత్తుగా చూపు తగ్గవచ్చు. కళ్ల ముందు ఏవో కాంతిపుంజాలు తేలుతున్నట్లు (ఫ్లోటర్స్) కనిపించవచ్చు. చికిత్స : తక్షణ లేజర్ చికిత్సతోగానీ లేదా కంటిలో ఇచ్చే ఇంజెక్షన్లతో గాని లేదా శస్త్రచికిత్స ప్రక్రియల ద్వారాగాని చూపు మరింత దిగజారకుండా ఆపే అవకాశాలుంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా తమ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటరాక్ట్ (తెల్ల ముత్యం ): వయసు పెరుగుతున్న కొద్దీ కంటిలో ఉండే లెన్స్ తన పారదర్శకతను కోల్పోతుంది. ఫలితంగా దృష్టి మసకబారడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం, చూపు సన్నగిల్లడం, రాత్రివేళ చూడటం కష్టమైపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స : అత్యంత సాధారణమైన శస్త్రచికిత్స ద్వారా కంటిలోని లెన్స్‌ను మార్చి మరో పారదర్శకమైన లెన్స్ అమర్చడం వల్ల మళ్లీ మామూలుగానే చూడటం సాధ్యపడుతుంది. చూపు అంతరాయాల్లో తాత్కాలికం... దీర్ఘకాలికం... వివిధ వ్యాధులు, రుగ్మతలు చూపునకు అంతరాయం కలిగించవచ్చు. అయితే అందులో కొన్ని తాత్కాలికమైనవి. చికిత్స తీసుకుంటే నయమై చూపు మామూలుగా వచ్చేస్తుంది. అయితే కొన్ని అవరోధాలు మాత్రం కాస్తంత దీర్ఘకాలిక చికిత్స అవసరమైనవి. చూపునకు కలిగే కొన్ని రకాల సమస్యలు లేదా అంతరాయాలు క్రమంగా పెరుగుతూ΄ోయి, వాటి కారణంగా దీర్ఘకాలికంగా ముప్పు కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే వీటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని... గ్లకోమా : కంటిలో ఉన్న ద్రవాలు కొంత ఒత్తిడిని కలగజేస్తుంటాయి. ఈ ఒత్తిడినే ‘ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్’ అంటారు. అయితే కొందరిలో ఈ ఒత్తిడి క్రమంగా పెరిగిపోతూ ఉండటం వల్ల వారికి కనిపించే దృష్టి వైశాల్యం (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా కుంచించుకుపోతూ / తగ్గిపోతూ ఉంటుంది. ఇలా క్రమంగా తగ్గిపోవడాన్ని / కుంచించుకుపోతూ ఉండటాన్ని ‘కన్‌స్ట్రిక్షన్ ఆఫ్ ఫీల్డ్’ అంటారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి చికిత్స తీసుకోకపోతే అతడి చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇలా కంటిలోని ద్రవాల ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే వ్యాధిని గ్లకోమా అంటారు. లక్షణాలు : గ్లకోమా ఉన్నవారిలో చూసే వైశాల్యం (ఫీల్డ్) క్రమంగా కుదించుకుపోతుంది. ఇది ఒక్కోసారి క్రమంగా జరగవచ్చు లేదా కొందరిలో అకస్మాత్తుగానూ జరగవచ్చు. ఇక కంటిముందు నల్లమచ్చలాంటి వెలుగు, దగ్గరి వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం, లోతైన సొరంగంలోకి చూస్తున్న ఫీలింగ్ (టన్నెల్ విజన్) ఉండవచ్చు. ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అదుపులో ఉండేలా చికిత్స తీసుకోకపోతే ఈ లక్షణాలు క్రమంగా పెరుగుతూ పోయి చివరకు శాశ్వతంగా దృష్టి కోల్పోయే ముప్పు ఉంటుంది. చికిత్స : గ్లకోమాకు చికిత్స మూడు విధాలుగా జరుగుతుంది. మొదటిది మందులతో ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను పెరగకుండా అదుపులో ఉంచడం. రెండోది లేజర్ చికిత్స. దీని తర్వాత కూడా ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అదుపులోకి రాకపోతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. హైపర్టెన్సివ్ రెటినోపతి : మన దేహంలోని అన్ని అవయవాలతో ΄ాటు కంటికీ నిత్యం రక్తప్రసరణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రక్త΄ోటు ఉన్నవారిలో రక్తనాళాలపై కలిగే ఒత్తిడి తీవ్రంగా పెరిగినప్పుడు అత్యంత సన్నటి రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) ఆ ఒత్తిడికి చిట్లి΄ోయే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు కోల్పోయే ముప్పు ఉంటుంది. లక్షణాలు : చూపు మసకబారడం, ఒకవైపు సక్రమంగా కనిపించక΄ోవడం లేదా చూసే ఏరియా (వైశాల్యం) తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. చికిత్స : ఈ సమస్య వల్ల చూపు కోల్పోకుండా ఉండేందుకు రక్తపోటును అదుపులో ఉంచుకోవడమే మంచి నివారణ చర్య. ఇలాంటి సమస్య ఉన్న కొందరిలో లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. ఏఆర్‌ఎమ్‌డీ : ఇది వయసుతో పాటు వచ్చే కంటి సమస్య. ‘ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్’ అనే ఇంగ్లిష్ పదాల సంక్షిప్త రూపమే ఈ ‘ఏఆర్‌ఎమ్‌డీ’. కంటి రెటీనాలోని ‘మాక్యులా’ అని పిలిచే మధ్యభాగం తీవ్రంగా ప్రభావితమైపోవడంతో ఈ సమస్య వస్తుంది. లక్షణాలు : ఈ సమస్య ఉన్నవారిలో ‘స్కోటోమాస్’ రావచ్చు. ఇక వస్తువు – రూపం ఉన్నది ఉన్నట్లు గాక తీవ్రంగా మారి (డిస్టార్షన్) కనిపించవచ్చు. ఉన్న వస్తువు కంటే కనిపించేది చిన్నదిగా ఉంటే దాన్ని ‘మైక్రోప్సియా’ అంటారు. ఉన్న వస్తువు పరిమాణం కంటే కనిపించేది పెద్దదిగా ఉంటే దాన్ని ‘మ్యాక్రోప్సియా’ అంటారు. వస్తువు రూపం పూర్తిగా మారిపోతే దాన్ని ‘మెటామార్ఫోప్సియా’ అంటారు. చికిత్స : ఈ సమస్య ఉన్నవారికి కంటి డాక్టర్లు లేజర్ చికిత్స ద్వారాగానీ లేదా కంటిలోని విట్రియల్ ఛేంబర్ అనే ప్రాంతంలో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్లగానీ లేదా శస్త్రచికిత్సతో గాని సమస్యను మరింతగా పెరగకుండా నిలువరించేందుకు అవకాశాలెక్కువ. కెరటోకోనస్ వ్యాధి : సాధారణంగా గమనించి చూస్తే మన కంటి నల్ల గుడ్డు ప్రాంతం ఒకింత ఉబ్బెత్తుగా కనిపిస్తూ గుండ్రం (స్ఫెరికల్)గా ఉంటుంది. కానీ కెరటోకోనస్ అనే కండిషన్ ఉన్నవారిలో ఈ ఉబ్బెత్తుగా ఉండేభాగం కోణం (కోన్) ఆకృతిని సంతరించుకుంటుంది. ఈ కండిషన్‌నే ‘కెరటోకోనస్’ అంటారు. లక్షణాలు : ఈ కండిషన్ ఉన్నవారు సౌకర్యంగా చూడలేరు. అంతా మసగ్గా కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు తాము చూసే దృశ్యం కదిలిపోతున్నట్లు, వణుకుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. చికిత్స : కాంటాక్ట్లెన్స్లతో చికిత్స చేయవచ్చు. ‘కొలాజెన్ క్రాస్ లింకింగ్’ ప్రక్రియ అవసరపడవచ్చు.‘కెరటోప్లాస్టీ’ అనే చికిత్స చేయాల్సి రావచ్చు. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ (దృష్టిలోపాలు) : సరైన అద్దాలు వాడటం ద్వారా తరహా కంటి సమస్యలను అధిగమించవచ్చు. వీటినే రిఫ్రాక్టివ్ లోపాలు అంటారు. కొందరికి చాలా దగ్గరి నుంచి చూస్తేగాని వస్తువులు స్పష్టంగా కనిపించవు. దీన్నే ‘మయోపియా’ లేదా ‘నియర్‌సైటెడ్‌నెస్’ అంటారు. ఇక కొందరు ఆ వస్తువులను మరింత దూరంగా ఉంటే తప్ప స్పష్టంగా చూడలేరు. ఈ కండిషన్‌ను ‘హైపరోపియా’ లేదా ‘ఫార్సైటెడ్నెస్’ అంటారు. ఇక కొందరిలో గ్రాఫ్‌లో ఉన్న అడ్డు, నిలువు రేఖలు ఒకేసారి కనిపించవు. ఈ సమస్యను ‘ఆస్టిగ్మాటిజమ్’ అంటారు. సరిదిద్దడమిలా : ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్‌ను తగిన అద్దాలను ఉపయోగించి సరిచేయవచ్చు. కేవలం ఈ అద్దాలతోనే వాళ్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. కాబట్టి దీని గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. అలాగని చికిత్స తీసుకోకుండా ఉన్నా, తగిన అద్దాలు వాడకపోయినా సమస్య మరింత తీవ్రం కావచ్చు. మెల్లకన్ను : ఇంగ్లిష్‌లో ‘స్క్వింట్’ అనే ఈ కండిషన్‌ను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఈ కండిషన్లో కుడి, ఎడమ కనుగుడ్లలో ఏదో ఒకటి లోపలివైపునకో, బయటికో చూస్తుంటుంది. సాధారణంగా మెల్లకన్ను ఉన్నవారికి ఒకే వస్తువు రెండుగా కనిపించడం, మసకగా కనిపించడం, తలనొప్పి, వాంతులు ఉండవచ్చు. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొందరు దీన్ని అదృష్టంగా కూడా పరిగణిస్తుంటారు. కానీ దీర్ఘకాలంలో చూపు పూర్తిగా పోయే ముప్పు కూడా ఉంటుంది. చికిత్స : మెల్లకన్నుకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఇవే కాకుండా... డబుల్ విజన్, ఫ్లాషెస్, స్కోటోమాస్, హాఫ్ ఫీల్డ్ లాస్, ప్రాప్టోసిస్, రంగుల వలయాల వంటివి కనిపిస్తే వీలైనంత త్వరగా కంటి వైద్య నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాల్సిందే. లేకపోతే చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. (చదవండి: -
ఐ డ్రాప్స్, ఇన్హేలర్లు ఎక్కువగా వాడుతున్నారా..! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా కన్ను ఎర్రబారిన, దురదపుడుతున్నా..డాక్టర్ని సంప్రదించకుండానే ఐడ్రాప్స్ తెచ్చుకుని వేసేసుకుంటాం. అలాగే కాస్త ముక్కుదిబ్బడగా ఉన్న వెంటనే నాసల్ ఇన్హేలర్లను వాడేస్తాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణ రిలీఫ్ కోసం తరుచుగా వీటిని వాడేస్తుంటాం. ఇలా అస్సలు చేయొద్దని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే ఆ సమస్య తప్పదని చెబుతున్నారు.ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పదేళ్ల వయసున్న పిల్లలు గ్లాకోమా( Glaucoma)తో బాధపడుతున్న కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇలా ఎందుకు జరగుతుందని వైద్యులు క్షణ్ణంగా పరిశీలించగా..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్దిపాటి అలెర్జీలకైనా వెంటనే స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలను వాడుస్తుండటమే దీనికి కారణమని పరిశోధనలో తేలింది. ఎయిమ్స్‌లో నమోదైన దాదాపు చాలా కేసులు ఇలాంటి కోవకు చెందినవేనని వైద్యులు చెబుతున్నారు. ఇలా వైద్యుడిని సంప్రదించకుండా పదేపదే ఐ డ్రాప్స్ ఉపయోగిస్తే గ్లాకోమా బారినపడి అంధత్వంతో బాధపడతారని చెబుతున్నారు. ఇలా స్టైరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, ఇన్హేలర్లు లేదా స్టెరాయిడ్లను మాత్రలు లేదా ఇంజెక్షన్ రూపంలో ఉపయోగిస్తే..అవి కంటిలోపల ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. ఫలితంగా కంటి లోపలి ఆప్టిక్ నరాలు దెబ్బతినడానికి దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కండ్లకలక కోసం ఈ ఐడ్రాప్స్ వినియోగించి గ్లాకోమా బారిన పడిన కేసులు రాజస్థాన్, హర్యానా వంటి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదయ్యాయని తెలిపారు వైద్యులు. అదీగాక ఈ గ్లాకోమా లక్షణాలను ప్రారంభంలో గుర్తించకుండా చివరిదశలో రావడంతో చాలామంది పిల్లలు అంధత్వం బారినపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే చాలామంది గ్లాకోమా రోగుల్లో ఇన్హేలర్ వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లల్లో అంతగా కనబడని ఈవ్యాధి..స్టెరాయిడ్ ఆధారిత ఐడ్రాప్స్, ఇన్హేలర్లు వాడటం వల్లనే అని పరిశోధనలో తేలింది. సాధారణంగా వయోజన గ్లాకోమా 40 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతుందట. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా ఈ వ్యాధి బారినపడిన చరిత్ర, డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు, కంటి గాయం తదితరాల వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే అథ్లెట్లు చర్మ సంబంధమైన స్టెరాయిడ్ క్రీమ్‌లు, కండరాల నిర్మాణానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లను వాడొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇవి గ్లాకోమాకు దారితీస్తాయని అంటున్నారు. అంతేగాదు ముఖం మీద, కళ్ల చుట్టూ స్టెరాయిడ్లు ఉన్న క్రీములు వినియోగిస్తే..గ్లాకోమాకు దారితీయవచ్చని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, క్రీమ్‌లు వినియోగిచొద్దని నొక్కి చెప్పారు. ఇక కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుదల కూడా కంటిలోపలి ఒత్తిడిని పెంచుతుందని, ఇది కంటిలోపలి రక్తపోటుకు దారితీస్తుందని అన్నారు. ఏదైనా కారణం చేత ఆరు వారాలకు పైగా స్టెరాయిడ్లు తీసుకునే రోగులు తప్పనిసరిగా వైద్యులు చేత గ్లాకోమా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గ్లాకోమా అనేది లక్షణాలు లేకుండా మన కను దృష్టిని అదృశ్యం చేసే వ్యాధి. అందువల్ల క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అత్యంత కీలకం. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారికి లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గ్లాకోమా వ్యాది వచ్చిన చరిత్ర ఉన్న వారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువని వెల్లడించారు. అంతేగాదు చాలామందికి తమకు గ్లాకోమా ఉందని తెలియదట. ప్రాథమిక స్థాయిలోనే దీన్ని గుర్తించేలా.. కంటి స్క్రీనింగ్‌పరీక్షలు అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. దీన్ని ముందుగానే గుర్తిస్తేనే అంధత్వం బారినపడకుండా ఉండగలమని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: 'అంధురాలైన అమ్మమ్మ సాధించిన విజయం'..! పోస్ట్ వైరల్ ) -
Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు
శరీరానికి ప్రాణం పోసేది శ్వాస. శ్వాస ఆగిపోతే జీవితం ఆగిపోయినట్టే. అందుకే రోజువారీ దినచర్యలో శ్వాసను నియంత్రించడం చాలా అవసరమని యోగ చెబుతోంది. సంస్కృతంలో, "ప్రాణ" అంటే ప్రాణశక్తి లేదా శక్తి, " యమ" అంటే నియంత్రణ. యోగాలో ప్రాణాయామం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఆయువును పొడిగించే ఆసనాన్నే ప్రాణాయామం అని చెప్తారు. మనస్సును నియంత్రించడానికి అనుసరించే అత్యంత ముఖ్యమైన పద్ధతుల్లో ఇది ఒకటి. మనిషి ఎక్కువ కాలం జీవించడానికి ప్రాణాయామం సహాయపడుతుంది. ప్రాణాయామం లేదా శ్వాస నియంత్రణ, అనేక శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలకు ఆక్సిజన్ అందించి అన్నింటినీ సక్రమంగా నడిపించే ప్రక్రియ శ్వాసక్రియ. అన్ని కణాలకు, శరీర వ్యవస్థలకు ఆక్సిజన్ సరఫరా జరగాలంటే శ్వాస మెరుగ్గా ఉండాలని, యోగా ద్వారా శ్వాసను నియంత్రించడం సాధ్యమని యోగా నిపుణులు చెబుతారు. మనసును అదుపులో ఉంచడం, ఏకాగ్రతను సాధించడం అనేవి నాడీవ్యవస్థకు సంబంధించినవి. ఇందులో అత్యంత కీలకమైన దశ శ్వాస. ప్రాణాయామంతో మనస్సు, శరీరం రీఛార్జ్ యోగాలో ప్రాణాయామం ప్రయోజనాలు యోగాకు మించి ఉంటాయి. శ్వాస మీద పని చేస్తున్నప్పుడు, శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తూనే తగినంత ఆక్సిజన్ సరఫరాతో శ్వాసను నియంత్రించడం, సరైన విధంగా సాధన చేయడం ఈ యోగాలో కీలకం. శరీరాన్ని రీఛార్జ్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది ప్రాణాయామం జీర్ణాశయానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది, మెరుగైన జీర్ణక్రియ కోసం రక్త ప్రవాహాన్ని, ప్రేగుల బలాన్ని పెంచుతుంది. యోగా ఆసనాలతో కలిపి చేసే ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవక్రియ వ్యర్థాలను తొలగిస్తుంది. సాధన చేయడానికి... ప్రాణాయామం చేయడానికి, ఒక ప్రశాంతమైన స్థానంలో కూర్చొని, వెన్నును నిటారుగా ఉంచాలి. రెండు కళ్ళను మూసి, శ్వాసను లోపలికి పీల్చుకోవాలి. కొన్ని క్షణాలు ఆ శ్వాసను బిగించి, తర్వాత నెమ్మదిగా బయటకు వదిలేయాలి. ఈ ప్రక్రియను పదే పదే పునరావృతం చేయడం వల్ల శరీరానికి, మనసుకు ప్రశాంతత చేకూరి శక్తిమంతం అవుతాయి. శ్వాస సాధన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రాణాయామంలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఐదు ప్రాణాయామాలు ఉన్నాయి. అనులోమ విలోమ ప్రాణాయామంకపాలభాతి ప్రాణాయామంభ్రమరి ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం దిర్గ ప్రాణాయామం -
మండే ఎండలు: జర జ్యూస్ కోండి!
ఎండలు మండిపోతుండటంతో నగర వాసులు బెస్ట్ పానీయాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు కూల్‌డ్రింక్స్, సోడాలు ఆధిపత్యం చెలాయించినా.. ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటూసహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఎండ వేడిలో శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రతల సమతుల్యత కాపాడటం ప్రామాణికంగా మారుతున్న నేపథ్యంలో పోషక విలువలు కలిగిన పదార్థాల వినియోగానికే జై కొడుతున్నారు. ట్రైనర్లు సైతం వేసవిలో సహజ, పోషక పానీయాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుండటంతో ఇప్పుడిదే ట్రెండ్‌గా మారింది. – సాక్షి, సిటీబ్యూరో అలోవేరా, కీరా, బీట్రూట్ ఇలా ఎన్నెన్నో.. వేసవి తాపానికి ఉపశమనం అంటున్న నిపుణులు సోషల్ మీడియాలో సెలబ్రిటీల పోస్టుల ప్రభావం ఫుట్‌పాత్ నుంచి ఫైవ్‌స్టార్ హోటల్స్ వరకు లభ్యం ఇష్టంగా జ్యూస్‌లు తాగుతున్న ఈతరం యువత హెర్బల్ రింగ్స్ ఇందులో మరో ప్రత్యేకంసామాన్య జనాల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ ఆరోగ్య పానీయాలపై ఆసక్తి పెరగడం ద్వారా, ఇది తాత్కాలిక ఫ్యాషన్ కాకుండా జీవనశైలిలో భాగంగా మారిన ఆరోగ్యకరమైన అలవాటు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. వేసవిలో చల్లదనం కోసం, ఆరోగ్యం కోసం ఈ తాజా పానీయాల ట్రెండ్‌ను మెచ్చుకోకుండా ఉండలేమంటున్నారు. ఈ మధ్య సినీనటి కీర్తిసురేష్‌తో పాటు పలువురు టాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ అందానికి, ఆరోగ్యానికి ఈ పానీయాలు కూడా ప్రధాన కారణమని చెబుతుండటంతో యువత వీటిపై మోజు పెంచుకుంటోంది. ఈ పానీయాల తయారీ కోసం ఫుడ్ బ్లాగర్స్ ప్రత్యేకంగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కూల్ కూల్ సబ్జా.. సబ్జా గింజలతో కూడిన పానీయాలకు మార్కెట్లో ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా ఇవి శరీర చల్లదనానికి దోహదపడతాయి. ముఖ్యంగా లెమన్ జ్యూస్, రోస్ షర్బత్, మిల్క్ బేస్డ్ డ్రింక్స్‌లో సబ్జా గింజల వినియోగం విస్తృతంగా పెరిగింది. శరీరానికి కూలింగ్ ఇచ్చే ఈ గింజలు, అధిక వేడిలో పొట్టకు ఉపశమనంగా పనిచేస్తాయి. సరికొత్తగా అలోవేరా.. ఆరోగ్యకరమైన అభిరుచులలో అలోవేరా జ్యూస్ ఒకటిగా నిలిచింది. సోషల్ మీడియాలో అలోవేరా జ్యూస్ వైరల్‌గా మారడంతో.. దీనిని సైతం ఇష్టంగా సేవిస్తున్నారు. ఇది దాహాన్ని తీరుస్తూనే, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మానికి కూడా లాభదాయకంగా ఉండటంతో మహిళలకు ఈ జ్యాస్ నచ్చేసింది. వేడిమి సమతుల్యం.. క్యారెట్, బీట్రూట్, కీరా వంటి కూరగాయల జ్యూస్‌లు ఆల్‌టైం ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటంతో ఇబ్బంది లేకుండా తేలికగా జీర్ణమై, శరీరానికి శక్తిని అందిస్తాయి. బీట్రూట్ జ్యూస్ రక్తహీనత నివారణకు, క్యారెట్ జ్యూస్ కంటికి మేలు చేసేందుకు, కీరా శరీర ఉష్ణోగ్రత తగ్గించేందుకు ఉపయోగపడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌కు బదులుగా.. సంప్రదాయ పానీయాలైన కొబ్బరి నీళ్లు, చెరుకు రసం కూడా ఎప్పటిలానే వాటి స్థానాన్ని నిలుపుకున్నాయి. వీటిలో సహజమైన తీపి, విటమిన్లు, మినరల్స్ ఉండటం వలన ఇవి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌కు బదులు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. కొబ్బరి నీళ్లు, కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తే, చెరుకు రసం శక్తిని పెంచుతుంది.ఔషధ పానీయాలు సైతం.. ఇదే సమయంలో పుదీనా, తులసి వంటి ఔషధ గుణాలు కలిగిన పానీయాలు ఇప్పుడు మార్కెట్లో దొరకుతున్నాయి. వీటిలో పుదీనా శ్వాస సంబంధిత సమస్యలకు, తులసి ఇమ్యూనిటీ మెరుగు పరిచేందుకు సహాయపడతాయి. హెర్బల్ టీ, తులసి వాటర్ వివిధ రూపాల్లో లభిస్తున్నాయి. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్ఫుట్పాత్ టు ఫైవ్ స్టార్.. ఈ పానీయాలు కేవలం ఫుట్‌పాత్ జ్యూస్ స్టాల్స్ వరకు మాత్రమే కాకుండా.. త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కూడా ప్రత్యేక మెనూలో చోటు దక్కించుకున్నాయి. హోటల్ లాబీలలో గ్రీన్ హెల్త్ షాట్స్, డిటాక్స్ జ్యూస్‌లు, స్పెషల్ డ్రింక్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. రాత్రి సేదతీరే క్లబ్, పబ్‌లలో కూడా ఈ పానీయాలకు ఆదరణ పెరిగింది. ఇదొక మోడ్రన్ లివింగ్ స్టైల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. -
హైబీపీని అదుపులో ఉంచుకుందాం ఇలా..!
హైబీపీ అనేది జీవనశైలికి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య. ఇది ఒకసారి కనిపించాక ఇక దాదాపు బాధితుల జీవితకాలమంతా హైబీపీ వాళ్ల జీవనాన్నీ, అలవాట్లను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా నార్మల్‌గా 120 / 80 ఉండాల్సిన బీపీ కొలత అంతకంటే ఎక్కువగా ఉండటాన్ని హైబీపీ లేదా హైపర్‌టెన్షన్‌గా చెబుతారు.హైబీపీ ప్రధానంగా జన్యు కారణాల వల్లనే వస్తుంది. అయితే వాళ్ల జీవనశైలిలో భాగంగా వాళ్లు తీసుకునే ఆహారం, దేహానికి దొరికే వ్యాయామం అలాగే వాళ్లు అనుభవించే ఒత్తిడి... ఇవన్నీ హైబీపీ వచ్చేందుకు కారణమవుతుంటాయి. నివారణ ఇలా... ఆరోగ్యకరమైన జీవనశైలితో హైబీపీని చాలావరకు నివారించవచ్చు. అదెలాగో చూద్దాం. ఆహార పరంగా: ఆహారంలో సోడియమ్ మోతాదులు ఎక్కువగా తీసుకోవడం నేరుగా బీపీని పెంచుతుంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఆహారాలు, క్యాన్డ్ ఫుడ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే శ్నాక్స్ వంటివి తగ్గించాలి. పొటాషియమ్ ఉండే ఆహారాలతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అందుకే పొటాషియమ్ మోతాదులు ఎక్కువగా ఉండే అరటిపండ్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆహారంతో హైబీపీని నియంత్రించడాన్ని ‘డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’గా చెబుతారు. ఇందులోని మొదటి అక్షరాలను తీసుకుని సంక్షిప్తంగా ఈ పద్ధతిని ‘డ్యాష్’గా పేర్కొంటారు. డ్యాష్ ఆహారాల్లో భాగంగా తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లతో హైబీపీని నియంత్రించవచ్చు. వ్యాయామం ఇలా... ప్రతివారం కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా ఏదో ఒక వ్యాయామం చేస్తుండటం మంచిది. మానసిక ఒత్తిడి... దీర్ఘకాలిక ఒత్తిడి హైబీపీకి కారణమవుతుంది. అందుకే ఒత్తిడిని అదుపు చేసేందుకు యోగా, ధ్యానం, శ్వాసవ్యాయామాల వంటి ప్రక్రియలు అనుసరించడం మేలు. మద్యం, పొగతాగడానికి దూరంగా... మద్యం, పొగతాగే అలవాట్లు హైబీపీని మరింత ప్రేరేపిస్తాయి. అందుకే ఆ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు... పొగతాగని వారితో పోలిస్తే పొగతాగేవారిలో... రక్తనాళాల్ని పెళుసుగా మార్చే ‘అథెరో స్కిప్లోరోసిస్’ అనే సమస్య 10 ఏళ్ల ముందుగా వస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. మరికొన్ని ఇతర సూచనలు...స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి. దాంతో బీపీ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ∙రోజూ కనీసం 7 – 9 గంటలు కంటినిండా నిద్రపోవాలి. ఇక క్రమం తప్పకుండా బీపీ పరీక్షించుకుంటూ ఉంటూ దాన్ని బట్టి జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. ∙హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా డాక్టర్ సూచించిన మోతాదులో మందులు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్‌కు చెప్పకుండా మానేయడం సరికాదు. చివరగా... బీపీ రీడింగ్‌ను క్రమం తప్పకుండా ఖచ్చితమైన రీతిలో చూసుకుంటూ, దాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా సుదీర్ఘకాలం పాటు మామూలుగానే జీవించడం సాధ్యమవుతుంది. డాక్టర్ అంజని ద్వారంపూడికన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ (చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! మై ప్లేట్ ఫర్ ది డే మెనూ..)∙ -
షుగర్ ఉంటే..ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా?
నాకు ఇప్పుడు మూడోనెల. గతంలో గర్భస్రావం కావడం వలన చాలా డిస్టర్బ్ అయ్యాను. నన్ను ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం సిద్ధంగా లేను. చాలా బాధగా ఉంది. ఈ సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి?– రమ్య, హైదరాబాద్ మీ పరిస్థితిని అర్థం చేసుకోగలం. ప్రెగ్నెన్సీ మానసికంగా చాలా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు. దీంతో బాధ, కోపం, అసహనం, ఆందోళన ఎవరికైనా వస్తాయి. మళ్లీ ప్రెగ్నెన్సీ మీద భయం ఉంటుంది. ఇలాంటప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి. సహాయం తీసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి మీ భావాలను వివరంగా వారితో పంచుకోవాలి. టాకింగ్ థెరపీ ద్వారా మనసులో ఉండే బాధను తొలగించుకోవచ్చు. అలా ఎందుకు అయింది, ఏమి చేస్తే మళ్లీ అలా జరగకుండా ఉంటుంది. ఏ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా అన్ని కోణాల్లో మాట్లాడుతూ మీ మనసులోని అనుమానాలను తొలగించుకోవచ్చు. దీంతో డాక్టర్ అవసరమైన పరీక్షలు చేసి సమస్య తీవ్రతను అంచనా వేస్తారు. అవసరమైతే మానసిక నిపుణుడిని సంప్రదించమని చెప్తారు. ఇది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (పీటీఎస్డీ) కావచ్చు. దీనికి కౌన్సెలింగ్, థెరపీ అవసరం. సాధారణంగా నాలుగు నుంచి ఐదు వారాల్లో ఉపశమనం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండు వారాల్లోనే తేడా కనిపిస్తుంది. ఎలాంటి మందులూ వీళ్లకి అవసరం ఉండదు. అందుకే, భయపడకుండా ఒకసారి డాక్టర్ని కలవండి. కొంతమందికి ఈ సమస్య ఎక్కువగా ఉండచ్చు. వీరికి లాంగ్ టర్మ్ కౌన్సెలింగ్ సెషన్స్‌తోపాటు కొన్ని మందులు సూచిస్తాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) అనేది ఒక రకమైన టాకింగ్ థెరపీ. దీనిలో మీ మనస్సులోని ఆలోచనలు మేనేజ్ చేసే ఫోకస్డ్ కౌన్సెలింగ్ చేస్తారు. మీకు రొటీన్‌గా కొన్ని పనులు చెయ్యమని చెప్తారు. రెండు నుంచి మూడు నెలల సీబీటీ చికిత్సతో ఉపశమనం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో సెర్ట్రాలిన్ మాత్రలను తాత్కాలికంగా ఉపయోగిస్తారు. ఇది కొన్ని వారాలు మాత్రమే. ఈ లోపల కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల వలన మానసిక స్థితి మెరుగవుతుంది. నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మధుమేహం ఉంది. మందులు వాడుతున్నాను. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శారద, వరంగల్. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. అప్పుడు వారు కొన్ని పరీక్షలను ముందే చేయించి, దాదాపు అన్నీ కంట్రోల్లో ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తున్నారు. వీటిలో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, మూర్ఛ, ఆస్తమా లాంటివి ఉంటాయి. ముందే డాక్టర్ని సంప్రదించినప్పుడు , మీ సమస్య ఎంతవరకు కంట్రోల్లో ఉందో తెలుసుకోవచ్చు. దీని వలన తల్లికి, బిడ్డకి భవిష్యత్తులో ఏ సమస్యలు ఉండవు. డయాబెటిక్ క్లినిక్స్‌లో వెంటనే సంప్రదించి, హెచ్‌బీ1సీ పరీక్ష చేయించుకోండి. ఇందులో చక్కెర స్థాయి 5.5 నుంచి 6. 5 శాతం మధ్యలో ఉండాలి. ఒకవేళ మీ షుగర్ కంట్రోల్లో ఉంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం తగ్గుతుంది. షుగర్ ఎక్కువ ఉంటే కొన్ని నెలలు స్ట్రిక్ట్ డైట్, వ్యాయామం చేయాలి. మందులు అవసరమైతే మార్చాలి. కొన్ని రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు రోజూ తీసుకోవటం ప్రారంభించండి. ఈ సమయానికి డాక్టర్ సూచించిన మందులు మాత్రమే వాడాలి. ఇన్సులిన్ వాడటం సురక్షితమే. ఐ స్క్రీనింగ్, మూత్రపిండాలు, కాలేయం, హార్మోన్ పరీక్షలు కూడా చేయించాలి. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఏ ఇబ్బందులు రాకుండా చూస్తాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..) -
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!
ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే శరీర బరువు చాలా కీలకం. మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చేస్తూ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామో లేదో తనిఖీ చేసుకోవాలి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉంటే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు. మరి మన శరీర బరువు నియంత్రణలో ఉండాలన్నా, శరీర బరువును తగ్గించుకోవాలన్నా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. సమతుల్య ఆహారం తీసుకునే జాగ్రత్త పడాలి. మరి అధిక బరువును తగ్గించుకునే క్రమంలో శరీరంలో ఫైబర్, ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండాలి. అందుకు మన ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన కొన్నిముఖ్యమైన ఆహార పదార్థాలు గురించి తెలుసుకుందాం.సాధారణ శారీరక శ్రమతో పాటు కొన్ని రకాల ఆహారాలను మన మెనూ చేర్చుకోవడం వల్లన, ప్రొటీన్ ఫుడ్ అందడంతో పాటు, తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉంటూ, కడుపు నిండిన అనుభూతి నింపేవి... రోజువారీ ఆహారంలో చేర్చినప్పుడు బరువు తగ్గడానికి గణనీయంగా సహాయపడతాయి. అంతేకాదు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి.రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి . జీవక్రియను పెంచుతాయి.ఇదీ చదవండి: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్ ఫేంఆకుకూరలుఆకుకూరలు కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపించడానికి సహాయపడతాయి. వీటిల్లోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఓట్స్ఓట్స్ అనేది కరిగే ఫైబర్, ముఖ్యంగా బీటా-గ్లూకాన్ అధికంగా ఉండే తృణధాన్యం. కడుపు నిండిన అనుభూతినిచ్చి, జీర్ణక్రియను నెమ్మదిస్తుంది అతిగా తినకుండా నిరోధిస్తుంది. రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.గ్రీకు యోగర్ట్ గ్రీకు పెరుగులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గే సమయంలో కండరాల నిర్వహణకు మద్దతు ఇస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపర్చే, మంటను తగ్గించే జీర్ణక్రియకు సహాయపడే ప్రోబయోటిక్లు పుష్కలంలా లభిస్తాయి. చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!గుడ్లుగుడ్లు పోషకాలతో నిండి ఉంటాయి . అధిక-నాణ్యత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అవసరమైన విటమిన్లను అందిస్తాయి. అల్పాహారంగా గుడ్లు తినడం వల్ల కడుపు నిండి, కేలరీల ఇన్‌టేక్ తగ్గుతుంది. ఆకలి , కొవ్వు నిల్వలో పాల్గొనే హార్మోన్లను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.చియా గింజలు చియాగింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అవకాడోఅవకాడోలో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్‌తో సమృద్ధిగా లభిస్తాయి. పొటాషియం కూడా ఉంటుంది.ఇది నీటి నిలుపుదలని నిర్వహించడానికి మరియు ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. పరోక్షంగా కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.బెర్రీలుబెర్రీలు కేలరీలు తక్కువ, ఫైబర్, విటమిన్లు మ,శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తీపిని వదులుకోకుండా బరువు తగ్గడానికి ప్రయత్నించే ఎవరికైనా ఇవిచక్కగా ఉపయోగపడతాయి.నట్స్ నట్స్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , ఫైబర్‌ను అందిస్తాయి.. అవి కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ, గింజలను మితంగా తీసుకుంటే, ఆకలిని అరికట్టి, మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గించే సామర్థ్యం కారణంగా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనాలు చూపిస్తున్నాయి.చిక్కుళ్ళుచిక్కుళ్ళు మొక్కల ఆధారిత ప్రోటీన్ , కరిగే ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి, దీర్ఘకాలిక సంతృప్తిని ప్రోత్సహిస్తాయి. ఆకలిని నియంత్రించి, రక్తంలో చక్కెర పెరుగుదల లేకుండా స్థిరమైన శక్తి వనరును అందిస్తాయి. ఇది కొవ్వు నిల్వలను కరిగేలా చేస్తాయి.నోట్: బరువుతగ్గడం అనేది నిబద్ధతతో చేయాల్సిన పని. ఎవరికి వారు క్రమశిక్షణగా వ్యాయామం చేస్తూ , ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా తమబరువును తగ్గించుకోవాలి. ఇందుకు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోవాలి. -
World Hypertension Day : పట్టణ యువతలో పెరుగుతున్న ‘హైబీపీ’
మే 17 ప్రపంచ రక్తపోటు దినోత్సవం (World Hypertension Day) సందర్భంగా, అపోలో హాస్పిటల్స్ దేశంలో పెరుగుతున్న రక్తపోటుపై జాతీయ అవగాహన కోసం పిలుపునిస్తోంది.ఆరోగ్యవంతులైన భారతీయులలో ప్రతీ ఇద్దరిలో ఒకరికి ముందస్తు గుండె జబ్బులు వస్తున్నాయి . దేశీయంగా యువకుల్లో దాదాపు 30శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. రక్తపోటు అనేది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం , అకాల మరణాలకు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటిగా మారింది. ప్రజారోగ్యంపై దీని గణనీయమైన ప్రభావం ఉన్నప్పటికీ, అధిక సంఖ్యలో అధిక రక్తపోటు నిర్ధారణ కావడంలేదు. దీనిపై అవగాహన పెంచుకోవాలని అపోలో హాస్పిటల్స్ ప్రజలను కోరుతుంది. భారతదేశంలో పెరుగుతున్న ‘రక్తపోటు’రక్తపోటు సుమారు 300 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మందికి వారికి బీపీ ఉన్నట్టు గుర్తించడం లేదు. 2024లో 45 ఏళ్లలోపు వారిలో 26శాతం మందికి మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయింది.అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ, “భారతదేశం అనేక ప్రజారోగ్య సంక్షోభాలను అధిగమించింది . ఇది అవగాహన సమిష్టి కృషి ద్వారానే సాధ్య ం. అపోలో హాస్పిటల్స్‌లో, నివారణ అనేది మొదటి ప్రిస్క్రిప్షన్ అని తాము నమ్ముతున్నామన్నారు. డిజిటల్ హైపర్‌టెన్షన్ పర్యవేక్షణను మెరుగుపరచడం, రొటీన్ స్క్రీనింగ్‌లకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత నివ్వడం ముఖ్యమన్నారు. ప్రతి భారతీయుడి ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షును తాము అభిలషిస్తున్నా మన్నారు.ముఖ్యంగా ప్రధాన నగరాల్లో, హైదరాబాద్ (68%), ఢిల్లీ (65%) , చెన్నై (63%) ఎక్కువ కేసులు నమోదు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. దీర్ఘకాలిక ఒత్తిడి , కదలికలు లేని జీవితం లాంటి 'పట్టణ జీవనశైలి' గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని పెంచుతోంది.అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీత రెడ్డి మాట్లాడుతూ, “రక్తపోటు ఇకపై వయస్సు లేదా జన్యుశాస్త్రానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఇది యువ పట్టణ జనాభాలో నిశ్శబ్ద అంటువ్యాధిగా మారుతోంది. నిజమైన సవాలు రక్తపోటును లెక్కించడంతోపాటు, వ్యక్తి విస్తృత హృదయనాళ ప్రమాద ప్రొఫైల్‌ను అర్థం చేసుకోవడంలో ఉంది. బయోమార్కర్లపై సమగ్ర అవగాహనను స్వీకరించాలి, ఎందుకంటే తేలికపాటి అసమతుల్యతలు కూడా మరింత తీవ్రమైన అంతర్లీన పరిస్థితులకు ప్రారంభ సూచికలు కావచ్చు అని ఆమె తెలిపారు. అంతేకాకుండా, వేగవంతమైన పట్టణీకరణతో, నిశ్చల జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు , నిరంతర ఒత్తిడి లాంటివన్నీ ప్రజారోగ్య సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. నివారణ , ముందస్తు జోక్యం అనేది తప్పనిసరి. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతదేశంలోని పట్టణ జనాభాలో దాదాపు 30శాతం అధిక రక్తపోటు లేదా ప్రీ-హైపర్‌టెన్షన్ బారిన పడటం ఆందోళనకరమైంది. మన తోటి పౌరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆరోగ్య సంరక్షణ, విధానం ,సమాజ అవగాహనతోపాటు, త క్షణ సమిష్టి చర్య అవసరమని ఆమె చెప్పారు.నివారణ మార్గాలుఉప్పు తీసుకోవడం తగ్గించడం, శారీరక శ్రమను పెంచడం ,ఒత్తిడి నిర్వహణ వంటి సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా అధిక రక్తపోటు వల్ల కలిగే 80శాతం గుండెపోటులు, స్ట్రోక్‌లను నివారించవచ్చని ఆధారాలు చూపిస్తున్నాయి. అధిక రక్తపోటు వైద్య నిర్వహణ చాలా కీలకమైనప్పటికీ, అపోలో హాస్పిటల్స్ నివారణ ఆరోగ్య సంరక్షణ వైపు మార్పు కోసం వాదిస్తోంది. అధిక రక్తపోటు పెరుగుతున్న భారాన్ని తిప్పికొట్టడానికి కీలకం ఏమిటంటే, వ్యక్తులు క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు, సమస్య ముదరకముందే గుర్తించడం. అపోలో హాస్పిటల్స్ దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో సాంకేతికతను సమగ్రపరచడానికి రక్తపోటును గుర్తించడం , నిర్వహించడం మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రిడిక్టివ్ అనలిటిక్స్ , టెలిమెడిసిన్‌లో పురోగతి ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.జాతీయ చర్యకు పిలుపు: సమిష్టి బాధ్యతహృదయ సంబంధ నివారణపై జాతీయ పునరాలోచన కోసం అపోలో పిలుపునిస్తోంది, భారతీయులు ముందుగానే స్క్రీనింగ్‌లను ప్రారంభించాలని, ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత లేదా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారికి స్క్రీనింగ్‌లను ప్రారంభించాలని కోరుతోంది. కరోనరీ కాల్షియం స్కోరింగ్ వంటి అధునాతన ఇమేజింగ్ పద్ధతులను చేర్చడం వల్ల పైకి కనిపించని కారణాలను బహిర్గతం చేయడంలో సహాయపడుతుంది. ప్రారంభ గుర్తులను చూపించేవారికి నివారణ చికిత్సా వ్యూహాలను అవలంబించడం వల్ల, అవి లక్షణరహితంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వచ్చే సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. ప్రారంభ దశలోనే అథెరోస్క్లెరోసిస్ ఉన్న వ్యక్తులు మార్గదర్శకాల ఆధారిత జోక్యాలను పొందినప్పుడు హృదయ సంబంధ సంఘటనలలో 45–50శాతం తగ్గింపు ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక రక్తపోటును ముందుగా గుర్తిస్తే.. నియంత్రణ సాధ్యమే: ఆలివ్ ఆసుపత్రిబీపీ చెక్ చేసుకుంటున్నారా? పాణాలు హరించడంలో బీప సలెంట్ కిలర్ - వరల్ బీడీ డే సందర్భంగా ఆలివ్ హాస్పిటల్ అవగాహనప్రాణాలను హరించడంలో రక్తపోటు సైలెంట్ కిల్లర్ అని హదరాబాద్ లోని ఆలివ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. . 17 అంతర్జాతీయ రక్తపోటు దినం సందర్భంగా గుండె సంబంధిత వ్యాదులపై ఆసుపత్రి నిర్వాహకులు అవగాహన కల్పించారు. రక్తపోటు గుర్తింపు, నియంత్రణ, నివారణ లాంటి అంశాలపై అవగాహనా కార్యక్రామాన్ని నిర్వహించారు. రక్తపోటు ద్వారా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహనా ఆవశ్యకతపై వివరించారు. ‘రక్తపోటును సరిగ్గా గుర్తించండి, నియంత్రించుకుంటూ ఎక్కువకాలం జీవించండి’ అనే థీమ్ దీనిపై చర్చించారు. రక్తపోటు దేశంలో తీవ్ర ప్రజారోగ్య సమస్యగా మారుతోందని, ముఖ్యంగా గుండె సంబంధిత, వ్యాధులు, మూత్ర పిండాల వైఫ్యలానికి కీలకమైన ప్రమాదకారంగా మారుతోందన్నారు నిపుణులు.ఇదొక అంటువ్యాధిలా ఉందనీ, దాదాపు 200 మిలియన మంద దీనితో బాధపడుతున్నారనీ, డియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గణాంకాలు చెబుతుండగా, ఇందులో కొంతమందిలో ఇది అదుపులో ఉంది. అలాగేఏ జర్నల్ ఆఫ్ హ్యూమన్ హైపర్‌టెన్షన్‌లో ఇటీవల పచురితమన ఒక అధ్యయనం పకారం, భారతీయ పెదలలో 22.6శాతం మంది అధిక రక్తపోటుతొ బాధపడుతున్నారు. అయితే ఇందులో 15 శాతం మందిచి నియంత్రణలో ఉంది.గుండెపోటు, లేదా గుండె వైఫల్యం చివరి దశలో, సమస్య తీవ్రమైనపుడుమాత్రమే రోగులు వైద్య కోసం వస్తున్నారని ఆలివ్ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వెనల్ కార్డియాలజిస్ట్ డా. జహెదుల్లా ఖాన్ విచారం వ్యక్తంచేశారు. ఈ సమస్యను ముందుగాగుర్తించినా, లేదా క్రమం తప్పకుండా చికిత్సతీసుకున్నా, ప్రమాదకరమైన, అత్యవసర పరిస్థితులు రావని సూచించారు. ఈ సందర్భంగా ఆలివ్ హాసి్పటల్ లోని కన్సలెంట్ ఇంటర్వననల్ కారయాలజిస్ డాకర్ జహెదులా ఖాన్ మాటాడుతూ, “క్రమం తప్పకుండా బీపీని చెక్ చేసుకుంటూ ఉంటే నియంత్రణ సాధ్యమన్నారు. లక్షణాల కోసం చూడకుండా అవగాహన పెంచుకొని, తీసుకునే నివారణ చర్యలే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయుధమన్నారు. జాగ్రత్తలుఅధిక రక్తపోటు ఎలాంటి లక్షణాలు లేకుండా ముదిరిపోతుంది. అందుకే పతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసార బీపీ చెక్ చేసుకోవటం అలవాటుగా మార్చుకోవాలి.సమతుల్య, తక్కువ సడియం ఆహారం, అధిక పటాషియం ఉండేలా ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. శారీరకంగా చురుకుగా ఉండటంతోపాటు ఒత్తిడిని నియంతించుకోవాలి. సరైన చికిత్సతో అధిక రక్తపోటును కట్టడి చేయవచ్చు. -
యాభై దాటారా? మతిమరుపా? ఇవిగో జాగ్రత్తలు!
మీ వయసు యాభై దాటిందా? ఏమనుకోకండి...మీ పిల్లలకు, మీ వారికి, అత్తమామలకు, ఇతర కుటుంబ సభ్యులకు కావలసిన వాటన్నింటినీ అమర్చి పెడుతూ మీ గురించి మీరు పట్టించుకోవడం మానేశారా? అయితే ఇప్పుడు తెలియక΄ోవచ్చు కానీ, ముందు ముందు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కనీసం ఇప్పుడయినా మేలుకోవడం మంచిది. 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు తమ ఆరోగ్యం కోసం అలవరచుకోవలసిన ఆహారపు నియమాలు ఏమిటో తెలుసుకుందాం... నిజానికి యాభై ఏళ్లు దాటిన వారికోసం ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ లేదు. కాకపోతే వయసుతోపాటు శరీరానికి విటమిన్లను గ్రహించే శక్తి తగ్గుతుంటుంది కాబట్టి తీసుకునే ఆహారంలోనే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. యాభైఏళ్లు వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల శరీరానికి క్యాల్షియంను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. శరీరంలో క్యాల్షియం తగ్గితే ఆస్టియో పోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. కాబట్టి క్యాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. క్యాల్షియం ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు బాగా తీసుకుంటే సరి΄ోతుంది. అయితే ఇక్కడ మరో విషయం... శరీరం క్యాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి3తోపాటు వ్యాయామం అవసరం.విటమిన్ డి3 కోసం పొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం క్యాల్షియంను గ్రహించుకుంటుంది. లేకుంటే క్యాల్షియం ట్యాబ్లెట్లు మింగవలసి ఉంటుంది.సాధారణంగా 50 సం. దాటినవారు కుటుంబంలోని వాళ్లందరూ ఎవరి పనుల మీద వాళ్లు బయటకు వెళ్లిపోయాక ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు. అందువలన కండరాలు పటుత్వం కోల్పోయి బలహీనత వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు, మొలకలు, బాదం, నట్స్ లాంటి ఆహారం తీసుకోవాలి.యాభై దాటిన వారికే కాదు, ఎవరికైనా సరే, శరీర ΄ోషణకు మాంసకృత్తులు చాలా అవసరం. కిలో శరీర బరువుకు 1.5 గ్రా. చొప్పున మాంసకృత్తులు తీసుకోవాలి. ఉదాహరణకు 60 కేజీల బరువున్నవారు 90 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది.మరో ముఖ్య విటమిన్ – విటమిన్ బి 12. శరీరానికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల బి12 కావాలి. విటమిన్ బి 12, శరీరఆరోగ్యాన్ని పరిక్షించేందుకు, ఎర్ర రక్తకణాల వృద్ధికి, మెదడు సరిగా పనిచేయడానికి అవసరం.ఇవీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్బి 12 పాలు,పెరుగు, చీజ్, గుడ్లు, చేపలు, చికెన్ మొదలైన వాటిలో లభిస్తుంది. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్ధాలు తగ్గిస్తే మంచిది. అధిక ఉప్పు అధిక రక్త΄ోటుకు, కీళ్ల నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది.50 సం. దాటినవారు ఎక్కువగా మతిమరుపు వచ్చిందని అంటూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం వీళ్ళు నీళ్లు తక్కువ తీసుకోవడం కూడా మతిమరుపునకు ఉన్న కారణాల్లో ఒకటని తేలింది. చక్కగా పండ్లు, కూరలు, ఆకుకూరలు, మొలకలు, తృణధాన్యాలతో కూడిన మితాహారాన్ని తీసుకుంటూ, శరీరానికి తగినంత వ్యాయామం కల్పించడం అవసరం. ఇవీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..! -
Yoga కూర్చొని కూడా బరువు తగ్గొచ్చు
‘దండాసనం’ (Dandasana or Staff Pose) అని పిలువబడే స్టాఫ్ పోజ్ వెన్నెముక, కాళ్ళు, తుంటి భాగంలో బలాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం కూర్చున్న భంగిమలో ఉంటుంది. యోగా ప్రారంభకులకు అనుకూలమైన అభ్యాసంగా ఉపయోగపడుతుంది.ఎలా చేయాలంటే.మ్యాట్ పైన కూర్చొన, కాళ్ళు ముందు చాపి కూర్చోవాలి. తొడ కండరాలను స్ట్రెచ్ చేయాలి. పాదాలను ముందుకు వంచాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భుజాలను వెడల్పుగా చేస్తూ, నిటారుగా ఉంచాలి. ∙చేతులను హిప్ బాగానికి రెండు వైపులా నేల మీద నిటారుగా ఉంచాలి.ఈ భంగిమలో 5–15 శ్వాసలోపలకు తీసుకొని, వదలాలి, ఈ సమయంలో శ్వాసపై పూర్తి దృష్టి పెట్టాలి. ఇదీ చదవండి : బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ప్రయోజనాలు.. ∙ఈ ఆసనం ద్వారా వెన్నునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ∙చేతులు, తొడ కండరాలలో ఒత్తిడి రిలీజ్ అవుతుంది. దీర్ఘ శ్వాసల వల్ల ఛాతీ భాగం స్ట్రెంథెన్ అవుతుంది. ఇతర యోగా భంగిమలకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఈ భంగిమ రోజూ సాధన చేయడం ద్వారా శారీరక బరువు పట్ల అవగాహన పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఆహారంవైపు దృష్టి మరలి, అధికబరువు సమస్య తగ్గుతుంది.ఈ భంగిమలో తొడ, మోకాలి భాగాలు ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తే యోగా పట్టీని ఉపయోగించవచ్చు. కూర్చోవడంలో ఇబ్బంది పడుతుంటే, సపోర్ట్ కోసం ఒక పలచటి దిండును ఉంచవచ్చు. మొదట్లో కాళ్ళను నిటారుగా ఉంచలేకపోతే ఆందోళన పడనక్కర్లేదు. మెల్లగా అభ్యాసనం ద్వారా కాళ్లు నిటారుగా వస్తాయి. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..! -
వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్‌కి రెడీ అంటున్న 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్
కుమారుడితో కలిసి దిల్లీలో ఉంటున్న రోషిణికి ఎడమ కాలి మోకాలినొప్పి మొదలైంది. మెట్లు ఎక్కడం, నడవడం కష్టంగా మారింది. ఆమె ఎడమ మోకాలికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు గుర్తించారు. కుడి చూపుడు వేలు బలహీన పడింది.ఫిజియో థెరపీ మొదలు పెట్టింది. ‘ఈ టైమ్‌లో అమ్మకు జిమ్ అవసరం ఉంది’ అనుకున్నాడు ఆమె కుమారుడు, ఫిట్నెస్ కోచ్ అయిన అజయ్. 68 సంవత్సరాల వయసులో తొలిసారిగా జిమ్‌లోకి అడుగు పెట్టింది రోషిణి.మెల్ల మెల్లగా ఆమెకు సాంత్వన చేకూరింది.స్ట్రెచ్చింగ్, మూమెంట్ ఎక్సర్‌సైజ్‌లతో మొదలుపెట్టి వర్కవుట్స్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. రెగ్యులర్ ట్రైనింగ్ వల్ల చేయి బలపడింది. రోజువారీ పనులు కష్టంగా అనిపించేవి కాదు. 在 Instagram 查看这篇帖子 Choudhary Ajay Sangwan (@weightliftermummy) 分享的 జిమ్ ఉత్సాహం ఆమెను వెయిట్ లిఫ్టింగ్ వైపు తీసుకువచ్చింది.ఇప్పుడు రోషిణి ట్రాప్బార్ డెడ్‌లిఫ్ట్‌లో 97 కేజీల బరువు ఎత్తుతుంది. 80 కేజీల కన్వెన్షల్ డెడ్‌లిఫ్ట్స్ చేస్తుంది. 50 కేజీల స్క్వాట్స్ చేస్తుంది. 120 కేజీల లెగ్ ప్రెస్ చేస్తుంది. 4 నిమిషాల పాటు ప్లాంక్ పట్టుకోగలదు. ప్రతిరోజూ రెండు గంటలు స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో చేస్తుంది. ‘దువ్వెన పట్టుకోవడం కూడా కష్టమే అని ఒకప్పుడు డాక్టర్లు అమ్మ గురించి చెప్పారు’ అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు అజయ్. జిమ్‌లో వర్కవుట్స్ పుణ్యమా అని ఇప్పుడు రోషిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు ఆమెను ప్రేమగా ‘వెయిట్‌లిఫ్టర్ మమ్మీ’ అని పిలుచుకుంటారు.ఇదీ చదవండి:Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!డైట్ విషయానికి వస్తే...‘ఎలాంటి రిస్ట్రిక్షన్లు లేవు. నాకు దహి బల్లే అంటే చాలా ఇష్టం. అలా అని అదేపనిగా తినను. అప్పుడప్పుడు మాత్రమే తింటాను. ఏదైనా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు’ అంటుంది ఇంటి భోజనాన్ని ఇష్టపడే రోషిణి. వచ్చే సంవత్సరం అమెరికాలో జరిగే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’కి ఆమెకు ఆహ్వానం అందింది.ప్రస్తుతం రోషిణి ఆ ఈవెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ‘ఒకప్పుడు నేను ఇంటికే పరిమితమయ్యేదాన్ని. ఇప్పుడు మాత్రం బయటికి వెళుతున్నాను. రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది’ అంటుంది రోషిణి. ‘సీనియర్ సిటిజన్స్ జిమ్‌లో వ్యాయామాలు చేసినప్పుడు అది వాళ్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వారి నుంచి యువతరానికి సందేశం అందుతుంది’ అంటున్నాడు అజయ్. అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో జిమ్‌లోకి అడుగు పెట్టిన రోషిణి... ఇప్పుడు ఎన్నో వ్యాయామాలలో ఆరి తేరింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పట్టు సాధించింది. అమెరికాలో జరగబోయే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’లో పాల్గొనడానికి రెడీ అవుతోంది 70 సంవత్సరాల రోషిణి. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్ -
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
వయసు మీరుతున్న కొద్దీ తలపై జుట్టూడిపోవడం సాధారణం. కానీ.. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంటుంది. మళ్లీ జుట్టు కావాలని అనుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వ్యయ ప్రయాసలతో కూడిన పద్ధతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సమస్య తీరి పోతుందంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా... రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా కూడా చేసేందుకు తాము ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని వీరు చెబుతున్నారు. నొప్పి ఏమాత్రం కలిగించని, అతిసూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి.. ఆ సూదుల ద్వారా ఒక మందును నెత్తికి అందించడం ద్వారా ఇది సాధ్యమని వారు వివరించారు. ఎలుకలపై తాము ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని, సత్ఫలితాలు సాధించామని తెలిపారు.అలొపీసియాకు కారణాలు కచ్చితంగా తెలియవు కానీ.. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే.. శరీర రోగ నిరోధక వ్యవస్థే.. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు దాడి చేశాయని పొరబడి మన శరీరానికి నష్టం చేయడాన్నే ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. అలోపీసియా విషయంలో రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తాయన్న మాట. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడా రాలిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో రాలిపోయిన తరువాత ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది కానీ.. మిగిలిన వారికి ఆ అదృష్టం ఉండదు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్‌ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీళ్లనొప్పులు, తామర వంటివి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కావడం... చికిత్సకు మందులు (రోగ నిరోధక వ్యవస్థను అణచివేసేవి) ఉపయోగించినప్పుడు జుట్టు మొలవడం! మందులు వాడటం నిలిపేసిన వెంటనే జుట్టు రాలడమూ మొదలవుతూ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ మందుల్లోనే ఏదో మర్మముందన్న సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఇదీ చదవండి: వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!మందులు కేవలం వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తున్న టీ–కణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్ ప్యాచ్ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకల కుదుళ్లకు మాత్రమే అందేలా చేశారు. ఎలుకలతో ప్రయోగాలు చేసినప్పుడు మూడు వారాల్లోపు పదిసార్లు ΄్యాచ్‌లు మార్చి.. ఇంకో ఎనిమిది వారాలు వాటిని గమనించారు. మూడు వారాల తరువాత వెంట్రుకలు పెరగడం మొదలైంది. పదివారాలపాటు పెరుగుతూనే ఉన్నాయి. సో... సమీప భవిష్యత్తులోనే బట్టతల కలవారందరూ ఎంచక్కా జేబులో దువ్వెన పెట్టుకుని తిరిగే అవకాశం ఉందన్నమాట! -
'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..
ఇటీవల కాలంలో సీజేరియన్ డెలివరీల కంటే..నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు పలువురు మహిళలు, సెలబ్రిటీలు. ఆ దిశగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని మరీ ప్రసవిస్తున్నారు. అయితే ఇటీవల ఎక్కువగా ట్రెండ్ అవుతోంది 'వాటర్ బర్త్'. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు దీని గురించే సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్. అంతేగాదు ఈ నీటి ప్రసవం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పొకొచ్చారామె. ఇంతకీ ఏంటా ప్రసవం.. ? అందరూ దీన్ని ఎంచుకోవచ్చా..? తదితర విషయాలు గురించి తెలుసుకుందామా..కల్కి కొచ్లిన్ ఫ్రెంచ్ దేశానికి చెందిన బాలీవుడ్ నటి. తన విలక్షణమైన నటనతో ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన నటి. ఆమె పియానిస్ట్ గయ్‌ని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె అందరిలాంటి నార్మల్ డెలివరీ కాకుండా..నీటి ప్రసవాన్ని ఎంచుకుంది. సంప్రదాయ నార్మల్ డెలివరీలలో ఇది కూడా ఒకటి. బిడ్డను స్వాగతించడానికి ఈ పద్ధతి అద్బుతమైనదని అంటోంది నటి కల్కి. శరీరానికి చాలా సులభమైన ప్రక్రియని చెబుతోందామె. కానీ భారతీయ మహిళలు దీన్ని ఎందుకు ఎంచుకురో తెలియడం లేదన్నారు. బహుశా ఇది ఖర్చుతో కూడిన ప్రక్రియనే ఉద్దేశ్యంతో కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారామె. ఇటీవల అలీనా డిసెక్ట్స్తో జరిగిన సంభాషణలో నటి కల్కి ఈ విషయాలు వెల్లడించారు. ఇదేమి ఆశ్చర్యపోవాల్సిన ప్రవాస ప్రక్రియ కాదంటున్నారామె. శిశువు అల్రెడీ ఉమ్మనీరులో ఉంటుంది కాబట్టి ఇలా నీటిలో ప్రసవిస్తే శిశువుకి మరింత సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు కల్కి. ఆస్పత్రిలో కూడా అందుకు సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయని చెబుతోంది కల్కి. సహజ సిద్ధమైన కాన్పులలో ఇది ఒకటని..ఇటీవలే నెమ్మదిగా వెలుగులోకి వస్తోందని చెబుతున్నారామె. ముఖ్యంగా తనలాంటి సెలబ్రిటీల అనుభవాలతోనే ప్రజలకు తెలుస్తోందని చెబుతోంది. అసలేంటి ప్రసవం..వాటర్ బర్త్ అంటే ..సింపుల్‌గా చెప్పాలంటే..వాటర్ బర్త్ అంటే.. ఒక రకమైన ప్రసవం. దీనిలో కాబోయే తల్లి డెలివరీ టైంలో ప్రవహించే కొలను లేదా వెచ్చని నీటి తొట్టిలో గడుపుతారు. అలా విశ్రాంతి తీసుకున్నప్పుడూ..డెలివరీ సంక్లిష్టంగా కాకుండా సులభంగా అయిపోతుంది. సాధారణ ప్రసవంతో పోలిస్తే..ఈ ప్రసవం చాలా సౌకర్యవంతగంగా, తేలికపాటి కష్టంతో కూడుకున్నదని చెబుతున్నారు వైద్యులు. ఇది ఎందుకు ప్రజాదరణ పొందుతోందంటే..తల్లి శరీర బరువుని తగ్గించి స్వేచ్ఛగా కదలడానికి అనుమతిస్తుంది. అలాగే సమర్ధవంతమైన గర్భాశయ సంకోచాలను ప్రోత్సహిస్తుంది. పైగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా గర్భాశయ కండరాలు తక్కువ నొప్పితోనే ప్రసవం అయ్యేలా చేస్తాయి. అలాగే శిశువుకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుందట. అంతేగాదు డెలివరీ టైంలో ఉండే ఆందోళన కూడా నీటిలో మునిగి ఉండటం వల్ల తగ్గుతుందట. ఒత్తిడికి సంబధించిన హార్మోన్లు తగ్గించి..నొప్పులు వచ్చేలా ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా వీలు కల్పిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల నీటిలో తక్కువ పురిట నొప్పులతోనే ప్రసవం సులభంగా అయిపోతుందట.అందరూ ఈ ప్రక్రియ ఎంచుకోవచ్చా.?క్రిటికల్ కానీ గర్భణిలు మాత్రమే ఈ పద్ధతిని ఎంచుకోగలరని చెబుతున్నారు నిపుణులు. అలాగే పిండం 37 నుండి 41 వారాల మధ్య ఉంటేనే ఈ పద్ధతికి అనుమతిస్తారట. అలాగే తల్లిలో అమ్నియోటిక్ ద్రవం(ఉమ్మనీరు) తగిన మోతాదులో ఉండాలని చెబుతున్నారు. అలాగే నెలలు నిండక ముందు అయ్యే కాన్పులకు ఈ పద్ధతి పనికిరాదని చెబుతున్నారు. అదీగాక గతంలో సీజేరియన్ అయ్యిన మహిళలు కూడా ఈ ప్రక్రియని ఎంచుకోకూడదని వెల్లడించారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టీ బ్యాగులు' తింటే ఏమవుతుందో తెలుసా..!) -
బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
ప్రముఖ టీవీ నటి,బాగ్ బాస్ 12 విన్నర్ దీపిక కాకర్ (Dipika Kakar), తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అసలు దీపిక కాకర్‌కు ఏమైంది?దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్‌లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్‌గా నిలిచింది. తాజాగా దీపిక కాకర్‌ను లివర్‌లో పెద్ద ట్యూమర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని తొలగించేందుకు వైద్యులు త్వరలోనే ఆపరేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు, దీపిక భర్త షోయబ్ ఇబ్రహీం ఒక వ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే అదృష్టవశాత్తూ అది ట్యూమర్ కాదని తెలిపాడు. దీపిక ఇటీవల కడుపునొప్పితో బాధపడిందని, మొదట్లో అది మామూలు కడుపు నొప్పే అనుకున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత అది తగ్గింది. కానీ మళ్లీ నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా ట్యూమర్ ఉన్నట్టు తేలింది. కాలేయంలోని ఎడమ లోబ్‌లో చాలా దాదాపు టెన్నిస్ బంతి అంత కణిడి తున్నట్టు సీటీ స్కాన్ ద్వారా గుర్తించారు షోయబ్ పోస్ట్‌లో అభిమానులతో షేర్ చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కెరీర్‌కు దూరంగా కెరీర్ పీక్‌లో ఉండగానే భర్త, ఫ్యామిలీకోసం పరిశ్రమకు దూరమైంది. పెళ్లికి ముందు చదువు పూర్తికాగానే, దీపిక కాకర్ మూడు సంవత్సరాలు విమాన సహాయకురాలిగా పనిచేసింది. 2010లో, నీర్ భరే తేరే నైనా అనే షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. అలా దాదాపు ఆరేళ్లు టీవీలో ప్రదర్శితమైన ససురల్ సిమర్ కాలో ఆమె 'సిమర్' పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. టెలివిజన్ ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. దీపిక ఎపిసోడ్‌కు రూ. 70వేలు వసూలు చేసేదంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.మొదటి భర్తకు విడాకులు, రెండో పెళ్లి2011లో దీపికా కాకర్ రౌనక్ సామ్సన్ను వివాహం అయింది. విభేదాల కారణంగా 2015లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ససురాల్ సిమర్ కా సమయంలో, దీపిక షోయబ్ ఇబ్రహీంతో పరిచయం ప్రేమగా మారింది. తెరపై అందరినీ ఆశ్చర్యపరిచిన వీరి కెమిస్ట్రీ నిజజీవితంలోనూ బాగా పండింది. ముఖ్యంగా మొదటి భర్తతో విడాకుల సమయంలో షోయబ్ దీపికకు సపోర్ట్‌గా నిలిచాడు. 2018లో మాతం మారి, తన పేరును ఫైజాగా మార్చుకుని మరీ షోయబ్ ఇబ్రహీని వివాహం చేసుకుంది. 2023లో, ఈ జంట తమ మగబిడ్డ ( రుహాన్ )కు జన్మనిచ్చింది.2019లో, దీపిక ‘కహాం హమ్ కహాం తుమ్’ అనే షోలో నటించింది, కానీ ఆ షో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక కుమారుడు రుహాన్ పుట్టిన తర్వాత దీపిక తన కెరీర్‌ను విడిచిపెట్టి, కొడుకు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొంది కానీ భుజం గాయం కారణంగా షోను మధ్యలోనే వదిలేసింది. 2011 - 2018 వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న దీపిక నికర విలువ రూ. 40 - రూ. 45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. -
'టీ బ్యాగులు' తినడం గురించి విన్నారా..?
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి. కానీ కొందరికి చాలా వెరైటీ అభిరుచులు ఉంటాయి. అది తినడం లేదా స్కిల్ పరంగా ఏదైనా.. ఆ అలవాట్లు చాలా చిత్రంగా ఉంటాయి. అలానే ఇక్కడొక అమ్మాయికి ఉన్న విచిత్రమైన అలవాటు వింటే..ఇదేం అభిరుచి అనిపిస్తుంది.సైప్రస్‌లోని లిమాసోల్‌కు చెందిన లియుబోవ్ సిరిక్ అనే 20 ఏళ్ల అమ్మాయికి ఓ వింత ఆహారపు అలవాటు ఉంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ అభిరుచి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. 'టీ' అంటే ఇష్టపడే ఆహార ప్రియులు ఆమె అలవాటు వింటే..వామ్మో అని నోరెళ్లబెడతారు. మార్కెటింగ్ బ్రాండ్ మేనేజర్ అయిన లియుబోవ్కి టీ బ్యాగులు తినడం అంటే ఇష్టమట. టీ తాగిన తర్వాతా ఆ టీ బ్యాగ్‌ని పడేయకుండా మొత్తంగా తినేస్తుందట. ఇలా ఆమె రోజుకు రెండుసార్లు తినేస్తానని చెబుతోందామె. వారానికి కనీసం మూడుసార్లు పేపర్ టీ బ్యాగ్‌లు ఫినిష్ చేస్తానని అంటోంది. ఈ అలవాటు 14 ఏళ్ల అప్పుడు ప్రారంభమైందట. వాళ్ల అమ్మమ్మ పుదీనా ఆకులు తినమని చెప్పినప్పుడూ ..ఈ టీ ఆకులు రుచి చూడాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే టేస్ట్ నచ్చి..అది క్రమంగా అలవాటుగా మారిందని అంటోంది లియుబోవ్. ఆమె ఆర్గానిక్ టీ బ్యాగులను మాత్రమే తింటుందట. ప్లాస్టిక్ లేదా నైలాన్‌తో ఉన్న వాటిని టచ్ చేయనని చెబుతోంది. అయితే కొన్ని టీ బ్యాగుల్లో ఫాబ్రిక్ ఉంటుంది కాబట్టి తినడానికి కష్టంగా ఉంటుందని అంటోంది. అయితే ఆమె ఈ అలవాటుని వదిలేద్దాం అనుకుందట గానీ సాధ్యం కాలేదని చెబుతోంది. ఇది ప్రమాదకరమా..?అయితే ఇదిప్రమాదకరమా అంటే..ఒక్కోసారి ఆ టీ వేస్ట్ గొంతులో అడ్డుపడటం లాంటిది జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గొంతు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల వాదన. కానీ ఈ అమ్మాయి లియుబోవ్ మాత్రం ఈ అలవాటు మంచిదేనా? కాదా? అని గూగుల్‌లో సర్చ్ చేసిందట. చివరికి ఇది హానికరం కాదని నిర్థారించుకున్నాకే ధీమాగా తింటున్నానని చెబుతోంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యంగానే ఉన్నానంటోంది. ధూమపానం, మద్యం వంటి అలవాట్ల కంటే ప్రమాదకరమైనది కాకపోయినా..సాద్యమైనంత వరకు ఈ అలవాటుని దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తానంటోంది. అయినా ఏ అలవాటుకైనా అడిక్ట్ అయ్యిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్' అని పెద్దలు ఊరికే అనలేదు కదా..! ఆరోగ్యానికి హానికరం కాకపోయినా..తగు జాగ్రత్తలో ఉండటమే మంచిది కదూ..!. View this post on Instagram A post shared by Newsflare (@newsflare) (చదవండి: 70 ఏళ్ల వ్యక్తి కాలినడకతో కేదార్‌నాథ్‌కు..! వీడియో వైరల్) -
మామిడి తొక్కే కదా అని పారేయొద్దు.. లాభాలెన్నో తెలుసా?
