Sharmila Tagore: కీమోథెరపీ చేయంచుకోకుండానే కేన్సర్‌ని ఓడించారామె..! | Soha Ali Khan Shares How Mom Sharmila Tagore Beat Cancer Without Chemo | Sakshi
Sakshi News home page

అమ్మ కీమోథెరపీ చేయంచుకోకుండానే కేన్సర్‌ని ఓడించింది..!: సోహా అలీఖాన్‌

Apr 14 2025 12:34 PM | Updated on Apr 14 2025 3:48 PM

Soha Ali Khan Shares How Mom Sharmila Tagore Beat Cancer Without Chemo

బాలీవుడ్‌ దిగ్గజ నటి షర్మిలా ఠాగూర్‌కి ఊపిరితిత్తుల కేన్సర్‌ నిర్థారణ అయ్యినట్లు ఓ ఇంటర్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ కేన్సర్‌ని కీమోథెరఫీ వంటి చికిత్సలతోనే పనిలేకుండానే సునాయాసంగా ఓడించారు. ఇప్పుడామె పూర్తిగా కోలుకున్నారు కూడా. ఆ విషయాన్ని కూతురు నటి సోహా అలీ ఖాన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నారు. ముందుగానే ఆ వ్యాధిని గుర్తించడంతోనే తన తల్లి సురక్షితంగా ఆ వ్యాధి నుంచి బయటపడగలిగారని అన్నారు. ఆ సమయంలో మా కుటుంబం పడిన బాధ అంతఇంతగాదంటూ నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారామె. అందరూ తనతల్లిలా బాధకరమైన చికిత్సల జోలికిపోకుండానే సులభంగా ఈ కేన్సర్‌ని జయించడం ఎలాగో కూడా వివరించారు. అదెలాగా చూద్దామా..!.

సోహా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో నయన్‌దీప్ రక్షిత్‌కి ఇచ్చిన ఇంటర్వ్వ్యూలో తన ఫ్యామిలీ ఫేస్‌ చేసిన క్లిష్ట సమయాన్ని పంచుకున్నారు. నిజానికి ఒక వ్యాధి నిర్థారణ యావత్తు కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేస్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. ఆ సమయం తామెంతో ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. 

అయితే దేవుడి దయ వల్ల తన తల్లి ఆరోగ్య పరిస్థతి మరింత క్షీణించక మునుపే గుర్తించగలిగాం. చెప్పాలంటే కేన్సర్‌ స్టేజ్‌ జీరోలో ఉండగానే గుర్తించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంకా ఆమె శరీరంలో కేన్సర్‌ వ్యాపించని దశ. అందువల్ల ఆమెకు కీమోథెరపీ లేదా రేడియేషన్ వంటి అదనపు చికిత్సలు లేకుండానే శస్త్ర చికిత్సతో ద్వారా నయం చేశారు. 

ఊపిరితిత్తుల కేన్సర్‌ని ముందుగానే ఎలా గుర్తించొచ్చంటే..
ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ సంబంధిత మరణాలలో ఊపిరితిత్తుల కేన్సర్ కూడా ఒకట. ఇది ముందస్తు హెచ్చిరికలతో మన శరీరాన్ని అప్రమత్తం చేస్తుందట. అవేంటంటే..

  • సాధారణ కార్యకలాపాల సమయంలో శ్వాస ఆడకపోవడం లేదా ఊపిరి ఆడకపోవడం.

  • ఛాతీ నొప్పి లోతైన శ్వాస లేదా తీవ్రమైన దగ్గు

  • బరువు తగ్గిపోవడం

  • రక్తం లేదా తుప్పు రంగు కఫం దగ్గు

  • బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు

నిజానికి ఇవన్నీ చూడటానికి సాధారణ వైద్య పరిస్థితులే. అవి తరుచుగా కొనసాగి..ఆందోళనకు గురిచేస్తే తక్కణమే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. అలాకాకుండా ధూమపానం లేదా సెకండ్‌హ్యాండ్ పొగకు గురైన చరిత్ర కలిగినవారు క్రమంతప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. 

ఈ అలవాట్లతో ప్రమాదాన్ని నివారించొచ్చు..

  • ధూమపానానికి దూరంగా ఉండటం

  • పొగ పీల్చే వ్యక్తులకు దూరంగా ఉండటం

  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

  • తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం

  • వ్యాయామం చేయడం

  • ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.

(చదవండి: సరికొత్త మ్యూజిక్‌ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!)

 

Advertisement
 
Advertisement
Advertisement