
కోలీవుడ్ నటుడు సూర్య శివకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటన పరంగా ఆయనకు సాటి లెరెవ్వరూ. ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఒదిగిపోవడం సూర్య ప్రత్యేకత. తన వైవిధ్యభరితమైన నటనతో మంచి ప్రేక్షకాధరణ ఉన్న నటుడు. తాను నటించే పాత్ర కోసం మొత్తం ఆహార్యమే మార్చుకునేందుకు వెనకడుగువేయని గొప్ప నటుడు. గతేడాది రిలీజ్ అయ్యి కంగువా మూవీ కోస సూర్య ఎంతా కష్టపడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ప్రేక్షకుల మన్ననలను పొందడంలో విఫలమైన ఆ మూవీలో సూర్య కంగువా ప్రాతకు పూర్తి న్యాయం చేశారు. ఆ పాత్ర కోసం సూర్య కేవలం వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ బాడీని సాధించారు. నిజంగా అది అంత తక్కువ వ్యవధిలో సాధ్యమేనా..?. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు తదితర విశేషాలు గురించి తెలుసుకుందామా..!.
నిజానికి 49 ఏళ్ల వయసులో ఉన్న సూర్యకి ఇది చాలా సవాలుతో కూడిన విషయం. ఆయన కూడా ఓ ఇంటర్వ్యూలో ఆ ఏజ్‌లో సిక్స్ ప్యాక్ బాడీ అనేది..ఓ పర్వతాన్ని అధిరోహించే ఫీట్ లాంటిదని అన్నారు సూర్య. ఆ ఏజ్‌లో జీవక్రియ మందగిస్తుంది కాబట్టి చాలా కఠినమైన డైట్‌ని అనుసరించనట్లు చెబుతున్నారు.
అంతేగాదు ఆ మూవీ షూటింగ్ పూర్తి అయ్యేవరకు కూడా వందరోజులు.. మంచి ప్లాన్‌తో కూడిన డైట్‌ని అనుసరించానని అన్నారు. నిజానికి సూర్య మంచి భోజన ప్రియుడట. అలాగే తన భార్య, కూతురు కూడా తనలానే మంచిగా తింటారట, కొడుకు మాత్రం కాదట. అలాగే ఆయన అంతా ఎక్కువగా తిన్నప్పటికీ లావు అవ్వపని తన బాడీ తత్వం వల్ల ఎక్కువ బరువు పెరిపోతాననే భయం ఉండదని ధీమాగా చెబుతున్నారు సూర్య.
ఇది మంచిదేనా..?
నిపుణులు మాత్రం ఇంత తక్కువ వ్యవధిలో అలాంటి బాడీ ప్యాక్ సాధించడం అసాధ్యమని చెబుతున్నారు. ఇక్కడ హీరో సూర్య తక్కవ కార్బోహైడ్రేట్, చక్కెర, ఉప్పు దరిచేరని ఆహరం నిపుణుల పర్యవేక్షణలో తీసుకుని ఉండి ఉంటారు. అందువల్ల ఇది సాధ్యమైందని అన్నారు. అలాగే సూర్య డైట్ ప్లాన్‌లో లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఆర్ద్రీకరణ తదతరాలన్నిటికీ ప్రాధన్యాత ఇచ్చే ఫుడ్‌ని అందించి ఉండొచ్చని నిపుణుడు విద్యా చావ్లా అన్నారు.
అయితే ఈ డైట్ అందరికీ సరిపడకపోవచ్చని అన్నారు. ఎందుకంటే.. ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగణంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. పైగా సరైన ఫిట్‌నెస్, వర్కౌట్‌లతో కూడిన సిక్స్ ప్యాక్ బాడీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు. అలాగే సెలబ్రిటీల మాదిరిగా తొందరగా బాడీ రూపురేఖలు మారిపోవాలనుకుంటే మాత్రం ఫిట్‌నెస్ నిపుణుల పర్యవేక్షణలోనే చేయడం మంచిదని సూచించారు నిపుణులు.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రశంసల జల్లు..!)