ఇది మామిడి సీజన్ – ఎండల వేడితో పాటూ దక్కే తీపి రుచులు మామిడి పండ్లు. ఈ సీజన్లో మామిడి పండ్లు తింటాం కానీ.. తొక్క మాత్రం తీసి విసిరేస్తాం. కానీ మీకు తెలుసా? మామిడి తొక్క కూడా ఓ పోషకవంతమైన ఆహారం కావచ్చు. అవును – మామిడి తొక్క తినదగినదే, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిది కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు..తొక్క తినడం సురక్షితమేనా?సాంకేతికంగా చూస్తే, అవును. మామిడి తొక్క విషమేమీ కాదు. ఇది ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగిఫెరిన్, క్వెర్సిటిన్, కెరోటినాయిడ్లు వంటి బయోయాక్టివ్ పదార్థాలతో నిండివుంది. అయితే మామిడి తొక్క మందంగా, కొద్దిగా చేదుగా, కొన్నిసార్లు కొబ్బరి తరహాల ఉంటుంది. అందువల్ల చాలా మందికి నచ్చదు.అంతేకాదు కొంత మందికి మామిడి తొక్కలోని కొన్ని పదార్థాలు అలెర్జీ కలిగించొచ్చు మామిడిని తీసేటప్పుడు మురికితో పాటు చర్మంపై మంట వచ్చినట్లయితే, తొక్క తినకుండా ఉండటమే మంచిది.తొక్కలో పోషకాలు...ఇందులోని ఫైబర్: జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మాంగిఫెరిన్ వంటి పదార్థాలు శరీరంలో అలర్జీలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ చర్మాన్ని కాంతి వంతం చేస్తుంది. అలాగే కొన్ని పరిశోధనలు మామిడి తొక్క బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడవచ్చని చెబుతున్నాయి. రుచికరంగా తినే విధాలు:మామిడి తొక్క చట్నీ:2 మామిడిల తొక్క (శుభ్రంగా కడగాలి)ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరిఅల్లం చిన్న ముక్క, తగినంత ఉప్పు,కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో కొద్దిగా మిక్స్ చేయండి. కావాలంటే మస్టర్డ్ గింజలు, కరివేపాకు టాంపర్ చేయొచ్చు.ఎండబెట్టి పొడి తయారు చేయడం:మామిడి తొక్కని ఎండలో లేదా ఓవెన్ లో బాగా ఎండబెట్టి పొడి చేసి, స్మూతీల్లో లేదా మసాలా మిశ్రమాలలో కలుపుకోవచ్చు. ఒక చిన్న ముక్క మామిడి తొక్క పండిన మామిడి, అరటిపండు, యోగర్ట్‌తో కలిపి మేళవిస్తే.. తీపి, చేదు మధ్య బ్యాలెన్స్ అవుతుంది. తొక్కని తరిగి, నీళ్ళలో నానబెట్టి, కొన్ని రోజులు ఫెర్మెంటేషన్‌కు ఉంచండి. స్వచ్చమైన వెనిగర్ లాగా తయారవుతుంది. సలాడ్ డ్రెస్సింగ్‌కు బాగా సరిపోతుంది.శుభ్రంగా కడిగిన మామిడి తొక్కని వేడి నీటిలో లేదా గ్రీన్ టీ లో వేసి మరిగించండి. హల్కా రుచి, యాంటీ ఆక్సిడెంట్ల తేలికపాటి పౌష్టికత మీకు లభిస్తుంది.జాగ్రత్తలు...పండే మామిడి తొక్కపై పురుగుమందుల శేషాలు ఉండొచ్చు. తొక్క తినాలంటే ఆర్గానిక్ మామిడిని మాత్రమే ఎంచుకోవాలి. అలా దొరకని పక్షంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అవేంటంటే..నీళ్ళలో 1 టీస్పూన్ ఉప్పు, టీస్పూన్ పసుపు కలిపి 10–15 నిమిషాలు నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగడం ద్వారా కాయపై అలుముకున్న పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే తొలగించవచ్చు. అలాగే ఒక బౌల్ నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టి, తరువాత మంచి నీటితో కడగడం 1:3 నిష్పత్తిలో వెనిగర్ : నీటిలో కలిపి 15–20 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి. అలాగే తినాలనుకుంటే మామిడి తొక్కని మృదువైన బ్రష్ లేదా గుడ్డతో సున్నితంగా తోమి శుభ్రం చేయాలి.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అంతర్జాతీయ వంటకాలు..) -
Covid-19 మళ్లీ వచ్చేసింది : కేసులు, మరణాలు, అధికారుల హెచ్చరికలు
ఆసియాలో కోవిడ్మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియా అంతటా కోవిడ్ న్యూ వేవ్ ఆందోళన రేపుతోంది. హాంకాంగ్, సింగపూర్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి కనిపిస్తుండటం మరింత ఆందోళనకరంగా మారింది. ఆసియాలోని ఈ రెండు అతిపెద్ద నగరాల్లో వైరస్ కేసులు క్రమానుగతంగా పెరుగుతున్నందున, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు బూస్టర్ షాట్లు తీసుకోవాలని, ప్రజలు తమ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు పిలుపునిచ్చారు.జనసాంద్రత ఎక్కువగా ఉన్న హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని స్థానిక ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని నగరంలోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు స్థానిక మీడియాతో అన్నారు. హాంకాంగ్‌లో కోవిడ్-పాజిటివ్ కేసుల శాతం అత్యధిక స్థాయికి చేరిందన్నారు. మే 3 నుండి వారంలో మరణాలతో సహా తీవ్రమైన కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాదిలో అత్యధిక స్థాయికి చేరుకుని 31కి చేరుకున్నాయని అక్కడి లెక్కల ద్వారా తెలుస్తోంది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్లలో కనిపించిన కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరికలు బాగా పెరిగాయని తెలిపారు.అటు సింగపూర్‌లో మే 3 నుండి వారంలో గత ఏడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28 శాతం పెరిగి 14,200 కు చేరగా, రోజువారీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య దాదాపు 30 శాతం పెరిగింది. దీనికి సంబంధించి నగర-రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఈ నెలలో కోవిడ్ డేటాను విడుదల చేసింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరగవచ్చు, అయితే, మహమ్మారి సమయంలో కంటే ప్రసరణ వేరియంట్లు వ్యాప్తి, తీవ్రమైన కేసులకు సంబంధించిన సూచనలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే..హాంకాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ వారం చివర్లో తైవాన్‌లోని కావోసియుంగ్‌లో తన కచేరీలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చైనీస్ సోషల్ మీడియా వీబోలోని కచేరీ అధికారిక ఖాతా గురువారం తెలిపింది.ఇదీ చదవండి: పురుషులూ మేలుకోండి.. హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!అటు చైనా కూడా కోవిడ్ కేసులను, వ్యాప్తిని నిశితంగా గమనిస్తోంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, ప్రస్తుతం గత సంవత్సరం వేసవిలో కోవిడ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకునే దిశగా చైనా పయనిస్తోంది. మే 4 దాకా ఐదు వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువ పెరగడం గమనార్హం.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? -
నిద్ర.. గురక.. గుండెపోటు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పొద్దంతా కష్టపడి పనిచేసి, రాత్రిపూట కడుపు నిండా భుజించి ప్రశాంతంగా నిద్రపోతే.. అర్ధరాత్రి ఎక్కడో గుర్ర్..గుర్ర్మంటూ వస్తోన్న శబ్దం చికాకు తెప్పిస్తుంది. గాఢనిద్రలో ఉన్నవారిని ఉలిక్కి పడేలా చేస్తుంది. పక్కన పడుకుంటే చెవుల్లో సప్తస్వరాలు మోగినట్లు వినిపించే గురక శబ్దం మంచి నిద్రను దూరం చేస్తుంది. గురకపెట్టేవారి పక్కన పడుకునే వారి కష్టాలు ఇవైతే.. గుర్ర్.. గుర్ర్మంటూ సోయిలేకుండా పడుకునేవారు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారు. అకస్మాత్తుగా హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది రాత్రిపూట గురక పెట్టేవారు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.నగరవాసుల్లో ఎక్కువగా..నగరవాసుల్లో చాలామందిని గురక సమస్య వేధిస్తోంది. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఊబకాయం, మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (వోఎస్ఏ) అనేది గురకకు కారణమవుతోంది. కండరాలతో నిర్మాణం అయిన ఊపిరి గొట్టంలో నిద్రపోయే సమయంలో కలిగే ఆటంకంతో ఆ శబ్దం వస్తుంది. ఇలా వచ్చే శబ్దాన్నే గురక అంటారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి గురక రాదు. గురక ఉన్నవారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందితో తరచూ నిద్రలోంచి మేల్కొంటారు. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి.. నిద్రలోనే హార్ట్ ఎటాక్‌లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.పాలిసొమ్నోగ్రఫీతో పరీక్షస్లీప్ అప్నీయాతో బాధపడే వారికి స్లీప్ స్టడీస్ (పాలిసొమ్నోగ్రఫీ) పరీక్ష అవసరమవుతుంది. గురకతో బాధపడుతున్న వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో అతని శరీర వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో ప్రత్యేక పరికరాలతో పరిశీలించి రికార్డు చేస్తారు. ఇందులో మెదడు పనితీరు తెలుసుకునేందుకు ఎలక్ట్రోఎన్సెపలోగ్రఫీ (ఈఈజీ), గుండె పనితీరు కోసం ఎలక్ట్రోకార్డియోగ్రఫీ (ఈసీజీ) కండరాల కదలికల కోసం ఎలక్ట్రోమియోగ్రామ్ తదితర పరికరాలను శరీరానికి అనుసంధానించి ఏ మేరకు నాణ్యమైన నిద్రపోతున్నారో లేదో అని పరీక్షిస్తారు.జనాభాలో 10 శాతం మందికిగురక సమస్యతో ఉమ్మడి జిల్లా జనాభాలో 10 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రతీరోజు 150మందికి పైగా అంటే నెలకు సుమారు 5,000 మంది గురక సమస్యతో ఆసుపత్రులకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇందులో 200 మందికి పైగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా పరీక్ష చేయించు కుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యగా బాధపడే వారు 2,000 మంది వరకు ఉంటారని వైద్యుల అంచనా.జీవనశైలిలో మార్పులతో..గురకను తగ్గించుకోవాలంటే చికిత్సతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం, మద్య, ధూమపానాల వాడకాన్ని తగ్గించుకోవడం. షుగర్, బీపీ, థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం వల్ల గురక సమస్యకు మెరుగైన ఫలితం ఉంటుంది. నిద్రతో మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలో వచ్చే చిన్నచిన్న సమస్యలకూ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యం చేయించుకోవాలి. – వినయ్‌కుమార్, పల్మనాలజిస్టు లక్షణాలు ఇవీనిద్రలో ఐదుకన్నా ఎక్కువసార్లు శ్వాస ఆగిపోయినట్లు అనిపించి మెలకువ రావడంనిద్రపోయినా ఉదయం లేవగానే నిద్రలేమి ఉన్నట్లు అనిపించడం రాత్రి పూట ఛాతీలో నొప్పి.. నిద్రలేవగానే గొంతులో నొప్పినిద్రలేవగానే తలనొప్పి, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారిని గురక బాధితులుగా గుర్తిస్తారు.జాగ్రత్తలుఊబకాయంతో బాధపడుతుండే వారి బరువును తగ్గించుకోవడం ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లను మానుకోవడంబీపీ, షుగర్, థైరాయిండ్ నార్మల్‌గా ఉంచుకోవడంప్రతీరోజు వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలి. -
ఒళ్ళంతా పురుగులు పాకుతున్నాయంటుంది!
మా అమ్మ గారికి 78 సంవత్సరాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది ఆమె ఒక 6–7 నెలల నుండి ఒళ్ళంతా చిన్న చిన్న పురుగులు పాకుతున్నాయని, దురదగా ఉందని వళ్లంతా గోక్కుంటోంది. స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకుని చర్మం డాక్టర్ గారి దగ్గరికి తీస్కుని వెళ్ళాము. పరీక్ష చేసి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని దురద తగ్గడానికి కొన్ని మందులు ఆయింట్మెంట్ ఇచ్చారు. అవి వాడిన తర్వాత కూడా ఆమెకు ఉపశమనం లేదు. పురుగులు చర్మంలోకి చొచ్చుకు పోతున్నాయని గొడవ చేస్తుంది. పుండ్లు పుట్టేలా చర్మాన్ని గోకుతుంది. ఒక చిన్న ఖాళీ డబ్బా తీస్కుని దాంట్లో పురుగులు వేశానని మమ్మల్ని కూడా చూడమని చెప్తుంది. ఆ డబ్బాలో ఆమె బట్టలవి చిన్న చిన్న దారపు పోగులు తప్ప ఏమి లేవు అంటే ఒప్పుకోదు. ఆవిడ బాధ తట్టుకోలేక ఇంకో స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళ్ళాము. ఆయన తల స్కాన్ చేసి ఒకసారి మానసిక వైద్యునికి చూపించమని చెప్పారు. ఆమె అన్ని రకాలుగా బాగుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. జ్ఞాపక శక్తి బాగుంది. ఈ పురుగులు పాకుతున్నాయిని ఒక్క కంప్లెట్ తప్ప! ఆమెకు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ అవసరం అంటారా?– పద్మావతి, బళ్ళారిమీరు మీ అమ్మగారిలో చూస్తున్న లక్షణాలు క్లాసికల్‌గా ‘డెల్యూజనల్ పారా సైటోసిస్‘ లేదా ‘ఎక్బామ్ సిండ్రోమ్‘ అనే మానసిక సమస్య వచ్చిన వారిలో కనబడతాయి. ఇది ఒక అరుదైన మానసిక సమస్య. దీనిని ఎక్కువగా స్త్రీలలో చూస్తాము. మెదడు రసాయనాల్లో వచ్చే మార్పులు ఈ జబ్బు రావడానికి ప్రధాన కారణం. రక్త హీనత, విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యలు లాంటివి ఉండే వారిలో కూడా జబ్బు వచ్చే ఆవకాశాలు ఎక్కువ. కొన్ని సార్లు పెద్దవయసులో వచ్చే ‘ఆల్జీమర్స్ డిమెన్షియా‘ ఈ లక్షణంతోనే ప్రారంభం అవ్వొచ్చు. అలాగే అత్యంత అరుదుగా మెదడులో కణుతులు లాంటివి ఉన్నా డెల్యూజన్లో పారా సైటోసిస్ లక్షణాలు కనపడే అవకాశముంది. తమ వంటిమీది లేదా చర్మం కింద పురుగులు పాకుతున్నాయనే సందేహం తప్ప ఇతర లక్షణాలు ఏమి కనపడవు. దురద తట్టుకోలేక కొంతమంది చర్మానికి క్రిమి సంహారక మందులు పూసుకొని ప్రాణం మీదికి కూడా తెచ్చుకుంటారు. యాంటీ సైకోటిక్ మందుల ద్వారా ఈ జబ్బు లక్షణాలని పూర్తిగా తగ్గించవచ్చు. మీరు దగ్గర్లోని మానసిక వైద్యుని వెంటనే కలిసి వాళ్ళు చెప్పిన ప్రకారం మందులు వాడితే త్వరగా ఆమె సమస్య తగ్గుతుంది. ఇది మానసిక జబ్బు లక్షణమే తప్ప శారీరక అనారోగ్యం ఏమాత్రం కాదనేది అందరూ గుర్తించాలి! (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com) (చదవండి: Miss worl 2025: అతడు.. ఆమె... మిస్ వరల్డ్) -
హీరో సూర్యలా 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్ సాధ్యమేనా! నిపుణుల వార్నింగ్ ఇదే..
కోలీవుడ్ నటుడు సూర్య శివకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన పరంగా ఆయనకు సాటి లెరెవ్వరూ. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఒదిగిపోవడం సూర్య ప్రత్యేకత. తన వైవిధ్యభరితమైన నటనతో మంచి ప్రేక్షకాధరణ ఉన్న నటుడు. తాను నటించే పాత్ర కోసం మొత్తం ఆహార్యమే మార్చుకునేందుకు వెనకడుగువేయని గొప్ప నటుడు. గతేడాది రిలీజ్ అయ్యి కంగువా మూవీ కోస సూర్య ఎంతా కష్టపడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ప్రేక్షకుల మన్ననలను పొందడంలో విఫలమైన ఆ మూవీలో సూర్య కంగువా ప్రాతకు పూర్తి న్యాయం చేశారు. ఆ పాత్ర కోసం సూర్య కేవలం వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ బాడీని సాధించారు. నిజంగా అది అంత తక్కువ వ్యవధిలో సాధ్యమేనా..?. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు తదితర విశేషాలు గురించి తెలుసుకుందామా..!.నిజానికి 49 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకి ఇది చాలా సవాలుతో కూడిన విషయం. ఆయన కూడా ఓ ఇంటర్వ్యూలో ఆ ఏజ్‌లో సిక్స్ ప్యాక్ బాడీ అనేది..ఓ పర్వతాన్ని అధిరోహించే ఫీట్ లాంటిదని అన్నారు సూర్య. ఆ ఏజ్‌లో జీవక్రియ మందగిస్తుంది కాబట్టి చాలా కఠినమైన డైట్‌ని అనుసరించనట్లు చెబుతున్నారు. అంతేగాదు ఆ మూవీ షూటింగ్ పూర్తి అయ్యేవరకు కూడా వందరోజులు.. మంచి ప్లాన్‌తో కూడిన డైట్‌ని అనుసరించానని అన్నారు. నిజానికి సూర్య మంచి భోజన ప్రియుడట. అలాగే తన భార్య, కూతురు కూడా తనలానే మంచిగా తింటారట, కొడుకు మాత్రం కాదట. అలాగే ఆయన అంతా ఎక్కువగా తిన్నప్పటికీ లావు అవ్వపని తన బాడీ తత్వం వల్ల ఎక్కువ బరువు పెరిపోతాననే భయం ఉండదని ధీమాగా చెబుతున్నారు సూర్య. ఇది మంచిదేనా..?నిపుణులు మాత్రం ఇంత తక్కువ వ్యవధిలో అలాంటి బాడీ ప్యాక్ సాధించడం అసాధ్యమని చెబుతున్నారు. ఇక్కడ హీరో సూర్య తక్కవ కార్బోహైడ్రేట్, చక్కెర, ఉప్పు దరిచేరని ఆహరం నిపుణుల పర్యవేక్షణలో తీసుకుని ఉండి ఉంటారు. అందువల్ల ఇది సాధ్యమైందని అన్నారు. అలాగే సూర్య డైట్ ప్లాన్‌లో లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆర్ద్రీకరణ తదతరాలన్నిటికీ ప్రాధన్యాత ఇచ్చే ఫుడ్‌ని అందించి ఉండొచ్చని నిపుణుడు విద్యా చావ్లా అన్నారు. అయితే ఈ డైట్ అందరికీ సరిపడకపోవచ్చని అన్నారు. ఎందుకంటే.. ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగణంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. పైగా సరైన ఫిట్నెస్, వర్కౌట్లతో కూడిన సిక్స్ ప్యాక్ బాడీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు. అలాగే సెలబ్రిటీల మాదిరిగా తొందరగా బాడీ రూపురేఖలు మారిపోవాలనుకుంటే మాత్రం ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలోనే చేయడం మంచిదని సూచించారు నిపుణులు.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రశంసల జల్లు..!) -
టీబీ రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ పోషకాహార కిట్లు..
ప్రముఖ ఔషధ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది క్షయ (టీబీ) రోగులకు మద్దతు ఇవ్వడానికి ఈరోజు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, టీబీ రోగులకు ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను అందించనుంది ఈ ప్రాజెక్ట్ పరిధిలో భాగంగా మొత్తం 6,180 కిట్లను పంపిణీ చేయనుంది. ప్రతి పోషకాహార కిట్‌లో బియ్యం, చిరు ధాన్యాలు, వంట నూనె , వేరుశనగల, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ కార్యక్రమం, 2025 నాటికి టీబీని నిర్మూలించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ కార్యక్రమమైన ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగం. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద నిక్షయ్ మిత్రగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నమోదయ్యింది. ఈ ప్రాజెక్ట్, అక్షయ పాత్ర ఫౌండేషన్ మద్దతుతో నిర్వహించబడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక క్షయవ్యాధి భారత్‌లోనే ఉండటం బాధకరం ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి బాధితులలో దాదాపు 27% ఇక్కడే వున్నారు. గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం.. 2022లో భారతదేశంలో 2.82 మిలియన్ల కొత్త టిబి కేసులు నమోదయ్యాయి. వాటిలో దాదాపు 3 లక్షలకు పైగా మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించాయని అంచనా.చివరగా ప్రారంభోత్సవ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరిగింది, దీనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ జితేష్ వి పాటిల్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి హాజరయ్యారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ ఉమా చిగురుపాటి మాట్లాడుతూ.. "మంచి ఆరోగ్యమనేది కేవలం ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, సంపన్నమైన , ఉత్పాదక సమాజానికి పునాది అని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా టీబీ రోగులకు అవసరమైన పోష్టికాహార మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. ఈ వ్యాధి బారి నుంచి కోలుకునే ప్రయాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు తోడ్పడటం తోపాటు 2025 నాటికి భారతదేశంలో టీబీని నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యంలో మా వంతు పాత్ర పోషిస్తుండటం గర్వకారణంగా వుంది" అని అన్నారు.(చదవండి: Meghan Markle: నటి మేఘన్ మార్కెల్ పేరెంటింగ్ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!) -
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ తింటున్నారా..? అంబానీ, సచిన్‌ల హెల్త్ కోచ్ షాకింగ్ విషయాలు
ఉరుకుల పరుగుల హడావిడి జీవితాలే అందరివి. కాసేపు కుదురుగా నచ్చిన వంటకం వండుకుని తినే తీరికే లేదు చాలామందికి. భార్య భర్తలిద్దరు ఉద్యోగాలు, మరోవైపు పిల్లలు బాధ్యతలు.. కారణంగా ఏదో సింపుల్‌గా త్వరగా అయ్యే అల్పాహారం, వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు బ్రేక్‌ఫాస్ట్ ఈజీ అనే స్థాయికి వచ్చేశారు. అది లేకుండా రోజు గడవదు చాలామందికి. కానీ రుచిగా ఉండే ఈ వైట్ బ్రెడ్ జోలికి అస్సలు వెళ్లకూడదని..దాన్నిరోజు అల్పాహారంగా తీసుకుంటే ఇక ఆరోగ్యం అంతే అని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తున్నారు అంబానీ, సచిన్ టెండూల్కర్ల ఆరోగ్య కోచ్. అస్సలు బ్రెడ్ ఏవిధంగా ప్రమాదకరమో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం!.అంబానీలు, సచిన్ టెండూల్కర్‌తో సహా అనేక మంది అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు వెల్నెస్ కోచ్ డాక్టర్ మిక్కీ మెహతా. ఆయన తరుచుగా ఇన్‌స్టాలో ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే ఈసారి ప్రతిరోజు బ్రెడ్ తీసుకుంటే ప్రేగు ఆరోగ్యం ఎలా పాడవ్వుతుందో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో సవివరంగా వెల్లడించారు. బ్రెడ్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు..ప్రజలు తమ దైనందిన జీవితంలో బ్రెడ్ తినడం అనేది అత్యంత సర్వసాధారణంగా మారిపోయిందని అన్నారు. భారతీయుల అల్పాహారంలో భాగమైపోయిందని కూడా అన్నారు. టీ విత్ బ్రెడ్, ఆమ్లెట్ బ్రెడ్, లేదా జామ్ విత్ బ్రెడ్, పోహా విత్ బ్రెడ్ లాగించేస్తున్నారు. కానీ ఈ తెల్లబ్రెడ్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాకరమైనదని నొక్కి చెప్పారు మెహతా. దీనివల్ల ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనే సమస్య వస్తుందని చెప్పారు. ఇటీవల తన కుమార్తె ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఆమె అకస్మాత్తుగా తల తిరగడం, వంటి సమస్యలను ఎదుర్కొంది. అచ్చం మద్యం సేవించిన వ్యక్తి మాదిరిగా కళ్లుతిరిగిపడిపోయిందని అన్నారు.బ్రూవరీ సిండ్రోమ్ అంటే..ఆమె పెద్ద మొత్తంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్ తింటున్నట్లు గమనించలేదని అన్నారు మెహతా. ఆమె ఎప్పుడైతే అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరింది అప్పుడే అసలు విషయం తెలిసిందన్నారు డాక్టర్ మెహతా. అంటే జీర్ణం కాని బ్రెడ్ ఇథనాల్ లేదా ఆల్కహాల్‌గా మారుతుందట. ఇది శరీరంపై ఆల్కహాల్‌కి మించిన ప్రభావం చూపిస్తుందట. పైగా ప్రేగులను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. దాంతో నెమ్మది నెమ్మదిగా బ్రూవరీ సిండ్రోమ్కి దారితీస్తుందట. ఇది ఒక అరుదైన వైద్య పరిస్థితి. దీన్ని గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇక్కడ ఆల్కహాల్ సేవించకపోయినా..ఒక విధమైన మత్తులో ఉంటారట. అంటే.. అరగని బ్రెడ్ శరీరంలో జీర్ణశయాంతర ప్రేగులో కిణ్వ ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ ఉత్పత్తి అవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఎదరవ్వుతుంది. నివారణ..బ్రెడ్‌ని తినలేకుండా ఉండలేం అనుకున్నవారు..బాగా ఆకలేసి..అందుబాటులో ఏం లేకపోతే తప్ప బ్రెడ్ జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు మెహతా. అలాగే మంచి ఫైబర్‌తో కూడిన ఆహారాని డైట్లో భాగం చేసుకుంటే..బ్రెడ్ వ్యర్థాలు సులభంగా బయటకు విసర్జించబడతాయని అన్నారు మెహతా. సో బ్రెడ్ తినేవాళ్లంతా కాస్తా జాగ్రత్తంగా ఉండటమే బెటర్..!. View this post on Instagram A post shared by Dr. Mickey Mehta (@mickey_mehta)గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: కొందరు జస్ట్ 4 గంటలే నిద్రపోయినా ఆరోగ్యంగానే ఉంటారు! రీజన్ అదే అంటున్న నిపుణులు) -
Hot Summer: చెమట గడ్డలు, ఉడుకు గడ్డలు, నివారణ ఇలా!
లబ్బీపేట(విజయవాడతూర్పు) : వేసవి ఉక్కపోతకు గాలిసోకని టైట్ దుస్తులు తోడవడంతో ఎక్కువ మంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో చర్మవ్యాధుల వైద్యులను సంప్రదిస్తున్న వారిలో ఎక్కువ మంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురైన వారు ఉంటున్నారు. టైట్ దుస్తులు, జీన్స్ వంటివి వేసుకుని పది, పన్నెండు గంటల పాటు ఉంటున్న వారిలో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. వాటికి తోడు వేసవిలో సన్‌బర్న్, సెగ గడ్డలు, రాష్ వంటివి సోకే అవకాశం ఉందంటున్నారు. నగరంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చర్మవ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీరవేసవిలో ఇబ్బందే వేసవిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడతాయి. దీంతో చర్మవ్యాధులతో పాటు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా సన్‌బర్న్, రాష్ (చెమట పొక్కులు), చెమట గ్రంథులతో ఏర్పడే గడ్డలు(ఉడుకు గడ్డలు), ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సన్ ఎలర్జీ, ఇతర చర్మవ్యాధులతో పాటు, మహిళలు మంగు వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి : సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్! ఎండలో తిరిగే వారితో పాటు, ఉక్కపోత ప్రాంతాల్లో ఉండే వారు ఈ వ్యాధులతో ఇబ్బంది పడతారు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బిగుతుగా ఉండే వ్రస్తాలు ధరించే వారికి, స్నానం చేసిన తర్వాత చర్మాన్ని సరిగ్గా తుడుచుకోకుండా వ్రస్తాలు ధరించే వారికి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. తొడల మధ్య తామరలాగా రావడంతో పాటు, దురదలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వారు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడంతో పాటు, అనంతరం తేమ లేకుండా చర్మాన్ని శుభ్రంగా తుడిచి, వైద్యులు సూచించిన లోషన్స్ రాసి అరికట్టవచ్చు. ప్రస్తుతం ఫంగల్‌తో ఇబ్బంది పడుతూ వైద్యుల వద్దకూ క్యూ కడుతున్నారు. సన్‌బర్న్(చర్మం కాలిపోవుట) ఎండలో ఎక్కువగా తిరిగే వారు సన్‌బర్న్‌కు గురవుతుంటారు. చర్మంపై కాలినట్లు మచ్చలు ఏర్పడతాయి. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. సన్బర్న్స్కు గురైన వెంటనే వైద్యుని సంప్రదించాలి. నీరు, పానీయాలు సేవించాలి. వైద్యుని సలహా మేరకు సన్ర్స్కీన్ లోషన్స్ వాడి అరికట్టవచ్చు. సెగగడ్డలు ఇవి చెమట గ్రంథులతో ఏర్పడతాయి. అధిక ఉష్ణోగ్రతల్లో ఉండే వారికి ఎక్కువగా వస్తుంటాయి. చిన్న చిన్న సెగగడ్డలుగా వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. వీటి నివారణకు క్రీమ్స్, పౌడర్స్ అందుబాటులో ఉన్నాయి. వైద్యుని సలహా మేరకు యాంటి బయోటిక్ మందులు వాడాలి. రాష్(చెమట కాయలు) ఎండలో తిరిగే వారికి ఎక్కువగా రాష్ వస్తుంది. గాలి సోకని మందమైన దుస్తులు, సిల్క్ వస్త్రాలు ధరించిన వారు దీని బారిన పడతారు. చర్మం కందిపోయినట్లు అనిపించడం, పొక్కులు వస్తాయి. ఇదీ చదవండి : 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో చర్మవ్యాధులు సోకకుండా జాగ్రత్తలువేసవిలో శరీరానికి మాయిశ్చరైజర్స్, సన్‌స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా గొడుగు, తలకు టోపీ ధరించాలి. ముఖ్యంగా లూజు దుస్తులు, కాటన్‌వి వేసుకోవాలి. రాత్రి వేళల్లో సైతం గాలిసోకే ప్రాంతంలో నిద్రించాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అనంతరం శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. స్నానం అనంతరం చర్మానికి పౌడర్ రాసుకుంటే చెమట పొక్కులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు.ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారు వాడే టవల్స్ మరొకరు వాడితే సోకే అవకాశం ఉంది. వాటిని వేడి నీటిలో నానబెట్టి వాష్ చేయాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తగిన జాగ్రత్తలతో చర్మ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వేసవిలో పలుచటి లూజుగా ఉండే కాటన్ దుస్తులు వాడాలి. నీరు, నీటిశాతం ఎక్కువగా ఉండే పళ్లు తీసుకుంటే చర్మవ్యాధులు రాకుండా చూడవచ్చు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను నివారించవచ్చు. జిమ్, వాకింగ్, స్పోర్ట్స్‌కు వెళ్లే వారు, ఆలస్యం చేయకుండా వెంటనే స్నానం చేయాలి. –డాక్టర్ సెంథిల్ కుమార్, చర్మవ్యాధుల నిపుణులు, మొగల్రాజపురం ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర -
అదృష్టవంతులంటే వీళ్లే..! కేవలం 4 గంటల నిద్ర చాలట..
మనలో చాలామంది నిద్రలేమి సమస్యలతో సతమతమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ కొందరు మాత్రం తక్కువ సమయమే పడుకున్నా..ఆరోగ్యంగానే ఉంటారు. పైగా ఎలాంటి చికాకు, ఆందోళనలు కనిపించవు. చాలా చురగ్గా తమ పనులు చేసుకుంటుంటారు. వాళ్లను చూసి అసూయ కూడా కలుగుతుంది. అబ్బా మనలానే కదా వాళ్లు తక్కువ సమయమే పడుకున్నా..ఇంతలా హెల్దీగా ఉంటున్నారు అనే బాధ కలుగుతుంది. అలాగే శాస్త్రవేత్తలు కూడా నిద్ర పనితీరు అందిరిలోనూ ఒకేలాంటి ప్రభావం ఉండదని చెబుతుంటారు కూడా. అయితే అందుకు కారణాలు గురించి మాత్రం నిర్థారించలేకపోయారు. కానీ ఇప్పుడు దానికి సమాధానం దొరికిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. రాత్రిపూట నాలుగు నుంచి ఆరు గంటలే నిద్రపోయినప్పటికీ..ఉదయం చురుగ్గా పనిచేయడానికి రీజన్ అరుదైన జన్యు పరివర్తనమే(Genetic mutation) కారణమని పరిశోధకుల తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ జన్యు పరివర్తనం నిద్ర-మేల్కొనే చక్రాన్ని ప్రభావితం చేస్తుందట. అంటే దీనికారణంగా ఆయా వ్యక్తులు ..తక్కువ గంటల్లోనే డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోతారట. వాస్తవానికి వైద్యులు ప్రతి వ్యక్తి రాత్రి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలని సూచిస్తుంటారు. అలా నిద్రపోనట్లయితే..నిద్ర లేమి అల్జీమర్స్, గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారినపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇక్కడ తక్కువ నిద్ర చక్రం ఉన్న ప్రతిఒక్కరికి ఇలాంటి ఆరోగ్యసమస్యలు ఉండవని అధ్యయనం వెల్లడించింది. చెప్పాలంటే ఈ వ్యక్తులను అదృష్టవంతులనే చెప్పాలి. తక్కువసేపే పడుకున్నా..హెల్దీగా ఉండగల సామర్థ్యం వీరి సొంతం. ఇక సాధారణంగా అందరికీ పడుకునేటప్పుడు శరీరం పనిచేస్తూనే ఉంటందనే విషయం తెలిసిందే. అయితే ఇలాంటి అరుదైన జన్యుపరిస్థితి ఉన్న వ్యక్తులకు మాత్రం నిద్రపోతున్నపుడు వారి శరీరం విధులు మనకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయని కాలిఫోర్నియా న్యూరోసైంటిస్ట్ చెబుతున్నారు. అంతేగాదు ఆయా వ్యక్తుల్లో మానవ సూపర్-స్లీపర్ SIK3-N783Y అనే జన్యు మ్యుటేషన్ ఉండటాన్ని గుర్తించింది. దీవిల్ల తక్కువ గంటల్లోనే గాఢనిద్రను పొందుతారట. పరిశోధకులు ఈ మ్యూటేషన్ని ఎలుకలలో ప్రవేశపెట్టగా అవి కూడా తక్కువ గంటలే నిద్రపోతున్నట్లు గుర్తించారు నిపుణులు. అంతేగాదు ఈ మ్యుటేషన్ ఉన్న ఎలుకలు 31 నిమిషాలే నిద్రపోతే..ఈ మ్యుటేషన్ లేని ఎలుకలు 54 నిమిషాలుపైగా నిద్రపోవడాన్ని గమనించారు. అంతేగాదు ఎలుకలో NSS hSIK3-N783Y మ్యుటేషన్ ఉండటం వల్ల నిద్ర సమయం తగ్గుతుందని, EEG డెల్టా శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ మ్యుటేషన్ నిర్మాణాత్మక మార్పులకు కారణమవుతుందని అన్నారు. ముఖ్యంగా ఇది ప్రోటీన్ కీ ఫాస్ఫేట్ అణువులను ఇతర ప్రోటీన్లకు బదిలీ చేసే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నారు. చివరగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయన ఫలితాలు నిద్ర రుగ్మతలకు కొత్త చికిత్సలను అందించి, నిద్ర నాణ్యతను మెరుగుపరిచగల ఆశను రేకెత్తించిందన్నారు. (చదవండి: National Technology Day 2025: నైపుణ్యాలున్న యువతకు స్వర్గధామం భాగ్యనగరం) -
బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ డైట్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..
ఎముకల ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనది. వయసు పెరిగేకొద్దీ ఎముకలు సాంద్రతను కోలపోతాయి. పైగా పగుళ్లు ఏర్పడి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ లోపాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఎముకలను బలహీనపర్చడాన్ని వేగవంతం చేస్తాయి. తరుచుగా గాయలయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటా వేలల్లో ఉంటుందోని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వైద్యలు మాత్రం ఇండియన్ డైట్‌తోనే నివారించుకోవచ్చని చెబుతున్నారు. ఎముక ఆరోగ్యాన్నికాపాడంలో భారతీయ ఆహారాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయిని చెబుతున్నారు. పైగా అవి అందుబాటులో ఉండే ఆహారాలేనని అంటున్నారు. అంతేకాదండోయ్ బలమైన ఎముకల బెస్ట్ ఇండియన్ ఫుడ్ గైడ్ ఏంటో కూడా వివరించారు. మరీ అవేంటో తెలుసుకుందామా..!.కాల్షియం అధికంగా ఉండే ఆహారాలుఎముకల బలానికి కాల్షియం అత్యంత ముఖ్యమైన ఖనిజం. పెద్దలకు రోజుకు 1000–1200 mg కాల్షియం అవసరం. భారతీయ ఆహారంలో సహజంగానే అనేక కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు ఉన్నాయి.పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, పనీర్ , మజ్జిగ వంటివి కాల్షియం అద్భుతమైన వనరులు.ఆకుకూరలు: పాలకూర (పాలక్), మెంతులు (మేథి), ఉసిరి వంటి మొక్కల ఆధారిత కాల్షియంనువ్వులు: భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే నువ్వులు (టిల్) గింజలు కాల్షియంతో సమృద్ధిగా ఉంటాయి.రాగి: సాంప్రదాయ భారతీయ ధాన్యం, రాగులు కాల్షియంతో నిండి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైనవి.అంటే పైన చెప్పిన వాటిల్లో కనీసం ఒక గ్లాసు పాలు లేదా మజ్జిగ తీసుకున్నాచాలు కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు.మెరుగైన కాల్షియం శోషణకు విటమిన్ డికాల్షియం శోషణకు విటమిన్ డి అవసరం. సూర్యరశ్మికి గురికావడం ఉత్తమ సహజ వనరులే కానీ ఫుడ్ పరంగా ఏవంటే..గుడ్డు పచ్చసొనసాల్మన్, సార్డిన్ వంటి కొవ్వు చేపలుబలవర్థకమైన పాల ఉత్పత్తులుపుట్టగొడుగులుఇక్కడ అందరికీ ఈజీగా అందుబాటులో ఉండే సూర్యరశ్మిలో గడిపే యత్నం చేయటం వంటివి చేస్తే చాలు.ఎముక ద్రవ్యరాశికి ప్రోటీన్ప్రోటీన్లు ఎముకల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. భారతీయ ఆహారాంలో ప్రోటీన్‌ని జోడిస్తే ఈ ఎముకల సమస్యను అధిగమించొచ్చు.పప్పుధాన్యాలు, కాయధాన్యాలు (పప్పు, రాజ్మా, శనగ, మూంగ్)పాల ఉత్పత్తులుబాదం, వాల్నట్లు, అవిసె గింజలు, విత్తనాలులీన్ మాంసాలు, గుడ్లుప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఎముక సాంద్రతను పెంచుతుంది, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు వైద్యులుఎముక సాంద్రతకు మెగ్నీషియం, ఫాస్ఫరస్ఎముకల నిర్మాణాన్ని నిర్వహించడానికి కాల్షియంతో పాటు మెగ్నీషియం, పాస్ఫరస్ కూడా కీలకమే. ఈ ఖనిజాలు అధికంగా ఉండే భారతీయ ఆహారాలలో ఇవి ఉన్నాయి:అరటిపండ్లు, అంజూర పండ్లు, ఖర్జూరాలుగోధుమ బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాలుజీడిపప్పు, వేరుశెనగ వంటి గింజలుగుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలుఎముకలకు హాని కలిగించే ఆహారాలు..పోషకాలు అధికంగా ఉండే ఆహారం కీలకం అయినప్పటికీ, కొన్ని ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయని విషయం గ్రహించాలని హెచ్చరిస్తున్నారు నిపుణులుతినకూడనవి..చక్కెర పానీయాలుశీతల పానీయాలుఎముకల నుంచి కాల్షియం లీక్ అయ్యే అధిక ఉప్పుఅధిక మొత్తంలో కెఫిన్నడక, జాగింగ్, బరువు మోసే వ్యాయామాలు, సమతుల్య ఆహారం తదితరాలు జీవితాంతం ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అందువల మనకు అందుబాటులో ఉండే ఈ సాధారణ ఆహారాలతో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..) -
సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..
ఇటీవల కాలంలో అందంగా, నాజుగ్గా ఉండేందుకే అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు అతివలు. అందుకోసం ఎలాంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకునేందుకైనా వెనకాడటం లేదు. అలాంటి సౌందర్య చికిత్స చేయించుకునే ఓ మహిళ వేళ్లను కోల్పోయింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లుగా.. పాపం ఆ మహిళకు తీవ్ర బాధనే మిగిల్చింది ఆ కాస్మెటిక్ సర్జరీ.అసలేం జరిగిందంటే..తిరువనంతపురం జిల్లా, కజకూట్టం సమీపంలోని తంపురాన్ముక్కులోని కాస్మెటిక్ హాస్పిటల్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తిరువనంతపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంఎస్ నీతు రెండు నెలల క్రితం ఫిబ్రవరి 22న క్లినిక్‌లో కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. ప్రసవం తర్వాత సాధారణంగా పొట్ట ఒదులుగా బెల్లీ పొట్టలా మారుతుంది కొదరికి. ఇక్కడ నీతుకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో.. ఉదర కొవ్వు తీయించుకునే కాస్మెటిక్ సర్జరీ లైపోసక్షన్ని చేయించుకుంది. సర్జరీ జరిగిన మరుసటి రోజే నీతూని డిశ్చార్జ్ చేసి పంపించేశారు వైద్యులు. ఆ తర్వాత నుంచి ఆమెకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒకటే తలతిప్పడం..తీవ్ర బలహీనత, నీరసం వంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. వైద్యులను సంప్రదిస్తే..జావా, ఓట్మీల్ వంటివి తీసుకోవాలని సూచించారు. అయితే ఆమె పరిస్థితి మెరుగవ్వక పోగా, అంతకంతకు విషమించడం మొదలైంది. దీంతో హుటాహుటినా సదరు కాస్మెటిక్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమె పరిస్థితి చూసి..పది యూనిట్ల రక్తం కూడా ఎక్కించారు. అయినా ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో..మరొక ఆస్పత్రికి రిఫర్ చేశారు వైద్యులు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అక్కడ సుమారు 22 రోజుల అనంతరం కోలుకుంది. నీతు చేయించుకున్న లైపోసక్షన్ తీవ్ర ఇన్ఫెక్షన్ సమస్యలు కలిగించి..పరిస్థితి దిగజారిపోయేలా చేసిందని చెప్పారు వైద్యులు. అంతేగాదు ఆమెకు త్వరితగతిన నయం అయ్యేలా ఎడమ పాదం ఐదు వేళ్లు, ఎడమ చేతి నాలుగు వేళ్లను తొలగించినట్లు తెలిపారు వైద్యులు. దీంతో కుటుంబ సభ్యులు సదరు కాస్మెటిక్సర్జరీ నిర్లక్ష్యం కారణంగానే నీతుకి ఈ పరిస్థితి ఎదురైందంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అలాగే ఆమెకు సర్జరీ చేసిన డాక్టర్ షెనాల్ శశాంకన్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగింది. ఇక విచారణలో సదరు కాస్మెటిక్ ఆస్పత్రి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండానే ఈ క్లినిక్ నిర్వహిస్తుందని తేలింది. దీంతో ఆ క్లినిక్‌ని మూసివేసేలా నోటీసులు జారీ చేశారు. కాగా, గతంలో కొందరు ఇలాంటి సౌందర్య చికిత్సలు చేయించుకుని ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చాలానే వెలుగు చూశాయి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: యుద్ధ చర్య కాదు..! ఆపరేషన్ సిందూర్‌పై పాక్ వ్యక్తి ప్రశంసల జల్లు) -
30 డేస్ ఛాలెంజ్ : ఇలా చేస్తే యవ్వనంగా, ఆరోగ్యంగా!
ఉదయాన్నే వేడి వేడి కాఫీనో, టీనో తాగాలి. అదీ కాస్త చక్కెర ఎక్కువ వేసుకుంటే భలే మజాగా ఉంటుంది. ఇక అన్నం తినగానే మామిడిపండో, అరటిపండో ఏదో ఒక పండు తినాలి. లేదంటే ఏదో ఒక స్వీట్ లడ్డూనో,పాలకోవా, మైసుర్ పాక్ ఏదో ఒకటి అలా నోటికి తగిలితే భోజనం పూర్తి అయినట్టు. అంతే కాదండోయ్.. టీలో వేస్తూనో, పిల్లలకు పాలు కలుపుతూనో ఒక స్పూన్ నోట్లో వేసుకోవడం గృహిణులు బాగా అలవాటు. ఒక విధంగా చెప్పాలంటే షుగర్ లేని రోజంటూ ఉండదు. నిత్యం ఏదో ఒక రూపంలో చక్కెర బుక్కేస్తూ ఉంటాం. షుగర్ లెస్ టీ అంటూనే, టీలో మైదా, చక్కెర కలిపిన బిస్కట్లు నంజుకుంటాం. అసలు చక్కెర అతిగా తినడం వల్ల అనర్థాల గురించి ఎపుడైనా ఆలోచించారా? ఒక్క నెల రోజులు చక్కెర తినడం మానేస్తే మన శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఎలా ఉంటాయో తెలుసా?ఇలా నియంత్రణ లేకుండా స్వీట్లు, సోడా, పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ రూపంలో నిత్యం మనం చక్కెరను తీసుకుంటూ ఉంటాం. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అధిక చక్కెర వినియోగం ఆరోగ్యంపై వివిధ ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కారణమవుతుంది. చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పేమాట. టైప్ 2 డయాబెటిస్‌తోపాటు, గుండె జబ్బులు, దంత సమస్యలు , మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ వీడియోలో, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి వరుసగా 30 రోజులు చక్కెరను మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించారు. View this post on Instagram A post shared by Saurabh Sethi (@doctor.sethi)> చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా! 30 రోజులు చక్కెర వాడకాన్ని మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడుతుంది. లివర్‌లో ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.ముఖంలో ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది చక్కెరను తగ్గిస్తే ముఖం నాజూగ్గా తయారవుతుంది. ఉబ్బరం , నీరు తగ్గి చక్కటి ముఖం వస్తుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో మంట వస్తుంది. ఒక్క నె లరోజులు దీన్ని నియంత్రిస్తే, ఇది తగ్గుతుంది. అలాగే కళ్లు, కాళ్ళలో వాపు తగ్గుతుంది.నడుము సన్నగా అవుతుంది. బొడ్డు, కాలేయ కొవ్వు తగ్గుతుంది. కేలరీలు తగ్గి, బరువు తగ్గడానికి, లేదా పెరగకుండా ఉండటానికి దోహద పడుతుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చక్కెరను మానేయడం వల్ల గట్ బాక్టీరియా సమతుల్యమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. మొటిమలు , చర్మం ఎర్రబారటం తగ్గి, స్కిన్ ప్రకాశవంతమవుతుంది. దీంతొవృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.ఇదీ చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!చక్కెరను తగ్గించడానికి చిట్కాలు:ప్రాసెస్ చేసిన పదార్థాలకు దూరండా ఉండాలి. లేబుల్‌లను జాగ్రత్తగా చదివి తీసుకోవాలి.చక్కెర బాగా తీసుకోవడం బాగా అలవాటైతే నెమ్మదిగా తగ్గించేందుకు ప్రయత్నించాలి. చక్కెరను తీసుకోవడం మానేసిన వారిలో తలనొప్పి అలసట, శక్తి స్థాయిలు తగ్గినట్లు అనిపిస్తుంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ,లీన్ ప్రోటీన్లు వంటి ఆహారంపై దృష్టిపెట్టాలి. ప్రత్యామ్నాయ షుగర్ ఉత్పత్తులపై దృష్టిపెట్టాలి. నోట్. సోషల్‌మీడియా సమాచారం ఆధారంగా అందించిన సమాచారం అని గమనించగలరు. ముఖ్యంగా గుండెజబ్బుల, అధిక రక్తపోటుతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు తమ ఆహార పద్దతులను మార్చుకోవాలి. -
బడికి వెళ్లే వయసులోనే.. రక్త కన్నీటి గాథ..!
కొందరు చిన్నారులు తల్లిపాలు తాగే వయస్సులో రక్తాన్ని ఎక్కించుకుంటూ తల్లడిల్లుతున్నారు. బడికి వెళ్లాల్సిన సమయంలో రక్తనిధి కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాక్లెట్లు చప్పరించాల్సిన నోటితో చేదు మందు బిల్లలు తింటున్నారు. తోటి చిన్నారులు ఆనందంగా ఆడుకుంటుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని నిస్సహాయస్థితి వారిది. అలసట, ఆయాసాల మధ్య ప్రాణాంతక వ్యాధి తలసేమియా బాధితుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉమ్మడి జిల్లాలో 179 మంది చిన్నారుల సంతోషాన్ని ఇది దూరం చేస్తోంది. అయితే వారి ఆయుష్షు పెంచే బాధ్యతను జిల్లా జనరల్ ఆస్పత్రి, రెడ్‌క్రాస్ తీసుకుంది. రక్తం ఎక్కించాల్సిందే.. తలసేమియా జన్యు సంబంధిత వ్యాధి. వ్యాధి సోకిన వారికి వారం, పదిహేను రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ వ్యాధిగ్రస్థుల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి శరీరానికి అవసరమైనంత ఉండదు. ఒకవేళ ఉత్పత్తి అయినా ఎక్కువ కాలం ఉండదు. 2018లో తలసేమియాను ఆరోగ్యశ్రీ పథకంలో విలీనం చేయడం వల్ల బాధితులకు ప్రతి నెల మందులను జనరల్ ఆస్పత్రి నుంచి ఇస్తుంటే.. రక్తం మాత్రం రెడ్‌క్రాస్ నుంచి అందిస్తున్నారు. ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!వ్యాధి లక్షణాలు.. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంది. చిన్నారులు ఎదుగుతున్న కొద్దీ వ్యాధి బయటపడుతుంది. వ్యాధి బారినపడిన పిల్లలకు రక్తహీనత మొదలై జీర్ణశక్తి మందగిస్తుంది. ముఖం పాలిపోవటం, ఎదుగుదల లేకపోవడం, హుషారు తగ్గడం, నీరసించి పోవడం వంటి లక్షణాలు కని్పస్తాయి. కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి ప్రారంభమై, మూత్రం పసుపు వర్ణంతో వస్తోంది. ఇదీ చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!పరీక్షలు చేయించు కోవాలి ఈ వ్యాధి బారిన పడినవారు పసువు రంగులో మూత్ర విసర్జన చేస్తుండటం వల్ల దీనిని తల్లిదండ్రులు పచ్చకామెర్లుగా భావిస్తుంటారు. అవగహన లేమి కారణంగా పచ్చ కామెర్లకు చికిత్స అందిస్తారు. పైలక్షణాలు పిల్లల్లో ఉంటే జనరల్ ఆస్పత్రిల్లో పూర్తిస్థాయి పరీక్షలు చేయించి చికిత్స చేయించుకోవాలి. -
వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!
మనం సాధారణంగా ఏదైనా పిండి వంటలు చేసినపుడు ఎక్కువ వాడుతుంటాం. ముఖ్యంగా జంతికలు, కారప్పూస, అరిసెలు, బూందీ తదితర పిండివంటలు చేయాలంటే ఆయా పదార్థాలను నూనెలో ఫ్రై చేస్తుంటాం. అలాగే పకోడీ, బజ్జీ లాంటి స్నాక్స్ చేసినప్పుడు కూడా డీప్ ప్రై చేస్తాం. అప్పుడు వాటికి సంబంధించిన మడ్డి, చిన్న చిన్న తునకలు నూనెలో మిగిలిపోతాయి. అవి మాడిపోయి నల్లగా కనిపిస్తుంటాయి. అంతేకాదు అవి ఫ్రెష్‌గా వేయిస్తున్న వాటికి అంటుకుని చూడ్డానికి బాగా అనిపించవు. మరి అలాంటి నూనెను పూర్తిగా క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి వాడిన నూనెను పాప్‌కార్న్ పిండి సహాయంతో సులభంగా శుభ్రం చేయవచ్చని మీకు తెలుసా? ఈ ఈజీ టిప్ గురించి తెలుసుకుందాం.పిండి వంటలు, స్నాక్స్ చేసినపుడు వండినపుడు కొంత నూనె మిగిలిపోతుంది. అలాగే గిన్నె అడుగు భాగంలో కొంత వేస్ట్, మడ్డి లాంటి పేరుకుపోతుంది. ఈ నూనెని మళ్ళీ వాడాలన్నా, అందులో కొన్ని మిగిలిన పదార్థాలను క్లీన్ చేయడం,నూనెను ఫిల్టర్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఆయిల్ ఫిల్టర్‌తో వడ కట్టినా, పల్చటి బట్టతో వడపోసినా పూర్తిగా శుభ్రం కాదు. మరి అలాంటి నూనెని ఎలా క్లీన్ చేయాలి. దీనికి సంబంధించిన ఒక వీడియో ఎక్స్‌లో ఆసక్తికరంగా మారింది. దీనికి ఏకంగా 16.4 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.तेल से गंदगी/अवशेष साफ करने का ये सबसे सही जुगाड़ है। pic.twitter.com/ieS62WWQaM— Dr. Sheetal yadav (@Sheetal2242) May 7, 2025 "> కార్న్‌ఫ్లోర్ చిట్కాముందుగా కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. అందులో కొద్దిగా నీరు కలిపి బజ్జీ పిండిలా చేయాలి. దీనిని మరిగే నూనెలో వేయండి. అప్పుడు అది నూనె అడుగు భాగంలో ముద్దలాగా మారి, నూనెలోని మడ్డిని, మాడిపోయిన పిండి వంటల తునకలను ఎట్రాక్ట్ చేస్తుంది. మొక్క జొన్న పిండి ముద్దను అలా గుండ్రంగా తిప్పాలి. అంతే ఈజీగా నూనెలోని మొత్తం అవశేషాలు అయస్కాంతం లాగా పని చేస్తుంది. డస్ట్ అంతా పిండిముద్దకు అతుక్కుని పోయి.. నూనె పూర్తిగా శుభ్రపడి , తేటగా కనిపిస్తుంది. ఆ ముద్దను పారవేసి దీనికి మిగిలిన వంటల్లో వాడుకోవచ్చు. ఇలా చేయడం నూనెలోని మాడు వాసన కూడా పోతుంది.జపాన్‌లో, టెంపురా చెఫ్‌లు 100 సంవత్సరాలుగా నూనెను శుభ్రం చేయడానికి స్టార్చ్‌ను ఉపయోగిస్తున్నారు. మరిగించిన నూనెలో మళ్లీ వేయించడం వల్ల అక్రిలామైడ్ వంటి కేన్సర్ కలిగించే సమ్మేళనాలు రెట్టింపు అవుతాయి. అయితే FDA డేటా ప్రకారం కార్న్‌స్టార్చ్ ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కార్న్‌స్టార్చ్ ఫ్రైస్‌తో శుభ్రం చేసిన నూనె ఫిల్టర్ చేయని నూనెతో పోలిస్తే 25 శాతం తక్కువ తడిగా ఉంటుందట.ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!నోట్ : ఆయిలీ ఫుడ్స్, వేపుళ్లు ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఒకసారి వాడిన నూనెని పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి అంత మంచిది. ఎక్కువ సార్లు మరిగించిన పరిమితంగా వాడుకోవడం ఉత్తమం. వీలైతే అలాంటి ఆయిల్‌ను ఉపయోగించక పోవడమే మంచిది. ముందుగానే తక్కువ నూనెలో వేయించేలా జాగ్రత్తపడాలి. -
కాలేయ వ్యాధికి మధుమేహ మందుతో చికిత్స
సాక్షి, హైదరాబాద్: కాలేయ వ్యాధిగ్రస్తులకు ఇప్పటివరకు సరైన మందు లేదు. కాలేయం చెడిపోతే ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. దీంతో సరైన మందు లేక తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఊరట కలిగించే శుభవార్తను శాస్త్రవేత్తలు వెల్లడించారు. మధుమేహానికి వినియోగించే ‘సెమాగ్లుటైడ్’అనే మందు, ఇప్పుడు లివర్ వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగపడుతుందని లండన్ కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మందుతో కాలేయంలోని గాయాలు తగ్గినట్లు గుర్తించారు. ముఖ్యంగా ‘మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియాటో హెపటైటిస్’(సాధారణంగా మాష్ అని పిలుస్తారు) అనే కాలేయ వ్యాధిని నియంత్రించడమే కాకుండా కొంతవరకు తిరిగి సరిచేసే శక్తి కూడా ఈ మందుకు ఉందని తాజా అధ్యయనం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో పరిశోధన.. ప్రపంచంలోని 37 దేశాల్లో 800 మందిపై ఈ ఔషధ ప్రయోగం నిర్వహించారు. వారిని రెండు వర్గాలుగా విభజించారు. ఒక వర్గానికి ప్రతి వారం సెమాగ్లుటైడ్ మందును అందించగా, మరొక గ్రూపునకు ప్లాసెబో (నకిలీ మందు) ఇచ్చారు. 72 వారాల పాటు జరిపిన ఈ ప్రయోగం ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. » సెమాగ్లుటైడ్ తీసుకున్న వారిలో 63 శాతం మందికి లివర్ మంట తగ్గినట్టు తేలింది. దాదాపు 37 శాతం మందిలో కాలేయంలోని గాయాలు (ఫైబ్రోసిస్) తగ్గినట్టు గుర్తించారు. » ఇదే సమస్య ప్లాసెబో (నకిలీ మందు) వాడిన వారిలో కేవలం 22 శాతం మందిలో మాత్రమే కనిపించింది. ఈ మందు వాడిన వారు సాధార ణంగా బరువు తగ్గినట్టు కూడా తెలిసింది. » సెమాగ్లుటైడ్ మందు వాడిన వారిలో కొందరికి వాంతులు, జీర్ణ సమస్యలు తలెత్తినప్పటికీ, ఆశాజనక ఫలితాల ముందు ఇవి తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. » ఈ మందును వాడిన కొంతమందికి వాంతులు, మలబద్ధకం, విరోచనాలు వంటి జీర్ణసంబంధిత స మస్యలు ఎదురయ్యాయి. అయితే ఇవి తాత్కాలిక మేనని, దీర్ఘకాల ప్రయోజనాలతో పోల్చితే తక్కు వేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. లివర్ సమస్యలకి కారణాలు అనేకం: అధిక కొవ్వు, మధుమేహం, అధిక రక్తపోటు, శరీరం చురుకుదనం లేకపోవడం వంటి కారణాలతో లివర్‌లో కొవ్వు పేరుకుని కాలేయం పాడవుతుంది. దీన్ని నాన్–ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి అని పిలుస్తారు. ఇది తీవ్రమై ‘మాష్’గా మారితే, కాలేయం పూర్తిగా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. » ‘ఇలాంటి మందు తయారవడం ద్వారా తీవ్రమైన కాలేయ వ్యాధులకు కొత్త మార్గం ఏర్పడింది. ము ఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఇది ప్ర యోజనకరం’అని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ ఫిలిప్ న్యూసమ్ తెలిపారు. -
కొత్త బట్టలు అలానే ధరించేస్తున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా మనం షాపింగ్‌కి వెళ్లి కొత్తగా బట్టలు కొనుగోలు చేసి వెంటనే వేసుకుని చూస్తాం. పైగా అవి మనకు సరిగ్గా సరిపోయిందో లేదని ట్రయల్ రూంలో వెళ్లి మరి చెక్ చేస్తాం. ఆ తర్వాత ఇంటికి తెచ్చుకుని నేరుగా ధరించేస్తాం. ఇది సర్వసాధారణం. చాలామటుకు అందరు ఇలానే చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన బట్టలను కొందరు దేవుడి వద్ద పెట్టి అలానే వేసుకుంటాం. కానీ అలా వేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు చర్మ నిపుణులు. కొన్ని కొత్త బట్టలు వాటికి ఉపయోగించే రసాయనాల రీత్యా అలా కొత్త బట్టలను నేరుగా ధరించొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. అలా అనడానికి రీజన్ ఏంటో చూద్దామా..!.స్టైలిష్‌గా ఉండే దుస్తులు ధరించడం నేటి యువత ట్రెండ్. అందుకోసం సరసమైన ధరల్లో లభించే బజార్లు తెలుసుకుమని కొంటున్నారు. కొందరు బ్రాండ్‌వి కొనుగోలు చేయగలరు. మరికొందరు వన్‌ప్లస్ టు ఆఫర్లు లేదా కాస్త తక్కువ ధరకు దొరికే చోట కొనుగోలు చేస్తుంటారు. అయితే అలానే ఒక కుర్రాడు బట్టలుకొని నేరుగా ధరించాడు. అంతే ఒక్కసారిగా అలెర్జీల ఒంటిమీద ఎర్రటి పొక్కులు వచ్చేశాయి. అందరిలానే కొత్తగాకొన్నవే కదా అని వేసుకున్నాడు. కానీ దాని వల్ల అతడు బాడీ అంత ఒక రకమైన ఇన్ఫెక్షన్ వచ్చేసి..దారుణంగా తయారైంది. తాను ఎదుర్కొన్న అనుభవాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై డెర్మటాలజిస్ట్‌లు స్పందించారు. అతడి పరిస్థితిని మొలస్కం కాంటాజియోసమ్ అనే అంటువ్యాధి అని అన్నారు. ఒక రకమైన వైరస్ వల్ల వచ్చే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్గా నిర్థారించారు. ఈ మధ్య రెట్రో ఫ్యాషన్ ఓ ట్రెండ్‌గా మారింది. అంతేగాదు పర్యావరణ హితంగా రీసైకిల్ చేసిన పాత బట్టలను కొనుగోలు చేస్తున్నారు కొందరు. అలాంటివి కూడా కొన్నవెంటనే నేరుగా ధరిస్తే ఇలాంటి ప్రమాదమే ఎదురవుతుందని అన్నారు. అంతేగాదు కొన్న వెంటనే ఎలాంటి బ్రాండెడ్ బట్టలైన ఉతికి ధరిస్తేనే మంచిదని సూచించారు. ఎందుకంటే ఆయా ఫ్యాబ్రిక్ల రంగుల కోసం ఉపయోగించే గాఢ రసాయనాలు.. ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలిగించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు న్యూయార్క్‌కి చెందిన వైద్య నిపుణుడు. అలాగే ఇలాంటి అవాంఛిత చర్మ సమస్యలను నివారించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన స్టైలిష్వేర్ అయినా ఒక్కసారి వాష్ చేశాక ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు.గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఓఆర్ఎస్ అని పిల్లలకు తాగిస్తున్నారా..? హెచ్చరిస్తున్న నిపుణులు) -
మంచి పుచ్చకాయను గుర్తించండి ఇలా!
వేసవిలో లభించే పుచ్చకాయలు అందరికీ ఇష్టం, అంతకంటే చల్లని నేస్తాల వంటివి అనొచ్చు. వాటి సహజమైన తీపి, అధిక నీటి శాతం వాటి రిఫ్రెషింగ్ రుచితో పాటు కలర్‌ఫుల్ రూపం కూడా సమ్మర్లో వాటిని తిరుగులేనివి పండుగా నిలబెట్టాయి. ఈ పుచ్చకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ అనేకం...పుచ్చకాయ కేవలం అలసిపోయినప్పుడు రిఫ్రెష్ చేసే పండు మాత్రమే కాదు, అవసరమైన పోషకాలతో కూడా నిండి ఉంటుంది. దాదాపు 9092% నీటితో కూడిన పుచ్చకాయ, వేసవి వేడి సమయంలో హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఒక 100 గ్రాముల పుచ్చకాయ ద్వారా దాదాపు 16 కేలరీలు లభిస్తాయి తక్కువ కేలరీల పండుగా, బరువును నియంత్రించుకునే వారికి పుచ్చకాయ అనుకూలంగా ఉంటుంది. దీనిలో సి, ఎ, బి6 విటమిన్లు అలాగే పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం వలన ఈ పండు అధిక రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రయోజనకరం. దీని విటమిన్ సి కంటెంట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేసి వివిధ వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. పుచ్చకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది, దానిలోని ఇనుము శాతం కారణంగా రక్తహీనత ఉన్నవారికి మంచిది. పండులోని ఎరుపు భాగాన్ని తరచుగా అత్యంత రుచికరంగా పరిగణిస్తారు, అయితే చర్మం దగ్గర ఉన్న లేత ఆకుపచ్చ రంగులో ఉండే భాగం సైతం ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా పుచ్చకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, దానిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. వేసవి నెలల్లో, రోడ్డు పక్కన ఎర్రగా, కోసిన పుచ్చకాయ రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో చాలా కల్తీ పుచ్చకాయలు ఉన్నాయి, మరి తాజా, ఆరోగ్యకరమైన పుచ్చకాయను కొనుగోలు చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? నాణ్యత లేని పండ్ల ద్వారా మోసపోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం ఎలా? ఇప్పుడు చూద్దాం..కల్తీ పుచ్చకాయ అంటే హానికరమైన రసాయనాలు, రంగులు లేదా ఆర్టిషియల్ రిపైనింగ్ ఏజెంట్లను ఉపయోగించి దాని రూపాన్ని లేదా బరువును పెంచడానికి తారుమారు చేసిన పండు. సాధారణ కల్తీ పద్ధతుల్లో దాని గుజ్జును ఎర్రగా కనిపించేలా చేయడానికి ఆర్టిషియల్ కలర్‌ను ఇంజెక్ట్ చేయడం, బరువు పెంచడానికి నీటిని జోడించడం లేదా తాజాదనాన్ని కాపాడటానికి రసాయనాలను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. ఈ పద్ధతులు మన ఆరోగ్యానికి హానికరం, కాబట్టి విశ్వసనీయ విక్రేతల నుంచి మాత్రమే పుచ్చకాయలను కొనుగోలు చేయడం సహజ పక్వత సంకేతాలను తనిఖీ చేయడం ముఖ్యంమంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి? పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, రంగు ముఖ్యం. నిస్తేజమైన చర్మం ఉన్న దాని కంటే శక్తివంతమైన, తగిన రంగు కలిగిన పుచ్చకాయ మంచి ఎంపిక. పక్వానికి ముఖ్య సూచిక దానిని తట్టినప్పుడు వచ్చే శబ్దం బోలుగా ఉండే, తేలికపాటి శబ్దం పండు నీటితో నిండి ఉందని మంచిదని సూచిస్తుంది. అదనంగా, ఏవైనా మచ్చలు లేదా గాయాలు ఉన్నాయా అని పుచ్చకాయను తనిఖీ చేయాలి, ఎందుకంటే ఇవి నష్టం లేదా చెడిపోవడాన్ని సూచిస్తాయి. పుచ్చకాయ అడుగున పసుపు మచ్చల కోసం ఉండాలి. అలా మచ్చలు ఉంటే ఈ పుచ్చకాయను సరైన సమయంలో సహజంగా పండించారని అర్ధం. అయితే, లేత లేదా తెల్లటి మచ్చలు ఉంటే పండు పూర్తిగా పక్వానికి రాకముందే కోసినట్లు అర్ధం View this post on Instagram A post shared by Adithya Nataraj 🇮🇳 (@learnwithadithya) (చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!) -
నటుడు ధర్మేంద్ర వాటర్ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! ఎలా చేస్తారంటే..
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర(Dharmendra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలతో వేలాది అభిమానులను సంపాదించుకున్న నటుడు. ఎనిమిది పదుల వయసులో కూడా అంతే అందంగా మంచి ఫిట్నెస్తో ఉంటారు. అంతేగాదు తరుచుగా తన వర్కౌట్ వీడియోలతో ఆరోగ్య స్పృహను కలుగుజేస్తుంటారు. తాజాగా తన గేమ్-ఛేంజర్ వాటర్ వ్యాయామాలతో వీడియోని షేర్ చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచారు. కండరాల కదలికలు కోసం, ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే శారరీక కదలికలకు ఈవ్యాయామాలు మంచి గేమ్ ఛేంజర్ అనిపోస్ట్లో పేర్కొన్నారు 89 ఏళ్ల ధర్మేంద్ర. ఈ నేపథ్యంలో ఆ వ్యాయమాలు ఎలా చేస్తారు..? కలిగే ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నీటిలో చేసే ఈ సున్నితమైన వాటర్ వ్యాయామాలు శరీరానికి మంచి కదలికలని చెబుతున్నారు నిపుణులు. కాళ్లకు, మొత్తం శరీరానికి మంచిదని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి వ్యాయామాలు తప్పనిసరి అని అన్నారు. ఇలా చల్లటి నీటిలో తేలియాడుతూ చేసే రిలాక్స్డ్ వ్యాయామాలు ఏంటో చూద్దామా..!.వాటర్ వాకింగ్: ఇక్కడ నీటిలో నడవడం బయట భూమిపై నడిచినంత ఈజీగా చేయలేం. కొద్దిమొత్తంలో బలాన్ని ఉపయోగించి నడవాల్సి ఉంటుంది. మన అడుగుపడకుండా చేసే నీటి నిరోధకతతో ఫోర్స్‌గా నడవడం వల్ల మోకాళ్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేగాదు నీటిలోకి దిగి తేలియాడుతూ..స్మిమ్మింగ్‌పూల్ చుట్టూ నడవాలి. దీనివల్ల ఎలాంటి కండర సమస్యలు ఉండవని చెబుతున్నారు నిపుణులు.వాటర్ జాగింగ్: ఇక్కడేంటంటే ఇంకాస్త ముందడుగు వేసి భూమ్మీద చేసినట్లుగా పూల్ చుట్టు జాగింగ్ చేయాలి. దీనివల్ల త్వరితగతిన చెమటలు పట్టేస్తాయి. స్పీడ్‌గా కేలరీలు బర్న్ అవ్వడమే గాక శరీరానికి చక్కని వ్యాయామంలా కూడా ఉంటుంది.ఫ్లట్టర్ కిక్స్: పూల్ సైడ్‌ను పట్టుకుని శరీరాన్ని నిటారుగా ఉంచి.. ఫ్లట్టర్ కిక్ చేయాలి. చల్లటి నీటిలో ఉంటూ కాళ్ళకు తగిన వ్యాయామం అందించే మార్గం. ఇది ఒకరకంగా ఈత కొడుతున్న అనుభూతి కలిగిస్తుంది. .లెగ్ రైజెస్: పూల్ చివరలో నిలబడి కాళ్ళను పక్కకు ఎత్తండి. ఇది హిప్ ఫ్లెక్సర్‌లను బలంగా ఉంచుతుంది. ఇది బాడీకి సూపర్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది.వాటర్ పుష్-అప్లు: పూల్ అంచుపై చేతులను ఉంచి, మోచేతులు వంచి నిలబడండి. ఆ తర్వాత అంచు నుంచి మిమ్మల్ని దూరంగా నెట్టండి, ఆపై నెమ్మదిగా వెనుకకు తగ్గించండి. ఇది అచ్చం పుష్-అప్ చేయడం లాంటిది. అయితే నీటి నిరోధకత పైకి లేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ శరీరాని మంచి కదలికలను అందించడమే గాక కండరాలు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఉపకరిస్తాయి.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగ నిపుణులు లేదా వైద్యులను సంప్రదించండి. View this post on Instagram A post shared by Dharmendra Deol (@aapkadharam) (చదవండి: ఎంత పనిచేశావ్ నాన్న..! హార్ట్ టచింగ్ వీడియో..) -
60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
వ్యాపారవేత్త, దేశీయ అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. చాలా అలవోకగా యోగాసనాలు వేస్తూ కనిపించారు. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసు కోవాలని ఈ సందర్భంగా మహిళలకు సలహా ఇచ్చారు. 40 ఏళ్లు దాటిన తరువాత ప్రతీ మహిళ తన ఆరోగ్యంపై, శరీరంపై శ్రద్ధ పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కూడా. తాజాగా కోచ్ వినోద్ చన్నా నీతా అంబానీ వ్యాయామ పద్ధతులపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.నీతా అంబానీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా, తన అనుభవాన్ని బాలీవుడ్ షాదీస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పంచుకున్నారు . 60 ఏళ్ళ వయసులో కూడా నీతా అంబానీ వ్యాయామానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారంటూ వినోద్ చన్నా ఆమె వ్యాయామ దినచర్య గురించి మాట్లాడారు. తన సలహాలను, సూచనలను తు.చ తప్పకుండా పాటిస్తారని వెల్లడించారు. " నేను నిర్ణయించినట్టే ఆమె వ్యాయామం చేస్తారు.చాలా కష్టపడతారు. వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను ఏమి చెప్పినా, అనుసరించి లక్ష్యాన్ని చేరుకుంటారు" అని చెప్పారు. వినోద్ మార్గదర్శకత్వంలో వివిధ యోగా ఆసనాలు, స్ట్రెచింగ్ ,శ్వాస వ్యాయామాలు చేసిన వీడియోను నీతా ఇటీవల షేర్ చేసిన సంగతి తెలిసిందే.వినోద చన్నా వ్యాయామ సలహాలు50 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్న సమయంలో వారి వారి విభిన్న జీవనశైలి, ప్రతిదాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ పోషకాహారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, కాల్షియం స్థాయి గురించి తెలుసుకోవాలని చెప్పారు. లేదంటే పైకి బాగానే ఉన్నప్పటీ, ఎముకలు పెళుసుగా మారి తొందరగా గాయపడతారని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ కండరాల నిర్మాణం తగ్గుతుంది కాబట్టి పోషకాహారం పరిపూర్ణంగా ఉండాలని, కదలిక లేకపోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది కాబట్టి, మంచి ఆహారం తీసుకోవడం, శక్తి, స్థిరత్వం, మనస్సు,శరీరం మధ్య సమన్వయాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!ఉదయమా? సాయంత్రమా? ఉదయం లేదా రాత్రి వ్యాయామం చేయాలా వద్దా అని ప్రశ్నిస్తే.. రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చని చెప్పారు వినోద్ . శరీరానికి చురుకుదనం, కదలికలే ముఖ్యం అని చెప్పారు. "ఆడ అయినా మగ అయినా వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్ అనేది చేతులు, భుజాలు, పొట్ట, వీపు , కాళ్లు వంటి శరీర భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే చురుగ్గా ఉండరో, వారికి భవిష్యత్తులో ప్రతీ విషయంలోనూ సమస్యలొస్తాయి. చురుగ్గా ఉండని వారు ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకి వెయిట్ ట్రైనింగ్‌లో ముందుగా మొబిలిటీ అనేది చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుకాగా సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా నీతాతోపాటు, ఆమె కుమార్తె ఇషా , చిన్న కుమారుడు అనంత్ అంబానీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, వ్యాపారవేత్త, అనన్య బిర్లా, నటి శిల్పా శెట్టి, జాన్ అబ్రహం, రితేష్ దేశ్‌ముఖ్,ఆయుష్మాన్ ఖురానా ఇతర నటులు కొంతమందికి వినోద్ దగ్గర శిక్షణ పొందిన వారే కావడం విశేషం. -
అనారోగ్య మరణాల్లో.. పురుషులే అధికం!
పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోంది. అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఎయిడ్స్ వంటివాటితో అస్వస్థతకు గురై మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) తాజా అధ్యయనం తెలిపింది. ఆధిపత్య ధోరణి, ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం, వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా వెల్లడైంది. పురుషుల్లో అధిక ధూమపానం, మహిళల్లో ఊబకాయం, అరక్షిత శృంగారం ప్రధాన అనారోగ్య హేతువులని తెలిపింది. హెచ్ఐవీతో పాటు కరోనా సమయాల్లోనూ కూడా నివారణ చర్యలు మొదలుకుని రోగ నిర్ధారణ, చికిత్స వంటి అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు బాగా వెనుకబడి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. 200 దేశాల్లో అధిక రక్తపోటుకు తీసుకునే చికిత్సలో కూడా పురుషులు, మహిళల్లో చాలా వ్యత్యాసముంది. 56 శాతం దేశాల్లో ఎయిడ్స్, 30 శాతం దేశాల్లో మధుమేహం, 4 శాతం దేశాల్లో హై బీపీ రేటు పురుషుల్లోనే ఎక్కువగా ఉంది. 14 శాతం దేశాల్లో ఎయిడ్స్, ఐదు శాతం దేశాల్లో మధుమేహం, భారత్‌లో హై బీపీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి. 131 దేశాల్లో ఎయిడ్స్, 107 దేశాల్లో హై బీపీ, 100 దేశాల్లో మధుమేహ మృతుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ. ఎయిడ్స్‌తో 25 దేశాల్లో, డయాబెటిస్తో 9 దేశాల్లో, హై బీపీతో యూఏఈలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని అధ్యయనం తేల్చింది. వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స దిశగా పురుషులను ప్రోత్సహించడం, అందరికీ సమానంగా ఆరోగ్యం అందించే వ్యవస్థలను రూపొందించడం చాలా అవసరమని బ్రిటన్‌కు చెందిన గ్లోబల్ 50/50 సహవ్యవస్థాపకుడు కెంట్ బస్ తెలిపారు.(చదవండి: First Women Rescuer: ఆపదలో ఆమె సైతం..!) -
తలసేమియాపై ఖమ్మంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
ఖమ్మం, : ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా, తలసేమియా & సికిల్ సెల్ సొసైటీ (TSCS) ఖమ్మంలో అవగాహన మరియు సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 15 మంది పిల్లలకు వారి ధైర్యం మరియు విజయాలకు గుర్తింపుగా ఎక్సలెన్సీ అవార్డులు అందజేశారు. అలాగే, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల సమన్వయకర్తలందరినీ వారి అంకితభావ సేవలను గుర్తించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా రోగులు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రఘురామ రెడ్డి మాట్లాడుతూ... "తలసేమియా బాధితులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ వ్యాధిపై అవగాహన పెంచడం మరియు నిర్మూలన కోసం మేము కృషి చేస్తాము. ఈ సమస్యను పార్లమెంటులో కూడా లేవనెత్తుతాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వద్ద ఈ సమస్యను తప్పకుండా చర్చిస్తాం" అని ఎంపీ తలసేమియా బాధితులకు మద్దతును తెలియజేశారు.టీఎస్ సీఎస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రత్నవలి కొట్టపల్లి ఆధ్వర్యంలో, TSCS సిబ్బంది ప్రత్యేక సన్మానాలు చేశారు. దీంతో పాటు తలసేమియాతో బాధ పడుతున్న పిల్లలతో సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటలు మరియు ఆసక్తికరమైన కార్యక్రమాలను నిర్వహించారు. ఇవి తలసేమియా బాధిత కుటుంబాలకు సంతోషాన్ని నింపాయి.ఈ కార్యక్రమం గురించి శ్రీమతి రత్నవలి మాట్లాడుతూ... "TSCS తరపున నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వ్యక్తులు, సంస్థలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఖమ్మం మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిబద్ధతకు TSCS హృదయపూర్వక ప్రశంసలు తెలియజేస్తోంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయం చేసి, నిర్వహించిన డాక్టర్ ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో శ్రీ కిరణ్ మరియు శ్రీ శివరతన్ గార్లు చురుగ్గా పాల్గొన్నారు. వారి సహకారానికి TSCS తరఫున ధన్యవాదాలు." అని పేర్కొన్నారు. -
పగలబడి నవ్వేందుకు పది కారణాలు...
'సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా'..అంటున్నారు నిపుణులు. నవ్వు నాలుగు విధాల చేటు కాదు ఆరోగ్యం అని ఘంటాపథంగా చెబుతున్నారు. నవ్వడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే గాక ఒత్తిడి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖం సదా నవ్వుతూ ఉండే సంబంధబాంధవ్యాలు కూడా సానుకూలంగా ఉంటాయట. నిజానికి 'నవ్వు' వైజ్ఞానికంగా చాలా మంచిది అనే విషయాన్ని హైలెట్ చేస్తోంది. ఇలా ఎందుకు అంటున్నారంటే..నవ్వు ఆరోగ్యానికి ఎందుకు మంచిదంటే..రోగనిరోధక శక్తిని పెంచుతుంది - ఇది యాంటీబాడీల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది - నవ్వడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండి రక్తపోటును తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది - నవ్వు కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను తగ్గిస్తుంది, మరింత రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది.మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది - ఇది శరీరం సహజ అనుభూతిని కలిగించే రసాయనాలు అయిన ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది.సామాజిక బంధాలను బలపరుస్తుంది - నవ్వుతూ ఉంటే అందరు మనతో మాట్లాడటానికి, ఉండటానికి ఇష్టపడతారు. తద్వారా సమాజంలో ఇతరులతో మంచి సంబంధాలనే కుటుంబ సంబంధాలు కూడా బాగుంటాయి. ఆహ్లాదకరమైన సానుకూల వాతావరణాన్ని సొంతం చేసుకోవచ్చు. నొప్పిని తగ్గిస్తుంది - డోపమైన్ ఉత్పత్తిని ప్రేరేపించి..వివిధ రుగ్మతల నివారిణిగా పనిచేస్తుంది.సానుకూలతను ప్రోత్సహిస్తుంది - అంతేగాదు మనలో తెలియని కాన్ఫిడెన్స్ పెరిగి ఎలాంటి సవాళ్లనైనా సులభంగా అధిగమించగలుగుతారు. మానసిక ఆరోగ్యానికి మద్దతిస్తుంది - నవ్వు విశ్రాంతిని ప్రోత్సహించి ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది.ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది - గాఢమైన నవ్వు డయాఫ్రాగమ్‌కు మంచివ్యాయామంగా పని చేస్తుంది. పైగా శ్వాసక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది - ఎక్కువగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవిస్తారని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి.కావునా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వేద్దాం..చక్కటి ఆరోగ్యాన్ని పొందుదాం. ](చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..
వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతలు శరీరంలోని నీటిని ఆవిరి చేస్తుంటాయి. ఎన్నిసార్లు నీళ్లు తాగినా దాహం తీరదు. ఆకలిగానూ అనిపించదు. అలసట, నీరసంతో రోజంతా చికాకు. ఈ సమస్యలకు పరిష్కారం మన చేతిలోనే ఉందంటున్నారు పోషకాహార నిపుణులు సుజాతా స్టీఫెన్. ‘శరీరం త్వరగా డీ–హైడ్రేట్ అయ్యే కాలం ఇది. తినే పదార్థాల ఎంపిక సరిగా లేకపోతే జీర్ణవ్యవస్థ గాడి తప్పుతుంది. ఇలాంటప్పుడు... కూరగాయలతో చేసిన సలాడ్స్, సాంబార్, రసం.. వంటివి రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి.రెండు గంటలకు ఒకసారి గ్లాసుడు నీళ్లు, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి. అకస్మాత్తుగా తలనొప్పి, భావోద్వేగాలలో మార్పు, నీరసం, ఇరిటేషన్.. వంటివీ తలెత్తుతుంటాయి. దీనిని సైలెంట్ డీ–హైడ్రేషన్ సమస్యగా గుర్తించి నీళ్లు తాగి, కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. నిమ్మరసం, సబ్జా గింజలతో తయారు చేసుకున్న లస్సీ ఒంటికి మేలు చే స్తుంది. నిమ్మరసంలో షుగర్‌కు బదులు కొద్దిగా ఉప్పు, సోడా కలుపుకొని తాగచ్చు. మధుమేహులు ఒకేసారి ఎక్కువ మొత్తం తింటే, శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. అందుకని టైమ్ ప్రకారం ఏదో ఒకటి మితంగా తినాలి. గర్భిణులకు ప్రత్యేకంఈ కాలం గర్భిణులు ఏ కొంచెం తిన్నా ఆయాసం వస్తుంటుంది. ఇలాంటప్పుడు మసాలా ఉన్న ఆహారం కాకుండా పండ్లు, జ్యూసులు, సలాడ్స్ పైన దృష్టి పెట్టాలి. దీని వల్ల కడుపులో హెవీగా ఉన్నట్టు అనిపించదు. ఆయాసం సమస్య తలెత్తదు. వయసు పైబడిన వాళ్లు పగటివేళ ఎండగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి అయితే వెంట నీళ్లు, పండ్లు తీసుకెళ్లాలి. డీ హైడ్రేట్ అయితే బీపీ డౌన్ అయ్యి కళ్లు తిరిగి పడి΄ోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వారి వెంట మరొకరు తోడుండాలి. రీ హైడ్రేషన్ వేసవిలో యూరిన్ పసుపు రంగులో వస్తుందంటే శరీరంలో నీటిశాతం తగ్గిందని అర్ధం. రీ హైడ్రేషన్ కోసం నీళ్లు, నిమ్మరసం సరైన ఎంపిక. ఫ్లేవర్డ్, షుగర్ లెస్ మెడికేటెడ్ ఓఆర్ఎస్లను ఎంచుకోవచ్చు. ఇది మంచి సీజన్బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి సీజన్. వేడికి ఎక్కువ ఆహారం తినబుద్ది కాదు.. పండ్లు, కూరగాయలు, జ్యూస్, నీళ్లు ఎక్కువ తీసుకుంటాం. ఇదంతా లో క్యాలరీ ఫుడ్. దీనివల్ల బరువు సులువుగా తగ్గచ్చు. వాకింగ్, జాగింగ్, వ్యాయామాలకు ఉదయం వేళ ఎంచుకోవడమే మంచిది. వేసవిలో పార్టీలకు వెళ్లినప్పుడు తినే మసాలా ఫుడ్స్ మరుసటి రోజు కూడా ప్రభావం చూపుతుంది. పడుకునేటప్పుడు మజ్జిగ తాగితే అసౌకర్యం తగ్గుతుంది.కూల్ సలాడ్కీరా, దోస, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, క్యాప్సికమ్ వంటివి సన్నని ముక్కలుగా తరిగి, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి కలిపి సలాడ్ తయారు చేసుకోవాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి, రోజులో రెండు మూడుసార్లు తింటే, తేలికగా అనిపిస్తుంది. సొరకాయ జ్యూస్, పుదీనా, కొత్తిమీర షర్బత్‌లు, చట్నీలు, రాగి జావ వంటివి.. ఒంటికి మేలు చేస్తాయి.మాంసాహారులు తాజాగా తయారు చేసుకున్నవి, నూనె తక్కువగా ఉపయోగించినవి తీసుకోవాలి. – సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ (చదవండి: బుల్లితెర నటి అస్మిత హెల్తీ డైట్ ప్లాన్ ఇదే..! 20 ఏళ్లుగా..) -
ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్ చేసే యోగాసనం ఏదో తెలుసా?
వశిష్ఠాసనాన్నిసైడ్ ప్లాంక్ పోజ్ అని కూడా అంటారు. ఇది అథ్లెటిక్స్ చేసే వ్యాయామాలను పోలి ఉంటుంది. కాబట్టి శరీరానికి తగినంత చురుకుదనం లభిస్తుంది. శరీర బరువు బ్యాలెన్స్‌ను సరిచూసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగ పడుతుంది.ఎలా చేయాలంటే...మ్యాట్ పైన పడుకొని ఎడమచేతి వైపు తిరగాలి. తర్వాత ఎడమపాదం నుంచి కుడిమోకాలిని వంచి, ఎడమ చేతిని నేలకు ఆనించి శరీరాన్ని పైకి లేపాలి. బరువు మొత్తం చేతి మీద వేయడం సాధ్యం కాని వాళ్లు మోచేతి వరకు ఉంచాలి. కుడిచేతిని కుడి తుంటిపై ఉంచాలి. బరువు మొత్తం ఎడమ పాదం, ఎడమ చేతిపైనే ఉంటుంది కాబట్టిబాడీని బ్యాలెన్స్ చేయడం తప్పనిసరి. ∙తుంటి భాగాన్ని వీలైనంత పైకి ఎత్తి, కుడిమడమ నుండి తల వరకు శరీరాన్ని ఒక సరళ రేఖలోఉంచేలా దృష్టి పెట్టాలి. కనీసం 5 దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ, వదిలి ఉండగలగాలి.తర్వాత యధాస్థితికి వచ్చి, తిరిగి కుడివైపు ఇదే విధంగా చేయాలి. ప్రయోజనాలు... ఈ ఆసనం ద్వారా శక్తిస్థాయులు పెరుగుతాయి. కండరాలు, వెన్నుముక సమస్యలు తగ్గి బలం పెరుగుతుంది. శరీరానికి, మైండ్‌కి, కండరాలకు సమతుల్యత నిస్తుంది. ఛాతీ, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. ఎమోషషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇదీ చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..! -
వీగన్..వీగన్.. : ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!
‘ఒక వ్యక్తి మొక్కల ఆధారిత ఆహారాన్ని (plant-based food) ఎంచుకుంటే రోజుకు 1,100 గ్యాలన్ల నీటిని ఆదా చేసినట్టే. పది కేజీల కార్బన్ ఉద్గారాలను తగ్గించి భూమికి మేలు చేసినట్టే. ఒక జంతువు జీవితాన్ని కాపాడిన వారవుతారు. మీ భోజన ఎంపిక మీ ఆరోగ్యం గురించే కాదు, భూమిపైన జంతుజాలం నివసించడానికి, ఆరోగ్యకరమైన భూమి కోసం కూడా’ అంటున్నారు వీగన్ ప్రేమికులు. ‘ఉత్సాహంగా తినండి. ఉత్సాహంగా జీవించండి. ఉత్సాహంగా ఉండండి! పోషకాలతో ఉండండి, దయతో ఉండండి, ఆకుపచ్చగా ఉండండి!’ అనేది వీగన్ ప్రేమికుల మాట.మన ఆహారాల్లో శాకాహారం, మాంసాహారం గురించి తెలుసు. కొన్నాళ్లుగా వినిపిస్తున్నది వీగన్ (Vegan) ఆహారం. జంతు సంబంధిత ఆహారాలకు దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. వీటిలో.. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజలు మొదలైనవి ఉంటాయి. ‘వీగన్ డైట్ ఎంపికలో సవాళ్లెన్నో ఉంటాయి. ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి12 పోషకాల కోసం ఆహార ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఉడికించిన శనగలను తీసుకుంటే ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్.. వంటి ΄ోషకాలు లభిస్తాయి. శనగలను ఉడకబెట్టి, కూర లేదా సలార్ రూపంలో తయారుచేసి తీసుకోవచ్చు. సోయాబీన్స్‌లో మాంసాహారంతో సమానంగా ప్రొటీన్లు లభిస్తాయి. ఇందులోని ఐరన్, జింక్, క్యాల్షియం, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మహిళల్లో మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తాయి. వేరుశనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు,ఫైబర్ లభిస్తాయి. బరువును కంట్రోల్లో ఉంచడానికి సహకరిస్తాయి. ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నాక్వినోవాలో ప్రొటీన్ సమృద్ధిగా లభిస్తుంది. మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ బి6 వంటి ΄ోషకాలు మెండుగా ఉంటాయి. చిక్కుడు జాతికి చెందిన రాజ్మా, బ్లాక్ బీన్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ బి, ఫైబర్, ప్రొటీన్లు లభించే ఈ చిక్కుళ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదంపప్పు, పిస్తా, అక్రోట్ వంటి నట్స్ రోజూ కొన్ని తీసుకుంటే గుండెకు మేలు చేస్తాయి. నట్స్‌లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి మితంగా తీసుకోవాలి. ఇలా మొక్కల ఆధారిత గింజలు, మొలకెత్తిన విత్తనాలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. రుచికరంగా, ఆరోగ్యకరంగా జీవనశైలిని మార్చుకోవచ్చు.’– శారద, ప్లాంట్ప్రెన్యూర్, సిమీస్ వరల్డ్, హైదరాబాద్చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
సరికొత్త వెల్నెస్ ట్రెండ్ "ఫార్ట్ వాక్" అంటే ..? వైద్య నిపుణుల సైతం బెస్ట్..
ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతికత తోపాటు..సరికొత్త వెల్నెస్ ట్రెండ్లు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. పైగా ఇంట్లో వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ డైట్ మంచిది, ఇలా చేస్తే బెటర్ అంటూ ఎన్నెన్నో ఆరోగ్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మరో వెల్నెస్ ట్రెండ్ నెట్టింట సందడి చేస్తోంది. ఆఖరికి నిపుణులు సైతం చాలా మంచిదని చెబుతుండటం మరింత విశేషం. మరీ ఆ ట్రెండ్ ఏంటి..? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ అంటే.."ఫార్ట్ వాక్"(Fart Walk) అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్‌బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అట. తక్కువ శ్రమతో కూడిన ఆరోగ్య రహస్యమని అంటున్నారు. ఇంతకీ అసలు ఈ వాక్ ఎలా చేస్తారంటే..ఫార్ట్ వాక్ అంటే..భోజనం తర్వాత తేలికపాటి నడకనే ఫార్ట్వాక్ అంటారు. అంటే ఇక్కడ రాత్రిభోజనం తర్వాత తప్పనిసరిగా వాక్ చేయడంగా భావించాలి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యానికి సహాయపడుతుందట. ఈ ఫిట్నెస్ దినచర్య ప్రాథమిక లక్ష్యం జీర్ణక్రియకు సహాయపడటం, తీవ్రమైన వ్యాధులను నివారించడం అని రచయిత్రి స్మిత్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dr. Tim Tiutan | Internal Medicine (@doctortim.md) మనం ఫైబర్‌తో కూడిన భోజనం తీసుకుంటాం కాబట్టి గ్యాస్ సమస్య ఉత్ఫన్నమవుతుందట. అలాంటప్పుడు గనుక ఇలా ఫార్ట్ వాక్ చేస్తే.. ఆపానవాయువు నోరు లేదా కింద నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందట. జస్ట్ రెండు నిమిషాలు ఆ విధంగా నడిస్తే..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయని చెబుతున్నారు స్మిత్. కేన్సర్ వైద్యుడు డాక్టర్ టిమ్ టియుటన్ రచయిత్రి స్మిత్ సూచించిన ఫిట్నెస్ చిట్కాని సమర్థించారు. ఆమె చెప్పింది సరైనదేనని, నిజంగానే దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పారు. భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత - లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్‌ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సులిన్ సమస్య ఏర్పడదని అన్నారు. అలాగే మరో వైద్యుడు అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ డామన్ కూడా ఈ ఫిట్‌నెస ట్రెండ్‌కి మద్దుతిచ్చారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఆలస్యంగా నడక ప్రారంభిస్తే అప్పటికే పోషకాలు శోషించబడి రక్తంలో కలిసిపోతాయని, అలాగే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయని చెబుతున్నారు డామన్. కలిగే లాభాలు..కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి దీర్ఘాయువుని అందిస్తుందిఎలాంటి అనారోగ్యల బారినపడకుండా కాపాడుతుందివృద్దాప్యంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటేనే కాసేపు ఓ రెండడుగులు అటు.. ఇటు..నడిచి ఆరోగ్యంగా ఉందామా మరీ..!. (చదవండి: Summer Tips: ఏసీతో పనిలేకుండానే సహజసిద్ధంగా ఇంటిని చల్లగా మార్చేద్దాం ఇలా..!) -
స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!
ఇంతవరకు ఎందరో వెయిట్ లాస్ జర్నీలు ప్రేరణగా నిలిచాయి. ఒక్కోక్కరిది ఒక్కో నేపథ్యంతో బరువు తగ్గేందుకు ఉపక్రమించారు. అయితే వారంతా డైట్లు వర్కౌట్లతో బరువు తగ్గితే. ఈ బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా మాత్రం మందులతోనే బరువు తగ్గానంటూ కుండబబ్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. అందరు ఆ మందులు దుష్ప్రభావాలు చూపుతాయనే దుష్ప్రచారంతో వాడేందుకు జంకుతున్నారని, అందులో వాస్తవం లేదని మరీ చెబుతున్నారు. తాను ఆ మందులు వాడుతూనే ఎలా ఆర్యోకరంగా బరువు తగ్గారో కూడా వెల్లడించారు. ఇదేంటి మందుల వద్దనే అంటారు కదా నిపుణులు అనే సందేహంతో ఆగిపోకండి అసలు కథేంటో తెలుసుకోండి మరీ..!.బాలీవుడ్ నిర్మాత హన్సల్ మెహతా టెలివిజన్ షోలు తీస్తూ నెమ్మదిగా మంచి బ్లాక్‌బస్టర్ మూవీలు తీసి మంచి నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు. ఉత్తమ చలన చిత్ర నిర్మాతగా అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఆయన డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఓ పక్క అధిక బరువుతో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా. అయితే మెహతా బరువు తగ్గేందుకు తన ఆరోగ్య సమస్యల రీత్యా డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే మౌంజారో మందులను వాడానని అన్నారు. దానివల్లే బరువు తగ్గానని చెప్పారు. బరువు తగ్గాడానికి సెలబ్రిటీలు ఉపయోగిచే మౌజరోని తాను వాడానని మెహతా నిర్భయంగా చెప్పడమే గాక ఏకంగా పదికిలోలు తగ్గినట్లు తెలిపారు. అలాగే దీంతోపాటు సరైన జీవనశైలిని పాటించానని అన్నారు. అధిక ప్రోటీన్ భోజనం, చక్కెరను తగ్గించడం, మెడిటేరియన్ డైట్ వంటివి అనుసరించానని అన్నారు. ఆల్కహాల్ సేవించడం కూడా తగ్గించినట్లు తెలిపారు. సరైన జీవనశైలిని అనుసరించడం తోపాటు వర్కౌట్లు, అడదడపా ఉపవాసం, హైడ్రేటెడ్ ఉండేలా తగినంత నీరు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. దాంతో తన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయికి రావడమే గాక, ఇన్సులిన్ నిరోధకత తగ్గిందన్నారు. ఇప్పుడు యంగ్ ఏజ్‌లో వేసుకున్న పాత బట్టలు అన్ని సరిపోతున్నాయని ఆనందంగా చెప్పారు. ఆ మందులపై అపోహ ఎక్కువ..ఓజెంపిక్, మౌంజారో వంటి జీఎల్పీ-1 మందులు బరువు తగ్గడానికి పేరుగాంచినవి. కొద్దిమేర బరువుత తగ్గాలనుకునేవారికి, దీర్ఘకాలిక బరువుతో సతమతమవుతున్న వారికి ఇవి మంచివే అనేది నిపుణులు అభిప్రాయం. అయితే అనుసరించేటప్పుడు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణుల పరివేక్షణలోప్రారంభించాలట. ఇలాంటి వాడటానికి సిగ్గపడాల్సిన పనిలేదంటున్నారు మెహతా. అయితే వాటితోపాటు సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవలంభిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని చెబుతున్నారు. భారత్‌లో ఎలి లిల్లీ లాంఛ్ చేసిన ఈ ఔషధం మౌంజారో గేమ్-ఛేంజర్ కావచ్చని..భవిష్యత్తులో మరిన్ని సంచలనాలను సృష్టిస్తుందని చెబుతున్నారు నిపుణులు.Under medical guidance, I began Mounjaro to address rising blood sugar levels in the pre-diabetic range and to manage my steadily increasing weight. Paired with a committed lifestyle shift—high-protein meals, minimal sugar and alcohol, regular strength training, proper hydration,… pic.twitter.com/R0GnHuEcl7— Hansal Mehta (@mehtahansal) May 1, 2025గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..) -
Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?
ఓ మహిళ.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తితో.. జంతుబలి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మా ఇష్టం మాకు నచ్చింది మేం తింటాం.. అంటూ అవతలి వ్యక్తి సమాధానం ఇస్తున్నాడు. మాంసాహారం తింటాం అంటే కుదరదు.. ఎందుకు కుదరదో చెబుతాను వినండి.. అంటూ ఆమె శాకాహారం గొప్పతనం, మన సైక్లింగ్ ప్రకృతి నియమాలు ఇతర అంశాలను వివరించారు. మీరు ప్యూర్ వెజిటేరియన్‌గా మారతారా? అని హామీ తీసుకుంది. ఇంత చెప్పిన తర్వాత ఆ మనిషిలో ఆలోచన మొదలైంది. ఇంతకీ ఎవరా మహిళ.. ఆమె చేస్తున్న ప్రచారం ఏమిటి..? ఆమె పేరే విజయలక్ష్మి.. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ కార్పొరేట్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్. ప్రవృత్తి.. పది మంది గుమిగూడి ఉండే చోట శాకాహారంతో ప్రయోజనాలను వివరిస్తూ శాకాహారమే తినాలంటూ ప్రచారం చేయడం. ఎంతలా వారికి అవగాహన కల్పిస్తున్నారంటే ఆమె మాటలు విన్న తర్వాత చాలా మంది ఇక మాంసాహారం జోలికి వెళ్లకూడదని నిర్ణయం కూడా తీసుకుంటున్నారు. – సికింద్రాబాద్ శాకాహారంలో అనుభూతిని ఆస్వాదిద్దామా..? అంటూ మొదలవుతుంది ఆమె ప్రచారం. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం పేరుతో సోషల్ మీడియా వేదికగా ఓ పేజీ క్రియేట్ చేశారు. తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఆ వేదికపైకి రమ్మని పిలుపునిచ్చారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు.. అలా 200లకు చేరింది ఆ సంఖ్య. వీలున్నప్పుడల్లా పదిమంది జనం ఉండే చోట ప్రత్యక్షమవుతారు. శాఖాహారంలోని గొప్పతనాన్ని.. అది తీసుకోవడం వల్ల శరీర అవయవాల మీద పనితీరును.. ఇతర అంశాల్ని చక్కగా వివరించి మాంసాహారానికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ మాటలు విన్న ఎవరైనా క్చతంగా ఆకుకూరలు, కూరగాయలు గొప్పతనాన్ని ‘వంట’ పట్టించుకోవడం నిజం. పక్కా ప్రణాళికతో ప్రచారం.. యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం వ్యవస్థాపకురాలైన ఎన్వీ విజయలక్ష్మి పనితీరు చాలా ఆసక్తికరం. స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమైన వలంటీర్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారో తెలుసుకుంటారు. ఫలానా రోజు ఫలానా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ చిన్న పోస్టులు పెడతారు. ఆ ఏరియాలో ఉండే వలంటీర్లు.. అందుబాటులో ఉండే వారంతా సుముఖత వ్యక్తం చేస్తే వెంటనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేస్తారు. తక్కువలో తక్కువ కనీసం 50 నుం 60 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చూసుకుంటారు. అక్కడికి వచ్చిన వారంతా బృందాలుగా విడిపోయి నాలుగైదు ప్రదేశాలకు వెళ్లి తమ సంస్థ లక్ష్యాన్ని వివరిస్తారు.మారేందుకు మీరు సిద్ధమా..? సోషల్ మీడియా వేదికగా యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరంలో చేరాలని ఉందా? అయితే అదే పేరుతో ఉన్న ఫేస్బుక్, ఇస్ట్రాగామ్ పేజీల ద్వారా గానీ.. సభ్యులుగా చేరిపోవచ్చు. ఆ మీదట వలంటీర్లుగా సేవలు అందించవచ్చు. ఆ మీదట శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకొని మీరు శాకాహార ప్రియులుగా మారిపోవచ్చు. పాఠశాలలే టార్గెట్‌గా.. శాకాహారం వినియోగించాలనే ప్రచారాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలను టార్గెట్ చేసుకుని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. చదువుకునే వయసు నుంచే జంతువధ చేయకూడన్న లక్ష్యాన్ని విద్యార్థుల్లో ఇనుమడింపజేయడం ద్వారా ఎక్కువ ఫలితాలు రాబట్టవచ్చన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, పవర్‌పాయింగ్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం, కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా వీలున్న అన్ని మార్గాల్లో ప్రచారాలు కొనసాగించి శాకాహార భోజన ప్రియులను రూపొందిస్తున్నాం. పాఠశాలల్లో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం కమిటీలు ఏర్పాటు చేయడం, పోటీలు నిర్వహిస్తూ వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహిస్తున్నాం. – ఎన్వీ విజయలక్ష్మి, వ్యవస్థాపకురాలు దేశమంతా ఒకే వేదికగా.. యునైటెడ్ వెజిటేరియన్ ఫోరం అనేది ఒక తెలంగాణకు మాత్రమే కాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరింపజేసి.. వీలైనంత ఎక్కువ మంది జనాభాను శాకాహారం వైపు తిప్పటిమే తమ ధ్యేయమని చెబుతున్నారు విజయలక్షి్మ. ఆ దిశగా విస్తృతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పారామే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉండే తమ వాళ్ళ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఫోకస్ చేస్తున్నారు ఈ వెజిటేరియన్ విజయక్ష్మిఆరోగ్య సూత్రాలు వివరిస్తూఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించడానికి శాకాహారం పాత్ర ఏంటో యునైటెడ్ వెజిటేరియన్స్ ఫోరం ప్రతినిధులు వివరిస్తారు. ఎదుటివారు మాంసాహార ప్రియులైన వారు అడిగే ప్రశ్నలకి శాకాహార పూరితమైన సమాధానాలు ఇచ్చి వెజిటేరియన్స్‌గా మారాలంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఒక నెల రోజులు టైం తీసుకోండి.. పప్పు దినుసుల మీద దృష్టి పెట్టండి ఆకుకూరల్లో బలమైన పోషకాల కోసం మీరే తెలుసుకోండి.. మీరు తీసుకునే మాంసాహారాన్ని మేము చెప్పే శాకాహారాన్ని బేరీజు వేసుకోండి అంటూ జనం మెదడుల్లోకి శాఖాహార గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమేంటి చాలామందిని మార్చి చూపించారు కూడా.. -
పాతచీరలను అప్‌సైక్లింగ్ చేసి..స్టైలిష్‌గా మార్చేయండిలా..!
అప్ సైక్లింగ్ వార్డ్రోబ్లను చెక్ చేసుకుంటే కుప్పలుగా ఉన్న చీరలు, దుపట్టాలు కొన్నిచీరలు తమ పెళ్లినాటివి అయి ఉంటాయి. అమ్మ, అమ్మమ్మలు ఇచ్చిన జ్ఞాపకాల చీరలు సరేసరి మరికొన్నింటికి బ్లౌజ్‌లు పాతవయ్యావని పక్కన పడేసినవి కొన్ని... ఓల్డ్మోడల్ అయ్యాయని కొన్నిపక్కన పెట్టేసినవి ఉంటాయి.ఇలాంటి వాటన్నింటినీ ఈ సమ్మర్ రోజుల్లో కొత్తగా రూపు కట్టేలా ప్లాన్ చేయవచ్చు. మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్లను గమనిస్తూ కాలానుగుణంగా పాతచీరలను అప్‌సైక్లింగ్ చేసి, మీదైన కొత్తశైలిని వ్యక్తీకరించవచ్చు.అప్‌సైక్లింగ్ విధానం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యం ఇచ్చినవారం అవుతాం. వృధానూ అరికట్టవచ్చు.అంచులను మార్చి...అంచు ఉన్న కాటన్, పట్టుచీరలతో చేసిన ఇండోవెస్ట్రన్ మోడల్ డ్రెస్సులు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, ఆర్గంజా, నెటెడ్ చీరల నుండి అనార్కలీలు, లాంగ్ గౌన్లు, కుర్తీలు డిజైన్ చేయించవచ్చు. పట్టు, బ్రొకేడ్, బెనారస్ వంటి వాటితో ఓవర్ కోట్స్, లాంగ్ జాకెట్స్, పలాజోలు, స్కర్ట్లు డిజైన్ చేయవచ్చు.ప్యాచ్ వర్క్పల్లూ, లేదా అంచులు కొద్దిగా చిరిగిన చీరలకు చిరిగిన అంచును తీసివేసి, జరీ, సీక్వెన్స్, కుందన్ వర్క్ చేసిన ప్యాచ్‌వర్క్ అంచును జత చేసి, తిరిగి వాడచ్చు. పాతకాలం నాటి చీరలను సల్వార్ సూట్లుగా మార్చవచ్చు. చీర పల్లూని పైభాగానికి ఉపయోగించవచ్చు. అంచులను నెక్కి, చేతులకు వాడచ్చు. కాంట్రాస్ట్ ప్యాచ్‌వర్క్ బోర్డర్లనూ జత చేయవచ్చు. బాటమ్, దుపట్టా కోసం మరొక పాత చీరను ఉపయోగించవచ్చు.లాంగ్ గౌన్లువన్పీస్ లాంగ్గౌన్లు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటున్నాయి. అందుకని, పాతచీరను ఉపయోగించి లాంగ్ గౌన్‌ను తయారు చేయించుకోవచ్చు. అదనపు మెటీరియల్‌కి కాంట్రాస్ట్ కలర్ లేదా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్‌ను వాడచ్చు. చీరలను ఉపయోగించిన డ్రెస్సులనే కాదు, కటింగ్‌లో వృథాగా పడేసే ఫ్యాబ్రిక్‌తో ఫ్యాషన్ జ్యువెలరీనీ రూపొందించవచ్చు. ఇది ఇండోవెస్ట్రన్ వేర్కి ముఖ్యంగా వేసవిలో మరింత ఆధునిక అట్రాక్షన్‌ను అద్దుతుంది. (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు) -
పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు
పేరెంటింగ్ నియమాలు తరానికీ తరానికీ మారుతున్నాయి. కొత్త తరం పేరెంటింగ్‌లో చాలా ఫ్లెక్సిబుల్‌గా, ఎంçపతీతో ఉంటోంది. పిల్లలతో చాలా దృఢమైన బంధాన్ని కోరుకుంటోంది. పిల్లల ఎమోషనల్ వెల్ బీయింగ్ కోసం ఎటువంటి భయాలూ, బిడియాలూ లేకుండా తాము అనుకున్నది ధైర్యంగా కమ్యూనికేట్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. పిల్లల స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే రోల్‌మోడల్ పేరెంటింగ్ రూల్ పాటించాలనుకుంటున్నారు. యాభైఏళ్ల కిందట పేరెంటింగ్‌లో క్రమశిక్షణ అనే పదం వీర విహారం చేసేది. నాన్న ఇంట్లో ఉంటే పిల్లల అల్లరి వినిపించకూడదు, పుస్తకం పట్టుకుని కనిపించాలి. నాన్న ప్రశ్నిస్తే వినయంగా సమాధానం చెప్పాలి. నాన్న ఎదుట పడాలంటే భయం. ఈ చట్రంలో పెరిగిన తరం, ఆ తర్వాతి తరం ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు. ఈ జెన్ జెడ్ పేరెంట్స్ తమ పిల్లల విషయంలో భౌతికపరమైన క్రమశిక్షణ పాటించడం కంటే తల్లిదండ్రుల మాట మీద విశ్వాసం, అర్థం చేసుకోవడం దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇంటి నిండా బొమ్మలే!జెన్ జెడ్ పేరెంట్స్ తమ బాల్యంలో ఎదురైన సంఘటనలను బేరీజు వేసుకుంటూ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదోననే నియమావళిని రూపొందించుకుంటున్నారు. బాల్యంలో తాము నొచ్చుకున్న సందర్భాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ పిల్లల మనసు గాయపరచకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు. ఇందులో విపరీతమైన షాపింగ్ ఒకటి. గత తరం పేరెంట్స్ చేతిలో డబ్బు పరిమితంగా ఉండేది. ఇప్పుడు డబ్బు పుష్కలంగా అందుతోంది. రోజువారీ శ్రామికుల కుటుంబాలు కూడా తమ రాబడిలో ఎక్కువ భాగాన్ని సరదాలకు ఖర్చుపెడుతున్నాయి. అప్పట్లో ఏడాదికో రెండేళ్లకో ఒక బొమ్మ కొనిస్తే... ఇప్పుడు ప్రతి ఇంట్లో పాతిక–ముప్పై బొమ్మలకు తక్కువ కాకుండా షెల్ఫ్‌లు నిండిపోతున్నాయి. పిల్లలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసే క్రమంలో ‘నో’ చెప్పడాన్ని ప్రోత్సహిస్తున్న జెన్ జెడ్ పేరెంటింగ్ పిల్లలకు తాము కూడా ‘నో’ చెప్పవచ్చనే సంగతి మర్చిపోతున్నారు. ఇక మగపిల్లలు ఏడవకూడదనే సామాజిక షరతును ప్రశ్నిస్తున్న మనస్తత్వ నిపుణులు ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వండి’ అంటున్నారు. కాలం మారుతున్న క్రమంలో వస్తున్న మార్పులివన్నీ. ‘మగపిల్లలను కూడా ఏడవనివ్వాలి, వారిలోని సున్నితత్వాన్ని పరిరక్షించాలి’ అని చెబుతున్న న్యూజెనరేషన్ పేరెంటింగ్ దానిని అమలు చేయడంలో మాత్రం తార్కికతను కోల్పోతోందన్నారు ట్రాన్స్పర్సనల్ హోలిస్టిక్ కోచ్ అర్పితాగుప్త. సంతోష క్షణాలు!ఈ తరంలో దాదాపుగా అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. పేరెంట్స్ కూడా తమ బిడ్డ ఆడుకోవడానికి అక్క,చెల్లి, అన్న, తమ్ముడు లేని బాల్యాన్ని మిగిల్చామని అర్థం చేసుకుంటున్నారు. తోబుట్టువులు లేని లోటు తీర్చడం కోసం పిల్లలతో తల్లులే కాదు తండ్రులు కూడా చక్కగా ఆడుకుంటున్నారు. వారిని ఆటల్లో ఎంగేజ్ చేయడానికి తగినంత సమయం కేటాయిస్తున్నారు. వాళ్లు పెద్దయిన తర్వాత బాల్యాన్ని గుర్తు చేసుకుంటే తల్లిదండ్రులతో ఆడుకున్న తీపి జ్ఞాపకాలు గుర్తు వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పిల్లల మెదళ్లలో విరిసిన ఆలోచనను చక్కగా వ్యక్తం చేయగలిగేటట్లు ప్రోత్సహిస్తున్నారు. పిల్లల ఆలోచనలను, ఆకాంక్షలను కొట్టిపారేయకుండా తగిన ప్రాధాన్యతనిస్తున్నారు. పిల్లల కెరీర్ విషయంలోనూ వారి అభిరుచులను సమాజం గిరిగీతలను పట్టించుకోకుండా స్వాగతిస్తున్నారు. మొత్తంగా చూస్తే తమ బాల్యంలో తమకు కలలుగానే ఉండిపోయిన అన్నింటినీ తమ పిల్లలకు అందిస్తున్నారు. ఒక్క మాటలో చె΄్పాలంటే పిల్లల బాల్యంలో తామను తాము ప్రతిక్షేపించుకుంటున్నారు. తమకు దక్కని సంతోషాలను చాలా ఎక్కువగా అందించాలని తపన పడుతున్నారు. ఆదర్శవంతమైన పేరెంటింగ్‌కి ప్రతిరూపాలుగా ఉండాలని అభిలషిస్తున్నారు. ఆచరణలో ఒకింత సమతుల్యత, సమన్వయం అలవరుచుకుంటే జెన్ జెడ్ పేరెంటింగ్ రోల్ మోడల్ పేరెంటింగ్ అవుతుంది.ఓ ఆశ్చర్యకరమైన సంఘటనఅది మహారాష్ట్రలో ఓ పర్యాటక ప్రదేశం. నడిరోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించి΄ోయింది. ఏం జరిగిందో చూద్దామని కొందరు తమ వాహనాలు దిగి ముందుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు, 30 ఏళ్లుంటాయి, తన కారును చూసుకుంటూ బిగ్గరగా ఏడుస్తున్నాడు. ‘ఏమైంది’ అని అడిగారెవరో. కారు మీద పడిన గీతలు చూపిస్తూ మళ్లీ భోరుమన్నాడతడు. అది అతడికిష్టమైన కారు, ముచ్చటపడి కొనుక్కున్న కారని చెప్పి వెక్కిళ్లు పెడుతున్నాడు. అతడి తల్లిదండ్రులు కారు లోపల ఉన్నారు. ‘మా అబ్బాయి చాలా సున్నితమనస్కుడండీ. తనకిష్టమైన కారుకి గీతలు పడితే భరించలేక΄ోతున్నాడు’ అన్నారు వాళ్లు సమర్థింపుగా. మగవాళ్లు ఏడవకూడదని బాల్యంలోనే మైండ్‌ని కండిషన్ చేసే పెంపకం ఒకప్పటిది. ఎమోషన్స్సకి లింగభేదం ఉంటుందా అని ఏడుపు వచ్చినప్పుడు అన్ కండిషనల్‌గా ఆ ఎమోషన్ని వ్యక్తం చేయవచ్చనే వాదన నేటిది. అయితే పైన చెప్పుకున్న కండిషన్లో ఆ కుర్రాడి కారణంగా ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ట్రాఫిక్‌లో ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఎమోషన్స్‌ని ఆపుకోలేక కోపాన్ని ప్రదర్శిస్తే పరిస్థితి విషమిస్తుంది. పరిణతి చెందిన వాళ్లం కొంతమందిమి కలగచేసుకుని ‘కారు పక్కకు తీసుకుని, ఎమోషన్ కంట్రోల్ అయిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించండి’ అని సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చిందని చెబుతున్నారు అర్పితాగుప్తా, హోలిస్టిక్ కోచ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: -
నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
‘‘నా ఉదయం వేడి వేడి మసాలా టీతో మొదలవుతుంది. ఆ ఎనర్జీతో మొదలయ్యాక రోజంతా అదే ఉత్సాహం, శక్తితో ఉండటానికి నాకు సరిపడే ఆరోగ్యవంతమైన డైట్‌ని తీసుకుంటాను’’ అని రెజీనా కాసాండ్రా పేర్కొన్నారు. హీరోయిన్గా పలు భాషల్లో సినిమాలు చేస్తూ... బిజీ బిజీగా ఉండే రెజీనా కాసాండ్రా డైట్ విషయం లో స్ట్రిక్ట్‌గా ఉంటానంటున్నారు. కానీ వారంలో ఒక్కరోజు మాత్రం ‘చీట్ డే’ అని నవ్వేశారు. ఇక ఆ రోజు ఆయిల్ అని, ఫ్యాట్ అని నియమాలేం పెట్టుకోకుండా అన్నీ తింటానన్నారు. ఇంకా రెజెనా చెప్పిన విశేషాలు ఈ విధంగా... ఉదయం మసాలా టీ తాగిన కాసేపటికి అల్పాహారానికి మొలకలు, బాదంలాంటి డ్రై ఫ్రూట్స్ (పొట్టు తీసినవి), పండ్ల రసం తీసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ బాగా తినాలి. అందుకే వీటితోపాటు ఇడ్లీ, దోసె తింటాను. సాంబార్ కాంబినేషన్ ఉండాల్సిందే. మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇస్తాను. బీన్స్, క్యారెట్, ఇంకా ఉడికించిన కూరగాయలు, పప్పు తప్పకుండా ఉండాల్సిందే. అన్నంతోపాటు ఇవన్నీ తింటే ఇటు కార్బోహైడ్రేట్స్ అటు ప్రోటీన్ రెండూ అందుతాయి. బ్రౌన్రైస్ని ప్రిఫర్ చేస్తాను. మన రోజుని మనం హెవీ బ్రేక్‌ఫాస్ట్‌తో మొదలుపెట్టి, రాత్రి వరకూ క్రమ క్రమంగా తగ్గించుకుంటూ తినాలి. డిన్నర్ ఎంత లైట్ అయితే అంత బెటర్. అందుకే నేను సూప్ లాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను. ఇప్పటివరకూ చెప్పినది ఒక రోజులో తీసుకునే డైట్ అయితే నా వారం ప్లాన్ ఎలా ఉంటుందంటే... వారంలో ఒక రోజంతా కేవలం పండ్ల రసాలతోనే సరిపెట్టేస్తాను. ఒక రోజంతా పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు పోతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఇలా మలినాలను పోగొట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే రెండు వారాలకోసారి కలబంద గుజ్జు తింటాను. దీనికోసం పొట్ట ఖాళీగా ఉంచుకుంటాను. అలా ఎమ్టీ స్టమక్‌తో తింటేనే మంచిది. కలబంద గుజ్జు చర్మానికి నిగారింపుని ఇస్తుంది. ఇక ఒకేసారి కాకుండా రోజు మొత్తంలో కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతుంటాను. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్‌కి నేను దూరం. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే... ఎక్సర్సైజ్లు చేయడటం, ఆహారం విషయంలో నియమాలు పాటించడం వంటివి స్లిమ్‌గా ఉండటం కోసమే కాదు... ఆరోగ్యంగా ఉండటం కోసం కూడా. సన్నగా ఉండాలని కడుపు మాడ్చుకున్నా ప్రమాదమే. అందుకే చక్కగా తినాలి... వ్యాయామాలు చేయాలి. అప్పుడు ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంటాం’’ అంటూ ముగించారు రెజీనా.నేను, యోగా వేరు కాదని అనుకుంటాను. అంతలా యోగాని ఇష్టపడతాను. నేను ఫిట్ అండ్ ఫైన్‌గా ఉండటానికి యోగా ఓ కారణం. సూర్య నమస్కారాలతో మొదలుపెట్టి, భుజంగాసనం, సర్వాంగాసనం... ఇలా చాలా చేస్తాను. అలాగే ఇతర వ్యాయామాలు కూడా చేస్తుంటాను. నా ఎక్సర్సైజ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే... ఒకరోజు అప్పర్ బాడీ చేస్తే తర్వాతి రోజు లోయర్ బాడీ వర్కవుట్స్ చేస్తాను. – డి.జి. భవాని(చదవండి: -
Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
రక్తశాలి బియ్యం దాని ప్రత్యేకమైన ఎరుపు రంగు, గొప్ప పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యాభిలాషులైన వినియోగదారులకు దీని విలువ తెలుసు. సాంప్రదాయకంగా దీన్ని కేరళలోని వయనాడ్ జిల్లాలోని సహజమైన, జీవవైవిధ్య వాతావరణంలో పెంచుతారు. ఇది తరచుగా ఈ ప్రాంతపు వ్యవసాయ వారసత్వానికి హ్నంగా చెబుతుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు ప్రకృతి వ్యవసాయ దారులు పండిస్తున్నారు. రక్తశాలి అనే పేరు సంస్కృత పదం నుం వచ్చింది. ‘రక్త’ అంటే రక్తం. ‘శాలి’ అంటే బియ్యం. రక్తశాలి జిగురు లేనిది. గ్లూటెన్ సెన్సిటివ్ వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. దాని అధిక పోషక, ఔషధ లక్షణాల కారణంగా ఆరోగ్య ప్రయోజనాభిలాషులకు ఇది చాలా విలువైనది.విశేష పోషకాలురక్తశాలి పోషకాలతో కూడిన ఆహారం. వంద గ్రాముల ముడి బియ్యం.. 363.49 కిలో కేలరీల శక్తిని అందిస్తుంది. ్ర΄ోటీన్ (8.96 గ్రా.), పిండి పదార్ధం (71.18 గ్రా.), కొవ్వు (4.77 గ్రా.), జింక్ 15.75 మి.గ్రా., ఐరన్ (0.99 మి.గ్రా.) కలిగి ఉంటుంది. ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ కింది ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాల నిపుణులు చెబుతున్నారు.రక్తశాలి బియ్యాన్ని పాలిష్ చేయకుండా ముడి బియ్యం వండుకొని తింటారు. ఇది ముఖ్యంగా రక్తహీనత ఉన్న మహిళలకు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ఇది రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దీన్ని ఆహారంగా తీసుకుంటుంటే రక్తం హెచ్చుతగ్గులను స్థిరంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది.అంకితభావంతో కూడిన సేంద్రియ/ప్రకృతి రైతుల సంరక్షణలో సాగవుతున్న అరుదైన రకాల్లో ఇదొకటి. ఆయుర్వేదంలో శరీర త్రిదోషాల(వాత, పిత్త, కఫ) సమతుల్యం చేయగలదన్న గుర్తింపు పొందింది. కాలేయం, మూత్రపిండాలు, నాడీ రుగ్మతలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుందని, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీన్ని సిఫార్సు చేస్తున్నారు.110 రోజుల ఖరీఫ్ పంటరక్తశాలి వరి పంట ప్రధానంగా కేరళలో వర్షాధార వ్యవసాయంలో సాగవుతోంది. సేంద్రియ పద్ధతుల్లో, పర్యావరణహిత పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జూన్/జూలై నుండి నవంబర్/డిసెంబర్ వరకు ‘శాలి’ సీజన్లో పండిస్తారు. దాదాపు 110 రోజుల పంట. జాగ్రత్తగా నీటి నిర్వహణ అవసరం. అయితే, అననుకూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని దిగుబడి నిస్తుంది. సారవంతమైన ఎర్ర ఒండ్రు నేలల్లో రక్తశాలి వరి బాగా పెరుగుతుంది. తగినంత వర్షపాతంతో కూడిన ఉష్ణమండల తేమ వాతావరణం దీనికి అనువైనది. అధిక నాణ్యత గల స్థానికంగా సాగయ్యే రక్తశాలి విత్తనాలను ఎంచుకుంటే మంచి దిగుబడి రావటంతో పాటు తెగుళ్ళు, పురుగుల బెడద ఉండదు. ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయిఔషధ విలువలు, పోషకాల కారణంగా రక్తశాలి బియ్యానికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, దీని సాగు విస్తృతం కాక΄ోవటానికి అనేక సవాళ్లు ఆటకంగా ఉన్నాయి. రక్తశాలి సాగు, వినియోగం పెరగడానికి ఎదురవుతున్న సవాళ్లు... ఈ సవాళ్లలో నాణ్యమైన విత్తనాల లభ్యత ఒకటి. విత్తన బ్యాంకులు లేదా కమ్యూనిటీ విత్తన నిధుల ఏర్పాటు ద్వారా రక్తశాలి వంటి అపురూప దేశీ విత్తనాల లభ్యతను పెంచవచ్చు. ఖర్చులు తగ్గించడానికి, నాణ్యమైన విత్తనాలను అందించేందుకు రైతుల విత్తన సహకార సంఘాలను ప్రోత్సహించాలి. రక్తశాలి దిగుబడి ఇతర రకాలతో పోల్చితే తక్కువ. ఈ కారణంగా, సేంద్రియ వ్యవసాయంలో అధిక శ్రమ వల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి పోషక, ఔషధ గుణాలు పోకుండా చూసుకుంటూనే దిగుబడి పెంచేందుకు పరిశోధనలు చేపట్టాలి. సేంద్రియ బియ్యం నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్థానిక రైతులతో బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఎక్కువ మంది రైతులు రక్తశాలి బియ్యాన్ని సాగు చేసి విక్రయించేలా ప్రోత్సాహకాలు లేదా సబ్సిడీలను అందించాలి. కొత్త సాగుదారులకు ఉత్తమ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. పంట ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ పనులను సహకార సంఘాలు లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం లేదా అనుసంధానించడం ద్వారా సాగును విస్తరింపచేయవచ్చు. రక్తశాలి బియ్యంతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు సాధారణ ప్రజలకు బాగా తెలియక΄ోవటం లేదా అర్థం చేసుకోకపోవటం వల్ల వినియోగం తక్కువగా ఉంది. సోషల్ మీడియా, స్థానిక ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణులను ఉపయోగించి ఔషధ పోషక ప్రయోజనాలను హైలైట్ చేస్తూ అవగాహన ప్రచారం ప్రారంభించడం అవసరం. వర్క్‌షాప్‌లు, సెమినార్లు లేదా స్థానిక సంతలు నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి.స్థానిక వంటకాల్లో రక్తశాలి బియ్యాన్ని వాడేలా ప్రోత్సహించేలా వంటల ఉత్సవాలు నిర్వహించాలి. ఈ బియ్యంతో తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించే ఆహార ఉత్సవాలను నిర్వహించాలి. మార్కెటింగ్ గొలుసులను, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను అన్వేషించడం ద్వారా మార్కెటింగ్‌ను మెరుగుపరచవచ్చు. రక్తశాలి బియ్యానికి సేంద్రియ ధృవీకరణ కల్పిస్తే సాగుదారులు ప్రీమియం మార్కెట్లలో అధిక ధర పొందేందుకు సహాయపడుతుంది.మరో విశేషం ఏమిటంటే...ఇది కండగల ఎర్ర నేలల్లో వర్షాధారంగా, సేంద్రియంగా సాగుకు అనువైనది. అయితే, దిగుబడి తక్కువ. కేవలం మహిళల ఆరోగ్యంకోసమైనా దీన్ని తిరిగి మన పంట పొలాల్లోకి, మన వంటిళ్లలోకి, పళ్లాలోకి తెచ్చుకోవటం అత్యవసరం. దిగుబడి పెంచే పరిశోధనలు చేపట్టాలి. అయితే, ఔషధ గుణాలు ΄ోకుండా చూడాలి. రక్తశాలి సాగును ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ పథకాల ద్వారా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా నేరుగా దేశంలో మహిళలందరికీ అందేలా చెయ్యాలి!చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో ఇన్ని వేలు పెరిగిదా? కొందామా? వద్దా?ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!విటమిన్లు: మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు (బి విటమిన్లు వంటివి), ఖనిజాలు (ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటివి) రక్తశాలి బియ్యంలో ఉన్నాయి.అధిక ఫైబర్: రక్తశాలి బియ్యంలో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. కడుపు నిండిన భావనను కలిగించటం ద్వారా శరీర బరువు నిర్వహణలో సహాయపడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు: అధిక సాంద్రతలో ఎరుపు రంగు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.తక్కువ గ్లైసెమిక్ సూక: ఇది తెల్ల బియ్యం కంటే తక్కువ గ్లైసెమిక్ సూకను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.గుండె ఆరోగ్యం: ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.గ్లూటెన్–ఫ్రీ: గ్లూటెన్ అసహనం లేదా సెలియాక్ వ్యాధి ఉన్న వ్యక్తులకు ఇది ఒక గొప్ప వరం. సురక్షితమైన, పోషకాలతో కూడిన బియ్యం. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వృద్ధాప్యపు ఛాయలు కనపడకుండా సహాయపడతాయి.రోగనిరోధక శక్తి: రక్తశాలి బియ్యంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి.రక్త వృద్ధి: రక్తశాలి బియ్యం రక్త వృద్ధిని మెరుగుపరుస్తుంది. రక్తహీనత ఉన్న మహిళలకు వరప్రసాదం వంటిది. రక్తం స్థాయిని స్థిరీకరించడానికి లేదా నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది. రక్తశాలి బియ్యం రక్తంలో చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ముగింపురక్తశాలి అనేది స్వదేశీ వరి రకం. ఔషధగుణాలు, పోషకాంశాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఇప్పటికీ సాధారణ ప్రజలకు అంతగా తెలియదు. అందువల్ల ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేయాలి. రైతులు, పరిశోధకులు, విధాన రూపకర్తలు ఉమ్మడిగా పనిచేసి దీన్ని మళ్లీ వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.రక్తశాలి అద్భుతమైన అధిక పోషక, ఔషధ గుణాలున్న పురాతన వరి వంగడం. పేరుకు తగ్గట్టే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది రక్తశాలి బియ్యపు గింజ. అంతేకాదు, రక్తహీనతను పారదోలటంతో పాటు రక్తం తగ్గి΄పోకుండా స్థిరీకరించగలిగిన అద్భుత గుణం రక్తశాలి సొంతం. రక్తహీనతకు గురయ్యే మహిళలకు ఇది చక్కటి ఆరోగ్యవంతమైన పరిష్కారం. ముడి రక్తశాలి బియ్యం తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. చాలా రకాల వరి బియ్యంలో ఉన్నట్లు ఇందులో గ్లుటెన్ లేదు. గ్లుటెన్ ఇన్టాలరెన్స్ / సెలియక్ వంటి ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది వరం. -
మండే ఎండలు : కిడ్నీలో రాళ్లు, పెరుగుతున్న కేసులు, బీ అలర్ట్!
హైదరాబాద్ తెలంగాణలో వేసవి ముదురుతోంది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) తన నివేదికలో తెలిపింది. డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, విపరీతంగా ఎండల్లో తిరగడం వల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల సమస్యతో రావడంతో వారికి ఏఐఎన్‌యూల చికిత్సలు చేస్తున్నారు. వేసవి అంటేనే “స్టోన్ సీజన్” అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీలకు చాలా ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా శరీరంలో నీరు ఆవిరి అయిపోవడం, ఉప్పు ఎక్కువగా తినడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వేసవిలో కిడ్నీలలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి.ప్రధానాంశాలు: రోజుకు సగటున 300 నుంచి 400 వరకు కిడ్నీలో రాళ్ల కేసులు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇది బాగా ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది. జంక్ ఫుడ్ తినడం, ఎక్కువగా కదలకపోవడం, తగినంత నీరు తాగకపోవడంతో పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువవుతోంది. 10-17 సంవత్సరాల మధ్య పిల్లల్ల రాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు నీళ్లు తాగకపోవడం, స్నాక్స్ ప్యాకెట్లు కొని తినడం, కూల్ డ్రింకులు తాగడం దీనికి కారణం. పురుషులతో పోలిస్తే మహిళలకు ఈ సమస్య కొంత తక్కువే (సుమారు 40% తక్కువ). కానీ, గర్బవతులుగా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చి, గుర్తించకపోతే ముప్పు ఎక్కువ. పిల్లల్లో ఈ సమస్య వల్ల దీర్ఘకాలంలో వారి కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.ఈ సందర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ తైఫ్ బెండెగెరి మాట్లాడుతూ, “కిడ్నీలో రాళ్ల కేసులు ఈసారి అసాధారణంగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వేడి పెరిగిపోవడం, తగినంత నీరు తాగకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. పాఠశాలకు వెళ్లే పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వారికి ఈ కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ అవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రాళ్ల సమస్య కేవలం పెద్దవాళ్లది అనుకోకూడదు. పిల్లల తల్లిదండ్రులతో పాటు పాఠశాలలు కూడా దీనిపై అవగాహన పొందాలి. తగినంత నీళ్లు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, సమస్యను త్వరగా గుర్తించడం వల్ల చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా.. వేసవి నెలల్ల ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి” అని సూచించారు.జాగ్రత్తగా ఉండండిలా...తగినన్ని నీళ్లు తాగాలి. మూత్రం స్పష్టంగా, లేతరంగులో ఉండేలా చూసుకోవాలి.ఉప్పు, ప్రాసెస్డ్ ఆహారం, జంతువుల కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా పిల్లల్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ చిరుతిళ్లు, కూల్ డ్రింకుల వాడకం మానేయాలి.స్కూల్లో ఉన్నప్పుడు, ఇళ్ల దగ్గర కూడా తగినన్ని నీళ్లు తాగేలా చూడాలికుటుంబంలో ఎవరికైనా గతంలో కిడ్నీ రాళ్లు ఏర్పడితే మరింత జాగ్రత్తగా ఉండాలి.ఎప్పటికప్పుడు కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు కారణం లేకుండా కడుపునొప్పి రావడం, తరచు మూత్ర విసర్జనకు ఇబ్బంది పడడం లాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులకు చూపించాలి. తగినన్ని నీళ్లు తాగడం చాలావరకు ఈ సమస్యను దూరం పెడుతుంది. -
Bone Fractures: కట్టుకట్టినా సెట్టవ్వలేదా..?
అది రోడ్డు ప్రమాదాలు గానీ, ఇంట్లో ఎత్తు నుంచి పడిపోవడంగానీ బాత్రూమ్లో జారిపడటం గానీ జరిగినప్పుడు మొదట అందరూ అడిగేది... ఎవరివైనా ఎముకలు విరిగాయా అని. ఇంగ్లిష్‌లో ఫ్రాక్చర్ అని పిలిచే ఈ ఎముకలు విరిగినప్పుడు ఆపరేషన్‌తో విరిగిన ఎముకల్ని దగ్గర చేయడం, ప్లేట్స్ వేయడం, సిమెంట్ కట్టు వేసి అతికించడానికి ప్రయత్నించడం వంటి వైద్య ప్రక్రియల్ని అనుసరిస్తూ ఉంటారు. విరిగిన ఎముకల్ని దగ్గరగా వచ్చేలా సెట్ చేసినప్పుడు చాలామందిలో సరిగ్గా అతుక్కునే ఎముకలు కొందరిలో అంతగా సెట్ కాకపోవచ్చు. దాంతో ఎముకలు సరిగా సెట్ కాలేదనీ, అతుక్కోలేదనీ కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి కేసులనే ఫెయిల్యూర్ ఆర్థోపెడిక్స్ అని సాధారణ ప్రజలు చెబుతున్నప్పటికీ... వాస్తవానికి ఇలా సరిగా సెట్ కాని సందర్భాల్లో దీన్ని ‘నాన్ యూనియన్ ఆఫ్ ఫ్రాక్చర్’గా చెబుతున్నారు. ఇలా సరిగా అతకనప్పుడు ఎముకలు ఉన్న సదరు అవయవం సరిగా పనిచేయకపోవడం, నొప్పి రావడంతో పాటు కొన్నిసార్లు ఆ కండిషన్ ప్రాణాంతకం కావడం అనే ముప్పు కూడా రావచ్చు. ఇలా ఎముకలు సరిగా అతకని సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సల వంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. వాటంతట అవే అతుక్కునే ఎముకలు...విరిగిన ఎముక సరిగా అతకకపోవడం జరిగినప్పుడు అందుకు కారణాలూ, అందులో ఇన్వాల్వ్ అయిన అంశాలూ ఎన్నో ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ఎముక రెండుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చలేకపోతే (సెట్ చేయలేకపోతే) ఆ కండిషన్‌ను ‘ఇన్‌సఫిషియెంట్ రిడక్షన్’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో విరిగిన ఎముక చక్కగా అతకదు. ఫలితంగా పూర్తిగా, సరిగా నయం కాదు. ఆ పరిస్థితినే ‘నాన్‌యూనియన్’ అంటారు.ఏదైనా ఎముక విరిగినప్పుడు వాటిని సరిగా అమర్చి పెట్టి అలా కాలానికి వదిలేస్తే అవి వాటంతట అవే కుదురుకుని చక్కగా అతుక్కునే శక్తిని ప్రకృతి ఎముకకు ఇచ్చింది. అందుకే విరిగిన ఎముకను సరిగా సెట్ చేసి (అమర్చి) అలా వదిలేస్తే కాలం గడిచే కొద్దీ ఎముక దానంతట అదే నయమవుతుంది. ఇందుకు కావల్సినదల్లా ఆ విరిగిన ఆ ఎముక ముక్కల్ని సరిగా కూర్చడం / పేర్చడంలో నైపుణ్యమే. అయితే కొన్ని సందర్భాల్లో కాస్తంత ప్రత్యేక శ్రద్ధ, కొద్దిపాటి చికిత్స మాత్రం అవసరమవుతాయి. అందుకే చాలా సందర్భాల్లో అత్యంత నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స జరగకపోయినా ఎముకలు కుదురుకుంటాయి. ఎముకకు ఉన్న ఈ గుణం మూలానే కొన్నిచోట్ల సంప్రదాయ వైద్యం పేరిట ఎముకలను సెట్ చేసేవారూ ఎముకల్ని అతకగలుగుతుంటారు. తనంతట తానే అతుక్కునే సామర్థ్యం ఎముకకు ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల అవసరం ఎందుకు అవసరమంటే... విరిగిన ఎముకలకు కట్టు కట్టి పూర్తిగా సెట్ అయ్యేందుకు వదలాలంటే విరిగిన ప్రదేశంలో అవి సరిగా అమరేటట్లుగా ఉంచడమన్నది చాలా ప్రధానం. ఇది సరిగా జరగక΄ోతే విరిగిన ఎముక సరిగా (ఖచ్చితంగా) అతుక్కోకపోవచ్చు లేదా నయం కావడమన్నది చాలా ఆలస్యంగా జరగవచ్చు. ఇలా ఎముక అతుక్కోవడంలో జాప్యం జరిగితే దాన్ని ‘డిలేయ్డ్ యూనియన్’ అంటారు. ఈ పరిస్థితిని కొందరు ఎదుర్కొంటారు. ఇక కొందరిలో ఎముక సరిగా అతకనే అతకదు. ఈ పరిస్థితిని ‘నాన్ యూనియన్’ అంటారు.డిలేయ్డ్ యూనియన్ / నాన్ యూనియన్‌కు కారణాలుఎముక విరిగిన చోట కణజాలం కూడా తీవ్రంగా దెబ్బతినడం. ఎముక విరిగిన చోట మృదు కణజాలానికి కోలుకోలేనంత నష్టం జరగడం. ఎముక సరిగా అతకని ప్రాంతానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం. ఎముక సరిగా అతకని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ రావడం. విరిగిన ఎముకను తగినంత సేపు కదలకుండా ఉంచక΄ోవడం, స΄ోర్టు తగినంతగా లభించక΄ోవడం (ఇన్‌సఫిషియెంట్ స్ప్లింటేజ్). రెండు ఎముకలు అతుక్కునేలా తగినంత ఒత్తిడి (కంప్రెషన్) కలిగించక΄ోవడం (ఒక ఎముక మరో ఎముకపై జారకుండా ఉండేలా... ఒకదానితో మరొకటి సరిగ్గా అమరిపోయేలా లేదా కలిసిపోయేలా ఉపయోగించే గరిష్ఠ ఒత్తిడిని కంప్రెషన్ అంటారు). ఎముక అతుక్కోకపోవడానికి కారణాలుఎముక అసలే అతుక్కోక΄ోవడాన్ని నాన్‌యూనియన్ అంటారు. సాధారణంగా ఆలస్యంగా అతుక్కోడానికి కారణమయ్యే అంశాలే ఎముక అసలు అతుక్కోక΄ోవడానికీ చాలావరకు కారణం కావచ్చు. దానితోపాటు మరికొన్ని కారణాలూ ఉండవచ్చు. అవేమిటంటే... ∙క్యాలస్ బ్రిడ్జ్ ఏర్పడకపోవడం : రెండు ఎముకలు అతికించేందుకు దగ్గర చేసినప్పుడు వాటి మధ్య కొంత గ్యాప్ రావడం. దీని గురించి ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే... టూ లార్జ్ స్పేస్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ క్యాలస్ బ్రిడ్జ్‌గా దీన్ని పేర్కొంటారు... అంటే ఎముక అతుక్కునే ముందర రెండు ముక్కల మధ్య ఒక బ్రిడ్జ్‌లాంటిది ఏర్పడుతుంది. దాన్నే ‘క్యాలస్ బ్రిడ్జ్’ అంటారు. గ్యాప్ రావడం వల్ల అది ఏర్పడదు. ఇంటర్΄ పొజిషన్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ : అతుక్కోవాల్సిన రెండు ఎముకల మధ్య మృదుకణజాలం అడ్డుగా రావడం వల్ల ఎముక అతుక్కోదు. ఇలా జరగడాన్ని ఇంటర్పొజిషన్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ గా పేర్కొంటారు. అవసరమైన పరీక్షలు విరిగిన ఎముక సరిగా అతుక్కుందా లేక సరిగా అతుక్కోలేదా లేదా అతుక్కునే ప్రక్రియ ఆలస్యం అవుతోందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఎక్స్–రే పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్స రహిత విధానాలుఇందులో సర్జరీ లేకుండానే క్యాల్షియమ్ సప్లిమెంటేషన్ ఇవ్వడం, తొడుగులు వంటి ఉపకరణాలను అమర్చడం వంటి ప్రక్రియలను అవలంబిస్తారు. చికిత్సఎముకలు సరిగా అతుక్కోకపోవడం లేదా ఆలస్యంగా అతుక్కోవడం వంటి సమస్య ఎదురైనప్పుడు అందుకు కారణమైన అంశాలను చూడాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఎముక అతుక్కోవడంలో ఆలస్యం జరిగినప్పుడు ఎముక పెరిగేలా బోన్‌గ్రాఫ్ట్ వంటి ప్రక్రియలను కూడా అవలంబించాల్సి రావచ్చు. శస్త్రచికిత్సఎముక సరిగా అతకని చోట బాధితులకు అవసరమైన శస్త్రచికిత్సను చేయడం. ఎముకలు అతకని పరిస్థితి నివారణ ఇలా... ఇక ఎముక సరిగా అతకకపోవడం వంటి పరిస్థితిని నివారించడానికి... ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే... ఎముక ఫ్రాక్చర్ అయిన వ్యక్తికి పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తప్పనిసరిగా మానేయాలి. డాక్టర్ చెప్పిన చికిత్స ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలి. అన్ని పోషకాలు అందేలా అన్ని ΄ోషకాలు ఉన్న ఆహారాన్ని వేళకు తింటుండాలి. పొగతాగేవారు, స్థూలకాయులు, మధుమేహం (డయాబెటిస్) సమస్య ఉన్నవారిలో నాన్–యూనియన్‌కు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉంటూ డాక్టర్ చెప్పే అని సూచనలనూ పాటించాల్సి ఉంటుంది.అతుక్కోని భాగాలు ఏవంటే...నిజానికి శరీరంలోని ఏ ఎముక అయినా సరిగా అతుక్కోక΄ోవడానికి ఆస్కారం ఉంది. అయితే మన శరీరంలో కొన్ని ఎముకలు మాత్రం ఒకపట్టాన అతుక్కోకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకు పలు అంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు మిగతా ఎముకలతో ΄ోలిస్తే ఆ ఎముకలకు రక్తసరఫరా సరిగా ఉండక΄ోవడం వంటివి. అందుకే ఆ ఎముకల విషయంలో తరచూ ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎముకలు లేదా ఫ్రాక్చర్లు ఏవంటే... లాటెరల్ కాండైల్ హ్యూమరస్ ఫ్రాక్చర్: మోచేతిలో బయటవైపు ఉండే ఎముక విరిగితే దాన్ని లాటరల్ కాండైల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అంటారు. ఇది సరిగ్గా అతుక్కోవడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు.ఫీమోరల్ నెక్ ఫ్రాక్చర్: తుంటి ఎముకలో తొడలో ఉండే కాలి ఎముక సరిగ్గా ఓ గిన్నెలాంటి భాగంలో బంతిలా కూర్చుంటుంది. ఈ బంతికీ, మిగతా ఎముకకూ మధ్య ఉండే సన్నటి భాగం (నెక్) విరిగినప్పుడు అది అంత త్వరగా సెట్ కాకపోవచ్చు. ఫిఫ్త్ మెటాటార్సల్ (జోన్స్ ఫ్రాక్చర్)అరికాలిలో ఉండే ఎముకల్లో ఒకటైన ఈ ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు అతుక్కోవడం ఒకింత కష్టం కావచ్చు.టాలస్ ఫ్రాక్చర్‌చీలమండ ఎముకల మధ్య ఉండే ఎముకకు అయిన ఫ్రాక్చర్. స్కేఫాయిడ్ ఫ్రాక్చర్‌మణికట్టుపై బరువు పడినప్పుడు అయిన ఫ్రాక్చర్లు. సరిగా అతుక్కోకపోవడమన్నది చాలా కొద్దిమందిలోనే... ఫ్రాక్చర్ అయినవాళ్లలో కేవలం ఒక శాతం కేసుల్లోనే ఎముక అసలు అతుక్కోక΄ోవడం (నాన్–యూనియన్) జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితి చాలావరకు కాళ్ల ఎముకల విషయంలోనే ఎక్కువ. ఎందుకంటే కాలి ఎముక విరిగాక మళ్లీ కాళ్లు కదిలించాల్సి వచ్చినప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కండిషన్ పునరావృతమయ్యే అవకాశాలెక్కువ. ఎముక సరిగా అతకకపోయినా (నాన్‌యూనియన్‌లోనైనా) లేదా ఆలస్యంగా అతికినా (డిలేయ్డ్ యూనియన్‌లో) కనిపించే సాధారణ లక్షణాలివి... ఎముక విరిగిన చోట (ఫ్రాక్చర్ ప్రాంతంలో) నొప్పి తగ్గక΄ోవడం లేదా అదేపనిగా నొప్పి వస్తుండటం. ఎముక విరిగిన శరీర భాగాన్ని మునుపటిలా ఉపయోగించలేక΄ోవడం. ఎముక ఫ్రాక్చర్ అయిన చోట వాపు (స్వెల్లింగ్) రావడం. విరిగిన ఎముకకు సంబంధించిన కీలు (జాయింట్)ను కదల్చలేక΄ోవడం. విరిగిన ఎముక సరిగా అతుక్కోక కాస్త అటు ఇటు కదులుతుండటం. విరిగిన ఎముకలు అతుక్కోవడంలో ఎదురయ్యే సమస్యలివి... విరిగిన ఎముక నయమయ్యే సమయంలో ఇతరత్రా అనేక సమస్యలు ఎదురుకావచ్చు. అసలు ఒక ఎముక అతుక్కోనేలేదని ఎప్పుడు చెప్పవచ్చంటే... ∙మూడు నుంచి ఆర్నెల్ల తర్వాత కూడా విరిగిన ఎముక అతుక్కోకుండా ఉంటే దాన్ని ఎముక అతుక్కోవడంలో ఆలస్యం (డిలేయ్డ్ యూనియన్)గా చెప్పవచ్చు. ఒకవేళ ఆర్నెల్ల తర్వాత కూడా అతుక్కోకపోతే దాన్ని ‘నాన్‌యూనియన్’గా పేర్కొనవచ్చు. ∙ఒక చోట ఎముక అతకడంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతోందంటే అక్కడ ఎముక అతుక్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్థం. జాప్యం తీవ్రంగా ఉందంటే దాన్ని కొంతమేర అతకని ఎముక (నాన్‌యూనియన్)గానే పరిగణించాల్సి ఉంటుంది. ∙రెండుగా విరిగిన భాగాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోయినప్పటికీ అది సరిగా ఖచ్చితమైన రీతిలో కూర్చినట్లుగా అతుక్కోక΄ోతే దాన్ని ‘మాల్‌యూనియన్’ అంటారు. సాధారణంగా ఎముక సరిగ్గా రెండు ముక్కలుగా విరిగినప్పుడు దాన్ని సరిగా కూర్చుండబెట్టినప్పుడు సరిగానే అతుక్కుంటుంది. అయితే కొన్నిసార్లు దెబ్బ చాలా బలంగా పడి కొన్ని ఎముక విరిగిన చోట ముక్కలుగా అయి΄ోవడం వల్ల అతికించే ప్రక్రియలో ఖచ్చితంగా కూర్చలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దాని వల్ల ఎముక నిడివి కాస్త తగ్గవచ్చు. దీన్ని ‘ఇన్‌సఫిషియెంట్ రిడక్షన్’గా పేర్కొంటారు. పైన వివరించిన పరిస్థితులు ఏవైనప్పటికీ విరిగిన ఎముక సరిగా అతకక΄ోయినా లేదా అతుక్కోవడంలో ఆలస్యం జరిగినా బాధితులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. డాక్టర్ బాలవర్థన్ రెడ్డిసీనియర్ కన్సల్టెంట్‌ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: ఎనర్జిటిక్ హేమంగి..! న్యూక్లియర్ సైన్స్‌లో..) -
Rich Man's Disease: అరటి పండ్లు తిన్నారంటే ఇలా..!
ఇదేం వ్యాధి ఆ పేరేంటీ.. అనుకోకుండి. కేవలం ధనవంతులకే వచ్చే వ్యాధా..? అంటే..ఔననే అంటున్నారు నిపుణులు. ధనవంతులు, వారి జీవనశైలి, అలవాట్ల కారణంగా వస్తుంది కాబట్టి దీన్ని Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని అంటారు. ఇంతకీ ఏంటా వ్యాధి..? ఎలా నయమవుతుంది అంటే..బాగా డబ్బున్న వ్యక్తులు(Rich Man's )తీసుకునే మాంసం, పానీయాలు, ప్రత్యేక కూరగాయాలు తదితరాల కారణంగా వచ్చే వ్యాధి కావడంతో Rich Man's Disease(ధనవంతుల వ్యాధి) అని పిలుస్తారు. ఆర్థరైటిస్ మరో రూపామైన గౌట్ వ్యాధిని ఇలా పిలుస్తారట. కీళ్లల్లో తరుచుగా బొటనవేలు దిగువన తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపులతో ఇబ్బంది పెడుతుంటుంది. ఆ ప్రదేశం అంతా చాలా సున్నితంగా ఉండి కొంచెం తాకిన నొప్పితో విలవిలలాడినట్లుగా ఉంటుంది. ఇది ఒకరమైన ఆర్థరైటిస్‌గా చెబుతుంటారు నిపుణులు. ఎందువల్ల వస్తుందంటే..గౌట్ శరీరంలో యూరిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఇది కీళ్లలో సూది లాంటి స్ఫటికాలు ఏర్పడటానికి దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ పెరుగుదల గౌట్‌కు ఎలా కారణం అంటే..కొన్ని ఆహారాలు, పానీయాలలో కనిపించే ప్యూరిన్లు అనే రసాయనాలను విచ్ఛిన్నం కావడంతో యూరిక్ యాసిడ్ ఉత్ఫన్నమవుతుంది. అదీగాక శరీరం కూడా సహజంగా యూరిక్ యాసిడ్‌ను తయారు చేస్తుంది. ఫలితంగా శరీరంలో అదనపు యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం మొదలై గౌట్‌కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలు సాధారణంగా రక్తం నుంచి యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి, మూత్ర విసర్జన రూపంలో బయటకి పంపించేస్తుంది. అయితే శరీరం అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్‌ని ఉత్పత్తి చేస్తే.. మూత్రపిండాలను దాన్ని బయటకు పంపించలేకపోతాయి. ఫలితంగా ఆ యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో కీళ్లల్లో ఏర్పడతాయి. ఆ పదునైన స్ఫటికాలు కారణంగా నొప్పి, వాపు ఇతర సమస్యలు ఉత్ఫన్నమై గౌట్ వ్యాధి వస్తుంది. గౌట్ సంకేతాలు, లక్షణాలు..గౌట్ అటాక్స్ చాలా బాధాకరంగా ఉంటుందితీవ్రమైన, భరించలేని నొప్పిరంగు మారడం లేదా ఎరుపుదనంకీళ్ల దృఢత్వంవాపు తేలికపాటి స్పర్శకు కూడా తట్టుకోలేని సున్నితత్వంవెచ్చదనం, లేదా కీలు మండుతున్నట్లుగా అనిపించడంఏ ఆహారాలు గౌట్‌కు కారణం అంటే..ప్యూరిన్లతో నిండిన ఆహారాన్ని తినడం లేదా త్రాగడం వల్ల గౌట్‌కు దారితీసే అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చక్కెర పానీయాలు, డెజర్ట్‌లు.కార్న్ సిరప్ ఇది అన్ని ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల్లోనూ ఉంటుందిఆల్కహాలిక్ పానీయాలలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుందిహెర్రింగ్, స్కాలోప్స్, మస్సెల్స్, కాడ్ ఫిష్, ట్యూనా, ట్రౌట్, హాడాక్ వంటి సముద్రపు చేపల్లోరెడ్మీట్నివారణ..ఆహారంలో మార్పులను సూచిస్తారు వైద్యులు. తక్కువ ప్యూరిన్ ఆహారాన్ని అనుసరించడం ద్వారా సమస్య తగ్గుతుంది. నిపుణులు పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లను తినాలని సిఫార్సు చేస్తారు. ఇది మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్‌ను విసర్జించడానికి సహాయపడుతుంది. అలాగే, అరటిపండ్లు విటమిన్ సి పవర్‌హౌస్. ఇది రక్తంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ కూడా. అలాగే, అరటిపండ్లతో పాటు నారింజ, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, కివి స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, చెర్రీస్, ఆపిల్స్, పైనాపిల్స్ వంటి వాటిల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి గౌట్ వ్యాధిని అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించాలి. (చదవండి: 'గ్రానీ' అభిరుచులే ట్రెండ్ అంటున్న యువత..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
తొందర తొందరగా లాగించేస్తున్నారా? అయితే లావైపోతారు!
వేగం..వేగం..అంతా స్పీడ్ యుగం. మల్టీ టాస్కింగ్.. పనులు ఎంత వేగంగా చేసుకుంటూ పోతే అంత మంచిది. నెమ్మదిగా నత్తనడకన చేస్తానంటే కుదరదు. అంతా ఫాస్ట్. పనులు చక్క బెట్టుకోవడం వరకు ఓకే కానీ.. ఆహారం విషయంలో వేగం అస్సలు పనికి రాదు. ఆహారాన్ని త్వరగా, ఆదరాబాదరగా మింగేయడం వల్ల వల్ల అనేక రకాల రోగాలొచ్చే ప్రమాదం ఉంటుంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. నిజమేనా. నమ్మశక్యంగా లేదు కదూ, అసలు ఎలాంటి అనర్ధాలు వస్తాయో చూసేద్దాంఅన్నం గానీ, ఇంకేదైనా ఆహారాన్నిగానీ నెమ్మదిగా ప్రశాంతంగా, బాగా నములుతూ తినడం అనేది ఉత్తమం. ఆహారం నమ్మిలే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇలా లాలాజలంతో కలిపి మింగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. లేదంటే త్వర, త్వరగా అన్నం తినడం వల్ల అతిగా తినడం బరువు పెరిగే అవకాశం ఉంది. అవును నిజమే. ఎందుకంటే గబా గబా తినడం వల్ల ఎంత తింటున్నాము అనేది అంచనా ఉండదు. కడుపు నిండిన సంకేతాలను మెదడు అంత తొందరగా నమోదు చేయకపోవచ్చు.త్వరగా తినడం వల్ల తీసుకునే కేలరీల సంఖ్యంగా బాగా పెరుగుతుంది. ముఖ్యంగా రైస్ వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో కలిపి ఉన్నప్పుడు, కాలక్రమేణా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.ఆహారం నమలకుండా ఆబగా తినేయడంతోపాటు, కొంతమంది వెంటనే నీరు తాగుతూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇదీ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కొవ్వు పేరుకు పోతుంది. అందువల్ల ఆహారాన్ని నోటిలోని మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి.పూర్తిగా నమలకుండా తినడం వల్ల జీర్ణసమస్యలొస్తాయి. అజీర్తి కడుపు ఉబ్బరంతోపాటు, గట్ హార్మోన్ల పని నెమ్మదిస్తుంది. వేగంగా మింగడం వల్ల ఆహారంతోపాటు, గాలిని (సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో) ఎక్కువగా మింగే అవకాశం ఉటుంది. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. వుక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది.చాలా వేగంగా తినడం వల్ల తినే ఆహారం రుచిని పూర్తిగా ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాం.అంతేకాదు ఆత్రంగా భోజనం తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి పెరిగిపోతుంది. ఆహారంలోని గ్లూకోజ్ ఎక్కువ స్థాయిలో రక్తంలో కలిసిపోతుంది. దీంతో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వేగంగా తినే వారు మెటబాలిక్ సిండ్రోమ్‌ను కలిగి ఉంటారు. దీని వల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశం 23 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నమాట.భోజనం చేసే సమయాల్లో శుచిగా, శాంతంగా వ్యవహరించాలని, ప్రశాంత చిత్తంతో ఉండాలని కూడా పెద్దలు చెప్పేమాట. చివరగా .. కూటికోసంమే కోటి విద్యలన్నట్లు..కూర్చుని భోజనం చేయడానికి 20 నిమిషాలు కేటాయించడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది. ఒక పథకం ప్రకారం పనులు చేసుకుంటూ, ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు సమయాన్ని కేటాయించు కోవాలి. అనసరంగా సమయాన్ని వృధా చేసే పనులనుపక్కన బెట్టి శ్రద్ధగా, రుచిని ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి. -
కుప్పలు తెప్పలు : రెట్టింపైన ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం
అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముంబైలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గడం లేదు. వాటర్ బాటిళ్లు, ఆయిల్ బాటిళ్లు, ఫినాయిల్, బాత్రూంలు శుభ్రంచేసే యాసిడ్, ఇతర రసాయనాల బాటిళ్ల వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. వివిధ అవసరాలకు వాడి పారేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లవల్ల పర్యావరణానికీ హాని జరుగుతోంది. 2023తో పోలిస్తే 2024లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. 2023లో 67 లక్షల కేజీల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం జరగ్గా అదే 2024లో ఏకంగా 1,42,23,000 కేజీలకు చేరుకుంది. దీన్ని బట్టి రెట్టింపునకుపైగా ప్లాస్టిక్ వినియోగం జరిగినట్లు స్పష్టమవుతోంది. వన్ టైం యూజ్ బాటిళ్లే ఎక్కువ.. ముంబైలోని వివిధ చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను బట్టి ఇందులో అధికంగా ఒకసారి వినియోగించే (వన్ టైం యూజ్) బాటళ్లే అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో వివిధ రకాల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, తినుబండారాల పార్శిల్ ప్యాకింగులు ఉన్నాయి. ఒకప్పుడు గల్లీలలొ, ఫూట్‌పాత్‌లపై, రోడ్ల పక్కన, ఖాళీ మైదానాలలో బీఎంసీ ఏర్పాటుచేసిన కుండీలలో చెత్త అధికంగా కనిపించేది. కానీ ఇప్పడు అదే చెత్త కుండీలలో ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇలా చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను నిర్వీర్యంచేసి మళ్లీ కొత్తగా తయారుచేయడానికి వీలున్న బాటిళ్లను బీఎంసీ పారిశుద్ధ్యం విభాగం సిబ్బంది పోగు చేస్తున్నారు. బాటిళ్లతోపాటు భోజనం చేసే ప్లేట్లు, నీటి గ్లాస్లు, స్పూన్లు, పార్శిల్ కంటైనర్లు, స్ట్రాలు, కప్‌లు, సంచులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఏ మాత్రం తగ్గలేదు. 2023లో నిర్వీర్యం చేసి మళ్లీ వినియోగించే వీలున్న 85–90 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించగా అదే 2024లో 96.6 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. అదే 2022లో 67,12,557 కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ముంబైలో ప్రçస్తుతం చెత్త నిర్వీర్యం చేసే 48 కేంద్రాలు పని చేస్తున్నాయి. ముంబైలో రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. పొడి చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, కార్డు బోర్డులు, థర్మకోల్, పుట్ట బాక్స్‌లు, గాజు బాటిళ్లు, పాత దుస్తులు, ఈ–చెత్త ఉంటున్నాయి. 2024లో 6,15,513 కేజీల ఈ–చెత్త పోగుచేశారు. ఇందులో థర్మకోల్ కూడా అధికంగా ఉంది. ఇదిలాఉండగా 2005 జూలై 26వ తేదీన ముంబైలో వచి్చన వరదల్లో 200 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అప్పట్లో వరదలకు ప్రధాన కారణం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగమేనని తేలింది. దీంతో తేరుకున్న బీఎంసీ 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. ఆ తరువాత 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్టాస్టిక్ క్యారీ బ్యాగులు తయారుచేసే కంపెనీలపై, నిల్వచేసే గోడౌన్లపై, విక్రయించే వ్యాపారులపై వినియోగదారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలో 833 మంది విక్రయించే వ్యాపారులు, వినియోగదారుల నుంచి 3,148 కేజీల ప్టాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.41.70 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రస్తుతం ప్లాస్టిక్ తయారు, విక్రయం, వినియోగించే వారిపై అంతగా చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా దాడులు చేసి కంపెనీలకు సీలు వేయడం, విక్రయించే వ్యాపారులు, వినియోగించే సామాన్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగం భారీగానే జరుగుతోంది. -
ఓపెన్ జిమ్: కసరత్తు.. ఆరోగ్యం మా సొత్తు!
జీవనశైలి మారింది. మారుతున్న కాలంతో పాటు జీవనంలో వేగం పెరిగింది. దీంతో అలసట, ఒత్తిడి అధికమైంది. ఆహార పానీయాలు తీసుకోవడంలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. దీంతో ఎన్నో వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి. వాటిని అధిగమించడానికి వ్యాయామం తప్పనిసరైంది. అందుకు ఓపెన్ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అక్కన్నపేట(హుస్నాబాద్): జిమ్‌లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయకుండా గ్రామాల్లోనే ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో దాదాపు అన్ని గ్రామాల్లో ఓపెన్ జిమ్‌లను నిర్మించారు. వాటి నిర్మాణానికి సుమారు రూ.5లక్షలు కేటాయించారు. మండలంలో 31 గ్రామాలు ఉండగా ఇటీవల మరో ఆరు గ్రామాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం మొత్తం 37 గ్రామాలు ఉన్నాయి. అందులో సగానికిపైగా గ్రామాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. జిమ్‌లను ఉదయం, సాయంత్రం వినియోగించుకొంటున్నామని, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిమ్‌ల ఏర్పాటు విషయంలో చొరవ తీసుకొన్న మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని స్థానికులు చెప్పారు. కొత్త అనుభూతి బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన జిమ్‌లలో కసరత్తు చేయడం కొత్త అనుభూతిని కలిగిస్తుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ప్రైవేటు జిమ్‌లకు వెళ్లే స్తోమతలేని పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ జిమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతి రోజు వ్యాయామం చేయడంతో ఫిట్నెస్తో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకొంటున్నారు. -
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మంచి ఆరోగ్యం కోసం తినాల్సిన వాటి గురించి సదా ఆరోగ్య నిపుణులు ద్వారా వింటుంటాం. అయితే అవి మన వల్ల కాదని, ఇష్టం లేదనో లేక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పక్కన పెట్టేస్తాం. కానీ కొన్ని రకాల నట్స్ మాత్రం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని మన డైట్లో భాగం చేసుకుంటే చాలామటుకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాంటి వాటిల్లో ఒకటి బాదంపప్పు. బరువుతగ్గేందుకు, వ్యాధినిరోధక శక్తిని పెండచడంతో దీనికి సాటి మరొకటి లేదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవో పరిశోధనాత్మకంగా వివరించి చెప్పారు. అవేంటంటే..!.గుండె ఆరోగ్యం: ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ, డయాస్టొలిక్ రక్తపోటును కొద్దిగా తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. బరువు నిర్వహణ: రోజూ కనీసం 50 గ్రాముల బాదం తీసుకుంటే బరువు పెరగమని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి హెల్ప్ అవుతుందని అన్నారు. గట్‌హెల్త్: బాదం ప్రయోజనకరమైన గట్ బాక్టీరియాను పెంచుతుంది. జీవక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది.బ్లడ్ షుగర్: బాదం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీస్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవేగాక బాదంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పోషకాలు అధికంగా ఉన్నందున రోజవారి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం తమ అధ్యయనాలు బాదం ప్రయోజనాలను బలంగా హైలెట్ చేశాయని అందువల్ల ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ డైట్లో భాగం చేసుకోవాలని సూచించారు. ఇక వాటి పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు నిపుణులు.(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు) -
సలుపుతున్న రాచపుండు!
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఇది ఇప్పుడు చిన్నవయసు వారిని సైతం బలితీసుకుంటుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ కేన్సర్(టీఆర్సీ).. అంటే పొగాకు వినియోగించే వారివని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 20–25 ఏళ్ల యువతనూ పట్టిపీడిస్తోందంటున్నారు. పొగాకు తీసుకోవడం ప్రారంభించిన 10–20 ఏళ్ల తర్వాత కేన్సర్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రతీ ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అవుతోందని, దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు.ఒత్తిడితో ప్రమాదమే..మానసిక ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో శరీరంలో వ్యాధి నిరోరధకశక్తిపై తీవ్రప్రభావం చూపి కొన్ని రకాల హర్మోన్లు లోపిస్తాయి. దీంతో కూడా కేన్సర్ బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు..ఏటా కరీంనగర్ జిల్లాలో వందల మంది కేన్సర్‌తో చనిపోతున్నారు. దురలవాట్లు, జీవనశైలిలో మార్పుతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. పురుషుల్లో నోటి, వివిధ రకాల కేన్సర్లు వస్తుండగా, మహిళల్లో రొమ్ము, సర్విక్ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కేన్సర్ నిర్ధారణ, చికిత్స అందుబాటులో ఉన్నాయి.నోటి కేన్సర్‌కు కారణాలు..పురుషుల్లో స్మోకింగ్, స్మోక్లెస్ టొబాకో వినియోగం ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. బీడీ, సిగరేట్తోపాటు నాన్ స్మోకింగ్ టొబాకోలో పాన్ మసాలా, తంబాకు, గుట్కా, ఖైనీ తినడం, ఆల్కహాల్ తాగడం వంటివి కారణమవుతున్నాయి. పొగాకు 14 రకాల కేన్సర్లకు కారణమవుతోంది. దీని పొగలో కనీసం 80 రకాల కేన్సర్ కారకాలు(కార్సినోజెనిక్ ఏజెంట్లు) ఉంటాయి. పొగను పీల్చినప్పుడు రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. రక్త ప్రవాహంలోకి వెళ్లి శరీరమంతా విస్తరిస్తాయి. అందుకే ఊపిరితిత్తులు, నోటి కేన్సర్లు మాత్రమే కాకుండా ఇతర రకాలు కూడా వస్తాయి. మహిళలు బాధితులవడం ఆందోళన కలిగిస్తోంది.అందుబాటులో టీకా..కేన్సర్ దరిచేరకుండా వ్యాక్సిన్(టీకా) అందుబాటులో ఉంది. 9 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు హెచ్‌పీవీ రెండు డోసుల్లో వేసుకోవాలి. 21ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు.రొమ్ము కేన్సర్‌కు..ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతీ లక్ష మంది మహిళల్లో 35 మంది రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. జన్యులోపాలు, వంశపారంపర్యం, ఇన్ఫెక్షన్లు, రొమ్ములో గడ్డలు ఏర్పడడం, ఆధునిక జీవనశైలి, సంతానలేమి, 12 ఏళ్లలోపు రజస్వల అవడం, 55 ఏళ్ల కన్నా ముందుగానే రుతుక్రమం ఆగిపోవడం ఇందుకు కారణం. వ్యాధి నిర్ధారణ పద్ధతులున్నా అవగాహన లేక చివరిదశలో బాధితులు వైద్యులను సంప్రదిస్తున్నారు.ఇలా గుర్తించండి..నోటి, రొమ్ము, సర్విక్ కేన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. రొమ్ములో గడ్డలు ఏర్పడితే మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. మలం, యూరిన్‌లో రక్తం, తెల్లబట్ట, ఎర్రబట్ట, ఒక్కసారిగా బరువు తగ్గితే.. సర్విక్ కేన్సర్‌గా భావించి హెచ్‌పీవీ డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి స్క్రీనింగ్ చేసుకోవడంతో ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే వీలుంటుంది. నోటి ఆల్సర్లు, దగ్గితే రక్తం పడడం, బరువు తగ్గడం లక్షణాలు కనిపిస్తే నోటి కేన్సర్ పరీక్ష చేయించాలి.‘ఆరోగ్య మహిళ’ వరం ఆరోగ్య మహిళ కార్యక్రమంలో అన్నివ్యాధులకు నిర్ధారణపరీక్షలతోపాటు ముఖ్యంగా కేన్సర్ స్క్రీనింగ్‌పై దృష్టి పెడుతున్నాం. మహిళలకు బ్రెస్ట్, సర్వికల్, గర్భాశయ, ఇతర కేన్సర్లు ఉంటే మేం చేసే పరీక్షల్లో ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో చికిత్స సులభమవడమే కాకుండా కేన్సర్ నిర్మూలన ఫలితం మెరుగ్గా ఉంటుంది.– డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్తొలిదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు కేన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నయం చేయొచ్చు. మగవారు ఎక్కువగా ఊపిరితిత్తుల కేన్సర్‌కు గురవుతున్నారు. స్మోకింగ్, నాన్ స్మోకింగ్ టొబాకో, రెడ్‌మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. మద్యపానం నియంత్రించాలి. నిర్దేశిత బరువు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం అర్ధగంటపాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. – డాక్టర్ రవీంద్రచారి, పల్మనాలజిస్టు(చదవండి: పారేయకండి.. పదును పెట్టండి..!) -
Yoga: మానసిక శక్తిని పెంచే శ్వాస
నాసిక రంధ్రాల ద్వారా శ్వాసను లోపలికి తీసుకుంటూ, తిరిగి వదులుతూ చే సే ప్రాణామాయ పద్ధతులలో ముఖ్యమైనవి నాలుగు ఉన్నాయి. వాటిలో.. కపాలభాతి: ఈ ప్రాణాయామంలో వేగంగా ఊపిరి తీసుకోవడం, వదలడం ఉంటుంది. ఈ విధానం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. శ్వాసకోశ కండరాలు బలోపేతం అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. దీని వల్ల చేసే పనిపైన శ్రద్ధ, సృజనాత్మకత పెరుగుతుంది. ఒక ప్రశాంతమైన స్థలంలో సుఖాసనంలో కూర్చొని, ముక్కు ద్వారా శ్వాస పీల్చుతూ, వదులుతూ ఉండాలి. భస్త్రిక: ఈ ప్రాణాయామం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచవచ్చు. నోటిద్వారా శ్వాసను తీసుకొని, నోటిద్వారా వదలాలి. ఈ ప్రక్రియను పది–పదిహేను సార్లు పదే పదే చేయాలి. భ్రామరి: ఈ ప్రాణాయామం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నోటితో తేనెటీగలాగ హమ్ చేస్తూ .. నాసిక రంధ్రాల ద్వారా గాలి పీల్చుకొని, నెమ్మదిగా వదలాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యులను సంప్రదించి, నిపుణుల సలహాతో వీటిని సాధన చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందదుతారు. -
వేసవిలో మహాపానీయం 'మజ్జిగ'..! ఎందుకు మంచిదంటే..?
వేసవికాలంలో మజ్జిగ మహాపానీయం ఆరోగ్యానికి మంచిది. ఎండదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాంటి పానీయానికి సంస్కృతంలో తక్రం, మధితం, ఉదశ్విత్తు అని మూడు పేర్లు ఉన్నాయి. తక్రం : నాలుగో వంతు నీరుపోసి తయారు చేసేది తక్రం. మధితం : అసలు నీరు పోయకుండా చిలికినది. ఇది రుచిగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు. ఉదశ్విత్తు : సగం నీళ్లు పోసి తయారు చేసేది. ఈ మూడింటిలో తక్రం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేడి నుంచి ఉపశమనాన్నిస్తుంది.. గతంలో అయితే ఇంటికి వచ్చిన అతిథులకు.. ఎండలో వచ్చిన వారికి, వెళ్లే వారికి మజ్జిగను ఇచ్చేవారు. బాగా చిలికిన మజ్జిగలో ఒక నిమ్మకాయరసం, తగినంత ఉప్పు, చిటికెడు పంచదార కలిపి ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలకు వెళ్లే వారు గాజుసీసాలో మజ్జిగ తీసుకెళ్తే ఎండ దెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. – ఉన్నవ పూర్ణచందర్రావు, మూసారంబాగ్ వేసవిలో కూర్చిక పానీయం.. ఒక గ్లాసు పాలు తీసుకుని కాచి చల్లార్చి అందులో రెండు గ్లాసుల పుల్లని మజ్జిగ కలపాలి. ఈ పానీయాన్ని కూర్చిక అంటారు. ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాములు చొప్పున దేనికదే మెత్తగా దంచి కలుపుకోవాలి. ముందుగా ఈ మూడింటినీ కలిపి తగినంత ఉప్పు చేర్చి దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. కూర్చికను తాగినప్పుడల్లా అందులో ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగితే.. వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తుంది. జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది. దప్పికని పోగొడుతుంది.మజ్జిగ తాగేవారికి ఏ వ్యాధులూ దరిచేరవని, వచ్చిన వ్యాధులు తగ్గి తిరిగి తలెత్తకుండా ఉంటాయని, విషదోషాలు, దుర్భలత్వం, చర్మరోగాలు, ధీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమితవేడి తగ్గిపోతుందని, శరీరానికి మంచి వర్చస్సు కలుతుందని యోగరత్నాకరంలో పేర్కొన్నారు. ప్రయోజనాలు..వేసవిలో మజ్జిగ ఎక్కువగా తీసుకోడం వల్ల శరీరంలో లవణాలను తగ్గకుండా చేస్తుంది.తోడుపెట్టినందు వల్ల పాలల్లో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉంటాయి. దీంతోపాటు మంచి బ్యాక్టీరియా మనకు దొరుకుతుంది. ఫ్రిజ్‌లో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా దెబ్బతింటుంది. అందుకే అతి చల్లని మజ్జిగ తాగకూడదు. మజ్జిగను చిలకడం వల్ల తేలికగా అరిగే గుణం ఏర్పడుతుంది. అందుకే పెరుగు కంటే మజ్జిగ మంచింది. (చదవండి: 'టీ లైఫ్'..! మహిళలను ఆంట్రప్రెన్యూర్స్‌గా, ఇండస్ట్రియలిస్ట్‌గా..) -
Summer Tips 46-48 డిగ్రీలకు ఎండలు : జాగ్రత్తలు తీసుకోకపోతే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నాటికి 46–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సింగరేణి కాలరీస్‌తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేసవికి అనుగుణంగా నడుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత.. తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల సమీపంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వడగాడ్పులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సింగరేణి కారి్మకులతోపాటు రోజువారీ కూలీలు, రైతులు, చిరువ్యాపారులు, నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తత అవసరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరైతే గొడుగు, టోపీ, సన్‌్రస్కీన్ లేదా తడి గుడ్డ ఉపయోగించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందాలని చెబుతున్నారు. టూవీలర్లపై వెళ్లే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వదులైన, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలంటున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ... వేసవిలో తాగిన నీరు తాగినట్టే చెమట రూపంలో వెళ్లిçపోతుంది. రోజుకు 3–4 లీటర్ల నీరు తాగడం శ్రేయస్కరం. దాహం లేకపోయినా గంటకోసారి నీటిని తాగుతూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఓఆర్ఎస్, ఉప్పు–చక్కెర కలిపిన నీరు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. కూల్‌డ్రింక్స్, బీర్లు, చికెన్, మాంసం తినడం వేసవిలో వేడిని ఇంకా పెంచుతాయి. రోజుకు 2–3 సార్లు కొబ్బరినీరు తాగితే శరీరంలో ఎలక్రొ్టలైట్స్ సమతౌల్యంగా ఉంటాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ శరీరంలో నీటిని తగ్గిస్తాయి కాబట్టి వాటి బదులు హెర్బల్ టీ, తాజా పండ్ల రసాలు తాగడం మేలు. ఆహారం ముఖ్యం తేలికైన, నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, కీర దోస వంటివి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అధిక ఉప్పు, కారం, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఉడకబెట్టిన ఆహారం, సూప్‌లు, సలాడ్లు తీసుకోవాలి. గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వాళ్లు నీటిని అధికంగా సేవిస్తూ ఎండల్లో తిరగడం తగ్గించాల్సి ఉంటుంది. జాగ్రత్తలతోనే వేసవి నుంచి రక్షణ వేసవిలో శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీర ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు దాటినప్పుడు మెదడు వ్యాధులు, అవయవ వైఫల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను శరీరం బ్యాలెన్స్ చేసుకొనేలా వ్యవహరించాలి. ఆహార నియమాలు పాటించాలి. అధిక ఎక్సర్సైజ్లు తగ్గించాలి. – డాక్టర్ కిరణ్ మాదాల, ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఉస్మానియా కళాశాల -
స్లిమ్‌గా నటి మాధురి దీక్షిత్ భర్త..! మొదట తండ్రిపై ఆ తర్వాత..
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90లలో ఎన్నోబ్లాక్బస్టర్ హిట్ మూవీలతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి. ఇక ఆమె డాక్టర్ శ్రీరామ్‌ని పెళ్లాడి..సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఇటీవలే అడపదడపా బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తళుక్కుమంటున్నారు. ఆమె ఈ వయసులో కూడా అంతే స్లిమ్‌గా అందంగా ఉంటారామె. అందులోనూ ఆమె భర్తే ఆరోగ్య నిపుణుడు కాబట్టి..ఫిట్‌నెస్‌పై మంచి శ్రద్ధ తప్పకుండా ఉంటుంది. అంతేగాదు ఈ ముద్దుగుమ్మ భర్త శ్రీరామ్ బరువు ఏవిధంగా తగ్గించుకోవచ్చో తనపైనే ప్రయోగాలను చేసుకుని మరీ వివరిస్తున్నారు. ఆయన చిన్న చిన్న మార్పులతో బరువు తోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించుకున్నట్లు తెలిపారు. అదెలాగో చూద్దామా..!.ఇంక్టాక్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్డియాక్ థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ అయిన శ్రీరామ్ నేనే ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషించేది జీవనశైలేనని నొక్కి చెప్పారు. చక్కటి ఆరోగ్యం కోసం జీవశైలిలో మంచి మార్పులు అనే పెట్టుబడి పెట్టాలన్నారు. లేదంటే అనారోగ్యం బారిన పడక తప్పదన్నారు. వివిధ సంక్రమిత వ్యాధులకు ప్రధాన కారణం మానవులు అనుసరించే లైఫ్స్టైలేనని అన్నారు. ఆయన తన పేషెంట్లకు వచ్చే వ్యాధులను చక్కటి జీవశైలితో బయటపడేలా చేశాడు. ఆయన తండ్రి 55 ఏళ్ల వయసులో డయాబెటిస్తో బాధపడుతున్నప్పుడూ.. అతని జీవనశైలి మార్చి..మందులపై ఆధారపడకుండా నిర్వహించగలిగేలా చేశానని అన్నారు. ప్రస్తుతం ఆయనకు 86 సంవత్సరాలని అన్నారు. తన తండ్రిలో వచ్చిన మంచి పరివర్తన చూశాక.. ఓ డాక్టర్‌గా తాను కూడా మంచి జీవనశైలిని పాటించాలని గ్రహించానన్నారు శ్రీరామ్. అప్పుడే మంచిగా ప్రజలకు సేవల చేయగలనని విశ్వసించి..మార్పుకు శ్రీకారం చుట్టారట. ఎప్పుడైతే శ్రీరామ్ జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావడం ప్రారంభించారో..త్వరితగతిన సత్ఫలితాలను అందుకున్నారు. దాదాపు 18 కిలోల బరువు తగ్గారు, అలాగే 16శాతం శరీర కొవ్వు కూడా తగ్గిందని చెప్పారు. దీన్ని అలాగే కొనసాగించి..తదుపరి పుట్టిన రోజుకల్లా..12 నుంచి 15 శాతం కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనేది తన లక్ష్యమని అన్నారు. ఇంతలా ఎందుకంటే..తాను ఓ మ్యాగ్జైన్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అంటే మంచి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండొచ్చాని ప్రయోగపూర్వకంగా చెప్పడమే ఎందరికో స్ఫూర్తిని కలిగించారు డాక్టర్ శ్రీరామ్.(చదవండి: ChatGPT: చాట్‌జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..! వైద్యులే ఆ సమస్య ఏంటో చెప్పలేకపోయారు..) -
వేసవిలో మలేరియాతో జరభద్రం..!
వేసవి వచ్చేసింది. వాతావరణ మార్పుల ప్రభావంతో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది వారాలు గడిస్తే నైరుతి రుతుపవనాలు కూడా వచ్చేసి, వానలు జోరందుకుంటాయి. ఇటువంటి వాతావరణం దోమల పెరుగుదలకు, వ్యాధులకు అనుకూలం. ముఖ్యంగా చిన్న దోమ కాటు వేస్తే ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, మలేరియా మహమ్మారి బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలి. వ్యాప్తి ఇలా...తేమ శాతం అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఆడ ఎనాఫిలిస్ దోమల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ దోమ కుడితే మలేరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల తరువాత మలేరియా జ్వర లక్షణాలు బయట పడతాయి. మలేరియా సోకిన వారు సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. ఒకవేళ రోగి కోలుకున్నా ఆ పరాన్నజీవి మాత్రం శరీరంలో ఏడాది పాటు నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారు సమతుల ఆహారం తీసుకుంటే త్వరితగతిన కోలుకుంటారు. గత ఏడాది 12 అనుమానిత కేసులు మలేరియా నియంత్రణకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా గత ఏడాది 12 మలేరియా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని జిల్లా మలేరియా యూనిట్ అధికారులు తెలిపారు. జిల్లాలోని అమలాపురం, రాజోలు, కొత్తపేట, మండపేటల్లో డివిజన్ మలేరియా యూనిట్లున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అదనంగా మరో మూడు సబ్ మలేరియా యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేసి, మలేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అమలాపురం డివిజన్ యూనిట్‌కు అమలాపురం టౌన్, అమలాపురం రూరల్, కొత్తపేట డివిజన్‌కు రావులపాలెంలో సబ్ మలేరియా యూనిట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలివీ.. మలేరియాను రక్త పరీక్ష (ఆర్డీ) ద్వారా నిర్ధారిస్తారు. ఈ వ్యాధి సోకిన వారు చలి, వణుకుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడతారు. వ్యాధి నిరోధక శక్తి లేని వారికి విపరీతమైన తలనొప్పి వచ్చి, ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంటుంది. వ్యాధి నిర్ధారణ కాక ముందే బాధితులు తక్కువగా మూత్రం విసర్జించడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరితే మూత్రపిండ సంబంధిత సమస్యలు అధికమవుతాయి. రోగులు వైద్యుల పర్యవేక్షణలో ఏకధాటిగా 14 రోజుల పాటు చికిత్స తీసుకోవాలి. మధ్యలో మానేస్తే వ్యాధి తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. మలేరియాలో ప్లాస్మోడియం ఫాల్సీఫారం రకమైతే మూడు రోజుల పాటు ఏసీటీ చికిత్స పొందాలి. ఈ చికిత్స అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. రోగులు సత్వరమే కోలుకునేందుకు పండ్ల రసాలు, గ్లూకోజ్, చెరకు రసం వంటి ద్రవ పదార్థాలు విరివిగా తీసుకోవాలి. నివారణ చర్యలతో మేలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఇంట్లో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా తరచూ లార్వాసైడ్ క్రిమి సంహారక మందు పిచికారీ చేయాలి. ఇంటి గోడలపై సింథటిక్ ఫైరిత్రాయిడ్, ఏసీఎం క్రిమి సంహారక మందును అవసరమైన మేరకు పిచికారీ చేయాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి మలేరియా బారిన పడిన వారు వ్యాధి తీవ్రత తగ్గే వరకూ అప్రమత్తంగా ఉండాలి. నివారణ ఎంతో ముఖ్యమో కోలుకోవడానికి కూడా ఆహారపు అలవాట్లు కూడా అంతే ముఖ్యం. జిల్లాలో మలేరియా కేసులను సున్నా శాతానికి తగ్గించేలా కృషి చేస్తున్నాం. – ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా యూనిట్ ప్రత్యేక అధికారి, అమలాపురంనేడు ప్రపంచ మలేరియా దినోత్సవం ఇంగ్లండ్‌కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత సర్ రోనాల్డ్ రోస్ సుదీర్ఘంగా 18 సంవత్సరాల పాటు (1881–1899) చేసిన పరిశోధనల వల్ల మలేరియా వ్యాధి సోకే తీరును గుర్తించారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల కుట్టడం వల్లే ఈ వ్యాధి సంభవిస్తుందని నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) 2008 ఏప్రిల్ 25 నుంచి ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తోంది. (చదవండి: ChatGPT: చాట్‌జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..! వైద్యులే ఆ సమస్య ఏంటో చెప్పలేకపోయారు..) -
చాట్‌జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..!
చాట్‌జీపీటీ వంటి సాంకేతికతో ఆరోగ్య సలహాలు తీసుకోవద్దుని నొక్కి చెబుతుంటారు నిపుణులు. అవి నేరుగా వైద్యుడిని సంప్రదించినట్లుగా ఉండదు, పైగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యాధులను నిర్థారించలేదనే హెచ్చరిస్తుంటారు. అయితే ఆ మాటలన్నింటిని కొట్టిపారేసేలా ఓ ఘటన చోటుచేసుకుంది. వైద్యులే గుర్తించలేని ఆరోగ్య సమస్యను గుర్తించి ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. అసలు ఆ ఏఐ చాట్‌జీపీటీ లేకపోతే నా ప్రాణాలే ఉండేవి కాదని కన్నీటిపర్యంతమైంది ఆమె. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..అమెరికాలోని నార్త్‌కరోలినా ప్రాంతానికి చెందిన మహిళ ఎన్నేళ్లుగానో తెలియని అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం కారణంగా ఆమె బాడీలో ఎన్నో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంది. దీంతో వైద్యులను సంప్రదించినా లాభం లేకుండాపోయింది. వాళ్లంతా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్థారించారు.పైగా యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. అయినా ఆమెకెందుకో తాను అంతకుమించిన పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్న ఫీల్ ఉండేది. దీంతో సరదాగా ఏఐ చాట్‌జీపీటీలో తాను ఫేస్ చేస్తున్న అనారోగ్య సమస్యలను వివరించింది. చివరగా వైద్యులు ఏమని నిర్థారించారో చాట్‌జీపీటో సంభాషిస్తుండగానే..ఆమె హషిమోటో వ్యాధితో బాధపడి ఉండొచ్చని చెప్పింది చాట్‌జీపీటీ. దీంతో ఆమె వెంటనే వైద్యుల్ని సంప్రదించి ఆ దిశగా వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆ పరీక్షల్లో ఆమె ప్రాణాంతక కేన్సర్ అయినా..హషిమోటో వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. స్క్రీనింగ్ పరీక్షల్లో వైద్యులు ఆమె మెడలో రెండు చిన్న గడ్డలను గుర్తించారు. ఆ తర్వాత వాటిని కేన్సర్ కణితులుగా నిర్థారించారు. ప్రస్తుతం ఆమె తగిన చికిత్సను పొంది ఆ సమస్య నుంచి బయటపడింది. తాను గనుక చాట్‌జీపీటీనీ సంప్రదించి ఉంకడపోతే..ఇంకా ఆర్థరైటిస్ మందులు వాడుతూ..కేన్సర్ సమస్యను ముదరబెట్టుకునేదాన్ని అని వాపోయింది. ఇలా మరో ప్రయత్నం చేయకుంటే తన ప్రాణాలే పోయేవి అంటూ తన అనుభవాన్ని వివరించారామె. ఏంటీ వ్యాధి అంటే..హషిమోటో వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక రుగ్మత. ఇది హైపోథైరాయిడిజం (thyroid గ్రంధి తక్కువ పనితీరు)కు కారణమవుతుంది. దీని వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని విదేశీ కారకంగా భావించి, దానిపై దాడి చేస్తుంది. ఈ దాడి థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీసి, దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చితకిత్స మాత్రం.. మందులతో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవాల్సిందే.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Starch-Free Rice Cooker: డయాబెటిస్, ఊబకాయాన్ని దరిచేరనీయదు..) -
తెలంగాణలో తొలిసారిగా టెండన్ ఆగ్మెంటేషన్ షోల్డర్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆపరేషన్
హైదరాబాద్: ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అపోలో వైద్యులు అరుదైన ఘనతను సాధింఆరు తెలంగాణలోనే తొలి అల్లోగ్రాఫ్ట్ టెండన్ (ఆకిలీస్ టెండన్) ఆధారిత లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ షోల్డర్ సర్జన్ డా. ప్రశాంత్ మేశ్రం ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇటువంటి చికిత్స అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో తొలిసారిగా జాయింట్ ప్రిజర్వేషన్ కోసం అల్లోగ్రాఫ్ట్ టెండన్ ద్వారా ఆ శస్త్ర చికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు.వివరాల్లోకి వెళితే 55 ఏళ్ల శక్తివంతమైన వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరు నెలలపాటు తీవ్రమైన నొప్పితోపాటు, చేతిలో బలహీనతతో బాధపడ్డాడు. మాసివ్, మరమ్మతులు చేయలేని రోటేటర్ కఫ్ టియర్తో పాటు ఆర్మ్ జాయింట్లో ప్రారంభ దశ ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారు అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్‌లోని డా. మేశ్రంని సంప్రదించారు.ఈ మేరకు అతి సంక్లిష్టమైన ఈ ఆర్థోస్కోపిక్-అసిస్టెడ్ లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ శస్త్రచికిత్సలో ఆకిలీస్ టెండన్ అల్లోగ్రాప్ట్ను నిష్ణాతంగా ఉపయోగించారు. బైసెప్స్ టెండన్ రీ-రూటింగ్, సబ్స్కాపులారిస్ టెండన్ మరమ్మతులతో కూడిన ఈ చికిత్స ద్వారా భుజం పనితీరు సామర్థ్యాన్ని పునరుద్ధరించి, తద్వారా ఆర్థరైటిస్‌ను నివారించే ప్రయత్నించి విజయవంతమైనారు. ఆపరేషన్ తర్వాత చేసిన షోల్డర్ జాయింట్లో మారిన హెడ్ పొజిషన్ తిరిగి సరి అయినట్టు వెల్లడైంది. అరుదైన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఒక కొత్త మైలురాయి అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. -
World Mental Health Index : అట్టడుగున హైదరాబాద్, కారణాలివే!
ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం నగర యువత మానసిక ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. అంతర్జాతీయంగా సేపియన్ ల్యాబ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ దీనిని వెల్లడించింది. మానసిక ఆరోగ్యం ( World Mental Health Index )అత్యల్పంగా ఉన్న భారతదేశపు మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు అట్టడుగున స్థానం కల్పించింది. మెంటల్ హెల్త్ కోషియంట్(ఎంహెచ్క్యు) స్కేల్లో నగరం ప్రపంచ సగటు 63 కాగా మన నగరం 58.3 స్కోర్‌ను సాధించింది. ఢిల్లీ 54.4 స్కోర్‌తో మన తర్వాత స్థానంలో నిలిచింది. ఈ అధ్యయనం కోసం సంస్థ 18 నుంచి 55 ఆ తర్వాత వయస్సు కలిగిన 75 వేల మంది వ్యక్తులను ఎంచుకుంది. – సాక్షి, సిటీబ్యూరోఎంహెచ్క్యు స్కేల్ మానసిక ఆరోగ్యాన్ని ‘బాధలో ఉండటం’ నుంచి ‘అభివృద్ధి చెందడం’ వరకు విభజించింది. ‘ఎండ్యూరింగ్’ ‘మేనేజింగ్’ కేటగిరీల మధ్య హైదరాబాద్ సగటు పడిపోయింది. నగరంలో ‘32% మంది ‘బాధపడుతున్న’ లేదా ‘కష్టపడుతున్న’ కేటగిరీల్లోకి వచ్చారు. ఇది పేలవమైన భావోద్వేగ నియంత్రణ, బలహీనమైన సంబంధాలతో క్షీణించిన మానసిక పనితీరుగా గుర్తించడం జరిగింది’ అని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేందర్ స్వామినాథన్ అంటున్నారు.యువతే ఎక్కువ.. మానసికంగా ప్రభావితమైన వారి సంఖ్య యువకులలో ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు అంతర్జాతీయ కొలమానాలతో సమానంగా 102.4 స్కోర్ సాధించగా, 18 నుంచి 24 సంవత్సరాల మధ్య యువత సగటున 27 పాయింట్లు పైబడి మాత్రమే సాధించి ‘ఎండ్యూరింగ్’ విభాగంలో చోటు దక్కించుకుంది. సేపియన్ ల్యాబ్స్‌కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘దాదాపు సగం మంది యువకులు బాధను, మనసును బలహీనపరిచే భావాలను కలిగి ఉన్నారు’ అని చెప్పారు. యువత మానసిక ఆరోగ్య సంక్షోభానికి కారణాలను సైతం నివేదిక కీలకంగా ప్రస్తావించింది.పంచుకునే మనసులు లేక.. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పరిస్థితికి ముఖ్యంగా సామాజిక బంధాల విచ్ఛిన్నం ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. వ్యక్తివాద మనస్తత్వాలు పెరగడం వల్ల కుటుంబాలు సన్నిహిత స్నేహాలు వంటి సంప్రదాయ పద్ధతులు క్షీణించాయి. పిల్లలతో గడపడం అనే విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటివి వీటికి జత కలిసి ఒంటరితనం పెరుగుదలకు ఆజ్యం పోసింది అని నివేదిక తేల్చింది.ఊహ తెలిసేలోపే.. స్మార్ట్ ఫోన్ వినియోగం చిన్న వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వినియోగం అలవాటు కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తోంది. తగిన వయసు లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల విషాదం, నిరాశా నిస్పృహలు, ఉద్రేకం, ఆత్మహత్యా ధోరణులు పెట్రేగేందుకు అవకాశం ఇచ్చి వాస్తవ దూరమైన ప్రపంచంలోకి నెడుతోంది. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రాభంగానికి, సైబర్ బెదిరింపులు, హానికరమైన కంటెంట్‌ను దగ్గర చేస్తుంది. పర్యావరణ ప్రభావం.. మానసిక సమస్యలకు పర్యావరణ మార్పులు కూడా దోహదం చేస్తున్నాయి. ఆహారం నీటిలో ఇప్పుడు సర్వ సాధారణంగా కనిపించే పురుగు మందులు, భారీ లోహాలు మైక్రోప్లాస్టిక్‌లు–మెదడు అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు యుక్తవయస్సులో ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు ఇది దోహదం చేస్తోందని నివేదిక నిర్ధారించింది. రాంగ్ డైట్.. సైకలాజికల్ ఫైట్.. అతిగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్(యుపీఎఫ్) తీసుకునే వ్యక్తులు మానసిక క్షోభను కూడా ఎక్కువ అనుభవించే అవకాశం ఉంది. ‘యుపీఎఫ్ వినియోగం 15 సంవత్సరాలలో బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇది 30% వరకు మానసిక అనారోగ్యానికి కారణమవుతోందని మా డేటా సూచిస్తోంది.’ అని నివేదిక పేర్కొంది. -
Sperm Race ఇది రొటీన్ రేస్ కాదు! సమ్‌థింగ్ స్పెషల్!
ఈ నెల 25న ప్రపంచంలోనే తొలిసారిగా లాస్ ఏంజిల్స్‌లో ‘లైవ్ స్పెర్మ్ రేస్’ జరగనుంది. జీవనశైలిలో మార్పులు... మొదలైన వాటివల్ల పురుషుల్లో పెరుగుతున్న సంతాన లేమి అనే క్లిష్టమైన సమస్యపై ఈ రేస్ దృష్టి సారిస్తుంది.‘ఎవరి స్పెర్మ్ హెల్తీయెస్ట్? ఫాస్టెస్ట్?’ అనే దానిపై జరిగేపోటీ ఇది. పోటీ ఎలా ఉంటుంది? అనే విషయానికి వస్తే... నిజమైన స్పెర్మ్‌తో కూడిన రేస్ ఇది. మానవ ప్రత్యుత్పత్తి మార్గాన్ని అనుసరించేలా మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్ రూపొందించారు. సింక్రనైజ్డ్ స్టార్టర్లతో రసాయన సంకేతాలు, ఫ్లూయిడ్ డైనమిక్స్ కోర్సు ద్వారా స్పెర్మ్ నమూనాలు ఈత కొట్టేలా చేస్తారు. ఈపోటీని యాక్షన్ హై–రిజల్యూషన్ కెమెరాతో రికార్డ్ చేస్తారు. విజేతను నిర్ణయించడానికి మూడు రేసులు జరుగుతాయి. ప్లే–బై–ప్లే కామెంటరీ అలరిస్తుంది.ఇన్స్టంట్ రీప్లే, కామెంటరీ, గణంకాలు, లీడర్ బోర్డ్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లను అభిమానులు ఆస్వాదించేలా చేస్తుంది.ఈ రేస్‌లో బెట్టింగ్ కూడా ఉంటుంది!అత్యంత వేగంగా ఈత కొట్టే స్పెర్మ్‌పై అభిమానులు పందెం కట్టవచ్చు. ‘ఏ లాఫ్ విత్ ఏ డీపర్ పర్పస్’ నినాదంతో ఈ రేస్‌కు శ్రీకారం చుట్టారు. యువ మిలియనీర్ల బృందం ఈ విచిత్ర పోటీని నిర్వహిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హెల్త్, టెక్, ఎంటర్టైన్మెంట్లను మిళితం చేసి రూపొందించిన రేస్ ఇది. ‘ఎవరూ టచ్ చేయని అంశాన్ని తీసుకొని ఆసక్తికరంగా ఈ రేస్‌ను రూపొందించాం. ఇది పురుషుల సంతానలేమి గురించి ప్రజలు నిస్సంకోచంగా మాట్లాడుకునేలా చేస్తుంది’ అంటున్నారు పోటీ నిర్వాహకులు.రేస్ ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ‘ఎక్స్’లో ‘ది స్పెర్మ్ ట్రాక్: నాట్ యువర్ యావరేజ్ రేస్’ టైటిల్‌తో ట్రైలర్ విడుదల చేశారు. ఈ రేస్‌లో పాల్గొనే టీమ్‌లను కూడా పరిచయం చేశారు. రేస్ ఉద్దేశం గురించి ‘స్పెర్మ్ రేసింగ్ మేనిఫెస్టో’ కూడా విడుదల చేశారు. ఈ మైక్రోస్కోపిక్ బ్యాటిల్లో వీర్య విజేత ఎవరో వేచి చూద్దాం.ఇది చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్ -
కలర్‌ఫుల్.. సిబ్లింగ్స్ వాక్..!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ని బంధాలున్నా తోబుట్టువుల అనుబంధం, ప్రేమ ప్రత్యేకమైనవి. జన్మతో సహా కలిసొచ్చే బంధం ఇది. ఇంతటి గొప్ప అనుబంధాన్ని, ఆప్యాయతను అంతే చక్కగా ప్రదర్శించింది కూకట్పల్లి అశోక వన్ మాల్ వేదికగా నిర్వహించిన ది సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్. అశోక డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో, అందమైన నడకతో, ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తమ విశిష్టతను ప్రదర్శించారు పలువురు చిన్నారులు. ఈ కార్యక్రమం ఫ్యాషన్ భాగస్వామి అయిన రిలయన్స్ ట్రెండ్స్.. ఫ్యాషన్ వాక్‌లో పాల్గొన్న పిల్లలందరికీ ఆకర్షణీయమైన దుస్తులను అందించింది. అదనంగా మేక్ మై హోమ్, డెకథ్లాన్ సంస్థతో కలిసి ఈ చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అశోక డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పరిసరాల్లోని కుటుంబాలతో బంధం ఏర్పరచుకోడానికి, షాపింగ్ చేయడానికి, ఆనందించడానికి అవకాశాలను సృష్టించడానికి అశోక వన్ మాల్ సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్ నిర్వహించామని, ఈ కార్యక్రమం తోబుట్టువుల సంబంధాల గొప్పతనాన్ని ప్రదర్శించిందని అన్నారు.నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్చార్మినార్: వేసవి సెలవులను పురస్కరించుకుని మే నుండి జూన్ వరకూ నెహ్రూ జూలజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనడానికి ఔత్సాహికులైన విద్యార్థులు రూ.1000 రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ వన్యప్రాణుల జూ ఉత్సాహవంతులైన పిల్లలను వేసవి శిబిరంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తోందన్నారు. ప్రతి రోజూ బ్యాచ్‌ల వారీగా నిర్వహించే ఈ వేసవి క్యాంపులో ప్రతి బ్యాచ్‌కూ 15 నుండి 20 మంది విద్యార్థులు ఉంటారన్నారు. ఈ వేసవి శిబిరంలో జూ పార్కుకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు జూ టూర్, జూ పార్కులోని జంతువుల చరిత్ర, సమాచారం తెలుసు కోవడం, సరీసృపాలపై అవగాహన సెషన్, రాత్రి గుహ సందర్శన, ఇతర సరదా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనుభవజ్ఞులైన వన్యప్రాణుల విద్యావేత్తల నేతృత్వంలో ప్రతి బ్యాచ్‌కూ ప్రతి రోజూ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద చెల్లించే రూ.1000లో స్నాక్స్, శాఖాహార భోజనంతో పాటు అభ్యర్థులకు క్యాప్, క్యాప్, నోట్ ప్యాడ్, జూ బ్యాడ్జ్, హైదరాబాద్ జూ లోగోతో కూడిన కిట్ అందిస్తారన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తో పాటు అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావాలన్నారు. 040–2447 7355లో గానీ, 92810 07836 వాట్సాప్ నెంబర్లో గానీ సంప్రదించాలన్నారు. -
నా దారి రహదారి : రివర్స్ వాకింగ్
ప్రతి రోజూ అందరూ వాకింగ్ చేస్తారు.. అతడు కూడా అందరిలానే వాకింగ్ చేస్తాడు.. అయితే అందరికన్నా భిన్నంగా వెనక్కి నడుస్తాడు.. అదే రివర్స్ వాకింగ్ అండి. అతడే కూకట్పల్లి, వివేకానందనగర్‌లో నివాస ముండే అన్య శ్రీధర్. నగరంలోని ఓ ఫార్మాకంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజూ 5 గంటలకే వాకింగ్ మొదలుపెడతాడు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో అందరూ ముందుకు నడుస్తుంటారు.. ఆయన మాత్రం వెనుకవైపు నడుస్తూ.. వేగంగా పరుగెత్తటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పక్కనుంచి నడవడానికి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో శ్రీధర్ మాత్రం వెనుక వైపు పరుగెత్తటం విశేషం.ప్రతి రోజూ వివేకానందనగర్ కాలనీలోని వాకర్స్ రూట్లో యువకులతో సహా అందరూ ముందుకు నడుస్తుంటారు. అంతేకాకుండా వాకింగ్ చేసేవారు ఒకటిన్నర కిలోమీటర్లను సుమారు 15 నిమిషాలు నడుస్తుండగా.. శ్రీధర్ వెనుకవైపు 10 నిమిషాల్లోపు పరుగెత్తటం విశేషం. దాదాపు 17 నుంచి 20 నిమిషాల్లో రెండు రౌండ్లను రివర్స్‌లో పూర్తిచేస్తాడు. వ్యాయామం విషయంలో కూడా అందరూ నిలబడి కాళ్లను సైక్లింగ్లాగా వ్యాయామం చేసారు. తను మాత్రం తల కిందికి పెట్టి కాళ్ళను దాదాపు 5 నిమిషాల సేపు వాకింగ్ సైక్లింగ్ చేయటం విశేషం. అంతేకాకుండా తల కిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టి 3 నిమిషాల సేపు ఉంటారు. ఈ విధంగా శ్రీధర్ ఆరు పదుల వయసులో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా వ్యాయమం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ‘తాను గతంలో సాధారణ వాకింగ్‌తో పాటు వ్యాయామం చేసేవాడినని, తాను ఒక ఆర్టికల్ చదివి హృదయ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టే విధంగా ఈ వ్యాయామం పనిచేస్తుందని గ్రహించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఈ వ్యాయామంపై ప్రత్యేక దృష్టి సారించి వాకింగ్ చేయటం మొదలు పెట్టానని, దాదాపు మూడు సంవత్సరాలుగా రివర్స్ వాకింగ్ చేస్తూ.. తనలాంటి మరికొందరికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు ‘సాక్షి’తో తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని తాను పాటిస్తానని, తన వ్యాయామం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తనను మన్నించాలని కోరారు. -
మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ అమరిక.. రోబోటిక్ శస్త్రచికిత్సతో అద్భుతం
హైదరాబాద్: ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి వైద్యులు అసాధారణ శస్త్రచికిత్స చేసి, పశ్చిమబెంగాల్‌కు చెందిన వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. అతడి సొంత మూత్రపిండాన్నే శరీరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చడంతోపాటు... పూర్తిగా పాడైపోయిన మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ ఉపయోగించి అతడి కిడ్నీల పనితీరును సాధారణ స్థితికి తీసుకొచ్చారు.ఈ వృద్ధుడికి 2023లో వేరేచోట మూత్రపిండాల్లో రాళ్లు తీయడానికి మామూలు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత అతడి మూత్రనాళాలు పూర్తిగా పూడుకుపోయాయి. దాంతో క్రియాటినైన్ ప్రమాదకరంగా పెరిగిపోయి, విపరీతమైన నొప్పి, తరచు జ్వరంతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది.కిడ్నీలు రెండూ పాడైపోవడంతో తాత్కాలికంగా అతడికి ట్యూబులు (నెఫ్రోస్టమీలు) అమర్చి బయటి నుంచి మూత్రం పంపేవారు. పలు రాష్ట్రాలు తిరిగినా ఏ ఆస్పత్రీ చేర్చుకోకపోవడంతో చివరకు హైదరాబాద్ వచ్చారు. సమగ్ర పరీక్షలు చేసిన తర్వాత.. అతడి మూత్రనాళాలు చాలావరకు పూడుకుపోయినట్లు గుర్తించారు. ఇది చాలా అరుదు, సమస్యాత్మకం కూడా.కుడివైపు కిడ్నీ కోసం వైద్యులు ముందుగా అతడి సొంత అపెండిక్స్ తీసుకుని, పూడుకుపోయిన మూత్రనాళానికి బదులు దాన్ని అమర్చారు. అపెండిక్స్ కూడా మూత్రనాళం పరిమాణంలోనే ఉంటుంది. రోబోటిక్ శస్త్రచికిత్సతో దీన్ని మార్చారు. ఇది చాలా అరుదుగా చేసే చికిత్స. దీన్ని అపెండిక్స్ ఇంటర్పొజిషన్ అంటారు.“మూత్రనాళం బాగా పూడిపోఉయినప్పుడు దాన్ని బాగుచేయడానికి ఇది అత్యంత సృజనాత్మకమైన, మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి. సాధారణంగా ఇలా చేయరు. కానీ ఈ రోగి కేసులో ఇదే సరైన పరిష్కారం” అని ఏఐఎన్యూలోని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్,యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. ఈ చికిత్స అనంతరం అతడి కుడి కిడ్నీ బాగుపడింది. దాంతో బయట అమర్చిన ట్యూబులను తీసేశారు.సొంత కిడ్నీ మార్పిడి ఇలా.. రెండు నెలల తర్వాత అతడి ఎడమవైపు కిడ్నీ ఇంకా అలాగే ఉంది. అపెండిక్స్ కుడివైపే ఉంటుంది కాబట్టి రెండోవైపు పేగులను తీసి అమర్చవచ్చు. కానీ, అందులో ఈ వృద్ధుడికి సమస్యలు ఉండడంతో అత్యంత అరుదైన పరిష్కారాన్ని వైద్యులు ఎంచుకున్నారు. అదే.. సొంత కిడ్నీనే మార్చడం. ఈ సంక్లిష్టమైన చికిత్సలో.. రోగి ఎడమ కిడ్నీని రక్తనాళాలతో కలిపి తీశారు. తర్వాత దాన్ని కొంత కిందభాగంలో అమర్చారు. తద్వారా పాడైన మూత్రనాళాన్ని బైపాస్ చేసి, బాగున్న భాగంలోంచి మూత్రం వెళ్లేలా చేశారు.“సొంత కిడ్నీ మార్పిడి అనేది చాలా పెద్ద ఆస్పత్రుల్లోనే చేస్తారు. ఇది చిట్టచివరి పరిష్కారం. చాలా కచ్చితత్వంతో చేయాల్సిన శస్త్రచికిత్స. అతడి శరీరంలోనే అతడి కిడ్నీకి వేరే ఇల్లు ఇచ్చాం” అని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ విజయ్ మద్దూరి తెలిపారు. ఇప్పుడా బెంగాలీ వృద్ధుడు పూర్తి సాధారణ స్థితికి చేరుకున్నారు. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, క్రియాటినైన్ స్థాయి సాధారణంగా ఉంది. నొప్పి, ఇతర సమస్యలూ తగ్గిపోయాయి.“ఈ కేసు వైద్యపరంగా ఓ సరికొత్త విజయం. రెండు కిడ్నీలను కాపాడేందుకు రెండు విభిన్న రకాల, అత్యాధునిక శస్త్రచికిత్సలు చేశాం. ఒకదాంట్లో అపెండిక్స్ను ఉపయోగించగా, మరోదాంట్లో సొంత కిడ్నీనే మార్చారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలా చేసినవాటిలో విజయవంతం అయినవే చాలా తక్కువ” అని ఏఐఎన్‌యూ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు. ఈ శస్త్రచికిత్సల్లో డాక్టర్ తైఫ్ బెండెగెరి కూడా పాల్గొన్నారు. రెసిడెంట్ వైద్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఆసిత్ సాయపడ్డారు. -
న్యూ ట్రెండ్.. ఆక్వా వర్కౌట్స్ : ప్రయోజనాలెన్నో!
పొద్దున్నే లేచి వ్యాయామం కోసం జిమ్‌కి వెళదామని ట్రాక్ సూట్, షూ ధరించేలోగానే చెమట్లతో తడిపేసే సీజన్ ఇది. అందుకే నగరవాసులు నీటి అడుగునే జిమ్దగీకి జై కొడుతున్నారు. చల్లని నీటిలో ఓ వైపు శరీరాన్ని చల్లబరుస్తూ.. మరోవైపు వ్యాయామాలు చేస్తూ సేదతీరుతున్నారు. ముంబై, బెంగళూర్ తదితర నగరాలతో పాటు భాగ్యనగరిలో కూడా ఆక్వా వర్కవుట్స్‌కి ఫిదా అవుతోంది నగర యువత. – సాక్షి, సిటీబ్యూరోపింగ్ జాక్‌లు, ఆర్మ్ లిఫ్ట్‌లు, లెగ్ కిక్స్, లెగ్ షూట్స్ ఇవన్నీ.. రోజూ జిమ్‌లో చేసేవే కదా అనుకోవచ్చు. అయితే అవన్నీ ఇప్పుడు నీటిలోనూ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు అనుసరిస్తున్న ఆక్వా వర్కౌట్లు/హైడ్రో ఎక్సర్సైజ్లు నగరంలోనూ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. సిటీలో ఏప్రిల్, మే నెలల్లో ఆక్వా సంబంధిత వ్యాయామాలకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక కొత్తఎత్తయిన భవనాల్లోనూ, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ అందుబాటులో ఉన్న పూల్స్‌లో ఈ వ్యాయామాల సందడి కనిపిస్తోంది. ‘ఇది సాధారణ వ్యాయామాల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే నీటిలో ఉన్నప్పుడు కాళ్లూ, చేతుల కదలికలకు పరికరాల కదలికను జోడించడం సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో క్యాలరీలను బాగా ఖర్చు చేయడంలో ఇది సహాయపడుతుంది. నీటిలో సౌకర్యవంతంగా ఉన్నంత వరకూ (ఇది పూల్స్‌లో ఎక్కువ లోతులేని వైపు ఉంటుంది) ఈ ఫార్మాట్ అన్ని వయసుల వారికీ పని చేస్తుంది అని చెబుతున్నారు ఆక్వా ఫిట్ ఇన్స్ట్రక్టర్ కవితారెడ్డి. చదవండి : 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీవ్యాయామాలెన్నో.. ఆక్వా ఎరోబిక్స్ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు సిటీలో క్యాలరీలను బర్న్ చేసి రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడే అనేక నీటి ఆధారిత వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆక్వాటిక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఆక్వా జుంబా, హెచ్ఐఐటీ, తబాటా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఆక్వా యోగా, కిక్–బాక్సింగ్ వంటి అనేక రకాలైన వర్కవుట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘డంబెల్స్, నూడుల్స్, ఆక్వా బాక్సింగ్ గ్లోవ్స్, రెసిస్టెన్స్ ట్యూబింగ్, వాటర్ వాకింగ్, ఆక్వా థ్రెడ్మిల్స్, వాటర్ బైక్‌లు ఇంకా ఎన్నో.. పరికరాలతో చేసేందుకు ఆక్వా వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయోజనాలెన్నో.. నీటి అడుగున వ్యాయామాలు బరువు తగ్గడానికి, కండరాలను టోన్ చేయడానికి, శక్తిని పెంచడానికీ సహాయపడతాయని అధ్యయనాలు నిరూపించాయి. తక్కువ అలసటతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. ఆర్థరైటిస్ రోగులకు ఇవి ఉత్తమమైనవి. అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఆక్వా వర్కౌట్లు గర్భిణులకు కూడా మంచిదని చెబుతున్నారు కవిత. ఈ వ్యాయామం వల్ల కీళ్లకు కూడా మేలైన రక్షణ ఉంటుంది. అందుకే సాధారణంగా గాయం నుంచి కోలుకునే క్రమంలో తరచూ హైడ్రో థెరపీని ఉపయోగిస్తారు. కార్డియో–ఇన్‌టెన్సివ్‌గా ఉంటాయి, గాలి కంటే నీరు 13 రెట్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి నీటి వ్యాయామాలు మరింత పటిష్టంగా ఉంటాయి. నేలమీది వ్యాయామం కంటే ఎక్కువ నిరోధకతను అందిస్తాయి. ఇది ఒక గంటలో 500–1,200 క్యాలరీలు బర్న్ చేయగలదు. నీటిలో ఉన్నప్పుడు శరీర బరువులో 10 శాతం మాత్రమే బరువు కలిగి ఉంటారు. కాబట్టి కీళ్ళు అన్లోడ్ చేయబడినట్లు అనిపిస్తుంది. నేల మీద మనం చేసే వ్యాయామాల్లో తప్పుడు కదలికల వల్ల లిగ్మెంట్స్ చిరిగిపోవడానికి /ఒత్తిడికి / బెణుకు లేదా పగుళ్లకు కారణమవుతుంది. నీటిలో వ్యాయామాల వల్ల గాయం అయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చికిత్స కోసం నీటి వ్యాయామాలు సిఫార్సు చేస్తారు. ఇది చురుకుదనం, వెయిట్‌లాస్ కోసం ప్రభావవంతంగా ఉంటాయి. కాలుతో త్రిభుజం ఆకారంలో ఉండే డెగేజ్ పాస్ వంటివి ఇందులో ఉన్నాయి. పూల్‌లో నీటి సాంద్రత కాలుని ఎక్కువ దూరం కదపడానికి సహాయపడుతుంది. చదవండి : వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!కొన్ని సూచనలు మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం స్విమ్మింగ్ క్యాప్ ధరించడం ద్వారా చర్మం, జుట్టుకు క్లోరిన్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కళ్లను రక్షించడానికి నీళ్లు కంట్లో కలిగించే చికాకును నివారించడానికి గాగుల్స్ ధరించాలి.నిదానంగా వ్యాయామం ప్రారంభించి కొంచెం కొంచెంగా తీవ్రతను పెంచాలి. శ్వాసను ఎక్కువసేపు బిగబట్టుకోవద్దు. నీటి అడుగున కఠినమైన విన్యాసాలు చేయవద్దు. నైపుణ్యం, స్థాయి, సామర్థ్యానికి తగిన వ్యాయామాలు మాత్రమే చేయాలి.సరైన శిక్షణ పర్యవేక్షణలో ఉంటే తప్ప అధునాతన వర్కవుట్స్ ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అనుభవం లేకుంటే డైవింగ్ లేదా ఫ్లిప్ చేయడం మంచిదికాదు. అన్ని సీజన్స్‌లోనూ ఆరోగ్యకరమే.. ఈ వర్కవుట్ కేవలం వేసవిలో మాత్రమే కాదు అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరం. బెంగళూరులో ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారంగా ఎంచుకున్న ఈ వ్యాయామం నగరానికి వచి్చన తర్వాత నాకు పూర్తి స్థాయి ప్రొఫెషన్‌గా మారింది. దీని కోసం సింగపూర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఏరోబిక్ అండ్ ఫిట్నెస్ (ఫిసా) కోర్సును చేశాను. ప్రస్తుతం నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న స్ట్రోక్స్‌తో పార్ట్నర్గా ఆక్వా వర్కవుట్స్‌లో సిటిజనులకు శిక్షణ అందిస్తున్నాను. ఈ వ్యాయామాల లాభాలపై అవగాహన మరింత పెరిగితే అది మరింతమందికి మేలు కలిగిస్తుంది. – కవితారెడ్డి, ఆక్వా ఫిట్ శిక్షకురాలు -
మిల్లెట్స్‌తో ఆరోగ్యం మెరుగు: అమల
లెట్ సీ కమ్యూనిటీ ప్రారంభం మాదాపూర్: అందరూ ఆహారంలో మిల్లెట్స్‌ను భాగం చేసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని సినీనటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని అన్నారు. మాదాపూర్‌లోని మినర్వా గ్రాండ్ హోటల్లో శనివారం లెట్ సీ (లివింగ్ త్రూ కమ్యూనిటీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహారం, ఆధ్యాతి్మకత, ఆరోగ్యం, ఉద్యమోన్యుఖత అనే నాలుగు అంశాలు మన జీవితంలో ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మిల్లెట్లను వాడుతూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆనందంగా ఉండాలని కోరారు. లెట్సీ ద్వారా ఫిజికల్ మీటింగ్స్, ఆన్లైన్ సమావేశాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మధ్యతరగతి యువతను మిల్లెట్ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని ప్రశంసించారు. లెట్ సీ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ టిపిన్స్, భోజనాల పోడులు, నూడుల్స్, పాస్తా, స్నాక్స్, మిఠాయిలు తదితర ఉత్పత్తుల గురించి వివరించారు. 50 మంది డాక్టర్లతో ఏర్పాటు చేసిన హెచ్‌ఎన్‌ఏ కౌన్సిల్ తరపున డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ మండలాల వారీగా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ గోషిక, సీఎ ప్రవీణ్‌కుమార్, మిల్లెట్ రైతులు, వినియోగదారులు, లెట్సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెట్ ఫెస్ట్.. స్టైలిష్ డాగ్స్విభిన్న జాతులు.. వివిధ రకాల పెంపుడు కుక్కలు సందడి చేశాయి. చూపరులను ఆకట్టుకున్నాయి. శనివారం బీ2ఎం వెట్‌కేర్ ఆసుపత్రిలో రెయిన్బో విస్టాస్ పెట్ లవర్స్ అసోసియేషన్ సహకారంతో పెట్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ మెగా పెట్ ఫెస్ట్‌లో 40కిపైగా విభిన్నమైన జాతుల స్టైలిష్ డాగ్‌లు కనువిందు చేశాయి. పెంపుడు జంతువులను ఆకర్షించడం, వాటితో స్నేహం చేయడం, అనుభవాలను పంచుకోవడానికి పెద్ద సంఖ్యలో పెట్ లవర్స్ తరలి రావడంపై గర్వంగా ఉందని బీ2ఎం వెట్‌కేర్ వ్యవస్థాపకుడు సంతోష్‌నాయక్ అన్నారు. పెంపుడు జంతువుల సంరక్షణ చర్యలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి పెట్ ఒక ప్రత్యేకమైనదన్నారు. -
ఎండలు మండించే సమ్మర్... చైల్డ్ కేర్!
పిల్లలకు ఆటల్లో ఒళ్లు తెలియకపోవడమే కాదు... ఎండ తీవ్రతా తెలియదు. ఇప్పటికే ఎర్రటి ఎండ మండుతోంది. ఇంతటి ఎండల తీవ్రత వల్ల ఆరుబయట ఆడే పిల్లలకు వడదెబ్బ మొదలుకొని, డీహైడ్రేషన్ వరకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీడపట్టున ఉంటే వడదెబ్బ తగలదని కొందరి అభిప్రాయం. కానీ నీడ ఉన్నప్పటికీ అక్కడ వేడిమి తీవ్రత ఎక్కువగా ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం లేకపోలేదు. వేసవిలో చిన్నారులకు ఎండ ముప్పులు ఏయే రూపాల్లో వస్తాయో చూద్దాం. ఎండ తీవ్రతతో సమస్యలివి... మజిల్ క్రాంప్స్ : దేహం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలు అందుతూ ఉంటాయి. ఈ ఆదేశాలన్నీ లవణాలలోని విద్యుదావేశం కలిగిన అయాన్లు నరాల ద్వారా ప్రసరించడం వల్ల కండరాలకు ఆదేశాలందుతూ ఉంటాయి. ఇదీ చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఎండవేడిమి తీవ్రతతో చెమట రూపంలో నీటినీ, లవణాలనూ కోల్పోవడం వల్ల నరాల ద్వారా మెదడునుంచి కండరాలకు సరైన ఆదేశాలందవు. దాంతో డీ–హైడ్రేషన్‌కు గురి కాగానే కండరాలు బిగుసుకుపోతాయి. వీటినే మజిల్క్రాంప్స్గా చెబుతారు. మజిల్క్రాంప్స్ వస్తే వెంటనే దేహానికి నీటిని అందించాలి. పిల్లల్లో మజిల్ క్రాంప్స్ వస్తే : పిల్లలకు మజిల్క్రాంప్స్ కారణంగా కండరాలు బిగదీసుకుపోతుంటే వారికి ‘ఓరల్–రీ-హైడ్రేషన్ (ఓఆర్ఎస్) ద్రావణాన్ని తాగించాలి. ∙ఓఆర్ఎస్ అందుబాటులో లేక΄ోతే కొబ్బరినీళ్లు కూడా తాగించవచ్చు. ఓఆర్‌ఎస్‌గానీ, కొబ్బరినీళ్లుగానీ అందుబాటులో లేకపోతే... ఒక అరటిపండు తినిపించి, మంచినీళ్లు తాగించాలి. అరటిపండులో నొటాషియం వంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అరటిపండూ, నీళ్లతో అవి చాలావరకు భర్తీ అవుతాయి.వడదెబ్బ : ఒక్కోసారి చాలా ప్రాణాంతకంగా మారే మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ ఈ వడదెబ్బ. శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్. కానీ పిల్లలు వడదెబ్బకు లోనైతే వారి శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి΄ోతుంది. వాస్తవానికి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు మెయింటెయిన్ అయ్యేందుకు మెదడులోని హై΄ోథెలామస్ అనే గ్రంథి తోడ్పడుతుంది. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళిదేహ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమటలు పట్టి... దేహంలోంచి ఉష్ణోగ్రతను తీసుకుని ఆ చెమటలు ఆవిరైపోతూ ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒకే స్థాయిలో మెయింటైన్ అవుతుంటుంది. కానీ దేహ ఉష్ణోగ్రత అదేపనిగా పెరిగి΄ోతూండటంతో స్వేదగ్రంథులు అలసిపోయి ఇక ఏమాత్రం పనిచేయని స్థితికి చేరుకుంటాయి. దాంతో శరీరం వేడెక్కుతున్నా... దాన్ని నియంత్రిస్తూ ఉష్ణోగ్రత సమంగా ఉండేలా చేయడానికి అవసరమైన యంత్రాంగం విఫలం కావడంతో దేహ ఉష్ణోగ్రత ఇంకా ఇంకా పెరిగి΄ోతుంది. దీనికి ఓ సూచన కూడా ఉంటుంది. పిల్లల చంకల్లోనూ చెమట పట్టని స్థితి రావడం ఒక్కోసారి పిల్లలు స్పృహ తప్పిపోయి అపస్మారక స్థితికి చేరడం వడదెబ్బను సూచిస్తాయి.వడదెబ్బలో లక్షణాలివి... వికారం, వాంతులు; కళ్లు తిరగడం; ∙నీరసం, స్పృహ తప్పడం, ఫిట్స్ రావడం,చివరగా కోమాలోకి వెళ్లడం జరగవచ్చు. వడదెబ్బకు చికిత్స: దేహ ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరి అంతకంతకూ పెరుగుతుంటే... ఆ కారణంగా మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ స్థాయికి (నార్మల్కు) తీసుకురావడం అవసరం. ఒంటి ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్‌కు మించుతున్నట్లు తెలియగానే వెంటనే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. ఫ్యాన్ కింద కూడా వేడిగాలి వస్తుంటే పిల్లల దుస్తులను వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. దుస్తులు ఇబ్బందికరంగా ఉంటే నడుముకు చిన్న ఆచ్ఛాదన ఉంచి, బట్టలన్నీ తీసేయాలి. చల్లటి నీటిలో ముంచిన గుడ్డతో ఒళ్లంతా తుడుస్తూ చల్లటి గాలి ఒంటికి వేగంగా తగులుతూ వెళ్లేలా చూడాలి. ఇలా ఒళ్లు త్వరగా చల్లబడుతుంది. ∙ఈ చర్యల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల దగ్గర ఐస్ గడ్డలనుంచాలి. దాంతో శరీరం మరింత చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఒబేస్ పిల్లలకు జాగ్రత్త అవసరం! మామూలు పిల్లలతో పోలిస్తే కాస్త ఒబేస్‌గా ఉండే పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ పిల్లల ఒంట్లోంచి నీళ్లు కోల్పోతున్నప్పుడు ఆ నీటితో పాటు విలువైన ఖనిజలవణాలనూ కోల్పోతున్నారని గ్రహించాలి. స్థూలకాయమున్న పిల్లలు బాగా ఆటలాడుతున్నప్పుడు ప్రతి కిలోకు 50 మిల్లీలీటర్ల నీరు కోల్పోవచ్చు. దాంతో తమ పిల్లలు బరువు కోల్పోతూ, ఆరోగ్యంగా మారుతున్నారంటూ పెద్దలు అపోహ పడటం సరికాదు. వాళ్లు విలువైన ఖనిజలవణాలు కోల్పోయి డీ–హైడ్రేషన్‌కు గురవుతున్నారనే విషయాన్ని గ్రహించాలి. అందుకే ఇలా బరువు తగ్గుతున్నప్పుడు పెద్దలు వారి ఒంటిలో జరిగే జీవక్రియలకు (మెటబాలిక్ యాక్టివిటీస్‌కు) అవసరమైన నీటిని వెంటవెంటనే భర్తీ చేస్తూ ఉండాలి. అందుకే స్థూలకాయులైన పిల్లలు వెంటవెంటనే మరింత బరుతు తగ్గుతున్నట్లు గ్రహిస్తే పెద్దలు వారి ఒంట్లోకి తగిన ఎలక్ట్రోలైట్స్ పంపించేందుకు కొబ్బరినీళ్లు, గ్లూకోజ్ వంటివి ప్రతి 20 నిమిషాలకొకసారి తాగిస్తూ ఉండటం తప్పనిసరి. ఎండ దుష్ప్రభావాల నివారణ ఇలా... ఎండవేళల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి ప్రదేశాల్లోనే ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎండవేళల్లో ఇన్డోర్ గేమ్స్‌కు మాత్రమే వారిని పరిమితం చేస్తే బాగుంటుంది. ∙ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే, అందునా ఇంట్లో కూడా చల్లగా ఉండే ప్రదేశాల్లోనే ఉండేలా చూడాలి. ఆటల్లో పూర్తిగా నిమగ్నమైపోయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారు కొద్దికొద్దిగా మంచినీళ్లు తాగుతుండేలా చూడాలి. వీలైతే మధ్యమధ్యలో కొబ్బరినీళ్లు, పళ్లరసాలు కూడా ఇవ్వవచ్చు. ఇలాంటి కొద్దిపాటి జాగ్రత్తలతో పిల్లలు వేసవి దుష్ప్రభావాలకు లోనుకాకుండా జాగ్రత్త పడాలి. సాయంత్రాలు బాగా చల్లబడ్డ తర్వాతనే వాళ్లను ఔట్‌డోర్ గేమ్స్‌కు అనుమతించాలి. ఎండలు మండిపోతున్నాయి. పిల్లలకు సెలవులూ వచ్చాయి. నీడపట్టున ఉండాల్సిన పిల్లలు కాస్తా సెలవుల్లో ఆడుకోవడం కోసం ఎండల్లోకి వెళ్తే...? అది మరింత ప్రమాదం. ఈ వేసవి వేడిమితో చిన్నారులకు వచ్చే సమస్యలేమిటో, ఈ సెలవుల ఎండల్లోంచి పిల్లలను కాపాడుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.ఎండల్లో పిల్లలు ఎక్కువగా చెమట వల్ల నీరూ, లవణాలూ కోల్పోతున్నారని తెలియడానికి విపరీతంగా చెమట పట్టడమే సూచన అని కొందరు అ΄ోహపడుతుంటారు. అది వాస్తవం కాదు. పిల్లలతో పోలిస్తే పెద్దల్లో చెమట గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రత పెరగగానే చెమటలు పట్టడం పెద్దల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ పిల్లల్లో అలా కాదు. వాళ్లలో పెద్దల మాదిరిగా చెమటలు పట్టాలంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. ఒంటిని చల్లబరిచే మెకానిజమైన చెమట పట్టడమన్నది పిల్లల్లో కాస్త తక్కువే కావడం వల్ల పెరిగే కొద్దిపాటి వేడిమి కూడా పిల్లలపై ఎక్కువగా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలకు పెద్దగా చెమటలు పట్టక΄ోయినా... వాళ్ల ఒంటి ఉష్ణోగ్రత త్వరగా పెరుగుతుందని తెలుసుకోవడంతోపాటు చిన్నపిల్లల్లో చెమట గ్రంథుల సంఖ్య తక్కువ కాబట్టి వేడెక్కిన ఒళ్లు వెంటనే చల్లబడదు కాబట్టి బాగా చల్లగా ఉండేచోటే వాళ్లు ఆడుకుంటూ ఉండేలా చూడాలి. ఆరుబయటి ఉష్ణోగ్రత బాగా తగ్గాకే వారిని బయట ఆటలాడటానికి అనుమతించాలి. డా. శివనారాయణ రెడ్డి వెన్నపూస,సీనియర్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్!
గతంలో గర్భధారణ (ప్రెగ్నెన్సీ) ప్లానింగ్ అంటూ ఏదీ ఉండేది కాదు. నిజానికి తమకు కావాల్సినప్పుడు, తమకు అవసరమైన సమయంలోనే ప్రెగ్నెన్సీ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే... అది వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కాబోయే తల్లికీ, పుట్టబోయే బిడ్డకూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. తల్లీ బిడ్డా సురక్షితంగా కూడా ఉంటారు. సరైన ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌తో ప్రయోజనాలెలా కలుగుతాయో తెలుసుకుందాం. గతం తరం యువతుల్లో తమకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం నెల తప్పిన తర్వాత గానీ తెలిసేది కాదు. అప్పుడు... తమకు పెగ్నెన్సీ వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇంట్లోనే కొన్ని పరీక్షలు చేసుకునేవారు. అయితే గర్భధారణను ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో కొన్ని లోపాల నివారణకు ముందునుంచే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మహిళ తాము నెల తప్పాలనుకున్న మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనే పోషకాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనాలుంటాయి. మార్కెట్లో మాత్రల రూపంలో దొరికే ఈ ఫోలిక్ యాసిడ్ చాలా చవక. నిజానికి పాలకూర లాంటి ఆకుకూరల్లో అది సమృద్ధిగా ఉంటుంది. పిండంలో వచ్చేందుకు అవకాశమున్న న్యూరల్ ట్యూబ్ (వెన్నుపాము) లోపాలను అది అరికడుతుంది. పుట్టుకతో వచ్చే ఈ వెన్నుపాము లోపాలను స్పైనాబైఫిడా అంటారు. చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఫోలిక్ యాసిడ్ ఇలాంటి అనేక ప్రెగ్నెన్సీ లోపాలను అరికడుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్న మహిళలకు మూడు నెలల ముందునుంచే ఆబ్స్ట్రెష్టీషియన్స్/ గైనకాలజిస్టులు ఫోలిక్ యాసిడ్ మాత్రలను సూచిస్తుంటారు. ప్రెగ్నెన్సీ ప్లాన్నింగ్ వల్ల స్పైనా బైఫిడా మాత్రమే కాకుండా పౌష్టికాహార లోపాల వల్ల పిండదశలో ఎదురయ్యే మరెన్నో సమస్యలూ నివారించవచ్చు. అంతేకాదు... దేశంలోని మహిళల్లో దాదాపు 59 శాతం మందిలో రక్తహీనత (అనీమియా) ఎక్కువ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మహిళకు ఐరన్ సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా కూడా కాబోయే తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంది. చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళిగర్భం ప్లాన్ చేసుకున్న నాటి నుంచి మహిళకు అన్ని పోషకాలూ అందేలా ఆరోగ్యకరమైన సమతు లాహారాన్ని ఇవ్వడం, అందులో కూరగాయలు, ఆకుకూరలు, తాజాపండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలతో ఇటు కాబోయే తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు, ఆ చిన్నారికి తగినంత రోగనిరోధక శక్తి సమకూరేలా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశముంటుంది. డా.స్వప్న సముద్రాలసీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రీషియన్ -
లెడ్ పాయిజనింగ్ అవుతోందా?
నాకిప్పుడు మూడోనెల. నేను పెయింట్, డైయింగ్ షాప్‌లో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాను. లెడ్ పాయిజనింగ్ అవుతుందని విన్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దేశీత, శ్రీకాకుళం.పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారు ఎక్కువ శాతం లెడ్ డస్ట్‌కి గురవుతారు. లెడ్ పెయింట్స్‌ని స్ట్రిప్ చేసినప్పుడు, అది పీల్చుకుంటే లెడ్ డస్ట్ ఎక్కువ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ పరిశ్రమల్లో ఉండే ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అవుతుంది. ఎక్కువ కాలం లెడ్ డస్ట్‌కు గురైతే, లెడ్ పార్టికల్స్ శరీరంలోకి చేరుతాయి. అందుకే, ఈ పరిశ్రమల్లో పని చేసేవారు శరీరం, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. సాధారణ వాతావరణం ద్వారా అందరికీ కొంత లెడ్ ఎక్స్పోజర్ అవుతుంది. కానీ, ఎక్కువ శాతం ఈ పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో వారికే అవుతుంది. ఈ లెడ్ శరీరంలోకి వ్యాపించి ఎముకలు, దంతాల్లో నిల్వ ఉంటుంది.అంతేకాదు, ప్రెగ్నెన్సీలో ఈ లెడ్ పార్టికల్స్ బ్లడ్ స్ట్రీమ్‌లోకి చేరి తల్లికి, బిడ్డకు ప్రమాదం చేస్తాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో రక్తపరీక్షల్లో ఈ లెడ్ లెవల్‌ను పరిశీలిస్తాం. క్యాల్షియం, ఐరన్, విటమిన్ డీ, విటమిన్ ఈ, విటమిన్ సీలను ఆహారంలో తక్కువ తీసుకునే వారికి ఈ లెడ్ అబ్జార్ప›్షన్ పెరుగుతుంది. అందుకే, సమతుల్యమైన ఆహారం, పోషకాహారం ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఈ లెడ్ లెవెల్స్ 5 ఎమ్సీజీ / డీఎల్ కన్నా ఎక్కువ ఉంటే అది డేంజర్ లెవెల్ అని అర్థం. లెడ్ మెటల్ ప్లాసెంటాను దాటి పిండంలోకి చేరగలదు. ఈ లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గర్భస్రావం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు, హై బీపీ వంటి సమస్యలు పెరుగుతాయి. బిడ్డ మెదడుపై కూడా ప్రభావం పడుతుందని పరిశోధనల్లో తేలింది.బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. అందుకే, డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలి. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, రక్తంలో మీ లెడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చెస్తారు. నీటిలో కూడా లెడ్ ఎక్స్‌ప్లోజర్ కావచ్చు. కాబట్టి వడగట్టి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. పరీక్షల్లో లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మొదట క్యాల్షియం మాత్రలు ఇస్తారు. ఒక గ్రాము డోస్ రోజూ డెలివరీ వరకు తీసుకోవాలి. చెలేషన్ థెరపీ ఇవ్వాలి. రెండు నుంచి నాలుగు వారాల తరువాత లెడ్ లెవెల్స్‌ను మళ్లీ చెక్ చేస్తాం. రెండో త్రైమాసికంలో సురక్షితంగా ఈ మందును అడ్జస్ట్ చేసి ఇస్తాం. భవిష్యత్తులో లెడ్ ఎక్స్పోజర్ ఎక్కువ కాకుండా డెలివరీ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి.ఎలాంటి వారికి సమస్య ఎక్కువ?నా వయసు ముప్పై సంవత్సరాలు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నాము. ఎలాంటి వాళ్లకి ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి?– ప్రణతి, గుంటూరు.ప్రెగ్నెన్సీలో కొందరికి ఎక్కువ సమస్యలు కావచ్చు. మరికొందరికి తక్కువ ఉండవచ్చు. సాధారణంగా అలసట, థైరాయిడ్ సమస్యలను ఎక్కువమందిలో చూస్తాం. కానీ, కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న వారిలో సమస్యలు ఎక్కువ అవుతాయి. బరువు ఎక్కువ ఉండటం, స్థూలకాయం, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో తల్లికి బీపీ, మధుమేహం, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బేబీకీ వెన్నెముక, మెదడు సమస్యలు పెరుగుతాయి. వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న తల్లుల్లో క్రోమోజోమ్ అసాధారణతలు ఎక్కువ ఉంటాయి. అలానే టీనేజ్ ప్రెగ్నెన్సీలో కూడా సమస్యలు ఎక్కువ. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన కండిషన్స్‌లో కూడా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ట్విన్స్, మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్లో ఉండవచ్చు. వారిలో షుగర్, హై బీపీ ప్రమాదం పెరుగుతుంది. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఎదుగుదల సమస్యలు, ప్లాసెంటా సమస్యలు ఉన్నా ఇప్పుడు అవి ప్రభావం చూపుతాయి. అందుకే, మూడవనెల నుంచి మంచి ఆహారం తీసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే, ప్రమాదాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా పరీక్షలు చేసి, మందులను సూచిస్తారు.ప్రెగ్నెన్సీలో బేబీకి ప్రమాదమా?నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నాను. ఇంట్లో ఉమ్మడి కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే పనిచేసే ఆఫీసులోనూ కూడా చాలా టార్గెట్స్ ఉంటాయి. ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. అది తగ్గించుకోవాలన్నా అవటం లేదు. ఈ ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో బేబీకి ఏదైనా ప్రభావం ఉంటుందా? – రూప, బెంగళూరు.ఒత్తిడి అనేది మానవ జీవితంలో సహజం. కానీ, ప్రెగ్నెన్సీ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా అనుభవించవలసిన సమయం. ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత సంతోషంగా ముందుకు వెళ్లగలరు. సానుకూల వైఖరి చాలా అవసరం. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. ఒత్తిడి పెంచే ఆలోచనలు అస్సలు చెయ్యకూడదు. ప్రెగ్నెన్సీలో శరీరం, మెదడులో చాలా మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పుల వలన కొంత అసహనం, చిరాకు ఉంటాయి. అతిగా ఒత్తిడికి గురైతే నిద్రలేమి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, హై బీపీ, నెలలు నిండకుండానే ప్రసవం, పుట్టిన బిడ్డ బరువు తక్కువ ఉండటంలాంటి సమస్యలు రావచ్చు. ఒత్తిడికి దారితీసే కారణాలను వెతికి, వాటిని ముందే పరిష్కరించుకోవాలి. కనీసం తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ ఒక గంటసేపు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. బాగా నిద్రపోవాలి. -
World Liver Day: సురక్షితమైన జీవనానికి కాలేయ ఆరోగ్యం అనివార్యం
హైదరాబాద్: ఆరోగ్యకరమై, సురక్షితమైన జీవనానికి కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కాలేయ ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఉంటే కాలేయ వ్యాధుల నియంత్రణ కష్టమేమి కాదనీ ఆలివ్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్. పరాగ్ దశత్వార్ అన్నారు. అంతర్జాతీయ కాలేయ దినోత్సవం సందర్భంగా ఆలివ్ హాస్పిటల్ యాజమాన్యం కాలేయ వ్యాధులపై పౌరులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. గ్యాస్ట్రో, హెపటాలజీ వైద్య బృందంతో కాలేయాన్ని సంరక్షించుకునే అంశాలపై చర్చించారు. శరీర జీవక్రియలలో కీలక పాత్ర పోషించే కాలేయంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు సూచించారు.కాలేయ వ్యాధులు, నివారణ, నియంత్రణ చర్యలపై అవగాహన కలిగి ఉంటే ప్రాణప్రాయ పరిస్థితులే దరిచేరవని ఆసుపత్రి కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ పరాగ్ దశత్వార్ అన్నారు. ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ, కాలేయ వ్యాధులు, ఇన్ ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్, జీఐ మాలిగ్నెన్సీ వంటి వ్యాధులకు చికిత్స చేయడంలో అనుభవం కలిగి కాలేయ ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయన మాట్లాడారు. " కాలేయం నిర్విషీకరణ, జీర్ణక్రియ, పోషక నిల్వ, రక్తం గడ్డకట్టడం వంటి ముఖ్యమైన విధులకు బాధ్యత వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయి. ఏటా లక్షలాది కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు. హెపటైటిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు గురౌతున్నారు. పోషకాహారం, కొవ్వు, చక్కెర, సోడియంను పరిమితం చేస్తే కాలేయ వాపు గణనీయంగా తగ్గుతుంది.మెడిటరేనియన్ డైట్ వంటి ఆహారాలు నాన్-ఆల్కహాలిక్ ప్యాటీ లివర్ వ్యాధులను తిప్పికొట్టవచ్చు. కాలేయ సంబంధిత వ్యాధుల ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. నగరీకరణ జీవనశైలి, మద్యపానం, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి కారణాలతో కాలేయ ఆరోగ్యాన్ని ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. కాలేయాన్ని సంరక్షించుకునేందుకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల ఆహారాన్న తీసుకోవాలి. మద్యపాన వినియోగం తగ్గించడం, క్రమం తప్పని శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన బరువు, హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండటం వంటి అలవాట్లతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వీటితోపాటు అదనంగా హెపటైటిస్ A, Bలకు టీకాలు వేయడం కీలకం అన్నారు. కాలేయ వ్యాధులకు ప్రత్యేక సంరక్షణతో సమగ్రమైన, అధిక నాణ్యతను అందించే లక్ష్యంలో ఆలివ్ హాస్పిటల్ సిద్ధంగా ఉంది. అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో, ఆసుపత్రి రోగులకు సాధ్యమైనంతఉత్తమమైన ఫలితాలను నిర్ధారించడానికి సాధారణ స్క్రీనింగ్ ద్వారా అధునాతన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి." అని అన్నారు.ఆలివ్ హాస్పిటల్ గురించి: తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ ఆధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది.ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్, ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్థులైన వైద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత యొక్క బంగారు ప్రమాణం అయిన నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్‌కేర్ నుండి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. -
Mulberry మల్బరీ జ్యూస్ : ఆరోగ్య ప్రయోజనాలు
తియ్య తియ్యగా... పుల్ల పుల్లగా ఉండే మల్బరీ పండ్లు అన్ని కాలాలలోనూ అందుబాటులో ఉంటాయి. మల్బరీ పండ్లతో చేసిన జ్యూస్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అవేమిటో చూద్దాం..మల్బరీతో ఆరోగ్య ప్రయోజనాలుమల్బరీలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం, కడుపులో మంటలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మల్బరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి రక్తనాళాల పనితీరును మెరుగుపరచి రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. తద్వారా స్ట్రోక్స్, గుండెపోటు వంటి సమస్యలను నివారిస్తుంది.ఇదీ చదవండి: ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగారోగనిరోధక శక్తి పెంపు: మల్బరీ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధులకు వ్యతిరేకంగా శక్తిమంతమైన రక్షణను అందిస్తుంది.ఎముకల ఆరోగ్యానికి: మల్బరీలోని విటమిన్ కె, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి మంచిది.కంటి చూపు మెరుగు: మల్బరీ జ్యూస్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది తాగడం వల్ల చూపు మెరుగుపడుతుంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసే వారికి కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.వేగంగా కోలుకోవడానికి తోడ్పడుతుంది: శస్త్రచికిత్స తర్వాత రోగులకు మల్బరీ జ్యూస్ చాలా ఉపయోగ కరంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. జుట్టు సహజ రంగును నిలుపుకుంటుంది: మల్బరీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టు సహజ రంగును నిలుపుకోవడానికి సహాయ పడుతుంది, జుట్టు నెరిసిపోవడాన్ని తగ్గిస్తుంది.చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!మెదడు ఆరోగ్యానికి మంచిది: మల్బరీలో న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉన్న వివిధ బయో యాక్టివ్ సమ్మేళనాలు మెదడు కణాలను ఒత్తిడి నుంచి రక్షించి ఐక్యూను మెరుగుపరుస్తాయి. మల్బరీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నోట్ : చివరగా... ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఈ జ్యూస్‌ని విపరీతంగా తాగ కూడదు. పరిమితి పాటించడం మంచిది. -
రోజంతా నీరసంగా అనిపిస్తోందా? ఇలా ప్లాన్ చేయండి!
చాలామంది రోజంతా నీరసంగా.. నిస్సత్తువగా గడుపుతుంటారు. దీనివల్ల శరీరం నిస్తేజంగా మారడమే కాకుండా అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిన్నపాటి మార్పుల ద్వారా రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవచ్చు. అవేంటో చూద్దాం.. తగినంత నిద్ర.. ప్రతిరోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. నిద్రలేమి చిరాకు, నీరసానికి దారితీస్తుంది.ఆరోగ్యకరమైన ఆహారం.. పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు శరీరానికి శక్తినిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే వాటిని తగ్గించడం మంచిది. వ్యాయామం.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల ΄ాటు వ్యాయామం చేయడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. శక్తి స్థాయులు పెరుగుతాయి. నడవడం, యోగా, డ్యాన్స్ లేదా ఇష్టమైన ఏదైనా శారీరక శ్రమ చేయవచ్చు.నీరు తాగడం.. రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. డీహైడ్రేషన్ వల్ల అలసట, చిరాకు కలగవచ్చు.ధ్యానం, విశ్రాంతి.. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ కోసం కేటాయించండి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.పాజిటివ్ ఆలోచనలు.. ప్రతికూల ఆలోచనలను తగ్గించుకుని సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి. కృతజ్ఞత కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.ఇష్టమైన పనులు చేయడం.. ఆనందం కలిగించే హాబీలు లేదా పనుల కోసం సమయం కేటాయించడం మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.సామాజిక సంబంధాలు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ఇతరులతో మాట్లాడటం, కనెక్ట్ అవ్వడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.కొత్త విషయాలు నేర్చుకోవడం.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదా కొత్త విషయాలు తెలుసుకోవడం మీ మనస్సును ఉత్తేజపరుస్తుంది, ఉల్లాసంగా ఉంచుతుంది.రోజువారీ అలవాట్లు.. ఉదయం లేవగానే సహజమైన సూర్యకాంతిలో గడపడం శరీరపు జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది, ఉల్లాసంగా ఉంచుతుంది.చిన్న చిన్న విరామాలు.. మీరు ఎక్కువసేపు ఒకే పనిలో ఉంటే, మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి. లేచి కొంచెం నడవండి లేదా స్ట్రెచ్ చేయండి.పనులు ప్లాన్ చేసుకోవడం.. రోజువారీ పనులను ఒక క్రమంలో ప్లాన్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మరింత నియంత్రణలో ఉన్నట్లు అనిపిస్తుంది.నవ్వండి, నవ్వించండి.. నవ్వడం ఒక గొప్ప ఒత్తిడి నివారిణి, హాయిగా నవ్వుకోడం మానసిక స్థితిని తక్షణం మెరుగు పరుస్తుంది.ఈ చిట్కాలను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా రోజంతా ఉల్లాసంగాఉత్సాహంగా ఉండగలగడం ఎవరికైనా సాధ్యమే.ఒకవేళ మీకు ఏవైనా ప్రత్యేకమైన ఆందోళనలు ఉంటే, వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. -
Selenium శాపం: అప్పుడు వెంట్రుకలు.. ఇప్పుడు గోళ్లు
ముంబై: బుల్ధానా జిల్లాలోని షెగావ్ తాలూకా గ్రామాల ప్రజలను ‘సెలీనియం’శాపం వేధిస్తోంది. తాలుకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 30 మంది గోళ్ల సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని బుల్దానా ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ బంకర్ తెలిపారు. సెలీనియం అధిక వినియోగం వల్లే... కాగా గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో షెగావ్ తాలూకా జాతీయ వార్తల్లో ప్రధానంగా నిలిచింది. తమకు హఠాత్తుగా బట్టతల వచ్చిందని, జుట్టు విపరీతంగా ఊడిపోయిందని పలువురు ఆరోగ్యశాఖ అధికారులను ఆశ్రయించారు. నిజనిజాలపై నిపుణులు ఆరా తీయగా రేషన్ దుకాణాలు పంపిణీ చేసిన గోధుమల్లో అత్యధిక శాతం సెలీనియం ఉండటం, దానిని వినియోగించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తేలింది. అయితే కొందరు ఈ వాదనను ఖండించారు. ఏది ఏమైనప్పటికీ బాధితులు తీవ్ర ఆవేదన చెందారు. కాగా తాజాగా షేగావ్ తాలూకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు 30 మందికి గోళ్ల సంబంధిత సమస్యలు తలెత్తాయి. కాగా సెలీనియం అధిక వినియోగం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చునని భావిస్తున్నట్లు అనిల్ బంకర్ తెలిపారు. గతంలో ఈ సమస్యను ఛేదించిన పద్మశ్రీ వైద్యుడు హిమ్మత్రావ్ బవాస్కర్రాత్రికి రాత్రే మహారాష్ట్రలోని బుల్ధానాలో, 4 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల 300 మంది గ్రామస్తుల ప్రజలు జుట్టు రాలిపోవడం, ఇతర సమస్యలతో బాధపడ్డాడు. తొలుతు దీనికి నీటి కాలుష్యం కారణమని అంతా భావించారు. కానీ తేలు కాటు చికిత్సలో తన కృషికి ప్రసిద్ధి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్రావ్ బవాస్కర్ దీన్ని నమ్మలేదు. 92 వేల రూపాయలకు పైగా సొంత ఖర్చులతో ఒక నెల రోజులపాటు పరిశోధన చేశారు. జుట్టు, రక్తం, మూత్రం, ఆహార నమూనాలను సేకరించి, ఆహారం, ఆహార వనరులు, లక్షణాలను నిశితంగా విశ్లేషించింది. దీనికి అధికమోతాదులో ఉన్న సెలీనియం కారణమని తేల్చారు. సురక్షితమైన పరిమితికి 600 రెట్లు ఎక్కువ ఉంటుంది. కలుషితమైన గోధుమలను,గోధుమ పిండి (అట్టా) పంపిణీతో, గ్రామస్తులు తెలియకుండానే వారి రోజువారీ భోజనం ద్వారా విషపూరిత స్థాయిలలో సెలీనియంను వినియోగించారని వెల్లడించారు.సెలీనియం ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ లక్షణాలు దీర్ఘకాలంగా సెలీనియం ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధినే సెలెనోసిస్ అంటారు.సెలీనియం అనేది ఒక రసాయన మూలకం. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. సెలీనియం ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది చిన్ని మొత్తంలోనే శరీరానికి అవసరం. జీవక్రియ, థైరాయిడ్ పనితీరులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిసుంది. అయితే దీని వినియోగం ఎక్కువైతే కొన్ని దుష్పరిణామాలు తప్పవు.లక్షణాలు : జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం లేదా రాలిపోవడం, నోటిలో లోహ రుచి, శ్వాస వెల్లుల్లి వాసన, చర్మపు దద్దుర్లు, వికారం, విరేచనాలు, అలసట, చిరాకు, నాడీ వ్యవస్థలో లోపాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, తలనొప్పి.సెలీనియం విషప్రభావం తొలిలక్షణాలు: శ్వాసలో వెల్లుల్లి వాసన, నోటిలో లోహ రుచి.సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు: బ్రెజిల్ నట్స్ చేపలు, షెల్ షిఫ్ ఎర్ర మాంసం, ధాన్యాలు, గుడ్లు, కోడి మాంసం, కాలేయం, వెల్లుల్లి. ఇవీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్కరణ్ జోహార్ షాకింగ్ వెయిట్ లాస్ ఒజెంపిక్ ఇంజెక్షన్లే కారణమా? -
కరణ్ జోహార్ షాకింగ్ వెయిట్ లాస్ ఒజెంపిక్ ఇంజెక్షన్లే కారణమా?
చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) అకస్మాత్తుగా బరువు తగ్గి, బక్కిచిక్కిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత త్వరగా బాగా బరువు తగ్గి అటు అభిమానులను, ఇటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. అదనపు బరువును తగ్గించడానికి అసహజ పద్ధతులను ఉపయోగిస్తున్నాడనే పుకార్లు జోరుగా వ్యాపించాయి. బరువు తగ్గడానికి ఓజెంపిక్ (Ozempic) ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై కరణ్ జోహార్ (కేజో) తాజాగా స్పందించాడు. అసలేంటీ ఓజెంపిక్ ఇంజెక్షన్, దీంతో అంత తొందరగా బరువు తగ్గవచ్చా? కరణ్ జోహార్ ఏమన్నాడు? తెలుసుకుందాం.స్టైలిష్; ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే కరణ్ జోహార్ కరణ్ ఉన్నట్టుండి బక్కగా మారిపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. విపరీతంగా ఓజెంపిక్స్ తీసుకోవడంతోనే ఇలా అయ్యాడని కామెంట్లు వినిపించాయి.అయితే తాజాగా వీటిపై కరణ్ స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను బరువు తగ్గడానికి ప్రధానంగా రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తున్నానని తెలిపాడు. కఠినమైన ఆహార ప్రణాళిక ఈ మార్పునకు కారణమని కరణ్ వెల్లడించాడు. ఇటీవల, కరణ్ జోహార్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో 'ఆస్క్ కేజో' సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులు అతని ఆకస్మిక బరువు తగ్గడం స్లిమ్‌గా మారడం వెనుక గల కారణం గురించి ప్రశ్నించారు. తాను ఇలా మారడానికి చాలా సమయం పట్టిందని, అందరూ అనుకున్నట్టుగా తాను ఎలాంటి మందులు తీసుకోలేదని స్పష్టంగా పేర్కొన్నాడు. ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, వ్యాయామంతో సరైన మార్గంలో బరువు తగ్గాను. ఇపుడు చాలా బావుంది.కొత్త ఉత్సాహం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అంతేకాదు తాను ఆరోగ్యంగా,హ్యాపీగా ఉన్నానంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు. నెటిజన్లు ఒప్పుకోవడం లేదుమరోవైపు కరణ్ జోహార్ ఓజెంపిక్‌ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్‌తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు. కరణ్ గణనీయంగా బరువుగా తగ్గడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం కూడా ఆయన బరువు తగ్గడం ఆకర్షించింది. బరువు తగ్గడానికి ముందు, తరువాత అంటూ ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. అలాగే కరణ్ జోహార్ ఓజెంపిక్ ఉపయోగిస్తున్నాడని ఎక్స్ ఖాతాలో ఒక యూజర్ ఆరోపించాడు. దీంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.అసలేంటీ ఓజెంపిక్ టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న పెద్దలలో ఆహారం, వ్యాయామంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటానికి ఇంజెక్షన్ ఒక మెడిసిన్‌గా వాడతారు. 2017లో తొలిసారి దీనికి ఆమోదం లభించింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలోకి ఇన్సులిన్ సరైన విడుదలను ఇది నియంత్రిస్తుంది. Ozempic ఇంజెక్షన్ ఆకలిని తగ్గిస్తుంది . జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది చివరికి బరువు తగ్గడానికి దారితీస్తుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో బరువు తగ్గించే ఔషధంగా సెలబ్రిటీలు ఓజెంపిక్‌ను ఉపయోగిస్తున్నారా అని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. -
గంటల్లోనే వణుకుడు వ్యాధి మాయం..!
చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ.. మనమీద మనకే నియంత్రణ లేకుండా చేసే దారుణమైన సమస్య ..పార్కిన్సన్స్ డిసీజ్. దాదాపు ఏడాది క్రితం వరకు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. కానీ వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఓ సరికొత్త చికిత్స వచ్చింది. అదే.. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్జీఎఫ్యూఎస్). దీని సాయంతో.. కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్య ప్రముఖులు చెబుతున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబసభ్యులకు ఈ సమస్య, దాని లక్షణాలు, ఉన్న చికిత్స అవకాశాల గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్‌లోని మూవ్మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యంలో గురువారం నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై.. తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగాధిపతి, చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు.. “పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనిషిని పూర్తిగా కుంగదీసే సమస్య. దీనివల్ల వచ్చే శారీరక సమస్యలతో పాటు.. అవి ఉన్నాయన్న బాధ వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా ఎక్కువే. ఇంతకాలం మందులు, డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు మాత్రమే దీనికి పరిష్కారంగా ఉండేవి. ఇప్పుడు చిన్న కోత కూడా అవసరం లేకుండా కేవలం ఎంఆర్ఐ యంత్రానికి మరో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చి మూడు నాలుగు గంటల పాటు చికిత్స చేస్తాం. ఇది పూర్తయ్యి రోగి బయటకు రాగానే ఒకవైపు ఉన్న సమస్య పూర్తిగా నయం అయిపోతుంది. అప్పటివరకు ఉన్న వణుకు మటుమాయం అవుతుంది. పైగా ఈ ప్రక్రియ చేసేటప్పుడే వణుకు తగ్గిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కాబట్టి... పూర్తిగా తగ్గిన తర్వాతే చికిత్స పూర్తవుతుంది. అంతేకాదు గతంలో డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలకు ఎంత వ్యయం అయ్యేదో.. దాదాపుగా దీనికి కూడా అంతే అవుతుంది. వణుకు ప్రాథమిక దశలో ఉన్నవారి నుంచి బాగా తీవ్రంగా ఉన్నవారి వరకు ఎవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. వారికి ఒక చిన్న పరీక్ష చేసి, ఈ చికిత్స వారికి సరిపోతుందో లేదో నిర్ణయిస్తాం. ఆ తర్వాత చికిత్స చేయించుకుని.. హాయిగా ఎవరి సాయం లేకుండా ఒక్కరే నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించిన కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం జయశ్రీ మాట్లాడుతూ, “ఎంఆర్జీ ఎఫ్యూఎస్ అనేది చాలా అత్యాధునికమైన చికిత్స. ఇప్పటికే కిమ్స్ ఆస్పత్రిలో ఎనిమిది మంది రోగులకు దీని సాయంతో చికిత్స చేసి సత్పఫలితాలు సాధించాం. ఇందులో ఎలాంటి కోత అవసరం లేకుండా ఎంఆర్ఐతోనే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపుతారు. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులో ప్రభావితమైన ప్రాంతాలను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, వెంటనే చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్‌తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్న్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తాం. తర్వాత ఎక్కువ హీట్ తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుంది. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుంది. సాధారణంగా పార్కిన్సన్స్ రోగులకు ఒకవైపే (కుడి లేదా ఎడమ) సమస్య తీవ్రంగా ఉంటుంది. వ్యాధి త్రీవత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్సకు సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. ఫలితాలు మాత్రం వెంటనే కనిపిస్తాయి."ఓ కేసులో 28 ఏళ్ల యువకుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచర్ అవుదామనుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన తర్వాత ఇప్పుడు హాయిగా టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలామందికి సాయపడుతున్నాడు. అలాంటి నాణ్యమైన జీవితాన్ని అందరికీ ఇవ్వాలని కిమ్స్ తహతహలాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాలజీ బృందం అత్యుత్తమ సేవలు అందిస్తోంది. అందుకు వారికి అభినందనలు” అని కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు.చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్. మోహన్ దాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్టర్ ఈఏ వరలక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాడా, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు. “సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. అవి మోటార్, నాన్ మోటార్. మోటార్ సమస్యలు అంటే కదలికలకు సంబంధించినవి. వణుకు, గట్టిగా అయిపోవడం, నెమ్మదించడం లాంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. చేతులు, కాళ్లు విపరీతంగా వణుకుతుంటాయి. ఏవీ పట్టుకోలేరు, సరిగా నడవలేరు. నడకమీద నియంత్రణ ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోయే పనికి 20 నిమిషాలు పడుతుంది. ముఖంలో కదలికలు తగ్గిపోతాయి. ఇక నాన్ మోటార్ సమస్యల్లో నిద్ర లేకపోవడం, మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం, మలబద్ధకం, మానసిక సమస్యలు, వాసన లేకపోవడం లాంటి వాటితో పాటు.. శరీరం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తరచు పడిపోయి గాయపడతారు. ఈ సమస్యల వల్ల వాళ్లు నలుగురితో కలవలేక ఒంటరిగా మిగిలిపోతారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లలేరు. విపరీతమైన కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ పార్కిన్సన్స్ వల్ల అదనంగా వస్తాయి.(చదవండి: శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు.. ) -
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువుకి చెక్‌పెట్టడం ఓ సవాలు. ఎంతోమంది సెలబ్రెటీలు దీన్ని ఛాలెంజింగ్ తీసుకుని బరువు తగ్గి చూపించారు. అయితే అది అందరికీ సాధ్యం కాలేదు. కేవలం తగ్గాలన్న లక్ష్యంతో, కృతనిశ్చయంతో ఉన్నవారికే సాధ్యమైంది. అమ్మబాబోయ్ అనుకుని చేతులెత్తేయకుండా పట్టుపట్టి..ఆరోగ్యం కావాలనుకునే వారికే సుసాధ్యమైంది. ఇప్పుడు తాజాగా ఆ కోవలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్ట్ శోభా డే కుమార్తె ఆనందితా చేరారు. ఆమె కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే బరువు తగ్గేందుకు దారితీసిందని చెబుతున్నారు. ఇప్పుడామె ఎంత స్లిమ్‌గా మారారంటే..చూసేవాళ్లకే అసూయ కలిగేంతగా తగ్గిపోయారు. ఎందుకంటే జస్ట్ ఏడు నెలల్లోనే 40 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారామె. మరీ ఆమెకు అదెలా సాధ్యమైందో తెలుసుకుందామా..!.గత ఆగస్టు 23, 2024 వరకు అధిక బరువుతో ఉండేది. అప్పటి నుంచి తన వెల్నెస్ జర్నీ ప్రారంభించానని తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు ఫ్రీలాన్స్ రచయిత ఆనందిత. ఆ పోస్ట్‌లో '40 కిలోల తగ్గుదల' అనే శీర్షికతో తన వెయిట్‌లాస్ జర్నీ గురించి రాసుకొచ్చారామె. అసలు నమ్మలేకపోతున్నా.. ఇంతలా బరువు తగ్గానా..? అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తాను ఏవిధంగా బరువు తగ్గిందో వివరించింది. ముందుగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు గురించి తెలిపారామె. తన అధిక బరువు కారణంతో కనీసం కొద్ది దూరం నడిచేటప్పటికే ఆయాసం వచ్చేసిందని, కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని అంటూ మాట్లాడారామె. శరరీంలో చెడు కొలస్ట్రాల్ లెవెల్స్ ఏ స్థాయిలో పెరిగాయంటే ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కేటప్పటికే గుండెపోటు వచ్చేస్తుందేమోన్న భయం కలిగిందట. అలాగే చర్మం రంగు మారిపోయి తన ఆకృతే ఒకలా అయిపోందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు స్లీప్ ఆప్నియా, నిద్రలేమి, నిరంతర దగ్గు, డయాబెటిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేదాన్ని అన్నారు. ఇక ఇలాగైతే ఎన్నోనాళ్లు ఉండనన్న ఫీల్ కలిగి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టానన్నారామె. ముఖ్యంగా షుగర్ లేని ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక తగిన వ్యాయామం చేయడం వంటివి చేసినట్లు తెలిపారు. ఈ విధానంతో బరువు తగ్గడమే కాకుండా సులభంగా మెట్లు ఎక్కేయగలనని, పైగా మెట్లు లేని హోటల్లో స్టే చేయగలనని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు ఆనందిత బరువు తగ్గడం అంటే శరీరాకృతి మారడంగా భావించొద్దు అది మన వెల్నెస్ ప్రయాణంగా భావిస్తేనే..బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగానూ ఉంటామని చెబుతోంది ఆనందిత. View this post on Instagram A post shared by Anandita De (@ananditade) (చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?) -
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ టాలీవుడ్ కోలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన ప్రసిద్ధ నటి. 90లలో తన అందం, నటనతో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి ఆమె. ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలో ప్రేక్షకుల, విమర్శకుల మెప్పుని పొందారు. అంతేగాదు వేలాదిగా అభిమానులను సొంతం చేసుకున్న తమిళ నటి. అలాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ కూడా తన హవాను చాటుతున్నారు. అవసరమైనప్పుడూ ప్రజల తరుపున గళం విపుత్తు..వార్తల్లో నిలుస్తున్నారు కూడా. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉండే ఆమె కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతుంటారు. అందుకు నిదర్శనమే ఆమె కొత్త గ్లామరస్ లుక్. ఎంతో లావుగా ఉండే ఆమె ఒక్కసారిగా పదహారణాల పడుచు పిల్లలా మారిపోయారు. నెటిజన్లు సైతం ఆమె కొత్త లుక్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరీ.. అంతలా బరువు కోల్పోయినా..ఖుష్బు వెయిట్‌లాస్ సీక్రెట్ ఏంటో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఐదుపదుల వయసులో ఖుష్బూ అద్భుతంగా తన బాడీ ఆకృతిని మార్చుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారామె. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నిజంగా ఆమెనా..? ఖుష్బు కూతురా..? అని కన్ఫ్యూజ్ అయ్యేలా గ్లామరస్ లుక్‌లో కనిపించారామె. అయితే ఆమె కొత్త లుక్‌ని చూసి.. కొందరు నెటిజన్లు మెచ్చుకోగా మరికొందరు మాత్రం ఇంజెక్షన్లు ఏవో తీసుకునే బరువు తగ్గారామె అంటూ కామెంట్లు చేశారు. అయితే ఖుష్బూ వాటిన్నంటిని కొట్టిపారేస్తూ..తాను ఎలా బరువుని తగ్గించుకోగలిగరో షేర్ చేసుకున్నారు. అలాగే తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో కూడా చెప్పారు. బరువు తగ్గడానికి షార్ట్ కట్స్ ఉండవని నర్మగర్భంగా తేల్చి చెప్పారామె. ఒకవేళ్ల తగ్గినా..అది తాత్కాలికమే అని కూడా అన్నారు ఖుష్బూ. కేవలం క్రమశిక్షణాయుతమైన జీవనశైలి, బరువు తగ్గాలన్న కృత నిశ్చయాలే..అద్బుతంగా బరువు తగ్గేందుకు దారితీస్తాయని అంటున్నారామె. అంతేగాదు అందుకోసం తాను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని అనుసరించారో కూడా పంచుకున్నారు. మనసుపెట్టి తినడం, ఒక గంటపాటు వర్కౌట్లు, అలాగే సాయంత్రం 45 నుంచి 50 నిమిషాలు తప్పనిసరి వాక్ తదితరాలే ఈ సరికొత్త లుక్‌కి కారణమని అన్నారు. అయితే తాను ఇలా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం కూడా వివరించారు. షూటింగ్‌ల సమయంలో సంవత్సరాల తరబడి అయిన గాయాలు, శస్త్రచికిత్సలు తన మోకాళ్లను పూర్తిగా బలహీనపరిచాయన్నారు. వాటిపై ఒత్తిడిపడకూడదంటే బరువు తగ్గక తప్పదని వైద్యులు సూచించినట్లు తెలిపారు. చీలమండలాలు బాగానే ఉన్నాయని, మోకాళ్లు ఆల్మోస్ట్ అరిగిపోయాయని అన్నారు. అప్పుడే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే అంతే సంగతులని భావించి..బరువు తగ్గాలని గట్టిగా ఫిక్స్ అయ్యానన్నారు. అలా తాను దాదాపు 20 కేజీల బరువుని కోల్పాయానన్నారు.ఇక్కడ ఖుష్బూ బరువు తగ్గేందుకు ఎటువంటి సౌందర్య చికిత్సల జోలికిపోకుండా.. అందంగా..ఆరోగ్యకరంగా వృద్ధాప్యాన్ని ఎలా మలుచుకోవచ్చో చూపించారు. ఏదీఏమైనా.. వయసురీత్యా మార్పులనేవి సహజం. వాటిని దాచే ప్రయత్నం కంటే..ఆరోగ్యదాయకమైన పద్ధతిలో తీసుకొస్తే..అటు అందం, ఇటు ఆరోగ్యాన్ని పదిలపరుచుకున్న వాళ్లమవుతామని తన చేతలతో చెప్పకనే చెప్పింది నటి ఖుష్బూ. (చదవండి: ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..) -
రక్తం ధారగా పోతోందా?.. బీ కేర్‌ఫుల్
చిన్న చిన్న గాయాలైనప్పుడూ జాగ్రత్త..!. రక్తం కారడం సహజమే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. ఒకవేళ అనుకోకుండా గాయమైనా..రక్తం కారి కాసేపటికి కంట్రోల్ అవ్వాలి. లేదంటే అది హిమోఫిలియా రుగ్మతే అయ్యి ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాంటి బాధితులు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. ఇవాళ ఏప్రిల్17 ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా అసలేంటి వ్యాధి..? దీనికి చికిత్స ఏంటి తదితరాల గురించి తెలుసుకుందాం.చాలామంది హీమోఫిలియా అనే వ్యాధి గురించి తెలియదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 17న హీమోఫిలియా అవేర్నెస్ డే నిర్వహిస్తున్నారు.హీమోఫిలియా అంటే హీమోఫీలియా అనే పదం హెమోరాఫిలియా అనే పదానికి సంక్షిప్త రూపం. దీన్ని జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ షోన్లీన్ , అతని అసోసియేట్ ఫ్రెడరిక్ హాప్ఫ్ సృష్టించారు. రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధి 'హిమోఫిలియా'. ఇది వారసత్వంగా తల్లి దండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. అలాంటి వారికి ఎముక సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, వాపు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో నిర్ధారణ చేసి మందులు వాడకపోతే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. 'రాయల్ డిసీజ్'.. ఈ సమస్య ఈనాటిది కాదు. ప్రాచీన ఈజిప్టు కాలం నుంచి దీని తాలుకా కేసులు నమోదయ్యాయట. అంతేగాదు దీన్ని 'రాయల్ డిసీజ్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈజిప్ట్రాణి విక్టోరియాకి ఈ వ్యాధి ఉందట. అలాగే ఆమెకు పుట్టిన తొమ్మిది మంది పిల్లల్లో ముగ్గురికి ఈవ్యాధి ఉందని, వారికి వారసత్వంగా వచ్చిందని అప్పుడే నిర్థారించారు వైద్య నిపుణులు. ఎందువల్ల ఇలా అంటే..సాధారణంగా ఎప్పుడైనా శరీరానికి గాయమైతే, రక్తస్రావం అవ్వడం మొదలవుతుంది. ఈ రక్తస్రావాన్ని ఆపేందుకు క్లాట్ ఏర్పడి, ప్లేట్లెట్స్ రక్తాన్ని చిక్కపరుస్తాయి. ఇలా రక్తస్రావం ఆగిపోతుంది. కానీ, హీమోఫిలియా ఉన్న వారికి శరీరంలో రక్తం గడ్డకట్టే కణాలు తక్కువగా ఉంటాయి. దీంతో వారికి గాయం అయితే రక్తం ధారగా శరీరం నుంచిపోతూనే ఉంటుందట. ఇక ఈ వ్యాధి ఏ,బీ అని రెండు రకాలుగా ఉంటుందట. ఈ వ్యాధి వల్ల ఒక వ్యక్తి తన శరీరంలో రక్తం గట్టకట్టడానికి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునేందుకు వీలుండదు. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుంది.హీమోఫిలియా బీ ఉన్న వారు తమ బ్లడ్ ప్లాస్మాలో ప్రొటీన్‌ను అంటే ఫ్యాక్టర్ 9ను సహజంగా ఉత్పత్తి చేసుకోలేరు. ఇప్పటి వరకు ఈ రోగులు ఫ్యాక్టర్ 9 కోసం ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందే. వారంలో పలుసార్లు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది.ఈ వ్యాధి జన్యుపరంగా వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, పిల్లలకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకేందుకు ఇతర కారణాలు చాలా తక్కువని అంటున్నారు నిపుణులు. ఇది చాలా అరుదైన వ్యాధని చెబుతున్నారు వైద్య నిపుణులు.అంతేగాదు పదివేల మందిలో ఒకరికి హీమోఫిలియా -ఏ సోకుతుందని, 40 వేల మందిలో ఒకరికి హీమోఫిలియా బీ వస్తుందని చెప్పారు. చివరిగా..ఏ రూపంలో ఈ వ్యాధి సోకినా అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులులక్షణాలు..ఈ వ్యాధి లక్షణాలు స్వల్పంగా లేదా చాలా తీవ్రంగా ఉంటాయిముక్కు నుంచి రక్తం కారడంపళ్ల చిగుళ్ల నుంచి రక్తస్రావంచర్మం తేలిగ్గా ఊడొస్తుంది.శరీరం లోపల రక్తస్రావమవుతూ ఉండటంతో జాయింట్లలో నొప్పిహీమోఫిలియా వల్ల తలలో ఇంటర్నల్‌గా రక్తస్రావమవుతుంది. తీవ్ర తలపోటు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.దీంతో పాటు, చిన్నవయసులోనే ముసలివాళ్లుగా మారడం, మెదడుకు సరైన సమయంలో రక్తం అందకపోవడంతో స్పృహ కోల్పోవడం, ముఖం అందవికారంగా మారడం వంటివి కూడా కనిపిస్తుంటాయి.ఈ లక్షణాలు అతి కొద్ది మంది రోగులలో మాత్రమే కనిపిస్తాయి.హీమోఫిలియా మూడు స్థాయుల్లో ఉంటుంది. స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు శరీరంలో 5 నుంచి 10 శాతం మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలుంటాయి.మధ్యస్థంగా ఉన్నప్పుడు 1 నుంచి 5 శాతం మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, వీటి స్థాయి శరీరంలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉంటుంది.ఈ పైలక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిందే. చికిత్స ఏంటంటే..నిజానికి కొన్నేళ్ల వరకు ఈ వ్యాధికి చికిత్స అనేది చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు రక్తం గడ్డకట్టేందుకు ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఒక వేళ ఈ వ్యాధి అంత ప్రమాదకరస్థాయిలో లేకపోతే ఔషధాలతో ఉపశమనం పొందొచ్చు. అలాగే తోబుట్టువుల్లో ఒకరికి ఉండి మరొకరికి లేకపోయినా..కొంతకాలం తర్వాత వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయిన హెచ్చరిస్తున్నారు. ఇక హీమోఫిలియా బీ రకం వ్యాధి అయితే చికిత్స అత్యంత ఖరీదైనదే అంటున్నారు నిపుణులు. ఇటీవలే అమెరికా దీనికి హెమ్జెనిక్స్ అనే ఇంజెక్షన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చిందట. అయితే దీని ధర 3.5 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు 28 కోట్లు.). అంతేగాదు ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న ఔషధాల్లో ఇదే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌గా నిలిచింది. ఇది అత్యంత అరుదైన వ్యాధికావడంతో దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ప్రత్యేకంగా ఒక రోజుని ఏర్పాటు చేసి మరీ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు అధికారులు. ఈ ఏడాది థీమ్ "అరుదైన రక్రస్రావం రుగ్మత గురించి మహిళలు, బాలికలు అందరూ తెలుసుకోవాలి".. అనే నినాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. (చదవండి: ఆరోగ్యానికి అదే మార్గం..! సూచిస్తున్న పోషకాహార నిపుణులు) -
‘కేన్సర్.. మనీ వేస్ట్’ : రియల్టర్ ఎంత పనిచేశాడు!
కేన్సర్ మహమ్మారి సోకిందంటే మరణ శాసనమే అని చాలా మంది భావిస్తారు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత కేన్సర్‌ను జయించవచ్చు. మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు, ఆత్మ విశ్వాసం, మనోధైర్యం ఉంటే ఈ వ్యాధినుంచి బైటపడవచ్చు. మరీ ముఖ్యంగా కేన్సర్ వ్యాధి నివారణలో ముందస్తు గుర్తింపు, అవగాహన చాలా అవసరం. ఈ అవగాహన లేమి కారణంగా పచ్చని కాపురం కుప్పకూలి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయ్.ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కుల్దీప్ త్యాగి (46) తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకంటే తనకు కేన్సర్ వ్యాధి సోకిందని, ఎంత డబ్బు ఖర్చు చేసినా అది నయం కాదని భయపడిపోయాడు. అందుకే ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుల్దీప్ తన భార్యను లైసెన్స్ పొందిన రివాల్వర్‌తో కాల్చి చంపి, ఆపై నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఇంట్లో తనను తాను కాల్చుకున్నాడు. సంఘటన జరిగిన సమయంలో వారి కుమారులు ఇంట్లో ఉన్నారు. తుపాకీ కాల్పులు విన్న వెంటనే వారి తల్లిదండ్రుల గదికి చేరుకున్నారు. కుల్దీప్ మృతదేహం నేలపై, అన్షు మృతదేహం మంచంపై కనిపించింది. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను శవపరీక్షకు పంపారు.‘‘కేన్సర్ ఉందని నిర్ధారణ అయింది. నా కుటుంబానికి దాని గురించి తెలియదు. కోలుకుంటానన్న గ్యారంటీ లేదు. దీనికి చికిత్స కోసం డబ్బు వృధా .. అందుకే ఈ నిర్ణయం. ఇందులో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు, ముఖ్యంగా నా పిల్లలు నిందించాల్సిన అవసరం లేదు" అంటూ సూసైడ్ నోట్ రాశాడు. అలాగే కలిసి ఉంటామని ప్రమాణం చేశాను కాబట్టి తన భార్య అన్షు త్యాగిని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోతున్నా అంటూ ఆమెను కూడా కాల్చి చంపేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుల్దీప్ తండ్రి రిటైర్డ్ పోలీసు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి పూనమ్ మిశ్రా వెల్లడించారు. -
ఆరోగ్యానికి అదే మార్గం..!
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ప్రధానమని జాతీయస్థాయిలో పేరొందిన న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు. ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్, ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియాతో కలిసి నగరంలోని తాజ్ డెక్కన్‌లో పోషకాహారంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన ఆహారంతో పాటు చురుగ్గా ఉండటం కూడా చాలా అవసరం అన్నారు. వ్యాయామానికి ముందు తర్వాత తీసుకునే ఆహారం చాలా కీలకమని, కొవ్వులు, ఆహారంలో ఫైబర్, జింక్, మెగ్నీషియం వంటి 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదం వంటి పప్పులు మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఈ సదస్సులో భాగంగా జరిగిన చర్చలో అపోలో హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ హరితా శ్యామ్, యశోద హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ సునీతా ఫిలిప్, స్టార్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జోరుగా.. హుషారుగా..శాస్త్రిపురం: వేసవిలో పచ్చని పార్కులు ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు పార్కుల్లో సందడి చేస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పార్కులలో జీహెచ్ఎంసీ అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఓపెన్ జిమ్‌తో పాటు చిన్నారుల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. దీంతో పార్కుల్లో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఏ పార్కు చూసినా పిల్లలు, వృద్ధులు, మహిళలతో కళకళలాడుతున్నాయి. (చదవండి: నీడ పట్టున ఉండొద్దు..నిత్యం కాస్త ఎండ తగలాల్సిందే..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
కలవరపెడుతున్న మధుమేహం
అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అతను ఖిన్నుడయ్యాడు.నగరానికి చెందిన మటన్ వ్యాపారి గౌస్మొహిద్దీన్కు 37 ఏళ్లు కూడా లేవు. ఇద్దరు పిల్లలున్నారు. సరైన వ్యాయామం లేక ఒత్తిడికి గురై బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. ఇటీవల సరిగా నిద్రపట్టడం లేదని బాధితుడు వాపోతున్నాడు. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో మధుమేహం, రక్తపోటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత పురం జిల్లాలో మధుమేహ జబ్బు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదల రేటుతో పోల్చి చూస్తే డయాబెటిక్ బారిన పడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. యువకులు సైతం జీవనన శైలి జబ్బుల బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో 40 ఏళ్లు నిండిన వారిలో ఎక్కువగా ఆయా జబ్బుల బారిన పడేవారు. కానీ, ఇటీవల 30 ఏళ్లు దాటని వారూ వీటి కోరల్లో చిక్కుతున్నారు. ఈ విషయం వైద్యులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. గ్రామీణులూ బాధితులే.. మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులతో బాధపడే వారు ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువగా ఉండేవారు. పని ఒత్తిడితో సతమతమవడం కారణంగా వీటి బారిన పడేవారు. కానీ, ఇప్పుడు ఆయా రోగాలు పల్లెలకూ విస్తరించడం గమనార్హం. ఈ క్రమంలోనే డయాబెటిక్, బీపీ మందుల ధరలు పెరగడం సామాన్యులకు కొరకరాని కొయ్యగా మారింది. అవగాహన లేకే.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) బాధితులు 27 శాతం పైగానే ఉన్నట్టు తేలింది. పట్టణాల్లో అయితే ఇది 30 నుంచి 32 శాతం కూడా ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. ఇక.. షుగర్, హైపర్‌టెన్షన్ జబ్బులు నియంత్రణలో లేనివారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో శరీరంలో ఇతర అవయవాలపై ప్రభావం పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జబ్బుల నియంత్రణపై అవగాహన లేకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది. అలవాట్లు మార్చుకోవాలి మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు. పొగ తాగడం చాలా ప్రమాదకరం. –డా.సుధాకర్‌రెడ్డి, గుండె వైద్య నిపుణులు సమస్యలెన్నో.. » షుగర్ నియంత్రణలో లేకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. » కంటిచూపుపై దు్రష్పభావం పడుతుంది. » శరీరంలో గాయాలైనప్పుడు మానడం చాలా కష్టం. » మధుమేహం అదుపులో లేకపోతే » గుండె జబ్బులొచ్చే అవకాశాలు ఎక్కువ. » అధిక రక్తపోటు వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. » నరాల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. -
భారతీయ ఫేమస్ వంటకాన్ని మెచ్చిన జపాన్ రాయబారి..!
మన భారతీయ వంటకాలు విదేశీయలు మెచ్చుకోవడం కొత్తేం కాదు. కానీ ప్రముఖులు, అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఇతర దేశాల ప్రముఖ వంటకాలను రుచి చూస్తే మాత్రం..వెంటనే వాళ్లపై గౌరవం పెరుగుతుంది. అదీగాక ఆ వంటకం టేస్ట్‌ని మెచ్చుకుంటే..ఇక ఆ ఆనందం వేరెలెవెల్. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటుచేసుకుంది. భారతదేశం పర్యటనలో ఉన్న జపాన్ రాయబారి కైచి ఓనో బిహార్ పేమస్ వంటకమైన 'లిట్టి చోఖా'ని రుచి చూశారు. లిట్టి చోఖా ప్రపంచ వంటకాల్లోని తనదైనముద్ర వేసిన విలక్షణమైన వంటకం ఇది. భూటాన్, భారత్‌లలో సేవలందిస్తున్న జపాన్ రాయబారి కైచి ఓ రెస్టారెంట్లో బిహారి వంటకాలను రుచి చూశారు. టేబుల్‌పై అందంగా ఒక బౌల్లో ఆకర్షణీయంగా అమర్చిన రైస్, పెరుగు, చేపల ఫ్రై, వాటితోపాట ఈ లిట్టి చోఖా రెసిపీ కూడా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.."నమస్తే బిహార్..చివరికి బిహార్ ప్రముఖ వంటకం లిట్టు చోఖాను రుచి చూసే అవకాశం లభించింది." అని పోస్ట్‌పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో జపాన్ రాయబారి బిహారీ మాండలికాన్ని ప్రదర్శిస్తూ..“గజబ్ స్వాద్ బా” అని కితాబు కూడా ఇచ్చేశారు. ఇక్కడ గజబ్ స్వాద్ బా అంటే గొప్ప రుచి అని అర్థం. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షించడమే గాక ఆశ్చర్యపరిచింది కూడా.ఏంటీ 'లిట్టి చోఖా ' :బిహారీ సంప్రదాయ వంటకం ఇది. దీన్ని స్టఫ్డ్ బేక్డ్ హోల్ వీట్ బాల్స్ అని కూడా అంటారు. ఇది చాలా రుచికరమైన, పోషక వంటకం. గోధుమ పిండి బంతిలో సుగంధద్రవ్యాలతో కూడిన మసాల ఉంచి సైడ్ డిష్‌గా కూరగాయలతో చేసిన కర్రీని అందిస్తారు. అలాగే ఇక్కడ జపాన్‌తో బీహార్ చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉంది. అందులోనూ ఇది బుద్ధుని భూమి కావడంతో జపాన్ వాసులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా పేరుగాంచింది.Namaste, Bihar!Finally had the chance to try the world-famous Litti Chokha—Gajab Swad Ba!👍 pic.twitter.com/DTzqStRsUn— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) April 14, 2025 (చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!) -
విటమిన్-డి... ఈ ఐదు విషయాలు తెలుసా?
విటమిన్ డి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. దీని లోపం వల్ల శక్తిస్థాయిలు క్షీణించి అలసటకు దారితీస్తుంది. రోగనిరోధకవ్యవస్థ పనితీరుకు కీలకమైనది ఇదే. అందువల్ల ఈ విటమిన్ లోపిస్తే అంటువ్యాధులు, అనారోగ్యాల బారినపడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు పరిశోధనలు సైతం ఈ విటమిన్ లోపిస్తే..ఆందోళన, డిప్రెషన్‌తో సహా మానసిక రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉందని వెల్లడించాయి కూడా. అంత ప్రాముఖ్యత ఉన్న విటమిన్ డికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఇది కేవలం విటమిన్ మాత్రమే కాదు. కాల్షియం శోషణ, ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న కాల్సిట్రియోల్ అనే హార్మోన్‌కు పూర్వగామిగా పిలుస్తారు. ఎముకల బలానికి ప్రసిద్ధి చెందినప్పటికీ..ఇది కండరాల పనితీరు, రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ విటమిన్ సూర్యరశ్మిలో పుష్కలంగా దొరుకుతుంది. సహజంగా సులభంగా పొందగలిగే విటమిన్ ఇది. అంతేకాదండోయ్ సూర్యకాంతి నుంచి వచ్చే యూవీబీ కిరణాలకు గురైనప్పుడు..శరీరం ఆటోమేటిగ్గా 'డి'ని ఉత్పత్తి చేస్తుందట. అందువల్ల ఆరోగ్యం కోసం బహిరంగ కార్యకలాపాలు తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఆహారంలో కూడా ఉంటుంది ఈ విటమిన్ డి. ముఖ్యంగా కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, సూర్యరశ్మికి గురయ్యే పుట్టగొడుగులు, పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుందట. విచిత్రం ఏంటంటే ఇంతలా సమృద్ధిగా సూర్యరశ్మి భారత్‌లో ఉన్నప్పటికీ..ప్రతి ఐదు మంది భారతీయులలో ఒకరు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.2023 నివేదికల ప్రకారం..భారతదేశ జనాభాలో దాదాపు 76% మంది ఈ విటమిన్ లోపంతోనే బాధపడుతున్నారుట. అందులో పురుషులు 79% మంది కాగా, స్త్రీలు 75% కావడం గమనార్హం. అలాగే 84% మంది పాతికేళ్ల వయస్సు కంటే తక్కువగా ఉన్న యువతే ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా వదోదర, సూరత్, జైపూర్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. (చదవండి: ఒర్రీ వెయిట్‌లాస్ సీక్రెట్: వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?) -
కొత్త శిఖరాలకు కో-వర్కింగ్..!
వేర్వేరు కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఒకే చోట ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడమనే కో–వర్కింగ్ స్పేస్ కాన్సెప్ట్ నగరంలో విజృంభిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఊతమిచ్చేలా కో–వర్కింగ్ స్పేస్ అందించే సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యకు చేరుకోవడం విశేషం. అత్యంత అధునాతన ఆఫీసులను డిజైన్ చేసి, సంస్థ అవసరాలను బట్టి కనీసం ఐదుగురి నుంచి 500 మంది ఉద్యోగుల వరకూ అవసరమైన స్పేస్‌ను కో–వర్కింగ్ స్పేస్ ఆఫర్ చేసే సంస్థలు అందిస్తున్నాయి. వర్క్ స్టేషన్‌కి ఇంత చొప్పున స్థలాన్ని కేటాయించి, దానికి అనుగుణంగా వీరు చార్జ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఆఫీస్‌కు సంబంధించి ఏ బాదర బందీ సదరు కంపెనీకి ఉండదు. సెక్యూరిటీ మొదలు పెడితే.. క్యాబిన్స్, సర్వర్ రూమ్స్, సర్వర్ ర్యాక్స్, ఇంటర్నెట్, కెఫెటేరియా, లాబీస్పేస్, కాన్ఫరెన్స్ రూమ్స్ ఇలా.. ప్రతిదీ అందుబాటులో ఉంటాయి. సేవలు అందించడానికి అవసరమైన మ్యాన్ పవర్ సైతం సిద్ధంగా ఉంటుంది. సంస్థ ఉద్యోగుల సంఖ్య పెరిగినా కేవలం 15 రోజుల వ్యవధిలో పెరిగిన ఉద్యోగులకు సరిపడా స్పేస్ విస్తరింపజేస్తారు. రెడీమేడ్ ఆఫీసులకు ఊతం.. ‘ఈ రోజు బిజినెస్ ఐడియా వస్తే.. రేపు కంపెనీ అనౌన్స్ చేసేయడానికి ఈ రెడీమేడ్ ఆఫీసులు సహకరిస్తాయి. కొన్నేళ్ల క్రితం కొండాపూర్‌లో 12,500 చదరపు అడుగుల్లో 200 సీటింగ్ కెపాసిటీతో కో–వర్కింగ్ స్పేస్ స్టార్ట్ చేస్తే అది కేవలం రెండు నెలల్లో ఫిలప్ అయిపోయింది. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 95వేల చదరపు అడుగుల్లో 1800 సీటింగ్ కెపాసిటీ ఉన్నది ఏర్పాటు చేశాం. స్టార్టప్స్‌కి అకౌంటింగ్, జీఎస్టీ రిటర్న్స్ తదితర అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తున్నాం. ప్రస్తుతం మేం అందిస్తున్న స్పేస్‌లో వందలాది కంపెనీలు ఆఫీసులు నిర్వహిస్తున్నాయి’ అంటూ వివరించారు ఐ స్ప్రౌట్స్ నిర్వాహకులు సుందరి. ఇంతింతై..స్పేస్ కొండంతై.. ప్రారంభంలో ఈ కాన్సెప్ట్ సృజనాత్మక రచయితలు, ఆర్టిస్టులు, ఫ్రీలాన్సర్లకే పరిమితమైంది. అయితే ఐటీ, ఎంఎన్‌సీలు, స్టార్టప్‌లు కో–వర్కింగ్‌లోకి రంగప్రవేశం చేయడంతో ఈ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోవిడ్–19 మహమ్మారి తర్వాత కంపెనీలు స్టార్టప్‌లలో ఫ్లెక్సీ వర్క్‌స్పేస్ కాన్సెప్‌్టకు ఆదరణ పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ప్రకారం, దేశంలోని టాప్–7 నగరాల్లో మొత్తం 20.8 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌లో, కో–వర్కింగ్ స్పేస్ వాటా దాదాపు 25%గా ఉంది. కేఫ్స్, హోటల్స్, మాల్స్‌లోనూ.. కో–వర్కింగ్ ప్లేస్‌లు ఇప్పుడు నగరాల్లోని మాల్స్, హోటల్స్, కేఫ్స్‌కు కూడా విస్తరించడం గమనార్హం. ఇటీవలే వియ్ వర్క్ అనే గ్లోబల్ కంపెనీ, అమీర్‌పేటలోని ఎంపీఎమ్ మాల్లో తమ కో–వర్కింగ్ స్పేస్‌ను ప్రారంభించింది. అలాగే నగరంలో 25 సెంటర్స్‌ను నిర్వహిస్తున్న బ్రాండ్.. ‘ఆఫీస్(ఏడబ్ల్యూఎఫ్ఐఎస్)’ ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 40,000 సీటింగ్‌ను జోడించడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సైబర్ సిటీలో 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్‌ను స్మార్ట్‌వర్క్స్ కో–వర్కింగ్ స్పేసెస్ ఇటీవలే లీజుకు తీసుకుంది.పోటాపోటీగా వసతులు.. ఈ కో–వర్కింగ్ స్పేస్‌లోకి కంపెనీలు ఆకర్షించడానికి పేరొందిన జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ‘మా కో–వర్కింగ్ స్పేస్‌లో కనీసం 300 మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ, ప్రైవేట్ క్యాబిన్లు, డెడికేటెడ్ డెస్క్‌లు, హాట్ డెస్క్‌లు, మీటింగ్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ రూములు ఉన్నాయి. మా టీమ్ ప్రతిరోజూ నిర్వహణా బాధ్యతల్ని పర్యవేక్షిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది’ అని నగరంలో కో–వర్కింగ్ స్పేస్ నిర్వహిస్తున్న స్ప్రింట్ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. దేశంలో మనమే ముందు..నగరంలోని ఆఫీస్ మార్కెట్ గతేడాది ప్రథమార్ధలోనే 50 లక్షల చదరపు అడుగుల లీజును దాటేసింది. హైటెక్ సిటీ, గచి్చబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు వర్క్‌స్పేస్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అద్దం పడుతున్నాయి. దేశంలో ఫ్లెక్సిబుల్ కో–వర్కింగ్ స్పేస్‌లను అందించడంలో హైదరాబాద్ ముందుందని ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే, తెలంగాణ రాష్ట్ర రాజధానిలో స్థలాలకు వ్యయం చాలా తక్కువని ఆయన అంటున్న మాట. పాశ్చాత్య దేశాల్లోని పలు నగరాల్లో దాదాపు 50 శాతం కో–వర్కింగ్ స్పేస్లే ఆక్రమించాయి. ప్రస్తుతం నగరంలో వీటి విజృంభణ చూస్తుంటే భవిష్యత్తులో వాటి సరసన మన నగరమూ నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
మీ భంగిమ 'వెన్ను'దన్నుగా ఉందా..? సరైన పోష్చర్ అంటే..?
ఇటీవల చాలా చిన్న వయసులో ఉన్నవారు కూడా కండరాల నొప్పులని ఒళ్లునొప్పులనీ అంటుండటం మామూలే. దీనికి కారణం ఏదో జబ్బు లేదా వ్యాధి కాకపోవచ్చు. సరిగా నిలబడటం, కూర్చోవడం వంటివి చేయక΄ోవడమే కావచ్చంటున్నారు నిపుణులు. చాలామంది సరిగా నిల్చోవడం, ఆఫీసుల్లో లేదా ఇతరత్రా కూర్చోవడం, ఏదైనా వస్తువులు అందుకోవడం కోసం ఒంగడం వంటివి సరిగా చేయడం లేదంటే చాలామందికి అది ఆశ్చర్యమే. కానీ ఇదే నిజమంటున్నారు నిపుణులు. సరైన రీతిలో నిలబడటం, కూర్చోవడం, వంగడం, సెల్‌ఫోన్ మాట్లాడేటప్పుడు మెడ కండరాలపైన ఒత్తిడి పడేలా ఒక పక్కకు పూర్తిగా మెడ వంచకపోవడం వంటి శారీరక భంగిమలను (పోష్చర్‌ను) సరైన రీతిలో ఉంచడం వంటి మామూలు జాగ్రత్తలతోనే చాలా నొప్పులు నివారించవచ్చనీ, ఎప్పుడో వృద్ధాప్యంలో రావాల్సిన అరుగుదల సమస్యలను ముందే తెచ్చుకోకుండా రక్షించుకోవచ్చని తెలుసుకోవడం మేలు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... సరిగ్గా నిలబడటం, నడిచేటప్పుడు ముందుకు లేదా పక్కకు ఒంగినట్లుగా కాకుండా సరిగ్గా నడవడం, కార్ లేదా బైక్ నడిపేటప్పుడు సరిగా కూర్చోవడం వల్ల ఒంటికి సంబంధించిన చాలా నొప్పులనూ, చాలా అరుగుదల సమస్యలను రాకుండా చూసుకు΄ోవచ్చు. ఇలా నడిచేటప్పుడు, నిలబడినప్పుడు, కార్ లైదా బైక్ నడిపేటప్పుడు మనం ఉండే శారీరక భంగిమల్లో (పోష్చర్స్‌లో) మన కండరాలు, ఎముకలపైన ఒత్తిడి పడుతుంటుంది. దాని కారణంగా ఆయా కండరాల్లో నొప్పులు రావడం లేదా అక్కడి ఎముకలు ఎప్పుడో చాలాకాలం తర్వాత అరగాల్సినవి కాస్తా ముందుగానే అరగడం జరగవచ్చు. తప్పుడు భంగిమల వల్ల కండరాల మీద పడే అలాంటి ఒత్తిడులను వీలైనంత తగ్గించగలిగితే / నివారించగలిగితే కండరాలనూ, లిగమెంట్లనూ, టెండన్లనూ చాలాకాలం బలంగా, పటిష్టంగా కా΄ాడుకోవచ్చు. దాంతో కండరాల నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. దీనికి కావల్సిందల్లా మనం సరిగ్గా నిలబడటం, సరిగా కూర్చోవడంలో సరైన భంగిమలు (పోష్చర్స్) పాటించడమే. ఇలా దేహ భంగిమను (పోష్చర్‌ను) ఎంత బాగా మెయింటెయిన్ చేసుటే ఎముకల అరుగుదల సమస్యలనూ (డీజనరేటివ్ ప్రాబ్లమ్స్‌ను), కండరాలపై పడే ఒత్తిడిని అంతగా నివారించుకోచ్చు అని తెలుసుకోవడం ముఖ్యం. సరైన పోష్చర్ అంటే... ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తిపైనా భూమ్యాకర్షణ శక్తి ప్రతినిత్యం పనిచేస్తూ, ప్రతివారూ నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఆఖరికి పడుకుని ఉన్నప్పుడు కూడా మనందరి మీదా ప్రభావంచూపుతూనే ఉంటుంది. తప్పుడు పద్ధతుల్లో నిలబడటం, కూర్చోవడం జరిగినప్పుడు ఆ ప్రభావం గరిష్టంగా ఉంటుంది. అందుకే అరుగుదల, కండరాలపై ఒత్తిడి దుష్ప్రభావం ఎక్కువ. దీనికి బదులు సరైన భంగిమల్లో నిలబడటం, కూర్చోవడం, వాహనం నడపడం, ఫోన్ మాట్లాడటం చేస్తుంటే అన్ని అవవయవాల మీద ఒత్తిడి సమంగా పడటంతో అరుగుదల, దుష్ప్రభావాలు ఒకేచోట కేంద్రీకృతం కావడం వంటి సమస్యలు ఉండవు. దాంతో నొప్పులూ, బాధలూ లేకుండా చాలాకాలం పాటు హాయిగా ఉండవచ్చు. సరైన పోష్చరల్ భంగిమలంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం.చాలా సేపు నిలబడాల్సిన వాళ్లు ఎవరంటే... ఏదైనా వైకల్యమో లేదా ఆరోగ్య సమస్య ఉంటేనో తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తీ తన రెండు కాళ్లపై నిలబడటం మొదలుపెట్టిన నాటినుంచి సరిగా నిలబడటం నడవటం చేస్తుంటారు. ఇక ట్రాఫిక్‌లో నిలబడి డ్యూటీ చేసే పోలీసులు, ముఠాలు చెప్పడం కోసం బోర్డు దగ్గర లేదా టేబుల్ దగ్గర నిలబడే ఉపాధ్యాయులు / లెక్చరర్లు, సిటీ బస్సుల్లోని కండక్టర్లు, వంట చేసే మగవారు లేదా గృహిణులు, సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, మెషిన్ ఆపరేటర్లు... ఇలాంటి వారందరికీ తమ వృత్తులపరంగా చాలాసేపు నిలబడే ఉండాల్సిన అవసరముంటుంది. వీళ్లలో కాళ్లపైనా, ΄ాదాలపైనా ఒంటిబరువు చాలాసేపు పడటం వల్ల కాళ్లల్లో నీరసం, నిస్సత్తువ, కాళ్లవాపులు, వేరికోస్ వెయిన్స్, మెడనొప్పి, నడుమునొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి.మంచి పోష్చర్‌లో నిలబడటం ఎలా? సరైన శారీరక భంగిమలో (మంచి పోష్చర్‌లో) నిలబడటం వల్ల కాళ్లు, కండరాలు, నడుము, మెడ వంటి అవయవాలపై తక్కువ భారం పడుతుంది. అలా తక్కువ భారం పడేలా సరైన రీతిలో నిలబడటానికి ఈ కింద పేర్కొన్న సూచనలు / జాగ్రత్తలు పాటించడం మేలు. అవి... నిలబడి చేసే పనులకు ఉపయోగించే ప్లాట్‌ఫారాన్ని (ఉదాహరణకు వంట చేసేవారు వంట టేబుల్, నిలబడి డ్రాయింగ్ వేసేవారు తమ ప్లాంక్ వంటి వాటిని) తమ ఎత్తుకు తగినట్లుగా అడ్జెస్ట్ చేసుకోవడం. నిలబడి ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న రకరకాల వస్తువులను అందుకునే క్రమంలో పూర్తిగా ఒంగి తీసుకోవాల్సి వచ్చే దూరంగా ఉంచకుండా, తేలిగ్గా తీసుకునేంత దూరంలోనే వస్తువులను ఉంచుకోవడం. ఫ్లాట్‌ఫారమ్‌కు సరిగ్గా ఎదురుగా ఉండే పనులను చేసుకోవడం (ఉదాహరణకు వంట లేదా డ్రాయింగ్ వంటివి చేసేప్పుడు మీ ప్లాట్ఫారానికి పక్కగా ఉండకుండా ఎదురుగానే ఉండటం అవసరం). మడమలను పూర్తిగా ఫ్లాట్‌గా ఉంచకుండా వాటి కింద కాస్తంత ఎత్తుగా ఉండేలా చూసుకోవడం. (అయితే మడమల కింద ఉంచుకునే ఎత్తు మరీ ఎత్తుగా లేకుండా జాగ్రత్త పడటం). చాలాసేపు నిలబడి వంట చేయాల్సి వచ్చినప్పుడు ఒంటి బరువును కాళ్లపై మార్చి మార్చి వేస్తుండటం. (అంతేతప్ప... మొత్తం బరువును చాలాసేపు ఒకే కాలిపైన మోపడం సరికాదని గుర్తుంచుకోవాలి). నిలబడి చేసే పనులు (అంటే నిలబడి ఫ్లోరింగ్ శుభ్రం చేయడం, మాపింగ్, గార్డెనింగ్) వంటివి వీలైనంత నిటారుగా నిలబడే చేయడం. (అంతే తప్ప... చాలాసేపు ముందుకు ఒంగిపోయి చేయడం సరికాదు. అలా ఒంగిపోయి చాలాసేపు పనిచేయడం వల్ల వెన్నెముకపై ఎక్కువ భారం పడుతుందని తెలుసుకోవాలి).సరైన పోష్చర్‌లో కూర్చోవడమిలా...గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో కూర్చొని పనిచేసే ఉద్యోగాలే ఎక్కువ. అయితే ఇలా కూర్చుని పని చేసేటప్పుడు సరైన పోష్చర్‌లో కూర్చోకపోవడమే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు మూలం. కూర్చుని కంప్యూటర్‌పై పనిచేసేవారు మొదలుకొని బల్లలపై కూర్చొని రాత పనిచేసే అనేక మందిలో సరిగా కూర్చోకపోవడం వల్లనే నడుమునొప్పి, కండరాల నొప్పులు, మెడ బిగుసుకుపోవడం (స్టిఫ్‌నెక్), తరచూ పాదాలకు తిమ్మిరిపట్టడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇలా అదేపనిగా, సుదీర్ఘంగా కూర్చోవడం వల్ల భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, కొన్ని రకాల మానసిక సమస్యలూ వచ్చే అవకాశాలున్నాయి. కండరాలు, ఎముకలపై వీలైనంత తక్కువ భారం పడేలా కూర్చోవడం ఎలాగంటే... కుర్చీలో వీలైనంత నిటారుగా కూర్చోవాలి. అంతేతప్ప వెన్నుపై అధికమైన భారం పడేలా భుజాలను వేలాడేసి లేదా ఒంగి΄ోయి కూర్చోవడం సరికాదు.కంప్యూటర్ మానిటర్ సరిగ్గా ఉపయోగించేవారి కళ్లకు సరిగ్గా ఎదురుగా ఉండేలా అమర్చుకోవాలి. అంతే తప్ప మెడను బాగా ఎత్తిగానీ లేదా మెడను మరీ ఎక్కువగా ఒంచి చూసేలా దాన్ని అమర్చుకోకూడదు. కీబోర్డు చేతులకు, వేళ్లకు సౌకర్యంగా అందేలా ఉండాలి. కీబోర్డుపై పనిచేసే పమయంలో మోచేతులకు సపోర్ట్ ఉండేలా కూర్చీ తాలూకు హాండ్‌రెస్ట్‌లను అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతులు అలసిపోకుండా చాలాసేపు పని చేయడానికి వీలవుతుంది. కంప్యూటర్ పై పనిచేస్తున్నప్పుడు వీపును కుర్చీ తాలూకు బాక్‌రెస్ట్‌కు ఆనించి ఉంచాలి. అలాగని కుర్చీ బ్యాక్‌రెస్ట్ మరీ వెనక్కువాలి ఉండకూడదు. పనిచేసే సమయంలో వెనక్కు ఆనకపోవడం వల్ల భుజాలు, మెడ, వెన్ను సమస్యలు వచ్చే అవకాశముంది. నడుం కండరాలపై ఎక్కువ భారం పడి, ఎక్కువ శ్రమ కలుగుతుంది. పని చేసే సమయంలో కూర్చీ బ్యాక్‌రెస్ట్‌ను నిటారుగానే ఉంచి, వీపును దానికి ఆనించి ఉంచాలి. అప్పుడు వీపుకు తగినంత సపోర్ట్ దొరికి, వెన్నుపై భారం తగ్గుతుంది. కంప్యూటర్ అదేపనిగా కంటిన్యువస్‌గా ఉపయోగించడానికి బదులుగా ప్రతి గంటసేపు పని తర్వాత 10 నిమిషాలు విశ్రాంతి ఇవ్వడం మందిది. అది కూడా ఆ 10 నిమిషాలూ మళ్లీ కూర్చునే ఉండటానికి బదులుగా లేచి కాస్త అటు ఇటు తిరగడం మేలు. ఎదురుగా ఉన్న బల్లపైన మనం తరచూ ఉపయోగించే వస్తువులను మూడు అంచెల్లో పెట్టుకోవచ్చు. మొదటి అంచెలో అనుక్షణం అందుకునే వస్తువులు / పనిముట్లు / పుస్తకాలు / ఉపకరణాలు ఉంచుకోవాలి. రెండో అంచెలో తరచూ ఉపయోగించేవి పెట్టుకోవాలి. ఎప్పుడోగాని ఉపయోగించని వాటిని డెస్క్/టేబుల్‌కు అటు చివర ఉంచాలి. ఇలా మన వస్తువుల అమరిక ఉండటం వల్ల... వస్తువులను అందుకునే సమయంలో వెన్నుపై భారం చాలావరకు తగ్గుతుంది. కూర్చొని ఉన్నప్పుడు కాళ్లను ఫుట్‌రెస్ట్‌పైన కాస్తంత ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. దాంతో వెన్ను/నడుము నొప్పి నివారించవచ్చు.కార్ డ్రైవింగ్‌లో పాటించాల్సిన పోష్చర్ జాగ్రత్తలు...డ్రైవింగ్ చేసే సమయంలో కారులో లేదా వాహనంలో కూర్చునే పోష్చర్ సరిగా లేకపోతే వెన్నుకు, మెడకు, నడుముకు సంబంధించిన చాలా సమస్యలు వచ్చేందుకు అవకాశాలెక్కువ.డ్రైవింగ్ సమయంలో సరిగా కూర్చోకపోతే... డ్రైవింగ్ పోష్చర్ సరిగా లేకపోతే ‘రిపిటిటివ్ డ్రైవింగ్ ఇంజ్యురీస్’ (ఆర్డీఐ) అనే సమస్యలు వస్తాయి. దాంతో మెడ బిగుసుకు΄ోవడం (స్టిఫ్‌నెక్), పాదాలు, కాళ్లకు తిమ్మిర్లు రావడం, భుజాలు నొప్పి పెట్టడం, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కార్‌డ్రైవింగ్ చేసేవారు పోష్చర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.డ్రైవింగ్‌లో సరిగా కూర్చోవడమిలా... ఫోర్‌వీలర్ డ్రైవింగ్ సమయంలో వెన్నుపైన సాధ్యమైనంత తక్కువ భారం పడేలా కూర్చోవడానికి పాటించాల్సిన సూచనలివి... డ్రైవ్ చేసేవాళ్లు సౌకర్యంగా కూర్చునేలా డ్రైవింగ్ సీట్ ఉండాలి. డ్రైవింగ్ చేసే సమయంలో స్టీరింగ్‌పై చేతులు పెట్టే పద్ధతి ఎలా ఉండాలంటే... మన డెస్క్‌పై చేతులు ఉంచినప్పటికంటే... స్టీరింగ్‌పై చేతులు కాస్త ఎత్తుగానే ఉండాలి. స్టీరింగ్ వీల్‌కూ, డ్రైవర్ ఛాతీకి మధ్య 25 – 30 సెం.మీ. (10 – 12 అంగుళాల) స్థలం ఉండేలా స్టీరింగ్ అడ్జెస్ట్ చేసుకోవాలి. డ్రైవ్ చేసేవారు ఎలా కూర్చోవాలంటే... స్టీరింగ్‌వీల్ ఎట్టిపరిస్థితుల్లో తమ కాళ్లకు ఆనకుండా చూసుకోవడం అవసరం. అలా స్టీరింగ్ వీల్‌కూ తమ దేహానికి మధ్య అవసరమైనంత స్థలం ఉన్నప్పుడు స్టీరింగ్‌ను సౌకర్యంగా తిప్పడానికీ, ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోడానికీ వీలుగా ఉండి, ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ చేసేవారికి ఎక్కువ రక్షణ కలుగుతుంది. కారు కుదుపుల్లో సైతం కాళ్లకు స్టీరింగ్‌కు ఆనకూడని విధంగా సీట్, స్టీరింగ్‌వీల్ అడ్జెస్ట్ చేసుకోవాలి. వాహనం ఆగాక డ్రైవింగ్ చేసేవారు చాలా సౌకర్యంగా దిగగలిగే విధంగా కారు సీట్ ఉండాలి. స్టీరింగ్‌కూ, సీట్‌కూ మధ్య... డ్రైవ్ చేసే వ్యక్తి దిగేందుకు అనువుగా ఉండేంత స్థలం ఉండాలి. డ్రైవింగ్ చేసేవారు... మరీ 90 డిగ్రీలు నిటారుగా కూర్చొని డ్రైవ్ చేయడమూ సరికాదు. కాస్తంత వెనక్కు వాలి సౌకర్యంగా కూర్చుని డ్రైవ్ చేయాలి. అయితే డ్రైవింగ్ సీట్లో అలా వెనక్కి వాలినప్పుడు ఆ కోణం 120 డిగ్రీలకు మించకూడదు. డ్రైవింగ్ సీట్ వర్టికల్‌గా డ్రైవింగ్ చేసేవారి వెన్నుకూ, కింది భాగంలో వారి తొడలకు మంచి సపోర్ట్ ఇవ్వాలి. అలా మంచి సపోర్ట్ ఇచ్చేలా సీట్ కుషన్ ఉండటం మేలు. డ్రైవ్ చేసేప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. బ్రేక్, క్లచ్ పెడల్స్ వంటి కారు భాగాలన్నీ డ్రైవింగ్ చేసేవారి కాళ్లకు సౌకర్యంగా తక్షణం అందేలా డ్రైవింగ్ సీట్ అమర్చుకోవాలి.టూవీలర్ (బైక్) డ్రైవింగ్‌లో పోష్చర్ ఇలా... సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి భాగాల అమరికలో కొన్ని ప్రమాణాలను పాటిస్తుంటారు. వాటిని అనుసరించడం వల్ల చాలా సమస్యలు రావు. అయితే బాగా స్టైల్‌గా కనిపించడం కోసం కొంతమంది తమ బైక్ హ్యాండిల్ బార్స్‌ను, సీట్ కోణాన్ని రకరకాలుగా మార్చి అమర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు పొట్టి హ్యాండిల్ బార్స్ వాడటం, సీట్‌ను మరీ ఏటవాలుగా ఉండేలా అమర్చుకోవడ వంటివి చేస్తుంటారు. అలా కాకుండా బైక్ తయారీదారులు ప్రామాణికంగా ఉంచిన విధంగానే హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌లు ఉంచుకోవడం మేలు. మరీ ఇబ్బందిగా ఉంటేనే తప్ప వాటిలో వ్యక్తిగతమైన మార్పులు చేసుకోకపోవడమే మంచిది. బైక్ వాడుతున్నప్పుడు నడుమునొప్పి, వెన్నునొప్పి వస్తుంటే... డ్రైవింగ్ చేసేవారికి బైక్ సీట్ అనువుగా, సౌకర్యంగా ఉండేలా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. అవి... బైక్‌ల హ్యాండిల్స్ తగినంత విశాలంగా, రెండు చేతులు సరైన గ్రిప్ ఉండేలా పట్టుకోవడానికి వీలుగా ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ముందుకు ఒంగిపోవడంతో ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. హ్యాండిల్ పట్టుకున్నప్పుడు డ్రైనింగ్ చేసేవారు తమ దేహం నిటారుగా ఉండేలా కూర్చోవాలి. అయితే ఇటీవల కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలోని సీట్లు, హ్యాండిల్ బార్స్ శరీరం బాగా ముందుకు వాలిపోయి ఉండేలా మార్పులు చేస్తున్నారు. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల వెన్ను నిటారుగా ఉండకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి హ్యాండిల్‌బార్‌నూ, సీట్లను అలాంటి ఫాల్టీ పోష్చర్స్కు అవకాశమిచ్చేలా అమర్చుకోవడం సరికాదు. కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయి΄ోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి వచ్చేందుకు అవకాశం ఉంది. కాళ్లతో బ్రేక్ వేయడానికీ, గేర్లు మార్చడానికీ సౌకర్యంగా, వీలుగా ఉండేలా ఫుట్‌రెస్ట్‌లు ఉండాలి. చాలామంది బైక్‌లపై ప్రయాణాలు చేసేవారు తమ వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్΄్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం ఇటీవల చాలా సాధారణంగా కనిపించే దృశ్యం. ఈ భారం నడుంపై ఎక్కువగా పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా, అది సీట్‌పై ఆనేలా చూసుకోవడం చాలా మంచిది. పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీలైనంత ఎక్కువ కాలం పోటు నొప్పులు రాకుండా కండరాలను సంరక్షించుకోవడం, ఎముకలు అరగకుండా నివారించుకోవడం సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సెల్‌ఫోన్ వాడకంలోజాగ్రత్తలివి...ఇటీవల టూవీలర్ డ్రైవ్ చేస్తుండే వాళ్లు అలాగే డెస్క్ మీద కంప్యూటర్‌పై పనిచేస్తూనే భుజానికీ చెవికీ మధ్య సెల్‌ఫోన్ ఉంచుకుని, మెడతో ఆ ఫోన్‌ను నొక్కిపట్టి ఉంచి మాట్లాడటం చేస్తుంటారు. అది సరికాదు. ఇందుకు బదులుగా వాహనం ఆపి ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్స్ వాడటమన్నది మెడ, వెన్ను ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్‌ఫోన్స్‌తోగాని మరే రకంగానూ సెల్‌ఫోన్ మాట్లాడకూడదు. పైగా అది చట్టరీత్యా నేరం. అలాగే అది ప్రాణానికి ప్రమాదం కూడా. సెల్‌ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ వాడుతుండటం వల్ల బొటనవేలి వెనక ఉండే టెండన్ ఇన్ఫ్లమేషన్కు గురై వాపు వస్తుంది. అ తర్వాత కూడా అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానకుండా మాటిమాటికీ తిరగబెడుతుంది. దీన్నే బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అంటారు. అందుకే వీలైనంత వరకు అత్యవసర పరిస్థితుల్లోనే సెల్‌ఫోన్ ఉపయోగించాలి. సెల్‌ఫోన్ సంభాషణలు వీలైనంత క్లుప్తంగా ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్లో ఎక్కువగా మాట్లాడటం కన్నా మెసేజ్‌లనే ఎక్కువగా అలవాటు చేసుకోవడం మంచిది. అయితే ఇలా మెసేజ్‌లు ఇచ్చేటప్పుడు మెడను హానికరమైన కోణాలలో ఒంచకూడదు. మీ మెడను ఎంతగా ఒంచితే వెన్నుపై పడే భారం అంతగా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. సెల్‌ఫోన్ నెంబరును బాగా సన్నిహితులకు మాత్రమే ఇవ్వడం వల్ల అనవసరమైన కాల్స్‌ను అవాయిడ్ చేయవచ్చు. పొద్దున్నే లేవడానికి అలారం మొదలుకొని... రిమైండర్లు, ఆటలు, పాటలు, కాలిక్యులేటర్... ఇలా ప్రతిదానికీ సెల్‌ఫోన్ మీదే అతిగా ఆధారపడటం అంత మంచిది కాదు. అది వెన్నుకు చేటు చేయడంతోపాటు సెల్‌ఫోన్ అడిక్షన్‌కు దారితీయవచ్చు. -
సహజమైన మార్పు ఇది.. మనమూ మారుదాం!
గైనకాలజిస్ట్లు, సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు, లైఫ్ కోచ్‌లు.. అందరూ చెబుతున్నదీ, అవగాహన పెంచుతున్నదీ.. మెనోపాజ్‌తో మహిళ జీవితం అయిపోదని, అదొక ఫేజ్ అని, సహజమైన మార్పు అనే! దాన్ని ఆమె సాఫీగా దాటి.. లైఫ్‌ని ఉత్సాహంగా రీస్టార్ట్ చేయాలంటే ఆ దశ మీద అందరికీ అవగాహన ఉండాలని! ఆ ఉద్దేశాన్ని ఈ క్యాంపెయిన్ కాస్తయినా నెరవేర్చిందని.. సైలెంట్‌గా ఉన్న ఆ అంశాన్ని చర్చలోకి తెచ్చిందని భావిస్తున్నాం! మెనోపాజ్ గురించి మరికొందరు నిపుణులు చెబుతున్న మరికొన్ని విషయాలను తెలుసుకుందాం..మెనోపాజ్‌ను మనతో సహా తూర్పుదేశాలన్నీ పాజిటివ్‌గానే చూస్తున్నాయి. ఇది మహిళ జీవితంలో అత్యంత సహజమైన దశ. సింప్టమ్స్ తీవ్రంగా ఉండి దైనందిన జీవితం కూడా కష్టమైప్పుడు తప్ప దీన్ని దాటడానికి మెడికల్ సపోర్ట్ అంతగా అవసరం ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక ఆసక్తికరమైన మార్పు. కాబట్టి దీని గురించి మాట్లాడ్డానికి సిగ్గుపడనక్కర్లేదు. బిడియం అంతకన్నా వద్దు. 45– 55 ఏళ్ల మధ్య వచ్చే పెరిమెనోపాజ్‌లో శారీరక, మానసిక, హార్మోన్ల, భావోద్వేగపరమైన మార్పులెన్నో కనిపిస్తుంటాయి. ఆ ఒత్తిడిని చాలామంది మహిళలు ఎవరి సహాయమూ లేకుండానే దాటేస్తుంటారు. సహాయం తీసుకోవాలనే ఎరుక వాళ్లకు లేక, అండగా ఉండాలనే గ్రహింపు కుటుంబాలకు రాక! కానీ ఇప్పుడా ఆలోచనను మార్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి! కుటుంబాలకు ఆ అవగాహన రావాలంటే పెరిమెనోపాజ్లోని మహిళలు తాము అనుభవిస్తున్న శారీరక, మానసిక సమస్యల గురించి కుటుంబానికి చెప్పాలి. చర్చించాలి. అప్పుడే ఆమె పరిస్థితిని కుటుంబం అర్థం చేసుకోగలదు. అండగా నిలబడగలదు. అంతేకాదు ఆ దశలోని మహిళలు తమ మానసిక భారాన్ని తేలిక చేసుకోవడానికి పదిమందితో కలుస్తూ .. మాట్లాడుతూ ఉండాలి. నడివయసు స్త్రీలలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. అయితే వయసుతో వచ్చిన మార్పులేమిటీ, ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వచ్చిన మార్పులేమిటో కనుక్కోవడం కష్టమే! సమస్యలు తీవ్రంగా ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆ మహిళ వైద్యులను సంప్రదించాలి. ఆమె చెప్పింది వైద్యులు శ్రద్ధగా విని, అవసరమైన సలహాలు, సూచనలతో ఆమె ఆ దశను సాఫీగా దాటేలా సాయం చేస్తారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల పెరిమెనోపాజ్ పట్ల సమాజంలో అవగాహన కలిగే అవకాశం ఉంది.కష్టం లేకుండా పెరిమెనోపాజ్ దశను దాటేందుకు కొన్ని చిట్కాలు...డైట్ : పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం భోజన మోతాదును, అందులోని అధిక కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి కానీ పూర్తిగా భోజనాన్నే మానేయకూడదు! రోజు మొత్తంలో తీసుకునే భోజనంలో 30 శాతం లేదా అంతకంటే తక్కువ కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఫ్యాటీ మీట్స్, హోల్ మిల్క్, ఐస్‌క్రీమ్స్, చీజ్ లాంటివాటికీ దూరంగా ఉండాలి. మసాలానూ దరిచేరనివ్వద్దు. చక్కెర, ఉప్పునూ తగ్గించాలి. గ్రిల్డ్, స్మోక్ ఫుడ్‌కీ నో చెబితే మంచిది. ఫైబర్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను డైట్లో చేర్చాలి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు నీటిని తాగాలి. మద్యం పూర్తిగా మానేయాలి. కాఫీ తగ్గించాలి. వ్యాయామం: క్రమం తప్పని వ్యాయామంతో శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుంది. అందుకే రోజూ 45 నిమిషాల పాటు కచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా, మెడిటేషన్,ప్రాణాయామాన్నీ ప్రాక్టీస్ చేయాలి. క్రియేటివ్ వర్క్‌ని వెదుక్కోవాలి. ఇది ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు, చుట్టాలు, స్నేహితులతో కలుస్తుండాలి. హాట్ ఫ్లషస్ ఇబ్బందిగా మారితే.. వాటిని ట్రిగర్ చేస్తున్నవేవో గమనించి వాటికి దూరంగా ఉండాలి. పడక గదిని చల్లగా ఉంచుకోవాలి. డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. వాకింగే కాక స్విమ్మింగ్, డాన్సింగ్, సైక్లింగ్ ఇలా ఇష్టమైనదాన్ని ఎంచుకోవచ్చు. విటమిన్ ఇ సప్లిమెంట్స్ తీసుకోవాలి. 40 నుంచి 60 గ్రాముల సోయా ప్రొటీన్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటన్నిటి సహాయంతో పెరిమెనోపాజ్ దశను హాయిగా దాటేయొచ్చు. – డాక్టర్ ప్రణతి రెడ్డిక్లినికల్ డైరెక్టర్, రెయిన్బో హాస్పిటల్స్45– 55 ఏళ్ల మధ్య వచ్చే పెరిమెనోపాజ్‌లో శారీరక, మానసిక, హార్మోన్ల, భావోద్వేగపరమైన మార్పులెన్నో కనిపిస్తుంటాయి. ఆ ఒత్తిడిని చాలామంది మహిళలు ఎవరి సహాయం లేకుండానే దాటేస్తుంటారు. సహాయం తీసుకోవాలనే ఎరుక వాళ్లకు లేక, అండగా ఉండాలనే గ్రహింపు కుటుంబాలకు రాక! కానీ ఇప్పుడా ఆలోచనను మార్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి!పాజ్ నుంచి పుంజుకుందాం.. మెనోపాజ్ అనేది ప్రతి మహిళ జీవితంలో సహజమైన ప్రక్రియ. దీని తర్వాత కూడా ఆమెకు 30 ఏళ్లు పైబడిన ఆరోగ్యకర మైన, చురుకైన జీవితం ఉంటుంది. అందుకే మెనోపాజ్‌లో వచ్చే మార్పులు, సమస్యల గురించి తెలుసుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం అత్యంతవసరం! ఈ దశలోని శారీరక మార్పులు మహిళల మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తాయి. హాట్ ఫ్లషస్.. ఆ వెంటనే చెమటలు పట్టడం వంటివి మహిళ దైనందిన జీవితాన్ని ఇబ్బందిగా మారుస్తాయి. వెజైనల్ డ్రైనెస్ వైవాహిక జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అది ఆమెలో ఆందోళనకు తద్వారా ఇతర మానసిక సమస్యలకూ దారీతీయవచ్చు. ఈ సమయంలో కొందరు మహిళలు బరువు పెరుగుతారు. కీళ్లనొప్పులు, అలసట, ఏకాగ్రత లోపించడం వంటివీ అనుభవంలోకి వస్తుంటాయి. ఇవన్నీ మానసిక ఇబ్బందులకు దారితీస్తుంటాయి. ఈ మొత్తంలో ప్రధానంగా చర్చించుకోవాల్సింది మెనోపాజ్‌లో వచ్చే డిప్రెషన్ లేదా కుంగుబాటు గురించి. మహిళలకు మెనోపాజ్ కంటే ముందు డిప్రెషన్ ఉన్నా లేకపోయినా.. ఈ దశలో దీనిబారినపడే ప్రమాదం రెండు నుంచి నాలుగింతలు ఎక్కువని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే ఈ టైమ్‌లో కుటుంబం ఆమెకు అండగా నిలవాలి. కానీ మన దేశంలో దీని పట్ల సరైన అవగాహన లేక కుటుంబాల నుంచి కోరుకున్న మద్దతు లభించట్లేదు. అందుకే మెనోపాజ్ ప్రభావాన్ని కుటుంబమూ అర్థం చేసుకొని, అవగాహన పెంచుకోవాలి. మెనోపాజ్ తర్వాతా ఆమె జీవితం సాఫీగా సాగిపోయేలా సహకరించాలి. లేకపోతే ఒత్తిడి పెరిగి అది ఆమెను వేగంగా వృద్ధాప్యానికి చేరువచేస్తుంది. డిప్రెషన్ లక్షణాలు ఏమాత్రం కనపడినా జంకు, సందేహం లేకుండా వెంటనే మానసిక వైద్యనిపుణులను కలవాలి. ఏ మానసిక సమస్యకైనా కౌన్సెలింగ్ రూపంలోనో.. మందులో రూపంలోనో.. ఇంకే ఇతర సపోర్ట్ రూపంలో అయినా చికిత్స ఉంటుంది. దానికంటే ముందు మంచి ఆహార అలవాట్లు, ఎక్సర్సైజ్, మెడిటేషన్‌ను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. సమస్యలను సాటి మహిళలతో పంచుకోవడానికి, చర్చించడానికి సందేహించవద్దు. షేరింగ్ వల్ల ఆందోళన, భయం తగ్గుతాయి. భరోసా వస్తుంది. అంతేకాదు ఆ చర్చల వల్ల సమాజంలోనూ దీనిపట్ల అవగాహన పెరుగుతుంది. ఇది జీవితంలో మళ్లీ పుంజుకోవడానికి సాయపడుతుంది.– డాక్టర్ అల్లం భావన, సైకియాట్రిస్ట్ఫిట్నెస్ పెంచుకుందాం... మెనోపాజ్ అనగానే జీవితం అయిపోయిందని భావించడమో, ఇక ఉపయోగం లేదని అనిపించుకోవడమో, తమ అవసరాన్ని ఎవరూ గుర్తించరనే భయమో కలుగుతుంది. నిజానికి ఇప్పుడే జీవితానికి కొత్త అర్థం మొదలవుతుంది. ఈ దశలో ఫిట్నెస్ చాలా కీలకం. ఫిట్నెస్ పెంచుకోవాలి. బ్రిస్క్ వాకింగ్, యోగా (భుజంగాసనం, చైల్డ్ పోజ్, శవాసనం లాంటివి),ప్రాణాయామం శరీరకంగా, మానసికంగా ఉపశమనాన్నిస్తాయి. సమతుల (కాల్షియం, విటమిన్ డి, ఒమేగా 3, ఫైబర్,ప్రొటీన్, నట్స్, ఫ్లాక్స్ సీడ్స్‌తో కూడిన) ఆహారం, తగినంత వ్యాయామంగల ఆరోగ్యకర జీవనశైలి మెనోపాజ్ సమస్యలకు చెక్ పెడుతుంది. ఒంటరితనం, దిగులుకు లోనవకుండా కొత్త యాక్టివిటీ మొదలుపెట్టాలి. ఫ్రెండ్స్‌తో గ్రూప్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుతూండాలి. మహిళ ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు ఆమె మనసు, భావోద్వేగాలు కూడా! ఈ కోణంలో కుటుంబం మెనోపాజ్ దశలోని మహిళను అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే ఆమె ఆ దశను ఆనందంగా మలచుకుంటుంది.. ఆత్మవిశ్వాసంతో సాగుతుంది. – రజిత మైనంపల్లి, లైఫ్ కోచ్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, యోగా అండ్ డైట్ ఎక్స్పర్ట్సిద్ధమైపోవాలంతే!అప్పటిదాకా బాధ్యతల్లో మునిగిపోయిన మహిళకు తన జీవితాన్ని తనకు నచ్చినట్టు మలచుకునే ఒక వెసులుబాటు మెనోపాజ్! పీరియడ్స్ ఆగిపోవడం వలన శారీరకంగా కొంత అసౌకర్యం ఉండొచ్చు. కానీ పీరియడ్స్ వల్ల అప్పటిదాకా ఉన్న కొన్ని అసౌకర్యాల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ప్రయాణాలకు, కొత్త ప్రయత్నాలకు పీరియడ్స్ ఆటంకం ఉండదు. ఫ్యామిలీ ప్లానింగ్ బాధ్యతను మోసే బెడదా తప్పుతుంది. ఒక స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ సానుకూలతల పట్ల దృష్టి నిలిపి.. మనసుకు ఉత్సాహాన్ని పట్టించి.. వయసుకు రెక్కలు తొడిగి రీస్టార్ట్‌కు సిద్ధమైపోవాలంతే!– శిరీష చల్లపల్లినిర్వహణ: సరస్వతి రమ -
రన్ ఫర్ హెల్త్..
అత్యవసర ఆరోగ్య సంరక్షణ, ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు హోండా బిగ్‌వింగ్ డీలర్ షిప్‌లు, ఆటోఫిన్ హోండా, జేఎస్పీ హోండా, ఫార్చ్యూన్ హోండా బిగ్‌వింగ్ సంయుక్తంగా 10కే రన్ విజయవంతంగా నిర్వహించారు. గచ్చిబౌలిస్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్నర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఫార్చ్యూన్ హోండా నీరవ్‌మోడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ అత్యవసర ఆరోగ్య సంసరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హోండా బిగ్‌వింగ్ ప్రయత్నంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశామన్నారు. దీనిని యేటా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను మొత్తం ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. హైటెక్‌సిటీలో 5 కె రన్.. మాదాపూర్ : ఐటీ ఉద్యోగులు 5 కె రన్లో పలువురు రన్నర్లు ఉత్సహంగా పాల్గొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ యశోధహస్పిటల్ వద్ద ఆదివారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 5 కె రన్ నిర్వహించారు. టీసీఎస్ ఉద్యోగులు 8500 మంది పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రముఖ డాక్టర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినవ్, టీసీఎస్ అధ్యక్షుడు వి.రాజన్న, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
Sharmila Tagore: కీమోథెరపీ చేయంచుకోకుండానే కేన్సర్‌ని ఓడించారామె..!
బాలీవుడ్ దిగ్గజ నటి షర్మిలా ఠాగూర్‌కి ఊపిరితిత్తుల కేన్సర్ నిర్థారణ అయ్యినట్లు ఓ ఇంటర్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ కేన్సర్‌ని కీమోథెరఫీ వంటి చికిత్సలతోనే పనిలేకుండానే సునాయాసంగా ఓడించారు. ఇప్పుడామె పూర్తిగా కోలుకున్నారు కూడా. ఆ విషయాన్ని కూతురు నటి సోహా అలీ ఖాన్ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ముందుగానే ఆ వ్యాధిని గుర్తించడంతోనే తన తల్లి సురక్షితంగా ఆ వ్యాధి నుంచి బయటపడగలిగారని అన్నారు. ఆ సమయంలో మా కుటుంబం పడిన బాధ అంతఇంతగాదంటూ నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారామె. అందరూ తనతల్లిలా బాధకరమైన చికిత్సల జోలికిపోకుండానే సులభంగా ఈ కేన్సర్‌ని జయించడం ఎలాగో కూడా వివరించారు. అదెలాగా చూద్దామా..!.సోహా తన యూట్యూబ్ ఛానెల్లో నయన్‌దీప్ రక్షిత్‌కి ఇచ్చిన ఇంటర్వ్వ్యూలో తన ఫ్యామిలీ ఫేస్ చేసిన క్లిష్ట సమయాన్ని పంచుకున్నారు. నిజానికి ఒక వ్యాధి నిర్థారణ యావత్తు కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేస్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. ఆ సమయం తామెంతో ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. అయితే దేవుడి దయ వల్ల తన తల్లి ఆరోగ్య పరిస్థతి మరింత క్షీణించక మునుపే గుర్తించగలిగాం. చెప్పాలంటే కేన్సర్ స్టేజ్ జీరోలో ఉండగానే గుర్తించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంకా ఆమె శరీరంలో కేన్సర్ వ్యాపించని దశ. అందువల్ల ఆమెకు కీమోథెరపీ లేదా రేడియేషన్ వంటి అదనపు చికిత్సలు లేకుండానే శస్త్ర చికిత్సతో ద్వారా నయం చేశారు. ఊపిరితిత్తుల కేన్సర్‌ని ముందుగానే ఎలా గుర్తించొచ్చంటే..ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ సంబంధిత మరణాలలో ఊపిరితిత్తుల కేన్సర్ కూడా ఒకట. ఇది ముందస్తు హెచ్చిరికలతో మన శరీరాన్ని అప్రమత్తం చేస్తుందట. అవేంటంటే..సాధారణ కార్యకలాపాల సమయంలో శ్వాస ఆడకపోవడం లేదా ఊపిరి ఆడకపోవడం.ఛాతీ నొప్పి లోతైన శ్వాస లేదా తీవ్రమైన దగ్గుబరువు తగ్గిపోవడంరక్తం లేదా తుప్పు రంగు కఫం దగ్గుబ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లునిజానికి ఇవన్నీ చూడటానికి సాధారణ వైద్య పరిస్థితులే. అవి తరుచుగా కొనసాగి..ఆందోళనకు గురిచేస్తే తక్కణమే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. అలాకాకుండా ధూమపానం లేదా సెకండ్‌హ్యాండ్ పొగకు గురైన చరిత్ర కలిగినవారు క్రమంతప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ అలవాట్లతో ప్రమాదాన్ని నివారించొచ్చు..ధూమపానానికి దూరంగా ఉండటంపొగ పీల్చే వ్యక్తులకు దూరంగా ఉండటంఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడంవ్యాయామం చేయడంఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.(చదవండి: సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!) -
ఆవు పిడకలు...ఆరోగ్యం..!
ఆవుపేడ కదా అందులో ఏముంది అనుకునే వారికి దాని విలువ తెలియకపోవచ్చు.. ముందు తరాలవారు దాని విశిష్టతను గుర్తించారు. వారికి దాని ఉపయోగాలు తెలుసు..అందుకే ఆవు పేడ నీటితో కళ్లాపి చల్లేవారు.. పేడ అలికిన ఇల్లు శుభదాయకమని చెప్పేవారు. మట్టి గోడలకు పేడను అలికేవారు.. ఇలా క్రిమి కీటకాలను ఆవుపేడ నశింపజేస్తుందని వారు ముందే పసిగట్టారు. పేడ విలువను గుర్తించిన నేటితరం ఆవుపేడతో చెయ్యలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్ , పిడకలు, విభూతి, పళ్లపొడి, రాఖీలు, ప్రమిదలు, బొమ్మలు, దేవుళ్ల ప్రతిమలు, కుండీలు, జపమాలలు, అగరొత్తులు అంటూ ఎన్నో రకాలుగా ఆవు పేడను వినియోగిస్తున్నారు. ఇలా ఆవు పేడలో మూలికలు కలిపి అగ్నిహోత్ర పిడకలు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజుల కండ్రిగ రైతు సుబ్బరాజు. పీల్చే గాలి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా, నగరి మండలం రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు అగ్నిహోత్ర పిడకలు తయారు చేస్తున్నారు. రైతుగా సేంద్రియ పద్ధతిలో నూతన పంటలు సాగు చేసి అందరి మెప్పు పొందిన ఆయన పాడి రైతుగాను ఆరోగ్యమిచ్చే అంశాలపైనే దృష్టిసారించారు. హోమ పూజలు, ఇళ్లలో దూపం వేసే సమయంలోనూ వచ్చే పొగ ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకునే ఆయన పర్యావరణ రక్షణకు సంబంధిత ఆయుర్వేద గ్రంథాలు చదవడం, సంబంధిత శాఖలోని వారిని కలిసి వారి వద్ద సలహాలు, సూచనలు పొంది అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. కష్టంతో కూడుకున్న పనే అయినా పర్యావరణ రక్షణపై ఉన్న వ్యామోహంతో ఇంటి వద్దే ఒక పాక వేసుకొని అగ్నిహోత్ర పిడకల తయారీ చేస్తున్నారు. ఒక్కో పిడక రూ.30 10 కిలోల ఆవు పేడతో పిడకలు తయారు చేయాలంటే 3 కిలోల నెయ్యి , పాలు, పెరుగు, పంచితం అవసరం. వీటితో పాటు వేసే మూలికలు స్థానికంగా లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపునకు వెళ్లి తీసుకొస్తున్నారు. ఇలా తయారు చేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోందని చెబుతున్నారు. వీటిని రూ.30కి విక్రయిస్తున్నారు. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు రైతు సుబ్బరాజు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చుట్టు పక్కల ఉన్న ఆలయాలలో జరిగే హోమ పూజలు, ఇళ్లలో జరిగే పూజలకు వాడటంతో పాటుతో తమిళనాడు, కర్ణాటకలలో జరిగే హోమ పూజలకు అగ్నిహోత్ర పిడకలు నగరి నుంచి తీసుకొని వెళతారు. ఒక్కసారి ఈ పిడకలు వాడి వాటి ప్రయోజనాలు తెలుసుకున్నవారు వాటిని వదలరు. తయారీ ఇలా.... దేశీవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, హోమ ద్రవ్యాలైన రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతీ, తామర మొదలగు సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాన్సి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, వేప, సుగంధి పాల, గ్రంథి తగర, చెంగాల్వ కోస్తు, పచ్చ కర్పూరం మొదలగు సుగంధ భరిత ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి కావాల్సిన ఆకారంలో చేసి ఎండబెడతారు. ఇలా శాస్త్రోక్తంగా పవిత్రంగా ఈ పిడకలు తయారవుతాయి. కావాల్సిన సామగ్రి సమకూర్చడానికి మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులు ఉంటే రోజుకు ఒక మనిషి 300 పిడకలు చేసి ఎండబెట్టవచ్చు.వినియోగించడం ఎలా.. ఇంట్లో హోమ ద్రవ్యంగాను , అగ్నిహోత్రంగా, ధూపంగా వేసినట్లైతే మూలికలతో తయారైన ఈ పిడకల నుంచి వచ్చే పొగ రోగ కారక క్రిములను అంతరిపంజేసి, వాతావరణ కాలుష్యం నివారించి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. ఆరోగ్యంతో పాటు సుగంధ భరితమైన సువాసనలతో ఇంటి వాతావరణం ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఆరోగ్యం కోసమే చేస్తున్నా ఆరోగ్యకరమైన పంటల కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. అలాగే గాలి కూడా వీలైనంత మేర ఆరోగ్యకరంగా ఇవ్వాలనే ఆలోచనే ఈ పిడకల తయారీకి దారి తీసింది. పూర్వీకులు ఉదయాన్నే సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ను నిర్మూలించేందుకు ఆవుపేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఈ మధ్య కాలంలో జరిపిన ప్రయోగాల్లో కనుగొన్నారు. ఒక పిడక మీద సెల్ ఫోన్ ఉంచినప్పుడు అది వెలువరించే రేడియేషన్ పరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాలలో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకొని ఆయుర్వేదానికి సంబంధించి కొందరి సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వీటిని తయారు చేస్తున్నా. – సుబ్బరాజు, పాడి రైతు, రాజులకండ్రిగ (చదవండి: సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!) -
ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్ చెయ్యొచ్చా..?
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఐదేళ్ల కూతురు ఉంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. ఇంకో బేబీకి ప్లాన్ చెయ్యాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – రాధ, ధర్మవరంవయసు పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు తల్లికి, బిడ్డకి ఎక్కువ ఉంటాయి. మొదటి డెలివరీ, ప్రెగ్నెన్సీలో ఏదైనా సమస్యలు ఉంటే అవి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే ఇప్పుడు ఆ సమస్యలు ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏం చేసి వాటిని నార్మల్‌కి తీసుకురావాలి అని ముందే గైనకాలజిస్ట్‌ని కలవాలి. మధుమేహం సమస్య ఇప్పుడు ఎక్కువ అయితే, హెచ్బి ఏ1సీ లెవెల్స్ డైట్ చెక్ చెయ్యండి. లెవెల్స్ ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యకు మందుల ద్వారా ముందే కరెక్ట్ చెయ్యాలి. థైరాయిడ్ లెవెల్స్ చాలామందికి ముందే తెలియటం లేదు. అది బేబీ మెదడు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే, ముందు టీఎస్‌హెచ్ లెవెల్స్ చెక్ చెయ్యండి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో శిశువు ఎదుగుదల సమస్యలు వచ్చినట్టయితే ఈసారి రాకుండా కొన్ని మందులు, డైట్ ముందే మార్చి ఇస్తాం. రక్తం గడ్డకట్టడం అవుతుందా అనే రక్తపరీక్షలు ముందే చేయించుకొని, దానికి తగిన మందులు వాడాలి. రక్తహీనత వలన రెండో ప్రెగ్నెన్సీలో చాలా సమస్యలు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపంతో ఇబ్బంది రావచ్చు. అందుకే సీబీపీ, విటమిన్ బీ–12, విటమిన్–డీ3 లెవెల్స్ ముందే చెక్ చేసుకోవాలి. భర్త వీర్య విశ్లేషణ కూడా ఒకసారి చేయించు కోవాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఇద్దరూ పాటించాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు ప్లానింగ్‌కి మూడు నెలల ముందు నుంచి తీసుకోవాలి. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఏవైనా చర్మ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉంటే అవి ఇప్పుడు రాకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. వాక్సినేషన్స్ కూడా చాలా ముఖ్యం. ఫ్లూ వాక్సిన్, ఎమ్ఎమ్ఆర్ వాక్సిన్, ఆటలమ్మ, రుబెల్లా వాక్సిన్స్ ముందు తీసుకోకపోతే ఇప్పుడు తీసుకొని, ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. మీ బరువు ఉండవలసిన బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) కన్నా ఎక్కువ ఉంటే, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉంటే కొంత బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. సమతుల్యమైన, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వ్యాయామం ప్రారంభించాలి. మీరు ఏదైనా సమస్యలకు మందులు వాడుతుంటే అవి ప్రెగ్నెన్సీలో మంచివి కాకపోతే, సంబంధిత డాక్టర్ని కలసి మందులను మార్పించుకోవాలి. చాలామందికి ఆందోళన తగ్గించే మందులు, మూర్చవ్యాధికి మందులు మారుస్తాము. ఉద్యోగం ఒత్తిడి ఎక్కువ ఉంటే ఆ ప్రభావం శిశువు ఎదుగుదలపై పడుతుంది. అందుకే సరైన వర్క్ ప్లేస్ సెలక్ట్ చేసుకోండి. ధ్యానం, యోగా చేయటం మంచిది. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరిగితే సమస్యలు వస్తాయా..? -
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
మెనోపాజ్ గురించి ఎంత మాట్లాడితే అంత అర్థమవుతుంది.. అర్థమైతేనే దాని మేనేజ్మెంట్ తెలుస్తుంది! అందుకే మెనోపాజ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చారు టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి.. ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా మెనోపాజ్ గురించి మాట్లాడుతూంటే అది చర్చగా మారుతుంది. అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల పట్ల కేర్ పెరుగుతుంది అంటున్నారు...నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎక్స్‌పీరియెన్స్ చేస్తున్న ఫేజ్. మానసికంగా ఇదెంత ప్రభావం చూపుతోందంటే.. కోపం.. బాధ.. దుఃఖం.. ఆవేశం.. ఇలా ఎమోషన్స్ ఏవీ మన కంట్రోల్లో ఉండవు. దేనికి ఎలా రెస్పాండ్ అవుతున్నామో తెలియదు. ఒకరకమైన అలజడి. వణుకు తెప్పిస్తుంది. భయపెడుతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితిని కల్పిస్తుంది.గట్టి దెబ్బే కొడుతుంది.. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఈ మూడ్ స్వింగ్స్ వల్ల మనమేం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ సమయంలో మన పనులు డ్యామేజింగ్‌గా కూడా ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులను హర్ట్ చేయొచ్చు. మన ఈ ప్రవర్తన ఇంట్లో వాళ్లకూ అర్థమవడం కష్టం. ఫ్రెండ్స్‌కి చెప్పుకుందామనుకుంటే.. ఎక్కడి నుంచి .. ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అసలు ఇది షేర్ చేసుకునే విషయమేనా అనే సంశయం. ఇలా అన్నిరకాలుగా ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది. మానసికంగా గట్టి దెబ్బే కొడుతుంది.ముందు మనల్ని మనం.. ఈ ఫేజ్‌ను డీల్ చేస్తూ నేను తెలుసుకున్నదేంటంటే.. డైట్, మెడిసిన్ అంతగా హెల్ప్ చేయవని. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే ఈ మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్నిస్తుందని. అందుకే ఎక్సర్సైజ్, యోగాను లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవాలి. ట్రావెల్ లేదా మనకు నచ్చిన పనితో మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. నేను నేర్చుకున్నది ఇదే! దీన్ని ఫాలో అవుతూ నా ప్రొఫెషనల్ లైఫ్ ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే అదే ఇన్కమ్ సోర్స్ కాబట్టి. అంతేకాదు మన వ్యక్తిగత సమస్యలు వర్క్ ప్లేస్‌లో చర్చకు తావు ఇవ్వకూడదు! ఇంకో విషయం ఏంటంటే.. మన మూడ్‌స్వింగ్స్ నేరుగా ప్రభావం చూపించేది కుటుంబం మీదనే. ఎంత ఇబ్బంది అయినా వర్క్ ప్లేస్‌లో ఒక ఎరుకతో ఉంటాం.. ఉండాలి కూడా! అందుకే ముందు మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్లతో మన పరిస్థితిని వివరించి.. వాళ్ల సపోర్ట్ కూడా తీసుకోవాలి. దీనివల్ల వర్క్ ప్లేస్‌లో డీల్ చేయడమూ తేలికవుతుంది. సందర్భం దొరికినప్పుడు.. ఈ ఫేజ్‌లోని ఆడవాళ్లకు కచ్చితంగా సపోర్ట్ కావాలి. ఆల్రెడీ ఆ ఫేజ్‌ను అధిగమించిన వాళ్లు తమ అనుభవాలను, డీల్ చేసిన తీరును షేర్ చేసుకోవడం వల్ల ఆ ఫేజ్‌లోకి ఎంటర్ అయిన మహిళలు ధైర్యం తెచ్చుకుంటారు. ఈజీగా మేనేజ్ చేయగలమనే భరోసా వస్తుంది. దీనివల్ల సిస్టర్హుడ్ డెవలప్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సందర్భం, ప్లాట్‌ఫామ్ దొరికినప్పుడల్లా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన మహిళలు దీనిగురించి మాట్లాడటమో.. తమ అనుభవాన్ని పంచుకోవడమో చేస్తే.. మెనోపాజ్ మీద అందరికీ అవగాహన కలుగుతుంది. ఆడవాళ్ల సమస్యలు, బాధలు అర్థమవుతాయి. ఇంటా, బయటా కూడా సపోర్ట్ అందే ఆస్కారం పెరుగుతుంది. నార్మలైజ్ చేయాలి‘మెనోపాజ్‌ను అనకూడని, వినకూడని మాటలా భావిస్తారు మన సమాజంలో! దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ఎంతగా చర్చిస్తే అంతగా అవగాహన పెరుగుతుంది.. అంత ఎక్కువగా మహిళలకు మద్దతు అందుతుంది. సమాజం మీద సెలబ్రిటీల ప్రభావం ఎక్కువ కాబట్టి ఈ బాధ్యతలోనూ వాళ్లు ముందుండాలి. మెనోపాజ్ గురించి మాట్లాడుతూ దాన్ని నార్మలైజ్ చేయాలి!’– లారా దత్తా, బాలీవుడ్ నటి.– శిరీష చల్లపల్లి -
మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..
మాతృత్వం ఓ వరం అంటారు. అదిపొందలేక బాధపడుతున్న వాళ్లెందరో. ప్రస్తుత జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, జంక్ఫుడ్లతో మాతృత్వం మసకబారుతోంది. ముఖ్యంగా తల్లులు, కాబోయే తల్లులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టీనేజ్ వయసు నుంచే ఆడపిల్లలు మంచి ఆహారపు అలవాట్లు తీసుకునేలా కేర్ తీసుకుంటే..పెళ్లయ్యాక అలాంటి సమస్యలుబారిన పడరని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు తల్లలు ఆరోగ్యం కోసం ప్రతి ఏడాది ఏప్రిల్11న 'మాతృత్వ సంరక్షణ దినోత్సవం' పేరుతో ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే రోజు మహాత్మాగాంధీ భార్య కస్తుర్బా గాంధీ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా అమ్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా..? కాబోయే తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. బారతదేశంలో మాతృత్వ సంరక్షణ పరంగా మెరుగ్గా ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిని వర్గాల్లో మాత్రం ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రసూతి మరణాల్లో భారత్ రెండో స్థానంలో ఉండటమే అత్యంత ఆందోళన కలింగించే అంశం. పట్టణాల్లో అమ్మల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ప్రసూతి మరణాలు తగ్గించే విషయాల్లో బేషుగ్గానే ఉన్నా..పేదరికం, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ సమస్య ఓ సవాలుగా ఉంది. ప్రధాన కారణాలు.. తీవ్రమైన రక్తస్రావం, ఇన్షెక్షన్లు, అధిక రక్తపోటు, అసురకక్షిత గర్భస్రావాలు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం తదితరాలని చెబుతున్నారు నిపుణులు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకి వీటిపై కొంత అవగాహన ఉంది, పైగా అందుబాటులో ఆస్పత్రులు, ఆరోగ్య నిపుణుల సలహాను సులభంగా పొందగలరు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇంకా నాటు వైద్యాన్నే ఆశ్రయించడం, గర్భిణితో ఉండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేమి తదితరాలు ప్రసూతి మరణాల ప్రమాదాన్నిపెంచుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం చొరవతో..ప్రసూతి మణాలు అడ్డుకట్టే వేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని అంగన్వాడి, హోమ్ డాక్టర్ వంటి పథకాలతో అమ్మలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలతో తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పురోగతి సాధిస్తోంది కూడా. పూర్తి స్థాయిలో ఈ ఆరోగ్య అసమానతలను అధిగమించాలంటే..కేవలం అవగాహన కార్యక్రమాలతోనే సాధ్యం. అందుకోసమే ప్రభుత్వాలు తల్లిపిల్లల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం తదితరాలపై అవగాహన కల్పిస్తున్నాయి. గర్భస్రావాలు జరగకుండా ఉండేలా.. ఆడపిల్లల ఆరోగ్యం కోసం పౌష్టిక ఆహారం అందించేలా కొన్ని రకాల పథకాలను కూడా ఇస్తుండటం గమనార్హం. అయితే అవి ఇంకా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నప్రజలకు పూర్తి స్థాయిలో చేరకపోవడంతోనే భారత్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉందంటున్నారు నిపుణులు. అందువల్లే ఏటా ఈ దినోత్సవం రోజునైనా పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అందించే ఆరోగ్య సంరక్షణ పథకాలపై అవగాహన కల్పించడం, మాతృత్వ మధురిమను రక్షించేకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి కార్యక్రమాలతో చైతన్యపరుస్తున్నారు. అంతేగాదు స్కూళ్లు, కాలేజ్‌లు, కార్యాలయాల్లో పెద్దఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత ముఖ్యం అని అంటున్నారు గైనకాలజిస్టులు. కాగా, ఇక ఈ ఏడాది "ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనకమైన భవిష్యత్తులు" అనే థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లుల ఆరోగ్యం కోసం..పోషకాహారం తీసుకోవడంగర్భనిరోధక మాత్రలు వైద్యులు పర్యవేక్షణలోనే వాడటం, అతిగా వాడకం నిరోధించటం తదితరాలు..ప్రసవం ముందు, తదనంతరం సరైన జాగ్రత్తలు తీసుకోవడంసరైన ఫ్యామిలీ ప్లానింగ్దీంతోపాటు కుటుంబ సభ్యుల సహకారం తదితరాలతో అమ్మల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలాగే మన కుటుంబానికి ఆధారమైన ఆమె ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇద్దాం. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం) -
Menopause: పాజ్ కాదు..కొత్త ఫేజ్...!
మార్పును అంగీకరిస్తేనే మనోనిబ్బరం, శక్తి తెలుస్తాయి.. స్త్రీలకు మెనోపాజ్ అలాంటి మార్పే! దాన్ని అంగీకరిస్తూ జీవితాన్ని రీస్టార్ట్ చేసుకోవాలి! అలా అంగీకరించాలంటే ఆ దశ మీద ముందు అవగాహన రావాలి. అవగాహన రావాలంటే మౌనం వీడాలి! ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి ప్రముఖ గాయని సునీత ముందుకు వచ్చారు.పాజ్ కాదు.. కొత్త ఫేజ్!‘‘మెనోపాజ్ మనకు చాలా దూరం అనుకునేవాళ్లలో నేనూ ఒకదాన్ని. కానీ అది మన శరీరంలో ఓ వలయంలా తిరుగుతూ మెల్లగా మన జీవితాన్నే ఎఫెక్ట్ చేస్తుంది. ఒకరోజు హఠాత్తుగా మనలో చిత్రమైన ఒత్తిళ్లు మొదలవుతాయి. మూడ్ మారిపోవడం, అసహనం, చర్మం ముడతలు పడటం, నిద్రలేమి, ఒంటరితనపు వేదన.. ఇవన్నీ ఓ పెద్ద సవాలుగా మారుతాయి. అదే మెనోపాజ్. పైకి ఉచ్చరించలేని మౌనంగా భరించే మార్పు. అదొక భయంకరమైన ప్రయాణం. మన చేయిపట్టుకునే వాళ్లు లేక ఒంటరితనం ఆవహిస్తుంది. దిగులు తోడవుతుంది.అదృష్టమే.. కాని అరుదు!మెనోపాజ్ దశకు చేరేప్పటికి జీవితం నెమ్మదిస్తుంది. పిల్లలు సెటిలవుతారు. భర్తా బిజీ అయిపోతాడు. మన ఉద్యోగంలో పెద్దగా మార్పు కనపడదు. వీటన్నిటికి తోడు మెనోపాజ్ ఇబ్బందులు.. అంతా అయిపోయిందనే భావన. మనల్ని మనమే సహించలేని రోజులు, భర్తకు చెబితే అసహనంగా చూసే క్షణాలుంటాయి. పిల్లలతో షేర్ చేసుకోనివ్వని బిడియం. స్నేహితులతో మాట్లాడదామంటే వారు ఇంకా ఆ దశకు చేరనివారే! అమ్మ కూడా అర్థంచేసుకోలేదేమో అనిపిస్తుంటుంది.. ‘మా రోజుల్లో..’ అంటూ అసలు విషయాన్ని పట్టించుకోకుండా నాస్టాల్జియాలోకి వెళ్లే ఆమె మాటలను వింటుంటే! మెనోపాజ్ స్టేజీని అర్థం చేసుకుని అండగా నిలబడే వాళ్లుంటే అదృష్టమే! కాని అది అరుదు! అందుకే మనల్ని మనమే సముదాయించుకోవాలి.. మోటివేట్ చేసుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన మెడికేషన్ తీసుకోవాలి. మెనోపాజ్‌ను కొత్త ఫేజ్‌గా భావించాలి. అప్పటిదాకా నిర్వర్తించిన బాధ్యతల నుంచి వెసులుబాటు దొరికిందని ఆనందపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఆ స్వేచ్ఛను ఆస్వాదించాలి. మన శక్తిసామర్థ్యాలకు ఓ అవకాశం అనుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, అభిరుచులు, ఆసక్తులతో జీవితాన్ని రీస్టార్ట్ చేయాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ జీవితం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. వదిలేయకండి.. ఎంత సెల్ఫ్మోటివేషన్తో ఉన్నా కుటుంబం, ఫ్రెండ్స్ నుంచి ఆమెకు సపోర్ట్ అవసరమవుతుంది. ముఖ్యంగా ఇంట్లో వాళ్లు తనతో మాట్లాడాలి.. తను అనుభవిస్తున్న స్థితి గురించి అడగాలని కోరుకుంటుంది. తనను వినాలని ఆశపడుతుంది. అందుకే ఆమెతో మాట్లాడాలి.. ఆమెను వినాలి.. ఆత్మీయంగా హత్తుకోవాలి. ఇవన్నీ ఆమెకు దివ్యౌషధాలు. కుటుంబ సభ్యులు ఆమెను వినడం వల్ల వాళ్లకు మెనోపాజ్ దశ పట్ల అవగాహన పెరిగి.. వర్క్‌ప్లేస్‌లోని మహిళలను అర్థంచేసుకుని సహానుభూతి చూపించగలుగుతారు. దీనివల్ల ఆడవాళ్లలో బిడియం పోయి.. ధైర్యం వస్తుంది. తమ ఇబ్బందుల గురించి చెప్పగలుగుతారు. ఆ స్టేజ్ ఎలా ఉంటుందో అమ్మాయిలూ గ్రహించగలుగుతారు. అప్పుడు ఆటోమేటిగ్గా మెనోపాజ్ పట్ల ఉన్న సైలెన్స్ బ్రేక్ అయ్యి అవేర్నెస్ పెరుగుతుంది. అందుకే ఆ దశను అనుభవిస్తున్న ఆడవాళ్లను ఒంటరితనానికి వదిలేయకండి. అప్పటిదాకా ఇంటిని.. ఇంట్లో మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకున్న ఆమెకు తోడుగా నిలబడండి. ఈ ప్రయాణం మనది అనే భరోసానివ్వండి!’’ అంటూ ముగించారు సునీత. మెనోపాజ్ అనేది స్త్రీ జీవితంలో సహజమైన దశ. ఆ సమయంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల గురించి తరచూ మాట్లాడుతూ.. చర్చిస్తూ ఉంటేనే దానిపట్ల అవగాహన పెరుగుతుంది. మెనోపాజ్‌ను అనుభవిస్తున్న మహిళే కాదు కుటుంబ సభ్యులూ దాన్ని అంగీకరించాలి. ఆమె దైనందిన జీవితం సాఫీగా సాగడానికి తగిన సపోర్ట్ అందించాలి. మహిళలు కూడా తమ పట్ల వ్యక్తిగత శ్రద్ధను మరచిపోవద్దు. – జూహీ చావ్లా, నటి, పర్యావరణ ప్రేమికురాలు.మెనోపాజ్ అనేది సహజమైన స్థితి. దాన్ని అంగీకరించి.. కొత్త అభిరుచులు, కొత్త అవకాశాలు, కొత్త పనులతో ఆ దశలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ ట్రాన్సిషన్‌తో సరికొత్త జీవితాన్ని ఆరంభించాలి తప్ప అంతా అయిపోయిందనే నిరాశకు లోనుకాకూడదు. – నటి నీనా గుప్తా ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూ తో’లోంచి!– శిరీష చల్లపల్లి -
వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ ట్విన్స్ ప్రయోగంలో ఏ డైట్ మంచిదంటే..?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. సోషల్‌మీడియా పుణ్యామా..? అని రకరకాల డైట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఏది మంచిది అని డిసైడ్ చేసుకోలేని కన్ఫూజన్లో పడేసేలా ఊదరగొడుతున్నాయి. అయితే ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈ ఇద్దరు కవలలు ఓ ప్రయోగానికి పూనుకున్నారు. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే ఈ కవల సోదరులు వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్లో ఏది బెటర్ అనే దాని గురించి తమ శరీరాలపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఏ డైట్ ఆరోగ్యకరమైనదో వైద్యపరంగా నిర్థారించి మరీ చెప్పారు.యూకేలోని డెవాన్లోని ఓ గ్రామానికి చెందిన రాస్, హ్యూగో టర్నోర్ అనే కవలలు ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు. ఈ ఇద్దరు ఆహారం, ఫిట్నెస్కి సంబంధించి పలు ప్రయోగాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈసారి మొక్కల ఆధారిత వర్సెస్ జంతువుల ఆధారిత డైట్లలో ఏది ఆరోగ్యానికి మంచి ఫలితాలనిస్తుంది దాని గురించి తమపైనే ప్రయోగాలు చేసుకుని మరీ నిర్థారించి చెప్పారు. అందుకోసం ఆరు నెలలపాటు ఈ 36 ఏళ్ల కవలలు దాదాపు ఒకేలాంటి జీవనశైలిని అనుసరించారు. అయితే తీసుకునే ఆహారంలోనే వ్యత్యాసం ఉంటుంది. హ్యూగో సముద్రపు ఆల్గే , మొక్కల ఆధారిత ఒమేగా 3 నూనెలు, మొక్కల ఆధారిత సప్లిమెంట్లు తదితరాలు తీసుకున్నాడు. రాస్ సాంప్రదాయ జంతు ఆధారిత విటమిన్లు తీసుకున్నాడు. అయితే ఆరు నెలల తదనంతరం ఇరువురిలో అద్భుతమైన మార్పులు, ఫలితాలు కనిపించాయి. ఇక్కడ హ్యూగో రక్తం పోషకాలతో కనిపించింది. కీలకమైన విటమిన్లు డీ3, కొవ్వు ఆమ్లాలు సమస్థాయిలో ఉన్నాయి. ఇక రాస్ తీసుకున్న నాన్ వెజ్ ప్రోటీన్లకు మించి హ్యగో శరీరంలో మెరుగైన స్థాయిలో విటమిన్లు ఉన్నాయి. వారిద్దరూ కూడా ఈ డైట్లలో ఇంత తేడా ఉంటుందని అనుకోలేదట. రక్తపరీక్షల్లో హ్యూగో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఒమేగా-3, విటమిన్ D3 పుష్కలంగా ఉన్నాయి హ్యూగో బాడీలో. కేవలం రక్తపరీక్షలే గాక, కొవ్వులు, ఆమ్లలాల స్థాయిలతో సహా ప్రతీది ట్రాక్ చేశారు. అయితే ఈ డైట్లలో మొక్కల ఆధారిత వెర్షన్ మెరుగైన ఫలితాలనిచ్చింది. రాస్ తిన్న సాల్మన్ చేపల కంటే సముద్రపు పాచి సప్లిమెంట్లోనే విటమిన్ డీస్థాయిలు, మంచిరోగ నిరోధక శక్తిని హ్యూగోకి అందించాయి. అంతేగాదు శాకాహారం శరీరంలో కొవ్వుని తగ్గించి మెరుగైన శక్తి స్థాయిలను ప్రోత్సహించదని తేలింది. ఇలాంటి ప్రయోగాలు ఆ కవలలకు తొలిసారి కాదు. గతంలో అధిక కార్బ్ వర్సెస్ అధిక కొవ్వు ఆహారాలలో ఏది మంచిదో తెలుసుకోవాలని ప్రయోగాలు చేశారు కూడా. దానిలో రాస్ పాస్తా, బియ్యం వంటి కార్బొహైడ్రేట్లు తీసుకోగా, హ్యూగో గుడ్లు, వెన్న వంటి వాటిని తీసుకున్నారు. అయితే రాస్ కొలస్ట్రాల్‌ని కోల్పోగా, హ్యూగో మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పైగా అందులో ప్రమాదకరమైన చెడెకొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఉన్నాయి. చివరగా ఈ కవల ఫిట్నెస్ ప్రయోగాల వల్ల మొక్కల ఆధారిత సప్లిమెంట్స్ ప్రయోజనాలు హైలెట్ చేయడమే గాక సాంప్రదాయ పోషకాహారం గురించి చాలకాలం నుంచి ఉన్న అపోహలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అంతేగాదు మన ఆరోగ్యంలో ఆహారం ఎంత కీలకపాత్ర పోషిస్తుందని అనేది తేటతెల్లమైంది కూడా. View this post on Instagram A post shared by 𝗧𝗛𝗘 𝗧𝗨𝗥𝗡𝗘𝗥 𝗧𝗪𝗜𝗡𝗦 (@theturnertwiins) (చదవండి: పీరియడ్స్ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!) -
నాన్న ఉన్నట్టుండి పడిపోతున్నారా?, అయితే..
ఆరు పదుల వయసు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు?, ఎలా ఉంటున్నారు? అనేది పిల్లలు గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అంతకుముందు చురుగ్గా తిరిగిన తండ్రి.. ఇప్పుడు ఉన్నట్టుండి డల్‌గా మారిపోవడం, శరీరం అంతా బిగుసుకుని ఉండిపోవడం, ఎక్కువగా నడవలేకపోవడం, ఒకవేళ నడిచినా పడిపోతుండడం లాంటి లక్షణాలు కనపడితే, అది కేవలం వయసు ప్రభావం మాత్రమే కాదు.. పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు. పై లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించాలి. తగిన పరీక్షల ద్వారా దానికి కారణాలేంటో తెలుసుకుని తక్షణం చికిత్స ప్రారంభిస్తే లక్షణాలు తగ్గడమే కాదు, కొన్ని కేసుల్లో పూర్తిగా నయం అయిపోతుంది కూడా! మెదడులో ఉండే డొపమైన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వచ్చే పార్కిన్సన్స్ వ్యాధి గురించి సామాన్య ప్రజల్లో కూడా అవగాహన ముఖ్యమని.. దాని లక్షణాలను గమనించి వెంటనే చికిత్స చేయించడం అవసరమని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ నెల 11న ప్రపంచ పార్కిన్సన్స్ డే(World Parkinson's Day) సందర్భంగా ఆయన మాట్లాడారు.“మన శరీరంలో ఇన్సులిన్ తగ్గితే మధుమేహం ఎలా వస్తుందో... అలాగే డొపమైన్ తగ్గితే పార్కిన్సన్స్ వస్తుంది. సాధారణంగా ఇది 60 ఏళ్లు దాటినవారిలోనే కనిపిస్తుంది గానీ, ఇటీవల కొన్ని కేసుల్లో మాత్రం 20లలో ఉన్నవారికి కూడా చూస్తున్నాం. ఇతర వ్యాధుల్లా కాకుండా.. శారీరకంగా కనిపించే లక్షణాలను బట్టే దీన్ని గుర్తించేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది. 👉ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం, గతంతో పోలిస్తే బాగా డల్‌గా ఉండడం, ముఖంలో ఎలాంటి హావభావాలు పలికించకపోవడం, శరీరం అంతా బిగుతుగా అయిపోవడం, చేతులు కొద్దిగా వణకడం, చేత్తో ఏవీ సరిగ్గా పట్టుకోలేకపోవడం, నడక తగ్గిపోవడం, నడుస్తుంటే పడిపోవడం... ఇలాంటివన్నీ కూడా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలే. వీటిలో ఏవి కనిపించినా కూడా అవతలివాళ్లు వెంటనే గుర్తించగలరు. 👉అలా గుర్తించినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో.. కుటుంబంలో ఏదైనా మరణం సంభవించడం వల్ల కుంగుబాటు (డిప్రెషన్)తో అలా అయిపోయారని, కొన్ని రోజులు పోతే అదే నయమైపోతుందని వదిలేయకుండా వెంటనే వైద్యులకు చూపించాలి. చూపించినప్పుడు ఆ సమస్య మానసికమా, శారీరకమా అన్నది గుర్తించి అందుకు తగిన చికిత్సలు అందిస్తారు.👉గతంలో పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ) వచ్చిందంటే దానికి ప్రధానంగా డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) లాంటి శస్త్రచికిత్సలే ఉండేవి. లేదంటే శరీరంలో డొపమైన్ స్థాయిని పెంచేందుకు కొన్ని రకాల మందులు వాడేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి కారణాలు ఏంటో తెలుసుకుని అందుకు తగిన చికిత్స చేసేందుకు అవకాశం వచ్చింది. ఇటీవల నా దగ్గరకు ఒక రోగి వచ్చారు. ఆయనకు పార్కిన్సన్స్ లక్షణాలే ఉన్నాయి. పరీక్షించినప్పుడు యాంటీబాడీలు తయారవ్వడం వల్ల డొపమైన్ స్థాయి తగ్గుతోందని గుర్తించాం. దాంతో ఇమ్యునోథెరపీ ప్రారంభిస్తే చాలా తక్కువ సమయంలోనే ఆయనకు పూర్తిగా నయమైంది. ఇప్పుడు మామూలు మనిషిలా ఉన్నారు. అందువల్ల సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొస్తే, పార్కిన్సన్స్ వ్యాధిని కూడా పూర్తిగా నయం చేసేందుకు కొన్ని కేసుల్లో అవకాశం ఉంటుంది. అదే ఇంతకుముందయితే జీవితాంతం డొపమైన్ పెంచేందుకు ఉపయోగపడే మందులు వాడుతూ ఉండాల్సి వచ్చేది, లేదా డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చేది. కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీరంలో కణాలు చచ్చిపోతాయి. అందువల్ల కూడా డొపమైన్ ఉత్పత్తి తగ్గిపోయి ఈ సమస్య వస్తుంది. అందువల్ల.. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే రసాయనాలకు గురికావడాన్ని కూడా తగ్గించాలి. అలాగే ఎంత త్వరగా ఈ లక్షణాలు గుర్తిస్తే అంత త్వరగా వైద్యులకు చూపించి, త్వరగా చికిత్స చేయడం మొదలుపెడితే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. చురుకైన జీవనశైలిని పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం, నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధి రాకుండా నిరోధించుకోవచ్చు” అని డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ వివరించారు.డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్,ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్,స్ట్రోక్ స్పెషలిస్ట్ -
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!
సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్ పీరియడ్ సైకిల్) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్‌టాక్ యూజర్ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్ విటమిన్‌ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ వంటి స్కానింగ్‌లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్‌టాక్ ఫాలోవర్స్ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం) -
మామయ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది
మా మామయ్యకు 65 ఏళ్లు. ఆయనకు బీపీ, షుగర్ చాలా కాలంగా ఉన్నాయి. సంవత్సరం క్రితం పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని చెప్పారు. ఇక్కడే నరాల డాక్టర్‌కి చూపిస్తున్నాం. కొన్ని రోజులుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. మా అత్త గారిని విపరీతంగా అనుమానిస్తున్నారు. ఇంటికి ఎవరైనా మగవాళ్ళు వస్తే వాళ్ళకి, మా అత్తగారితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. అలాగే రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోకుండా మధ్యలో లేచి బయటకు, ఇంట్లోకి తిరుగుతున్నారు. మాకు ఎవరికీ కనపడని మనుషులు ఆయనకు కనపడుతున్నారు. ఈమధ్య అనుమానం నా మీద కూడా మొదలైంది. ఇంట్లో ఆడవాళ్ళని బయటకు వెళ్ళనీయట్లేదు. మా ఆయనకి చెప్తే వాళ్ళ నాన్నను మందలించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రవర్తనతో, మాటలతో మాకు నరకం కనిపిస్తోంది. – భానుప్రియ, మదనపల్లెమీరు రాసిన దాన్ని బట్టి మీ మామ గారికి గతంలో ఎప్పుడూ మానసిక సమస్యలు లేవు, బీపీ, షుగర్ మాత్రమే ఉన్నాయి, ఈ మధ్యే పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని తెలుస్తోంది. మెదడులో ‘డోపమైన్’ అనే రసాయనం స్థాయి తగ్గినప్పుడు పార్కిన్సన్ జబ్బు, అదే డోపమైన్ పెరిగినపుడు ‘సైకోసిస్’ జబ్బు వస్తుంది. పార్కిన్సన్ జబ్బులో డోపమైన్ రసాయనం స్థాయి తగ్గడం వల్ల చేతులు వణకడం, నిదానంగా నడవడం, శరీరంలో కదలికలు తగ్గడం లాంటివి జరుగుతాయి. మందులు వాడినపుడు డోపమైన్ లెవల్స్ పెరిగి వారిలో ఈ లక్షణాలు మెరుగవుతాయి. ఐతే ఇలా మందులు వాడే వారిలో కొందరికి అనుమానాలు, భ్రాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనపడతాయి. దీనికి ప్రధాన కారణం డోపమైన్ లెవెల్స్ అవసరానికి మించి పెరగడం. మీ మామ గారి విషయంలో జరిగింది కూడా ఇదే! కనుక ముందు మీ న్యూరాలజిస్ట్‌ని కలిసి మందులు తగ్గిస్తారో లేదా మారుస్తారో కనుక్కోండి. అలా కుదరని పక్షంలో సైకోసిస్ లక్షణాలు తగ్గడం కోసం కొన్నాళ్ళు సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ఉండి ‘యాంటీ సైకోటిక్’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా మందులు వాడినప్పుడు పార్కిన్సన్ జబ్బు లక్షణాలు కొంత పెరగవచ్చు కూడా! అందుకే హాస్పిటల్లో డాక్టరు పర్యవేక్షణలో అడ్మిట్ అయి వైద్యం చేయించుకోవడం మంచిది. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన కావాలని ఇదంతా చేయడం లేదని గ్రహించండి. వీలైనంత త్వరగా దగ్గర్లోని మానసిక వైద్యున్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) (చదవండి: 'ట్విన్‌టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!) -
ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం
ప్యూబర్టీ, మాతృత్వంలాగే స్త్రీ జీవితంలో మెనోపాజ్ కూడా శారీరక, మానసిక మార్పులతో కూడిన సహజమైన దశ! అయితే... ఇది సాఫీగా సాగిపోయే దశ కాదు. కొన్ని హార్మోన్ల ఉత్పత్తి మందగించి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. అవి స్త్రీ దైనందిన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఇంత తీవ్రమైన అంశం మన సాంస్కృతిక నేపథ్యం కారణంగా సైలెంట్‌గా ఉండిపోయింది. ఆ సైలెన్స్ మెనోపాజ్ మీద అవగాహన కొరవడేలా చేస్తాయి. ఎంతలా అంటే సమాజం సంగతి అటుంచి మెనోపాజ్ ఎఫెక్ట్స్ మీద ఆ దశను అనుభవిస్తున్న స్త్రీలకే తెలియనంతగా! అందుకే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి... మెనోపాజ్ మీద విస్తృతమైన చర్చ కొనసాగాలి. అప్పుడే సమాజం ఆమెను అర్థం చేసుకోగలుగుతుంది. తన వంతు మద్దతు అందించగలుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో మెనోపాజ్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది.‘నేనిప్పుడు ఫ్రిజ్ డోర్ ఎందుకు తెరిచానబ్బా..?’ ఎంత చించుకున్నా అరుంధతికి గుర్తు రావడం లేదు. ‘ముందిక్కడి నుంచి వెళ్లు...’ చిన్న విషయానికే పెద్దగా అరిచేసింది ప్రతిమ. కంగుతిన్నాడు భర్త. ఆఫీస్‌లో సీరియస్ వర్క్‌లో ఉన్న అపర్ణ ఒక్క ఉదుటన లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్వసాగింది. ఎందుకంత దుఃఖం వచ్చిందో తెలియదు ఆమెకు. పనిమీద ఏకాగ్రత కుదరట్లేదు వైశాలికి. మాలతికి జాయింట్ పెయిన్స్, నీలిమకు నీరసంగా, నిస్సత్తువగా ఉంటోంది. విజయ డిప్రెసివ్‌గా ఫీలవుతోంది. దిగులు వెంటాడుతోంది. కారణం లేకుండానే ఆందోళన చెందుతోంది ప్రేమ. జీవనాసక్తి లేదు. గిరిజ అయితే కళావిహీనంగా మారిపోయింది. రజితకు ఉన్నట్టుండి వేడి ఆవిర్లు వస్తున్నాయి. క్షణంలో జ్వరమొచ్చినట్టుగా అయిపోతోంది. వీణకు నిద్ర కరవైంది. దాంపత్య జీవితం పట్లా ఆసక్తి పోయింది. దాంతో భర్త ఆమెను సాధిస్తూ తన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు.పైన చెప్పిన మహిళలవే కాదు 40– 50 మధ్య వయస్సు వనితలందరివీ దాదాపు అవే సమస్యలు! మెనోపాజ్ ఎఫెక్ట్స్! చిత్రవిచిత్రమైన ఆ పరిస్థితి అనుభవిస్తున్న వాళ్లకే అర్థంకాకపోతే కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బందికేం అర్థమవుతుంది.. వాళ్ల సహకారమెలా అందుతుంది! దీని మీద అవగాహన కల్పించేందుకు రమావైద్య, ఊర్వశి ఝా అనే వైద్యులు 1995 (ముంబై)లోనే తమ ప్రయత్నాన్నిప్రారంభించారు ‘ద ఇండియన్ మెనోపాజ్ సొసైటీ’ని స్థాపించడం ద్వారా ఇది ఇప్పటికీ తన సేవలను అందిస్తూనే ఉంది. జర్నలిస్ట్, రచయిత, మహిళా హక్కుల కార్యకర్త శైలీ చోప్రా కూడా ‘మెనోపాజ్’ మీద అవగాహన కల్పించేందుకు, దానికి సంబంధించిన మెడికల్ కేర్, కమ్యూనిటీ సపోర్ట్‌ను కూడగట్టేందుకు ఉద్యమిస్తున్నారు. మెనోపాజ్‌కి సంబంధించి విప్లవమే రావాలి అంటూ ఆమె రోడ్ షోస్ చేస్తున్నారు. గైనకాలజిస్ట్‌ల ప్రకారం వరుసగా పన్నెండు నెలలు నెలసరి రాకపోతే మెనోపాజ్ వచ్చినట్టే! రుతుక్రమంలోని స్త్రీలు తప్పించుకోలేని దశ అది! కానీ మన సాంస్కృతిక నేపథ్యం దీనిగురించి మాట్లాడనివ్వకుండా చేస్తోంది. దానిమీద విస్తృతమైన చర్చ జరిగితేనే అదో వినకూడని మాటలా కాకుండా సాధారణమైన అంశగా మారుతుంది. మెనోపాజ్ ఫేజ్‌లోని మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచన మొదలవుతుంది. ఆ దశలో వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం మొదలు శారీరక వ్యాయామం, ధ్యానం, ఎమోషనల్ బ్యాలెన్స్ లాంటివాటి మీద ఎరుక వస్తుంది. అప్పుడే మెనోపాజ్ ప్రభావాన్ని స్త్రీ సమర్థంగా ఎదుర్కోగలదు. ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటూ సాక్షి ఫ్యామిలీ కూడా శారీరక, మానసిక వైద్యనిపుణుల విశ్లేషణలు, వివరాలు, సలహాలు, సూచనలతో నేటినుంచి మెనోపాజ్ అవేర్నెస్ క్యాంపెయిన్‌ను మొదలుపెడుతోంది.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ 2019– 21) డేటా ప్రకారం..ప్రీమెచ్యూర్, అర్లీ మెనోపాజ్ గ్రామీణప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతోంది. దానికి పేదరికం, నిరక్షరాస్యత వంటివి కారణాలుగా చూపెడుతోంది. మద్యపానం, ధూమపానం, పోషకాహారలోపం, బహిష్టు సమయంలో అపరిశుభ్రంగా ఉండటం, అనారోగ్య పద్థతులు అనుసరించడం కూడాప్రీమెచ్యూర్ మెనోపాజ్‌కి కారణాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక సంతానం,18 ఏళ్లకే తొలి కాన్పు, పన్నెండేళ్లు లేదా అంతకంటే చిన్నవయసులో రుతుక్రమం ప్రారంభం అవడం లాంటి వాటివల్లా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రిస్క్ పెరగొచ్చని తెలుపుతున్నాయి. దేశంలోని మిగిలినప్రాంతాల కన్నా బిహార్‌లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రేట్ ఎక్కువగా కనబడుతోందని సర్వేల సారాంశం. అలాగే యాభై పైబడ్డాక కూడా నెలసరి కొనసాగిన వాళ్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అయ్యే రిస్క్ ఎక్కువ.నలభై ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వచ్చేస్తే దాన్నిప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. మన దేశంలో 2.2 శాతం మంది మహిళలు ప్రిమెచ్యూర్ మెనోపాజ్‌లో ఉన్నట్లు అంచనా. నలభైనుంచి నలభై నాలుగేళ్ల మధ్య వయసులో గనుక మెనోపాజ్ దశ మొదలైతే దాన్ని అర్లీ మెనోపాజ్ అంటారు. ఈ దశలో ఉన్న మహిళల సంఖ్య 16. 2 శాతం.దేశంలో మెనోపాజ్ సగటు వయసు నలభై ఆరున్నరేళ్లు. అయితేప్రాంతాల వారీగా ఈ సగటు వయసులో తేడాలున్నాయి. దక్షిణ భారతదేశంలో 46 ఏళ్లు. ఉత్తర భారతంలో 45.5, మధ్య భారతంలో 47.8, పశ్చిమ భారతంలో 46.2, తూర్పు భారతంలో 47.3 ఏళ్లు.ముందు తరాల వారితో పోలిస్తే.. మెనోపాజ్ సింప్టమ్స్‌కి ఆధునిక జీవన శైలి, అధిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, రోజులో ఎక్కువ సమయం ఫోన్లలో గడపడం వంటివన్నీ కారణాలుగా చెబుతున్నారు నిపుణులు.మెనోపాజ్‌లో వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి ప్రతి మహిళా అవగాహన పెంచుకోవాలి. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్‌లోని తమ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిస్పృహకు లోను కారాదు. – షబానా ఆజ్మీ, నటిమెనోపాజ్ దశలోని మహిళలు ముందు తమ పట్ల తాము శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల గురించి నిస్సంకోచంగా కుటుంబంతో చర్చించి, సపోర్ట్ అడగాలి. ఎమోషనల్ చాలెంజెస్‌కి డీలా పడిపోకుండా కుటుంబ సభ్యుల మద్దతుతో వాటిని నార్మలైజ్ చేసుకోవాలి. – ప్రీతి జింటా, నటి– సరస్వతి రమ(చదవండి: 'ట్విన్‌టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!) -
ఫ్రూట్స్‌తో.. బీకేర్‌ఫుల్..!
వేసవి సీజన్ వచ్చిందో లేదో అప్పుడే మార్కెట్లో మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. మామిడి పండ్లేనా.. సీజనల్ స్పెషల్ వాటర్మెలన్, మరోవైపు ద్రాక్ష, ఆల్ సీజనల్ ఫేవరెట్ అరటి ఇలా అన్నిరకాల పండ్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆరోగ్యం కోసం ఇష్టంగా కొనుగోలు చేసే పండ్లు ప్రమాదకర రసాయనాలను ఇంట్లోకి.. మన ఒంట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ సీజన్లో మాత్రమే దొరికే మామిడి పండ్లు.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితి నగరవాసులది. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రతి ఏడాది మరింత పెరుగుతూనే ఉండటం నగర జీవన శైలిని ఆందోళనకు గురిచేస్తోంది. సహజసిద్ధంగా విటమిన్లు, ప్రోటీన్లు తదితర పోషకాలను అందించే ఫలాలే ప్రజల అనారోగ్యానికి కారకాలుగా మారుతున్న నేపథ్యంలో అసలు మంచి పండ్లను ఎలా గుర్తించాలి అనే అంశంపై ఆరా తీస్తున్నారు నగరవాసులు. వేసవిలో పండ్లను ఎక్కువ ఆస్వాదించడానికి చాలా కారణాలున్నాయి. ఈ సీజన్లో మాత్రమే లభించే పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉండటం, వేసవి తాపానికి డీహైడ్రేషన్ నుంచి సంరక్షించుకోవడానికి పళ్ల రసాలను తాగుతుంటారు. దీన్ని అదనుగా భావించి, మార్కెట్ డిమాండ్‌కు సరిపడా సరఫరా అందించడమే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ప్రమాదకర పంథాను ఎంచుకుంటున్నారు. సహజసిద్ధంగా పండ్లను మగ్గించడానికి బదులు కృత్రిమ పద్ధతిలో రసాయనాలను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా కాల్షియం కార్బైడ్ వంటి విషపూరిత రసాయనాలను పండ్లు మగ్గించడానికి వాడుతున్నారు. ఈ పదార్థం అనారోగ్యాలకు కారణమని, దీంతో పండ్లను మగ్గించవద్దని గతంలోనే హైకోర్టు నిషేధించింది. అయినప్పటికీ మార్కెట్ అవసరాల కోసం కొందరు వ్యాపారులు ఈ రసాయనాలను వాడుతూనే ఉన్నారు. ఓ వైపు నగరంలో పరిశుభ్రత లేకుండా కత ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్లతోనే భయపడుతున్న సిటీజనులను ఈ పండ్ల పరిస్థితి మరింత భయపెడుతోంది. దీన్ని నివారించడానికే నగరాల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం పలు నిబంధనలు అమలు చేస్తోంది. అనుమతి మేరకు ఇథిలిన్ ఛాంబర్స్ వినియోగించేలా సూచనలిచ్చింది. ఈ ఛాంబర్స్‌లో 72 గంటల్లో కాయలు పండ్లుగా మారే విధానంలో హార్మోన్లు సమపాళ్లలో ఉంటాయి. వీటితో పాటు ఇథోపాన్ అనే షాచెట్స్తో పండ్లను మగ్గించడానికి అనుమతి ఉంది. ఈ మధ్య కాలంలో సహజసిద్ధంగా పండించిన పండ్లను ఎలా గుర్తు పట్టాలనే అంశాలపై నగరవాసులు ఆరా తీస్తున్నారు. కొందరైతే గూగుల్, యూట్యూబ్‌లో ఏఐని అడుగుతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సహజపద్ధతిలో వండిన ఫలాలు కమ్మని, తియ్యటి వాసనతో ఉంటాయని నిపుణులు, ఆర్గానిక్ రైతులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ పండ్లపై నల్లటి మచ్చలు కనిపిస్తాయని, అన్నిసార్లు అందంగా ఉన్న పండ్లే ఆరోగ్యకరమైనవని అనుకోవద్దని సూచిస్తున్నారు. ఫలాలను తెంపిన కాడ తాజాగా కాకుండా వాడిపోయనట్టు, సహజసిద్ధంగా పండించడం వల్ల ఈ పండ్లపై కాసింత గడ్డిపొట్టు, సన్నని బూజు కనిపిస్తాయి.తీవ్ర అనారోగ్య సమస్యలు ముఖ్యంగా హైదరాబాద్ నగర కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాలతో సతమతమవుతున్న నగరవాసులకు కృత్రిమంగా పండ్లను మగ్గించడానికి వినియోగించే కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదక రసాయనాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. యువతకు కూడా ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా హృదయం, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రిప్పెనింగ్ రసాయనాలు ఫలాలపై తొక్క మాత్రమే పండేలా చేస్తాయి. ఫలితంగా పండ్ల లోపలి గుజ్జు్జ పూర్తిగా పండకుండానే మార్కెట్లోకి అమ్మకానికి వస్తుంటాయి. వీటిని తినడం వల్ల వాంతులు, నీరసం, చర్మ సమస్యలు, విపరీతమైన దాహం, నోటిలో నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. చిన్నపిల్లలు, గర్భిణులకు ఈ పండ్లు మరింత ప్రమాదకరం. కాల్షియం కార్బైడ్ ఉత్పత్తి చేసే ఎసిటలీన్ మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీసి జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుందని పరిశోధనలు స్పష్టం చేశాయి. సహజంగా మగ్గించిన పండ్లను గుర్తుపట్టాలంటే.. ఒక బకెట్లో నీరు నింపి అందులో మార్కెట్లో కొన్న పండ్లను వేస్తే.. సహజంగా పండించిన ఫలాలు నీటి అడుగు భాగానికి చేరుకుంటాయి. ప్రమాదక రసాయనాలతో మగ్గించినవి మాత్రం నీటిపైకి తేలుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు వ్యాపారులు వేడి చేసిన కాల్షియం కార్బైడ్ నీళ్లలో పండ్లను ఉడకబెట్టి కృత్రిమంగా మగ్గిస్తుంటారు. ఇలాంటి విధానాల్లో పండ్లు వాటి ఆకారాన్ని కోల్పోయి గుండ్రంగా మారుతాయి. అంతేకాకుండా రసాయనాలతో పండించినవి తాజాగా, చర్మం నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ఈ ఫలాలు వాటి సహజమైన రుచిని చాలా వరకు కోల్పోతాయి. ఈ ఫలాలపై ఆకుపచ్చ, బ్రౌన్ కలర్లో మచ్చలను గుర్తించవచ్చు. ఈ మధ్య కాలంలో పలువురు రైతులు సహజసిద్ధంగా పండ్లను పండించి, వాటిని పెద్ద పెద్ద వాహనాల్లో భారీ స్థాయిలో నగరానికి తరలించి అమ్ముతున్నారు. (చదవండి: Coconut Fiber Matress: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్ ఐదేళ్లలో..) -
టీబీ గుర్తింపులో ఏఐ విప్లవం
హైదరాబాద్: చెస్ట్ ఎక్స్-రేలను ఉపయోగించి క్షయ వ్యాధి (టీబీ)ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కిమ్స్ ఆస్పత్రి అతిపెద్ద పరిశోధన చేసిందని తెలిపారు కిమ్స్ హాస్పిటల్స్ పల్మోనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతా శర్మ. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా, క్యూఎక్స్ఆర్ అనే అత్యాధునిక ఏఐ టూల్‌ను ఉపయోగించి మొత్తం 16,675 మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్-రేలను విశ్లేషించారు.ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టిపెట్టారు. ముందుగా ఏఐ ద్వారా టీబీని గుర్తించడం, ఆ తర్వాత రేడియాలజిస్టులు దాన్ని నిర్ధారించడం. టీబీ కేసులను గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ అత్యంత సమర్థమైనదని దీనిద్వారా తెలిసింది. మొత్తం గుర్తించిన కేసుల్లో 88.7% కచ్చితమైనవిగా తేలింది. దీంతో వ్యాధిని త్వరగా గుర్తించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని నిర్ధారణ అయ్యింది. దానికితోడు.. ఇందులో టీబీ లేదని నిర్ధారించడంలో 97% కచ్చితత్వాన్ని ఏఐ సాధించింది. ఏఐ టూల్ స్పెసిఫిసిటీ 69.1%గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రమాణాలను ఇది అందుకుంటోంది.ఇందులో మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఏఐ గుర్తించిన కేసులన్నింటినీ నిపుణులైన రేడియాలజిస్టులు కూడా నిర్ధారించారు. అందువల్ల క్లినికల్ డయాగ్నసిస్‌లో ఏఐ సామర్థ్యం, దాని కచ్చితత్వాలకు ఇది నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టీబీ కేసుల నేపథ్యం, సంప్రదాయ రేడియోగ్రఫీతో దాన్ని నిర్ధారించడానికి ఎక్కువ సమయం పడుతున్నందువల్ల ఇది మెరుగైన ప్రత్యామ్నాయం కానుంది.ఈ సందర్భంగా ఆమె ఈ పరిశోధన ప్రభావం గురించి మాట్లాడారు. “టీబీ గుర్తింపులో ఏఐ టూల్ సామర్థ్యం, దాని కచ్చితత్వం చాలా బాగున్నాయి. ఇది గేమ్ ఛేంజర్ కానుంది. ముఖ్యంగా నిపుణులైన రేడియాజిస్టులు ప్రతిసారీ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి” అని ఆమె చెప్పారు.కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ చైతన్య ఇసమళ్ల మాట్లాడుతూ, “మానవ నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు గానీ, ప్రాథమిక పరీక్షల విషయంలో మాత్రం అది చాలా ఆధారపడదగ్గ పరికరంగా ఉపయోగపడుతుంది. అందువల్ల సంక్లిష్టమైన కేసుల్లో లోతుగా పరిశీలించేందుకు అవసరమైన సమయం వైద్యులకు దొరుకుతుంది” అని వివరించారు. -
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
ఆరోగ్యపరంగా భారంగా మారిన సమస్య అధిక బరువు(ఊబకాయం). ఇదే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారణమని పదే పదే హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెప్పాలంటే ఇదే సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే బరువు తగ్గడం అంత ఈజీకాదు. పైగా ప్రస్తుత ప్రజల జీవన విధానం..అందుకు తగ్గట్టుగా ఉన్న ఒత్తిడులు, ఆందోళనలు వెరసీ బాడీపై ధ్యాస పెట్టే ఛాన్సే లేదు. అందువల్లే ఇది జఠిలమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం "బరువు తగ్గించుకుందాం..ఆరోగ్యంగా ఉందా" అని పిలుపునిస్తూ అవగాహన కల్పించే యత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా చేరారు. ఏం చేస్తే బరువు తగ్గగలరు అనే అంశం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.ఎంటర్ప్రెన్యూర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్, ఫిగరింగ్ అవుట్లో బరువు తగ్గడం అనే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. "ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. డబ్బుతో పరిష్కరించ లేని సమస్య ఇది. నేను ప్రధాని మోదీని కలసినప్పుడూ ఈ విషయం గురించే చర్చించాం. యోగా ఆధారిత ఆసనాలతో ఎలా తగ్గించుకోవచ్చో చెప్పారు మోదీ. కానీ ఆ దిశగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదని, ఇంకా ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో మార్పుకి సిద్ధపడలేకపోతోందని చెప్పారాయన. అయితే నేను జీవశైలిలో మార్పులను విశ్వసించనప్పటకీ....వైద్య ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా నమ్ముతా. ప్రస్తుతానికి మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న బాధితుల్లో ఓ ఆశను రేకెత్తిస్తోంది. ఈ జీఎల్పీ-1 అనే మధుమేహ మందులు ఈ సమస్యకు కొంతమేర శాస్త్రీయ పరిష్కారాన్ని అందించాయి. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చేలా చౌక ధరలలో లభించనున్నాయి. "అని అన్నారు బిల్‌గేట్స్. కాగా, ఈ డయాబెటిక్ మందులు ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో, జెప్‌బౌండ్ వంటివి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, తినాలనే కోరికను నివారిస్తాయనేది పరిశోధుకుల వాదన. ఇక GLP-1 అనేది మన శరీరంలో జీర్ణక్రియ, ఆకలి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మందులు ఆకలని నిర్వహించడంలో చాలా బాగా హెల్పవుతాయని అంటున్నారు నిపుణులుఏదీఏమైనా జీవనశైలే ముఖ్యమైనది..వైద్య ఆవిష్కరణల కంటే దీర్ఘకాలిక బరువు నియంత్రణలో ప్రధానమైనది జీవనశైలేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అయితే అందరూ లైఫ్‌స్టైల్ అనగానే భయపడిపోతున్నారని చెప్పారు. శరీరాన్ని మొత్త కష్టపెట్టకపోయినా..కనీసం కొద్దిపాటి కదలికలకు చోటు ఇస్తే మంచిదంటున్నారు. దీంతోపాటు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు..పాటించాలి. నమలి నమిలి నెమ్మదిగా తినడం..శరీరానికి వేడి కలిగించేపదార్థాలు తీసుకోవడం.. తదితరాల ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు నిపుణులు. చివగా మోదీ, బిల్‌గేట్స్ ఇరువురు ఊబకాయం అనేది కేవలం వైద్యపరమైన సమస్య కాదని, వాళ్ల వాళ్ల సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న లోతైన సమస్యగా అభివర్ణించారు. అయితే దీన్నుంచి బయటపడాలంటే మాత్రం రోజువారీ దినచర్య బ్రషింగ్‌లా జీవనశైలిలో మార్పులు కూడా భాగమైతేనే బరువు తగ్గడం సాధ్యమని నొక్కి చెప్పారు ఇరువురు. View this post on Instagram A post shared by Figuring Out with Raj Shamani (@figuringout.co) (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..) -
65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?
సాధారణంగా పెద్దవయసులోని వారు పడిపోయారనీ, బాత్రూమ్లో జారిపడ్డారనీ... లాంటి మాటలుతరచూ వినవస్తూ ఉంటాయి. దాదాపు 65 ఏళ్లు దాటిన చాలామంది ఇలా పడిపోతుంటారనే న్యూస్ వింటుండటం మామూలే. పెద్దవారు ఇలా పడిపోతుండటం వల్ల ఒక్కోసారి ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), తలకు గాయాలు (హెడ్ ఇంజరీస్) కావడం లాంటి అనర్థాలెన్నో జరుగుతుంటాయి. వీటిల్లో బాత్రూముల్లో జారిపోవడం మినహాయించి మిగతాచోట్ల పడిపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. పెద్దవాళ్లు అలా ఎందుకు పడిపోతుంటారో, అందుకు రకరకాల కారణాలేమిటో, వాళ్లు అలాపడిపోవడాన్నినివారించడమెలాగో చూద్దాం. ప్రస్తుతం మనదేశంలో 60 ఏళ్లు పైబడిన పెద్దవాళ్ల సంఖ్య 15 కోట్లు. అంటే మొత్తం జనాభా అయిన 140 కోట్లలో దాదాపు 10.5% మంది పెద్దవాళ్లే. వీళ్లలో దాదాపు 60 నుంచి 70 ఏళ్ల వాళ్లలో 25–30 శాతం మంది పడిపోతూ ఉండగా... 70 నుంచి 80 ఏళ్ల మధ్యవాళ్లలో పడిపోయే వారి శాతం 35%గా ఉంది. మామూలుగా పదిమందిలో ఆరుగురు ఇండ్లలోనే పడుతుంటారు. పడిపోవడం మెల్లగానే పడిపోయినట్లు కనిపించినా ఆ పడటం తాలూకు పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఉదాహరణకు అలా పడినప్పుడు మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘సబ్డ్యూరల్ హిమటోమా’ అంటారు. దీనికి శస్త్రచికిత్స అవసరం పడుతుంది. ఇక తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిపోయి మంచానికే పరిమితం కావడం చాలామంది ఎదుర్కొనే సమస్య. అప్పుడప్పుడూ పెద్దవారే కాదు... కొందరు మధ్యవయస్కులూ పడిపోవడం ఇటీవల సాధారణంగా జరుగుతోంది. ఇలా పడిపోడానికి కారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలివే... కొందరు పెద్ద వయసువారిలో వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ల పాదాల్లో స్పర్శ కొంతమేర తగ్గవచ్చు. దాంతో తాము పడి΄ోతున్నామనే సంగతి కూడా వాళ్లకు తెలియకుండానే వాళ్లు పడిపోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సాంద్రతతో పాటు మజిల్ మాస్ కూడా క్రమంగా తగ్గుతూ పోతుంది. దాంతో కండరాల్లోని శక్తి కూడా క్షీణించడంతో పడిపోవడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మోకాలు, చీలమండ, తుంటి ఎముకల కీళ్లలోనూ కొన్ని మార్పులు రావడం కారణంగా పడిపోవడాలు జరగవచ్చు. పెరుగుతున్న వయసుకు తగ్గట్లు చూపు మందగించడం, వినికిడి శక్తి కూడా క్షీణించడం వంటి అంశాలు కూడా ఒక్కోసారి అకస్మాత్తుగా పడిపోవడానికి కారణాలు కావచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో నిటారుగా నిలబడి ఉండే శక్తి తగ్గుతుంది. వయసు పెరిగిన పెద్దవాళ్లు పడిపోకుండా ఉండటానికి ప్రకృతి ఆ వృద్ధుల్ని కాస్త ముందుకు ఒంగిపోయేలా చేస్తుంది. పడి΄ోయేవాళ్లలో ఇలాంటివాళ్లే ఎక్కువ. కొన్నిసార్లు గుండె / మెదడు / శరీరంలోని ఇతర అవయవాలు లేదా వివిధ వ్యవస్థల్లోని ఆరోగ్య సమస్యలు నయం కావడం కోసం వాళ్లు వాడే మందుల కారణంగా కూడా వాళ్లు తూలిపడిపోయే ప్రమాదమూ ఉంటుంది. కొన్నిసార్లు నరాలకు సంబంధించిన కారణాలతోనూ పడిపోయే అవకాశాలుంటాయి. ఒక్కోసారి కారణాలేమీ లేకుండానే ముందుకో వెనక్కో పడిపోయే ప్రమాదం ఉంది. మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరగవచ్చు. అందుకే పెద్దవయసు వారు మాట్లాడుతూ నడవకూడదు. నడుస్తూ మాట్లాడకూడదు. వృద్ధాప్యంలో పడిపోవడానికి కారణమయ్యే మరికొన్ని ఆరోగ్య సమస్యలుపోష్చరల్ హై΄ోటెన్షన్ (లో బీపీ) : అకస్మాత్తుగా బీపీ తగ్గిపోయే కండిషన్ ఇది. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా శరీరంలోని ద్రవాలూ లేదా ఖనిజ లవణాల మోతాదులు తగ్గడం వల్ల ఇలా జరగవచ్చు. అలాగే కొందరిలో ఏదైనా మందు/ఔషధం తీసుకోగానే ఇలా జరగడానికి అవకాశముంది. ఒక్కోసారి పెద్దవాళ్లు తాము కూర్చున్న స్థితి నుంచి అకస్మాత్తుగా పైకి లేవడం లేదా ఉన్నట్టుండి పక్కపై నుంచి లేవడం జరిగినప్పుడు అకస్మాత్తుగా బీపీ పడిపోవచ్చు. ఇలాంటప్పుడు బీపీ 20 హెచ్‌జీ/ఎంఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు మెదడుకు చేరాల్సిన రక్తం మోతాదులు కాస్తా అకస్మాత్తుగా తగ్గడం వల్ల పడిపోవచ్చు. కొందరు నిలబడి మూత్రవిసర్జన చేసేవాళ్లలో ఆ సమయంలోనూ లేదా కొందరిలో అకస్మాత్తుగా దగ్గు రావడం వల్ల కూడా ఒక్కోసారి బీపీ హఠాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. సింకోప్ : కొందరు అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయినట్లుగా అయిపోతారు. కళ్లు తిరుగుతూ, చూపు తాత్కాలికంగా మసకబారుతుంది. ముఖంలో రక్తపు చుక్కలేనట్లుగా పాలిపోతారు. శరీరమంతా చల్లబడి, ఒళ్లంతా చెమటలు పట్టవచ్చు. దాంతో ఉన్నవారు ఉన్నట్టుగా అకస్మాత్తుగా పడిపోయి, ఎముకలు విరగడం, తలకు గాయం కావడం వంటి ప్రమాదం జరగవచ్చు. ఇలాంటి వాళ్లలో కొందరు ఒక్కోసారి తమ మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలా అకస్మాత్తుగా కళ్లు తిరుగుతూ పడిపోవడాన్ని ‘సింకోప్’ అంటారు. మానసికంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు, మనకు అంతగా ఇష్టం లేని దృష్యాలనూ / అంశాలనూ చూసినప్పుడు (ఎవరైనా గాయపడటం లేదా రక్తస్రావం అవుతుండటం, ఇంకెవరైనా తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటం వంటి తమకు ఆమోదం కాని అన్‌ప్లెజెంట్ విజువల్ స్టిములై కారణంగా) ఇలా జరగవచ్చు. వర్టిగో : ఒక్కోసారి కొందరిలో కళ్లు తిరిగినట్లుగా అయి΄ోయి ఒళ్లు స్వాధీనం తప్పి పడిపోవచ్చు. సాధారణంగా లోపలిచెవి లేదా బ్రెయిన్ స్టెమ్‌లో ఉన్న వ్యాధుల కారణంగా ఇలా జరగడానికి అవకాశాలెక్కువ. ఫిట్స్ : ఒక్కోసారి కొందరిలో ఫిట్స్ రావడం / స్పృహ కోల్పోవడం / శరీరమంతా కుదుపునకు (జెర్క్) లోనుకావడం వల్ల. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (టీఐఏ) : ఒక్కోసారి కొందరిలో తక్కువ తీవ్రతతో పక్షవాతం వచ్చి, మళ్లీ వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ అంటారు. అకస్మాత్తుగా పడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇలాంటి సందర్భాల్లో కొందరిలో సరిగా మాట రాకపోవడం, మాటలు ముద్దగా రావడం, కాళ్లూ, చేతులు తాత్కాలికంగా బలహీనంగా మారడం జరగవచ్చు. పార్కిన్సన్ డిసీజ్ : ఈ ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లలో వణుకు కారణంగా శరీరానికి సరైన బ్యాలెన్స్ లేకపోవడంతో పడిపోవడం జరుగుతుంది. వీళ్లలో శరీరం కదలికలు నెమ్మదించడం వల్ల కూడా వారు పడిపోయే ప్రమాదముంటుంది. వెన్నెముక / నరాలు / కండరాల వ్యాధుల వల్ల ఒక్కోసారి కాళ్లూ చేతులు బలహీనమైపోయినప్పుడు. దేహంలో సోడియమ్, పొటాషియమ్ వంటి లవణాలూ లేదా చక్కెర మోతాదులు తగ్గిపోయినప్పుడు. చాలా అరుదుగా మెదడులో కణుతులు, మతిమరపు, సైకోసిస్ వంటి అంశాలు కూడా పడిపోడానికి కారణాలు కావచ్చు. అకస్మాత్తుగా పడిపోవడాన్ని నివారించండి ఇలా...పడిపోవడానికి సరైన కారణాలను తెలుసుకొని... వాటిని సరిదిద్దుకోవాలి. అంటే... పడుకున్నవారు / కూర్చున్నవారు అకస్మాత్తుగా లేవడం వల్ల పడి΄ోవడం జరుగుతున్నా అలా ఉన్నపళంగా లేవడం సరికాదు. పడుకున్న వారు తాము పక్క నుంచి లేస్తున్నప్పుడు మొదట మెల్లగా ఒక పక్కకు ఒరుగుతూ... ఆ తర్వాత లేచి కూర్చుని... అప్పుడు మెల్లగా నిల్చోవాలి. కూర్చున్న వారు కూడా ఒకేసారి కుర్చీలోంచి లేవకుండా... మెల్లగా లేని నిలబడాలి. ఆరోగ్య కారణాల వల్ల ఇలా పడిపోయే మెడికల్ హిస్టరీ ఉన్నవారు అందుకు కారణాన్ని తెలుసుకోడానికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి అందుకు అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా. అకస్మాత్తుగా పడిపోవడానికి నరాలకు సంబంధించిన (న్యూరలాజికల్) కారణాలుంటే అవేమిటో తెలుసుకుని, తగిన చికిత్స తీసుకోవాలి. ఉపకరణాలు వాడటం : అకస్మాత్తుగా పడిపోయే వారు తమకు అవసరమయ్యే ఉపకరణాలు... అంటే చేతికర్ర (వాకింగ్ స్టిక్) / వాకర్ / కళ్లజోడు వంటివి దూరంగా పెట్టుకోకుండా, ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. కాస్తంత పెద్ద వయసు మహిళలు హైహీల్స్ తొడగడం సరికాదు. తమకు సురక్షితంగా ఉండే ఫ్లాట్ హీల్ పాదరక్షలు వాడాలి. కాలి కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేయడం చాలా రకాల పడి΄ోవడాలను (ఫాల్స్‌ను) నివారిస్తాయి.ఇతరత్రా మరికొన్ని మార్గాలివి... చాలా సార్లు పడిపోవడం అన్నది ఇండ్లలోనే జరుగుతుంటుంది. అందువల్ల ఇంటివాతావరణాన్ని పెద్దవారికి ఫ్రెండ్లీగా మార్చడం చాలా మేలు చేస్తుంది. పడకుండా నివారిస్తుంది. ఇందుకు చేయాల్సిన కొన్ని పనులు... నాన్‌స్టిక్ మ్యాట్స్ వాడటం. ఫ్రిక్షన్ బాగా ఉంటే ఫ్లోరింగ్ వేయించడం. కాలుజారనివ్వని కార్పెట్స్ పరవడం. గదిలో మంచి వెలుతురు / గాలి వచ్చేలా చేసుకోవడం. టాయిలెట్స్, బాత్రూమ్స్లో మంచి పట్టు ఉండటానికి వీలుగా హ్యాండ్ రెయిల్స్ అమర్చుకోవడం, బాత్రూమ్ బయట కాలుజారనివ్వని మ్యాట్స్ వాడటం మరీ అవసరమైతే తప్ప ఎక్కడా ఎక్కకుండా ఉండటం...వంటి జాగ్రత్తలతో పెద్దవారు పడిపోయే ప్రమాదాలను నివారించవచ్చు.పడిపోయే అవకాశాలు ఎవరిలో ఎక్కువ... చిన్న చిన్న అడుగులు వేస్తూ, రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు. నిల్చున్నప్పుడు రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు. నడిచే సమయంలో కళ్లు మూసుకునేలా ముఖం ఎక్కువగా రుద్దుకునేవారు.చికిత్స ఫాల్ క్లినిక్స్ : ఇటీవల చాలా ఆసుపత్రుల్లో ‘ఫాల్ క్లినిక్స్’ ప్రారంభిస్తున్నారు. వీటిలో పడి΄ోయిన వాళ్లకు ఇవ్వాల్సిన చికిత్స అందిస్తుంటారు. పడిపోయాక తలకు దెబ్బతగిలినప్పుడు తక్షణం న్యూరో సర్జన్ చేత చికిత్సలు అందించాల్సిన అవసరముంటుంది. ఫ్రాక్చర్స్ వంటివి అయితే ఆర్థో నిపుణులతో చికిత్స అందించాల్సి ఉంటుంది. -
నైట్‌షిఫ్టుల్లో పనిచేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!
ఇటీవల చాలామంది నైట్ డ్యూటీలు చేస్తున్నారు. గతంలో కేవలం కొద్దిమంది స్థానంలో ఇటీవల అమెరికా టైమ్‌కు తగ్గట్లుగా పనిచేయాల్సి రావడంతో రాత్రిళ్లు పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణంగా ప్రతిరోజూ పగలు పనిచేసి, రాత్రి నిద్రపోయే వారి ఆహారపు అలవాట్లతో పోలిస్తే... నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. లేక΄ోతే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలెక్కువ. నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులేమిటో చూద్దాం. నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారికి సాధారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఉదాహరణకు అవి... ఛాతీలో మంట, అజీర్ణం, మలబద్ధకం, ఆకలి తగ్గడం వంటి గాస్ట్రోఇంటస్టినల్ సమస్యతో పాటు రక్త΄ోటు, గుండెజబ్బులు, యాంగై్జటీ, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి వంటివి రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారిలో కాస్తంత ఎక్కువగా కనిపించవచ్చు.బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ..నైట్ షిఫ్టుల్లో పనిచేసేవాళ్లలో బరువు పెరిగి స్థూలకాయం (ఒబేసిటీ) వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇందుకు కారణాలు ఏమిటంటే... సాధారణంగా పగటి డ్యూటీలు చేసేవారు రాత్రంతా నిద్ర΄ోవడం వల్ల మళ్లీ ఉదయం వరకు భోజనం తీసుకోరు. కానీ రాత్రి డ్యూటీలు చేసేవారు రాత్రంతా మెలకువతో ఉండాల్సి రావడంతో మధ్య మధ్య ఆకలేస్తూ ఉంటుంది. దాంతో రాత్రివేళ్లలోనూ తినాల్సి వస్తుంటుంది. సాధారణంగా ఇలా రాత్రి వేళల్లో తినే ఆహారం కాస్తా మామూలు భోజనంలా కాకుండా కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఫాస్ట్ఫుడ్స్, జంక్ఫుడ్స్ వంటివే ఎక్కువ. అందుకే రాత్రివేళ పనిచేసేవారు తీసుకునే అసమతౌల్య ఆహారపు అలవాట్ల (అన్ బ్యాలెన్స్డ్ డయటరీ ΄ాటర్న్) కారణంగా ఒకపక్క కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండటం, మరో పక్క శారీరక శ్రమ లేక΄ోవడంతో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. దాంతో ఆ ఒబేసిటీ కారణంగా వచ్చే ఆరోగ్యపరమైన ముప్పులు (హెల్త్ రిస్క్‌లు) ఎక్కువే. అలాంటి ముప్పు రాకూడదంటే ఆహారపరంగా పాటించాల్సి సూచనలివి... రాత్రివేళల్లో ఉద్యోగాలు / పనులు చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారికి వచ్చేందుకు అవకాశమున్న చాలా రకాల ఆరోగ్య సమస్యలనూ, ఇతరత్రా ముప్పుల ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అందుకు అనువైన ఆహారపు అలవాట్లు ఇవి... æ నైట్‌షిఫ్టుల్లో పనిచేయడానికి వెళ్లేవారు... డ్యూటీకి వెళ్లే ముందర భోజనం చేసి వెళ్తుంటారు. వాళ్లు పెద్ద పెద్ద పరిమాణాల్లో తక్కువ సార్లు కాకుండా... చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటూ ఉండాలి. చిన్న పరిమాణంలో తీసుకునే ఆహారాలు జీర్ణం కావడం తేలిక. దాంతో చాలారకాల గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలు తేలిగ్గా నివారితమవుతాయి. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా ఉండాలి. పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆఫీసుల్లోని వెండింగ్ మెషిన్, కాఫెటేరియా వద్ద లభ్యమయ్యే ఆహారపదార్థాలకు సాధ్యమైనంతగా దూరంగా ఉండటమే మేలు. ఇంటిదగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారాన్నే (హోమ్ మేడ్ ఫుడ్‌ను) తీసుకోవడమే మంచిది. ఒకవేళ కాఫెటేరియా ఫుడ్‌నే తీసుకోవాల్సి వస్తే... పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే... తాజా పండ్లు, సలాడ్స్, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (అంటే ఉదాహరణకు...పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్ శాండ్విచ్లు) వంటివి తీసుకోవడం మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లు (ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్) వంటి ఆహారాలను వీలైనంతవరకు తీసుకోక΄ోవడమే మేలు. రాత్రివేళల్లో తీపి పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్స్ (అంటే... క్యాండీలు, చాక్లెట్లు, వైట్ బ్రెడ్స్, బన్, పాస్తా, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్) వంటి వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. రాత్రివేళ పనిచేస్తుండేవారు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. పగటితో పోలిస్తే రాత్రి కాసంత చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్లు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతో డిహైడ్రేషన్ ముప్పు ఉంటుంది. కాబట్టి నైట్ షిఫ్ట్‌లో తరచూ నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. నైట్ షిప్టుల్లో పనిచేసేవారు కాఫీ, టీ లు చాలా ఎక్కువగా తాగుతుంటారు. నిద్రరాకుండా ఉండటానికీ అలాగే బ్రేక్ సమయాల్లో ఇలా టీ, కాఫీలు తాగడం చాలా సాధారణం. అయితే వాటికి వీలైనంతగా తగ్గించాలి. టీ, కాఫీలు తాగాలనిపించినప్పుడల్లా నీళ్లు తాగుతుండటం మేలు. రాత్రివేళల్లో పనిచేసేవారు చాలావరకు వ్యాయామాలకు దూరంగా ఉంటారు. రాత్రంతా డ్యూటీ చేయడంతో పొద్దున్నే ఇంటికెళ్లగానే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇక రాత్రి డ్యూటీకి వచ్చే తొందరలో వ్యాయామాలను వదిలేస్తుండటం కద్దు. అయితే ఇలాంటివాళ్లంతా తమ వర్క్షెడ్యూల్కు అనుగుణంగా రోజులోని ఏదో ఒక సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజూ 45 – 60 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. రాత్రి షిఫ్టుల్లో పని సమయంలో వారిని ఉత్సాహంగా ఉంచడానికి ఈ వ్యాయామం తోడ్పడుతుంది. పైగా వ్యాయామపు ఉత్సాహం వల్ల రాత్రి పని చేసేటప్పుడు తూగురావడం వంటివి జరగవు. ఈ వ్యాయామాల వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే రాత్రి డ్యూటీల కారణంగా బరువు పెరగడమూ జరగదు. ఇదే వ్యాయామం రాత్రిపనివేళల్లో పనిచేయడం వల్ల కలిగే ఒత్తిడిని (స్ట్రెస్‌ను) నివారిస్తుంది. దాంతో అధిక రక్తపోటు (హైబీపీ), డిస్లిపిడేమియా (రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు అసాధారణంగా పెరగడం) వంటి ముప్పులూ నివారితమవుతాయి. (చదవండి: కోర్టులు ఆమెను గౌరవించాయి..! ఐనా ఆ ఒక్క ఉద్యోగమే కాదు..) -
World Health Day: వీళ్ల ఆరోగ్యమే.. దేశానికి మహాభాగ్యం!
రాజకీయ నాయకుల ప్రధాన విధి.. ప్రజలకు సేవ చేయడం. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించాలంటే.. వాళ్లూ ఆరోగ్యంగా ఉండాల్సిందే. అప్పుడే పరిపూర్ణంగా.. విరామం ఎరగకుండా తమ కర్తవ్యాలను నిర్వర్తించగలుగుతారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(World Health Day) సందర్భంగా.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ముఖ్య కారణాలు.. ఇంతకీ వీళ్ల ఆరోగ్యం దేశానికి ఎలా మహాభాగ్యమో ఓసారి పరిశీలిద్దాం..బిజీ షెడ్యూల్: నాయకులు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి శ్రమిస్తుంటారు. అలాగని.. ఆరోగ్యంగా ఉంటేనే వారు దీర్ఘకాలం సేవ చేయగలుగుతారు.నిరంతర ప్రయాణాలు: స్థల మార్పులు, వేళకి తగినపుడు ఆహారం పొందకపోవడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సరైన జీవనశైలి పాటించడం(టైం టు టైం తినడం లాంటివి..) ద్వారా దీన్ని నివారించగలుగుతారు.ఇమ్యూనిటీ బూస్ట్: రాజకీయ నేతలు ఎడతెరిపిలేని పర్యటనల్లో పాల్గొంటారని చెప్పుకున్నాం కదా. ఈ క్రమంలో రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి మంచి ఆహారం.. ఆరోగ్యపు అలవాట్లు పాటిస్తే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.మానసిక ఒత్తిడి: ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవడం అంటే.. తీవ్ర ఒత్తిడికి గురైనట్లే. ధ్యానం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ప్రధాన ఆరోగ్య సమస్యలుగుండె సంబంధిత వ్యాధులు: అధిక ఒత్తిడి కారణంగా గుండెపోటు సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి.మధుమేహం : భోజన అలవాట్ల వల్ల మధుమేహం రిస్క్ పెరుగుతుంది.హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు): చురుకైన రాజకీయ జీవితం వల్ల అధిక రక్తపోటుకి గురవుతారు.నిద్రలేమి: నిత్యం మీటింగులు, ప్రణాళికలు కారణంగా తగిన నిద్ర పొందలేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు..ఆహార నియంత్రణ : అధిక పిండి పదార్థాలు, కొవ్వు తగ్గించి.. శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవడం.నియమిత వ్యాయామం : రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం.ఆరోగ్య పరీక్షలు: ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం.నిద్ర-విశ్రాంతి: రోజుకు 7-8 గంటల నిద్ర పోవడం.. వీలు చిక్కినప్పుడు విశ్రాంతి తీసుకోవడం. మరీ వీలైతే కుటుంబ సభ్యులతో సమయం గడపడం.ఒత్తిడి నిర్వహణ : ధ్యానం, యోగా, స్మార్ట్ డిజిటల్ డిటాక్స్(స్మార్ట్ ఫోన్లకు కొంతకాలం దూరంగా ఉండడం) వల్ల ఒత్తిడి తగ్గుతాయి.నేతలు తమ ఆరోగ్యం కాపాడుకోవడం.. వాళ్ల సామాజిక బాధ్యత. ఆరోగ్యమున్న నాయకులే సమర్థవంతంగా దేశానికి సేవ చేయగలరు. అదే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. అది ప్రభుత్వ విధానాల మీద ప్రతికూల ప్రభావం చూపించగలదు. ఆరోగ్యం మంచిగా ఉంటేనే ప్రజలకు శ్రద్ధగా సేవ చేయగలరు. ఆరోగ్యమే నిజమైన సంపద.. ఈ సందేశాన్ని ఈ World Health Day 2025 సందర్భంగా ప్రతీ నాయకుడు గుర్తించాలి!. -
World Health Day 2025 : కొన్నిముఖ్యమైన విషయాలు, గణాంకాలు
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో గర్భస్థ శిశువులు, ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ఈ మరణాల రేటు మాత్రం ఇంకా ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) అందరికీ సమానమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను నిర్ధారించాల్సిన అత్యవసర అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ ఫుల్ ఫ్యూచర్స్ (“Healthy Beginnings, Hopeful Futures”) అనేది ఈ ఏడాది థీమ్‌గా నిర్ణయించింది. ఈ విషయంలో తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యం కీలక పాత్రను ఇది హైలైట్ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ఆరోగ్యకరమైన శిశువు బాల్యం ఆరోగ్యంగా ఉంటే ఆ చిన్నారి భవిష్యత్తు కూడా డా ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన గర్భధారణ, బాల్యం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయి, పోషకాహార లోపం, రక్తహీనత, తక్కువ జనన బరువు, సరైన ప్రసూతి ఆరోగ్య సంరక్షణ పద్ధతులు లింగ అసమానతలు వంటి సవాళ్లను అధిగమించడం చాలా కీలకం.ప్రసూతి పోషకాహార ప్రాముఖ్యత, రక్తహీనత, బరువు తక్కుతో సంభవించే శిశు జననాలను తగ్గింసే ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.ఈ సందర్భంగా కొన్ని గణాంకాలుప్రసూతి మరణాలు: గర్భధారణ లేదా ప్రసవ సమస్యల కారణంగా సంవత్సరానికి సుమారు 3లక్షల మంది మహిళలు మరణిస్తున్నారు.నవజాత శిశు మరణాలు: ప్రతి సంవత్సరం 2 మిలియన్లకు పైగా శిశువులు వారి మొదటి నెలలోనే మరణిస్తున్నారు.ప్రసవాలు: సంవత్సరానికి సుమారు 2 మిలియన్ల ప్రసవాలు జరుగుతున్నాయి.మరణాలు : దురదృష్టవశాత్తు, ప్రతి 7 సెకనకు పుట్టకముందే లేదా పుట్టిన తరువాత ఒక శిశు మరణం సంభవిస్తుంది.ప్రపంచ ఆరోగ్య లక్ష్యాలు: 2030 నాటికి ప్రసూతి మనుగడ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది కానీ ఈ బాటలో 5 దేశాలలో 4 దేశాలు లేకపోవడం గమనార్హం.మానసిక ఆరోగ్యం: మానసిక ఆరోగ్య పరిస్థితులు మాతా మరియు నవజాత శిశువుల ఆరోగ్యానికి గణనీయమైన ఆందోళన కలిగిస్తాయి.నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్: ఈ వ్యాధులు మాతాశిశు ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.కుటుంబ నియంత్రణ: ప్రసూతి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కుటుంబ నియంత్రణ సేవల అందుబాటులోకి రావడం చాలా కీలకం.ఆరోగ్య సంరక్షణ ప్రాప్యత: మరణాల రేటును తగ్గించడానికి జననానికి ముందు, ప్రసవ సమయంలోనూ , ఆ తరువాత అధిక-నాణ్యమైన సంరక్షణ అవసరం.గ్లోబల్ క్యాంపెయిన్స్: తల్లీ బిడ్డలశిశువులకు ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి ప్రపంచ దేశాల ప్రయత్నాల ప్రాముఖ్యతను డబ్ల్యూహెచ్ఓ నొక్కి చెప్పింది -
వాంటెడ్స్ వేలల్లో! కింగ్ మేకర్స్ ఐదుగురు నైజీరియన్లే
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 2020-24 మధ్య నమోదైన మాదకద్రవ్యాల కేసుల్లో 8,822 మంది ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరిలో ఐదుగురు నైజీరియన్లు అత్యంత కీలకమని, దేశవ్యాప్తంగా డ్రగ్స్ సిండికేట్‌ను వాళ్లే నడిపిస్తున్నారని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) అధికారులు గుర్తించారు. 2023లో పోలీసులు రూ.94.39 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయగా, అది ఇది గత ఏడాది నాటికి రూ.148.09 కోట్లకు చేరింది. ఈ కేసుల్లో సూత్రధారులు కంటే పాత్రధారులు మాత్రమే చిక్కుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన డ్రగ్స్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీజీఏఎన్‌బీ అధికారులు వాంటెడ్‌గా ఉన్న వారి కోసం గాలిస్తోంది. అప్పట్లో నేరుగా వచ్చిమాదకద్రవ్యాల క్రయవిక్రయాలన్నీ సోషల్ మీడియా, డార్క్ వెబ్ కేంద్రంగా సాగుతున్న విషయం తెలిసిందే. వీటిలోనే పెడ్లర్లు, సప్లయర్లు, కన్జ్యూమర్ల మధ్య బేరసారాలు పూర్తవుతున్నాయి. ఒకప్పుడు ఆన్లైన్లో డబ్బు డిపాజిట్ చేయించుకునే పెడ్లర్లు సిటీకి వచ్చి డ్రగ్స్ అందించి వెళ్లే వాళ్లు. అయితే టీజీఏఎన్‌బీ, హెచ్–న్యూ వంటి ప్రత్యేక విభాగాలు ఏర్పడిన తర్వాత డ్రగ్స్ దందాపై నిఘా పెరిగింది. వరుస పెట్టి డెకాయ్ ఆపరేషన్లు చేసిన అధికారులు, సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ పెడ్లర్స్‌ను పట్టుకున్నారు. దీంతో తెలంగాణకు వచ్చి డ్రగ్స్ సరఫరా చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. కొరియర్స్, డెడ్ డ్రాప్ విధానాల్లో... సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్న పెడ్లర్లు ఆన్లైన్లోనే నగదు చెల్లింపులు అంగీకరిస్తున్నారు. ఆపై కొరియర్ పార్శిల్ చేయడం లేదా సప్లయర్‌ను పిలిపించుకొని మాదకద్రవ్యాలను అందిస్తున్నారు. ఈ సప్లయర్లు సైతం నేరుగా కన్జ్యూమర్ని కలవట్లేదు. దీనికోసం డెడ్ డ్రాప్ విధానం అవలంభిస్తున్నారు. మాదకద్రవ్యాన్ని ఓ ప్రాంతంలో ఉంచి ఆ ప్రాంతం ఫొటో, లోకేషన్లను వారికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక కేసుల్లో కన్జ్యూమర్లు, కొన్ని కేసుల్లో సర్లయర్లు చిక్కుతున్నారు. పెడ్లర్స్ మాత్రం దొరక్కపోవడంతో ఆయా కేసుల్లో వాంటెడ్స్ పెరుగుతున్నారు. గత ఏడాది భారీగా పెరిగిన కేసులు... మాదకద్రవ్యాల కేసులు, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2023 కంటే 2024లో గణనీయంగా పెరిగింది. 2023లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసుల సంఖ్య 1487గా, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2170గా ఉంది. గత ఏడాది ఇవి 3074, 5205కు పెరిగాయి. 2020–24 మధ్య ఐదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 7131 కేసులు నమోదు కాగా, వీటిలో 23,547 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 14,725 మంది మాత్రమే అరెస్టు కాగా, ఇప్పటికీ 8822 మంది పరారీలోనే ఉన్నారు. ఈ వాంటెడ్స్ కోసం టీజీఏఎన్‌బీ, హెచ్–న్యూ, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీలతోపాటు స్థానిక పోలీసులూ గాలిస్తున్నారు. ఆ ఐదుగురూ అత్యంత కీలకం రాష్ట్రంలోనే కాదు... దేశ వ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో విస్తరించి ఉన్న డ్రగ్ నెట్‌వర్క్‌లో నైజీరియన్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రధాన పెడ్లర్స్, సర్లయర్స్లో వీళ్లే ఎక్కువగా ఉంటున్నారు. తెలంగాణకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ఐదుగురు నైజీరియన్లు కీలకమని టీజీఏఎన్‌బీ గుర్తించింది. వీరిలో డివైన్ ఎబుక సుజీపై ఎనిమిది, పీటర్ న్వాబున్వన్నా ఒకాఫర్, నికోలస్ ఒలుసోలా రోటిమీ, మార్క్ ఒవలబిలపై నాలుగు చొప్పున, అమోబి చుక్వుడి మూనాగోలుపై ఒక కేసు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆధారాలు లభించడంతో నిందితులుగా చేర్చామని అధికారులు చెప్తున్నారు. 2023–24ల్లో డ్రగ్స్ దందాలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో సూడాన్, కెన్యా, నైజీరియా, సోమాలియా, టాంజానియా, లైబీరియాలకు చెందిన 11 మందిని పోలీసులు నగరంలో గుర్తించి ఆయా దేశాలకు తిప్పిపంపారు. -
WorldHealthDay ఇది రెండో రౌండ్, అయినా యుద్ధమే!
నటి, దర్శకురాలు తహిరా కశ్యప్ (Tahira Kashyap) ఆరోగ్యం మరోసారి ఇబ్బందుల్లో పడింది. గతంలో బ్రెస్ట్ కేన్సర్‌ను ఓడించిన ఈ యోధురాల్ని మహమ్మారి ఇంకా వదల్లేదు. మళ్లీ తాను బ్రెస్ట్ కేన్సర్ (Breast Cancer) బారిన పడినట్టు నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా భార్య తహిరా కశ్యప్ వెల్లడించింది. రొమ్ము కేన్సర్ మళ్లీ వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. దీనిపై ఆమె భర్త ఆయుష్మాన్ ఖురానాతో సహా పలువురు స్పందించారు. ఈ సారి కూడా ఈ వ్యాధి నుంచి బైటపడతావంటూ ధైర్యం చెప్పారు.తనకు మళ్లీ కేన్సర్ సోకిందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్యం దిన రోజున తన అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్ కి తహిరా క్యాప్షన్ ఇచ్చింది:"ఏడేళ్ల బాధలు, రెగ్యులర్ చెకప్‌లు.. మామోగ్రామ్లు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికీ అదే చెప్తూ ఉంటా... అయినా నాకు రౌండ్ 2...సోకింది అని తెలిపింది. అయినా తాను మరొక యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని, ఈ వ్యాధితో పోరాడటానికి తాను నిశ్చయించుకున్నానని తెలిపింది. నాకు మళ్లీ కేన్సర్ వచ్చింది అని ప్రకటించడానికి మొహమాటం ఏమీ లేదు. ప్రపంచ ఆరోగ్య దినం రోజున ఇలా చెప్పడం బాధాకరమే. కానీ మన ఆరోగ్య సంరక్షణ గురించి మనం చేయ గలిగినంత చేద్దాం’ అంటూ పేర్కొంది. జీవితం నిమ్మకాయలు ఇచ్చినప్పుడు, నిమ్మరసమే తయారు చేసుకోవాలి. జీవితం గాడిన పడుతున్న సమయంలో మళ్లీ తిరగబెట్టినపుడు, దాన్ని కాలా ఖట్టా డ్రింక్‌లో దాన్ని పిండుకొని తాగడమే. ఎందుకంటే అది మంచి పానీయం. రెండోసారి కూడా నీకు కూడా మేలు జరుగుతుంది అంటూ రాసు కొచ్చింది"నా హీరో" అంటూ భార్య పోస్ట్‌పై ఆయుష్మాన్ ఖుర్రానా స్పందించగా, తాహిరా మరిది అపరశక్తి ఖురానా, "బిగ్ టైట్ హగ్ బాబీ! అని, మోర్ పవర్టూయూ అని మరొకరు, "నువ్వు దీన్ని కూడా గెలుస్తావు! మీ కోసం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తా.. నీకు మరింత శక్తి" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం దానిని ఎదుర్కోవడానికి ఉత్తమమైన మార్గాల్లోఒకటి అని తహిరా విశ్వాసం. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా తన పోరాటాలు ,చికిత్స ప్రయాణం గురించి సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం మాట్లాడుతూ ఉంటుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజు కీమో థెరపీ దుష్ప్రభావంతో జుట్టు ఊడిపోయి గుండుగా మారిన పోటోతో మరో స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను పంచుకుంది.‘టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్ ’ సహా అనేక బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత్రి తహిరా కశ్యప్ .2018లో తహిరాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం కోలుకుంది. కీమోథెరపీ సమయంలో తన అనుభవాలను, బాధలతోపాటు, ఈ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచు కుంది. ‘‘శర్మ జీ కి బేటి" తో బాలీవుడ్ దర్శకురాలిగా అరంగేట్రం చేసినటిగా తన ప్రతిభను చాటుకుంటోంది. ప్రకటించింది. ఇంతలోనే బ్రెస్ట్‌కేన్సర్ ఆమె సాహసానికి సవాల్ విసిరింది. యుద్ధంలో గెలవడానికి తాను సిద్ధంగా ఉన్నాననిగతంలో ప్రకటించిన మరీ కేన్సర్‌నుంచి బయటపడిన తహిరా ఇపుడు కూడా అదే నిబ్బరాన్ని ప్రకటించింది. దీంతో ఆమె స్నేహితులు, కుటుంబం స్నేహితులు అందరూ ఆమెకు అండగా నిలిచారు. అదే ధైర్యంతో ఈ వ్యాధినుంచి బైట పడి, విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) -
వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం లేకపోతే కోట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్టే.. ప్రస్తుత జీవన శైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాట పడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అందరూ ఆరోగ్యంగా జీవించేలా చేయటమే దీని ముఖ్యఉద్దేశం. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరకు పరిగెట్టడం కంటే ముందు జాగ్రత్త చర్యలతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్సీడీ–3.0 ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు గత ఏడాది నవంబరులో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0) కార్యక్రమం పేరుతో స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌తోపాటు, పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 8,75,977 మందికి స్క్రీనింగ్ పరీక్షలు గుంటూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన జనాభా 17,50,399 మంది ఉన్నారు. వీరిలో 8,75,977 మందికి వైద్యసిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో మధుమేహం అనుమానితులు 23,103 మంది ఉండగా, 4,438 మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే షుగర్‌తో 1,17,609 మంది చికిత్స పొందుతున్నారు. బీపీ అనుమానిత బాధితులు 23,294 మంది ఉండగా, 4,635 మందికి బీపీ ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే బీపీతో 1,33,419 మంది చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ అనుమానిత కేసులు 94 ఉండగా, క్యాన్సర్ ఉన్నట్టు ఆరుగురికి నిర్ధారౖణెంది. క్యాన్సర్ రోగులను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. గుండె ప్రధానం శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. లబ్‌డబ్‌మంటూ ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు లెక్క. గుండెకోసం తప్పని సరిగా రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. నూనె అధికంగా ఉండే పదార్థాలు , చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి. –డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు.బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవాలి... శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి, ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. –డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు.ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామక్రిష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు(చదవండి: రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్! బిల్‌గేట్స్ బెస్ట్ పేరెంటింగ్ పాఠం) -
హవ్వ! ఎండలోంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే విటమిన్ డీ గాయబ్?!
తెలిసీ తెలియని జ్ఞానంతో యూట్యూబర్లు, వెల్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లమంటూ ఇంటర్నెట్లో ఇచ్చే ఆరోగ్య సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే లేనిపోని అనుమానాలు, అపోహలు ఆందోళన తప్పదు. ఇంటర్నెట్లో వచ్చి సూత్రాలను, లేదా వారి ప్లాన్లను దినచర్యలో చేర్చుకోవాలని నిర్ణయించుకునే ముందు ఖచ్చితంగా నిపుణులచే ధృవీకరించు కోవాలి. అశాస్త్రీయమైన భావాలతో అలాంటి వారిచ్చే సలహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకు ఈ స్టోరీని చదవండి. పేరు తెలియని ప్రసవానంతర వెల్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ ఒకటి చర్చకు దారి తీసింది. రోజు సమయం, సూర్యేడి దిశ, మీరు స్నానం చేసే సమయాన్ని బట్టి శరీరం విటమిన్ డి గ్రహించే స్థాయిలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ‘‘ఎండలోంచి వచ్చిన వెంటనే సూర్యరశ్మికి గురైన వెంటనే స్నానం చేయవద్దు, ఒక గంట వేచి ఉండండి (మీ చర్మానికి దానిని గ్రహించడానికి సమయం కావాలి!) సలహా ఇచ్చేసింది. వెంటనే స్నానం చేస్తే మన శరీరం గ్రహించిన విటమిన్ డీ కరిగిపోతుందని ఈ పోస్ట్ ఉద్దేశం.ఇంకా ఏం చెప్పిందంటే..మహిళలకు గర్భధారణ విషయంలో గర్భధారణ సమయంలో విటమిన్ డీ, బిడ్డ ఎముక, మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.తక్కువ విటమిన్ డి గర్భధారణ మధుమేహం, ప్రీక్లాంప్సియా & అకాల జనన ప్రమాదాన్ని పెంచుతుంది. శక్తి, రోగనిరోధక పనితీరును మెరుగు పరుస్తుంది. మానసిక శక్తినిస్తుంది. ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్ లాంటి వాటి నుంచి రక్షణిస్తుంది. సన్‌కు ఎక్స్పోజ్ కాకపోవడం వల్లే మహిళల్లో విటమిన్ డీ లోపం వస్తోందని, ఈ విటమిన్ లభించే పదార్థాల గురించి కూడా సమాచారం ఇచ్చింది. ఇదంతాబాగానే ఉంది. కానీ ఎండలోంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే విటమిన్ డీ పోతుంది. వెంటనే స్నానం చేయవద్దు, ఒక గంట వేచి ఉండండి (మీ చర్మానికి దానిని గ్రహించడానికి సమయం కావాలి!) అంటూ చెప్పిన ఈ పోస్ట్ వాదనను నిపుణులు తోసిపుచ్చారు.ఈ వాదనలో నిజం ఎంత? తీవ్రమైన ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్ల నీటితో స్నానం చేయడం మంచిది కాదని కూడా చెబుతారు. కానీ విటమిన్ డీ నష్టం గురించి ఎక్కడా ప్రస్తావనలేదు. ముంబైలోని గ్లెనీగల్స్ హాస్పిటల్ పరేల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మంజూషా అగర్వాల్ ఈ వాదనను తోసిపుచ్చారు. వెంటనే స్నానం చేసినా లేదా గంట తర్వాత స్నానం చేసినా, విటమిన్ డీ ఎక్కడికీ పోదని స్పష్టం చేశారు. ఇది అంతర్గతంగా జరిగే చర్య కాబట్టి ఆందోళన అవసరం లేదని భరొసా ఇచ్చారు. “UVB కిరణాలు చర్మ కణాలలోని కొలెస్ట్రాల్‌తో సంకర్షణ చెందినప్పుడు విటమిన్ D చర్మంలో సంశ్లేషణ చెందుతుంది. ఈ ప్రక్రియ ఉపరితలంపై కాకుండా అంతర్గతంగా జరుగుతుంది. చర్మాన్ని కడగడం వల్ల, మురికి పోయినట్టు విటమిన్ తుడిచిపెట్టుకుపోదని అధ్యయనాలు నిర్ధారించాయని తెలిపారు. దీనికి బదులుగా సురక్షితమైన సూర్యరశ్మి ని స్వీకరించడం, చర్మాన్ని, దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం పై దృష్టి పెట్టడం మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. < View this post on Instagram A post shared by H.E.A.L.20 | Postpartum Wellness (@h.e.a.l.20)విటమిన్ డీ ప్రాధాన్యతమన శరీరానికి కావాల్సిన విటమిన్ డీ పొందాలంటే సూర్యరశ్మి కీలకం. సూర్యకాంతి మన శరీరం తగలడం ద్వారా బాడీలో విటమిన్ డి తయారవుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేంగా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. డీ విటమిన్ పుష్కలంగా ఉంటేనే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పలు జీవక్రియలు సక్రమంగా జరగాలంటే విటమిన్ డీ ప్రాధాన్యత చాలా ఉంది. రోజులో ఉదయం లేదా సాయంత్రం సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావానికి మన శరీరం గురైనపుడు,ముఖ్యంగా ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య సూర్య కాంతి తగిలేలా ఎండలో ఉంటే విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డిని శరీరం అలా తయారు చేసుకుని పలు అవసరాలకు ఉపయోగించుకుంటుంది. విపరీతమైన ఎండతీవ్రతకు గురైతే అతినీలలోహిత కిరణాలతో ఎక్కువ హాని కలుగుతుంది. అందుకే ఉదయం 8 గంటల లోపు వాకింగ్ చేసినా, సూర్య నమస్కారాలు చేసినా, ఎండలో నిలబడినా మంచిదని వైద్య నిపుణులు చెబుతారు. సూర్యోదయం కంటే ముందు స్నానం చేయడం ఉత్తమమైన విధానమని కూడా పెద్దలు చెబుతారు.నోట్: సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ పోస్ట్ లేదా ట్రెండ్‌ను గుడ్డిగా నమ్మేయొద్దు. ఇపుడు ఎక్కడ ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం విరివిగా వ్యాప్తి చెందుతోంది. ఏ సమాచారాన్నైనా ఒకటిరెండు సార్లు చెక్ చేసుకోవడం అవసరం. విశ్వనీయత కోసం నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
177- 95 కిలోలకు!.. బరువు తగ్గడమే శాపమైంది.. చివరికి పాపం ఆమె..!
బరువు తగ్గాలనేది చాలామంది ధ్యేయం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అందర్నీ వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు(ఊబకాయం). అందువల్లే సన్నగా.. స్లిమ్‌గా ఉండాలనే ధోరణి ఎక్కువైంది. కానీ వర్కౌట్లు, డైట్లతో కష్టపడటం కంటే సులువుగా, త్వరితగతిన తగ్గిపోవడమే నచ్చుతోంది చాలామందికి. అందుకే వారంతా సర్జరీల బాట పడతున్నారు. అయితే ఆధుని వైద్య విధానం ఎంతలా అభివృద్ది చెంది..నిమిషాల్లో శరీరం స్లిమ్‌గా అయిపోయే కొంగొత్త వైద్య విధానాలు వచ్చినప్పటికీ.. అవన్నీ ప్రమాదకరమే అని నిపుణుల పదే పదే హెచ్చరిస్తూన్నారు. కానీ నాజుగ్గా అయిపోవాలన్న ఇంటెన్షన్‌తో వాటన్నింటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నది అనవసరం అన్నట్లుగా..బరువు తగ్గే సర్జరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు చాలామంది. పాపం అలానే చేసి ఓ మహిళ భారీ మూల్యమే చెల్లించుకుంది. తిరిగి మాములు మనిషి కావడానికి ఎంత నరకయాతన అనుభవించిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఏం జరిగిందంటే..యూకేకికి చెందిన 42 ఏళ్ల డేనియల్ పీబుల్స్ అనే మహిళ బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో 2023లో గ్యాస్ట్రిక్ స్లీవ్ అనే శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకుంది. అయితే ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థలు అందుకోసం ఏడేళ్లు నిరీక్షించాలని చెప్పాయి. బాబోయే అన్నేళ్లు వెయిట్ చేయడం ఏంటని.. టర్కీ వెళ్లి మరీ బరువు తగ్గించుకునే గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేయించుకుంది. నిజానికి ఆమె 177 కిలోల ఊబకాయం సమస్యతో బాధపడుతుంది. ఆమె తన బిడ్డకు పుట్టబోయే చిన్నారితో హాయిగా గడపాలంటే ఇంత భారీ కాయం పనికిరాదని భావించి ఈ శస్త్రచికిత్సకు రెడీ అయ్యింది. అనుకున్నట్లుగా ఈ సర్జరీతో ఆమె ఏకంగా 95 కిలోల బరువు గణనీయంగా తగ్గిపోయింది. డేనియల్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది. సదరు టర్కీ ఆస్పత్రి యజమాన్యాన్ని కూడా ప్రశంసలతో ముచ్చెత్తింది. అంతా బాగానే ఉందనుకునేలోపే..రోజులు గడుస్తున్న కొద్దీ డేనియల్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడం ప్రారంభమైంది. అది చివరకి బెడ్‌మీద నుంచి కాలు దించడానికే భయపడేంత పరిస్థితికి చేరుకుంది. అలా ఒకరోజు మెడ నుంచి కింద శరీరం అంతా చచ్చుబడిపోయి పక్షవాతం బారినపడింది. ఇక ఆమె తిరిగి నడవడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పేశారు. బరువు తగ్గానన్నా.. ఆనందం ఆవిరైపోయి..బతుకే భారంగా మారిందనే.. బాధతో విలవిలలాడింది. అసలు తనకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో అని వైద్యులను ప్రశ్నించగా..ఈ బరువు తగ్గే సర్జరీ కారణంగా నరాల పనితీరుకి సంబంధించిన విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. నరాల పనితీరు మెరుగవ్వడం అనేది అంత ఈజీ కాదు..అందువల్ల మళ్లీ తాను యథావిధిగా నడవడం అనేది సాధ్యమా..? అనేది చెప్పడం కష్టమని అన్నారు వైద్యులు. దాంతో ముందు తాను ఈ స్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలే తప్పా..కుంగిపోకూడదని ఫిక్స్ అయ్యింది. ముందుగా నిపుణులైన వైద్యుల సమక్షంలో ఇంటెన్సివ్ చికిత్స తీసుకుంది. చివరకు ఆమె నరాల పనితీరు మెరుగై తిరిగి నడవగలిగేలా కింద ఉన్న ప్రతి అవయవంలో స్పర్శను తిరిగి పొందింది. చూస్తుండగానే..కొద్దిరోజుల్లోనే పూర్తిగా ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడింది. బరువు తగ్గాలనుకుంటే..అందుకు ఇంత మనోబాధను చెల్లించుకుంటానని కలలో కూడా ఊహించలేదని వాపోయింది డేనియల్.ఈ సర్జరీలు ఇంత ప్రమాదకరమా?గ్యాస్ట్రిక్ స్లీవ్ శస్త్రచికిత్స: దీనిని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కూడా అంటారు. ఇది బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్స (బారియాట్రిక్ సర్జరీ). ఈ శస్త్రచికిత్సలో కడుపును చిన్న అరటిపండు ఆకారంలోకి కుదించి.. ఆహారం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తారు. ఫలితంగా ఆయా వ్యక్తులు బరువు తగ్గడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో అప్పుడు పోషకాహార లోపం ఎదురవుతుంది. ఇది కాస్తా.. శరీరానికి తగినంతగా విటమిన్లు తీసుకోకపోవడానికి దారితీస్తుంది. ఫలితంగా నరాల పనితీరుకు అవసరమై బీ విటమిన్ లోపం ఏర్పడి పలు ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు.అక్కడైతే ఖర్చు తక్కువ.. విదేశాల్లో తక్కువ ధరలో ఊబకాయం శస్త్రచికిత్స చేయించుకోవచ్చని..చాలామంది అక్కడకు వెళ్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్ లాంటి దేశాల్లో ఇంకా చౌక. అంతేగాదు అక్కడ బ్రిటన్ వాసులు కూడా ఈ సర్జరీ చేయించుకుని పలు అనారోగ్య సమస్యల బారిన పడటం లేదా మరణించడం జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది ఈ శస్త్ర చికిత్స కోసమే సుమారు 5 వేల మందికి పైగా వ్యక్తులు విదేశాలకు వెళ్తున్నారని గణాంకాలు చెబుతున్నాయ్. తస్మాత్ జాగ్రత్త..!. ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు తగ్గి..ఆరోగ్యంగా ఉందాం..!.(చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?) -
కేన్సర్‌తో పోరాడటంలో బీట్రూట్ హెల్ప్ అవుతుందా..?
బీట్రూట్కు ఎరుపు రంగును ఇచ్చే బిటాలెయిన్స్ అనే పోషకం చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే విటమిన్–సీ కూడా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో ఇది కూడా కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అంతేకాదు... కొలాజెన్ ఉత్పాదన కూడా ఎక్కువగా జరుగుతుండటంతో చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండటానికి ఆ కొలాజెన్ సహాయపడుతుంది. బీట్రూట్ జ్యూస్ తీసుకునేవారికి అలసిపోకుండా చాలాసేపు పనిచేయగల స్టామినా పెరుగుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే... వ్యాయామం చేస్తూ బీట్రూట్ను క్రమం తప్పకుండా తీసుకునేవారు అనేక రకాల కేన్సర్ల నుంచి రక్షణ పొందుతారు. అలాగే బీట్రూట్ బీటాలైన్ పిగ్మెంట్ల కారణంగా కణితి కణాలను తగ్గించగలదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్ కేన్సర్ కణాలను తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్ రసంలోని నైట్రేట్లు గుండెపనితీరుని మెరుగ్గా ఉంచుతుంది(చదవండి: జుట్టుని మింగేసే మందులివే..) -
వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!
పాలకొల్లు సెంట్రల్: వేసవిలో చిన్నారులకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి ప్రారంభమైందంటే చాలు చికెన్ పాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు పాలకొల్లు మండలం లంకలకోడేరు పీహెచ్సీ వైద్యుడు అడ్డాల ప్రతాప్ కుమార్.చికెన్ పాక్స్ అన్ని వయసుల వారికి సోకినా.. ముఖ్యంగా చిన్నారులకు వేగంగా సోకే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి సోకిన వారు ఆహారం సరిగా తీసుకోలేకపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో నీరసంగా కనిపిస్తుంటారు. ఆటలమ్మ, గవద బిళ్లల లక్షణాలు కనిపించిన వెంటనే సంబందిత వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీ బయోటిక్ మందులు వాడాల్సి ఉంటుంది.గవద బిళ్లలుచల్లటి పానీయాలు అతిగా తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి గవద బిళ్లలు వస్తాయి. ప్రధానంగా లాలాజల గ్రంధులు ఉబ్బడంతో గవద బిళ్లలు ఏర్పడతాయి. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. ఏ ఆహారం తిన్నా నోటిలో నీళ్లు వేసుకుని పుక్కిలించాలి. ఎంఎంఆర్ టీకా వేయించుకోవడం వల్ల గవద బిళ్లలు రాకుండా నివారించవచ్చు. గవద బిళ్లలకు మందులు వాడితే మూడు రోజుల్లో తగ్గుతుంది. వాపు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ఏడు రోజులు పడుతుంది.చికెన్ పాక్స్ఆటలమ్మ వైరస్ వల్ల వస్తుంది. జ్వరం.. శరీరంలో వేడి ఎక్కువై పొక్కులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో స్కిన్ ఎలర్జీని కూడా ఆటలమ్మ అనుకుంటారు. ఆటలమ్మ అరి చేతులు, పాదాలు, నెత్తి మీద రాదు. అలా వచ్చాయంటే అవి స్కిన్ ఎలర్జీగా గుర్తించాలి. ఆటలమ్మ సోకిన వాళ్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ప్రతి రోజూ శుభ్రంగా స్నానం చేయాలి. టీకా అందుబాటులో ఉంది. వేయించుకోవడం మంచిది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి దురద ఎక్కువగా ఉంటుంది. ఒక చోట గోకి మరో చోటు గోకితే అక్కడ పొక్కులు వస్తాయి. అందువల్ల గోర్లు పెరగకుండా చూసుకోవాలి.తీసుకోవాల్సిన జాగ్రత్తలుఆటలమ్మ సోకిన వారిని ఇంట్లో మిగిలిన సభ్యులకు దూరంగా ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే అందించాలి. గవద బిళ్లలు వచ్చిన వారికి గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్ధాలు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. మూఢ నమ్మకాలు, అపోహలకు పోకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ఈ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు సోకకుండా ఉండాలంటే వేడి నీళ్లు తాగడంతో పాటు.. శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -
శ్వాస మరింత మెరుగ్గా! సింపుల్ అండ్ హెల్దీ యోగ!
శరీరం, మనస్సును సమన్వయం చేయడంలో శ్వాస కీలక పాత్ర పోషిస్తుంది. యోగా ద్వారా శ్వాసలోని లోపాలు, ఒత్తిడి, నిరాశ లను అదుపు చేయవచ్చు. మానసిక స్థిర త్వాన్ని మెరుగ పరచుకోవచ్చు.శ్వాస వ్యాయామాలు...ఉజ్జయి శ్వాసను సముద్ర శ్వాస పద్ధతితో పోల్చుతారు. ముక్కు ద్వారా దీర్ఘంగా గాలి పీల్చి, ముక్కు ద్వారా వదలడం. దీనిని సాధారణంగా అష్టాంగ, విన్యాస తరగతులలో ఉపయోగిస్తారు. మూడుభాగాల శ్వాసగా పిలిచే ఈ పద్ధతిలో బొడ్డు, ఛాతీ, దిగువ వీపును గాలితో నింపి, ఆపై రివర్స్ క్రమంలో ఉచ్ఛ్వాసం చేయడం జరుగుతుంది. ఇది విశ్రాంతిని, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మెరుగైన దృష్టిని ప్రోత్సహిస్తుంది.నాలుకను గొట్టం మాదిరి ముడిచి, వంకరగా ఉంచుతూ నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం, ఆపై ముక్కు ద్వారా ఊపిరి పీల్చడాన్ని సితాలి శ్వాస అంటారు. భ్రమరి శ్వాస ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. చూపుడు వేలును ముక్కుపైన ఉంచాలి. ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు తేనెటీగ లాగా హమ్ చేయాలి.చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో కపాలభాతి శ్వాసను ‘బ్రెయిన్ మెరిసే శ్వాస’ అని కూడా పిలుస్తారు. ఇది చిన్న, శక్తివంతమైన ఉచ్ఛ్వాసాలపై దృష్టి పెడుతుంది. దీర్ఘంగా శ్వాస పీల్చుకుని, ఆపై ముక్కు ద్వారా 15–30 సార్లు గాలిని వదలాలి. చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంనాడి శోధన శ్వాసను ‘ప్రత్యామ్నాయ నాసికా ప్రాణాయామం’ అని కూడా అంటారు. ఒక ముక్కు రంధ్రాన్ని మూసి, మరొకదాని ద్వారా శ్వాస తీసుకొని, వదలాలి. ఈ వివిధ యోగా శ్వాస పద్ధతులను సాధన చేయడం వల్ల శారీరక, మానసిక శ్రేయస్సు బాగా పెరుగుతుంది. -
గమనించండి.. వర్కవుట్స్ వీరికి వర్కవుట్ కాదు!
వర్కౌట్స్ చేయడం ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు వర్కవుట్స్ చేయకపోవడమే మంచిది. వారెవరో తెలుసుకుందాం. ఎముకలు, కండరాల సమస్యలు...లిగమెంట్స్ సమస్యలు, బెణుకులు, కీళ్ల గాయలు, ఎముకల పగుళ్ల వంటి సమస్యలు ఉన్నవారు వర్కౌట్ చేయడం వల్ల మరింత నష్టమవుతుంది కాబట్టి, ఈ సమస్యలున్నవారు పూర్తిగా కోలుకున్న తర్వాతే వర్కవుట్స్ చేయాలి. అదే విధంగా వళ్లునొప్పులు ఎక్కువగా ఉన్నా వర్కవుట్స్ చేయకూడదు.సర్జరీలు...కొన్నిసార్లు సర్జరీలు జరుగుతాయి. వీటి తర్వాత శరీరం కోలుకోవడానికి కొద్దిగా సమయ పడుతుంది. సర్జరీలు అయిన వెంటనే వర్కౌట్స్ చేస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ కావొచ్చు. ఇతర సమస్యలు కూడా వస్తాయి. అదేవిధంగా స్త్రీలు సిజేరియన్ వంటి ఆపరేషన్ తర్వాత కోలుకునే వరకూ వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలతోనే సరిపెట్టుకోవాలి. గుండె సమస్యలు...అరిథ్మియా, గుండె సమస్యలు, హై బ్లడ్ ప్రెజర్, హార్ట్ ఫెయిల్యూర్, గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వర్కౌట్స్ చేయొద్దు. కష్టమైన వర్కౌట్స్ అసలే వద్దు. ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉండే వర్కౌట్స్ గుండెపై ప్రెజర్‌ని పెంచుతాయి. దీని వల్ల ఛాతీ నొప్పి, హార్ట్ బీట్‌లో తేడా వచ్చి ఏకంగా గుండె ఆగిపోయే ప్రమాదమే ఉంది కాబట్టి, వర్కౌట్స్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.ఇన్ఫెక్షన్, ఫీవర్‌తో బాధపడేటప్పుడు...మీరు ఏదైనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు, ముఖ్యంగా జ్వరంతో ఉన్నప్పుడు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. అలాంటి సమయంలో వర్కౌట్స్ చేయడం వల్ల డీహైడ్రేట్ అవుతారు. హార్ట్ బీట్ పెరుగుతుంది. కండరాల బలహీనత, అలసట పెరుగుతుంది. అంతేకాకుండా గాయాలు అవుతాయి. అందుకే, జ్వరం తగ్గేవరకూ వర్కౌట్స్ జోలికి పోకపోడమే మంచిది. చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో -
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ ఆమె. తరుచుగా చుట్టూ జరుగుతున్న లోపాల గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ..సలహాలు సూచనలు ఇస్తుంటారు. చిన్నారులు దగ్గర నుంచి నేటి యువత వరకు ఎలాంటి జీవన విధానంతో లైఫ్‌ని లీడ్ చేస్తే బెటర్ అనే దాని గురించి అమూల్యమైన సలహలిస్తుంటారు కూడా. అలానే తాజాగా ఆహారపు అలవాట్లు ఎలా ఉంటే ఆరోగ్యానికి మంచిదో చెప్పారు. దాంతోపాటు తన తన ఆరోగ్యకరమైన డైట్ సీక్రెట్‌ని కూడా పంచుకున్నారు. మనం మనుషులం కాబట్టి ఒక్కోసారి చీట్ మీల్ తినేస్తుంటాం. అందుకు తాను కూడా మినహా కాదని నవ్వతూ చెప్పారామె. మరీ ఆ విషయాలేంటో చూద్దామా..!.పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌తో జరిగిన సంభాషణలో రాజ్యసభ ఎంపీ, విద్యావేత్త సుధామూర్తి భారతదేశం ఆహారం, భారతీయుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడారు. సుధామూర్తి ఆ భేటీలో ఇంట్లో వండిన ఆహారం తినడం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు. మనసుకు సంతృప్తిని, హాయిని ఇచ్చే ఆహారం తినడం గురించి నమ్ముతానన్నారు. అయితే అధిక కేలరీల ఆహారాన్ని మాత్రం తప్పకుండా నివారించాలన్నారు. అందుకోసం తానేం చేస్తారో కూడా వివరించారు. నోరూరించే అధిక కేలరీలు ఆహారాలు తన భోజనం టేబుల్‌పై లేకుండా ఉండేలా చూసుకుంటారట. చాలావరకు ఆ విషయంలో స్వీయ నియంత్రణ చాలా కష్టంగా ఉంటుంది. తాను కూడా ఒక్కోసారి చీట్ మీల్ చేస్తుంటానని అన్నారు. తనకు పెడ, బర్ఫీ లేదా మైస్ వంటి స్వీట్లంటే ఎంతో ఇష్టమని చూడగానే మనసు పారేసుకుంటానని నవ్వుతూ చెప్పారు. అయితే తీసుకునే ముందు ఇదొక్కటే లేదంటే తన ఆరోగ్యానికి ఇబ్బంది అని సర్ది చెప్పుకుంటూ ఆపేస్తా అన్నారు. డైట్ ఎలా ఉంటుందంటే..రోటీలలో ఒకటైన భక్రిని తాను ఇష్టంగా తింటానన్నారు. ఇక్కడ భక్రి అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తినే ప్రసిద్ధ ఫ్లాట్‌బ్రెడ్.ఎర్రటి గోధమ జోవర్ వంటి చిరుధాన్యాలను తీసుకుంటారెమె. చివరగా తీపి తినాలనే కోరికను నివారించడానికి పండ్లు ఎక్కువగా తీసుకుంటానన్నారు. అన్నీంట్ల కంటే కంఫర్ట్ ఫుడ్ - పోహా అంటారెమె. తన ప్రతి భోజనంలో తప్పనిసరిగా అది ఉండాల్సిందేనట.(చదవండి: అలనాటి గోల్డెన్ డేస్: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..) -
సగం మంది పురుషుల్లో సంతానలేమి సమస్యలు
సర్వే వివరాల ప్రకారం.సర్వే చేసిన కుటుంబాలు: 6,36,699పాల్గొన మహిళలు: 7,24,115వయసు: 15 ఏళ్ల నుంచి 49 ఏళ్లుపురుషులు: 1,01,839వయసు: 15 ఏళ్ల నుంచి 54 ఏళ్లుసాక్షి, సిటీబ్యూరో: మెట్రోపాలిటిన్ నగరాల్లో పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందనే నివేదికలు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఒక్కటైన నూతన జంట తల్లిదండ్రులు కావాలని ఎన్నో కలలు కంటారు. దానికి అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తీరా చూసే్త పిల్లల కోసం చేసిన ప్రయత్నాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు సంతానం ఆలస్యమవుతోందనగానే స్త్రీల సమస్యగానే పరిగణిస్తున్నారు. దేశంలో సుమారు 40 శాతం నుంచి 50 శాతం మంది మగవారిని ఇన్ఫెర్టిలిటీ సమస్య వేధిస్తోంది. మునుపటితో పోల్చితే 20 ఏళ్ల నుచి 40 ఏళ్ల వయసుగల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాతంల్లో సమస్య అధికంగా ఉందనే విషయం ఆందోళన కలిగిస్తోంది.ప్రభావం చూపే అంశాలు..నగర యువతలో మారుతున్న జీవన శైలి, మానసిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, వాతావరణ కాలుష్యం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, రేడియేషన్, భారీ స్థాయిలో లోహాలు, టాక్సిన్స్, బిస్ఫెనాల్-ఎ (బీపీఏ), థాలేట్స్, రసాయినాలు, ప్లాస్టిక్, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ వస్తువులు, తదితరాలు హార్మోన్ల స్థాయిలను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే పునరుత్పత్తిలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సైంటిఫిక్ చికిత్సలతో లోపాలను సులభంగా గుర్తించవచ్చు. హార్మోన్లను సమతుల్యం చేయడం, పురుషుల్లో పునరుత్పత్తి సామర్థా్యన్ని పెంచడానికి ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి అత్యాధునిక పద్దతులు అందుబాటులోకి వచ్చాయి.చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంనగరాల్లో అధిక సమస్యలు..దేశంలో ప్రధానమైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటిన్ నగరాల్లో పురుషుల్లో ఈ రకమైన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానోత్పత్తిలో స్త్రీ, పురుషులిద్దరూ సమాన పాత్ర ఉంటుంది. స్త్రీలతో పోల్చితే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పరీక్షించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే గనర యువతలోనే ఈ సమస్య అధికంగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ కాన్ఫరెన్స్ పరిశోధనలో 1970 తర్వాత జన్మించిన పురుషులలో మునుపటి తరాలతో పోలిస్తే, ముఖ్యంగా 25-40 సంవత్సరాల వయస్సులో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉందని తేలింది.మానసికంగా కుంగిపోతున్నారు.పెళ్లైన తరువాత ఏడాది, ఎండేళ్లయినా పిల్లలు కలగకపోయే సరికి పురుషులు మానసికంగా కుండిపోతున్నారు. ఒంటరితనం, విచారంగా ఉండటం, ఎవరికి చెప్పుకోవాలో తెలీక, ఎదుటి వ్యక్తుల మాటలకు లోలోన బాధపడుతున్నారు. ఈ భావోద్వేగ సమస్యలని పరిష్కరించడానికి సహచరులతో చర్చించుకోవడం, నిపుణల సూచనలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.గాంధీ ఆసుపత్రికి నెలకు సుమారు 500 మంది ఫెర్టిలిటీ సమస్యలతో వస్తున్నారు. ఒత్తిడి, లైఫ్ స్టైల్, స్మోకింగ్, రక్తప్రసరణ తగ్గడం వంటివి ఫెర్టిలిటీ సమస్యలకు దారితీస్తాయి. మిల్లీలీటరు స్పెర్మ్‌లో 15 నుంచి 16 లక్షల కౌంట్ ఉండాలి. కొంత మందిలో కనీసం లక్ష కూడా ఉండటంలేదు. ఇక్సీ వంటి చాలా అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అవగాహనతో తొలుత పరీక్షలు నిర్వహించుకుంటే సమస్యలను అధిగమించొచ్చు. -వి.జానకి, గాంధీ ఆసుపత్రి ఇన్ఫెర్టిలిటీ విభాగం ఇన్చార్జి.వివాహం అయి ఏడాది దాటినా పిల్లలు పుట్టడంలేదంటే భర్య, భర్తలిద్దరూ సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించడం మంచిది. కారణాలు త్వరితగతిన గుర్తిస్తే, మెరుగైన చికిత్సా విధానాలను అందించే అవకాశం ఉంటుంది. మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలపై ఎన్ఎఫ్హెచ్ఎస్ వంటి నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ధూమపానం, మధ్యంకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం, వయస్సు, జీవన శైలి, పర్యావరణం, వంటి అంశాలు మగవారిలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. - డా.కె.రఘువీర్, ఆండ్రాలజిస్టు, ఒయాసిస్ ఫెర్టిలిటీ -
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
పొద్దున్న లేచింది మొదలు రాత్రినిద్రపోయేంతవరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు జనం. బస్సుల్లో, బస్‌స్టాప్‌లో, రైళ్లలో, పార్క్‌ల్లో, ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు. పెద్దలు చెప్పినట్టు లేవగానే దేవుడి ముఖం చూస్తారో లేదో తెలియదు గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడని వారుమాత్రం ఉండరంటే అతిశయోక్తికాదు. అలా మారిపోయింది నేటి డిజిటల్ యుగం. కొంచెం టైం దొరికితే చాలు.. ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ (Reels), యూట్యూబ్ షార్ట్ వీడియోలు... అక్కడితో అయిపోదు.. టైం వేస్ట్ అవుతోందని తెలిసినా..మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది గంటల తరబడి. ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవారికి ఒక హెచ్చరిక. ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా? స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనర్థాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పడుకునే సమయంలో షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూడటానికి గడిపే స్క్రీన్ సమయానికి , యువకులు మధ్య వయస్కులలో అధిక రక్తపోటుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఒక అధ్యయనం గుర్తించింది. తాజాగా ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ ' సెలెండ్ ఎపిడమిక్ ఆఫ్ డిజిటల్ ఐ' అంటూ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరించారు. "రీల్స్ తక్కువగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది" అని డాక్టర్ లాల్ హెచ్చరించారు.మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో మనుషులు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడమేననీ, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్బుక్ ,యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌ను అతిగా చూడటం వల్ల అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా పిల్లలు , యువకుల్లో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల పెద్దల్లో కూడాతరచుగా తలనొప్పి, మైగ్రేన్లు , నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది నయంకాని అంధత్వానికి అత్యంత సాధారణ కారణమైన మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను,కంటి చూపు క్షీణించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు ,పని చేసే నిపుణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం వల్ల సామాజికంగా ఒంటరితనం, మానసిక అలసట,మతిమరపు లాంటి సామాజిక , మానసిక నష్టాన్ని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఏం చేయాలి. 20.20.20 రూల్నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే ఐ బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు కంటివైద్య నిపుణులు.చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు! -
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
ఉరుకుల పరుగుల జీనవ విధానంలో అందరూ తమ కెరీర్ లక్ష్యాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే జీవిత పరమావధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తలకు మించిన పనిభారానికి తోడు పోటీ వాతావరణానికి తగ్గట్లు దూసుకుపోవాలన్న ఒత్తడి కలగలసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నాయి. కొందరూ నిద్రను కూడా త్యాగం చేస్తూ ఎక్కువ గంటల కంప్యూటర్ స్క్రీన్లపైనే పనిచేస్తుంటారు. పాపం ఇలానే చేసి ఓ సీఈవో ఎంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వుతారు. అంతేగాదు ఆరోగ్యం విషయంలో నాలాగా అంతా అయిపోయాక ఇప్పుడే తెల్లారిందన్నట్లుగా మేల్కోవద్దు అంటూ హితువు పలుకుతున్నారు.బెంగళూరుకి చెందిన డేజీఇన్ఫో మీడియా అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ మిశ్రా లింక్డ్ఇన్లో తాను ఎదుర్కొన్న విషాదకర ఆరోగ్య పరిస్థితిని గురించి షేర్ చేసుకున్నారు. అతను తన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒక విధమైన ఆయాసంతో కూడిన వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైంది. ముందస్తుగా ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుంగా జరిగిన ఈ హఠాత్పరిణామం కారణంగా మిశ్రా ఆస్పత్రిపాలయ్యారు. వైద్యులు అతడిని ఐసీయూకి తరలించి సత్వరమే చికిత్స అందించారు. అప్పుడే ఆయన రక్తపోటు అనుహ్యంగా 230కి పెరిగిపోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వైద్యులు సైతం అమిత్ మిశ్రా పరిస్థితిని చూసి షాకయ్యారు. ఇంతలా రక్తపోటు ఎందుకు పెరిగిపోయిందని తెలియక వైద్యులు కూడా కాస్త గందరగోళానికి గురయ్యారని పోస్ట్‌లో తెలిపారు మిశ్రా. "అయితే దీనంతటికీ కారణం.. పనికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా.. విషయాన్ని విస్మరించడమే. పనే ముఖ్యం అనుకుంటాం. కానీ అది చేయాలంటే ముందు మన ఆరోగ్యం అంతే ముఖ్యం అని అనుకోం. ఆఖరికి శరీరం ఇచ్చే సంకేతాలను కూడా పట్టించుకోం. బాగానే ఉన్నామనే ధీమాతో ఉండిపోతాం. ప్లీజ్ మిత్రమా..ఈ పోస్ట్‌ని గనుక చదువుతుంటే మనం శరీరం చెప్పేది వినండి..దాని బాధను గుర్తించండి." అని పోస్ట్‌లో రాసుకొచ్చారు మిశ్రా. నెటిజన్లు ఆ పోస్ట్‌కి స్పందిస్తూ..వృత్తిపరమైన జీవితం కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ తమ అనుభవాలనే షేర్ చేయడమే గాక మిశ్రా త్వరితగతిన కోలుకోవాలని పోస్టులు పెట్టారు.(చదవండి: 40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?) -
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
అమెరికాలో మీజిల్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య సంబంధంపై విస్తృత చర్చ జరుగుతోంది. సీడీసీ(CDC), WHO చేసిన విస్తృతమైన అధ్యయనాలతో సహా పరిశోధనలు వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించాయి. ఆటిజం ప్రధానంగా జన్యు, పర్యావరణ కారణాలుగా వస్తోందని భావిస్తున్నారు. టీకాలు నిజంగా ఆటిజానికి కారణం కానపుడు, సైన్స్ ప్రకారం దానికి కారణమేమిటి? World Autism Awareness Day డే సందర్బంగా అటిజానికి నివారణ, చికిత్స తదితర వివరాలు తెలుసుకుందాం. టీకాల కారణంగా ఆటిజం వస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. టీకాలకూ, ఆటిజంకు సంబంధం లేదు. పిల్లలందరికీ ఏ వయసులో ఇప్పించాల్సిన టీకాలు యథావిధిగా ఆవయసులో ఇప్పించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రవర్తనకు అనుగుణంగా మందులు ఇవ్వడమే...ఆటిజంకు ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్లు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వీళ్లలో ఫిట్స్ (మూర్ఛ) వంటి అనుబంధ సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు వాటికి సంబంధించి మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. - డా. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ బుద్ధిమాంద్యం అనే అపోహ ఉందిఆటిజం అంటే అది ఒక రకమైన బుద్ధిమాంద్యత అని కొందరు అపోహ పడుతుంటారు. చాలా కేసుల్లో మిగతా అందరు పిల్లల్లా అందరితోనూ కమ్యూనికేట్ చేయలేకపోవడమే వీరిలో ఉండే లోపం. నిజానికి చాలామంది నార్మల్ చిన్నారుల కంటే చాలా ఎక్కువ ఐక్యూను ప్రదర్శించేవారూ ఈ పిల్లల్లో ఉంటారు. మెదడు వికాసం లేకపోవడం అన్నది.. సమçస్య తీవ్రత ఎక్కువగా ఉన్న దాదాపు మూడోవంతు పిల్లల్లో మాత్రమే ఉంటుంది. వీరి విషయంలో ఏ అంశంలో వికాసం కొద్దిగా ఆలస్యం జరుగుతోందో ఆ అంశంలో శిక్షణ ఇస్తే వాళ్లు నార్మల్ పిల్లల్లానే పెరగగలుగుతారు. -డా.ప్రభ్‌జ్యోత్ కౌర్ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ఎంత త్వరగా సమస్య గుర్తిస్తే అంత మంచిదిఆటిజం ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పలేం. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలను పరిశోధకులు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. అయితే ఆటిజం పిల్లలను గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమస్య పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఉంది. పట్టణాల్లో తమ పిల్లలకు ఆటిజం సమస్య ఉందని తెలిస్తే పరువు పోతుందేమో అనుకునేవారూ ఉన్నారు. పిల్లలు చూడటానికి బాగానే ఉన్నారు కదా, మనస్తత్వంలో మార్పు అందే వస్తుందిలే అని సరిపెట్టుకునేవారూ ఉన్నారు. కానీ, ఆటిజం సమస్య ఉన్న పిల్లలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. వారికి అర్ధమయ్యే విధంగా ఒక్కో అంశాన్ని పరిచయం చేయాలి. అందుకు చాలా ఓర్పు, శిక్షణ ఇచ్చే టీచర్లు అవసరం. ప్లే స్కూల్స్, ప్రైమరీ స్కూళ్ల నుంచే అవగాహన తరగతులు నిర్వహించాలి. టీచర్లు, తల్లిదండ్రులూ ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తించి, శిక్షణ ఇస్తే అంత మంచిది. -పి. హారికారెడ్డిబిహేవియర్అనలిస్ట్, యాధా ఏబీఏ సెంటర్,అత్తాపూర్,హైదరాబాద్ఓపికగా నేర్పాలిఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. దీని బాధిత పిల్లల్లో కమ్యూనికేషన్ సమస్య ఉంటుంది. సమస్య ఉన్న పిల్లల్లో స్టీరియోటైపిక్ బిహేవియర్ (ఒకే పనిని పదేపదే చేయడం) ఉంటుంది. ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం, వేరుగా చూడడం చేయకూడదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ప్రవర్తించాలో ఓపికగా నేర్పాలి. -డాక్టర్ వై.ప్రదీప్చిన్న పిల్లల వైద్యులు, డైక్ సెంటర్ తిరుపతి3 స్థాయిల్లో ఆటిజమ్పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత ఆధారంగా దీనిని ప్రధానంగా మూడు స్థాయిలుగా విభజించారు. మైల్డ్ ఆటిజం: పిల్లల వికాసంతక్కువగా (30% వరకు) ప్రభావితం అవుతుంది. మాడరేట్ ఆటిజం : వీరిలో వికాసం 30% నుంచి 60% లోపు ప్రభావితమవుతుంది. సివియర్ ఆటిజం: వికాసం చాలాఎక్కువగా ప్రభావితమవుతుంది.అంటే 60 శాతానికి పైగా.నేర్చుకోవడానికి సంబంధించి కొన్ని సమస్యలు» ఈ చిన్నారుల్లో నేర్చుకోవడానికి సంబంధించిరకరకాల సమస్యలు కనిపించవచ్చు. వాటిల్లో కొన్ని.. » జ్ఞానేంద్రియాల నుంచి లభ్యమయ్యే సమాచారాన్ని సరిగావిశ్లేషిoచుకోలేకపోవడం (సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ – ఎస్పీడీ). » నేర్చుకునే ప్రక్రియ సరిగా జరగకపోవడం (లెర్నింగ్ డిజార్డర్–ఎల్డీ). » కొంతమంది చిన్నారుల్లో ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలు(బిహేవియరల్ డిజార్డర్స్) ఉంటాయి. అంటే నలుగురితో కలవలేరు. అకారణంగా ఏడుస్తూ ఉంటారు. » కొందరిలో ఆటిజంతో పాటు మూర్ఛ వంటి నాడీ సంబంధిత రుగ్మతలుండవచ్చు. ఎందుకుఇలాంటి సమస్యలు?ఆటిజంకు కారణాలుతెలుసుకోడానికి ఇప్పటికీపెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ నిర్దిష్టమైన కారణాలేమీ ఇంకా తెలియరాలేదు. అయితే కొన్ని అధ్యయనాల్లో ఆటిజంకు గురికావడానికి కారణాలను కొంతవరకు తెలుసుకున్నారు. అవి... » కొంతమేరకు జన్యుపరమైన కారణాల వల్ల దీని బారిన పడుతున్నారు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, మెదడులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు సంబంధిత అంశాల్లో లోపాల వల్ల.. » బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి జెస్టేషనల్ డయాబెటిస్‌కు, హార్మోన్ల అసమతుల్యతకు లోను కావడం, గర్భధారణకు ముందు ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్లకు గురికావడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనుకావడం వల్ల..» గర్భంతో ఉన్నప్పుడు వాడిన, వాడకూడని కొన్ని మందుల వల్ల.. ఆ అధ్యయనాల్లోదేశంలో ఆటిజంతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం.. తొమ్మిదేళ్ల వయస్సులోపు చిన్నారుల్లో 1 నుంచి 1.5 శాతం పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని ఐఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఎంతమంది ఉంటారనే దానిపై గణాంకాలు అందుబాటులో లేవు. అయితే తెలంగాణలో 0–9 ఏళ్ల వయస్సు చిన్నారులు 60 లక్షల వరకు ఉంటారని అర్ధ గణాంక శాఖ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇందులో ఒక శాతాన్ని లెక్కిస్తే 60 వేల మంది, 1.5 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 90 వేల మంది వరకు చిన్నారులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సాధారణంగా ఈ సమస్య మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆటిజంలోని రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.ఏం చేయాలి మరి.. ?దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలి. పిల్లల్లో సమస్యను గుర్తించిన వెంటనే చికిత్సకు తీసుకెళ్లాలి. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత త్వరగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. 2 ఏళ్ల వయస్సు లోపు గనుక గమనిస్తే సులభంగా బయటపడే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆటిజం లక్షణాలు కనబరచే పిల్లలకు.. కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలూ సమాధానాల ఫార్మాట్లో నిర్వహించే పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారించవచ్చు. ఈ జబ్బు ఉన్నవారిలో ఫిట్స్ వంటి న్యూరలాజికల్ సమస్యలు ఉన్నప్పుడే ఎమ్మారై, ఈఈజీ, మెటబాలిక్ డిజార్డర్ స్క్రీనింగ్ వంటివి అవసరం.ఎలాంటి మందులూ లేవు.. ఈ రుగ్మతకు ఎలాంటి మందులూ లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫిట్స్ లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. రకరకాల థెరపీలతోనే చికిత్సచిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్...ఆటిజంకు థెరపీ పేరిట నగరాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లు, చైల్డ్ రిహాబిలేటేషన్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటి నిర్వాహకులు అర్హత కలిగిన థెరపిస్ట్‌లు కాకపోయినా..కేవలం ఆయాలను నియమించుకుని ఇలాంటి సెంటర్లు నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ఎన్జీవో సంస్థలు నిబద్ధతతో పనిచేస్తుంటే.. కొందరు పూర్తిస్థాయి వ్యాపారంలా నిర్వహిస్తున్నారు. ఒక్కో పిల్లాడిపై నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించకపోవడం, నిర్వహణ, నియంత్రణ లేకపోవడం వల్ల స్పీచ్ థెరపీ కేంద్రాలు ఇష్టానుసారం వెలుస్తున్నాయి. ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే ఆసుపత్రి భవనం, అందులో అర్హతగల డాక్టర్లు, నర్సులు, ఆయాలు, పడకలు తదితర సౌకర్యాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. కానీ ఈ పునరావాస కేంద్రాలకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు..» ఆటిజం ఒక వైకల్యంగా గుర్తింపు.. » పునరావాస కేంద్రాలు నడిపించే ఎన్జీవోలకు ఆర్థిక సాయం » వైకల్యంతో బాధపడేవారికి సంబంధించిన హక్కుల చట్టాన్ని వీరికి కూడా వర్తింపచేయడం ద్వారా విద్యలో, పునరావాసంలో సహాయం » ఆటిజం బాధితులకు ఉన్నత విద్య అభ్యాసానికి ఆర్థికసాయం » వీరికి యూనిక్ డిజెబిలిటీ (విశిష్ట వైకల్యం) గుర్తింపు కార్డు ఇవ్వడం » రూ 2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం » ఆటిజం తగ్గింపునకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆర్థిక సాయం.» పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్వయం ఉపాధికి రుణాలు మంజూరు, నైపుణ్య శిక్షణ. » ప్రాంతాల వారీగా సంగీత, నృత్య కచేరీలు ఏర్పాటు » రాష్ట్రంలో ఇప్పటివరకు ఆటిజంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు లాంటి చర్యలు చేపట్టక పోవడం గమనార్హం. -
బొర్రకు.. బుర్రకు లింకు! మరి ‘సెట్’ అయ్యేదెట్లా?
మీ కడుపు చల్లగుండ.. ఎవరికైనా ఏదైనా సాయం చేసినప్పుడు ఇలా దీవించడం చూసే ఉంటారు. మీరు బాగుండాలనే ఆకాంక్ష అది. కానీ కడుపు చల్లగా ఉండటం ఏమిటి అనిపిస్తుంటుందా? నిజమే.. మన కడుపు చల్లగా, అంటే ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. కానీ పొట్ట (bellyfat) మన ఆలోచనలపైనా, మెదడు పనితీరుపైనా ఎఫెక్ట్ చూపుతుందని తాజాగా గుర్తించారు. ఆ లింకేమిటో, దాని ఎఫెక్ట్ ఏమిటో తెలుసు కుందామా... – సాక్షి, సెంట్రల్ డెస్క్అదో ‘మైక్రోబియం’ ప్రపంచం..మన పొట్ట లోపల అంతా మనమే కాదు... ఓ సూక్ష్మజీవ ప్రపంచమే ఉంటుంది. మన జీర్ణాశయం, పేగుల్లో వేల కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ‘మైక్రోబియం’ లేదా ‘మైక్రోబయాటా’ అని పిలుస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన శరీర కణాల సంఖ్య కంటే... ఈ సూక్ష్మజీవుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన తినే ఆహారం జీర్ణంకావడంలో, జీవక్రియల్లో, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి ఈ మైక్రోబియం కీలకపాత్ర పోషిస్తుంది. కానీ అంతకన్నా ఓ అడుగు ముందుకేసి... మన ఆలోచనలను, భావాలను కూడా ఈ ‘సూక్ష్మజీవులు’ ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.డైరెక్ట్‌గా సిగ్నల్ ఇవ్వడమే..పొట్టలోని ‘మైక్రోబియం’కు, మన మెదడుకు డైరెక్ట్ లింకు ఉందని ఇటీవలి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. మైక్రోబియం ఇచ్చే సిగ్నల్స్‌ను బట్టి మెదడు పనితీరు ఉంటుందని తేల్చారు. మన మూడ్, జ్ఞాపకశక్తితోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు కూడా మైక్రోబియం సిగ్నల్స్‌ను బట్టి హెచ్చు తగ్గులకు లోనవుతాయని గుర్తించారు.పరిశోధనకు ‘బుల్లెట్’ దిగింది!1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే సైనికుడి పొట్టలోకి తూటా దూసుకెళ్లింది. ఆయనకు విలియం బ్యూమెంట్ అనే ఆర్మీ వైద్యుడు చికిత్స చేశాడు. ఆ సమయంలోనే జీర్ణవ్యవస్థ పనితీరుపై పరిశోధన చేశారు. మన ఎమోషన్ల వల్ల పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పొట్ట మన మెదడును ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలను అర్థం చేసుకోవడానికి మార్గం వేసింది.గుండె, కిడ్నీలకు మాత్రం దెబ్బపడేలా..పొట్టలో ఉండే బ్యాక్టీరియాతో మాంసాహారులకు ఓ సమస్య కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా మటన్ వంటి రెడ్‌మీట్ తీసుకున్నప్పుడు‘టిమావో (టీఎంఏఓ)’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందని... ఈ రసాయన సమ్మేళనం రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి, గుండె జబ్బులకు, కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని గుర్తించారు. అయితే ఆలివ్, గ్రేప్సీడ్ ఆయిల్ వంటివి ఆహారంలో చేర్చుకుంటే ‘టిమావో’ ఉత్పత్తి తగ్గుతోందని కూడా గుర్తించారు.తేడా వస్తే ఊబకాయమే..!జీర్ణవ్యవస్థలోని మైక్రోబియంలో బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు.. మెదడుకు, దాని నుంచి పిట్యూటరీ గ్రంధికి తప్పుడు సిగ్నల్స్ వెళతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనితో ఆకలిని నియంత్రించే హార్మోన్లలో తేడాలు వచ్చి.. అతిగా తినడం, ఊబకాయం బారినపడటం వంటి సమస్యలు వస్తున్నాయని గుర్తించినట్టు వివరిస్తున్నారు.‘మైక్రోబియం’ సమస్యలకు కారణమేంటి?సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆల్కాహాల్ అలవాటు, యాంటీ బయాటిక్స్ అతిగా వాడటం, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక ఒత్తిళ్లు, యాంగ్జైటీ వంటి సమస్యలు.. పొట్టలోని ‘మైక్రోబియం’లో బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయి. మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి.. చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఎన్నో సమస్యలు మొదలవుతాయి.చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీఇది ‘సెట్’ అయ్యేదెట్లా?అన్ని పోషకాలు, ఫైబర్ ఉండే సమతుల ఆహారం తీసుకోవడం మొదటి అడుగు. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీసి ‘మైక్రోబియం’ బ్యాలెన్స్‌ను మార్చేస్తాయి. అందువల్ల వీటిని నియంత్రించుకోవాలి. పెరుగు, ఫెర్మెంటెడ్ పదార్థాలు వంటి ప్రొబయాటిక్ ఆహారం... అరటి, అల్లం, ఉల్లి వంటి పీచు (ఫైబర్) ఎక్కువగా ఉండే ప్రీబయాటిక్ ఆహారం తీసుకుంటే మైక్రోబియం ‘సెట్’ అవుతుందని.. పరోక్షంగా మెదడు ఆరోగ్యానికీ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటికైనా మెదడు మన మాట వినకుంటే.. పొట్టతో ‘సిగ్నల్’ ఇప్పించే ప్రయత్నం చేయండి మరి. -
Fake Hospitals ఆస్పత్రులపై నియంత్రణేదీ?
ఉభయ తెలుగు కాష్ట్రాల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల తీరు రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. అధిక ఫీజులు, నకిలీ డాక్టర్లు, అనుమతులు లేని ఆస్పత్రులు - ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వ్యాపార లాభాలను కాపాడుకోవడమే ధ్యేయంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో, 2,367 ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 276 ఆస్పత్రులు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయంటే, పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అనుమతులు లేని ఆస్ప త్రుల్లో అనుభవం లేని వైద్యులు చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఇటీవల రోగులు మృత్యువాత పడుతున్న ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల (మార్చి 29న) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక ఆస్పత్రిని సీజ్ చేయడం, ఐదుగురు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయడం ఈ సమస్య లోతును సూచిస్తోంది. ఏపీ నుంచే కాక ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా హైదరాబాదుకు వైద్యం కోసం ఎందరో వస్తూ ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.ప్రజల ఆరోగ్యం వ్యాపార సరుకుగా మారిన ఈ పరిస్థితిలో, ప్రభుత్వ ఆస్పత్రుల దుఃస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రద్దీకి తగ్గట్లు బెడ్లు, సిబ్బంది లేకపోవడంతో సేవలు అందించడం సవాల్‌గా మారింది. దీనికితోడు, వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు రిఫర్ చేయడంతో పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం కోసం తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ, దానికోసం సమర్థవంతమైన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది స్వాగతించదగిన ప్రతిపాదన. అయితే, ఈ చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, నిరంతర పర్యవేక్షణ, కఠిన చర్యలతో అమలు జరగాలి. – ముద్దం నరసింహ స్వామి, సీనియర్ జర్నలిస్ట్ -
పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత..
బానపొట్ట ఉంటే ఎలాంటి ఫ్యాషన్ వేర్లను ధరించలేం. ఆడవాళ్లు అయితే సంప్రదాయ వస్త్రాలైన చీర వంటి వాటిని ధరించినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలవ్వుతారు. ఇక మగవాళ్లు జీన్స్, పంచె వంటి ట్రెడిషనల్ వేర్లను ధరించినప్పుడూ స్పష్టంగా పొట్ట ఎత్తుగా కనిపిస్తుంది. అబ్బా ఈ పొట్ట కరిగిపోయి చక్కగా ఫ్లాట్‌గా ఉంటే బాగుండును అని అనుకోని వారే లేరు. ఎందుకంటే పెద్దవాళ్లే కాదు చిన్నారులు, టీనేజర్లు కూడా ఈ సమస్యనే అధికంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు సింపుల్‌గా ఇలా చెక్పెట్టేయండి అంటూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు ప్రీతికా శ్రీనివాసన్ ఇన్స్టాగ్రాం వేదికగా చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..!.ఫ్లాట్ స్టమక్ కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. జిమ్, వర్కౌట్లంటూ పలు వ్యాయామాలు చేసేస్తుంటారు. అయినా పొట్ట ఫ్లాట్‌గా అవ్వడం లేదని వాపోతుంటారు. అలాంటప్పుడే తీసుకునే ఆహారాలపై ఫోకస్ పెట్టాలంటున్నారు ప్రీతికా. ఎలాంటి ఆహారాలు ఏ సమయాల్లో తీసుకుంటే మంచిది అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈ ఆహార స్ప్రుహ మిమ్మల్ని అనారోగ్య సమస్యల నుంచే గాక బానపొట్టను నివారిస్తుందని చెబుతున్నారామె. అదెలోగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.రాత్రిపూట మనం తీసుకునే ఆహారాలే బానపొట్టకు ప్రధాన కారణమని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు పగటిపూట తీసుకోవడమే మంచిదట. మరికొన్ని రాత్రి సమయాల్లో నివారిస్తే ఈ సమస్య తగ్గుముఖం పట్టడమే గాక పొట్ట వచ్చే అవకాశం ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలంటే..నివారించాల్సిన ఆహారాలు..పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే.. సాయంత్రం ఆరు తర్వాత ఆరు ఆహారాలను పూర్తిగా నివారించాలని చెప్పారు. అవేంటంటే..చక్కెర కలిగిన ఆహారాలు కేకులు, కుకీలు, చాక్లెట్లు సాయంత్రం ఆరు తర్వాత పూర్తిగా నిషేధించండి. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బొడ్డు కొవ్వు నిల్వకు దారితీస్తాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. మొదట్లో కష్టంగా అనిపించినా.. రాను రాను అదొక అలవాటుగా మారుతుందట. అలాగే భారీ ప్రోటీన్లు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ప్రోటీన్ అనేది ఆరోగ్యకరమైనప్పటికీ ఎర్రమాంసం, కూరలు వంటి భారీ ఆహారాలు రాత్రి సమయంలో జీర్ణం కావడం కాస్త కష్టం. ఫలితంగా నిద్ర లేమి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. బదులుగా చికెన్ బ్రెస్ట్, గుడ్లు, వంటి తేలికపాటి ప్రోటీన్లు తీసుకోండి. కార్బోనేటెడ్ పానీయాలు అస్సలు ఆరోగ్యానికి మంచివి కావని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే సాయంత్రం ఆరు తర్వాత దీన్ని పూర్తిగా నివారించండి అని సూచిస్తున్నారు. ఆఖరికి సోడాలు, బీర్లు, బిస్లరీ వాటర్ తదితరాలను కూడా నిషేధించండి. ఇవి పొట్ట ఉబ్బరం,గ్యాస్, కొవ్వు పెరిగేందుకు కారణమవుతాయట. ఇక సాయంత్రం ఆరు తర్వాత పాల ఉత్పత్తులను నివారించండి. ఇవి కడుపుపై చాలా భారాన్ని మోపుతాయట. ఇవి అరగడానికి సమయం ఎక్కువగా తీసుకోవడమే గాక జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందట. అందుకే సాధ్యమైనంత వరకు పాలు, చీజ్, పెరుగు, క్రీమ్‌లు వంటి వాటిని రాత్రిపూట నివారించండి. వాటిని హాయిగా పగటిపూట తినండి గానీ సాయంత్రం తీసుకోవద్దు. తెల్లబియ్యం, శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు, బ్రెడ్లు వంటివాటికి కూడా దూరంగా ఉండండి. వీటివల్ల ఇన్సులిన్ స్పైక్స్, బొడ్డు కొవ్వు పెరిగేందుకు దారితీస్తుంది. చివరగా డీప్-ఫ్రైడ్ ఫుడ్స్.. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, కచోరీలు, సమోసాలు వంటి డీప్-ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవద్దు. ఈ ఆహారాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. జీవక్రియను నెమ్మదిస్తాయి. పైగా శరీరంలో అధిక కొవ్వు నిల్వకు దారితీస్తాయి. పైన చెప్పిన ఈ ఆరు ఆహారాలను డైట్లో నివారించడం ప్రారంభించిన తర్వాత ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు మొదలవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. అంతేగాదు బానపొట్ట సమస్య తగ్గడమే గాక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. View this post on Instagram A post shared by LogaPritika Srinivasan (@fitmom.club) (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!)